మరింత శక్తిమంతంగా ఎల్‌ నినో!  | El Nino may turn very strong by late 2026 and early 2027 | Sakshi
Sakshi News home page

మరింత శక్తిమంతంగా ఎల్‌ నినో! 

Sep 29 2026 6:40 AM | Updated on Sep 29 2026 6:44 AM

El Nino may turn very strong by late 2026 and early 2027

 కొలంబియా యూనివర్సిటీ అంచనా 

2027 ఫిబ్రవరి వరకూ కొనసాగింపు? 

22 మోడళ్ల సర్వేతో నిర్ధారణ 

ఐఓడీ పాజిటివ్‌ ప్రభావంపై అనిశ్చితి!

న్యూఢిల్లీ: వర్షాభావంతో దేశం ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటూండగా... ఈ ఏడాది చివరికల్లా ఎల్‌ నినో బలపడనుందన్న వార్తలు ఆందోళనను మరింత పెంచుతోంది. కొలంబియా యూనివర్సి టీకి చెందిన ఇంటర్నషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్లైమెట్‌ (ఐఆర్‌ఐ)అంచనా ప్రకారం ఎల్‌నినో 2026 ఆఖరు నుంచి వచ్చే ఏడాది తొలినాళ్ల వరకూ మరింత బలపడనుంది. సెప్టెంబర్‌ మధ్యనాటికి పసిఫిక్‌ మహా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతల్లో దాదాపు మూడు డిగ్రీ సెల్సియస్‌ పెరుగుదల నమోదైంది ఈ సంస్థ తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఇది తీవ్రస్థాయి ఎల్‌నినోకు సంకేతమన్నది తెలిసిందే. తాము మొత్తం 22 మోడళ్లను సర్వే చేశామని, ఇందులో 13 గతిశీలమైన (డైనమిక్‌)వి కాగా.. మిగిలిన తొమ్మిది గణాంకాల ఆధారితమైనవి. ఇవన్నీ కూడా రానున్న చలికాలం మొత్తం ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతాయని చెబుతున్నాయి. శషభిషలకు తావులేకుండా 2027 ఫిబ్రవరి వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని, జూన్‌ నాటికి 61 శాతం వరకూ తగ్గుదల నమోదవుతుందని ఈ సంస్థ అంచనాలు చెబుతున్నాయి. అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినోగా ఇది రికార్డు సృష్టిస్తుందని తెలిపింది. 

మరోవైపు భారత్‌లో వర్షాలను తీవ్రంగా ప్రభావితం చేయగల ఇండియన్‌ ఓషన్‌ డయాపోల్‌ (ఐఓడీ) కూడా సెపె్టంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ పాజిటివ్‌గా ఉంటుందని, 2027 ప్రారంభం తరువాత సాధారణ స్థితికి వస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. హిందూ మహా సముద్రం పశి్చమ, తూర్పు ప్రాంతాల్లోని ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు వేడి, చల్లదనాల మధ్య ఊగిసలాడటాన్ని ఐఓడీ అంటూంటారు. అంటే ఈ సారి.. ఆఫ్రికా తూర్పు ప్రాంతంతోపాటు అరేబియా సముద్ర ఉపరితల నీరు వెచ్చగా ఉంటే.. ఇండోనేసియా, సుమత్రా ప్రాంతాల్లోని నీరు చల్లగా ఉంటుంది. ఈ తేడాలు భారత్‌లో కురిసే వర్షాలపై ప్రభావం చూపుతూంటాయి.

 సాధారణంగా ఎల్‌నినో ఏర్పడ్డ సంవత్సరం ఐఓడీ పాజిటివ్‌గా ఉంటుంది. కొన్నిసార్లు రెండూ వేర్వేరుగానూ ఏర్పడవచ్చు. ఎల్‌నినో ఏడాది భారత రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని, పంట దిగుబలు ప్రభావితమవుతాయని అంచనా. కొన్ని సందర్భాల్లో ఐఓడీ ఈ నష్టాలను తగ్గిస్తూంటుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఎల్‌నినో, ఐఓడీ పాజిటివ్‌లు మాత్రమే కాకుండా కొన్ని ఇతర పరిస్థితులు కూడా వర్షాలను ప్రభావితం చేస్తాయి. ‘‘ఎల్‌నినోతో వచ్చే ఏడాది ముప్పు పొంచి ఉందని ఐఆర్‌ఐ తాజా అంచనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశం ఒక్కటే పంట దిగుబడులు, వర్షాలను నిర్ణయించదు’’అని వీరు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement