సుందర్‌ పిచాయ్‌తో సరదాగా, సర్‌ప్రైజింగా : వైరల్‌ వీడియోలు | A fangirl youtuber Happy and surreal moment with Sundar Pichai | Sakshi
Sakshi News home page

సుందర్‌ పిచాయ్‌తో సరదాగా, సర్‌ప్రైజింగా : వైరల్‌ వీడియోలు

Feb 21 2026 4:51 PM | Updated on Feb 21 2026 5:03 PM

A fangirl youtuber Happy and surreal moment with Sundar Pichai

న్యూఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో  గూగుల్ ఉద్యోగి సీఈఓ సుందర్ పిచాయ్‌ను కలవడం గురించి చేసిన హృదయపూర్వక పోస్ట్ ఆన్‌లైన్‌లో అందరినీ ఆకట్టుకుంది.  గూగుల్‌లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అయిన తనుషి గుప్తా సుందర్‌ పిచాయ్‌ కలవాలనే తన చిరకాలకలను సాకారం చేసుసుకున్న వైనం గురించి లింక్డ్ఇన్‌లోపోస్ట్‌ చేసింది.

గుర్గావ్ కార్యాలయంలో సుందర్ పిచాయ్‌తో తన సంభాషణను సంగ్రహించిన వీడియో క్లిప్‌తో పాటు,  ఆ భావోద్వేగ క్షణాన్ని  ఆ ఒక కలగా అభివర్ణించింది. తన చిన్ననాటినుంచి తనకు 'రోల్ మోడల్' అయిన వ్యక్తితో షేక్‌  హ్యాండ్‌ ఇచ్చిన ఆ క్షణాలు తన జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. ఈ ఎన్‌కౌంటర్ తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని  తెలిపింది. అలాగే తాను గూగుల్‌లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌ని మాత్రమే కాదనీ, మేకప్ కంటే యంత్రాలను ఎంచుకున్న చిన్న అమ్మాయినని  పేర్కొంది. టెక్ గురించి అంతులేని ఆసక్తి ఉన్న విద్యార్థిని. వస్తువులను కొనడం కంటే వస్తువులను నిర్మించడం ముఖ్యమని నమ్మిన అమ్మాయి నంటూ పోస్ట్‌ చేసింది. 

ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం

సోషల్ మీడియా స్పందన
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 259,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు తాము ఆరాధించే ప్రజా వ్యక్తులను కలిసిన అనుభవాలను పంచుకున్నారు.

తనుషి కథతోపాటు మరో యువకుడి సరదా సంభాషణ కూడా నెట్టింట సందడిగా మారింది.  యూట్యూబ్‌ ద్వారా సక్సెస్‌ అయిన అనంత్ లథా స్టోరీ ఇది.  ‘ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్’  అను యూట్యూబ్‌ ని రన్‌ చేస్తున్న అనంత్‌  ఏఐ సదస్సులో సుందర్ పిచాయ్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. ‘ఫ్యాన్ బాయ్’ మూమెంట్ గురించి ఎక్స్ లో పోస్ట్ చేయడంతోపాటు  తన అనుభవాన్ని కూడా షేర్‌ చేశాడు. సదస్సులో సుందర్ పిచాయ్ పక్కనే కూర్చునే అవకాశం వచ్చిన తాను నమస్తే సార్.. మీరే నాకు నెలనెలా డబ్బులు ఇస్తున్నారు’ అంటూ  పలకరించానని చెప్పుకొచ్చాడు. దీనికి ఆశ్చర్యపోయిన పిచాయ్ ఎలా అని ప్రశ్నించారట.  తానొక యూట్యూబర్‌నిని,  మీ మూలంగానే నెలనెలా యూట్యూబ్ నుంచిఆదాయం పొందుతున్నానని చెప్పడంతో ఆయన సరదాగా నవ్వేశారంటూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సుందర్ పిచాయ్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement