బాలికపై హత్యాచారం : నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం | Rape murder accused killed in police firing fourth case in West Bengal since BJP came to power | Sakshi
Sakshi News home page

బాలికపై హత్యాచారం : నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం

Nov 9 2026 1:07 PM | Updated on Nov 9 2026 1:24 PM

Rape murder accused killed in police firing fourth case in West Bengal since BJP came to power

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో నిందితుడు  దిలీప్ రాయ్‌ను  పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. 12 ఏళ్ల మేనకోడలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్ రాయ్, సోమవారం తెల్లవారుజామున పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించాడు. జార్ఖండ్‌కు చెందిన దిలీప్ రాయ్, బెంగాల్-బిహార్ సరిహద్దు గుండా పారి పోవడానికి ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు సమాచారం ప్రకారం రాయ్‌గంజ్‌లో దాక్కున్న దిలీప్ రాయ్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు సోమవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో దాడి నిర్వహించారు. ఆ సమయంలో నిందితుడు పోలీసులపైకి కాల్పులు జరపగా, ఒక బుల్లెట్ పోలీసు వాహనం టైరుకు తగిలింది. పోలీసులు ఆత్మరక్షణ కోసం తిరుగు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని రాయ్‌గంజ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించగా, అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు..

నవంబర్ 3న 12 ఏళ్ల చిన్నారి సైకిల్‌పై బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. రెండు రోజుల తర్వాత కులిక్ నది సమీపంలోని అడవిలో ఆమె దిగంబరంగా, పాక్షికంగా కుళ్ళిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా  బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి పశ్చిమ బెంగాల్‌లో నమోదైన 4వ పోలీస్ ఎన్‌కౌంటర్ ఇది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement