ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి
మహేశ్వరం: త్వరలో జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొంది మహేశ్వరం గడ్డపై కా షాయ జెండా ఎగురవేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. నాగారంలోని ఓ ఫామ్ హౌస్‌లో మంగళవాం బీజేపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయా లని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు బస్వ పాపయ్య గౌడ్, కడారి జంగయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుధర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి అయిల్ల యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.


