ఆత్మహత్య చేసుకుంటున్నానని.. | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకుంటున్నానని..

Jan 1 2026 1:14 PM | Updated on Jan 1 2026 1:14 PM

ఆత్మహత్య చేసుకుంటున్నానని..

ఆత్మహత్య చేసుకుంటున్నానని..

డయల్‌ 100కు ఫోన్‌

వెంటనే స్పందించి

కాపాడిన కానిస్టేబుల్స్‌

మహేశ్వరం: ఆత్మహత్య చేసుకుంటున్నానని డయల్‌ 100కు ఫోన్‌ చేసిన వ్యక్తిని మహేశ్వరం పోలీసులు కాపాడారు. ఈ ఘటన మండల పరిధిలోని కోళ్లపడకల్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కేశంపేట మండలం కొత్తపేట్‌కు చెందిన గడ్డమీది కుమార్‌ ఘట్టుపల్లిలోని అత్తగారింటికి వచ్చాడు. భార్య, అత్తమామలో గొడవపడిన కుమార్‌ కోళ్లపడకల్‌–ఘట్టుపల్లి మార్గంలో చెట్లపొదల్లోకి వెళ్లి డయల్‌ 100కు కాల్‌ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడంతో పోలీసులు నా లుగు నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని బాధితుడి కాపాడారు. బాధితుడిని సురక్షితంగా కుటుంబ స భ్యులకు అప్పగించి గొడవ పడొద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement