సీపీఐ మహా సభకు తరలిరావాలి
● పార్టీ నేతల పిలుపు
● జీపు జాత ప్రారంభం
చేవెళ్ల: ఖమ్మం పట్టణంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య కోరారు. పట్టణంలోని శంకర్‌పల్లి చౌరస్తాలో శనివారం జీపుజాతను ప్రారంభించారు. పార్టీ నియోజకవర్గ కె.రామస్వామి అధ్యక్షతన జీపు జాత కొనసాగుతుందని తెలిపారు. భారత గడ్డపై సీపీఐ ఆవిర్భవించి వంద వసంతాలు పూర్తయ్యాయన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ అనుక్షణం పోరాడిందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.ప్రభులింగం, జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ, నాయకులు వడ్ల మంజుల, జయమ్మ, సుధాకర్‌గౌడ్, సత్యనారాయణ, సాయిలు, పోచయ్య, శ్రీను, మహేందర్, పెంటయ్య, లలిత, యాదమ్మ, భాగ్యమ్మ, నర్సయ్య తదితరులు ఉన్నారు.
శతాబ్ది ఉత్సవాలకు తరలిరావాలి
శంకర్‌పల్లి: ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జీపు జాత శనివారం శంకర్‌పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వందేళ్లు ప్రజల పక్షాన సీపీఐ ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూసిందని తెలిపారు. ఖమ్మంలో 5లక్షల మందితో జరిగే సభను విజయవంతం చేయాలని, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభులింగం, వడ్ల సత్యనారాయణ, శంకర్‌పల్లి మండల అధ్యక్షుడు సుధీర్, నాయకులు సత్తిరెడ్డి, గోపాల్‌రెడ్డి, మంజుల, లలిత, వెంకటమ్మ, నర్సింలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇంటికో మనిషి రావాలి..
కొత్తూరు: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 18న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పర్వతాలు పిలుపునిచ్చారు. కొత్తూరులో శనివారం ఆయన పలువురు నాయకులతో కలిసి జీపు యాత్రను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఖమ్మంలో నిర్వహిస్తున్న సభకు ఇంటికో మనిషి.. ఊరికో బండిలో రావాలన్నారు. దేశంలో రాజరిక వ్యవస్థ, భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి ప్రజల పక్షాన సీపీఐ చేసిన పోరాటాలు, ఉధ్యమాలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటాయన్నారు. ఈ పోరాటాల్లో వందల సంఖ్యలో కమ్యునిస్టులు అమరులైనట్లు తెలిపారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మండలం నుంచి భారీ సంఖ్యలో కమ్యూనిస్టులు, అభిమానులు, కార్మిక సంఘాల నాయకులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుద్దుల జంగయ్య, షకీల్, ఎల్లయ్య, మహ్మద్ హుస్సేన్, మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ మహా సభకు తరలిరావాలి
సీపీఐ మహా సభకు తరలిరావాలి


