గ్రీన్‌ఫీల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫీల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం

Jan 5 2026 11:18 AM | Updated on Jan 6 2026 1:21 PM

గ్రీన

గ్రీన్‌ఫీల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం

గ్రీన్‌ఫీల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం గెలుపే లక్ష్యంగా పని చేయాలి 7న సనాతన వేదయజ్ఞ మహా రథయాత్ర ప్రారంభం రేపు టీఆర్‌జేకేఎస్‌ రాష్ట్ర స్థాయి సమావేశం

ఆమనగల్లు: గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు న్యాయం చేస్తామని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఆదివారం ఆమనగల్లు, కడ్తాల మండలాల పరిధిలోని ముద్విన్‌, ఎక్వాయిపల్లి, మర్రిపల్లి, కోనాపూర్‌, ఆకుతోటపల్లి గ్రామాలకు చెందిన బాధిత రైతులతో వారు సమావేశం నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. భూమికి భూమి ఇవ్వాలని లేదా ఎకరాకు రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. రైతులకు అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందొద్దని ఎంపీ మల్లురవి అన్నారు. బాధిత రైతుల డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎక్వాయిపల్లి సర్పంచ్‌ కరుణాకర్‌గౌడ్‌, మర్రిపల్లి సర్పంచ్‌ ఈర్లపల్లి రవి, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పాలకుర్ల రవికాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మంచాల: గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ పిలుపుని చ్చారు. మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ బలపర్చిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను ప్రజలు నమ్మే పరి స్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం సంక్షేమ పథకాలను కూడా సక్రమంగా అమ లు పర్చడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఆ పాత్ర సక్రమంగా పోషించడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, బోసుపల్లి ప్రతాప్‌, వెంకట్‌ రెడ్డి, నారాయ ణ యాదవ్‌, జిల్లా నాయకులు దన్నె భాషయ్య, జంగయ్య గౌడ్‌, మండల అధ్యక్షుడు నూకం రాజు ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

కొందుర్గు: వేదగిరి వేదపీఠం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి మార్చి 2 వరకు నిర్వహించనున్న సనాతన వేదయజ్ఞ మహా పాదయాత్ర జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం తూంపల్లిలోని వేదగిరిగుట్టపై ప్రారంభమవుతుందని వేదగిరి సంస్థాపకుడు మర్రి కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామానుజ చినజీయర్‌స్వామి హాజరై యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. రథయాత్ర నేరుగా రామేశ్వరం చేరుకుని అక్కడి నుంచి శ్రీనగర్‌ వరకు 16 రాష్ట్రాల మీదుగా 54 రోజుల పాటు 9,500 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని వివరించారు.

బొంరాస్‌పేట: తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం (టీఆర్‌జేకేఎస్‌) రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈనెల 6న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్‌ గౌడ్‌ అధ్యక్షతన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ఆయా జిల్లాల్లోని జానపద కళాకారుల సంఘం మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ఈ సమావేశం ఉంటుందన్నారు. కళాకారుల సంక్షేమనిధి, ఆర్థిక భరోసా, భద్రత గుర్తింపు కార్డు అందజేత, పలువురికి సన్మానం తదితర అంశాలపై చర్చింనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఆసంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రమణకుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య, మహిళా విభాగం నాయకులు కవిత, సునీత, శ్రీదేవి తదితరులు హాజరవుతారని చెప్పారు.

గ్రీన్‌ఫీల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం 1
1/1

గ్రీన్‌ఫీల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement