అంత్యక్రియలకు వెళ్లి వస్తూ.. | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..

Jan 5 2026 11:20 AM | Updated on Jan 6 2026 1:22 PM

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..

చేవెళ్ల: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ మార్గమధ్యలో బైక్‌ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అంతారం గేట్‌సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ మండలం గోనుర్‌ గ్రామానికి చెందిన కావలి లాలప్ప(50) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం తెలిసిన బంధువు మృతి చెందారని గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో చేవెళ్ల మండలంలోని అంతారం గేట్‌ వద్దకు రాగానే మూత్ర విసర్జన కోసం కారు ఆపారు. లాలప్ప మూత్రవిసర్జన చేసి తిరిగి వస్తూండగా వేగంగా హైదరాబాద్‌ వైపు నుంచి వికారాబాద్‌వైపు వస్తున్న బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాలప్ప తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. రోడ్డుపై పడిపోయిన అతడిని గుర్తించిన స్నేహితులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement