మూగజీవాల రక్తం సేకరించి విక్రయం
కీసర: మూగ జీవాల నుండి అక్రమంగా రక్తాన్ని సేకరిస్తున్న ముఠాను కీసర పోలీసులు గుట్టురట్టు చేశారు. కీసర సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు.. నాగారం సత్యనారాయణ కాలనీలో మటన్, చికెన్ షాప్‌లో సోనూ మాంసం విక్రయిస్తుంటాడు. సోనూ, అతని ఉద్యోగి అఖిల్ ఇద్దరు వ్యక్తులు నిబంధనలకు విరుద్దంగా మూగ జీవాల నుండి రక్తం సేకరిస్తున్నారు. ఈ సేకరించిన రక్తాన్ని నగరంలోని ఓ సంస్థకు విక్రయించి ల్యాబోరేటరీలలో ఉపయోగించే షీప్ బ్లడ్ అగర్ ప్లేట్స్ తయారీకి వినియోగిస్తున్నట్లు తెలిసింది. మూగజీవాల నుండి రక్తాన్ని సేకరించిన వ్యక్తులు నిబంధనల ప్రకారం వెటర్నరీ వైద్యులు అయి ఉండాలని కానీ ఈ మాంసం విక్రయ కేంద్రంలో నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ వ్యక్తులు రక్తాన్ని సేకరిస్తున్నారని విచారణలో తేలింది. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ మేరకు ఇద్దరు నింధితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మూగజీవాల రక్తం సేకరించి విక్రయం


