ILT20: విండీస్‌ స్టార్‌ విధ్వంసం.. చిత్తుగా ఓడిన నైట్‌రైడర్స్‌ | ILT20, Sherfane Rutherford Explosive Half-Century Powers MI Emirates To Victory Over Abu Dhabi Knight Riders, Check Score Details | Sakshi
Sakshi News home page

ILT20: విండీస్‌ స్టార్‌ విధ్వంసం.. చిత్తుగా ఓడిన నైట్‌రైడర్స్‌

Nov 27 2026 7:40 AM | Updated on Nov 27 2026 10:15 AM

ILT20: Rutherford shines as MI Emirates beat Abu Dhabi Knight Riders

Photo Credit: Twitter

ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ టీ20లో భాగంగా అబుదాబి వేదికగా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 207 పరుగులు చేసింది. షెర్ఫెన్ రూథ‌ర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 51, 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించ‌గా, నికోలస్ పూరన్ (42 నాటౌట్‌), ముహహ్మద్ వసీమ్ (41), కుసాల్ పెరీరా (33) రాణించారు. 

నైట్‌రైడర్స్ బౌలర్లలో అబ్దుల్లా తరఖాలి రెండు వికెట్లు తీయగా, జాసన్ హోల్డర్‌, సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన అబుదాబి నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమైంది. అలిషాన్ షరాఫజ (36), మోయిన్ అలీ (36) పర్వాలేదనిపించారు. 

ఎంఐ బౌలర్లలో ఫజల్లా ఫరూకీ, జహూర్ ఖాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. హాఫ్ సెంచరీతో మెరిసిన రూథర్‌ఫోర్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజ‌యంతో ఎంఐ ఎమిరేట్స్ 4 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకోగా, అబుదాబి నైట్‌రైడ‌ర్స్ రెండు పాయింట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతోంది.

ఇదీ చదవండి: కివీస్‌తో రెండో టెస్టు.. డెబ్యూ మ్యాచ్‌లో మెరిసిన భార‌త బౌల‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement