
PC: BCCI/IPL.com
ఐపీఎల్ 2025 పునఃప్రారం వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లో ఆడేందుకు ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అతడు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వారం రోజులు వాయిదా పడడంతో చాలా మంది ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ రీ స్టార్ట్ అవుతుండడంతో కొంతమంది తిరిగి భారత్‌కు రావడానికి సిద్దపడితే, మరి కొంతమంది నిరాకరించారు. అందులో ఒకరు ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్.
ఐపీఎల్ 16వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు తన అందుబాటులో ఉండడని మెక్‌గర్క్ ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. ఈ క్రమంలో మెక్‌గర్క్ స్ధానంలో బంగ్లాపేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ముస్తఫిజుర్‌తో ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి అతడు యూఏఈతో టీ20 సిరీస్ ఆడేందుకు దుబాయ్‌కు పయనమయ్యాడు.
యాదృచ్ఛికంగా యూఏఈ-బంగ్లా సిరీస్ కూడా మే 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అతడు తిరిగి భారత్‌కు వస్తాడా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు బంగ్లా క్రికెట్ బోర్డు అతడికి ఎన్‌వోసీ మంజారు చేయడంతో ఢిల్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ఫాఫ్ డుప్లెసిస్ సైతం దూరమయ్యారు. ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.