
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ సారథి శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(269)తో చెలరేగిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో శతకం (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) తో కదం తొక్కాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 430 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
గవాస్కర్ రికార్డు బద్దలు..
👉ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో సన్నీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 344 పరుగులు చేశాడు.
ఇప్పుడు తాజా ప్రదర్శనతో గిల్ 54 ఏళ్ల కిందట గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా వరల్డ్ టెస్టు క్రికెట్‌లో ఈ రికార్డు ఇంగ్లండ్ లెజెండ్ గ్రాహం గూచ్ పేరిట ఉంది. 1990లో లార్డ్స్‌లో భారత్‌పై అతడు రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 456 పరుగులు చేశాడు. గిల్ మరో 26 పరుగులు చేసి ఉంటే గూచ్ ఆల్‌టైమ్ రికార్డు కూడా బ్రేక్ అయిఉండేది. అయితే ఈ జాబితాలో గూచ్ తర్వాత స్ధానంలో గిల్‌నే ఉన్నాడు.
👉అదేవిధంగా 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఒకే టెస్టుల 250 ప్లస్, 150కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఏ బ్యాటర్‌కు ఈ ఘనత సాధ్యం కాలేదు.
గెలుపు వాకిట్లో భారత్..
ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ముంగిట నిలిచింది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.