Shane Warne: వార్న్‌ మృతిపై థాయ్‌ పోలీసులు ఏమన్నారంటే..

Thai police Investigation Shane Warne Villa No Foul Play Suspected Death - Sakshi

ఆస్ట్రేలియన్‌ దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. థాయిలాండ్‌లోని తన విల్లాలో వార్న్‌ అచేతనంగా పడి ఉండడం.. తన వెంట ఉ‍న్న స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించడం చకచకా జరిగిపోయాయి. వైద్యులు కూడా దాదాపు 20 నిమిషాల పాటు వార్న్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వార్న్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు దృవీకరించారు. అయితే వార్న్‌ మృతి వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయేమోనన్న కారణంతో థాయ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా దర్యాప్తులో థాయ్‌ పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వార్న్‌ మృతిలో ఎలాంటి తప్పులు జరగలేదని.. తీవ్ర గుండెపోటు రావడంతోనే దిగ్గజ స్పిన్నర్‌ మరణించినట్లు థాయ్‌ పోలీసులు పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌లోని కోహ్‌ సమూయ్ ప్రాంతంలో వార్న్‌ తన విల్లాలో హాలిడే ఎంజాయ్‌ చేయడానికి వచ్చాడని తెలిపారు.వార్న్‌తో పాటు అతని స్నేహితులు కూడా విల్లాకు వచ్చారు. వార్న్‌ స్నేహితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వార్న్‌ మృతి చెందిన రోజు వారంతా క్రికెట్‌ మ్యాచ్‌ను చూశారు.

వార్న్‌ ఎలాంటి అల్కాహాల్‌.. మత్తు పదార్థాలు తీసుకోలేదని తేలింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో వార్న్‌ తన రూంలో పడుకున్నాడు. అదే సమయంలో తన స్నేహితులు తినడానికి రమ్మని పిలిచారు.. కానీ అప్పటికే అతను సృహ కోల్పోయాడు. వెంటనే వార్న్‌ను థాయ్‌ ఇంటర్నేషనల్‌ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు దాదాపు 20 నిమిషాల పాటు వార్న్‌ను బతికించే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. దీంతో వార్న్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.

ఇక వార్న్‌ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ ఇక లేడన్న వార్తను తట్టుకోలేకపోతున్నారు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ బయట వేలాది మంది అభిమానులు వార్న్‌ విగ్రహానికి నివాళి అర్పించేందుకు వస్తున్నారు. కొందరు వార్న్‌కు  ఇష్టమైన బీర్‌, సిగరేట్‌ ప్యాకెట్లను, మాంసాన్ని విగ్రహం వద్ద గుర్తుగా పెట్టారు. ఇక వార్న్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌.. ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయాం అంటూ ట్వీట్‌ చేశారు. వార్న్‌ అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికార లాంచనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

చదవండి: Shane Warne: భారత్‌కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం!

Shane Warne: వార్న్‌ను బతికించడానికి 20 నిమిషాలు కష్టపడ్డారు.. అయినా కానీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top