IND vs SL 1st Test : Virat Kohli Becomes 6th Indian Batter to Score 8000 Runs in Test Cricket - Sakshi
Sakshi News home page

IND vs SL: విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా!

Published Fri, Mar 4 2022 2:14 PM | Last Updated on Fri, Mar 4 2022 6:37 PM

irat Kohli Becomes 6th Indian to Score 8000 Test Runs - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్‌ ఈ ఘనతను సాధించాడు. అదే విధంగా కోహ్లి తన టెస్ట్‌ కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక టెస్ట్‌ క్రికెట్‌లో  8 వేల పరుగుల చేసిన ఆరో భారత బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. విరాట్‌ కోహ్లి 169 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాదించాడు. 154 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించి సచిన్‌ తొలి స్ధానంలో ఉన్నాడు.

అదే విధంగా కోహ్లి తప వందో మ్యాచ్‌లో మరో రికార్డును కూడా సాధించాడు. 100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న  రెండో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఈ ఘనత సాధించాడు. 2006లో దక్షిణాఫ్రికాపై 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన పాంటింగ్‌ 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.  ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 47 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే కోహ్లి సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ఇది నాకు చాలా స్పెషల్‌ మూమెంట్‌.. మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు: కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement