సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ల లీక్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ వేగవంతం చేసింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన అనుమతితో ఈ కేసులో అరెస్ట్ అయిన 9 మంది నిందితులను కస్టడీలోకి తీసుకుంది. ఈ మేరకు చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను తరలించారు. ముందుగా తొమ్మిది మందికి వైద్య పరీక్షలు చేయించనున్నారు. తర్వాత సిట్ అధికారులు వారిని విచారించనున్నారు.
కాగా పేపర్ లీక్ కేసులో అరెస్టయిన తొమ్మిది మంది నిందితులను సిట్ అధికారులు 10 రోజుల పాటు కస్టడీ కావాలని కోర్టులో పిటిషన్ వేయగా.. ఆరు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ శుక్రవారం నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. శనివారం నుంచి 23వ తేదీ వరకు వారిని పోలీసులు ప్రశ్నించి.. ఈ వ్యవహారంలో అన్ని వివరాలను ఆరా తీయనున్నారు. ఇదే సమయంలో ప్రవీణ్, రాజశేఖర్, శంకరలక్ష్యలను కలిపి విచారించి.. వాస్తవాలను వెలికితీయాలని అధికారులు నిర్ణయించారు.
చదవండి: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై కేసీఆర్ సీరియస్.. ఉన్నతస్థాయి సమీక్ష..
Comments
Please login to add a commentAdd a comment