నూతన సంవత్సర వేడుకల్లో విషాదం
● రోడ్డు ప్రమాదంలో తమిళనాడు విద్యార్థి మృతి
పుత్తూరు: నూతన సంవత్సర వేడు కలు ఓకుటుంబంలో పెను విషాదా న్ని నింపాయి. తన తో వచ్చిన తమ్ము డు సోము(16) ఇక లేడ ని తెలుసుకొన్న అన్న బద్రీతో పాటు సహచరులు విషాదంలో మునిగిపోయారు. పుత్తూరు మండలం, పరమేశ్వరమంగళం గ్రామం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఫ్లస్‌వన్ చదివే సోము అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. సహచరుల కథనం.. తమిళనాడు రాష్ట్రం, పళ్లిపట్టు తాలూకా, కేశవరాజుకుప్పం గ్రామానికి చెందిన 20 మంది యువ కులు కొత్త ఏడాదిని నారాయణవనం మండలంలోని కై లాసకోన జలపాతంలో జరుపుకోవడానికి గురువారం ఉదయం మోటర్ సైకిళ్లపై వచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేసి సరదాగా గడిపిన అందరూ సాయంత్రం 4గంటలకు గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇందులో మనోహరం, తులసీరాం, సోము ముగ్గురూ ఒక బైక్‌పై బయలుదేరారు. పరమేశ్వరమంగళం గ్రామం వద్ద బైక్ షడన్ బ్రేక్ వేయడంతో వెనక కూర్చొన్న సోము ఎగిరి కిందపడ్డాడు. అదే సమయంలో ఎదురుగా నగరి నుంచి పుత్తూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సోము అక్కడికక్కడే మృతి చెందా డు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


