Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Deputy CM Pawan Kalyan Warn TFI1
సినీ ఇండస్ట్రీకి పవన్‌ కల్యాణ్‌ బెదిరింపులు!

సాక్షి, విజయవాడ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ(TFI)పై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వంపై పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్లు, నిర్మాతలు, లీజుదార్లుపై విల్లు ఎక్కిపెట్టిన ఆయన.. వారిని టార్గెట్ చేస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేశారు. తన చిత్రం హరిహర వీరమల్లు కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) నిన్న తన మంత్రి దుర్గేష్ చేత.. థియేటర్లపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇవాళ నేరుగా తన కార్యాలయం నుండి హెచ్చరికతో కూడిన ఒక ప్రకటన విడుదల చేయించారాయన. ‘‘గతంలో అల్లుఅరవింద్, అశ్వనీదత్, దిల్ రాజు, సుప్రియ, చినబాబు, నవీన్ ఎర్నేని కలిశారు. అందరినీ రమ్మంటే ఎవ్వరూ రాలేదు. తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కూడా కలవలేదు. కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తున్నారు. ఇకమీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరపేది లేదు. వ్యక్తిగతంగా చర్చలుండబోవు... వ్యక్తిగతంగా వచ్చి టిక్కెట్ ధర పెంచమని కోరడం(Tickets Rate Hike) ఎందుకు..?. అందరినీ కలిసి రమ్మంటే ఎవ్వరూ రాలేదు..?. ఇది మాకు తెలుగు సినిమాలో కొందరు ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్. ఈ రిటర్న్‌ గిఫ్ట్‌కు తగ్గట్లే మేమూ పని చేస్తాం. సినిమా థియేటర్ల ఆదాయంపై ఆరా తీస్తున్నాం. థియేటర్లను యజమానులు నడపడం లేదు. లీజు దారులే థియేటర్లను నడుపుతున్నారు. లీజు దార్ల నుండి పన్ను వస్తుందా లేదా..? అని పరిశీలిస్తున్నాం. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ అధిక ధరలను కూడా తనిఖీ చేస్తాం. థియేటర్ల పైకి తనిఖీ బృందాలను పంపుతాం. మల్టీప్లెక్స్ లలో టిక్కెట్ల ధరలపై కూడా విచారణ జరుపుతాం. మల్టీప్లెక్స్ లలో ఆహారపదార్థాలపై కూడా తనిఖీలు చేస్తాం. ఇకమీదట కేవలం సినిమా సంఘాలతోనే చర్చిస్తాం’’ అని పవన్‌ పేరిట ప్రకటన వెలువడింది.

Ministers Tension On Ys Jagan Prakasam District Visit2
వైఎస్‌ జగన్‌ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు

సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మంత్రుల హడావుడి మొదలైంది. వైఎస్‌ జగన్‌ దెబ్బకు మంత్రులు దిగొచ్చారు. పొగాకు రైతులతో మార్టూరులో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలువురు రైతులతో మాట్లాడారు. 28 లోపు పొగాకు కొనుగోలు జరపాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఆశ ఎక్కువ .. పంట పండించక ముందు ఆలోచించాలి. పండించాక నష్టపోయామని బాధపడకూడదంటూ వ్యాఖ్యానించారు. మార్కెట్ లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు.కాగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాలబాట పట్టించిందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన వైఎస్‌ జగన్‌ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు.

Shreyas Iyer dropped from Test squad3
Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. క‌ట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్‌

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ శ‌నివారం ప్ర‌క‌టించింది. కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ.. క‌రుణ్ నాయ‌ర్‌, కుల్దీప్ యాద‌వ్‌, శార్దూల్ ఠాకూర్‌లను తిరిగి పిలుపునిచ్చింది. అయితే ఛీప్ సెల‌క్ట‌ర్‌ అజిత్ అగార్కర్ అండ్ కో ఎంపిక చేసిన ఈ జ‌ట్టుపై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ప‌క్క‌న పెట్ట‌డాన్ని చాలా మంది త‌ప్పుబడుతున్నారు. ఇటీవ‌ల కాలంలో అయ్య‌ర్ దేశ‌వాళీ క్రికెట్‌తో పాటు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. భార‌త్ ఛాంపియ‌న్స్ ట్రోఫీని సొంతం చేసుకోవ‌డంలోనూ శ్రేయ‌స్‌ది కీల‌క పాత్ర‌.అదేవిధంగా 2024-25 రంజీ ట్రోఫీ సీజ‌న్‌లో శ్రేయస్ అయ్యర్ కేవ‌లం ఏడు ఇన్నింగ్స్‌లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. అయ్య‌ర్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతున్నాడు. ఐపీఎల్‌-2025లో కెప్టెన్‌గా, ఆట‌గాడిగా ఈ ముంబై బ్యాట‌ర్ అద‌ర‌గొడుతున్నాడు. అయితే గ‌తేడాది మాత్రం అయ్య‌ర్ టెస్టుల్లో చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు.శ్రేయ‌స్‌ గత 12 ఇన్నింగ్స్‌లలో 17 సగటుతో 187 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందుకే సెలెక్టర్లు అత‌డిని ప‌క్క‌న పెట్టి ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఏదేమైనా ప్ర‌స్తుత ఫామ్‌ను ప‌రిగణ‌లోకి తీసుకుని అయ్య‌ర్‌ను ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌నకు ఎంపిక చేసి ఉంటే బాగుండేంది అని ప‌లువురు మాజీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.అయ్య‌ర్ జ‌ట్టులో ఉంటే మిడిలార్డ‌ర్ ప‌టిష్టంగా ఉంటుంద‌ని మ‌రి కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ అభిమానులైతే ఒక‌డుగు ముందుకు వేసి సెల‌క్ట‌ర్లపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కెప్టెన్‌ కావాల్సిన ఆటగాడికి పూర్తిగా జట్టులోనే ఛాన్స్‌ ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 14 టెస్టులు ఆడి 36.86 స‌గ‌టుతో 811 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో 5 హాఫ్ సెంచ‌రీల‌తో పాటు ఒక సెంచ‌రీ ఉంది.ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌.. అధికారిక ప్రకటన

Shah Rukh Khan As Brand Ambassador of Candere4
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Indian Businessman Arrives In Helicopter To Take Delivery Of Bentley Bentayga5
కారు కొనడానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియో

గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో ధనవంతులైన వ్యాపారవేత్తల సంఖ్య పెరిగింది. వారిలో చాలామంది భారతదేశంలో స్థిరపడ్డారు, మరికొందరు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లారు. వ్యాపారవేత్తల జీవన విధానం చాలా విలాసవంతంగా ఉంటుంది. కాబట్టి వీరు రోజువారీ వినియోగానికి సైతం ఖరీదైన కార్లు ఉపయోగిస్తుంటారు. ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ కారు కొనుగోలు చేయడానికి ఏకంగా హెలికాఫ్టర్‌లో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.కేరళలోని మలప్పురంలో ఉన్న ఫ్రాగ్రెన్స్ వరల్డ్ కంపెనీ ఓనర్.. 'మూసా హాజీ' హెలికాప్టర్‌లో వచ్చి.. బెంట్లీ బెంటాయెగా డెలివరీ తీసుకున్నారు. కారును మూసా హాజీ స్వయంగా డ్రైవ్ చేస్తుండగా.. కాన్వాయ్‌లో రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్లు కదిలాయి.ఇక్కడ కనిపించే బెంట్లీ కారు ఈడబ్ల్యుబీ వెర్షన్ అని తెలుస్తోంది. రోజ్ గోల్డ్ షేడ్‌లో పూర్తయిన ఈ కారు ధర రూ.6 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..బెంట్లీ బెంటయెగా ఈడబ్ల్యుబీ వెర్షన్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులోని 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌.. గరిష్టంగా 550 పీఎస్ పవర్, 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు అంబానీ ఫ్యామిలీ దగ్గర కూడా ఉంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india)

As Cases Surge in India Covid 19 New variants reported6
Covid-19: శరవేగంగా కోవిడ్ వ్యాప్తి.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఈసారి కొత్త ఉపరకాల(Variants) రూపంలో కలకలం సృష్టిస్తోంది. దాదాపు.. ఏడాదిన్నర తర్వాత పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు నమోదు అవుతున్నాయి.‌ మరీ ముఖ్యంగా గ్రామీణేతర ప్రాంతాల్లోనే వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది.జేఎన్.1 వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన మరో కొత్త వేరియెంట్లు ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8.1 భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కొత్త కేసులు వెలుగు చూశాయి. ఏడాదిన్నర తర్వాత ఒడిషాలో కొత్త కేసు నమోదుకాగా, రాజధాని రీజియన్‌లో మూడేళ్ల తర్వాత కోవిడ్‌ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. కేరళలో గరిష్టంగా 273 కోవిడ్‌ కేసులు, కర్ణాటకలో 35, మహారాష్ట్ర ముంబైలో 95.. థానేలో 10, ఢిల్లీలో 23 కేసులు రికార్డయ్యాయి. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో బాధితులు చేరుతున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. అదే సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాల కోసం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జేఎన్.1 వేరియంట్‌ను దాని వేగవంతమైన వ్యాప్తి కారణంగా ‘వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‘గా వర్గీకరించింది. కానీ, ప్రస్తుతానికి ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్‘గా ప్రకటించలేదు.మరోవైపు.. శరవేగంగా కొత్త వేరియెంట్లు వ్యాప్తిస్తున్నప్పటికీ.. లక్షణాలు మాత్రం స్వలంగానే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కొత్త ఉపరకాల లక్షణాలు సాధారణంగా గతంలోని ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉంటున్నాయి. గొంతు నొప్పి, తేలికపాటి దగ్గు, అలసట, జ్వరం వంటివి ప్రధాన లక్షణాలుగా కన్పిస్తున్నాయి. అయితే, డెల్టా వంటి పాత వేరియంట్లలో కనిపించిన రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్ల బారిన పడినవారిలో అంతగా కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో హైఅలర్ట్కోవిడ్‌(Covid-19) బారినవారు నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారని ఇండియా కరోనా ట్రాకర్ ఆధారంగా..‌ ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. హైదరాబాద్‌(తెలంగాణ)లో పేషెంట్ల కోసం ముందస్తుగా పరీక్ష చేసుకున్న ఓ వైద్యుడికి కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వైరస్‌ వ్యాప్తితో లక్షణాలు స్వలంగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తగా పలు రాష్ట్రాలు కోవిడ్-19‌ మార్గదర్శకాలను జారీ చేశాయి. మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, శుభ్రత.. వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరుతున్నాయి. ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్, మందులతో ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నాయి. అయితే అధిక ప్రమాదం ఉన్నవారు (వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు) బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Chanakya Thoughts: Five strategic plans for success7
కష్టాలకు బెదిరిపోవద్దు...ఈ ఐదు సూత్రాలు తెలుసుకోండి!

కొందరు సమస్యలను చూసి పెద్దగా టెన్షన్‌ పడరు. వాటిని తేలికగా ఎదుర్కొని పరిష్కరిస్తారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా అనుకుంటారు. అటువంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఐదు విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఎవరైనా తెలివితేటలను ఉపయోగించి సమస్య నుంచి బయటపడితే వారిని అపర చాణక్యుడు అని అంటాం. ఎందుకంటే భారతీయులలో చాణక్యుడికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే చాణక్యుడు గొప్ప సలహాదారు, వ్యూహకర్త, తత్వవేత్త. అలాగే వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉన్నవాడు. ఆయన జీవితంలో ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని నీతి సూత్రాలు బోధించాడు. అందులో కష్టాల్లో ఉన్నపుడు ఎలా మసులుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.పక్కా ప్లానింగ్‌...ఎవరినైనా సరే, సమస్యలు, సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటినుంచి తప్పించుకుని తిరగాలని చూడకూడదు. వాటిని ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకుని ఉండాలి. అప్పటికప్పుడు ఆలోచించడం కాకుండా తగిన ప్లానింగ్‌తో ఉంటే ఆ సమస్య నుంచి తేలికగా బయటపడగలరు. సంసిద్ధత...చాణక్యుడు ఏం చెబుతాడంటే ఎవరైనా సరే, కష్టాలు వచ్చినప్పుడు బెంబేలత్తకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని కష్టాలు చుట్టిముట్టినపుడు సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ముందే ఊహించి వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. దీనినే కీడెంచి మేలెంచడం అంటారు. సమస్య నుంచి పారిపోవడం కంటే కూడా దానిని ఎదుర్కొనేలా ఎవరికి వారు సంసిద్ధంగా ఉండాలి. చదవండి : ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్‌ నెం.1 లగ్జరీ కారుఓర్పు, నేర్పు...చాణక్య విధానం ప్రకారం, ఎవరూ కూడా తన ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎప్పుడూ సహనం కోల్పోకూడదు. ఎప్పుడూ సానుకూల కోణంలో ఆలోచించాలి. మరీ ముఖ్యంగా, ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఓపిక పట్టాలి. నేర్పుతో దానిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. పరిస్థితి ఏమైనప్పటికీ, ఆ సమయంలో సహనం కోల్పోకండా మంచి రోజులు వచ్చే వరకు ప్రశాంతంగా వేచి ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుందికుటుంబ సభ్యుల సంరక్షణ...చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కుటుంబ పెద్ద లేదా కుటుంబ సభ్యుల మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంరక్షిస్తూనే, వారికి ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు దానినుంచి బయట పడేసేందుకు చర్యలు తీసుకోవడం అవసరం. డబ్బు ఆదాపై దృష్టి పెట్టడం...ఎల్లప్పుడూ డబ్బును ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సూత్రాన్ని చాణక్యుడు దేశ కోశాగారం కోసం చెప్పినప్పటికీ అది మన ఇంటి కోశానికి కూడా పని చేస్తుంది. పై సూత్రాలను మనసులో పెట్టుకుని వాటి ప్రకారం కుటుంబాన్ని నడిపించుకుంటే మనం కూడా అపర చాణక్యులమవుతాం. చాణక్యుడిని గొప్ప వ్యూహకర్త అంటారు. ఎందుకంటే భారత రాజకీయాలు, చరిత్ర దిశను మార్చడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారు. తన జీవితకాలంలో ఆయన విధాన సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మానవ స్వభావం, జీవితం గురించి ఆయన చెప్పిన సిద్ధాంతాలు నేటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి

BRS KTR reacts On Kavitha Letter8
కవితకు కేటీఆర్‌ స్వీట్‌ వార్నింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అంటూ కవితకు కేటీఆర్‌ పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌.. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. మా పార్టీలో ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు.. ఎవరైనా లేఖలు రాయవచ్చు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరూ సమానమే. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు, దెయ్యం ఎందుకు? అని ప్రశ్నించారు.

Bollywood Actor Mukul Dev Dies At 549
బాలీవుడ్‌లో విషాదం.. రవితేజ ‘కృష్ణ’ విలన్‌ ఇక లేరు

బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్‌ దేవ్‌(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.సీరియల్‌ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ముకుల్‌ దేవ్‌ (Mukul Dev) బాలీవుడ్‌ మూవీ ‘దస్తక్‌’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు. ముకుల్‌ దేవ్‌కి టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్‌ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్‌ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్‌ ది ఎండ్‌’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘అతడు’ చిత్రాల్లో నటించిన రాహుల్‌ దేవ్‌ సోదరుడే ముకుల్‌. తల్లిదండ్రుల మరణంతో ముకుల్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.చ‌ద‌వండి: క‌న్న‌ప్ప టీమ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మంచు మ‌నోజ్‌

Bomb threat Call to Vijayawada Vizag Railway Station Check Details here10
విజయవాడ రైల్వే స్టేషన్‌కు బాంబు బూచి

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఏపీని వరుస బాంబు బెదిరింపులు హడలెత్తించాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌కు శనివారం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీలను, ప్లాట్‌ఫారమ్‌లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు.విజయవాడ రైల్వే స్టేషన్‌లో(Vijayawada Railway Station) బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కి కాల్ చేసిన అగంతకుడు.. తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నట్లు అధికారులు వెల్డించారు. ఆ కాల్‌ మహారాష్ట్ర లాతూర్‌ నుంచి వచ్చిందని, ఆగంతకుడు హిందీలో మాట్లాడాడని తెలిపారు. జీఆర్‌పీ, సీఎస్‌డబ్ల్యూ, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు జరిపారు. ఎల్‌టీటీ రైలు నుంచి కాల్‌ వచ్చినట్లు గుర్తించాం. ఎవరు కాల్‌ చేశారో విచారణ చేస్తున్నాం అని ఆర్‌పీఎఫ్‌ ఏఎస్పీ వెల్లడించారు. అంతకు ముందు.. నగరంలోని బీసెంట్ రోడ్‌కు (Besant Road) బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబ్ ఉన్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బీసెంట్‌ రోడ్‌లోని షాపులు, తోపుడు బండ్లను బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబ్ ఉన్న ఆనవాళ్లు లేక పోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.విశాఖపట్నం: ఇటు వైజాగ్‌ రైల్వే స్టేషన్‌లోనూ ‘బాంబు’ అలజడి రేగింది. ఎల్టీఐ ఎక్స్‌ప్రెస్‌(లోకమాన్య తిలక్ టెర్మినస్-విశాఖ)లో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు కాల్‌చేయడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. రైలు స్టేషన్‌కు చేరుకోగానే బాంబు స్క్వాడ్‌ తనిఖీలు జరిపింది. ఎస్‌ 2 కోచ్‌లో అనుమానాస్పద బ్యాగ్‌ గుర్తించింది. అయితే అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement