
జాతీయ పురస్కారమే లక్ష్యం
- ప్రముఖ సినీగీత రచయిత భాస్కరభట్ల
సింహాచలం : జాతీయ పురస్కారం సాధించాలన్నదే తన లక్ష్యమని ప్రముఖ సినీగీత రచయిత భాస్కరభట్ల చెప్పారు. మంగళవారం సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. స్వామి సన్నిధిలో పూజలు చేశారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో ముచ్చటించారు. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాతో గీత రచయితగా సినీరంగానికి పరిచయమైన తాను ఇప్పటివరకు సుమారు 300 చిత్రాలకు పనిచేశానని చెప్పారు. సంగీత దర్శకుడు చక్రి, తాను ఒకేసారి పరిచయమయ్యామని గుర్తు చేసుకున్నారు. తాజాగా రవితేజ ‘పవర్’, మహేష్‌బాబు ‘ఆగడు’తో పాటు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వస్తున్న ఎర్రబస్సు సినిమాకు పాటలు రాశానని చెప్పారు.