హైద‌రాబాద్ అత‌లాకుత‌లం..రంగంలోకి ఆర్మీ | Hyderabad rains, flood water: Army join flood Rescue operation | Sakshi
Sakshi News home page

హైద‌రాబాద్ అత‌లాకుత‌లం..రంగంలోకి ఆర్మీ

Published Fri, Sep 23 2016 3:36 PM | Last Updated on Wed, Aug 1 2018 4:01 PM

హైద‌రాబాద్ అత‌లాకుత‌లం..రంగంలోకి ఆర్మీ - Sakshi

హైద‌రాబాద్ అత‌లాకుత‌లం..రంగంలోకి ఆర్మీ

హైదరాబాద్ : భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న భాగ్యనగరంలో వరద సహాయక చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్మీ సాయం కోరింది. మరి కొన్నిరోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వరద తగ్గే వరకూ సహకారం అందించాలని ప్రభుత్వం ఆర్మీకి విజ్ఞప్తి చేసింది. ఆర్మీతో సమన్వయం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ తరఫున ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 

 జీహెచ్ఎంసీ అధికారుల వినతి మేరకు  రంగంలోకి దిగిన ఆర్మీ శుక్రవారం ఆల్వాల్ లో పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించింది.  కాగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగి అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సహాయచర్యలు చేపట్టినా తగినంత ఫలితం కనిపించడం లేదు. దీంతో అధికారులు ఆర్మీ సాయం కోరారు.

మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే  సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని బొంతు రామ్మోహన్ సూచించారు. అటువంటి మెసేజ్లు పంపిస్తే... ఐపీ అడ్రస్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement