
పవన్ విషయం భవిష్యత్‌లో ప్రకటిస్తా
హైదరాబాద్: త్యాగాల తెలంగాణ సాధన కోసం 'మహాజన సమాజం' పోరాడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళా విజ్ఞాన్ భవన్‌లో మహా జన సమాజం సదస్సు జరిగింది.
ఈ సదస్సులో గద్దర్ మాట్లాడుతూ త్వరలో జిల్లాల వారీగా కార్యక్రమాలు చేపడుతామని, ఆరు నెలల తర్వాత భువనగిరిలో 10 లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్పారు. తాము ఉద్యమ సంఘంలా ఉండాలా లేదా రాజకీయ పార్టీగా ఉండాలా అనే విషయాన్ని ఆలోచిస్తానని గద్దర్ అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలసి పనిచేస్తామా లేదా అనే విషయాన్ని భవిష్యత్‌లో ప్రకటిస్తానని చెప్పారు.