కాబూల్‌ రక్తసిక్తం.. | IS claims responsibility for Kabul bombing | Sakshi
Sakshi News home page

కాబూల్‌ రక్తసిక్తం..

Published Thu, Jun 1 2017 2:47 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

కాబూల్‌ రక్తసిక్తం..

కాబూల్‌ రక్తసిక్తం..

ట్రక్కు బాంబుతో ఆత్మాహుతి దాడి ∙ 90 మంది మృతి..
- 400 మందికి గాయాలు ∙భారత ఎంబసీకి వంద మీటర్ల దూరంలోనే పేలుడు
స్వల్పంగా దెబ్బతిన్న ఎంబసీ భవనం.. సిబ్బంది సేఫ్‌ ∙ దాడిని ఖండించిన ప్రధాని మోదీ
 
కాబూల్‌/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని కాబూల్‌లో ఓ ఉగ్ర వాది భారీ పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ హింసాకాండలో చిన్నారులు, మహిళలు సహా 90 మంది మృత్యువాతపడగా.. మరో 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వివిధ దేశాల ఎంబసీలు ఉండే చోట బుధ వారం ఉదయం 8.30 సమయంలో ఈ ఘట న చోటు చేసుకుంది. పేలుడు ధాటికి కిలో మీటర్‌ పరిధిలో ఉన్న భవనాల అద్దాలు, కిటి కీలు ధ్వంసమయ్యాయి. భారత రాయబార కార్యాలయానికి వంద మీటర్ల దూరం లోనే ఈ దాడి జరిగింది. దాడిలో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి.
 
భయానక వాతావరణం..
పేలుడు తర్వాత ఎటుచూసినా మృతదేహా లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ప్రాణాలు దక్కించుకునేందుకు గాయపడిన వారు, మహిళలు, స్కూల్‌ విద్యార్థినులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. పేలు డు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్మేయడంతో ఏం జరుగుతుందో తెలి యని పరిస్థితి ఏర్పడింది. తమ వారి గురించి ఆరా తీస్తూ చాలా మంది కన్నీరుమున్నీర య్యారు. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నాయి.
 
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
‘దాడి మృతుల, బాధితుల్లో చాలా మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు’ అని  అఫ్గాన్‌ ఆరోగ్య , హోం శాఖలు వెల్లడించాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. ఉదయం 8.30 సమయంలో జాన్‌బాగ్‌ స్క్వేర్‌ ప్రాంతం లో భారీగా పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కు తో ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ దురా గతానికి పాల్పడ్డాడని, ఈ దాడిలో 50 వాహ నాలు ధ్వంసమయ్యాయని వివరించాయి. బాధితులను ఆదుకునేందుకు కాబూల్‌ వాసులు ముందుకు రావాలని, రక్తానికి తీవ్ర కొరత ఉన్న దృష్ట్యా రక్త దానం చేయాలని కోరాయి. దాడిలో బీబీసీ చానల్‌కు చెందిన డ్రైవర్‌ మృతిచెందగా.. నలుగురు జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి.
 
మా పని కాదు: తాలిబాన్‌
ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే తాలిబాన్‌ ఈ దాడి తాము చేయలేదని స్పష్టం చేసింది. రంజాన్‌ మాసం కావడంతో ప్రస్తుతం దాడులకు విరామం ప్రకటించామని, ఈ దాడిని  తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది.
 
భారతీయులంతా క్షేమం
పేలుడులో భారత  ఎంబసీ కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది.  ఎంబసీకి  సమీపంలోనే పేలుడు సంభవిం చిందని, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఆఫ్గాన్‌లోని భారత రాయబారి మన్‌ప్రీత్‌ వోహ్రా తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలతో పాటు ఎంబసీ తలుపులు, కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయన్నారు. జపాన్‌ ఎంబసీ కూడా స్వల్పంగా దెబ్బతినగా, అక్కడి ఇద్దరు ఉద్యోగులు స్వల్పంగా గాయప డ్డారు.  దాడిని భారత ప్రధాని మోదీ ఖండించారు. ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న మోదీ.. మృతుల కుటుంబ సభ్యులకు ట్విట్టర్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపారు.  విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ భారత ఎంబసీ అధికారులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement