టీమ్ ట్రంప్..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంచనాలను తల్లకిందులు చేస్తూ విజయం సాధించిన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్... బాధ్యతలు చేపట్టేది జనవరి 20వ తేదీన. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజులకే ట్రంప్ తమ బృందాన్ని ఎంపిక చేసుకోవడంపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. కొన్ని పదవులకు తన ఎంపికను ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే కొన్ని నియామకాలకు సెనేట్ ఆమోదముద్ర ఉండాలి.
ముస్లింలు, మెక్సికన్ల వలసలపై నియంత్రణ, ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత... తదితర అంశాల్లో ట్రంప్ కఠినవైఖరిని ప్రకటించారు. పాలనాబృందంలోకి ఎంపికలు కూడా దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీలోని తన వ్యతిరేకులను కూడా కలుపుకొనిపోతున్నారు. వ్యతిరేకులతో మాట్లాడి తన బృందంలో చేర్చుకుంటున్నారు. ట్రంప్ టీమ్‌లో ఎవరు ఉండబోతున్నారు... ఆయన ఎన్నికల ప్రచార బృందంలో వీరు పోషించిన పాత్ర ఏమిటి? గతంలో ఆయనతో వీరి సంబంధాలు... లాంటి వివరాలు చూద్దాం.
(చదవండి..ట్రంప్ టీమ్లో ఎవరెవరు?)