నేనెప్పుడూ నీతోనే ఉంటా: హీరో | Anjali's birthday greetings ... Jai letter | Sakshi
Sakshi News home page

నేనెప్పుడూ నీతోనే ఉంటా: హీరో

Published Sat, Jun 17 2017 7:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

నేనెప్పుడూ నీతోనే ఉంటా: హీరో

నేనెప్పుడూ నీతోనే ఉంటా: హీరో

ప్రేమతో... జై లేఖ!!
ప్రేమ పెదవులు దాటి పెన్ను పట్టుకునేలా చేసింది. పెన్నుతో రాసింది అక్షరాలే కావొచ్చు. కానీ, వాటిలో తనకు అంజలి అంటే ఎంత ప్రేమో చెప్పే ప్రయత్నం చేశారు జై. తమిళ హీరో జై, తెలుగమ్మాయి అంజలి ప్రేమలో ఉన్నారని చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాలు ఎప్పట్నుంచో కోడై కూస్తున్నాయి. వీళ్లిద్దరూ సదరు వార్తలను కన్ఫర్మ్‌ చేయలేదు. కానీ, వీలైన ప్రతిసారీ పుకార్లకు ఫుడ్డు పెట్టేలా ఏదొకటి చేస్తుంటారు. అంజలికి పుట్టినరోజు (శుక్రవారం) శుభాకాంక్షలు చెబుతూ... జై రాసిన లేఖ పుకార్లకు ఫుల్‌ మీల్స్‌ పెట్టింది.

‘‘నువ్వంటే నాకు ఎంత ప్రత్యేకమో... నీ పుట్టిన రోజన్నా అంతే ప్రత్యేకం! నీకెంతో ప్రత్యేకమైన ఈ రోజున నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వు నీలానే ఉంటూ నా లైఫ్‌లో ప్రతి రోజును ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దావ్‌. దేవుడు, నేనూ ఎప్పుడూ నీతోనే ఉంటాం. హ్యాపీ బర్త్‌డే అంజూ. ప్రేమతో... జై!’’ – జై స్వయంగా రాసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన లేఖ సారాంశమిది. బదులుగా అంజలి ‘‘నాతో ఉన్నందుకు థ్యాంక్స్‌ జై. నువ్వెప్పుడూ ఉంటావని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈ సంభాషణ అంతా సోషల్‌ మీడియాలోనే జరిగింది.

 అంజలికి, జైకు మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య తన ప్రేయసికి దోసెలు వేసి తినిపించిన దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ఈ ప్రేమజంట పెళ్లికి ముందే సహజీవనం సాగిస్తున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఎంగేయుం ఎప్పోదుం చిత్రంతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారిందని, అప్పటి నుంచి ఆ ప్రేమ బలపడుతూ వస్తోందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది.

ఇక ఇటీవల బెలూన్‌ చిత్ర షూటింగ్‌ స్పాట్‌లో నటుడు జయ్‌ పుట్టిన రోజు వేడుకను జరుపుకోగా అంజలి ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి హాజరై అందర్నీ ఆశ్చర్యపరచింది. శుక్రవారం నటి అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా జయ్‌ నువ్వు నాకు ఎలా స్పెషలో అదే విధంగా నీకు అన్నిరోజులూ స్పెషల్‌గా అమరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ రాసిన లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అందుకు బదులుగా అంజలి కూడా నీవు నాతో ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ ప్రత్యేక రోజున నాకు ఈ స్పెషల్‌ లేఖ రాసినందుకు మరో థ్యాంక్స్‌ అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొంది. మొత్తం మీద వీరి స్పెషల్‌ లేఖలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంత జరిగిన తర్వాత ఇకపై వీళ్లిద్దరూ ఎప్పుడైనా పబ్లిగ్గా లవ్వు, గివ్వు లేదని చెప్పినా జనాలు నమ్మరేమో!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement