
'కబాలి యాప్'తో సరికొత్త ట్రెండ్
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కబాలి' సినిమా రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తోంది. సినిమాకు సంబంధించిన మొత్తం సమాచారం తెలుసుకునేందుకు సరికొత్త యాప్ ను రూపొందించారు.
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కబాలి' సినిమా రోజుకో కొత్త వార్తతో సంచలనం సృష్టిస్తోంది. సినిమాకు సంబంధించిన మొత్తం సమాచారం తెలుసుకునేందుకు సరికొత్త యాప్‌ను రూపొందించారు. 'కబాలి యాప్'ను శనివారం ఆవిష్కరించిన చిత్ర యూనిట్.. ఇక కబాలి సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నైనా అభిమానులు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇలా యాప్ ద్వారా ప్రచారం చేయడం సౌత్లో ఇదే తొలిసారి. ఇప్పటికే టీజర్‌తో రికార్డులు తిరగరాసిన తలైవా.. యాప్ ద్వారా సరికొత్త ట్రెండ్ సృష్టించినట్లయింది. సినిమాకు సంబంధించి రూమర్ల లాంటివి వార్తలకెక్కకుండా ఎప్పటికప్పుడు సినిమా వివరాలను అభిమానులకు చేరవేసేందుకే ఈ యాప్ ను రూపొందించారట చిత్ర యూనిట్.