
తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ వెల్లంకి మృతి
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు (కుమార్తె చరిత కొడుకు) సాకేత్ రామ్ వెల్లంకి(19) మంగళవారం అమెరికాలో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు అమెరికాలోని వర్జీనియా, మనస్సాస్లో జూలై 5న నిర్వహించనున్నారు. సాకేత్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. వెల్లంకి కుటుంబానికి ప్రవాసులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపు వర్జీనియాలో నిర్వహించనున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు వారు హాజరు కానున్నారు.