తేలుపిల్ల కుట్టిందా, వానపాము కరిచిందా?
ఖైదీ నెం. 150 సినిమా ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు మొదలుపెట్టిన వివాదాన్ని దర్శకుడు ఇప్పట్లో ముగించడానికి రాంగోపాల్ వర్మ ఇష్టపడుతున్నట్లు లేడు. చిరంజీవి ఫ్యాన్స్ డిజైన్ చేసిన పోస్టర్ అంటూ.. 'రౌడీ నెం.150' అనే ఒక పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసిన వర్మ.. మళ్లీ అర్ధరాత్రి అదే అంశం మీద మరో సెటైర్ వేశాడు. నాగబాబును 'ఎన్బి' అని సంబోధించిన వర్మ.. ''నిన్న అంత అరిచి ఈవాళ ఇంత సైలెంట్గా ఉండటానికి కారణం, తేలుపిల్ల కుట్టిందా, వానపాము కరిచిందా?'' అని ప్రశ్నించాడు.
(వర్మ సమర్పించు.. రౌడీ నెం.150)
చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా రచయిత యండమూరి, రామ్‌గోపాల్ వర్మలపై మండిపడ్డారు. ఒక వ్యక్తి ఇక్కడ డైరెక్షన్ చేయడం చేతకాక ముంబై వెళ్లిపోయి అక్కడి నుంచి సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నాడని, ఎవరు పడితే వాళ్లు మెగాస్టార్‌ను ఒక మాట అంటే మైలేజి పెరుగుతుందని అనుకుంటున్నారని నాగేంద్రబాబు మండిపడ్డారు. అయితే దానిమీద వెంటనే ట్విట్టర్లో విపరీతంగా కౌంటర్లు వేసిన వర్మ.. దాన్ని అక్కడితో ఆపకుండా ప్రతిరోజూ అదే అంశంపై ఏదో ఒకటి చెబుతూనే ఉండటం గమనార్హం.
(రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు)