'ఎక్స్ప్రెస్ రాజా'గా శర్వానంద్ | sharwanand new film express raja | Sakshi
Sakshi News home page

'ఎక్స్ప్రెస్ రాజా'గా శర్వానంద్

Published Tue, Sep 22 2015 10:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

sharwanand new film express raja

'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' లాంటి వరుస సూపర్ హిట్స్ తరువాత చిన్న బ్రేక్ తీసుకున్న శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సినిమా సెలక్షన్లో ఎప్పుడు కొత్త దనం చూపించే శర్వానంద్ మరోసారి అదే తరహా కథా కథనాలను ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తన నెక్ట్స్ సినిమాకు 'ఎక్స్ప్రెస్ రాజా' అనే టైటిల్ను ఫైనల్ చేశాడు.

'ఎక్స్ప్రెస్ రాజా' అన్న టైటిల్ వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఎక్స్ప్రెస్ ను రన్ రాజా రన్ నుంచి రాజాను తీసుకొని ఈ సినిమాకు ఎక్స్ప్రెస్ రాజా అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాను కూడా రన్ రాజా రన్ ను నిర్మించిన యువి క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కించనున్నారు.

బీరువా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సురభి ఈ సినిమాలో శర్వానంద్కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement