మనోళ్లు 'దేశీ పోర్న్‌'ను తెగ చూసేస్తున్నారు! | Indians love desi porn, Delhi tops with 39% traffic | Sakshi
Sakshi News home page

మనోళ్లు 'దేశీ పోర్న్‌'ను తెగ చూసేస్తున్నారు!

Published Thu, Apr 7 2016 11:33 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

మనోళ్లు 'దేశీ పోర్న్‌'ను తెగ చూసేస్తున్నారు! - Sakshi

మనోళ్లు 'దేశీ పోర్న్‌'ను తెగ చూసేస్తున్నారు!

భారతీయులు 'పోర్న్‌' సినిమాలను తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా 'దేశీ పోర్న్‌' శృంగార దృశ్యాలను అధికంగా ఇష్టపడుతున్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పోర్న్‌ వెబ్‌సైట్‌ను ఆరా తీయగా వెల్లడైన వివరాలివి. దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్‌- శృంగార దృశ్యాల వీక్షణలో టాప్-5లో నిలువగా, అందులో మొదటి స్థానం దేశ రాజధాని న్యూఢిల్లీదేనని తేలింది. దేశంలోనే అత్యధికంగా 39.2శాతం పోర్న్‌ ట్రాఫిక్‌ హస్తిన నుంచే నమోదవుతున్నది. హస్తినవాసులు 'ఇండియన్ కాలేజీ గర్ల్స్‌', 'ఇండియాన్ బాబీ', 'బెంగాలీ', 'ఇండియన్ ఆంటీ' పదాలను ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్నారట.

ఒక ఢిల్లీ, కోల్‌కతా వాసుల మధ్య ఒక పోలిక ఉంది. సగటున 9నిమిషాల 29 సెంకండ్లపాటు ఢిల్లీ, కోల్‌కతా వాసులు శృంగార దృశ్యాలను తిలకిస్తున్నారు. ఢిల్లీ వాసుల సెర్చ్ లో 'ఆస్‌', 'స్కూల్' పదాలు టాప్ కేటగిరీలో ఉన్నాయని 'పోర్న్‌హబ్‌' వెబ్‌సైట్ తెలిపింది.

గత ఏడాది ఆగస్టులో పోర్న్‌గ్రఫీ కంటెంట్ ను అందిస్తున్న 857 వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ తర్వాత ఆ నిషేధాన్ని చైల్డ్ ప్రోర్నోగ్రఫీకి మాత్రమే పరిమితం చేసింది. ఇక టాప్ నగరాల్లో రెండోస్థానంలో ఉన్న చెన్నై నుంచి ఆరుశాతం మంది పోర్న్ వెబ్‌సైట్లను చూస్తున్నారు. చెన్నైవాసులు అధికంగా తమ సెర్చ్‌లో 'తమిళ్‌' పదాన్ని ఉపయోగిస్తున్నట్టు తేలింది. సగటు వీక్షణలో చెన్నై జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా సగటున 8నిమిషాల 58 సెంకండ్లపాటు పోర్న్ వీక్షిస్తుండగా చెన్నైలో అది 7నిమిషాల 52 సెంకండ్లు మాత్రమే. ఇక నాలుగో స్థానంలో ఉన్న ముంబైకర్లు వికృతమైన శృంగార దృశ్యాలను అధికంగా చూస్తున్నారు. 'మిల్ఫ్‌' కేటగిరీలో ప్రౌఢ మహిళల శృంగార దృశ్యాలు వారు ఎక్కువగా వీక్షిస్తున్నట్టు తేలింది.

ఐదోస్థానంలో కోల్‌కతా వాసులు జపాన్‌కు చెందిన యానిమేటెడ్ పోర్న్‌గ్రఫీ అయిన హెంటాయ్‌ను అధికంగా వీక్షిస్తున్నట్టు తేలింది. దేశంలో పోర్న్‌ దృశ్యాల కోసం జరుపుతున్న టాప్ సెలబ్రిటీల సెర్చ్‌లో సన్నీ లియోన్‌ మొదటిస్థానంలో ఉండగా, మియా ఖలిఫా, టీవీ స్టార్లు కిమ్ కర్దాషియన్, లిసా ఆన్‌ లు తదుపరి స్థానాల్లో ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement