ఫుల్‌ జోష్‌గా పన్నీర్‌.. సంబురాల్లో శ్రేణులు | supreme Court convicts Sasikala in disproportionate assets case | Sakshi
Sakshi News home page

ఫుల్‌ జోష్‌గా పన్నీర్‌.. సంబురాల్లో శ్రేణులు

Published Tue, Feb 14 2017 10:49 AM | Last Updated on Thu, Sep 27 2018 8:37 PM

ఫుల్‌ జోష్‌గా పన్నీర్‌.. సంబురాల్లో శ్రేణులు - Sakshi

ఫుల్‌ జోష్‌గా పన్నీర్‌.. సంబురాల్లో శ్రేణులు

చెన్నై: అక్రమాస్తుల కేసులో శశికళ దోషి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుతో నిజంగా పన్నీర్‌ సెల్వంపై పన్నీర్‌ జల్లు పడినట్లయింది. శశికళ ముఖ్యమంత్రి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఈ తీర్పుతో పన్నీర్‌ వర్గం మొత్తం కూడా దాదాపు సంబురాల్లో మునిగిపోయింది. ఇప్పటికే పన్నీర్‌తో ఉన్న నేతలు, కార్యకర్తలంతా కూడా సెల్వం ఇంటికి వెళుతున్నారు.

కొన్ని చోట్ల బాణాసంచాలు కూడా పేలుస్తున్నారు. సెల్వం మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి చిందులేస్తున్నారు. పన్నీర్‌ సెల్వం మరికాసేపట్లో మీడియా సమావేశానికి సిద్ధమయ్యారు. తాము ఊహించిన తీర్పే వచ్చిందని, శశికళ ఈ కేసులో ముద్దాయి అవుతుందని తమకు ముందే తెలుసని పన్నీర్‌ వర్గం చెబుతోంది. మరోపక్క, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కీలకంగా మారనుంది.  
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement