
ఏబీ డివిలియర్స్
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు మాజీ ప్లేయర్, విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ మళ్లీ సారథ్యం వహించనున్నాడంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. జట్టు సారథ్య బాధ్యతలు తీసుకోవాలంటూ క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) బోర్డు తనను సంప్రదించినట్లు వచ్చిన వార్తల్ని స్వయంగా డివిలియర్స్ ఖండించాడు. అలాంటిదేం లేదంటూ ట్విట్టర్ వేదికగా డివిలియర్స్ స్పష్టం చేశాడు. ‘ప్రొటీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని సీఎస్‌ఏ నన్ను అడిగిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఈ రోజుల్లో ఏ వార్త నమ్మాలో తెలియట్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని ఏబీ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment