
కోహ్లి-కుంబ్లే వివాదంపై ‘దాదా’ కామెంట్
టీమిండియాలో విరాట్ కోహ్లి, అనిల్ కుంబ్లే మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడంలో బీసీసీఐ విఫలమైందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విమర్శించారు.
కోల్‌కతా: టీమిండియాలో విరాట్ కోహ్లి, అనిల్ కుంబ్లే మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడంలో బీసీసీఐ విఫలమైందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విమర్శించారు. కెప్టెన్, కోచ్ మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కంచడానికి మరింత సమర్థవంతంగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రధాన కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు చేయడంపై పశ్నించగా.. ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకునే హక్కు ఉందని సమాధానం ఇచ్చారు. అవకాశం ఉంటే తాను కూడా దరఖాస్తు చేసేవాడినని చెప్పారు.
జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటి సంస్కరణలను అమలు చేసేందుకు రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏడు సభ్యుల కమిటీలో గంగూలీని బీసీసీఐ సభ్యుడిగా నియమించింది. కమిటీ కచ్చితమైన పాత్ర ఏంటో ఇంకా తెలియదని, తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని గంగూలీ వెల్లడించారు. మరో రెండు రోజుల్లో కమిటీ పని ప్రారంభిస్తుందని, 15 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని భావిస్తున్నారు.