
యువరాజ్ మరో మైలురాయి!
ఇటీవల మూడొందల వన్డే మ్యాచ్ ను ఆడటం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న భారత వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఖాతాలో మరో మైలురాయి కూడా చేరింది.
ఆంటిగ్వా: ఇటీవల మూడొందల వన్డే మ్యాచ్ ను ఆడటం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న భారత వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఖాతాలో మరో మైలురాయి కూడా చేరింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డే ద్వారా యువరాజ్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇది యువరాజ్ కెరీర్ లో 400వ అంతర్జాతీయ మ్యాచ్. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడవ భారత ఆటగాడిగా యువరాజ్ నిలిచాడు. మరొకవైపు నాల్గొందల అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన 30వ ఓవరాల్ ప్లేయర్ గా యువరాజ్ గుర్తింపు సాధించాడు.
ఇందులో 302 వన్డేలుండగా, 58 ట్వంటీ 20లు, 40 టెస్టులు ఉన్నాయి. దీనిపై యువరాజ్ భార్య హజల్ కీచ్ ఆనందం వ్యక్తం చేసింది. యువరాజ్ ఆడిన మ్యాచ్ల సంఖ్యే అతనికి క్రికెట్ పై ఉన్న ప్రేమను చూపెడుతుందంటూ హజల్ కీచ్ ట్వీట్ చేసింది. ఇదే తరహాలో యువరాజ్ కెరీర్ మరింత ముందుగా సాగాలని హజల్ కీచ్ పేర్కొంది.