
మోదీ అమెరికా పర్యటనపై ట్రంప్ ట్వీట్
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నిజమైన స్నేహితుడి’గా వర్ణించారు.
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నిజమైన స్నేహితుడి’గా వర్ణించారు. సోమవారం శ్వేతసౌధంలో మోదీతో ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్వీట్ చేశారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం అమెరికాలో అడుగుపెట్టారు. వాషింగ్టన్ డీసీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
తనకు హార్థిక స్వాగతం పలికినందుకు ట్రంప్‌కు మోదీ ధన్యావాదాలు తెలిపారు. ట్రంప్‌తో సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ట్రంప్‌తో మోదీ భేటీకానున్నారు. మరోవైపు ప్రవాస భారతీయులు కూడా మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. విలార్డ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌లో ఆయనను ప్రవాస గుజరాతీయులు కలిశారు.
Thank you @POTUS for the warm personal welcome. Greatly look forward to my meeting and discussions with you @realDonaldTrump. https://t.co/lOfxlLI7v0
— Narendra Modi (@narendramodi) 25 June 2017
Look forward to welcoming India's PM Modi to @WhiteHouse on Monday. Important strategic issues to discuss with a true friend!
— President Trump (@POTUS) 24 June 2017