ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం | cpm condemns rss leader chandravath comments | Sakshi
Sakshi News home page

ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం

Published Thu, Mar 2 2017 4:12 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం

ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం

త్రివేండ్రం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఎవరైనా చంపితే, వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చంద్రావత్ వ్యాఖ్యలను సీపీఎం నాయకులు ఖండించారు.  కేరళ సీఎం విజయన్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఎంతో మంది తలలను తీసుకుందని అన్నారు.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. చంద్రావత్ వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ చింతామణి మాలవీయ, ఎమ్మెల్యే మోహన్ యాదవ్‌ల సమక్షంలో చంద్రావత్ మాట్లాడుతూ.. విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తి మొత్తం అమ్మేస్తానని చెప్పారు.
 

ఆ సీఎంను చంపితే.. కోటి ఇస్తా: ఆర్ఎస్ఎస్ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement