నోకియా 6జీబీ ర్యామ్ మొబైల్: ధర ఎంతో తెలుసా?
నోకియా 6జీబీ ర్యామ్ మొబైల్: ధర ఎంతో తెలుసా?
Published Thu, Jan 19 2017 6:04 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
నోకియా నుంచి మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ రాబోతోంది. ఫిబ్రవరిలో జరగనున్న ఎండబ్ల్యూసీ 2017లో నోకియా పీ1ను హెచ్‌ఎండీ గ్లోబల్ విడుదల చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన ఫోటోతో పాటు ధర కూడా ఆన్‌లైన్‌లో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. అచ్చూ షార్ప్ అక్వోస్ ఎక్స్‌ఎక్స్3లా నోకియా పీ1 కనిపిస్తోంది.
ఫీచర్స్:
- ఆండ్రాయిడ్ నౌగాట్‌తో నడుస్తుంది.
- గొరిల్లా గ్లాస్ 5
- 6జీబీ ర్యామ్
- స్నాప్‌డ్రాగన్835 ఎస్‌ఓసీ
- 22.6 మెగా పిక్సల్స్ కెమెరా
- వాటర్, డస్ట్ రెసిస్టెంట్
- ఫింగర్ ప్రింట్ స్కానర్
ఈ ఫీచర్లన్నీ నోకియా పీ1లో ఉంటాయని కొన్ని టెక్నాలజీ వెబ్‌సైట్లలో ప్రచురించారు. కాగా నోకియా పీ1 128జీబీ మోడల్ ధర రూ.54,500/-, 256జీబీ ధర రూ.64,700 వరకూ ఉంటుందని పలు రిపోర్టులు పేర్కొన్నాయి.
Advertisement
Advertisement