శశికళ దోషి: సుప్రీంకోర్టు తీర్పు | sasikala convicted in da case, four years imprisonment awarded | Sakshi
Sakshi News home page

శశికళ దోషి: సుప్రీంకోర్టు తీర్పు

Published Tue, Feb 14 2017 10:43 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

sasikala convicted in da case, four years imprisonment awarded



ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు రూ. 10 కోట్ల జరిమానా విధించింది.  దాంతో తమిళ రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. వెంటనే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక అసలు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అన్నది లేకుండా పోయింది. 
 
పన్నీర్ సెల్వానికి కూడా ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు భావించాలి. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయినట్లయింది. ఏ నేరంలోనైనా శిక్ష అనుభవిస్తే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన ఉండటంతో.. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా, ఎన్నికయ్యే అవకాశం లేదు కాబట్టి ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పూర్తిగా పోయాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement