నల్లగా ఉన్నాడని భర్తను చంపేసింది
ఆనంద్: భర్త నల్లగా ఉన్నాడని అసంతృప్తితో ఉన్న ఓ భార్య చివరికి అతడిని కడతేర్చింది. గురువారం గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, సుందరాణా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నల్లగా ఉన్నందున భర్తను పెళ్లయినప్పటి నుంచే ఫర్జానాబానో(22) అసహ్యించుకోవడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
భర్తతో శారీరక సంబంధానికి సైతం ఆమె నిరాకరించింది. ఇటీవల కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లి ఫర్జానా తిరిగి వచ్చింది. వారి మధ్య మళ్లీ గొడవ పెరిగి బుధవారం రాత్రి తీవ్రం కావడంతో ఫరూఖ్ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. గురువారం పొలానికి తనతో రమ్మని తీసుకెళ్లగా, ఆమె అక్కడే వెనక నుంచి సుత్తితో కొట్టి చంపేసింది. ఫర్జానాను పోలీసులు అరెస్టు చేశారు.