సచిన్ కోసం కామెంటేటర్ గా మారిన అమీర్ ఖాన్ | Aamir Khan turns commentator in Wankhede Stadium | Sakshi
Sakshi News home page

సచిన్ కోసం కామెంటేటర్ గా మారిన అమీర్ ఖాన్

Published Thu, Nov 14 2013 5:15 PM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

సచిన్ కోసం కామెంటేటర్ గా మారిన అమీర్ ఖాన్

సచిన్ కోసం కామెంటేటర్ గా మారిన అమీర్ ఖాన్

సచిన్ టెండూల్కర్ ఆడుతున్న చివరి టెస్ట్ అనేక విశేషాలకు వేదికైంది. సచిన్ ఆటనే కాకుండా బాలీవుడ్ తారల్లో కొందరు వాంఖెడే స్టేడియానికి తరలివచ్చారు. సచిన్ ఆటను చూడటానికి వచ్చిన బాలీవుడ్ తారల్లో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అమీర్ ఖాన్ కామెంటేటర్ గా మారడం క్రికెట్ అభిమానులను ఆకర్షించింది. క్రికెట్ కామెంటేటర్లు రవిశాస్త్రి, హర్షా భోంగ్లేతో కలిసి అమీర్ ఖాన్ కామెంటేటర్ అవతారం ఎత్తారు. 
 
కామెంటరీ బాక్సులో సచిన్ తో ఉన్న అనుబంధాన్ని, గడిపిన క్షణాలను అమీర్ ఖాన్ నెమరు వేసుకున్నారు. దూమ్ 3 చిత్రంలోని దూమ్ మచాలే పాటను క్రికెట్ దేవుడికి అంకితమిచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దూమ్3 చిత్ర ప్రమోషన్ ఈవెంట్ ఈ సాయంత్రం 4.30 గంటలకు ఉండగా, ఈ సాయంత్రం 6 గంటలకు వాయిదా వేశారు. 
 
వెస్టిండీస్ ఆలౌట్ అయిందనే సమాచారం అందుకున్న అమీర్ ఖాన్ స్టూడియోలో అన్ని పనులు వదులకొని తాను అదృష్టంగా భావించే నీలం రంగు టీషర్ట్ వేసుకుని స్టేడియంలో అడుగుపెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement