Citizenship Amendment Act
-
రివైండ్ 2024: విషాదాలు... విజయాలు
2024లో భారతావని తీపి, చేదులెన్నింటినో చవిచూసింది. హిందువుల ఐదు శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలో బాలరామునికి దివ్య ధామం కొలువుదీరింది. అస్తవ్యస్థ అభివృద్ధి తగదని కేరళ కొండల్లో ప్రకోపం రూపంలో ప్రకృతి హెచ్చరించింది. ‘400 పార్’ అన్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు హ్యాట్రిక్ ఇచ్చినా మెజారిటీకి కాస్త దూరంలోనే నిలబెట్టి షాకిచ్చారు. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో శిక్షణ వైద్యురాలిపై కామాంధుడి హత్యాచారం యావత్ జాతినీ నిశ్చేష్టపరిచింది. వలస చట్టాల స్థానంలో భారతీయ చట్టాలు వచ్చాయి. చచ్చిన జంతువుల చర్మాలపై వేళ్లు కదలించే వాళ్లంటూ దూరం పెట్టిన నోళ్లు నివ్వెరబోయేలా తబలాకు విశ్వవ్యాప్త కీర్తి కిరీటం తొడిగిన స్వర తపస్వి జాకీర్ హుస్సేన్ అస్తమయంతో సంగీత ప్రపంచం మూగబోయింది. సంస్కరణల బాటలో దేశాన్ని ప్రగతి పరుగులు పెట్టించిన కర్మయోగి మన్మోహన్, పారిశ్రామిక జగజ్జేత రతన్ టాటా సహా దిగ్గజాలెందరో ఇక సెలవంటూ మనను వీడి వెళ్లారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్లో జగజ్జేతగా నిలిచి టీనేజర్ గుకేశ్ దొమ్మరాజు ఆనంద డోలికల్లో ముంచెత్తాడు...అయోధ్యలో బాల రాముడు శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలో భవ్య రామమందిరం రూపుదిద్దుకుంది. బాల రాము ని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరిలో అతిరథ మహారథుల సమక్షంలో కన్నులపండువగా జరిగింది. వజ్రతిలకంతో అపూర్వ ఆభరణాలతో కూడిన ఆ సుందర రూపాన్ని చూసేందుకు భక్త కోటి పోటెత్తింది. ప్రారం¿ోత్సవాన్ని వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా వీక్షించారు.సత్తా చాటిన ఇస్రో 2024 మొదలవుతూనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జయభేరి మోగించింది. కృష్ణబిలాలు, ఎక్స్ కిరణాలపై శోధనకు ఎక్స్‌రే పొలారీమీటర్ శాటిలైట్‌ను జనవరి 1న తొలి ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించింది. వారంలోపే సూర్యునిపై పరిశోధనలకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్–1ను సైతం ఎల్–1 కక్ష్యలోకి చేర్చింది. ఏడాది పొడవునా ప్రయోగాలతో సత్తా చాటింది.పరిణిత తీర్పు లోక్‌సభలో తమకు ఎదురు లేదని భావించిన కమల దళానికి ఓటర్లు చిన్న షాకిచ్చారు. మోదీ మేనియాలో హ్యాట్రిక్ ఖాయమన్న అంచనాలను నిజం చేసినా, బీజేపీని మాత్రం మెజారిటీకి కాస్త దూరంలోనే ఉంచారు. అయోధ్యకు నెలవైన లోక్‌సభ స్థానంలోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. విపక్ష ‘ఇండియా’ కూటమి పర్వాలేదనిపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కలిసొచ్చి కాంగ్రెస్ కూడా కాస్త కోలుకుంది. దివికేగిన దిగ్గజాలు న్యాయ కోవిదుడు ఫాలీ ఎస్ నారిమన్, వామపక్ష దిగ్గజాలు బుద్ధదేవ్ భట్టాచార్య, సీతారాం ఏచూరి మొదలుకుని ఓం ప్రకాశ్ చౌతాలా, ఎస్ఎస్ కృష్ణ వంటి దిగ్గజ నేతలను, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నిపుణురాలు యామినీ కృష్ణమూర్తి తదితరులనూ ఈ ఏడాదిలోనే దేశం కోల్పోయింది. పారిశ్రామిక దిగ్గజం, మానవీయ విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అస్తమయం తీరని లోటు మిగిల్చింది. డిసెంబర్ అయితే పీడకలగా మిగిలింది. తబలా దిగ్గజం జాకిర్ హుస్సేన్, భారతీయ సినిమాకు మట్టి పరిమళాలద్దిన హైదరాబాదీ శిఖరం శ్యామ్ బెనగల్, రాజనీతిజు్ఞడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సంస్కరణల ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరి వెంట ఒకరు సెలవంటూ వెళ్లిపోయారు.బాండ్లకు బైబై పారీ్టలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచి్చన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వాటి జారీని తక్షణమే నిలిపేయాలంటూ ఏకగీవ్ర తీర్పునిచ్చింది. ఎన్నికల బాండ్ల ముసుగులో గోప్యంగా విరాళాల స్వీకరణ సమాచార హక్కుకు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. దాతల పేర్లపై గోప్యత తగదని చెప్పింది.వయనాడ్ విలయం కేరళలోని వయనాడ్ జిల్లాలో మారుమూల గ్రామాలపై కొండచరియలు విరిగిపడ్డ విలయంలో 231 మంది అమాయకులు సజీవ సమాధి అయ్యారు. పర్యాటకం పేరిట కొండలను ఇష్టంగా తవ్వేసిన పాపానికి వాళ్లు బలైపోయారు. దాదాపు 120 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. వేలమంది సర్వస్వం కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలో సత్సంగ్‌లో బోలే బాబా పాదస్పర్శ జరిగిన మట్టి కోసం భక్తులు వేలాదిగా ఎగబడ్డ ఉదంతం తొక్కిసలాటకు దారితీసి 121 మంది ప్రాణాలు కోల్పోయారు.అరెస్టులే అరెస్టులు ఢిల్లీలో మద్యం విధా నం కుంభకోణం కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. ఎట్టకేలకు బెయిల్ మీద బయటికొచి్చనా నమ్మినబంటు అతిశిని ఢిల్లీ సీఎం కుర్చీపై కూర్చోబెట్టారు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన అత్యాచారాల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ అరెస్టయ్యారు. కన్నడ నటుడు దర్శన్ తూగుదీప కూడా అభిమానిని కొట్టి చంపిన కేసులో కటకటాలపాలయ్యారు. సంచలనం సృష్టించిన నీట్ ప్రవేశ పరీక్షలోనూ పలు అరెస్టులు జరిగాయి.రైతన్నల పోరుబాట మద్దతు ధరకు చట్ట బద్ధత కోరుతూ పంజాబ్, హరియాణాలో కర్షకలోకం మరోసారి సమరశంఖం పూరించింది. శంభూ సరిహద్దు వద్ద మొదలైన రైతు ఉద్యమం మరోసారి ఉధృతంగా సాగింది. ఢిల్లీ, హరియాణా సరిహద్దుల దిగ్బంధం, పోలీసులతో రైతుల ఘర్షణ, లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో రైతన్నలు నెల రోజులుగా రోడ్డుపై రక్తమోడుతున్నా కేంద్రం నుంచి ఇప్పటికైతే సానుకూల ప్రకటన లేదు. నానాటికీ క్షీణిస్తున్న రైతు నేత డల్లేవాల్ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది.అమల్లోకి సీఏఏ వివాదాస్పద పౌరస త్వ సవరణ చట్టాన్ని మోదీ సర్కారు అమల్లోకి తెచ్చింది. 2014 డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలు లేకున్నా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైంది.భారత న్యాయవ్యవస్థభారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. బ్రిటిష్ హయాం నాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధార చట్టాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. సత్వర న్యాయం, జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎల్రక్టానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చాయి.చైనా దోస్తీ సరిహద్దు సంక్షోభాగ్నిని ఎగదోసే డ్రాగన్ దేశంతో ఎట్టకేలకు తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ ఒప్పందం కుదిరింది. అక్కడ బలగాల ఉపసంహరణ, ఉమ్మడి గస్తీకి ఇరు దేశాలు సరేనన్నాయి. దాంతో గల్వాన్ లోయ ఉద్రిక్తత అనంతరం దిగజారిన ద్వైపాక్షిక సంబంధాలు కాస్త మెరుగయ్యాయి.ఆర్జీ కర్ దారుణం కోల్‌కతా ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై సివిల్ వలంటీర్ చేసిన దారుణ హత్యాచారం యావద్దేశాన్నీ కలచివేసింది. నిందితునితో అంటకాగిన కాలేజీ ప్రిన్సిపల్‌ను తొలగించకపోగా వేరే పోస్టింగ్ ఇచ్చి మమత సర్కారు జనాగ్రహానికి గురైంది. మహిళా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత గాల్లో దీపమంటూ దేశవ్యాప్తంగా వైద్య లోకం రోడ్డెక్కడంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు చర్యలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.చదరంగంలో యువరాజు 18 ఏళ్ల గుకేశ్ దొమ్మరాజు చదరంగంలో భారత పతాకను సమున్నతంగా ఎగరేశాడు. ఏడేళ్ల వయసు నుంచే గళ్లపై తిరుగులేని పట్టు సాధించిన ఈ సంచలనం తాజాగా ప్రపంచ వేదికపై డిఫండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను మట్టికరిపించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్లో పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ
కోల్‌కతా: నూతన పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న పలువురికి సిటిజన్‌షిప్ సర్టిఫికేట్లను కేంద్రం బుధవారం జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు, హర్యానా, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో మొదటి విడత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సిటిజన్‌షిప్ సర్టిఫికేట్లను అధికారులు అందజేశారు. 2019లో పార్లమెంట్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం నియమ, నిబంధనలను మార్చి 11న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన విషయం తెలిసిందే. చట్టం నిబంధనలు నోటీఫై అయిన రెండు నెలల అనంతరం మే 15న తొలిసారి మొదటి విడతగా 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని, అమలు చేయమని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్న విషయం తెలిసిందే. సీఏఏ మానవత్వాన్ని అవమానించటమేనని, దేశ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని మండిపడ్డ సంగతి విధితమే.సీఏఏలో ఏముంది...!► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు.► 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు.► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్‌లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కల్పిస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు.► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది.► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. -
Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
సార్వత్రిక సంగ్రామంలో పశి్చమ బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటిదాకా 4 విడతల్లో 18 చోట్ల పోలింగ్ ముగిసింది. 20వ తేదీన ఐదో విడతలో 7 నియోజకవర్గాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవన్నీ రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక బెల్టులోనే ఉన్నాయి. భారీగా పట్టణ ఓటర్లున్న సీట్లివి. ఇటీవలే అమల్లోకి వచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), మైనారిటీలు ఈ సీట్లలో బాగా ప్రభావం చూపే అవకాశముంది. ఐదో విడతలో తలపడుతున్న 88 మంది అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు కీలక నియోజకవర్గాలపై ఫోకస్... హౌరా... వలస ఓట్లు కీలకం సుప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్, హౌరా రైల్వే స్టేషన్, బొటానిక్ గార్డెన్లకు నెలవైన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోట. తృణమూల్ ఇక్కడ పాగా వేసినప్పటికీ బీజేపీ కూడా భారీగా పుంజుకుంటోంది. తృణమూల్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ప్రముఖ ఫుట్‌బాలర్ ప్రసూన్ బెనర్జీ ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ గట్టి పోటీ ఇచి్చంది. బీజేపీ అభ్యర్థి రంతిదేవ్ సేన్‌గుప్తా కేవలం 6,447 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కిక్కిరిసిన జనాభా, ఐరన్ ఫౌండ్రీల్లో పనిచేసే కారి్మకులతో కళకళలాడే ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 93 శాతం పట్టణ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో పావు వంతు బెంగాలీయేతరులే! వీరంతా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. బీజేపీ నుంచి రతిన్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం సవ్యసాచి చటర్జీని రంగంలోకి దించింది. అత్యధికంగా 19 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉండటం విశేషం.ఆరాంబాగ్... హోరాహోరీ తృణమూల్ పాగా వేసిన మరో కమ్యూనిస్ట్ అడ్డా ఇది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో 2014లో తొలిసారి తృణమూల్ నుంచి అపురూపా పొద్దార్ (అఫ్రీన్ అలీ) 3.5 లక్షల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో మాత్రం సీపీఎం అభ్యర్థి శక్తి మోహన్ మాలిక్‌పై ఆమె కేవలం 1,142 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ రాయ్ గెలుపు వాకిట బోల్తా పడ్డా తృణమూల్‌తో పాటు సీపీఎం ఓట్లకు భారీగా గండికొట్టారు. అపురూపపై అవినీతి ఆరోపణలతో పాటు ముస్లింను పెళ్లి చేసుకుని ఆఫ్రిన్ అలీగా పేరు మార్చుకోవడంపై దుమారం చెలరేగడంతో తృణమూల్ ఈసారి మిథాలీ బాగ్‌ను రంగంలోకి దించింది. బీజేపీ కూడా కొత్త అభ్యర్థి అరూప్ కాంతి దిగర్ను పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం బిప్లవ్ కుమార్ మొయిత్రాకు సీటిచి్చంది. మూడు పారీ్టలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు బీజేపీ, మూడు తృణమూల్ గుప్పిట్లో ఉన్నాయి. హుగ్లీ... సినీ గ్లామర్! ఒకప్పుడు కమ్యూనిస్టు దుర్గం. తర్వాత తృణమూల్ చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడిక్కడ ఇద్దరు సినీ నటుల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. 2019లో ప్రముఖ బెంగాలీ సినీ నటి లాకెట్ ఛటర్జీ బీజేపీ నుంచి 73 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి తృణమూల్ కూడా సినీ నటి రచనా బెనర్జీని తొలిసారి లోక్‌సభ బరిలో దించింది. కాంగ్రెస్ సపోర్టుతో సీపీఎం నుంచి మనోదీప్ ఘోష్ రేసులో ఉన్నారు. యూరప్ వలసపాలనకు ఈ నియోజకవర్గం అద్దం పడుతుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో పోర్చుగీసు, ఫ్రెంచ్, డాని‹Ù, డచ్ కాలనీలుండటం విశేషం. గతంలో టాటా మోటార్స్ నానో కార్ల ప్లాంట్‌ను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించి వెళ్లగొట్టిన సింగూర్ కూడా ఈ ఎంపీ స్థానం పరిధిలోనే ఉంది. ఈ వివాదం తర్వాతే కమ్యూనిస్టులను ఇక్కడ దీదీ మట్టికరిపించారు కూడా. బెంగాల్లో పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన జిల్లా కావడంతో ఇక్కడ పట్టణ ఓటర్లు ఎక్కువ. దీని పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లూ తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. త్రిముఖ పోరులో ఈసారి బీజేపీకి ఎదురీత తప్పదంటున్నారు.ఉలుబేరియా... మైనారిటీల అడ్డా బ్రిటిష్ జమానా నుంచీ జనపనార పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం హౌరా జిల్లాలో ఉంది. అయితే, ఈ పరిశ్రమలు నెమ్మదిగా మూతబడుతూ వస్తున్నాయి. ఇప్పుడిక్కడ ఒక్క భారీ జూట్ మిల్లు కూడా లేదు. నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ఇంజనీరింగ్, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ హిందూ, ముస్లింలు సమానంగా ఉంటారు. 1980ల నుంచీ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు! సీపీఎం తరఫున హన్నన్ మోలాహ్ ఏకంగా వరుసగా ఎనిమిదిసార్లు నెగ్గారు. 2004 నుంచి ఈ స్థానం తృణమూల్ గుప్పిట్లో ఉంది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు సుల్తాన్ అహ్మద్ గెలుపొందారు. ఆయన మరణానంతరం భార్య సజ్దా అహ్మద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆమె బీజేపీ అభ్యర్థి జాయ్ బెనర్జీపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా సజ్దాయే తృణమూల్ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి అరుణ్ ఉదయ్ పాల్ చౌదరి పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో కాంగ్రెస్ అజర్ మాలిక్‌ను పోటీకి దించింది. హుగ్లీ జిల్లాలోని ప్రముఖ ముస్లిం మత గురువు అబ్బాస్ సిద్ధిఖీ తన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పార్టీ తరఫున స్వయంగా పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.బారక్పూర్... పోటాపోటీ ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట. 2014లో తృణమూల్ కాంగ్రెస్ దీన్ని బద్దలుకొట్టగా... కమలనాథులు గత ఎన్నికల్లో దీదీకి షాకిచ్చారు. రెండుసార్లు తృణమూల్ నుంచి గెలిచిన సీనియర్ నేత దినేశ్ త్రివేదిపై 2019లో బీజేపీ నేత అర్జున్ సింగ్ 14,857 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. గతంలో సింగ్ తృణమూల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. 2019 ముందు బీజేపీలోకి జంప్ చేసి అనూహ్యంగా విజయం సాధించిన అర్జున్ సింగ్ 2022లో తిరిగి తృణమూల్ గూటికి చేరారు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఇటీవలే మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకొని టికెట్ దక్కించుకున్నారు. అర్జున్ సింగ్ చేతిలో ఓటమి పాలైన దినేశ్ త్రివేది కూడా తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం విశేషం. అర్జున్ సింగ్‌పై ఏకంగా 93 కేసులుండటం గమనార్హం! తృణమూల్ నుంచి ఈసారి పార్థా భౌమిక్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం దేబదత్ ఘోష్‌ను బరిలో దింపింది. పోటీ ప్రధానంగా బీజేపీ, తృణమూల్ మధ్యే ఉంది. కమ్యూనిస్టులకు గట్టి ఓటు బ్యాంకున్న నేపథ్యంలో సీపీఎం ఓట్లు ఎవరి విజయావకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరం. ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉన్న ఈ నియోజకవర్గం గతంలో పారిశ్రామికంగా బాగా పురోగతిలో ఉండేది. జూట్, జౌళి మిల్లులు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఎక్కువ. ఇప్పుడవన్నీ మూతబడటంతో ఉపాధి కోసం ప్రజలు వలస బాట పట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
అజంగఢ్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ చట్టాన్ని మాత్రం మీరు ఎప్పటికీ రద్దు చేయలేరు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి తేలి్చచెప్పారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్, జాన్పూర్, బదోహీ, ప్రతాప్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. సీఏఏ కింద కాందీశీకులకు భారత పౌరసత్వం కలి్పంచే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, వీరంతా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులేనని చెప్పారు. మతం ఆధారంగా భారత్‌ను విడగొట్టడంతో వీరంతా బాధితులుగా మారి మన దేశానికి వచ్చారని, చాలాఏళ్లుగా ఇక్కడే కాందిశీకులుగా బతుకుతున్నారని తెలిపారు. ప్రాణభయంతో వలస వచి్చన బాధితులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. ఈసారి మూడు డోసుల బుజ్జగింపు విధానాలు ‘‘ఉత్తరప్రదేశ్‌లో గతంలో భయానక పరిస్థితులు ఉండేవి. పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష ప్రసాదించి వదిలేసేవారు. ముష్కరులకు రాజకీయ ముసుగేసి కాపాడుతూ ఉండేవారు. దీనివల్ల ఉగ్రవాదం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. అయినా కొందరు విపక్ష నాయకుల ధోరణిలో మార్పు రావడం లేదు. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం వచి్చన తర్వాత మార్పు మొదలైంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ అనేవి రెండు పార్టీలు. నిజానికి అవి ఒకే దుకాణం. అక్కడ బుజ్జగింపు రాజకీయాలు, అబద్ధాలు, కుటుంబస్వామ్యం, అవినీతిని అమ్ముతుంటారు. ఈసారి వారు మూడు డోసుల బుజ్జగింపు విధానాలతో ముందుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాజేసి ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టాలని ప్రయతి్నస్తున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో సగం దోచుకొని ఓటు బ్యాంక్‌కు అప్పగించాలని కుట్రలు పన్నుతున్నారు. దేశ బడ్జెట్లో ఏకంగా 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత రాహుల్, అఖిలేశ్ విదేశాలకు వెళ్లిపోతారు పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచక, అవినీతి పాలనను ఉత్తరప్రదేశ్‌లోనూ తీసుకురావాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు భావిస్తున్నాయి. హిందువులను హత్య చేయడం, దళితులను, ఆదివాసీలను వేధించడం, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడమే తృణమూల్ కాంగ్రెస్ పాలన. అలాంటి పాలన మనకు కావాలా? అనేది ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. జూన్ 4 తర్వాత మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది. ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లూ పని చేస్తానని గ్యారంటీ ఇస్తున్నా. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ), సమాజ్‌వాదీ పార్టీ యువరాజు(అఖిలేశ్ యాదవ్) విదేశాలకు వెళ్లిపోతారు. నోట్లో బంగారు చెంచాతో పుట్టిన బడాబాబులు ఈ దేశాన్ని సమర్థంగా నడపలేరు’’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు ‘‘ఈ లోక్‌సభ ఎన్నికలు మనకొక సువర్ణావకాశం. బలమైన ప్రభుత్వాన్ని నడిపించడంతోపాటు ఇండియా బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పే నాయకుడిని ఎన్నుకోవాలి. అందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలి. ప్రజలు వేసే ఓటు బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు నేరుగా నరేంద్ర మోదీ ఖాతాలోకి చేరుతుంది. ఇండియా కూటమి నాయకులు అధికారంలోకి వస్తే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని సైతం మార్చేస్తామంటున్నారు. నేను బతికి ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగనివ్వను. ఎక్స్–రే యంత్రాలతో ప్రజల ఆస్తులను సర్వే చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. అందుకే మనమంతా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ అజెండాను నేను బయటపెట్టా. దాంతో కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి’’. -
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
బారక్పూర్/హుగ్లీ: ‘‘నాకు వారసులెవరూ లేరు. దేశ ప్రజలే నా వారసులు. అభివృద్ధి చెందిన భారత్‌ను వారి చేతికి ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ప్రజలను లూటీ చేసి, వారసుల కోసం కోటలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అసలు లక్ష్యం. విపక్ష కూటమిలో కనిపించే ఉమ్మడి లక్షణం అవినీతి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను బతికి ఉన్నంతకాలం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎవరూ రద్దు చేయలేరని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ) వయసు కంటే తక్కువ సీట్లతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సిందేనని అన్నారు. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బెంగాల్‌లోని బారక్పూర్, హుగ్లీ, హౌరా, పుర్సురాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. బిహార్ రాజధాని పాటా్నలో రోడ్ షోలో పాల్గొన్నారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గూండాలు సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ నిందితులను తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం నిస్సిగ్గుగా కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ అరాచకాలను ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలపై హేయమైన నేరాలకు పాల్పడిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ రాష్ట్రం అవినీతి కేంద్రంగా, బాంబుల తయారీ పరిశ్రమగా మారిపోయింది. చొరబాట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇక్కడి స్థానికులు మైనారీ్టలుగా మారిపోతున్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు దాసోహం అంటోంది. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా గురించి నేను మాట్లాడితే తృణమూల్ నాయకులు బాంబుల బాష మాట్లాడుతున్నారు. హిందువులను బాగీరథీ నదిలో విసిరేస్తామంటున్నారు. వారికి ఆ అధికారం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగాల్లో శ్రీరాముడి పేరు పలికే పరిస్థితి లేదు. జనం శ్రీరామనవమి జరుపుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు జిహాద్ పిలుపులకు మద్దతిస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన బాధితులకు భారతదేశ పౌరసత్వం కలి్పంచేందుకు పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టంపై అబద్ధాల రంగు చల్లుతున్నాయి. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికే తప్ప లాక్కోవడానికి కాదు. 400కు పై సీట్లు.. నినాదం కాదు, తీర్మానం లోక్‌సభ ఎన్నికల్లో మూడు దశల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ బీజేపీ కూటమి పట్ల సానుకూలంగా జరిగింది. ఈసారి ఎన్నికల్లో మాకు 400కు పైగా సీట్లు వస్తాయనేది నినాదం కాదు. అది ప్రజల తీర్మానం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే సాధ్యం. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన ప్రతిపక్షాలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నాయి’ అని మోదీ స్పష్ట్టం చేశారు. -
Citizenship Amendment Act: సీఏఏ ఎవరికి లాభం?
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఫలితాలను బాగా ప్రభావితం చేసేలా కని్పస్తోంది. ఈ చట్టానికి నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు ఆమోదం లభించినా దేశవ్యాప్త వ్యతిరేకత, ఆందోళనలు తదితరాల నేపథ్యంలో అమలు మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సరిగ్గా ఎన్నికల ముందు దేశమంతటా సీఏఏను అమల్లోకి తెస్తూ మార్చి 11న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎవరేమన్నా సీఏఏ అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పాలక బీజేపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో సీఏఏ ప్రస్తావనే లేకపోవడంపై విపక్ష ఇండియా కూటమి పక్షాలతో పాటు కేరళ సీఎం విజయన్ విమర్శలు గుప్పించారు. దాంతో, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంటు తొలి సమావేశాల్లోనే రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి.చిదంబరం ప్రకటించారు. దాంతో సీఏఏపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.బెంగాల్లో మథువా ఓట్లు బీజేపీకేరాష్ట్రంలో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఏఏ హామీతోనే బీజేపీ బాగా బలపడింది. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన నామశూద్ర (మథువా) సామాజికవర్గంలో బీజేపీకి ఆదరణ పెరిగింది. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 18 సీట్లు గెలిచింది. తాజాగా చట్టాన్ని అమల్లోకి తేవడం మరింతగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. దళితులైన మథువాలు దేశ విభజన సమయంలో, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సందర్భంగా అక్కడి నుంచి భారీగా బెంగాల్లోకి వలస వచ్చారు. ఉత్తర 24 పరగణాలు, నదియా, పూర్వ బర్ధమాన్, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్ జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులకు పౌరసత్వం లేదు. అందుకే సీఏఏ చట్టానికి అత్యధికంగా మద్దతిస్తున్నది వీరే. 2019 డిసెంబర్లో పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించినప్పటి నుంచీ దాని అమలు కోసం డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్లో మతువా ఓటర్లు దాదాపు 1.75 కోట్లు ఉన్నట్టు అంచనా! బొంగావ్, బసీర్హాట్, రాణాఘాట్, కృష్ణానగర్, కూచ్ బెహార్ తదితర లోక్‌సభ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకం! వీటిలో ఎస్సీ రిజర్వుడు స్థానాలైన బొంగావ్, రాణాఘాట్, కూచ్ బెహార్ 2019 ఎన్నికల్లో బీజేపీ వశమయ్యాయి. బసీర్హాట్, కృష్ణానగర్ తృణమూల్ పరమయ్యాయి. బొంగావ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్‌ది మథువా సామాజికవర్గమే. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిం జనాభా 30 శాతమని అంచనా.అసోం: అసోం (14)తో కలిపి ఈశాన్య రాష్ట్రాల్లో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలోనూ సీఏఏ ప్రభావం బాగా ఉంటుందని అంచనా. బెంగాలీ మాట్లాడే శరణార్థులందరినీ ‘హిందూ–ముస్లింలు’గా, ‘చొరబాటుదారులు’గా స్థానికులు పరిగణిస్తారు. వారికి పౌరసత్వమిస్తే తమ గుర్తింపు, సంస్కృతి, సామాజిక సమీకరణాల వంటివన్నీ తలకిందులవుతాయని పలు ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనగా ఉన్నాయి. ముఖ్యంగా అసోం రాజకీయాలు దశాబ్దాలుగా బెంగాలీ వ్యతిరేక భావజాలం చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. అసోంలో ముస్లింలు ఏకంగా 34 శాతం ఉన్నారు. అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25కు ముందు శరణార్థులుగా వచ్చిన వారిని ఎన్ఆర్సీలో చేర్చేందుకు వీలు కలి్పంచారు. అలా దరఖాస్తు చేసుకున్న 3.3 కోట్ల మందిలో 19 లక్షల మందిని తుది లెక్కింపులో అనర్హులుగా ప్రకటించారు. వారిలో అత్యధికులు హిందువులే. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నిజమైన భారతీయులను పక్కన పెట్టారంటూ ఆందోళనకు దిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో 5 లక్షల పై చిలుకు బెంగాలీ హిందువులకూ తుది ఎన్ఆర్సీలో చోటు దక్కలేదు. వారంతా ఇప్పుడు సీఏఏ నుంచి ప్రయోజనం పొందుతారు. అసోం అస్తిత్వ పరిరక్షణే ప్రధాన నినాదంగా 2016, 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండుసార్లూ బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అసోంలో స్థిరపడిన మియా ముస్లింలపై స్థానికంగా ఉన్న ఆగ్రహం కారణంగా సీఏఏకు రాష్ట్రంలో బాగా మద్దతు కనిపిస్తోంది. కేరళ: ఈ దక్షిణాది రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. హిందువులతో పాటు ఇక్కడ అధిక సంఖ్యాకులైన క్రైస్తవ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీకి సీఏఏ కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. సీఏఏ అమలు నేపథ్యంలో వారు తమకు మద్దతిస్తారని బీజేపీ భావిస్తోంది. తిరువనంతపురంలో క్రెస్తవుల ఓట్లు 14 శాతానికి పైగా ఉన్నాయి. పథనంతిట్ట త్రిసూర్ లోక్‌సభ స్థానాల పరిధిలోనూ హిందూ, ముస్లింల కంటే క్రైస్తవులే అధిక సంఖ్యాకులు. పలు స్థానిక క్రైస్తవ మిషనరీలు ఇప్పటికే సీఏఏకు మద్దతు పలికాయి. ఇదీ విపక్షాల వాదన!సీఏఏ ప్రకారం పౌరసత్వం పొందేందుకు అర్హుల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడాన్ని విపక్షాలన్నీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పాక్, అఫ్తాన్, బంగ్లాల్లో ముస్లింలు మైనారిటీలు కారు గనకే చేర్చలేదన్న బీజేపీ వాదన సాకు మాత్రమేనని ఆక్షేపిస్తున్నాయి. పౌరసత్వం లేకుండా భారత్‌లో నివాసముంటున్న లక్షలాది మంది ముస్లింలను వెళ్లగొట్టడమే బీజేపీ లక్ష్యమని ఘాటుగా విమర్శిస్తున్నాయి. సీఏఏను నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)తో అనుసంధానించడం వెనక ఉద్దేశం కూడా ఇదేనంటున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం తదితర పారీ్టలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఏమిటీ సీఏఏ చట్టం...?► విదేశాల్లో మతపరమైన వివక్ష బాధితులై ఊచకోతకు గురైన మైనారిటీలకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ–2019 చట్టం ఉద్దేశం.► పాకిస్తాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో ఇలా మత హింస బాధితులై 2014 డిసెంబర్ 31, అంతకు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ఈ జాబితాలో హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవ మైనారిటీలున్నారు.► వారికి సీఏఏ చట్టం కింద ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆరేళ్లలో భారత పౌరసత్వం కల్పిస్తారు.