ప్రధానమంత్రి మోదీ స్పషీ్టకరణ
వికసిత్ భారత్‌ను ప్రజల చేతికి ఇవ్వాలన్నదే నా లక్ష్యం
విపక్ష కూటమిలో కనిపించే ఉమ్మడి లక్షణం అవినీతి
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరూ రద్దు చేయలేరు
ఈసారి కాంగ్రెస్‌కు యువరాజు వయసు కంటే తక్కువ సీట్లే
బారక్‌పూర్/హుగ్లీ: ‘‘నాకు వారసులెవరూ లేరు. దేశ ప్రజలే నా వారసులు. అభివృద్ధి చెందిన భారత్‌ను వారి చేతికి ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ప్రజలను లూటీ చేసి, వారసుల కోసం కోటలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అసలు లక్ష్యం. విపక్ష కూటమిలో కనిపించే ఉమ్మడి లక్షణం అవినీతి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను బతికి ఉన్నంతకాలం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎవరూ రద్దు చేయలేరని ఉద్ఘాటించారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ) వయసు కంటే తక్కువ సీట్లతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సిందేనని అన్నారు. పశి్చమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బెంగాల్‌లోని బారక్‌పూర్, హుగ్లీ, హౌరా, పుర్సురాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు.
బిహార్ రాజధాని పాటా్నలో రోడ్ షోలో పాల్గొన్నారు. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గూండాలు సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ నిందితులను తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం నిస్సిగ్గుగా కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ అరాచకాలను ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలపై హేయమైన నేరాలకు పాల్పడిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే...
పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ
తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ రాష్ట్రం అవినీతి కేంద్రంగా, బాంబుల తయారీ పరిశ్రమగా మారిపోయింది. చొరబాట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇక్కడి స్థానికులు మైనారీ్టలుగా మారిపోతున్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు దాసోహం అంటోంది. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా గురించి నేను మాట్లాడితే తృణమూల్ నాయకులు బాంబుల బాష మాట్లాడుతున్నారు. హిందువులను బాగీరథీ నదిలో విసిరేస్తామంటున్నారు. వారికి ఆ అధికారం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి?
బెంగాల్‌లో శ్రీరాముడి పేరు పలికే పరిస్థితి లేదు. జనం శ్రీరామనవమి జరుపుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు జిహాద్ పిలుపులకు మద్దతిస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన బాధితులకు భారతదేశ పౌరసత్వం కలి్పంచేందుకు పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టంపై అబద్ధాల రంగు చల్లుతున్నాయి. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికే తప్ప లాక్కోవడానికి కాదు.
400కు పై సీట్లు.. నినాదం కాదు, తీర్మానం
లోక్‌సభ ఎన్నికల్లో మూడు దశల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ బీజేపీ కూటమి పట్ల సానుకూలంగా జరిగింది. ఈసారి ఎన్నికల్లో మాకు 400కు పైగా సీట్లు వస్తాయనేది నినాదం కాదు. అది ప్రజల తీర్మానం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే సాధ్యం. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన ప్రతిపక్షాలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నాయి’ అని మోదీ స్పష్ట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment