the Congress Party
-
దళితులపై టీడీపీ నేతల కక్ష సాధింపు
► వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ► జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు పట్నంబజారు (గుంటూరు) : అధికారంలో ఉన్నామని ఇస్టానుసారంగా దళితులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ యూత్, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవను సర్ధుబాబు చేస్తున్న పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్యపై 307 కింద కేసు పెట్టడం దారుణమన్నారు. 16వ తేదీ సుబ్బయ్యను అదుపులోకి తీసుకుని, ఆయన బంధువులు, కుటుంబ సభ్యులకు తెలియకుండా మూడు రోజులు పాటు దాచిపెట్టడం హేయమైన చర్యగా అభిప్రాయపడ్డారు. ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలే దేవరాజు మాట్లాడుతూ ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు పాలక పక్షానికి కొమ్ముకాయటం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి డొక్కుమళ్ళ రవి మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్ సీసీ పలు విభాగాల నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, జంగా జయరాజు, రాచకొండ ముత్యాలరాజు, చిలుకా సుబ్బారావు, డి.సాంబయ్య, జంగమయ్య, నాగయ్య, సాంబయ్య తదిరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో ..డిగ్గీ బూస్ట్
కార్యకర్తల్లో ఉత్సాహం నింపే దిశగా కాంగ్రెస్ యాక్షన్‌ప్లాన్ 14న తొలి, 16న తుది జాబితాల విడుదలకు సన్నాహాలు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని అగ్రనేతలతో తారస్థాయికి తీసుకువెళ్లే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రారంభమైంది. మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్(డిగ్గీ రాజా) తో ప్రారంభమైన ప్రచార పర్వంలో గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీలతో పాటు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి తదితరులతో హీటెక్కించే దిశగా వ్యూహం రూపొందించింది. మంగళవారం దిగ్విజయ్‌సింగ్, టీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిల ఆధ్వర్యంలోని అగ్రనేతలు రాజేంద్రనగర్, ఖైరతాబాద్, సనత్‌నగర్, ఎల్బీ నగర్ నియోకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు..హైదరాబాద్‌లో అభివృద్ధి తమ హాయాంలోనే చేశామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాజేంద్రనగర్ సభ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరగ్గా, మిగిలిన మూడు సభలు ఆయా నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓటమి పాలైన దానం నాగేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్- రంగారెడ్డి జిల్లా నేతల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో దానం నాగేందర్ తొలి రోజు ఖైరతాబాద్ సమావేశానికే పరిమితమయ్యారు. ఎల్బీనగర్లో నిర్వహించిన సభలో భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలిరావటం ఉత్సాహం నింపింది. శివారు నియోజకవర్గాలకు సినీ అట్రాక్షన్ : కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులతో పాటు నగర శివారు నియోజకవర్గాల్లో సినీనటుడు చిరంజీవితో ప్రచారం చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైదరాబాద్ మేయర్ పోస్ట్‌కు మాజీ క్రికెటర్ అజ హారుద్దీన్ను నిలిపేందుకు పీసీసీ నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో, కనీసం అజహారుద్దీన్‌ను పాతబస్తీలో ప్రచారమైనా చేసిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నగరంలో అన్ని డివిజన్లకు పోటీ చేయటం ఖరారు కావటంతో ఏకాభిప్రాయం కుదిరిన చోట్ల అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను 14వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక క్లిష్టమైన డివిజన్ల అంశాన్ని పీసీసీ,సీఎల్పీ నేతల జోక్యంతో ఈనెల 16న విడుదల చేయనున్నారు. -
మంత్రి వర్గంలో చీలిక
చిచ్చురేపిన బీబీఎంపీ మేయర్ స్థానం జేడీఎస్‌తో పొత్తుపై కుదరని సయోధ్య భగ్గుమన్న విభేదాలు.. సిద్ధు నిర్ణయాలు తప్పు బట్టిన సీనియర్లు బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గంలో చీలిక ఏర్పడింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీలో విభేదాలను రేకెత్తించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయనకు అత్యంత సన్నిహితులైన కొందరు మంత్రులు బీబీఎంపీ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ వశం చేసేందుకు జేడీఎస్ సహకారం తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ చర్యలను ఆ పార్టీలోని కొందరు సీనియర్లతో పాటు మరికొందరు మంత్రులూ విభేధిస్తున్నారు. ఫలితంగా సోమవారం మంత్రి మండలి సమావేశంలో పాలన పరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారులను బయటకు పంపి వేసి సిద్ధరామయ్య నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయారు. అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో జేడీఎస్‌తో మైత్రి విషయంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు జేడీఎస్ సహకారం తీసుకుంటే తర్వాత ఆ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుందని, ఇది సరైన నిర్ణయం కాదంటూ సిద్ధరామయ్యకు పలువురు సూచించారు. దీని వల్ల ప్రజల దృష్టిలో పార్టీ పరువు మరింత దిగజారుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా జేడీఎస్‌తో మైత్రి విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హై కమాండ్‌కు తప్పుడు నివేదిక ఇచ్చారని అక్రోశం వ్యక్తం చేశారు. ఈ తీవ్ర వాగ్వాదం తర్వాత సిద్ధరామయ్య ఎలాంటి నిర్ణయం తెలపకుండా మరోసారి ఈ విషయంపై సమావేశమవుదామంటూ ముగించినట్లు సమాచారం. -
జిల్లాకు రాహుల్ ?
- మే రెండో వారంలో పర్యటన - రైతు కుటుంబాలకు పరామర్శ - టూర్ షెడ్యూల్‌పై టీపీసీసీ కసరత్తు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చే నెలలో జిల్లాలో పర్యటించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల పర్యటనలో భాగంగా మే రెండో వారంలో ఆయన తెలంగాణకు రానున్నారు. దీంట్లో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేలా టీపీసీసీ పర్యటనను ఖరారు చేస్తోంది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో రైతు కుటుంబాలను కలుసుకునేలా టూర్ షెడ్యూల్‌ను రూపొందిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. యువనేత పర్యటనను విజయవంతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆగపల్లిలో చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించి.. అక్కడి నుంచి నల్లగొండ జిల్లా మునుగోడు పర్యటనకు రాహుల్ వెళ్లేలా కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తో కాంగ్రెస్ నాయకత్వం సూత్రప్రాయంగా చర్చించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నందున.. దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీపీసీసీ నియోజకవర్గాల ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. -
త్వరలో పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటన
- మరాఠ్వాడ నుంచి ప్రారంభం - వెల్లడించిన ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు తట్కరే - నవీముంబై గెలుపు ఆత్మవిశ్వాసం పెంచిందని వెల్లడి సాక్షి, ముంబై: కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యటనలో పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు, పదాధికారులు పాల్గొంటారు. మే ఒకటో తేదీన మహారాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పూర్తయిన తరువాతి రోజు నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్ల నుంచి వరుసగా కరవు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న మరాఠ్వాడ రీజయన్ నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో ఎన్సీపీలో ఆవిరైన ఆశలు మళ్లీ చిగురించాయి. రాష్ట్రంలో తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే ధీమా పార్టీ నాయకుల్లో నింపాయి. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ నాలుగో స్థానానికే పరిమితమైంది. వరుస పరాజయాలతో కుంగిపోయిన పదాధికారులకు, కార్యకర్తలకు నవీముంబై ఎన్నికలు నూతన ఉత్తేజాన్ని కలిగించాయి. శాసనసభ ఎన్నికల తరువాత ఎన్సీపీకి బీజేపీ దగ్గర కావడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. దీంతో సందిగ్ధాన్ని తొలగించేందుకు పుణే, అలీబాగ్ ప్రాంతాల్లో శిబిరాలను నిర్వహించనున్నారు. నవీముంబైలో గణేశ్ నాయిక్ వల్లే ఎన్సీపీ విజయం సాధించిందని, అది కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిందని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. ఇందు కోసమే పవార్ పర్యటనను ఖరారు చేసినట్లు తెలిపారు. మరాఠ్వాడ పర్యటన అనంతరం విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పవార్ పర్యటిస్తారని తట్కరే చెప్పారు. ఆయనతోపాటు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, జయంత్ పాటిల్, దిలీప్ వల్సే పాటిల్ తదితర కీలక నేతలు కూడా పర్యటిస్తారని తట్కరే చెప్పారు. కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోయిందని, ఆ స్థానం ఆక్రమించాలని కార్యకర్తలకు ఉద్బోధించాలన్నారు. -
అన్నింటా గందరగోళమే..
- ఏ కార్పొరేషన్‌లోనూ రాని మెజారిటీ స్థానాలు - నవీముంబైలో ఎన్సీపీ.. మిగతా చోట్ల కాషాయ కూటమి ఆధిక్యం - చతికిల పడ్డ కాంగ్రెస్..హిట్టయిన ఎంఐఎం - కీలకం కానున్న స్వతంత్రులు సాక్షి, ముంబై: కార్పొరేషన్ల ఫలితాలు అందరూ ఊహించినట్లే వచ్చాయి. పోలింగ్ తక్కువగా నమోదవడంతో నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో అన్నిచోట్ల గందరగోళం నెలకొంది. అధికారం ఏర్పాటు చేయాలంటే ఇతరుల మద్దతు కచ్చితంగా తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. వేర్వేరుగా పోటీ చేసిన ప్రధాన పార్టీలు ఇప్పుడూ పంతాలకు పోతే అధికారానికి దూరమవాల్సిందే. నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరగ్గా గురువారం ఫలితాలు వెలువడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని పార్టీలకు స్థానాలు పెరగ్గా, మరికొన్ని పార్టీల స్థానాలు తగ్గిపోయాయి. నవీముంబై ఎన్సీపీ అతిపెద్ద పార్టీ నవీముంబైలో 111 వార్డులుండగా మొత్తం 568 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందరికన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 52 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ప్రధాన పార్టీలైన శివసేన, బీజేపీ కలసే పోటీ చేశాయి. శివసేన 68 స్థానాల్లో పోటీచేయగా 38 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 43 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఆరు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేశాయి. ఎన్సీపీ 107 స్థానాల్లో పోటీచేయగా ఏకంగా 52 స్థానాలు దక్కించుకుంది. పంతాలకు పోయిన కాంగ్రెస్ 89 స్థానాల్లో పోటీచేసి 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇతరులు ఐదు స్థానాలు గెలుచుకున్నారు. కార్పొరేషన్లో అధికారం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 56 (స్థానాలు) కావాలి. అందులో 52 స్థానాలు ఎన్సీపీకి రావడంతో ఈ పార్టీ అధికారం దక్కించుకోవడ ం ఖాయంగా కనిపిస్తోంది. తమకు ఐదుగురు స్వతంత్రుల మద్దతు ఉందని, కాంగ్రెస్‌తో జతకట్టాల్సిన అవసరం లేదని ఎన్సీపీ నేత గణేశ్ నాయిక్ అన్నారు. లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో ప్రభావం కోల్పోయిన ఎన్సీపీకి ఈ గెలుపు ఊరటనిచ్చే అంశం. కాషాయ కూటమి విజయ భేరి ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 113 వార్డులకు జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 900 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శివసేన, బీజేపీ కూటమికి ఇక్కడి ఫలితాలు నవీముంబై కంటే కొంత మెరుగ్గానే వచ్చాయి. శివసేన 64 స్థానాల్లో పోటీచేయగా 29 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 49 స్థానాల్లో పోటీ చేసి 23 గెలుచుకుంది. కాషాయకూటమికి మొత్తం 52 స్థానాలు వచ్చాయి. ఔరంగాబాద్‌లో ముస్లిం సంఖ్య ఎక్కువే అయినప్పటికీ నవీముంబైతో పోలిస్తే ఇక్కడ బీజేపీకి ఫలితాలు చాలా మెరుగ్గా వచ్చాయి. 110 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఇక్కడ కూడా కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో కాంగ్రెస్ ఇరు చోట్ల పూర్తిగా దెబ్బతింది. నవీముంబైలో అధికార పీఠం ఖాయం చేసుకున్న ఎన్సీపీ.. 70 స్థానాల్లో పోటీచేసి కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఎంఐఎం హిట్.. ఎంఐఎం 53 వార్డుల్లో పోటీ చేసి ఏకంగా 25 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు ఫలితాలు చాలా మెరుగ్గా వచ్చాయి. నవీముంబైతో పోలిస్తే ఔరంగాబాద్‌లో పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది. కాని ఇక్కడ రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో దిగడంవల్ల ఓట్లు చీలిపోయి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అధికారం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 57 స్థానాలు కావాలి. కాశాయ కూటమికే అధికార పీఠం దక్కించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఎస్పీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, ఇతరులు 18 మంది ఉన్నారు. వీరిలో ఎవరి మద్దతుతోనైనా అధికారం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశముంది. అంబర్నాథ్, బద్లాపూర్‌లో కాషాయ రెపరెప అంబర్నాథ్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారం ఏర్పాటు చేయడానికి కాశాయ కూటమికే ఎక్కువ అవకాశం ఉంది. మొత్తం 57 స్థానాలుండగా ఇందులో మూడు స్థానాలు ఇది వరకే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 54 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో శివసేనకు 26, మిత్రపక్షమైన బీజేపీకి 10 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ ఎనిమిది, ఎన్సీపీ ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. బద్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా కాషాయకూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఇద్దరు, ముగ్గురు స్వతంత్రుల అండతో అధికారం ఏర్పాటు చేసేందుకు అవకాశం లభించింది. కాంగ్రెస్, ఎన్సీపీలు ఇక్కడ కూడా చతకిలపడిపోయాయి. మొత్తం 47 స్థానాలుండగా ఐదు వార్డులు ఇదివరకే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 42 స్థానాల్లో కాశాయ కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. -
కరియప్ప చేరికతో కాంగ్రెస్‌లో లుకలుకలు
సింధనూరు టౌన్ : గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసిన ప్రముఖ నాయకుడు కే.కరియప్ప ఇటీవల బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ వర్గం జీర్ణించుకోలేక పోతోంది. మాజీ కాంగ్రెస్ ఎంపీ కే.విరుపాక్షప్ప బంధువైన కరియప్ప గత అసెంబ్లీ ఎన్నికల వరకు విరుపాక్షప్ప వెంటే ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం సంభవించిన పరిణామాలు, స్థానికంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప బీజేపీలో చేరారు. అప్పుడు కరియప్ప మాత్రం తటస్తంగా ఉన్నాడు. అయితే తెర వెనుక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేపట్టారు. క్రమంగా విరుపాక్షప్పకు దూరమైన కరియప్ప ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరియప్పను భవిష్యత్తులో కురుబ సమాజ నాయకుడిగా పార్టీ గుర్తిస్తే విరుపాక్షప్పకే నష్టమనే వదంతులు వినిపిస్తున్నాయి. అంతకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కే.విరుపాక్షప్ప గత లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించగా అప్పట్లో విరుపాక్షప్ప చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే హంపనగౌడ వర్గం సీఎం, కేపీసీసీ అధ్యక్షులకు మొర పెట్టుకున్నారు. దీంతో నిరాశ చెందిన విరుపాక్షప్ప చివరకు బీజేపీలో చేరిపోయాడు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బంధువు కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ హిట్నాళ్ తరఫున ప్రచారం చేయకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కరడి సంగణ్ణకే మద్దతు తెలిపి గెలిపించారు. అదే సమయంలో కరియప్ప కాంగ్రెస్ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసి పార్టీ అగ్రనాయకత్వంతో సంబంధాలు పెంచుకున్నారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వం సమక్షంలో పార్టీలో చేరిపోయారు. అయితే ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వర్గంలోని కొందరు నగరసభ సభ్యులు రాజీనామా చేస్తామని తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు నోరు మెదపడం లేదు. అగ్ర నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరినా రాబోయే రోజుల్లో స్థానిక నాయకులతో పొసుగుతారో లేక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారో వేచి చూడాలి. -
కరెంటు కోతలపై నిరసనాగ్రహం
ఖానాపూర్ : కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు ఖానాపూర్‌లో ఆందోళనకు దిగారు. స్థానిక జగన్నాథ్ చౌరస్తాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో కాలిపోయిన విద్యుత్ మోటార్ల తో సోమవారం గంటకు పైగా రాస్తారోకో చేశారు. విద్యుత్ ఆధారితంగా పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకుండా అనధికారికంగా ఎడాపెడా కోతలు విధిస్తోందని మండిపడ్డారు. అలాగే నాణ్యమై న విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపో యి, మోటార్లు కాలి తీవ్రంగా నష్టపోతున్నామంటూ రోడ్డు పై బైఠాయించారు. బతుకమ్మ వేడుకల పేరిట తెలంగాణ జాగృతికి రూ.10 కోట్లు, బ్రాండ్ అంబాసిడర్ అంటూ టెన్ని స్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రూ.2 కోట్లు అవసరం లేకు న్నా ఇచ్చిన కేసీఆర్ రైతు సమస్యలపై మాత్రం దృష్టిసారించ డం లేదని ఎద్దేవా చేశారు. పంటలు పండక అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కోతలతో నష్టపోయిన పంటలతో పాటు లోవోల్టేజీతో కాలిపోయిన మోటార్ల రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదేనా బాగు! తెలంగాణ వస్తే రాష్ట్రం బాగుపడుతుందనుకున్నామే గానీ ఈ విధంగా సమస్య ఉంటుందనుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కష్టాలను ప్రజలు మూడేళ్లపాటు ఓపిక పట్టాలని కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. రైతులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా అటు ప్రభుత్వంలో గానీ ఇటు అధికారుల్లో గానీ ఎలాంటి చలనం లేదని విమర్శించారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ బైఠాయింపు కొనసాగించారు. బలవంతంగా అరెస్టు అంతకుముందు చౌరస్తా ప్రాంతంలోని ఇతర కూడళ్లంన్నింటి రహదారులకు అడ్డంగా వాహనాలు పెట్టి దిగ్బంధించారు. దీంతో ఎస్సై టీవీరావుతో పాటు పోలీసులు ఎంత చెప్పినా రైతులు ఆందోళన విరమించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐ జీవన్‌రెడ్డి రంగప్రవేశం చేసి పలువురు రైతులు, నాయకులను బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గోసంపల్లెకు చెందిన రైతు కొమురయ్య సీఐ వాహనం కింద టైరుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని నినాదాలు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీ కమ్మల బాలరాజు, మాజీ ఎంపీటీసీ అంకం రాజేందర్, ఉప సర్పంచులు బర్లపాటి బీమరాజు, వీరేశ్, నాయకులు సల్ల దేవెందర్‌రెడ్డి, కరిపె శ్రీనివాస్, బీసీ రమేశ్, మాన్క దేవన్న, ఆమంద శ్రీనివాస్, పంతులు, నరేందర్, గంగాధర్, సందీప్, చందు, స్కైలాబ్ పాల్గొన్నారు. -
ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: ఎన్సీపీ తమ నుంచి విడిపోవడంతో ఇక సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబూ ఆసిమ్ అజ్మీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను కలిసి చర్చలు జరిపారని సమాజ్‌వాదీ ప్రతినిధి అబ్దుల్ ఖాదిర్ చౌదరి చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆయన అన్నారు. శివాజీనగర్-మన్‌ఖుర్ద్ నుంచి అబూ ఆజ్మీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీవండి, కుర్లా, మిరాజ్, నాగపూర్ సెంట్రల్ స్థానాలను తాము కోరుతున్నామని చెప్పారు. విదర్భలో ప్రాబల్యం ఉన్న జోగేంద్ర కవాడే, సులభ కుంభారేలతో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలిసింది. -
‘పొత్తు’ మెడపై కత్తి
న్యూఢిల్లీ/ముంబై: మరో ఒకటి, రెండు రోజుల్లో ఎన్సీపీ సానుకూలంగా స్పందించకపోతే ప్రజాస్వామ్య కూటమి ఇబ్బందుల్లో పడే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే కిందటిసారి తాము 174 సీట్లలో పోటీ చేశామని, ఈసారి కూడా ఆ స్థానాలన్నింటికీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని ఆయన వివరించారు. శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో సీట్ల పంపకంపై ఇంకా ఒప్పందం కుదరకపోతే మొత్తం 288 సీట్లకూ అభ్యర్థులను నిలబెట్టే విషయమై ఆలోచిస్తున్నామన్నారు. ఏదేమైనా పొత్తును, సీట్లను ఖరారు చేయాల్సింది తమ పార్టీ అధిష్టానమేనని ఆయన స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేయగా, ఎన్సీపీ 114 నియోజకవర్గాల్లో బరిలోకి దిగింది. ఈసారి తమకు సగానికి సగం 144 సీట్లు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రెండు పార్టీల భాగస్వామ్యం 50:50గా ఉండాలని అంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు, ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, న్యూఢిల్లీలో సోనియాగాంధీతో రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్సీపీతో సీట్ల పంపకం అంశాలపై చర్చించారు. ఎన్సీపీకి 130 సీట్లు ఇవ్వాలని ఆ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలి పాయి. ఈసారి ఎన్నికల్లో సీఎం పృథ్వీరాజ్ చవాన్ పోటీ చేస్తారా? చేస్తే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు మాణిక్‌రావ్ నిరాకరించారు. తన సొంత జిల్లా సతారాలోని కరాద్ దక్షిణ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని చవాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విధానమండలి సభ్యునిగా ఉన్నారు. -
‘ఇది శుష్కవాగ్దానాల నిరర్థక ప్రభుత్వం’
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ గత వందరోజుల్లో దుష్పరిపాలనకు పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలో ఒక పుస్తకాన్ని వెలువరించింది. మోదీ ప్రభుత్వం-వందరోజుల దుష్పరిపాలన అన్న శీర్షికతో రూపొందించిన పుస్తకాన్ని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన ఉపఎన్నికల ఫలితాలు, నిరర్థక ప్రభుత్వ శుష్క వాగ్దానాలపై ప్రజాగ్రహాన్ని ప్రతిఫలిస్తున్నాయని కాంగ్రెస్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ కలల భేహారి పాత్ర మాత్రమే పోషించారని వందరోజుల పాలన రుజువు చేసిందని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినా, ఉపఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ముప్పుగా పరిణమించాయని, బీజేపీ ముసుగు క్రమంగా తొలగిపోయే సూచనలున్నాయని పుస్తకం పేర్కొంది. -
ఈ ఫలితాలు బీజేపీకి హెచ్చరికలే
ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ న్యూఢిల్లీ: దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఫలితాలు పాలకపక్షమైన బీజేపీకి ప్రమాద హెచ్చరికలేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మోదీ ప్రభుత్వం వచ్చిన వందరోజుల్లోనే ప్రజావ్యతిరేకత ఏర్పడిందని, మోదీ ప్రభుత్వ వైఖరిని, బీజేపీ వ్యవహారశైలిని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏర్పడటం ఇదే తొలిసారని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ తాజా ఉపఎన్నికల్లో సాధించిన ఫలితాలు గణనీయమైనవేనని అన్నారు. ఇకపై పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషిచేస్తామన్నారు. -
ఎల్వోపీ లేకుండానే కీలక భర్తీలు
ప్రతిపక్ష నేత లేకుండా చట్టబద్ధ సంస్థల్లో పదవుల భర్తీకి కేంద్రం నిర్ణయం లోక్‌సభ సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్న డీవోపీటీ న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత (ఎల్వోపీ) లేకుండానే చట్టబద్ధమైన కేంద్ర విజిలెన్స్ కమిషనర్, జాతీయ మానవహక్కుల సంఘం చైర్మన్, లోక్‌పాల్ తదితర పదవులను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. లోక్‌సభ సెక్రటేరియట్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెప్పాయి. సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఎల్‌వోపీపై సమాచారమివ్వాల్సిందిగా లోక్‌సభకు లేఖ రాసింది. దానిపై స్పందించిన లోక్‌సభ సెక్రటేరియట్.. గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరంటూ సమాచారమిచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో చట్టబద్ధ సంస్థల నియామకాలపై ఎల్వోపీ లేకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ వర్గాలు చెప్పాయి. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 55 సీట్లు ఉండాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే ఉండటంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించడం తెలిసిందే. లోక్‌పాల్, ఎన్హెచ్ఆర్సీ, సీవీసీల నియామకాల ఎంపిక కమిటీలో ఎల్వోపీ ఉండటం తప్పనిసరి కాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. 2003 కేంద్ర నిఘా చట్టం ప్రకారం సీవీసీ, విజిలెన్స్ కమిషనర్లను ప్రధానమంత్రి నేతృత్వంలో హోం మంత్రి, ఎల్వోపీతో కూడిన ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ చేసిన సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఎల్వోపీని గుర్తించకపోతే లోక్‌సభ ప్రతిపక్ష పార్టీల్లోని పెద్ద పార్టీ నేతను ఆ కమిటీలోకి తీసుకోవచ్చని ఆ చట్టంలో మరో నిబంధన చెబుతోంది. అంతేగాక కమిటీలో ఏదైనా ఖాళీ ఉన్నంత మాత్రాన ఆ నియామకం చెల్లుబాటుకాకుండాపోదని ఆ చట్టం పేర్కొంటోంది. ఇదే విధంగా లోక్‌పాల్, ఎన్హెచ్ఆర్సీ చట్టాలు కూడా చెబుతున్నాయి. 2005 ఆర్టీఐ చట్టం ప్రకారమైతే.. ఎల్వోపీని గుర్తించని పక్షంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతను అలా భావించాలని పేర్కొంటోంది. కాగా, ప్రతిపక్ష నేత లేకపోవడంతో సీఐసీ చీఫ్ నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేదు. 2005లో అది ప్రారంభమైన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. సీఐసీ రాజీవ్ మాధుర్ గత నెల 22న పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. -
ఉప ఎన్నిక ఖాయం
నందిగామ కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు నేడు నామినేషన్ నందిగామ : నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు పార్టీ ప్రకటించడంతో పోటీ అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ఉప ఎన్నిక జరుగనుంది. చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే పోటీ పెట్టకూడదని ఒక సంప్రదాయం ఉంది. ఆ క్రమంలోనే దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను టీడీపీ అధిష్టానంతో సహా నాయకులంతా సౌమ్య ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరారు. ఇతర రాజకీయ పార్టీలు ఎవ రూ పోటీ చేయరని మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రజలు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నందిగామ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడపాటి బాబురావును పోటీలో దింపుతున్నట్లు ప్రకటించడంతో పోటీ అనివార్యం కానుంది. చిన్న, చితకా పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేయకుండా ఉంచేందుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని బుజ్జగించి నామినేషన్లు వేయకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ అవాక్కయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు మధ్య గట్టి పోటీ జరిగింది. తంగిరాల ప్రభాకరరావు 5212ఓట్లతో విజయం సాధించారు. కానీ అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మరణించారు. -
‘చెయ్యి’చ్చారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మేధోమథన సదస్సుకు పలువురు జిల్లా నేతలు గైర్హాజరవడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. జాతీయ, రాష్ర్టస్థాయి అగ్రనేతలు హాజరైన ఈ సదస్సును జిల్లా నేతలు లైట్‌గా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాం గ్రెస్ పార్టీ.. తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలనే లక్ష్యంతో ఈ ‘భవిష్యత్ కార్యాచరణ సదస్సును తలపెట్టింది. అయితే జిల్లా నాయకత్వం నుంచి స్పందన కరువైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సదస్సులను నిర్వహించాలని, మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సదస్సు ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు అనువైన ప్రాంతంగా జిల్లా ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లకు ఉపక్రమించింది. అయితే జిల్లా నాయకత్వం నుంచి సహకారం లభించకపోవడంతో సదస్సు తొలిరోజే అభాసుపాలైంది. రెండోరోజూ సాదాసీదాగానే కార్యక్రమాలు కొనసాగాయి. కనిపించని అగ్రనేతలు.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనగానే ఠక్కున గుర్తొచ్చే నేత మాజీ హోంమంత్రి సబితారెడ్డి. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వెలుగొందిన సబిత.. తాజా సదస్సుకు దూరం కావడంతో పార్టీలో చర్చోపచర్చలు జరిగాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే సైతం సదస్సులో కనిపించలేదు. గతంలో జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో హడావుడి చేస్తూ చురుకుగా పాల్గొనే మల్రెడ్డి సోదరులు.. భవిష్యత్ కార్యచరణ సదస్సుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలైన నారాయణరావు, కె.లకా్ష్మరెడ్డి, బి.రాజిరెడ్డి తదితరులు సైతం సదస్సులో పూర్తిస్థాయిలో పాల్గొనలేదు. ఎన్నికల సమయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంకటస్వామి కూడా పరిమిత పాత్రే పోషించారు. మరోవైపు చేవెళ్ల పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కార్తీక్‌రెడ్డి రెండోరోజు సదస్సుకు హాజరైనా మౌనముద్ర దాల్చారు. ఇలా ఎవరికివారు గిరి గీసుకుని సదస్సుకు దూరంగా ఉన్నారు. ఇక ముఖ్యనేతలు రాకపోవడంతో కార్యకర్తలు నిరాశకుగురయ్యారు. కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తూ వెనుదిరిగారు. ముదిరిన వర్గపోరు.. జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మరోమారు బహిర్గతమైంది. డీసీసీ పదవి విషయంలో నెలకొన్న వివాదం, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తదితర అంశాల కారణంగా పార్టీలో తీవ్రమైన అంతర్గత పోరు సాగుతోంది. ఎన్నికల సమయంలో ఒకే వ్యక్తికి పార్టీ పదవితో పాటు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడంపై గొడవ మొదలైంది. దీంతో అధిష్టానం క్యామ మల్లేష్‌ను డీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తప్పించి.. చేవెళ్ల టికెట్ ఆశించి భంగపడ్డ వెంకటస్వామికి కట్టబెట్టింది. తాజాగా నాలుగు రోజుల క్రితం తిరిగి క్యామకు డీసీసీ పీఠాన్ని అప్పగిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సదస్సు కార్యక్రమాలకు మల్లేష్ నేతృత్వం వహించారు. ఈ పరిణామం జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపింది. క్యామకు రెండోసారి అధ్యక్ష పీఠం ఇవ్వడంపై అటు మల్రెడ్డి వర్గం, ఇటు సబిత వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనేపథ్యంలో టీపీసీసీ తలపెట్టి ‘భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆయా వర్గాలు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా పార్టీలోని పలువురు సీనియర్ల సహకారం కరువవ్వడంతో రెండ్రోజుల సమావేశం కాస్తా పేలవంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన నేతలు వచ్చినప్పటికీ.. వారిని రిసీవ్ చేసుకునేందుకు స్థానిక నేతలెవరూ లేకపోవడంతో ఇతర ప్రాంతాల నేతలవద్ద జిల్లా కాంగ్రెస్ ప్రతిష్ట పలుచబడింది. -
‘డీసీసీ’పై మరోమారు చర్చ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా భార్గవ్ దేశ్‌పాండే నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం మీడియాలో వచ్చిన వార్తలు జిల్లాలోని ఆ పార్టీ వర్గాల్లో మరోమారు చర్చకు దారితీశాయి. డీసీసీ అధ్యక్షునిగా భార్గవ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకంపై పార్టీలో అసమ్మతి రాగాలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీలోని ఒకవర్గం నాయకులకు ఈ నియామకం మింగుడు పడలేదు. ఈ అసమ్మతి సెగలను చల్లార్చేందుకు అధిష్టానం ఈ మేరకు ఢిల్లీలో లీకులిచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈనెల 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సదస్సు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ సదస్సును ఏఐసీసీ ప్లీనరీ స్థాయిలో జరపాలని భావిస్తోంది. ఈ సదస్సులో ఎలాంటి అసమ్మతి రాగాలు వినిపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే ఈ లీకులని ఓ వర్గం నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమాత్రం తగ్గలేదు. జిల్లాలో రెండు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవర్గం భార్గవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. తాము మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నరేష్‌జాదవ్ ప్రకటించిన విషయం విధితమే. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నరేష్‌జాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భార్గవ్ అనుకూల వర్గం డిమాండ్ చేస్తోంది. మాజీ ఎంపీ వివేక్ కూడా భార్గవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి జానారెడ్డితో హైదరాబాద్‌లో చర్చలు జరుపడం ఆ పార్టీలో చర్చకు దారి తీస్తోంది. -
కాంగ్రెస్‌లో కలకలం
చైర్మన్ చేవెళ్ల రూరల్: డీసీసీ అధ్యక్షుడి మార్పు జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఎన్నికల సమయంలో అప్పటివరకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న క్యామ మల్లేశ్, చేవెళ్ల మండలానికి చెందిన పడాల వెంకటస్వామి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే క్యామ టికెట్ దక్కించుకుని ఎన్నికల బరిలో నిలిచారు. అధినాయకత్వం పడాలను బుజ్జగించి డీసీసీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఎన్నికల్లో ఓటమిపాలైన క్యామనురిగి డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్వర్వులు ఇవ్వడంతో జిల్లా నేతలంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఆనూహ్య మార్పును మల్లేశ్ వైరివర్గం జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన వర్గీయుడైన పడాలను తప్పించి... క్యామకు సారథ్య బాధ్యతలను కట్టబెట్టడంపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డితో శుక్రవారం భేటీ అయిన సబిత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తాజా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీనియర్, దళితుడైన వెంకటస్వామిని అనూహ్యంగా పదవి నుంచి మార్చడం ఎంతవరకు సబబని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్టానంతో చర్చించాలని కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నెల 24,25వ తేదీల్లో ‘మేధో మథనం’ జరుగుతున్న తరుణంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఒకింత ఆందోళన వ్యక్తం చేసిన జానా... ఈ వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల భోగట్టా. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవి నుంచి పడాల వెంకటస్వామిని అవమానరీతిలో తప్పించడంపై ఆయన సొంత నియోజకవర్గంలో తీవ్ర అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సౌమ్యుడిగా పేరున్న పడాలను ఆకస్మికంగా మార్చడాన్ని తప్పుబడుతున్న నేతలు.. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పదవులు అమ్ముకుంటున్నారు పశ్చిమ రంగారెడ్డి ప్రాంతానికి చెందిన దళితుడికి డీసీసీ దక్కిందని సంతోషపడ్డామని, మూడు నెలలకే మార్చడం సమంజసం కాదని మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కొందరు డబ్బులను పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు. వెంటనే అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోకుంటే పశ్చిమ రంగారెడ్డిలోని పార్టీ మండల అధ్యక్షులమంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. కొంతమంది పైరవీలు, స్వార్థం కోసమే రోజకీయాలు చేస్తున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నిర్లక్ష్య ధోరణి వల్లే పార్టీ మొత్తం నాశనం అవుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సబితారెడ్డిని కలిసి పార్టీలో కొనసాగాలో లేదో తేల్చుకుంటామని అన్నారు. సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి శివానందం, ఆలూరు ఎంపీటీసీ సభ్యుడు శ్రీశైలం, నాయకులు అలీ, మాధవరెడ్డి, హన్మంత్‌రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, ఆలూరు నర్సింలు, తదితరులు ఉన్నారు. -
యువ నాయకత్వానికి కాంగ్రెస్ పగ్గాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై చావుదెబ్బతిన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను యువ నాయకత్వానికి అందించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన భార్గవ్‌దేశ్ పాండే ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం మేరకు డీసీసీ అధ్యక్షునిగా భార్గవ్‌దేశ్‌పాండేను నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. ఆదిలాబాద్‌తోపాటు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల డీసీసీ అధ్యక్షులను కూడా అధిష్టానం నియమించింది. జిల్లాలో ఎంతో కీలకమైన డీసీసీ అధ్యక్ష పదవిని 28 ఏళ్ల యువకునికి అప్పగించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు డీసీసీ అధ్యక్షునిగా సీనియర్ నాయకులు సి.రాంచంద్రారెడ్డి వ్యవహరించారు. డీసీసీ అధ్యక్ష పదవికి ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలించింది. డీసీసీ మాజీ అధ్యక్షుడు రవీందర్రావు, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ిపీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ కూడా ఈ పదవిని ఆశించారు. ఈ ఎన్నిక విషయంలో తెలంగాణ పీసీసీ నెలరోజుల క్రితం జిల్లా నేతలతో అభిప్రాయ సేకరణ నిర్వహించింది. అయితే యువనేత రాహుల్‌గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా భార్గవ్‌కు ఈ పదవి దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భగ్గుమన్న విభేదాలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. రెండు గ్రూపులుగా కొనసాగుతున్న పార్టీలో ఒకవర్గం నేతలు భార్గవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నియామకాన్ని ప్రకటించిన వెంటనే మాజీ ఎంపీ వివేక్ ఆ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డితో హైదరాబాద్‌లో భేటీ అయినట్లు సమాచారం. అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేయనున్నారని పీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ నుంచి.. 2004లో ఎన్ఎస్యూఐలో చేరిన భార్గవ్ 2006లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమయ్యారు. 2009లో యువజన కాంగ్రెస్ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జీగా వ్యవహరించారు. 2010లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2012 నుంచి యువజన కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆయన 2014 ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కోటాలో ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్నారు. ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. -
బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ వల్లే: అద్వానీ
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ పాత్ర ఉందని బీజేపీ అగ్ర నేత వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అవినీతి, తప్పిదాలకు పాల్పడటమే బీజేపీ ఘనవిజయానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. మోడీ నాయకత్వంలో ప్రచారం కూడా విజయానికి దోహదపడిందన్నారు. బీజేపీకి గొప్ప రోజు...అమిత్ షా: ఎర్రకోటపై బీజేపీ కార్యకర్త(మోడీ) చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరగడం పార్టీ క్యాకర్తలందరికీ గొప్ప రోజని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా.. సంపూర్ణ మెజారిటీ రావడం ఇదే తొలిసారన్నారు. -
‘చే’జారిన ఎంపీపీ
కొత్తగూడెం: ఇప్పటికే నియోజకవర్గంలో చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకత్వలోపం మరోమారు బహిర్గతమైంది. మెజార్టీ ఉన్నా ఎంపీపీ పదవిని కూడా గెలుచుకోలేక చతికిలపడింది. కొత్తగూడెం మండల పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 14 ఎంపీటీసీలను గెలుచుకుంది. దీంతో ఎంపీపీ అధ్యక్షపీఠం ఇక హస్తగతమేనని అందరూ అనుకున్నారు. ఇక సీపీఐకి 9, వైఎస్సార్సీపీకి 3, టీడీపీకి 2, సీపీఎంకు 2 ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. ఎంపీపీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ అయి, ఈనెల 6న ఎన్నిక జరగాల్సి ఉండగా అనూహ్య రీతిలో సీపీఐ తరపున తన ఎంపీపీ అభ్యర్థిని ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించగా అంతర్గతంగా సయోధ్య కుదరకపోవడంతో మరో కాంగ్రెస్ ఎంపీటీసీ కూడా పోటీకి దిగారు. దీంతో ఆరోజు ఎన్నిక వాయిదా పడింది. మరుసటిరోజు కూడా అదే పరిస్థితి నెలకొనడం, అనూహ్యంగా మరొక కాంగ్రెస్ ఎంపీటీసీ కూడా ఎంపీపీ అధ్యక్ష పీఠంపై కన్నేయడంతో కాంగ్రెస్‌లో త్రిముఖ పోటీ ఏర్పడింది. మొత్తం 31 మంది ఎంపీటీసీలు ఉన్న కొత్తగూడెంలో 16 మంది సభ్యుల మద్దతు కూడగట్టిన వారికే ఎంపీపీ పీఠం దక్కే అవకాశం ఉంది. కాగా 14 ఎంపీటీసీ స్థానాలున్న కాంగ్రెస్ మరో ఇద్దరు ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీని చేజిక్కించుకునే అవకాశాలుండగా 9 మంది ఎంపీటీసీలు ఉన్న సీపీఐ సైతం ఎంపీపీపై కన్నేసింది. అభ్యర్థి ఎంపికలో జాప్యం.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంపీపీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో జాప్యం చేయడంతో ఆ పార్టీ ఎంపీటీసీల్లో అయోమయం నెలకొంది. ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉండిపోయింది. ఇక అభ్యర్థిని ప్రకటించడంలో సైతం తీవ్ర జాప్యం జరగడంతో పలువురు ఎంపీటీసీలు ఇతర పార్టీలవైపు చూశారు. సీతంపేటకు చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ లక్ష్మినారాయణ సీపీఐ అభ్యర్థికి మద్దతు తెలపడంతో చేజేతులారా ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకున్నట్టయింది. కాంగ్రెస్ పెద్దలు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో విఫలం కావడంతోపాటు సొంత పార్టీలో కుమ్ములాటలు కూడా పరిష్కరించలేని స్థితి నెలకొంది. నాలుగురోజుల క్రితం ఇతర పార్టీల ఎంపీటీసీల మద్దతుతో 16 మందితో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చివరకు అభ్యర్థి ఎంపిక జాప్యం జరగడంతో డీలాపడాల్సి వచ్చింది. -
ఒక రోజు ఆలస్యంగా కాంగ్రెస్ మేధోమథనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దేశంలోనే తొలిసారిగా ‘మధోమథన సదస్సు’లను మన రాష్ట్రం నుంచి మొదలు పెడుతోంది. ఈ నెల 24,25వ తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని ‘శ్రీ ఇందు కాలేజీ’లో ఈ సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ సదస్సు 23,24వ తేదీల్లో నిర్వహించాలని భావించినప్పటికీ, అనివార్యకారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పలువురు ముఖ్యనేతలు ఇటీవల ఇందు కళాశాలను సందర్శించి.. సదస్సు వేదికను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్ల తయారీలో పార్టీ నిమగ్నమైంది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సహా తాజాగా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజ యానికి దారితీసిన అంశాలు... పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ రెండు రోజుల సమావేశంలో ఖరారు చేయనున్నారు. తొలిరోజు ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పెలైట్ హాజరుకానుండగా, రెండోరోజు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కాంగ్రెస్‌వర్గాలు తెలిపాయి. రెండు రోజుల సదస్సుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, జాతీయ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు, మాజీ మంత్రి జైరాంరమేశ్, కుంతియా తదితరులు రానున్నారు. -
‘చేయి’జారలే..!
సాక్షి ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీని కూడా వీడనున్నట్లు వచ్చిన ఊహాగానాలకు మాణిక్‌రావ్ మంత్రాంగంతో తెరపడింది. నారాయణ రాణే జులై 21న మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా అనంతరం ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. అధిష్టానం నుంచి సరైన స్పందన రాలేదని, దీంతో రాణే పార్టీని వీడనున్నారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే రాణేను బుజ్జగించేందుకు అధిష్టానం మాణిక్‌రావ్ ఠాక్రేను రంగంలోకి దించింది. వీరిమధ్య మంగళవారం సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం రాణే తన రాజీనామాను వెనక్కితీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, మంత్రిపదవిలోనూ కొనసాగుతానని స్వయంగా రాణే ప్రకటించారు. ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతో చర్చల అనంతరం మంగళవారం సాయంత్రం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలోని ధ్యానేశ్వరి నివాసస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే మాట్లాడుతూ... మంత్రి పదవిని చేపట్టి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన డిమాండ్లను నెరవేరుస్తామని పార్టీ అధిష్టానం నుంచి హామీ లభించిందని చెప్పారు. ఈసారి మాట తప్పబోమంటూ పార్టీ చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాన్నారు. మంత్రిపదవికి చేసిన తన రాజీనామాను ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ఇంత వరకు స్వీకరించలేదన్నారు. దీంతో తాను మంత్రి పదవిలో కొనసాగడంతోపాటు పార్టీలో క్రియశీలంగా వ్యవహరించనున్నట్టు స్పష్టం చేశారు. మూడు నెలలు అధ్యక్ష పదవి కావాలి... రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడునెలపాటు తనను అధ ్యక్షుడిగా కొనసాగించాలని అధిష్టానాన్ని కోరానని, బుధవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రాణే వివరణ ఇస్తూ... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని భావించానని, విషయాన్ని అధిష్టానానికి తెలిపానన్నారు. అయితే ఈసారి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం కోరిందని, దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రాణే స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు తన కుమారుడు నితేశ్ రాణే పోటీ చేయడానికే తాను తొలి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. ఉద్దవ్‌పై మండిపాటు... శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతోపాటు శివసేనలో చేరిన దీపక్ కేసర్కర్పై రాణే తీవ్రంగా మండిపడ్డారు. ఘాటైన పదజాలంతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. కేవలం శివసేన అధినేత దివంగత బాల్‌ఠాక్రే కారణంగా ఉద్ధవ్‌కు రాజకీయాల్లో చోటు దక్కిందనే విషయం మరచిపోవద్దని విమర్శించారు. లోకసభ ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా అసెంబ్లీలో కూడా అలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని కలలు కంటున్న ఉద్ధవ్‌కు భంగపాటు తప్పదన్నారు. ఎన్సీపీని వీడి, శివసేన పార్టీలో చేరి దీపక్ కేసర్కర్పై కూడా రాణే విమర్శలు కొనసాగించారు. ఎమ్మెల్యేగా విఫలమైన కేస్కర్ శివసేనలో చేరారని, అసలు కేస్కర్ ఎవరని ప్రశ్నించారు. అభివృద్ధి పనులే మా ఎజెండా... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ది పనులే ఎజెండాగా కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. మంచిరోజులు వస్తాయంటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రజలను మోసగించారని, ఆయన పాలనలో ధరలు మరింతగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి రాష్ట్ర ప్రజలు మోడీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
అభయ‘హస్తం’ ఇచ్చేవారేరి?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్న జిల్లా నేతలను సమన్వయపరిచే వారు లేకపోవడం... గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోకపోవడంతో అసలు జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండానే ముగిసిపోతుందా అనే చర్చ అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ఆ పార్టీ కేడర్‌లోనూ జరుగుతోంది. ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు కనీసం జడ్పీ రాజకీయం కూడా చేయలేని స్థితికి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘చేతి’లో పదిమంది జడ్పీటీసీలున్నా... మరో పదిమంది మద్దతు తీసుకునేందుకు కనీస ప్రయత్నం చేసే నాయకుడు ఆ పార్టీలో లేకపోవడంతో జడ్పీ చైర్పర్సన్ ఎన్నికలో తాము చేష్టలుడిగి చూడాల్సిందేనా అనే ఆవేదన పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతోంది. టీడీపీలోని గ్రూపు తగాదాలు, ఇతర పార్టీల నుంచి ఉన్న సానుకూల అవకాశాలను ఒడిసిపట్టుకునే నాయకత్వం లేకపోవడంతో పార్టీ నుంచి గెలిచిన పదిమంది జడ్పీటీసీలు ప్రేక్షకపాత్రకే పరిమితం అవుతారనే చర్చ జరుగుతోంది. వేదికపైకి తెచ్చే వారేరి? జడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి నాలుగు రోజులు గడుస్తున్నా జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసలు ఎలాంటి చలనం కనిపించడం లేదు. నోటిఫికేషన్ వెలువడిన మర్నాడే టీడీపీ జడ్పీటీసీలు 19 మంది ఒకేసారి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి క్యాంపునకు కూడా వెళ్లిపోయారు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం ఇంతవరకు గెలిచిన 10 మందిని ఒక వేదికపైకి తీసుకువచ్చే నాయకుడే లేకుండా పోయారంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైర్పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో పాటు ఆ వర్గం నుంచి కేవలం ఒకే మహిళ గెలుపొందడం, ఆమె కూడా జిల్లాలోని ప్రధాన నాయకుల ఆశీస్సులున్న వ్యక్తి కాకపోవడం, కాంగ్రెస్ ఓడిపోయిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జడ్పీ పీఠం గురించి ఆలోచించే వారే లేరని పార్టీ కేడర్ అంటోంది. ‘ఎలాగూ టీడీపీకి ఒక్కరు కలిస్తే వారిదే పీఠం. మాకు పది మంది కావాలి. చాన్స్ వారికే ఉంది కాబట్టి మేం ప్రయత్నం చేసి ఏం లాభం.’ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నా.. టీడీపీతో కలిసే ఆ ఒక్కరు కాంగ్రెస్ వారే అయితే పరిస్థితి ఏంటనేది ప్రశ్న. కనీసం పదిమందిని ఒక్కచోట కూర్చోపెట్టి, పది మంది పార్టీ నాయకులు కూర్చుని జడ్పీ చైర్పర్సన్ ఎన్నికలో తాము ఎలాంటి వ్యూహం అనుసరిం చాలి... ఎలా వెళితే బాగుంటుంది అనే అంశంపై చర్చకు కూడా ప్రయత్నించకపోవడం గమనా ర్హం. ఈ పరిస్థితుల్లో నాయకులు అనుసరిస్తున్న వైఖరి వల్ల ఇతర పార్టీలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని, తమకు పీఠం దక్కకపోయినా, తమ పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మద్దతుతో ఇతర పార్టీలు ఆ పీఠంపై కూర్చునే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ ముఖ్య నేతలపై ఉందని పార్టీ కార్యకర్తలంటున్నారు. ఎవరికి వారే.. జిల్లా పార్టీకి అధ్యక్షుడు లేకపోవడం... అసలు అధిష్టానం కూడా ఈ అంశంపై దృష్టి సారించకపోవడం లాంటి కారణాలను పక్కనపెడితే జిల్లా నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా జడ్పీ చైర్పర్సన్ ఎన్నికను పట్టించుకోవడం లేదని, జిల్లా పార్టీలో ఉన్న గ్రూపుల నేపథ్యంలో ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ గడ్డుకాలంలో ఉన్నప్పుడే వ్యూహాలకు పదనుపెట్టి కార్యరంగంలో దూకాల్సిన నాయకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడం తగదనే భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే హోదాలో ఉన్న ‘ఆ నలుగురు’ కాకుంటే ఇంకెవరు పట్టించుకుంటారని కేడర్ ప్రశ్నిస్తోంది. అయితే, చైర్పర్సన్ ఎన్నిక జోలికి వెళితే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుందనే భయంతో పాటు అసలు ముందే బాధ్యత తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే భయంతో ఎమ్మెల్యేలు ఎవరికి వారు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 7న జరిగే జిల్లా పరిషత్ పాలకవర్గం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోషించబోయే పాత్ర ఎలా ఉంటుందో, ఆ నలుగురు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే. -
నిశ్శబ్దం
ఓటరు చేతుల్లో నేతల భవితవ్యం ముగిసిన మున్సిపల్ ప్రచారం అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ, టీడీపీ మధ్యేపోటీ 169 వార్డులకు, 50 డివిజన్లకు ఎన్నికలు ఆరు మున్సిపాల్టీల్లో వైఎస్ఆర్ సీపీ ముందంజ సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా మార్చి 15వ తేదీ నుంచి సాగిన రెండు వారాల మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, పలమనేరు, నగరి మున్సిపాల్టీలకు మార్చి 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 48 గంటల ముందే ప్రచారం సమాప్తం కావడంతో వార్డుల్లో నిశ్శబ్దం నెలకొంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రీఫైనల్ ఎలక్షన్స్ కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఆయా మున్సిపాల్టీల పరిధిలోని వైఎస్ఆర్ సీపీ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్జలు, ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా వార్డుల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యత భుజానికెత్తుకుని నియోజకవర్గస్థాయి నాయకులు రంగంలోకి దిగారు. హోరాహోరీగా ప్రచారం సాగిం చారు. అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీ, టీడీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ మాత్రం గల్లంతైంది. శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో మాత్రమే అన్ని వార్డులకు కాంగ్రెస్ తరఫున అభ్యర్థులను నిలబెట్టారు. మిగిలిన మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సమీప ప్రత్యర్థి టీడీపీ అందుకోలేనంతగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు దూసుకెళ్లారు. ఇంటింటా ప్రచారంతోపాటు, ఉద్యోగులు, కార్మికులను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించారు. చిత్తూరులో పోటాపోటీ చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎ.ఎస్.మనోహర్, ఆయన భార్య, కుమారుడు వేర్వేరుగా అభ్యర్థుల తరఫున వార్డుల్లో ప్రచారం చేశారు. ముఖ్యంగా చిత్తూరు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని, డివిజన్లువారీగా ప్రజలు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక సమస్యలపై అజెండాతో ఓట్లు అభ్యర్థించారు. పార్టీ గుర్తు ఫ్యానును ప్రజలు గుర్తుపెట్టుకునేలా పెద్ద సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేసి ప్రచారం సాగించారు. మున్సిపాల్టీల్లో ప్రచార జోరు పుంగనూరు మున్సిపాల్టీలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను చేపట్టి వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలో ప్రధానంగా ఎదురవుతున్న నీటి సమస్య, రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మదనపల్లె మున్సిపాల్టీలో తొలి నుంచి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్వయంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, సమన్వయకర్త షమీమ్‌అస్లాం వార్డుల్లో వైఎస్ఆర్ సీపీ గెలుపు కోసం ప్రచారం సాగించారు. సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ నిర్మాణంతోపాటు, పక్కా గృహాలు పేదలకు కట్టిస్తామన్న అజెండాతో ప్రజల్లోకి వెళ్లారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి అన్నివార్డుల్లో అభ్యర్థుల ప్రచారం కోసం తిరిగారు. కౌండిన్య నీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, పలమనేరుకు శాశ్వత ంగా నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ప్రచారం చేశారు. పుత్తూరు, నగరి మున్సిపాల్టీల్లో ఆర్కే రోజా స్వయంగా ఇంటింటికి వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించారు. నగరిలో రంగునీళ్ల కాలుష్యం పరిష్కారం కావాలన్నా, కంపోస్టు యార్డు ఏర్పాటుకు, పన్నులు తగ్గించేందుకు వైఎస్ఆర్ సీపీ కృషి చేస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా వైఎస్ఆర్ సీపీ చైర్మన్ అభ్యర్థి మిద్దెల హరితో కలిసి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రచారం సాగించారు. 35 వార్డుల్లో ప్రచారం చేశారు. స్థానిక అజెండాలను ప్రచారంలో పెట్టి ఓట్లు అభ్యర్థించారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్.ఎ.రెహమాన్ గెలుపు కోసం శ్రీకాళహస్తిలో ప్రచారం చేశారు. -
ఆ ఒక్కటీ అడక్కు
బీ ఫారం మాత్రమే ఇస్తాం.. డబ్బులడగొద్దు ఆశావహులకు రఘువీరా, చిరంజీవి సంకేతాలు సాక్షి, తిరుపతి: శాసనసభ, లోకసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాలు మాత్రమే ఇస్తామని నిధులు ఇవ్వలేమని కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, చిరంజీవి స్పష్టం చేసినట్టు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ వెతుకులాట మొదలు పెట్టింది. జిల్లా పరిధిలోని తిరుపతి లోకసభ మినహా మిగిలిన 14 అసెంబ్లీ, చిత్తూరు, రాజంపేట లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డికి అప్పగించారు. ఆ మేరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి చిరంజీవి వేణుగోపాల్‌రెడ్డికి సూచిం చినట్లు విశ్వసనీయ సమాచారం. బస్సు యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుపతికి వచ్చిన వారు నగర శివార్లలోని ఒక హోటల్లో వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై కొద్ది సేపు చర్చించారు. ప్రస్తుతం పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని అయినా పనిచేయక తప్పదని ఉద్బోధించారు. ముందుగా ఆయా స్థానాలకు బలమైన అభ్యర్థులను గుర్తించాలని సూచించారు. దాంతో పాటు అన్ని స్థానాలకు టికెట్లు ఆశించే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించవలసిందిగా స్పష్టం చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ పెద్ద ఎత్తున నిధులు అందజేస్తుందనే ప్రచారం తీసుకొచ్చారని, అటువంటిదేమీ ఉండదని ఆశావహులకు స్పష్టం చేయాలని కూడా వారు కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు టికెట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడతామంటూ ముందుకొచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఇప్పుడు రఘువీరా, చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తేటతెల్లమౌతోంది. తిరుపతికి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులు టికెట్‌ను ఆశిస్తూ రఘువీరాతో భేటీ అయినప్పుడు కూడా నిధుల విషయం చర్చకు వచ్చినట్లు తెల్సింది. వారితో కూడా నిధుల విషయంలో పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా పోటీ చేస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఇస్తామని మాత్రమే భరోసా ఇచ్చినట్లు తెల్సింది. తాను కష్టకాలంలో పార్టీ బాధ్యతలను స్వీకరించానని నిధులు ఆశించకుండా వస్తే బీ ఫారం మాత్ర ం ఇస్తానని తేల్చి చెప్పారు. దీంతో ఆ నాయకులు కొంత అసంతృప్తికి గురయ్యారు. అదేవిధంగా తిరుమలలో కలిసిన ఒకరిద్దరి నాయకులకు కూడా రఘువీరారెడ్డి ఇదే విషయాన్ని చెప్పిట్లు తెలిసింది. తిరుపతికి చెందిన ఒక నాయకుడు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో తాను పార్టీ టికెట్ ఆశించానని అప్పట్లో కనీసం తన పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదని రఘువీరా ముందు ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అప్పటి పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరు అర్థం చేసుకోవాలని రఘువీరా స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి పనిచేసే వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయని మాత్రమే తాను చెప్పగలనని రఘువీరారెడ్డి తెలియజేశారు.