kuldeep yadav
-
మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్
మెగా క్రికెట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా గురువారం చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) బరిలో దిగనుంది. తొలి పోరులో రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో శనివారమే దుబాయ్(Dubai)కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు కీలకమే కాబట్టి విజయంతో టోర్నమెంట్‌ను మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది.మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు ఎంపిక తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశాం. మరో ముగ్గురు బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల ప్లేయర్లు జట్టుకు అవసరం. ఈ ముగ్గురు జట్టుకు వైవిధ్యాన్ని అందిస్తారు. అయినా మేం మా బలాన్ని బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటాం. జడేజా, అక్షర్, వాషీ జట్టులో ఉంటే మాకు భిన్న రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మాకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాళ్ల అవసరం ఉంది.టీమిండియా గురించి మాట్లాడేవారు ఇతర జట్లలో ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉంటే.. వారి వద్ద ఆరుగురు పేసర్లు ఉన్నారేంటి అని అడగరు’’ అంటూ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న హిట్‌మ్యాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉందని తెలిపాడు.కొత్తగా వరుణ్ చక్రవర్తికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల భారత జట్టులో స్పిన్ దళానికి ప్రాధాన్యం దక్కింది. ప్రాథమిక జట్టులో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. అయితే, ఫైనల్ టీమ్‌ను ఖరారు చేసే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఫలితంగా జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కినట్లయింది.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరును విమర్శించారు. మెగా టోర్నీకి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’ పోటీలో భాగంగా గురువారం తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో మార్చి 2న మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. కాగా మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్‌కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్‌కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్‌దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు -
తుదిజట్టులో ఆ ఇద్దరు పక్కా.. మరీ అంతమంది ఎందుకు?: అశ్విన్
టీమిండియా సెలక్టర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) విమర్శించాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు.యశస్వి జైస్వాల్‌ను తప్పించికాగా ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మంగళవారం తమ పూర్తిస్థాయి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాథమిక జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి.. అతడి స్థానంలో కొత్తగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని చేర్చింది. అదే విధంగా.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కాగా.. హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది.ఇదిలా ఉంటే.. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నాకు అర్థం కావడం లేదు‘‘దుబాయ్‌కు ఇంతమంది స్పిన్నర్లను తీసుకువెళ్లడంలో మర్మమేమిటో నాకు అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి స్పిన్నర్ల సంఖ్య ఐదుకు పెంచారు. ఈ పర్యటనలో ముగ్గురు లేదంటే నలుగురు స్పిన్నర్లు ఉంటారని ముందుగానే ఊహించాం.కానీ దుబాయ్‌కు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్తున్నామా? ఒకరు.. లేదంటే ఇద్దరు అదనంగా ఉన్నారని అనిపించడం లేదా?.. అందులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు(రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్). ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు జడేజా, అక్షర్ తుదిజట్టులో ఉంటారు. కుల్దీప్ కూడా ఆడతాడు. ఇలాంటపుడు ఒకవేళ మీరు వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఓ పేసర్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది.అప్పుడు హార్దిక్ పాండ్యాను రెండో పేసర్‌గా ఉపయోగించుకోవాలి. లేదంటే.. స్పిన్నర్‌ను తప్పించి మూడో సీమర్‌ను తుదిజట్టులోకి తెచ్చుకోవాలి. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. మరి అప్పుడు వరుణ్‌కు ఎలా చోటిస్తారు?ఒకవేళ కుల్దీప్తో పాటు వరుణ్ కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దుబాయ్‌లో బంతి అంతగా టర్న్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఈ జట్టు ఎంపిక తీరు పట్ల సంతృప్తిగా లేను’’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.3-0తో క్లీన్స్వీప్కాగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సొంతగడ్డపై బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత తుదిజట్టులో జడేజాతో పాటు అక్షర్ పటేల్ ఉండటం ఖాయం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వీలుగా వీరికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఇద్దరు స్పెషలిస్టు పేసర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తిలలో ఒక్కరికే స్థానం దక్కుతుంది. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడుతుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
CT: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నీలో 2000 సంవత్సరంలో తొలిసారి ఫైనల్‌కు చేరింది టీమిండియా. అయితే, కెన్యాలో నాటి తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2002లోశ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. అనంతరం మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) సారథ్యంలో 2013లో మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత జట్టు... ఈసారి ఆఖరి గండాన్ని అధిగమించింది.ఐదు పరుగుల తేడాతో గెలుపొందిసౌతాఫ్రికా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ కేవలం ఐదు పరుగుల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను సోలోగా సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లకు ఫైనల్‌కు చేరినా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలై(India vs Pakistan).. ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో మరోసారి ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచే అవకాశం ముంగిట నిలిచింది.నాడు ఆ ఆరుగురు2017 తర్వాత.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం నిర్వహిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో టీమిండియా ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది. 2017 నాటి జట్టులో ఓపెనింగ్ బ్యాటర్‌గా ఉన్న రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనునున్నాడు.మరోవైపు.. ఆనాటి సారథి విరాట్ కోహ్లితో పాటు.. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ కూడా తాజా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేఈసారి టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఎవరన్న అంశంపై అభిప్రాయాలు పంచుకుంటూ.. ఈ ఆరుగురిలో ఒక్కరి పేరు కూడా చెప్పలేదు. వీరికి బదులుగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై డివిలియర్స్ నమ్మకం ఉంచాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానల్లో మాట్లాడుతూ.. ‘‘ఈసారి భారత జట్టులో ‘ఎక్స్’ ఫ్యాక్టర్‌గా కుల్దీప్ యాదవ్ మారబోతున్నాడని అనిపిస్తోంది.ఎందుకంటే.. టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుబోతోంది. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కుల్దీప్ ఈసారి ఇండియా తరఫున అందరికంటే మెరుగ్గా ఆడి.. ఫలితాలను ప్రభావితం చేయగలడు’’ అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.గాయం కారణంగాకాగా కుల్దీప్ యాదవ్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఎడమ గజ్జలో నొప్పి కారణంగా సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న ఈ స్పిన్ బౌలర్.. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నట్లు సమాచారం. గాయం కారణంగానే అతడు ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ పాల్గొనలేకపోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కుల్దీప్ యాదవ్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
‘అతడి ఖేల్ ఖతం.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) స్పందించాడు. స్పిన్, పేస్ బౌలర్ల విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఏళ్లకు ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నవారిని.. ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నాడు.లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయిందన్న ఆకాశ్ చోప్రా.. ‘స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఖేల్ కూడా ఖతమైందని అభిప్రాయపడ్డాడు. కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన పాకిస్తాన్(India vs Pakistan).. తాజాగా నిర్వహించబోతున్న మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గుఅయితే, భద్రతా కారణాల వల్ల టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శనివారం చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే టీమ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.మరోవైపు.. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్‌లకు అన్యాయం జరిగిందంటూ వారి అభిమానులు సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘యుజీ చహల్ విషయం కాస్త ప్రత్యేకమైనదే.అతడి కథ ముగిసిపోయింది2023 జనవరిలో అతడు చివరగా ఆడాడు. దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ.. 10 మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. అయితే, యువీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిలకడగా వికెట్లు తీశాడు కూడా. కాకపోతే.. ఈ టోర్నీ రేసులో అతడు వెనుకబడిపోయాడు.ఇక్కడితో అతడి కథ పూర్తిగా ముగిసిపోయినట్లే. అతడి ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ సెలక్టర్లు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. నిజానికి రెండేళ్ల క్రితమే అతడి పనైపోయింది. అందుకే సెలక్టర్లు బహుశా మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ అతడిని ఎంపిక చేసి ఉంటే.. అది తిరోగమనానికి సూచిక అయ్యేది.భువీని ఎలా సెలక్ట్ చేస్తారు?ఇక భువీ మూడేళ్ల క్రితం చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అసలు వన్డే ఫార్మాట్లో చాలాకాలంగా జట్టులోనే లేడు. మరి అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మెగా టోర్నీ కోసం పిలిపిస్తే.. ఇప్పుడు సెలక్టర్లను తిడుతున్న వారే.. అతడిని ఎంపిక చేసినా.. ఇదేం తీరు అని ప్రశ్నించేవారు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా యుజీ, భువీలు ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్ -
అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ
గింగిరాలు తిరిగే బంతులతో... ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన స్టార్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... భారత జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసేవారెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విదేశీ పిచ్‌లపై ప్రదర్శనను పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర వెనక అశ్విన్ పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం. అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై టీమిండియా 65 టెస్టులు ఆడగా... వీటన్నింటిలో అశ్విన్ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్ విఫలమైన రెండు సిరీస్‌లలో (2012 ఇంగ్లండ్‌తో, 2024 న్యూజిలాండ్‌తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. ఈ గణాంకాలు చాలు అతడేంటో చెప్పేందుకు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన 38 ఏళ్ల అశ్విన్... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం బుధవారం అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకగా... సహచరులు, సీనియర్లు అశ్విన్ ఘనతలను కొనియాడారు.అయితే ఇకపై అశ్విన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో... స్పిన్ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగంసుందర్కే చాన్స్ ఎక్కువ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అనే ప్రశ్నకు వాషింగ్టన్ సుందర్ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కాగా... సుందర్ కూడా అశ్విన్ బాటలోనే అటు బంతితో మాయ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. తాజా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌కే అవకాశమిచ్చింది. సమీప భవిష్యత్తులో ఇలాగే జరిగే సూచనలు కనిపించడంతోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్... కొత్త తరానికి మార్గం సుగమం చేశాడు. అశ్విన్ తరహాలోనే టి20 ఫార్మాట్లో సత్తాచాటి అటు నుంచి జాతీయ జట్టు తలుపు తట్టిన 25 ఏళ్ల సుందర్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 48.37 సగటుతో 387 పరుగులు సాధించాడు. విదేశీ పిచ్‌లపై అశ్విన్ కంటే మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం సుందర్ సొంతం కాగా... ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు యాజమాన్యం సుందర్‌ను ప్రోత్సహిస్తోంది. కెపె్టన్, కోచ్ నమ్మకాన్ని సంపాదించిన సుందర్... ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో వైవిధ్యం చూపగల నేర్పరి కావడంతో అతడు ఈ జాబితాలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు. రేసులో కుల్దీప్ యాదవ్ ఒకదశలో విదేశాల్లో భారత ప్రధాన స్పిన్నర్ అని హెడ్ కోచ్‌తో మన్ననలు అందుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చైనామన్ స్పిన్నర్‌గా జట్టులోకి వచి్చన కుల్దీప్ ప్రధానంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 106 వన్డేల్లో 172 వికెట్లు... 40 టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు ఫార్మాట్లో 13 మ్యాచ్‌లాడిన 30 ఏళ్ల కుల్దీప్ యాదవ్ 22.16 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో బ్యాటింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ కాస్త వెనుకబడి ఉండటం అతడికి ప్రతిబంధకంగా మారింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కుల్దీప్కు బ్యాటింగ్ ప్రతిభతో సంబంధం లేకుండా స్వదేశీ పిచ్‌లపై ప్రధాన స్పిన్నర్‌గా ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వయసురీత్యా చూసుకుంటూ ఇప్పటికే 30వ పడిలో ఉన్న కుల్దీప్... అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. అక్షర్‌కు అవకాశం లేనట్టే! గత కొంతకాలంగా పరిశీలిస్తే... సొంతగడ్డపై భారత జట్టు ఆడిన టెస్టుల్లో అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు. తన ఎత్తును వినియోగించుకుంటూ ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపాడు. 30 ఏళ్ల అక్షర్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 14 టెస్టులు ఆడి 19.34 సగటుతో 55 వికెట్లు పడగొట్టడంతో పాటు 35.88 సగటుతో 646 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్పిన్ ఆల్‌రౌండర్‌గా తనదైన పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్‌కు తన బౌలింగ్ శైలే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ స్పిన్నర్‌గా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బౌలరే కాగా... అక్షర్ మాదిరే బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. దీంతో బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి అంటే వీరిద్దరిలో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తనుశ్పై దృష్టి...ముంబైకి చెందిన కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్ తనుశ్ కొటియాన్‌కు కూడా అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నా... ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయని 26 ఏళ్ల తనుశ్... ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 33 మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టిన కొటియాన్... బ్యాట్‌తో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో చక్కటి ప్రతిభతో పాటు అవసరమైతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న తనుశ్... జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న పోటీని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు. -
Ind vs Ban 2nd Test: భారత తుదిజట్టు నుంచి అతడు అవుట్!
బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగనుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ఫైనల్ చేరే క్రమంలో మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.తొలి టెస్టులో పేసర్లకే పెద్దపీటఈ క్రమంలో ఇరు జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై ఈ మ్యాచ్ జరగగా.. ఇరు జట్లు ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చాయి. టీమిండియా ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లకు తుదిజట్టులో చోటిచ్చింది.అదే విధంగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కూడా ఆడించింది. దీంతో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి ఎదురైంది. అయితే, రెండో టెస్టులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండబోతుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాన్పూర్‌లోని నల్లమట్టి పిచ్‌పై మ్యాచ్ జరుగనుండటంతో కుల్దీప్ తుదిజట్టులో స్థానం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన‘‘నల్లమట్టి పిచ్‌పై గ్రాస్ వేసి.. కాస్త తేమగా ఉంచితే.. ఆట మొదటి రోజు, రెండో రోజు అరపూట వరకు బంతి బాగానే బౌన్స్ అవుతుంది. చెన్నై మాదిరే ఈ పిచ్ కూడా ఉంటే.. టీమిండియా మరోసారి ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లతో రంగంలోకి దిగుతుంది. అలా కాకుండా ఇది పక్కాగా కాన్పూర్ పిచ్ అయితే మాత్రం.. రోజురోజుకీ వికెట్ బాగా నెమ్మదిస్తుంది.స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ కచ్చితంగా తుదిజట్టులోకి వస్తాడు. అదే జరిగితే.. ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. పనిభారాన్ని తగ్గించేందుకు బుమ్రాకు విశ్రాంతినిస్తే.. ఆకాశ్ దీప్ జట్టులో ఉంటాడు. లేదంటే.. ఆకాశ్ స్థానాన్ని కుల్దీప్ భర్తీ చేస్తాడు. రెండో టెస్టులో ఆడబోయే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంతకంటే వేరే మార్పులేమీ ఉండకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత తుదిజట్టు కూర్పు గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. శుక్రవారం నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు భారత తుది జట్టు అంచనారోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII— BCCI (@BCCI) September 26, 2024 -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోర సాధనలో నిమగ్నమై ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారత్ ఇంకాస్త ఎక్కువగా శ్రమిస్తుంది. టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడి చాన్నాళ్లు కావడంతో ఈ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు చెమటోడుస్తుంది. సెప్టెంబర్ 13 నుంచే చెన్నైలో భారత శిక్షణా శిబిరం మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు లయను అందుకున్నారు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మ్యాచ్ ప్రారంభానికి మరో రెండు రోజులే ఉండటంతో భారత తుది జట్టు కూర్పుపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తుది జట్టులో వారుండబోతున్నారు.. వీరుండబోతున్నారంటూ సోషల్‌మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత మేనేజ్మెంట్ నుంచి మాత్రం తుది జట్టు విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీటీఐ నుంచి వస్తున్న సమాచారం మేరకు బంగ్లాతో తొలి టెస్ట్‌లో భారత స్పిన్ విభాగం ఖరారైనట్లు తెలుస్తుంది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండనున్నారని సమాచారం. అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది.మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఓ బెర్త్ మినహా బెర్త్‌లు అన్నింటి విషయమై క్లారిటీ ఉంది. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఐదో స్థానం కోసం కేఎస్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నప్పటికీ.. రాహుల్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఆతర్వాతి స్థానాల్లో జడేజా, అశ్విన్, కుల్దీప్ అనుకుంటే తొమ్మిది బెర్త్‌లు ఖరారైపోయినట్లే. ఇక మిగిలింది పేస్ విభాగం. ఈ కేటగిరీలో బుమ్రా స్థానం ఖరారు కాగా.. మరో పేసర్ కోటాలో అనుభవజ్ఞుడు సిరాజ్‌కు ఛాన్స్ ఇస్తారా లేక ఆకాశ్‌దీప్, యశ్ దయాల్లలో ఎవరో ఒకరివైపు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.బంగ్లాతో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్చదవండి: ముమ్మర సాధనలో... -
ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్
టీమిండియా చైనా మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌లో కుల్దీప్ మరో ఆరు వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల అరుదైన మైలురాయిని తాకుతాడు. కుల్దీప్ ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 53 వికెట్లు.. 106 వన్డేల్లో 172 వికెట్లు.. 40 టీ20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ టెస్ట్‌ల్లో 4 సార్లు, వన్డేల్లో 2 సార్లు, టీ20ల్లో 2 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇన్ని ఐదు వికెట్ల ఘనతలు సాధించడం చాలా అరుదు. కుల్దీప్ ఖాతాలో రెండు వన్డే హ్యాట్రిక్‌లు కూడా ఉన్నాయి.అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. కుంబ్లే మూడు ఫార్మాట్లలో కలిపి 953 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో కుంబ్లే తర్వాతి స్థానాల్లో అశ్విన్ (744), హర్బజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (597), రవీంద్ర జడేజా (568), శ్రీనాథ్ (551), షమీ (448), ఇషాంత్ శర్మ (434), బుమ్రా (397), అగార్కర్ (349), ఇర్ఫాన్ పఠాన్ (301) ఉన్నారు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మార్కును 12 మంది తాకారు. వికెట్ల ట్రిపుల్ సాధిస్తే కుల్దీప్ 13వ భారత బౌలర్ అవుతాడు.బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉండే అవకాశం ఉండటంతో ఇక్కడ కుల్దీప్ చెలరేగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఇదే మ్యాచ్‌లో కుల్దీప్ ట్రిపుల్ సెంచరీ వికెట్ల మార్కును తాకవచ్చు.రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరుగనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్.. వీడియో -
కుల్దీప్ భాయ్‌తో అంత ఈజీ కాదు.. వారిద్దరి వల్లే ఇదంతా: సెంచరీ హీరో
దేశీవాళీ క్రికెట్లో ముంబై యువ బ్యాటర్, భారత క్రికెటర్ సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా బి జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్న ముషీర్.. భారత బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ ‘బి’ 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ముషీర్ ఒంటరి పోరాటం చేశాడు. తన విరోచిత పోరాటంతో జట్టును అదుకున్నాడు. నవ్‌దీప్ సైనీ అండతో ముషీర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ‘బి’ జట్టు 79 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (227 బంతుల్లో 105; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు సైనీ (74 బంతుల్లో 29 ; 4 ఫోర్లు, ఒక సిక్సర్) నాటౌట్‌గా నిలిచాడు.ఇక తొలి రోజు ఆట తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముషీర్.. తన సెంచరీ క్రెడిట్‌ను భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్‌కు ఇచ్చాడు. "నేను కుల్దీప్ యాదవ్‌కు ప్రత్యర్ధిగా ఆడటం ఇదే రెండో సారి. అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్ అని మనకు తెలుసు. కుల్దీప్ భాయ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కానీ మా జట్టులో రిషబ్ పంత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. రిషబ్ భాయ్‌తో పాటు శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ కంటే ముందు నాకు కొన్ని సూచనలు చేశారు. కుల్దీప్ భాయ్ వేసిన బంతుల్లో ఏది అత్యంత ప్రభావవంతంగా ఉంటుందో వారు నాకు చెప్పారు. అతడి బౌలింగ్‌లో ఏ బంతులను ఎటాక్ చేయాలో నాకు వారిద్దరూ వివరించారు. దీంతో నేను క్రీజులో సెట్ అయ్యాక అతడిని సులభంగా ఎదుర్కొన్నాను" అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. -
కుల్దీప్ కాదు!.. టీమిండియాలో అశ్విన్ వారసుడు ఇతడే: డీకే
ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన ఈ చెన్నై స్టార్ 516 వికెట్లు తన ఖతాలో వేసుకున్నాడు. తద్వారా అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా అశూ కొనసాగుతున్నాడు.ఇక అశ్విన్ తదుపరి సొంతగడ్డ వేదికగా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్‌కు సరైన వారసుడు ఇతడేనంటూ టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మరో చెన్నై స్టార్కే ఉందని అభిప్రాయపడ్డాడు.కుల్దీప్ కాదు!ఇప్పటికే జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని.. వాషింగ్టన్ సుందర్ పేరును చెప్పాడు డీకే. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కొత్త తరం ఆఫ్ స్పిన్నర్ కోసం టీమిండియా వెదుకుతోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-ఏ సిరీస్ సందర్భంగా మూడు మ్యాచ్‌లలో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లను బరిలోకి దించడమే ఇందుకు నిదర్శనం.పుల్కిత్ నారంగ్, వాషింగ్టన్ సుందర్, సారాంశ్ జైన్లను ఈ సిరీస్ సందర్భంగా పరీక్షించింది. వీరిలో రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల నైపుణ్యం వాషింగ్టన్ సుందర్‌కే ఉంది. అశూ వారసుల పోటీలో అతడే ముందుంటానడంలో సందేహం లేదు. తనకు లభించిన కొద్దిపాటి అవకాశాలను కూడా వాషీ సద్వినియోగం చేసుకున్నాడు.అతడే సరైన వాడు.. ఎందుకంటే?అందుకే.. అశూ స్థానంలో అతడే సరైన వాడని చెప్పగలను’’ అంటూ దినేశ్ కార్తిక్ వాషీ పేరు చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కాగా 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే విధంగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. 24 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 22 వన్డేలు, 49 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 6, 23, 44 వికెట్లు తీశాడు. చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు వాషీ. -
షేన్ వార్న్ నా హీరో.. ఇప్పటికీ నేను బాధపడుతునే ఉన్నా: కుల్దీప్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ శుక్రవారం ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఏంసీజీలో ఏర్పాటు చేసిన దివంగత ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ విగ్రహం ముందు కుల్దీప్ నివాళులర్పించాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను కుల్దీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేశాడు. షేన్ వార్న్ బౌలింగ్‌లో ఎప్పటికి ఒక అద్భుతం అంటూ కుల్దీప్ క్యాప్షన్‌గా ఇచ్చాడు. అదే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడిన కుల్దీప్.. వార్న్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు."షేన్ వార్న్ నా ఆరాధ్య క్రికెటర్. షేన్ నా హీరో. అతడితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. వార్నీని గుర్తుచేసుకునే ప్రతీసారి నేను భావోద్వేగానికి లోనవుతాను. నా కుటుంబంలోని ఒకరిని నేను కోల్పోయినట్లు ఇప్పటికీ అనిపిస్తుందని" కుల్దీప్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పేర్కొన్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అనంతరం అతడు దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని టీమ్ Aకు కుల్దీప్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆ తర్వాత వరుస టెస్టు సిరీస్‌లతో కుల్దీప్ బీజీబీజీగా గడపనున్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో కుల్దీప్ది కీలక పాత్ర. -
లెఫ్టాండర్స్ టెస్టు, వన్డే అత్యుత్తమ జట్లు ఇవే!
క్రికెట్లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు.ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్. టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్.. వెస్టిండీస్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్రియన్ లారాను వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు.ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్, విండీస్ గ్రేట్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆసీస్ ఆడం గిల్క్రిస్ట్లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా)తో పాటు మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. కెప్టెన్‌గా ఆసీస్ లెజెండ్ ఈ జట్టులో ఒకే స్పిన్నర్, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలెన్ బోర్డర్‌ను ఎంచుకున్న వసీం జాఫర్.. వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు. అదే విధంగా.. లారా 11,953 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్‌క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 రన్స్ నాటౌట్, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆల్‌టైమ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97. మరోవైపు.. కెప్టెన్ అలెన్ బోర్డర్ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్‌గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్ సోబర్స్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.వసీం జాఫర్ లెఫ్టాండర్స్ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్మాథ్యూ హెడెన్, కుమార్ సంగక్కర, బ్రియన్ లారా, గ్రేమ్ పొలాక్, అలెన్ బోర్డర్(కెప్టెన్), గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడం గిల్‌క్రిస్ట్, వసీం అక్రం, జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్.ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య(శ్రీలంక), కుమార్ సంగక్కర(శ్రీలంక- వికెట్ కీపర్), బ్రియన్ లారా(కెప్టెన్), యువరాజ్ సింగ్(టీమిండియా ఆల్‌రౌండర్), మైకేల్ బెవాన్(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా), కుల్దీప్ యాదవ్(టీమిండియా)లను వసీం జాఫర్ ఎంపిక చేసుకున్నాడు. అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్ ఈ టీమ్స్‌ను సెలక్ట్ చేశాడన్నమాట!చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ -
బాలీవుడ్ నటితో వివాహం.. స్పందించిన టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై తొలిసారి స్పందించాడు. కుల్దీప్ ఓ బాలీవుడ్ నటిని పెళ్లాడబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే వరల్డ్‌కప్ విజయానంతరం స్వస్థలానికి (కాన్పూర్) చేరుకున్న కుల్దీప్ ఈ ప్రచారాన్ని ఖండించాడు. పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమే కానీ.. బాలీవుడ్ నటిని కాదని కుల్దీప్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కుల్దీప్ మాట్లాడుతే.. త్వరలోనే శుభవార్త వింటారు. నేను పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమే. కానీ, నా కాబోయే భాగస్వామి నటి కాదు. అయినా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరన్నది విషయం కాదు. చేసుకోబోయే అమ్మాయి నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందా లేదా అన్నదే నాకు ముఖ్యమని అన్నాడు.ఇదిలా ఉంటే, కుల్దీప్ భారత్ టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. కుల్దీప్ మెగా టోర్నీలో 10 వికెట్లు తీసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. వరల్డ్‌కప్ విజయానంతరం కుల్దీప్ జట్టుతో పాటు ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నాడు. అనంతరం నిన్ననే తన స్వస్థలం కాన్పూర్‌కు చేరుకున్నాడు. కాన్పూర్‌లో కూడా ముంబైలో జరిగిన తరహాలోనే విజయోత్సవ ర్యాలీ జరిగింది. కుల్దీప్ను అభిమానులు ఘనంగా సన్మానించి భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. వరల్డ్‌కప్ అనంతరం చాలామంది సీనియర్ల లాగే భారత సెలెక్టర్లు కుల్దీప్ కూడా విశ్రాంతి నిచ్చారు. కుల్దీప్ ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. త్వరలో శ్రీలంకతో జరుగబోయే సిరీస్‌కు కుల్దీప్ ఎంపికయ్యే అవకాశం ఉంది. -
దక్షిణాఫ్రికా గెలవాలంటే అదొక్కటే మార్గం: మోర్కెల్
టీ20 వరల్డ్-2024 ఫైనల్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలిసారి ట్రోఫీని ముద్దాడాలన్న కసితో ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు ఆ జట్టు మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ కీలక సూచనలు చేశాడు. ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కొనేందుకు ప్రోటీస్ బ్యాటర్లు అతిగా ఆలోచించకూడదని మోర్కల్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది మెగా టోర్నీలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. బుమ్రా తన 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ కేవలం 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు."బుమ్రా అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆరంభంలో వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉంది. అంతేకాకుండా డెత్ ఓవర్లలో కూడా అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు.పవర్ ప్లేలో రెండు ఓవర్లు, తర్వాత మళ్లీ ఆఖరి ఓవర్లలోనే బుమ్రా అటాక్‌లో వస్తాడు. కాబట్టి మా జట్టుకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు బాగా రాణించి పరుగులు చేపట్టాలి. అప్పుడే గౌరవప్రదమైన స్కోరును సాధించడానికి అవకాశముంటుంది. అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లను ఎటాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడొక వికెట్ టేకర్. తన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తడిలోకి నెట్టగలడు. కాబట్టి సౌతాఫ్రికా బ్యాటర్లు ఒత్తడికి లోనవ్వకుండా బాల్ టూ బాల్ టూ ఆచితూచి ఆడాలి. అప్పుడే దక్షిణాఫ్రికా గేమ్‌లో ఉటుందని"ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోర్కల్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
ఏమి చేస్తున్నావు కుల్దీప్.. రోహిత్ శర్మ సీరియస్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో సెమీఫైనల్‌కు చేరేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. గ్రూపు-1 నుంచి సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 196 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. ఆ తర్వాత బౌలింగ్‌లో ప్రత్యర్ధిని 146 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా(50), విరాట్ కోహ్లి(37), రిషబ్ పంత్(36), శివమ్ దూబే(34) పరుగులతో రాణించగా.. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మూడు, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్పై రోహిత్ అసహనం..ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో తొలి బంతిని షకీబ్ అల్ హసన్ భారీ సిక్స్ బాదాడు. ఆ తర్వాత రెండో బంతికి షకీబ్ రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్ముదుల్లాకు కుల్దీప్ గుగ్లీగా సంధించాడు. అయితే మహ్ముదుల్లాకు గుగ్లీ వేయడం రోహిత్‌కు నచ్చలేదు. వెంటనే రోహిత్.. ఏమి చేస్తున్నావు కుల్దీప్, అతడికి స్వీప్ ఆడనివ్వు. ఒకరు స్వీప్ ఆడి ఇప్పుడే ఔటయ్యాడు. కాబట్టి అతడు స్వీప్ ఆడేట్లు బౌలింగ్ చేయు అని చెప్పాడు. ఇదింతా స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Rohit Sharma and Stump Mic😂🫶🏻 pic.twitter.com/cSUrBnLJHJ— Kuljot⁴⁵ (@Ro45Kuljot) June 22, 2024 -
అఫ్గాన్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్‌కు నో ఛాన్స్
టీ20 వరల్డ్‌కప్-2024లో సూపర్ ఎయిట్ సమరానికి టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బడోస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ దిశగా అడుగులు వేయాలని టీమిండియా భావిస్తుంటే.. అఫ్గాన్ కూడా న్యూజిలాండ్ మాదిరే భారత్‌కు కూడా షాక్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే అఫ్గానిస్తాన్‌తో పోరుకు భారత జట్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారత జట్టు మెనెజ్‌మెంట్ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అదనపు స్పిన్నర్‌ను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు వేసి చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కుల్దీప్ ఇప్పటివరకు ఈ ఏడాది టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కుల్దీప్తో పాటు మరో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా బెంచ్‌లో ఉన్నాడు. కానీ ఇటీవల కాలంలో చాహల్ కంటే కుల్దీప్నే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో కూడా కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ యాదవ్ సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టుమెనెజ్మెంట్ చాహల్ కంటే కుల్దీప్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వినికిడి. ఇక ఈ ఒక్కటి మినహా జట్టులో ఇంకా ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.అఫ్గాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
IND vs CAN: భారత తుదిజట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్?!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ఇప్పటికే సూపర్-8కు చేరుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. గ్రూప్-ఏలో తమకు మిగిలి ఉన్న నామమాత్రపు మ్యాచ్‌లో కెనడాతో ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి తలపడనుంది.కాగా ఫ్లోరిడాలోని లాడెర్హిల్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైంది. ఫలితంగా పాయింట్ల పరంగా మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా సూపర్-8కు చేరగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇక టీమిండియా- కెనడా మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైపోయినా రోహిత్ సేనకు ఎలాంటి నష్టం లేదు. అదే విధంగా.. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన కెనడాపై కూడా ఇంకెలాంటి ప్రభావం ఉండదు.ఆ ఇద్దరు అవుట్!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టులో ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.అదే విధంగా.. శివం దూబే స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికాలో జరుగుతున్న టీమిండియా లీగ్ దశ మ్యాచ్‌లలో జడ్డూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.గత మ్యాచ్(అమెరికాతో)లో అతడికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో మూడు మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ కొట్టేసిన రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అయితే, సూపర్-8కు ముందు అతడికి కెనడాతో మ్యాచ్‌లో ఛాన్స్ ఇస్తే.. ప్రాక్టీస్ దొరుకుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో శివం దూబే స్థానంలో సంజూను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా.. వెస్టిండీస్‌లో సూపర్-8 మ్యాచ్‌ల నేపథ్యంలో.. కుల్దీప్ యాదవ్‌కు కూడా అమెరికాలో తొలి ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ మ్యాచ్‌లోనైనా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌లు న్యూయార్క్‌లోనే జరిగాయి.అక్కడి నసావూ కౌంటీ డ్రాప్ ఇన్- పిచ్ బౌలర్ల పాలిట స్వర్గధామంలా మారి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో కోహ్లి మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం ఐదు పరుగులే చేశాడు.అయితే, కెనడాతో మ్యాచ్ జరిగే వేదిక ఫ్లోరిడాలో పరుగులకు ఆస్కారం ఉన్న వికెట్ ఉంటుంది. కాబట్టి ఈసారైనా కింగ్ భారీగా రన్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇండియా వర్సెస్ కెనడాతో నామమాత్రపు మ్యాచ్‌కు తుదిజట్ల అంచనా భారత తుదిజట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.కెనడా తుదిజట్టు(అంచనా)ఆరోన్ జాన్సన్, నవనీత్ ధాలివాల్, పర్గత్ సింగ్, దిల్‌ప్రీత్ బజ్వా, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ (వికెట్ కీపర్), డిల్లాన్ హెయిలిగర్, సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్.చదవండి: పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్New York ✅#TeamIndia arrive in Florida 🛬 for their last group-stage match of the #T20WorldCup! 👍 pic.twitter.com/vstsaBbAQx— BCCI (@BCCI) June 14, 2024 -
IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులోకి గేమ్ ఛేంజర్! ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024లో- దాయాదుల పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్తు క్రికెట్ ప్రపంచం వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తోంది. ఈ బ్లాక్‌బ్లాస్టర్ క్లాష్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఐర్లాండ్‌పై విజయం సాధించి సమరోత్సహంతో భారత్ బరిలోకి దిగనుండగా.. పసికూన చేతిలో ఓడిన పాక్ మాత్రం ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. న్యూయర్క్ వికెట్ స్పిన్‌కు అనుకూలించడంతో పాటు పాక్‌పై కుల్దీప్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ క్రమంలోనే అతడికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. అదే విధంగా కుల్దీప్ కూడా ఇటీవల అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఒక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.మరోవైపు పాకిస్తాన్ కూడా ఓ మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ స్ధానంలో ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తుది జట్లు(అంచనా)భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్. -
కుల్దీప్ యాదవ్‌కు ఊహించని షాక్!
టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాలతో అమెరికా బిజీగా గడుపుతోంది. న్యూయార్క్‌లో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్న క్రికెటర్లు.. తాజాగా కొత్త జెర్సీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.అదే విధంగా.. ఐసీసీ అందించే ‘‘టీమ్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డులు కూడా అందుకున్న టీమిండియా స్టార్స్.. క్యాపులు ధరించి ఫొటోలు దిగారు. ఇదిలా ఉంటే.. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో భాగమైన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గురువారం క్యాప్ స్వీకరించాడు.టీమిండియాకు విలువైన ఆస్తిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి క్యాప్ అందజేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘‘టీమిండియాకు విలువైన ఆస్తి.. అద్భుతమైన అథ్లెట్‌కు క్యాప్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: కుల్దీప్ యాదవ్’’ అని రోహిత్ పేర్కొన్నాడు.ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ రోహిత్ భాయ్’’ అని కుల్దీప్ సమాధానమిచ్చాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?’’ అని రోహిత్ కుల్దీప్ను అడిగాడు. ఏమీ లేదంటూ అతడు బదులివ్వగా.. ‘‘లేదు లేదు నువ్వు మాట్లాడాల్సిందే’’ అని రోహిత్ శర్మ పట్టుబట్టాడు.‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’ఈ క్రమంలో.. ‘‘పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే, గతేడాది నేను బంతితో, బ్యాట్‌తో బాగా రాణించాను’’ అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. వెంటనే స్పందించిన రోహిత్.. ‘‘బ్యాట్‌తోనా? అదెప్పుడు?’’ అని సరదాగా కౌంటర్ వేశాడు.ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను!దీంతో కంగుతిన్న కుల్దీప్ టెస్టుల్లో బ్యాటింగ్ చేశానని గుర్తుచేయగా.. రోహిత్ బదులిస్తూ.. ‘‘ మనం వన్డేల గురించి మాట్లాడుతున్నాం. ఈ జట్టుకు నేనే కెప్టెన్‌ను. అయినా నువ్వు బ్యాటింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదు.కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ రోహిత్ కుల్దీప్ను ఆటపట్టించాడు. దీంతో బిక్కమొఖం వేయడం అతడి వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా జూన్ 1 బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా తమ వరల్డ్‌కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది.చదవండి: ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20 వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్ అతడే..!
మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ 2024పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. పలానా ఆటగాడు ఇన్ని పరుగులు చేస్తాడు.. పలానా బౌలర్ అన్ని వికెట్లు తీస్తాడు.. పలానా జట్టు టైటిల్ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయని అభిమానులు, విశ్లేషకులు సోషల్‌మీడియా వేదికగా జోస్యాల మోత మోగిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా విండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ కూడా స్పందించాడు.బిషప్ అందరి అంచనాలకు భిన్నంగా తన ప్రెడిక్షన్కు చెప్పి క్రికెట్ సర్కిల్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా టీమిండియా చైనా మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉంటాడని బోల్డ్ స్టేట్మెంట్ చేశాడు. మరో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత ప్రభావిత బౌలర్‌గా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు, మాజీలు యుజ్వేంద్ర చహల్ లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడని ముక్తకంఠంతో వాదిస్తుంటే.. బిషప్ మాత్రం కుల్దీప్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరల్డ్‌కప్ లీడింగ్ రన్ స్కోరర్పై కూడా బిషప్ తన అంచనాను అందరికీ భిన్నంగా వెల్లడించాడు. ఈ విభాగంలో మెజారిటీ శాతం విరాట్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్‌ల పేర్లు చెబుతుంటే బిషప్ మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేరు చెప్పి అందరి అంచనాల్లో తన అంచనా వేరని నిరూపించాడు. సెమీఫైనలిస్ట్‌ల విషయంలోనూ బిషప్ అంచనా కాస్త వైవిధ్యంగా ఉంది. ఈసారి ఫైనల్ ఫోర్కు భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు చేరతాయని బిషప్ చెప్పుకొచ్చాడు.కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఎడిషన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం టీమిండియా జూన్ 9న చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్ కోసం ఇదివరకే న్యూయార్క్ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో నిమగ్నమై ఉన్నారు. -
ఐపీఎల్-2024 : ఢిల్లీపై కోల్‌కతా అద్భుత విజయం (ఫొటోలు)
-
కుల్దీప్ యాదవ్ ఫైటింగ్ నాక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆఖరిలో స్పిన్నర్ కుల్దీప్ కీలక ఇన్నింగ్స్ ఆడడటంతో ఢిల్లీ.. 150 ప్లస్ మార్క్‌ను దాటగల్గింది. 26 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌దే టాప్ స్కోర్ కావడం విశేషం. కెప్టెన్ పంత్ రిషబ్ పంత్ 27 పరుగులతో పర్వాలేదన్పించాడు.ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు. -
పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్‌లో అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు. ఆది నుంచే గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. ఢిల్లీ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ శుబ్‌మన్ గిల్ వికెట్ తీసి టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని మొదలుపెట్టగా.. ముకేశ్ కుమార్ వృద్ధిమాన్ సాహా వికెట్ పడగొట్టాడు. ఇక సుమిత్ కుమార్ అద్భుత రీతిలో సాయి సుదర్శన్(12)ను రనౌట్ చేయగా.. ఇషాంత్ మరోసారి మ్యాజిక్ చేసి డేవిడ్ మిల్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ట్రిస్టన్ స్టబ్స్ అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్ వికెట్లు తీసి టైటాన్స్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. రషీద్ అవుట్ కావడంతో.. తానేమీ తక్కువ కాదన్నట్లు అక్షర్ పటేల్ రాహుల్ తెవాటియా(10) రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. ఖలీల్ అహ్మద్ మోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్ గాడిన పడేసే ప్రయత్నం చేసిన రషీద్ ఖాన్(31)ను పెవిలియన్‌కు పంపిన ముకేశ్ కుమార్ .. నూర్ అహ్మద్ వికెట్ కూడా తీసి కథ ముగించాడు. ఫలితంగా సొంతమైదానంలో 89 పరుగులకే కుప్పకూలింది గుజరాత్ టైటాన్స్. ఇక లక్ష్య ఛేదనలో ధనాధన్ ధోరణి అవలంభించిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి విజయ లాంఛనం పూర్తి చేసింది. A clinical bowling performance in Ahmedabad powered @DelhiCapitals to their third win of the season 👌 Watch the recap of the #GTvDC clash 🎥#TATAIPL pic.twitter.com/ukxCq7MOpS — IndianPremierLeague (@IPL) April 18, 2024 అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన ఢిల్లీ పొరపాట్లకు తావు లేకుండా గెలిచిన తీరు.. అందులోనూ ముఖ్యంగా కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ రాణించడం అభిమానులను ఖుషీ చేసింది. అదే విధంగా అతడు ఈ మ్యాచ్‌లో కూల్‌గా డీల్ చేసిన విధానం కూడా ముచ్చటగొలిపింది. పిచ్చి పట్టిందా అంటూ కుల్దీప్ ఆగ్రహం ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ బౌల్ చేశాడు. అతడి బౌలింగ్‌లో ఐదో బంతికి రాహుల్ తెవాటియా షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. కానీ, అప్పటికే మరో ఎండ్‌లో ఉన్న అభినవ్ మనోహర్ తెవాటియా పరుగు తీస్తాడేమోనని క్రీజు వీడాడు. ఇంతలో బంతిని అందుకున్న ఫీల్డర్ ముకేశ్ కుమార్‌ను వికెట్లకు గిరాటేయాల్సిందిగా పంత్ ఆదేశించాడు. ముకేశ్ కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్‌వైపు గురిపెట్టాడు. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన తెవాటియా మనోహర్‌ను వెంటనే వెనక్కి వెళ్లాలని సూచించగా.. అతడు సరైన సమయంలో క్రీజులో చేరాడు. Angry 💢 kullu 😭😭 pic.twitter.com/y7NQy1NQD3 — RITIKA RO 45 (@RITIKAro45) April 17, 2024 మరోవైపు.. ముకేశ్ విసిరిన బంతి ఓవర్ త్రో అయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుల్దీప్ యాదవ్.. ముకేశ్ కుమార్‌ను ‘నీకేమైనా పిచ్చి పట్టిందా’ అంటూ ఫైర్ అయ్యాడు. ఇంతలో పంత్ జోక్యం చేసుకుని ‘కోపం వద్దు భయ్యా’ అంటూ కుల్దీప్ను హత్తుకుని మరీ సముదాయించాడు. ఇంతలో ముకేశ్ సైతం చిరునవ్వులు చిందిస్తూ కుల్దీప్ కోపాన్ని లైట్ తీసుకున్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: Shubman Gill: ఒక్కరైనా డబుల్ హ్యాట్రిక్ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL LSG Vs DC Photos: కుల్దీప్ మాయాజాలం, 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు (ఫొటోలు)
-
LSG Vs DC: కుల్దీప్ మ్యాజిక్ డెలివరీ.. పూరన్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంచలన బంతితో మెరిశాడు. కుల్దీప్ అద్బుతమైన బంతితో లక్నో విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లక్నో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన కుల్దీప్ మూడో బంతికి మార్కస్ స్టోయినిష్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి పూరన్‌కు కుల్దీప్ ఆఫ్ స్టంప్ దిశగా అద్బుతమైన గూగ్లీని సంధించాడు. అయితే బంతి టర్న్ అవుతుందని భావించిన పూరన్ ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. గానీ బంతి ఎటువంటి టర్న్ కాకుండా బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చేసిన పూరన్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. కుల్దీప్ దెబ్బకు పూరన్ ఖాతాతెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్ 3 వికెట్లతో సత్తాచాటాడు. 𝗪𝗔𝗧𝗖𝗛 𝗢𝗡 𝗟𝗢𝗢𝗣! 🔄 😍 Kuldeep Yadav straight away unveiling his magic!👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC | @imkuldeep18 pic.twitter.com/pzfIQYpqnA — IndianPremierLeague (@IPL) April 12, 2024 -
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఎవరికంటే..?
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, పటిష్టమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీ లాంటి సీనియర్లు ఈ సిరీస్‌కు దూరమైనప్పటికీ వారి స్థానాలకు భర్తీ చేస్తూ యువ ఆటగాళ్లు దుమ్మురేపారు. ఈ సిరీస్‌లో టీమిండియా కుర్ర బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, దేవ్‌దత్ పడిక్కల్ లాంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో సీనియర్ల స్థానాన్ని ప్రశ్నార్దకంగా మార్చారు. బౌలింగ్ విషయానికొస్తే.. సీనియర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుంది. కుల్దీప్, బుమ్రా అవకాశం వచ్చిన ప్రతిసారి తమ సత్తా నిరూపించుకున్నారు. దృవ్ జురెల్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గానూ రాణించి పంత్ స్థానానికి ఎసరుపెట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సిరీస్ మొత్తంలో ఒక్క రజత్ పాటిదార్ మినహాయించి టీమిండియాకు అన్ని శుభాలే జరిగాయి. Any guesses who won the Fielding Medal for the series 🤔#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/NxZVWOX422 — BCCI (@BCCI) March 10, 2024 పాటిదార్ ఒక్కడే మూడు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆకాశ్‌దీప్ సైతం లభించిన అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ఆకాశ్ నాలుగో టెస్ట్‌లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా ఈ సిరీస్ ఆధ్యాంతం టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్‌లోనూ మెరుగ్గా రాణించారు. భారత ఆటగాళ్లు దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో మైదానంలో పాదరసంలా కదిలారు. అద్భుతంగా ఫీల్డింగ్ చేసి పరుగులు నియంత్రించడంతో పాటు కొన్ని కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టారు. సిరీస్ మొత్తంలో ఫీల్డింగ్‌లో సత్తా చాటిన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లకు ఇంపాక్ట్ ఫీల్డర్స్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఫీల్డింగ్‌కు సంబంధించి కుల్దీప్ యాదవ్‌కు ప్రత్యేక అవార్డు లభించింది. గతకొంతకాలంగా మైదానంలో రాణించే వారిని ఇంపాక్ట్ ఫీల్డర్ అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అంతకుముందు జరిగిన రాంచీ టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదారాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్.. ఆతర్వాత రెండో టెస్ట్‌లో 106 పరుగుల తేడాతో, మూడో టెస్ట్‌లో 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సిరీస్ ఆధ్యాంతం పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో జైస్వాల్ 9 ఇన్నింగ్స్‌ల్లో 2 డబుల్ సెంచరీలు, 3 అర్దసెంచరీల సాయంతో 712 పరుగులు చేసి సిరీస్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. -
మాటలు రావడం లేదు.. అతడొక సంచలనం! చాలా సంతోషంగా ఉంది: రోహిత్
సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. గతకొంత కాలంగా బాజ్‌బాల్ అంటూ సంప్రాదయ క్రికెట్ రూపు రేఖలు మార్చేసిన ఇంగ్లండ్ జట్టుకు.. భారత్ సరైన గుణపాఠం నేర్పింది. వరుసగా మూడు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆఖరి టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ధర్మశాల వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో టీమిండియా ఘనంగా ముగించింది. ఇక ఈ అద్భుత విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్ అసాంతం అదరగొట్టిన యువ ఆటగాళ్లపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టుల్లో ఇటువంటి విజయం సాధించాలంటే అన్ని ప్రణాళికలు సరిగ్గా అమలు కావాలి. సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్‌లో మా కుర్రాళ్లు అదరగొట్టారు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. గానీ దేశీవాళీ క్రికెట్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. అందుకే తీవ్రమైన ఒత్తడిలో సైతం వారు అద్బుతంగా రాణించారు. ఈ సిరీస్ విజయం సాధించేందుకు మా జట్టు మొత్తం తీవ్రంగా శ్రమించింది. కాబట్టి విన్నింగ్ క్రెడిట్ మా జట్టు మొత్తానికి ఇవ్వాలనకుంటున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సిరీస్ విజయం సాధిస్తే అందరూ సెంచరీలు, వ్యక్తిగత రికార్డుల కోసమే మాట్లాడతారు. కానీ ఒక టెస్టులో విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి బౌలర్ల కృషి లేనదే గెలుపొందడం చాలా కష్టం. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా స్పిన్నర్లు చాలా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కోసం ఎంతచెప్పుకున్న తక్కువే. మొదటి ఇన్నింగ్స్ ఆరంభంలో ఇంగ్లండ్ బ్యాటర్లు కాస్త దూకుడుగా ఆడుతున్నప్పుడు కుల్దీప్ యాదవ్‌ను ఎటాక్‌లో తీసుకురావాలని భావించాను. అందుకు తగ్గట్టే అతడు మాకు తొలి వికెట్‌ను అందించాడు. గాయం నుంచి కోలుకోని కుల్దీప్ ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. కుల్దీప్ బ్యాటింగ్ చేయడం కూడా మా జట్టుకు బాగా కలిసిచ్చోంది. ఇక జైశ్వాల్ గురించి ఏమి మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. అతడొక సంచలనం. యశస్వీ ఇంకా తన కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిరోహించాలి. జైశ్వాల్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి జైశ్వాల్ ఎక్కువగా ఇష్టపడతాడు. అతడికి ఇదొక అద్బుతమైన సిరీస్ అని పోస్ట్ మ్యాచ్ ప్రేజంటేషన్లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా జైశ్వాల్ ఈ సిరీస్‌లో దుమ్మురేపాడు. 712 పరుగులతో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జైశ్వాల్ నిలిచాడు. -
టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం
India vs England 5th Test Day 3: ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉపఖండ పిచ్‌లపై ‘బజ్‌బాల్’ ఆటలు చెల్లవంటూ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు.. బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్‌మన్ గిల్(110) అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ విజయం సాధ్యమైంది. ఫలితంగా సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన బ్యాటర్లు లేకుండానే యువ క్రికెటర్లతో కూడిన జట్టుతోనే భారీ విజయం అందుకుని తమ స్థాయిని చాటుకుంది టీమిండియా. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 స్పిన్నర్ల ఆధిపత్యం ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇందులో అశూ మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. ఓవరాల్‌గా కుల్దీప్ యాదవ్ 7, రవీంద్ర జడేజా రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ధర్మశాలలో మ్యాచ్ సాగిందిలా గురువారం మొదలైన ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు వీరుడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు (4/51) వికెట్లతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా తాను సైతం అంటూ ఒక వికెట్(1/17) దక్కించుకున్నాడు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ సెంచరీ(103) పూర్తి చేసుకోగా.. వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(110) సైతం శతక్కొట్టాడు. వీరిద్దరికి తోడు అరంగేట్ర బ్యాటర్ దేవ్దవ్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో.. 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. కేవలం నాలుగు పరుగులు జతచేసి భారత్ ఆలౌట్ అయింది. 477 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి.. 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. టీమిండియా స్పిన్నర్ల ధాటిని తట్టుకోలేకపోయింది. 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఐదుగురి అరంగేట్రం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్.. మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టారు. వీరిలో రజత్ పాటిదార్ మినహా మిగిలిన నలుగురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) సాధించగా.. అరంగేట్రంలోనే పడిక్కల్ సైతం హాఫ్ సెంచరీ(65)తో మెరిశాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్‌గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్‌ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం ►హైదరాబాద్‌లో తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచి.. తాజాగా ధర్మశాలలో టీమిండియా వరుస విజయాలు. పూర్తి అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
#Ash: వారెవ్వా.. 4.2 ఓవర్లలోనే మూడు వికెట్లు..
టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు సందర్భంగా ఈ అరుదైన మైలురాయికి చేరుకున్న అశూ.. ధర్మశాలలో తన స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. గింగిరాలు తిరిగే బంతితో ప్రత్యర్థి జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. శనివారం మొదలైన మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా 477 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో అశ్విన్ ఆరంభం(1.5 ఓవర్)లోనే ఓపెనర్ బెన్ డకెట్(2)ను బౌల్డ్ చేశాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) అనంతరం మరో ఓపెనర్ జాక్ క్రాలే(1- 5.3వ ఓవర్ వద్ద)ను కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19- 9.2 ఓవర్ వద్ద) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకుని టాపార్డర్ పతనాన్ని శాసించాడు ఈ చెన్నై బౌలర్. ఓవరాల్‌గా శనివారం నాటి ఆటలో తన బౌలింగ్‌లో వేసిన 4.2 ఓవర్లలోనే అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ జానీ బెయిర్ స్టో(39) రూపంలో నాలుగో వికెట్ దక్కించుకోగా.. బెన్ స్టోక్స్‌ను అవుట్ చేసి ఐదో వికెట్‌ను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 103 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు ముందు అశూకు నాలుగు వికెట్లు దక్కగా.. కుల్దీప్ ఒక వికెట్ తీశాడు. ఇక టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. -
ఆండర్సన్ ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి
Ind vs Eng- James Michael Anderson 700 Test Wickets: ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ధర్మశాలలో నామమాత్రపు ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో.. మూడో రోజు ఆటలో టీమిండియా 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే, శనివారం నాటి ఆట ఆరంభమైన కాసేపటికే జేమ్స్ ఆండర్సన్ నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్(30)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆండర్సన్ ఖాతాలో 700వ టెస్టు వికెట్ జమ అయింది. ఈ క్రమంలో.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి పేసర్‌గా అతడు రికార్డు సాధించాడు. 41 ఏళ్ల వయసులో ఆండర్సన్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక- స్పిన్నర్)- 800 షేన్ వార్న్(ఆస్ట్రేలియా- స్పిన్నర్)- 708 జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లండ్- పేసర్)- 700* అనిల్ కుంబ్లే(ఇండియా- స్పిన్నర్)- 619 స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్- పేసర్)- 604 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
కుల్దీప్ ఫటాఫట్...ఓపెనింగ్ ధనాధన్!
ధర్మశాలలో తొలి రోజే వాతావరణం భారత్‌కు అనుకూలంగా మారిపోయింది. గిర్రున తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక తలవంచిన ఇంగ్లండ్ అరవై ఓవర్ల లోపే పది వికెట్లనూ స్పిన్నర్లకే అప్పగించింది. టాస్ గెలిచిన సానుకూలత, శుభారంభం తర్వాత ఒక దశలో 175/3తో మెరుగైన స్థితిలో నిలిచిన పర్యాటక జట్టు పేలవ ప్రదర్శనతో 43 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకుంది. ఎడంచేతి మణికట్టుతో కుల్దీప్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, తన వందో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో అశ్విన్ అండగా నిలిచాడు. మరోమారు యశస్వి జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్, రోహిత్ సహకారం వెరసి సిరీస్‌లో భారత్‌కు తొలిసారి ఓపెనింగ్‌లో సెంచరీ భాగస్వామ్యం... ఆట ముగిసేసరికి కేవలం 83 పరుగుల లోటుతో ముగించిన టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే శుక్రవారమే చివరి టెస్టు పూర్తిగా భారత్ చేతుల్లోకి రావడం ఖాయం. ధర్మశాల: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన ఐదో టెస్టులో భారత్‌కు అన్ని విధాలా సరైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. యశస్వి జైస్వాల్ (58 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (52 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించగా... రోహిత్‌తో పాటు శుబ్‌మన్ గిల్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నాడు. ఆడిన మూడు టెస్టుల్లో విఫలమైన రజత్ పటిదార్ స్థానంలో భారత్ దేవ్‌దత్ పడిక్కల్‌ను తొలిసారి తుది జట్టులోకి ఎంపిక చేసింది. మరోవైపు 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌కు కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా బీసీసీఐ ప్రత్యేక జ్ఞాపిక అందించింది. టపటపా... ఓపెనర్లు క్రాలీ, డకెట్ (27) ఇంగ్లండ్‌కు మరోసారి శుభారంభం అందించారు. అయితే కుల్దీప్ రాకతో పరిస్థితి మారిపోయింది. గిల్ అద్భుత క్యాచ్‌తో తన తొలి ఓవర్లోనే డకెట్‌ను వెనక్కి పంపిన కుల్దీప్... కొద్ది సేపటికే పోప్ (11)ను కూడా అవుట్ చేశాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 100/2 కాగా, క్రాలీ కొన్ని చక్కటి షాట్లతో క్రీజ్‌లో పట్టుదలగా నిలబడ్డాడు. అయితే రెండో సెషన్లో భారత స్పిన్నర్లు మరింతగా చెలరేగిపోగా... ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కుల్దీప్ బౌలింగ్‌లో అనూహ్యంగా టర్న్ అయిన బంతి క్రాలీ వికెట్లను ఎగరగొట్టగా, 100వ టెస్టు ఆడుతున్న బెయిర్‌స్టో (29) వికెట్ కూడా కుల్దీప్ ఖాతాలోనే చేరింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. శుభారంభం... భారత ఓపెనర్లు యశస్వి, రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 20 పరుగుల వద్ద రోహిత్‌ను అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో అతను నాటౌట్‌గా తేలడం కలిసొచ్చింది. తొలి 27 బంతుల్లో 6 పరుగులే చేసి ఓపిక ప్రదర్శించిన యశస్వి స్పిన్నర్ల రాకతో చెలరేగిపోయాడు. బషీర్ వేసిన తొలి ఓవర్లో అతను 3 సిక్సర్లు బాదాడు. అయితే బషీర్ ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో అర్ధ సెంచరీని దాటిన యశస్వి అదే ఊపులో మూడో బంతికి ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. అనంతరం 77 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, మరోవైపు గిల్ కూడా దూకుడుగా ఆడాడు. పడిక్కల్@ 314 ఈ మ్యాచ్‌తో కర్ణాటకకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇప్పటికే 2 టి20లు ఆడిన పడిక్కల్... టెస్టులు ఆడిన 314వ భారత ఆటగాడిగా నిలిచాడు. 17 ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన 17వ ప్లేయర్‌గా బెయిర్‌స్టో గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అండర్సన్ (187), స్టువర్ట్ బ్రాడ్ (168), కుక్ (161), జో రూట్ (140), స్టివార్ట్ (133), బెల్ (118), గూచ్ (118), గోవర్ (117), అథర్టన్ (115), కొలిన్ కౌడ్రే (114), బాయ్‌కాట్ (108), పీటర్సన్ (104), బోథమ్ (102), స్టోక్స్ (102), స్ట్రాస్ (100), థోర్ప్ (100) ఉన్నారు. 14 భారత్ తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకున్న 14వ ప్లేయర్‌గా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ (200), ద్రవిడ్ (163), లక్ష్మణ్ (134), కుంబ్లే (132), కపిల్‌దేవ్ (131), గావస్కర్ (125), వెంగ్‌సర్కార్ (116), గంగూలీ (113), కోహ్లి (113), ఇషాంత్ శర్మ (105), సెహ్వాగ్ (103), హర్భజన్ (103), పుజారా (103) ఉన్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 79; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 27; పోప్ (స్టంప్డ్) జురేల్ (బి) కుల్దీప్ 11; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 26; బెయిర్‌స్టో (సి) జురేల్ (బి) కుల్దీప్ 29; స్టోక్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫోక్స్ (బి) అశ్విన్ 24; హార్ట్లీ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 6; వుడ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; బషీర్ (నాటౌట్) 11; అండర్సన్ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (57.4 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–64, 2–100, 3–137, 4–175, 5–175, 6–175, 7–183, 8–183, 9–218, 10–218. బౌలింగ్: బుమ్రా 13–2–51–0, సిరాజ్ 8–1–24–0, అశ్విన్ 11.4–1–51–4, కుల్దీప్ 15–1–72–5, జడేజా 10–2–17–1. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బ్యాటింగ్) 52; గిల్ (బ్యాటింగ్) 26; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (30 ఓవర్లలో వికెట్ నష్టానికి) 135. వికెట్ల పతనం: 1–104. బౌలింగ్: అండర్సన్ 4–1–4–0, మార్క్ వుడ్ 3–0–21–0, హార్ట్లీ 12–0– 46–0, షోయబ్ బషీర్ 11–2–64–1. -
Viral Video: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలి..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. తొలుత ఇంగ్లండ్‌ను 218 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోయి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. First Kuldeep Yadav give the ball to Ravi Ashwin but Ashwin return the ball to Kuldeep Yadav to celebrate his 5-Wicket haul. - Beautiful moments of the day...!!!! pic.twitter.com/64ev9CFM4f — CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024 కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత మైదానంలో తారసపడిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన అనంతరం భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్తుండగా వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్‌ను ముందుగా నడవమని సహచర ఆటగాళ్లు కోరారు. అయితే ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ ఇన్నింగ్స్ హీరో కావడంతో అశ్విన్ సహచరుల మాటకు ఒప్పుకోలేదు. కుల్దీప్నే ముందుగా నడవాల్సిందిగా కోరాడు. ఇలా నువ్వు-నేను అంటూ అశ్విన్, కుల్దీప్ మధ్య కాసేపు చర్చ జరిగింది. చివరికి అశ్విన్.. కుల్దీప్ను ఒప్పించాడు. కుల్దీప్ టీమ్‌ను లీడ్ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడయో నెట్టింట వైరలవుతుంది. వందో టెస్ట్ ఆడుతూ 500కు పైగా వికెట్లు తీసిన అశ్విన్ హుందాతనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదగడం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Ind vs Eng: ‘బజ్‌బాల్’ను కట్టడి చేసి.. బ్యాటింగ్‌లో అదరగొట్టి!
India vs England, 5th Test Day 1 Highlights: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా పైచేయి సాధించింది. ‘బజ్‌బాల్’ విధానంతో దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని కట్టడి చేసి.. స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ధర్మశాలలో గురువారం నామమాత్రపు ఆఖరి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్లు ఆది నుంచే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ.. ఇంగ్లిష్ జట్టును తిప్పలు పెట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే(79) ఒక్కడే పట్టుదలగా నిలబడగా.. మిగతా వాళ్లలో ఒక్కరి నుంచి కూడా అతడికి సహకారం అందలేదు. కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయ (Kuldeep Yadav- Ravichandran Ashwin Spin Magic) ఈ క్రమంలో 218 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు(4/51) వికెట్లతో రాణించాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్(1/17) దక్కింది. 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙇𝙞𝙠𝙚 𝙏𝙝𝙚𝙨𝙚! R Ashwin 🤝 Kuldeep Yadav Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ashwinravi99 | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/hJyrCS6Hqh — BCCI (@BCCI) March 7, 2024 అర్ధ శతకాలతో చెలరేగి భారత ఓపెనర్లు (Yashasvi Jaiswal- Rohit Sharma) ఇక తొలి రోజే ఇంగ్లండ్ ఆట కట్టించిన టీమిండియా.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫిఫ్టీ(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో ఇరదగీశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్ధ శతకంతో చెలరేగాడు. అయితే, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అనూహ్య రీతిలో యశస్వి స్టంపౌట్‌గా వెనుదిరగగా.. శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా స్కోరు 135/1 కాగా.. రోహిత్ శర్మ 52, శుబ్‌మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా ఉన్నారు. Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
చరిత్ర సృష్టించిన కుల్దీప్.. భారత తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఆఖరి టెస్టు ఆరంభమైంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కుల్దీప్ అదరగొడుతున్నాడు. బెన్ డకెట్(27), జాక్ క్రాలే(79), ఒలీ పోప్(11) రూపంలో టాపార్డర్ వికెట్లన్నీ తానే దక్కించుకున్న కుల్దీప్.. మిడిలార్డర్ బ్యాటర్లు జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0)లను కూడా అవుట్ చేశాడు. కాగా స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపిన సందర్భంగా కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున తక్కువ బంతుల్లోనే 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ అక్షర్ పటేల్‌లను ఈ చైనామన్ బౌలర్ అధిగమించాడు. అదే విధంగా.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్న కుల్దీప్ యాదవ్.. ఈ మార్కుకు చేరుకున్న పదిహేడో భారత బౌలర్‌గా నిలిచాడు. తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 50 వికెట్ల మార్కు అందుకున్న భారత బౌలర్లు 1871 - కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) 2205 - అక్షర్ పటేల్(Axar Patel) 2520 - జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
ధ్రువ్‌తో అట్లుంటది మరి.. చెప్పి మరి ఔట్ చేశాడు! ధోనిలా
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత వికెట్ కీపర్ మరోసారి తన స్కిల్స్‌ను ప్రదర్శించాడు. తన సమయస్ఫూర్తితో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను జురెల్ బోల్తా కొట్టించాడు. ఏం జరిగిందంటే? భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రోజు లంచ్ విరామానికి ముందు 26 ఓవర్ వేసే బాధ్యతను కుల్దీప్ యాదవ్‌కు అప్పగించాడు. ఆ ఓవర్లో తొలి బంతిని జాక్ క్రాలే సింగిల్ తీసి ఓలీ పోప్‌కు ఇచ్చాడు. పోప్ రెండో బంతికి ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించగా.. అది మిస్స్ అయ్యి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేతికి వెళ్లింది. అయితే జురెల్ కుల్దీప్ వద్దకు వెళ్లి తర్వాతి బంతికి పోప్ క్రీజును వదిలి ఆడుతాడని చెప్పాడు. యాదృచ్ఛికంగా జురెల్ చెప్పటినట్లగానే పోప్ క్రీజును వదలి బయటకు వచ్చి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ధ్రువ్ సూచనతో కుల్దీప్ టర్న్ ఎక్కువగా చేయడంతో బంతి జురెల్ బ్యాట్‌కు మిస్స్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే జురెల్ బెయిల్స్‌ను పడగొట్టి స్టంపౌట్ చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జురెల్ స్కిల్స్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనిని గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND vs ENG: ఎంత పనిచేశావు రోహిత్? అంతా ధ్రువ్ వల్లే! పాపం సర్ఫరాజ్ -
అయ్యో పాపం.. స్పిన్ వలలో చిక్కి క్లీన్‌బౌల్డ్! ఐదేసిన కుల్దీప్
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ చైనామన్ స్పిన్నర్ దెబ్బకు ఇంగ్లిష్ జట్టు టాపార్డర్ కుదేలైంది. కాగా ధర్మశాల వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య తాజా సిరీస్‌లో ఆఖరిదైన మ్యాచ్ గురువారం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 18వ ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడు ఇచ్చిన క్యాచ్‌ను శుబ్‌మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకెట్ వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జాక్ క్రాలే మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కానీ అతడికి జతైన వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(11)ను మాత్రం కుల్దీప్ త్వరగానే పెవిలియన్‌కు పంపగలిగాడు. 25.3వ ఓవర్లో పోప్ స్టంపౌట్ కావడంతో కుల్దీప్‌నకు రెండో వికెట్ దక్కింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఆ తర్వాత జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న క్రాలే అర్థ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. అయితే, కుల్దీప్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో దెబ్బకొట్టి క్రాలే(79)ను బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఇలా టాపార్డర్‌లో మూడు వికెట్లను తానే దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ వందో టెస్టు వీరుడు జానీ బెయిర్ స్టో(29) వికెట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్(0) రూపంలో ఐదో వికెట్‌ను కూడా దక్కించుకున్నాడు. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్కు ఇంగ్లండ్ బ్యాటర్లు అవుటైన తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
మీకు రూట్ ఉంటే.. మాకు కుల్దీప్ సార్ ఉన్నారు! అంతేగా?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. జడేజా, గిల్, సర్ఫరాజ్ వంటి స్టార్ బ్యాటర్లు ఇంగ్లండ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న చోట.. కుల్దీప్ తన క్లాస్‌ను చూపించాడు. తొలి ఇన్నింగ్స్ కేవలం 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కుల్దీప్.. ఇంగ్లీష్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తన డిఫెన్స్‌తో ఇంగ్లండ్ స్పిన్నర్లకు విసుగు తెప్పించాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పరుగులు రాబడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దృవ్ జురల్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 131 బంతులు ఎదుర్కొన్న యాదవ్ 2 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. ఆఖరికి జేమ్స్ ఆండర్స్ బౌలింగ్‌లో కుల్దీప్ ఔటయ్యాడు. కాగా భారత తొలి ఇన్నింగ్స్‌లో అందరి కంటే ఎక్కువ బంతులు కుల్దీప్ యాదవే ఎదుర్కోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కుల్దీప్ అద్భుత ఇన్నింగ్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చేసింది 28 పరుగులే కానీ సెంచరీ కంటే ఎక్కువంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది అయితే "మీకు రూట్ ఉంటే.. మాకు కుల్దీప్ సార్ ఉన్నాండంటూ" ఇంగ్లండ్‌ను ఉద్దేశించి పోస్టులు చేస్తున్నారు. కాగా రూట్ కూడా తన అద్బుత సెంచరీతో ఇంగ్లండ్‌ను అదుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 94 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. దృవ్ జురల్(59) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు వెనుకంజలో ఉంది. If You Have Joe Root Then We Have Sir Kuldeep Yadav .#INDvENG pic.twitter.com/spUiB8299a — ShivX #ExMIFan (@ShivX45) February 25, 2024 Meanwhile Rahul Dravid to Rajat Patidar after Kuldeep Yadav faced the maximum ball in the Indian inning 😅#INDvENG pic.twitter.com/Q2VWu4WhoP — Sujeet Suman (@sujeetsuman1991) February 25, 2024 -
మొన్న సర్ఫరాజ్.. ఇవాళ గిల్
సహచర ఆటగాళ్ల తప్పిదాల కారణంగా రనౌట్లు కావడం ఇటీవలికాలంలో చాలా ఎక్కువైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సహచరుడు రవీంద్ర జడేజా తప్పిదానికి బలైపోగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. నాలుగో రోజు ఆటలో టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్.. సహచరుడు కుల్దీప్ యాదవ్ రాంగ్ కాల్ కారణంగా రనౌటయ్యాడు. A heart-breaking run-out for Shubman Gill....!!!!pic.twitter.com/GoFZ3OEeOl — Johns. (@CricCrazyJohns) February 18, 2024 ఈ రెండు ఘటనల్లో స్ట్రయికింగ్‌లో ఉన్న ఆటగాళ్లే (జడేజా, కుల్దీప్) తొలుత పరుగుకు పిలుపున్చి ఆ తర్వాత వెనక్కు తగ్గారు. ఈ రెండు సందర్భాల్లో రాంగ్ కాల్‌కు బలైపోయిన ఆటగాళ్లు మాంచి ఊపులో ఉన్నప్పుడు రనౌటయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యే సమయానికి మెరుపు అర్ధసెంచరీ (66 బంతుల్లో 62 పరుగులు; 9 ఫోర్లు, సిక్స్) చేసి జోరు మీదుండగా.. ఇవాళ జరిగిన దురదృష్ట ఘటనలో గిల్ సెంచరీకి తొమ్మిది పరుగులు దూరంలో (151 బంతుల్లో 91; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నప్పుడు ఔటయ్యాడు. సర్ఫరాజ్, గిల్ రనౌట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. కాగా, రాజ్‌కోట్ టెస్ట్ నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 440 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఇవాల్టి ఆటలో శుభ్‌మన్ గిల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
లంచ్ తర్వాత పూనకం... 29 పరుగుల వ్యవధిలోనే ఖేల్ ఖతం!
India vs England, 3rd Test Day 3: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు మూడో రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భోజన విరామ సమయం తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-1తో సమంగా ఉన్న టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం మూడో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసి.. టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. #TeamIndia snag wickets for dessert 🍰 right after Lunch! 👌#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/AsabZXcy6S — JioCinema (@JioCinema) February 17, 2024 ఈ క్రమంలో శనివారం ఆట ఆరంభం నుంచే ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు విజయవంతమయ్యారు. దెబ్బకు తొలి సెషన్లోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ లంచ్‌కు ముందు 290/5 స్కోరు వద్ద నిలిచింది. అయితే, భోజనం చేసి మళ్లీ మైదానంలో దిగిన తర్వాత కేవలం 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో 319 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుస విరామాల్లో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ వికెట్లు తీసిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కుల్దీప్ యాదవ్ రెండు, జడేజా రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ మూడో రోజు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అశ్విన్ లేకుండానే పది మంది యాక్టివ్ (బౌలింగ్, బ్యాటింగ్) ప్లేయర్లతో టీమిండియా బరిలోకి దిగింది. మూడో రోజు ఇంగ్లండ్ వికెట్ల పతనం ఇలా.. ►39.5వ ఓవర్: బుమ్రా బౌలింగ్‌లో- యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి జో రూట్(18) అవుట్ ►40.4వ ఓవర్: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో- జానీ బెయిర్ స్టో ఎల్బీడబ్ల్యూ(0). ►50.1వ ఓవర్: కుల్దీప్ బౌలింగ్‌లో సెంచరీ వీరుడు బెన్ డకెట్(151) ఇన్నింగ్స్‌కు తెర లంచ్ తర్వాత.. ►65: జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ అవుట్(41) ►65.1: సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన బెన్ ఫోక్స్(13) ►69.5: సిరాజ్ బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్ బౌల్డ్(6) ►70.2: జడేజా బౌలింగ్‌లో టామ్ హార్లే స్టంపౌట్(9) ►71.1: సిరాజ్ బౌలింగ్‌లో ఆండర్సన్ క్లీన్‌బౌల్డ్(1). తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: IND Vs ENG: సర్ఫరాజ్ ఖాన్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు! 𝗔𝗹𝗹 𝘁𝗮𝗿𝗴𝗲𝘁𝘀 🎯𝗱𝗲𝘀𝘁𝗿𝗼𝘆𝗲𝗱 🚀☝️ Siraj wraps up the England innings with finesse 🔥👏#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/WOO1DRVDHE — JioCinema (@JioCinema) February 17, 2024 -
నిన్న యశస్వి.. నేడు బుమ్రా.. ఆధిక్యంలో టీమిండియా
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చాటుకుంది. వైజాగ్‌లో శనివారం నాటి ఆట ముగిసే సరికి 171 పరుగుల ఆధిక్యం సంపాదించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో రోజు డబుల్ సెంచరీగా మలిచి ఈ క్రమంలో తొలి రోజు భారీ సెంచరీ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్.. రెండో రోజు దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. ఇక 209 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి అవుట్ కాగా.. టీమిండియా 396 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. శనివారం 336/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండు రోజు ఆటను ఆరంభించిన భారత్.. అదనంగా 60 పరుగులు జత చేయగలిగింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగగా ఓపెనర్ బెన్ డకెట్(21) కుల్దీప్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ జాక్ క్రాలే(76) పట్టుదలగా నిలబడ్డాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ అద్భుత అర్ధ శతకంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వికెట్ల వేట మొదలుపెట్టి.. ఘనంగా ముగించి అయితే, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ ఆడాలని క్రాలే భావించగా.. శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్‌తో అతడికి సెండాఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన వికెట్ల వేట మొదలుపెట్టాడు. హైదరాబాద్ టెస్టు హీరో ఒలీ పోప్(23), జో రూట్(5), బెయిర్ స్టో(25), కెప్టెన్ బెన్‌స్టోక్స్(47) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల క్లబ్లో చేరాడు. ఇక టామ్ హార్లీ వికెట్‌తో ఈ మ్యాచ్‌లో ఫైఫర్ సాధించిన ఈ రైటార్మ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్(6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆఖరి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రాకు ఆరు, కుల్దీప్ యాదవ్‌కు మూడు, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కాయి. 171 పరుగుల ఆధిక్యంలో భారత్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓవరాల్‌గా 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 13, యశస్వి జైస్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో గెలిచి 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ Memorable Performance ✅ Special Celebration 🙌 Well bowled, Jasprit Bumrah! 🔥 🔥 Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/bRYTf68zMN — BCCI (@BCCI) February 3, 2024 -
IND Vs ENG 2nd Test: తొలిరోజు జైస్వాల్ సూపర్ ‘హిట్’..
India vs England, 2nd Test At Vizag Day 1 Update: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. వైజాగ్‌లో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి.. 93 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(14) నిరాశపరచగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసే సరికి 179 పరుగులతో అశ్విన్(5)తో అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో శుబ్‌మన్ గిల్(34), అరంగేట్ర బ్యాటర్ రజత్ పాటిదార్(32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా నామమాత్రంగానే ఆడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లకు రెండు చొప్పున వికెట్లు దక్కగా.. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్, స్పిన్ బౌలర్ హార్లీ ఒక్కో వికెట్ పడగొట్టాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 90.6: శ్రీకర్ భరత్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో షోయబ్ బషీర్‌కు క్యాచ్ ఇచ్చి భరత్ (17) పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 330-6(91) 88వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు: 307/5 యశస్వి జైస్వాల్ 168, శ్రీకర్ భరత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా ►85.3: షోయబ్ బషీర్ బౌలింగ్‌లో రెహాన్ క్యాచ్ ఇచ్చిన అక్షర్ పటేల్. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగిన ఆల్‌రౌండర్. లోకల్ స్టార్ శ్రీకర్ భరత్ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా @ 300 ►84: మూడు వందల పరుగుల మార్కు అందుకున్న టీమిండియా 73 ఓవర్లలో టీమిండియా స్కోరు: 250-4 ►యశస్వి 142, అక్షర్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 71.1: ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్ బౌల్డ్(32). నాలుగో వికెట్ కోల్పోయిన భారత్. యశస్వి, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. 63 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225/3 జైస్వాల్ 125, పాటిదార్ 25 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. టీ విరామ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మూడో వికెట్ డౌన్.. శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. టామ్ హార్లీ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ వచ్చాడు. యశస్వీ జైశ్వాల్ సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 151 బంతుల్లో జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ. 50 ఓవర్లకు టీమిండియా స్కోర్: 175/2. క్రీజులో జైశ్వాల్(104), శ్రేయస్ అయ్యర్(23) పరుగులతో ఉన్నారు. 42 ఓవర్లకు టీమిండియా స్కోర్: 137/2 42 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ జైశ్వాల్(69) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(21) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 38 ఓవర్లకు భారత స్కోర్: 114/2 38 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(56), శ్రేయస్ అయ్యర్(14) పరుగులతో ఉన్నారు. లంచ్ విరామానికి భారత్ స్కోర్: 103/2 రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(51), శ్రేయస్ అయ్యర్(4) పరుగులతో ఉన్నారు. జైశ్వాల్ హాఫ్ సెంచరీ ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 51 పరుగులతో జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. శుబ్‌మన్ గిల్ ఔట్.. 89 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. జేమ్స్ ఆండర్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 29 ఓవర్లకు భారత్ స్కోర్: 89/2, క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. జైశ్వాల్(41) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ అవుట్ 17.3: రోహిత్ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ మాయాజాలంలో చిక్కుకున్న టీమిండియా కెప్టెన్ ఒలీ పోప్‌నకు క్యాచ్ ఇచ్చి 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. గిల్ క్రీజులోకి వచ్చాడు. యశస్వి 26 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 41/1 (18) నిలకడగా ఆడుతున్న రోహిత్, జైశ్వాల్.. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్: 39/0, క్రీజులో యశస్వీ జైశ్వాల్(25), రోహిత్ శర్మ(14) పరుగులతో ఉన్నారు. పది ఓవర్లకు టీమిండియా స్కోరు: 23/0 యశస్వి, రోహిత్ ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి యశస్వి 13, రోహిత్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లకు టీమిండియా స్కోరు: 14/0 యశస్వి 9, రోహిత్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. ఖాతా తెరిచిన జైశ్వాల్.. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 9/0 తొలి ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(9), రోహిత్ శర్మ(0) ఉన్నారు. విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో రజిత్ పాటిదార్ భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరంగా కాగా.. పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో పాటిదార్‌తో పాటు ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేయగా.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ 🚨 Toss Update 🚨 Captain @ImRo45 wins the toss and #TeamIndia elect to bat in Vizag 👌👌 Follow the match ▶️ https://t.co/UvEzFjxrS7 Zaheer Khan #TeamIndia | #INDvENG | #IDFCFIRSTBank pic.twitter.com/rpBJ1si3XM https://t.co/rpBJ1si3XM — Fatima Raza (@Fatima__ain) February 2, 2024 -
T20 WC: ప్రపంచకప్ జట్టులో కుల్దీప్‌నకు నో ఛాన్స్! ఆ ముగ్గురే..
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ దళ కూర్పు గురించి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ముగ్గురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. తన ప్రాధాన్యం మాత్రం వీళ్లేనంటూ ముగ్గురు స్టార్ల పేర్లు చెప్పాడు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్-2024 జూన్ 4 నుంచి ఆరంభం కానుంది. ఈవెంట్ మొదలైన మరుసటి రోజు టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఆఖరి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రోహిత్ సేన అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో తలపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ జట్టులో స్పిన్ విభాగం నుంచి అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోగా.. తొలి రెండు మ్యాచ్‌లలో చైనామన్ బౌలర్ కుల్దీప్‌నకు తుదిజట్టులో చోటు దక్కలేదు. రవి, అక్షర్, సుందర్ ఈ రెండు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా అఫ్గన్‌తో ఆదివారం ముగిసిన రెండో టీ20లో అక్షర్ రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కలర్స్ షోలో మాట్లాడుతూ ప్రజ్ఞాన్ ఓజా అక్షర్ పటేల్‌పై ప్రశంసలు కురిపించాడు. బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ రాణించగల ఈ ఆల్‌రౌండర్ అసలైన మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. కీలక సమయంలో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అక్షర్ సొంతమని ఓజా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి కచ్చితంగా చోటివ్వాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా..."నా వరకైతే వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలి. నంబర్ 1.. రవీంద్ర జడేజా. అతడి అనుభవం జట్టుకు ప్రయోజనకరం. ఇక రెండో బౌలర్.. రవి బిష్ణోయి, మూడో ఆటగాడు అక్షర్ పటేల్. క్లిష్ట పరిస్థితుల్లో తెలివిగా బౌలింగ్ చేయగలడు" అని మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు. ఆ ముగ్గురికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ.. కుల్దీప్ యాదవ్‌ను మాత్రం విస్మరించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టుతో చేరనున్నాడు. చదవండి: BCCI: బీసీసీఐ సెలక్టర్‌పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల -
బ్యాటింగ్‌లో గిల్.. బౌలింగ్‌లో జడ్డూ.. సెకెండ్ ప్లేస్‌లోనూ మనోళ్లే..!
మరో రెండు రోజుల్లో 2023 సంవత్సరానికి ఎండ్ కార్డ్ పడనుంది. కేవలం మూడు అంతర్జాతీయ మ్యాచ్ మినహాయించి ఈ ఏడాది మ్యాచ్‌లన్నీ అయిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్-యూఏఈల మధ్య రెండు టీ20లు (29, 31 తేదీల్లో), న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 (31) మ్యాచ్‌లు మాత్రమే ఈ ఏడాదికి మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు కలుపుకుని) అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల రికార్డులు ఎవరి పేరిట ఉన్నాయని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టాప్-2లో భారత ఆటగాళ్లే ఉండటం విశేషం. బ్యాటింగ్‌లో టీమిండియా నయా రన్ మెషీన్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలువగా.. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. గిల్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 48 మ్యాచ్‌లు ఆడి 46.82 సగటున 7 సెంచరీలు, 10 అర్థసెంచరీల సాయంతో 2154 పరుగులు చేయగా.. విరాట్.. కేవలం 35 మ్యాచ్‌ల్లోనూ 66.06 సగటున 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 2048 పరుగులు చేశాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ డారిల్ మిచెల్ (50 మ్యాచ్‌ల్లో 1988) మూడో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (35 మ్యాచ్‌ల్లో 1800), ట్రవిస్ హెడ్ (31 మ్యాచ్‌ల్లో 1698) టాప్-5లో ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న రవీంద్ర జడేజా 35 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత రెండో స్థానంలోనూ టీమిండియా బౌలరే ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది 39 మ్యాచ్‌ల్లో 63 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు. ఆసీస్ మిచెల్ స్టార్క్ (23 మ్యాచ్‌ల్లో 63 వికెట్లు), పాక్ షాహీన్ అఫ్రిది (30 మ్యాచ్‌ల్లో 62), టీమిండియా మొహమ్మద్ సిరాజ్ (34 మ్యాచ్‌ల్లో 60) ఈ ఏడాది టాప్-5 వికెట్ టేకర్లలో ఉన్నారు. వరల్డ్‌కప్ హీరో మొహమ్మద్ షమీ (23 మ్యాచ్‌ల్లో 56) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
చరిత్ర సృష్టించిన కుల్దీప్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టును కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్.. 17 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో కుల్దీప్కు ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం. టీ20ల్లో కుల్దీప్కు రెండో ఫైవ్ వికెట్ల హాల్. అంతేకాకుండా గురువారం(డిసెంబర్ 14) కుల్దీప్ యాదవ్ 29వ వసంతంలోకి అడుగుపెట్టాడు. తద్వారా కుల్దీప్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టీ20 క్రికెట్లో పుట్టిన రోజున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అదే విధంగా టీ20ల్లో సేనా దేశాల్లో(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా) రెండు సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా కూడా కుల్దీప్ నిలిచాడు. చదవండి: Who Is Satheesh Shubha: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదుర్స్.. ఆర్సీబీ జట్టుతో! ఎవరీ శుభా సతీష్? -
సూర్య సూపర్ సెంచరీ.. దక్షిణాఫ్రికా చిత్తు
జొహన్నెస్‌బర్గ్: వాండరర్స్ మైదానంలో భారత్ విజయహాసం చేసింది. గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ , ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు శతకంతో చెలరేగాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. అంతర్జాతీయ టి20ల్లో నాలుగో సెంచరీ సాధించిన సూర్య... రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లతో సమంగా నిలిచాడు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయింది. చివరకు ఆ జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, మార్క్రమ్ (25) ఫర్వాలేదనిపించాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/17) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని పడగొట్టాడు. తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... తాజా ఫలితంతో 1–1తో టి20 సిరీస్ సమంగా ముగిసింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. సూర్య సిక్సర్ల జోరు... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. గిల్ (12), తిలక్ వర్మ (0)లను వరుస బంతుల్లో కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్‌లో యశస్వి మాత్రం దూకుడు కనబరుస్తూ మార్క్రమ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. నాలుగో స్థానంలో వచ్చిన సూర్య తనదైన శైలిలో ఆరంభం నుంచి విరుచుకుపడటంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 62 పరుగులకు చేరింది. మధ్యలో కొంత నెమ్మదించిన యశస్వి 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఫెలుక్వాయో ఓవర్లో సూర్య చెలరేగిపోయాడు. వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మూడో వికెట్‌కు సూర్యతో 70 బంతుల్లోనే 112 పరుగులు జోడించిన అనంతరం యశస్వి వెనుదిరిగాడు. రింకూ సింగ్ (14) ఈసారి ప్రభావం చూపలేకపోగా, జితేశ్ (4), జడేజా (4) విఫలమయ్యారు. మరోవైపు సూర్య మాత్రం తన జోరు కొనసాగించాడు. బర్జర్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాదిన అతను షమ్సీ ఓవర్లోనూ 4, 6 కొట్టాడు. 55 బంతుల్లో సూర్య సెంచరీ పూర్తి కాగా, 20వ ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. చివరి 4 ఓవర్లలో టీమిండియాను కట్టడి చేయడంలో సఫలమైన సఫారీ టీమ్ 40 పరుగులే ఇచ్చింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) హెన్డ్రిక్స్ (బి) షమ్సీ 60; గిల్ (ఎల్బీ) (బి) మహరాజ్ 8; తిలక్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 0; సూర్యకుమార్ (సి) బ్రీట్కే (బి) విలియమ్స్ 100; రింకూ (సి) (సబ్) స్టబ్స్ (బి) బర్జర్ 14; జితేశ్ (హిట్‌వికెట్) (బి) విలియమ్స్ 4; జడేజా (రనౌట్) 4; అర్‡్షదీప్ (నాటౌట్) 0; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–29, 2–29, 3–141, 4–188, 5–194, 6–199, 7–199. బౌలింగ్: బర్జర్ 4–0–39–1, మార్క్రమ్ 1–0–15–0, కేశవ్ మహరాజ్ 4–0– 26–2, విలియమ్స్ 4–0–46–2, ఫెలుక్వాయో 3–0–33–0, షమ్సీ 4–0–38–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్డ్రిక్స్ (రనౌట్) 8; బ్రీట్కే (బి) ముకేశ్ 14; మార్క్రమ్ (సి) యశస్వి (బి) జడేజా 25; క్లాసెన్ (సి) రింకూ (బి) అర్‡్షదీప్ 5; మిల్లర్ (బి) కుల్దీప్ 35; ఫెరీరా (బి) కుల్దీప్ 12; ఫెలుక్వాయో (సి) అండ్ (బి) జడేజా 0; మహరాజ్ (బి) కుల్దీప్ 1; బర్జర్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; విలియమ్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో ఆలౌట్) 95. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–42, 4–42, 5–75, 6–82, 7–89, 8–89, 9–94, 10–95. బౌలింగ్: సిరాజ్ 3–1–13–0, ముకేశ్ 2–0–21–1, అర్‡్షదీప్ 2–0–13–1, జడేజా 3–0–25–2, తిలక్ 1–0–4–0, కుల్దీప్ 2.5–0–17–5. -
భారత బౌలర్ల దెబ్బకు తలవంచక తప్పలేదు.. అయినా ఇంగ్లండ్‌కు ఆ గోల్డెన్ ఛాన్స్!
ICC WC 2023- Champions Trophy 2025: లక్నోలో టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.. భారత ఓపెనర్లు బ్యాటింగ్‌కు సిద్ధమయ్యారు.. ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లే బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఆది నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లకు సవాలు విసిరాడు. ఈ క్రమంలో.. మరో పేసర్ క్రిస్ వోక్స్ 4వ ఓవర్లో గిల్‌ను బౌల్డ్ చేయడం ద్వారా ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం ఇచ్చాడు. బౌలర్లు మెరుగ్గానే ఆడారు ఏడో ఓవర్లో మళ్లీ రంగంలో దిగిన విల్లే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రూపంలో బిగ్ వికెట్ సాధించి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత 12వ ఓవర్లో క్రిస్ వోక్స్ శ్రేయస్ అయ్యర్(4)ను మూడో వికెట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 36.5 ఓవర్ వరకు ఓపికగా క్రీజులో నిలబడి 87 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(39), సూర్యకుమార్ యాదవ్(49) రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగుల నామమాత్రపు స్కోరు చేసింది. దీంతో వరుస పరాజయాలతో డీలా పడ్డ ‘డిఫెండింగ్ చాంపియన్’ మ్యాచ్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి గెలవడం ఖాయమే అని ఇంగ్లండ్ జట్టు అభిమానులు అంచనా వేశారు. అయితే, టీమిండియా బౌలర్ల ముందు ఇంగ్లిష్ బ్యాటర్ల పప్పులు ఉడకలేదు. టీమిండియా బౌలర్ల దెబ్బకు తలవంచిన ఇంగ్లండ్ భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలింది. బట్లర్ బృందం ఆట కట్టించడంలో వీరిద్దరితో పాటు తాను రేసులో ఉన్నానన్నంటూ టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మిడిలార్డర్‌ను దెబ్బకొట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్రిస్ వోక్స్ రూపంలో తానూ ఓ వికెట్ తీశాడు. మొత్తంగా బుమ్రా 3, షమీ 4 వికెట్లతో దుమ్ములేపగా.. కుల్దీప్ ఇంగ్లండ్ సారథి బట్లర్, ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. View this post on Instagram A post shared by ICC (@icc) పాయింట్ల పట్టికలో అట్టడుగున డిఫెండింగ్ చాంపియన్ వెరసి 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో మరో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టీమిండియా స్థాయిని అందుకోలేక చతికిలపడింది. వరుస ఓటములతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున అతుక్కుపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ అన్న హోదాకు ఏమాత్రం న్యాయంచేయక అవమానాల పాలైన ఇంగ్లండ్.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడుతుందా లేదా అన్న దుస్థితికి చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వన్డే వరల్డ్‌కప్-2023 పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచిన జట్లకే చాంపియన్స్ ట్రోఫీ ఆడే అర్హత దక్కుతుంది. దీంతో ఇంగ్లండ్‌కు మిగిలిన మ్యాచ్‌లలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే, ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఆడిన ఆరింటిలో ఐదు ఓడినప్పటికీ ఇంగ్లండ్‌కు ఇంకా టాప్-7లో నిలిచే అవకాశం ఉంది. ఆ సమీకరణలు ఇలా.. నంబర్ 1: ఇంగ్లండ్‌కు ఈ ఈవెంట్లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తదుపరి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో బట్లర్ బృందం పోటీపడాల్సి ఉంది. ఈ మూడింటిలో రెండు తప్పక గెలవాలి. ►ఆస్ట్రేలియా ఆరంభంలో విఫలమైనా ఇప్పుడు సెమీస్ రేసులో దూసుకుపోతోంది. కాబట్టి కంగారూలపై నెగ్గాలంటే ఇంగండ్ చెమటోడ్చకతప్పదు. ►మరోవైపు.. నెదర్లాండ్స్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై సంచలన విజయాలతో జోరు మీదుంది. మరి స్కాట్ ఎడ్వర్డ్స్ బృందాన్ని కట్టడి చేయడం బట్లర్ అండ్ కో తో అవుతుందో లేదో చూడాలి. ►ఇక పాకిస్తాన్.. నిలకడలేని జట్టుకు మారుపేరుగా పాక్‌కు అపఖ్యాతి ఉంది. ఈ టోర్నీ ఆరంభం ముందు సెమీస్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న బాబర్ ఆజం సేన వరుస పరాజయాలతో డీలా పడింది. ►అయినప్పటికీ సాంకేతికంగా సెమీస్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంగ్లండ్‌తో సహా తమకు మిగిలిన అన్ని మ్యాచ్‌లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ఖాయం. నంబర్ 2: ►పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న నెదర్లాండ్స్ తమకు మిగిలిన మూడు మ్యాచ్లలనూ ఓడిపోవాలి. అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, టీమిండియా చేతిలో చిత్తు కావాలి. నంబర్ 3: ►టేబుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింట ఓడిపోవాలి. ►పై మూడు జరిగితేనే ఇంగ్లండ్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడే అవకాశం ఉంటుంది. లేదంటే బట్లర్ కెప్టెన్సీ కెరీర్లో ఇదొక మచ్చలా మిగిలిపోతుంది. చదవండి: WC 2023: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ ఒక్క గండం గట్టెక్కితే! వరల్డ్ రికార్డు మనదే -
పాక్‌కు చుక్కలు.. ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు! అతడొక్కడే..
ICC ODI World Cup 2023- India vs Pakistan: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు అదరగొట్టారు. అద్భుత బౌలింగ్‌తో పాకిస్తాన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు. మొతేరాలో వికెట్ల మోత మోగించారు. ఐసీసీ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లో దాయాదులు భారత్-పాక్ తలపడుతున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాయకుడి నమ్మకాన్ని నిలబెడుతూ.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేస్తూ శుభారంభం అందించాడు. తొలి వికెట్ అందించిన సిరాజ్ వరుస ఓవర్లలో మహ్మద్ సిరాజ్‌తో కలిసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో ఎనిమిదో ఓవర్లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(20)ను ఎల్బీడబ్ల్యూ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) 12.3వ ఓవర్లో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(36)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత 24.3వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు అంపైర్ కాల్‌తో లైఫ్ లభించగా.. అతడు 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు అయితే, ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత మూడో బంతికి సిరాజ్.. బాబర్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి టీమిండియాకు మూడో వికెట్ అందించాడు. అనంతరం చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 33వ ఓవర్లో అద్భుతం చేశాడు. రెండో బంతికి సౌద్ షకీల్(6)ను ఎల్బీడబ్ల్యూ చేసిన కుల్దీప్.. ఆఖరి బాల్‌కు ఇఫ్తికర్ అహ్మద్(4)ను బౌల్డ్ చేశాడు. బుమ్రా వరుస ఓవర్లలో ఆ ఇద్దరినీ బౌల్డ్ చేసి ఇక 34 ఓవరల్లో పాక్ స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 49వ పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. బుమ్రా సంచలన రీతిలో అతడిని బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ మరుసటి ఓవర్లో షాదాబ్ ఖాన్‌ను కూడా బౌల్డ్ చేసి పారేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) మనబౌలర్ల దెబ్బ మామూలుగా లేదు ఇలా వరుస వికెట్ల క్రమంలో హార్దిక్ పాండ్యా మహ్మద్ నవాజ్(4)ను.. రవీంద్ర జడేజా హసన్ అలీ(12), హ్యారిస్ రవూఫ్(ఎల్బీడబ్ల్యూ- 2)లను పెవిలియన్‌కు పంపడంతో పాకిస్తాన్ కథ 42.5 ఓవర్లకే ముగిసిపోయింది. ఐదుగురూ సరిసమానంగా.. అతడొక్కడే పాపం టీమిండియా బౌలర్లలో పేసర్లు సిరాజ్, బుమ్రా, పాండ్యా.. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ తలా రెండు వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనంలో ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు. 2 ఓవర్ల బౌలింగ్ వేసిన పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం ఒట్టిచేతులతో మిగిలిపోయాడు. 36 పరుగుల తేడాలో పాక్ 8 వికెట్లు కోల్పోయిందంటే మన బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ సంచలన స్పెల్స్‌తో పాక్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేయడంతో టీమిండియా బౌలర్లపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 192 పరుగుల విజయ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని టీమిండియా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో పాక్‌పై ఎనిమిదో విజయం నమోదు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: న్యూజిలాండ్‌కు బిగ్.. కేన్ మామ వరల్డ్‌కప్ నుంచి ఔట్! View this post on Instagram A post shared by ICC (@icc) -
కుల్దీప్ స్పిన్ మయాజాలం.. ఒకే ఓవర్లలో 2 వికెట్లు! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 33 ఓవర్లో రెండో బంతికి సౌద్ షకీల్‌ను ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపిన కుల్దీప్.. అదే ఓవర్లో ఆఖరి బంతికి ఇఫ్తికర్ అహ్మద్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్ తన 10 ఓవర్ల కోటాలో కేవలం 35 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కుప్పకూలిన పాకిస్తాన్.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లు కన్పించిన పాకిస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్, బుమ్రా, హార్దిక్, జడేజా తలా రెండు వికెట్లతో చెలరేగారు. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50),మహ్మద్ రిజ్వాన్(49) టాప్ స్కోరర్లగా నిలిచారు. చదవండి: ODI WC 2023: సిరాజ్ సూపర్ డెలివరీ.. బాబర్ ఆజం ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: అందరిలా కాదు! నెట్స్‌లో శ్రమించిన కోహ్లి.. వీడియో వైరల్
సొంతగడ్డపై మరోసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఆడేందుకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సన్నద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్ కోసం బుధవారమే రన్‌మెషీన్ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్ బౌలర్లతో పాటు టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ బ్యాటింగ్ చేస్తూ బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. కాగా గురువారం (అక్టోబరు 5) ఇంగ్లండ్- న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్-2023కి తెరలేచింది. ఈ క్రమంలో అక్టోబరు 8న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా.. విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తదితరులు నెట్స్‌లో చెమటోడ్చారు ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా కోహ్లి సుమారు రెండున్నర గంటల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. మిగతా వాళ్లతో పోలిస్తే అదనంగా 45 నిమిషాల పాటు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అంకితభావానికి మారుపేరైన కోహ్లి 2011 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2015, 2019(కెప్టెన్) ఎడిషన్లలోనూ ఆడాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ టీమిండియాకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో మరోమారు సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ జరుగుతున్న తరుణంలో కింగ్ రెండోసారి ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసీస్‌తో మ్యాచ్ కోసం గురువారమే చెన్నైకి చేరుకున్న టీమిండియా కొత్తగా ఆరెంజ్ కలర్ జెర్సీలో ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమైంది. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
WC 2023: ఈసారి ఆ అవార్డు అతడికే.. ఫైనల్లో కివీస్‌తో: మాజీ పేసర్
ICC World Cup 2023:‘‘అప్పుడు.. యువీ పాజీ జట్టు కోసం ఏం చేశాడో తెలుసుగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అతడి సొంతమైంది. ఈసారి అలాంటి ఆల్‌రౌండర్ ఎవరైనా ఉన్నారా అంటే అది హార్దిక్ పాండ్యానే. అతడు ఈసారి ఆ అవార్డు అందుకునే ఛాన్స్ ఉంది. టీమిండియాకు అత్యంత ప్రధానమైన ఆటగాడు’’ అని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2011లో యువరాజ్ సింగ్ మెరుపుల మాదిరే ఈసారి పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతం చేయగలడని జోస్యం చెప్పాడు. అదే విధంగా హార్దిక్‌తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచే అవకాశాలున్నాయని శ్రీశాంత్ పేర్కొన్నాడు. వాళ్లిద్దరు కూడా ఇక అవార్డుకు మూడో పోటీదారు జస్ప్రీత్ బుమ్రా అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ‘‘హార్దిక్ ఫాస్టెస్ట్ హండ్రెడ్ మర్చిపోవదు.. అలాగే బుమ్రా రెండు 5- వికెట్ హాల్స్ గుర్తున్నాయి కదా! ఇక మునుపెన్నడూ లేని విధంగా.. కుల్దీప్ యాదవ్ అద్భుత స్పెల్‌తో దూసుకుపోతున్నాడు. ఇవన్నీ గమనిస్తే ఈసారి ఈ ముగ్గురిలో ఒకరికి అవార్డు రావడం ఖాయమని అనిపిస్తోంది’’ అని శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్‌ను చూస్తామని శ్రీశాంత్ తన అంచనా తెలియజేశాడు. ఈసారి కప్పు మనదే 2019లో సెమీస్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు భారత్.. కివీస్‌ను తప్పక ఓడించాలని ఆకాంక్షించాడు. ఈసారి కప్పు టీమిండియాదే అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. ఇక టీమిండియా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో.. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ ఆడనుంది. కాగా 2011లో సొంతగడ్డపై ధోని సేన విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్ర పోషించిన యువీ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక శ్రీశాంత్ కూడా ఈ జట్టులో సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! -
సిరాజ్ కాదు!; వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్ లెజెండ్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆసియా కప్-2023లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలిచి టోర్నమెంట్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా మరో మెట్టు ఎక్కింది టీమిండియా. శ్రీలంకను తమ సొంతగడ్డపై మట్టికరిపించి జయభేరి మోగించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్‌బౌలర్లు రోహిత్ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు. బుమ్రా మొదలెడితే.. సిరాజ్ చుక్కలు చూపించాడు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత అతడికి ‘రెస్ట్’ ఇవ్వడంతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా మిగిలిన మూడు వికెట్లు తీసి పనిపూర్తి చేశాడు. ఈ క్రమంలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్ కాగా.. 6.1 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్ ఛేదించి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023కు ముందే అంతర్జాతీయ టైటిల్ సాధించి నయా జోష్‌లో ఉంది. వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాకు ప్రధాన ఆయుధం కానున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఈ మాజీ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వారి అమ్ములపొదిలో ఉన్న ప్రధాన అస్త్రం హార్దిక్ పాండ్యా అనడంలో సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతరీతిలో ఇక కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్ ఈవెంట్లో పటిష్ట జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజానికి భారత జట్టు ఇప్పుడు పూర్తి సమతూకంగా కనిపిస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్ తమ ఆటగాళ్లకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూ ఇక్కడిదాకా తీసుకువచ్చింది. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందే వాళ్లు సరైన జట్టుతో అన్ని రకాలుగా సంసిద్ధమయ్యారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడి సూపర్-4లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ ఇక ఆసియా కప్-2023లో కుల్దీప్ యాదవ్ 9 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్ పాండ్యా బంతితోనూ రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్ ఆరంభం కానున్న విషయం విదితమే. అంతకంటే ముందు రోహిత్ సేన ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: నాకు మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్ Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
టాప్-10లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు.. నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. ఏకంగా ముగ్గురు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2023లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 154 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు ఎగబాకగా.. ఇదే ఆసియా కప్‌లో పాక్‌పై సూపర్ సెంచరీతో ఇరగదీసిన కోహ్లి రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రోహిత్ సైతం రెండు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో ప్లేస్‌కు చేరుకున్నాడు. గడిచిన ఐదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2019 జనవరిలో చివరిసారి ముగ్గురు టీమిండియా బ్యాటర్లు టాప్-10లో ఉన్నారు. నాడు శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. తాజాగా ర్యాంకింగ్స్‌లో భారత్‌తో పాటు పాక్‌కు చెందిన ఆటగాళ్లు కూడా ముగ్గురు టాప్-10లో ఉండటం విశేషం. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇమామ్ ఉల్ హాక్ ఓ స్థానం దిగజారి ఐదులో.. అతని సహచరుడు ఫఖర్ జమాన్ మూడు స్థానాలు కోల్పోయి 10వ స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ విషయానికొస్తే.. భారత టాప్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసియా కప్‌లో తన అద్భుత ప్రదర్శన (పాక్‌పై 5 వికెట్లు, శ్రీలంకపై 4 వికెట్లు) కారణంగా ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తన తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ రాణిస్తున్న జోష్ హాజిల్‌వుడ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సహచరుడు మిచెల్ స్టార్క్, కివీస్ పేస్ గన్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో సంయుక్తంగా నిలిచారు. కాగా, టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియా-పాకిస్తాన్-భారత్‌ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఆసీస్, పాక్‌లు చెరి 118 పాయింట్లతో 1,2 స్థానాల్లో కొనసాగుతుండగా.. 116 పాయింట్లతో టీమిండియా మూడో ప్లేస్‌లో నిలిచింది. మూడు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 2 పాయింట్లే కావడంతో వచ్చే వారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో తప్పక మార్పులు జరగవచ్చు. -
‘టీమిండియా మ్యాచ్ ఫిక్స్ చేశారు’.. మండిపడ్డ అక్తర్! మనోళ్లకు చేతకాదు..
Asia Cup 2023- India vs Sri Lanka: ‘‘అసలు మీరేం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందంటూ నాకు మీమ్స్‌తో కూడిన మెసేజ్‌లు వచ్చిపడుతున్నాయి. పాకిస్తాన్‌ను రేసు నుంచి తప్పించేందుకు టీమిండియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోతుందనేది వాటి సారాంశం. మీరంతా బాగానే ఉన్నారు కదా? అసలు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? శ్రీలంక బౌలర్లు శక్తిని కూడదీసుకుని ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. వెల్లలలగే, అసలంక కఠినంగా శ్రమించారు. 20 ఏళ్ల పిల్లాడి పట్టుదల చూశారా? ఆ 20 ఏళ్ల పిల్లాడి తాపత్రయాన్ని మీరు చూశారా? 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇదంతా చూస్తూ ఉన్నా.. ఇండియా నుంచి, ఇతర దేశాల అభిమానుల నుంచి నాకు ఒకటే ఫోన్ కాల్స్. ఈరోజు ఇండియా కావాలనే ఓడిపోతుందని ఒకటే వాగడం’’ అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే పోరాటం చూసిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడగలిగారో అర్థం కావడం లేదంటూ సోకాల్డ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో పాకిస్తాన్‌ను 228 పరుగులతో చిత్తు చేసిన భారత జట్టు.. మంగళవారం శ్రీలంకతో తలపడింది. తిప్పేసిన స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కొలంబోలో రోహిత్ సేన ఎలాంటి పొరపాటు చేయలేదు. పాక్‌తో మ్యాచ్ ముగిసిన 15 గంటల్లోపే మళ్లీ మైదానంలో దిగిన టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లంక స్పిన్నర్లు వెల్లలగే, చరిత్ అసలంక ధాటికి 213 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై వెల్లలగే బంతిని తిప్పేసి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. టీమిండియా- లంక ఫలితంపై అయితే, లక్ష్య ఛేదనలో లంక 172 పరుగులకే ఆలౌట్ కావడంతో అతడి పోరాటం వృథాగా పోయింది. 41 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నేరుగా ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏలో భారత జట్టుతో పాటు ఉన్న పాకిస్తాన్‌కు ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. లంకను రోహిత్ సేన ఓడించాల్సిందే! ఈ నేపథ్యంలోనే కొంతమంది టీమిండియా టాపార్డర్ విఫలం కావడం చూసి.. లంకను గెలిపించి పాక్‌ను రేసు నుంచి తప్పించేందుకు ఇలా ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయమై తనకు కాల్స్ వచ్చాయని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తెలిపాడు. వాళ్లంతా కష్టపడ్డారు.. మనోళ్లకు చేతకాదు ‘‘వాళ్లు ఎందుకు అలా అంటున్నారో అర్థం కాలేదు. అసలు టీమిండియా ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుంది? గెలిస్తే ఎంచక్కా ఫైనల్ చేరే అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటుంది? ఎలాంటి కారణాలు లేకుండా ఇలాంటి పిచ్చిపని ఎందుకు చేయాలనుకుంటుంది? లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడారు. కుల్దీప్ అద్భుతం చేశాడు. జట్టును గెలిపించేందుకు జస్ప్రీత్ బుమ్రా శక్తిమేర కష్టపడ్డాడు. ఇక లంక కుర్రాడు వెల్లలగే బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగలడు. కానీ మన వాళ్ల సంగతి వేరు. వాళ్ల నుంచి ఇలాంటి పోరాటం ఎప్పుడూ చూడలేదు. మన ఫాస్ట్‌బౌలర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా 10 ఓవర్లు బౌలింగ్ చేసినా గాయపడకుండా ఉంటే చూడాలని ఉంది. మన వాళ్లు కూడా పోరాటపటిమ కనబరచాలి’’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిస్తేనే ఫైనల్ బెర్తు ఖరారవుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? Super11 Asia Cup 2023 | Super 4 | India vs Sri Lanka | Highlightshttps://t.co/EI2KjpFup6#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023 -
Ind vs SL: టీమిండియా బ్యాటర్ల విషయంలో సందేహం లేదు.. కానీ బౌలర్లే!
Asia Cup 2023- India vs Sri Lanka: పాకిస్తాన్‌పై భారీ విజయం కంటే శ్రీలంక మీద లో స్కోరింగ్ మ్యాచ్‌లో గెలుపే టీమిండియాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టులోని కీలక బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనలతో కెప్టెన్‌కు పూర్తి భరోసా ఇచ్చారని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించారు ఆసియా కప్-2023 సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టిన విషయం తెలిసిందే. పటిష్ట పేస్ దళం కలిగిన పాకిస్తాన్‌తో పోరులో ఓపెనర్లు రోహిత్ శర్మ(56), శుబ్‌మన్ గిల్(58) అర్ధ శతకాలు సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(122), నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్(111) అజేయ శతకాలతో దుమ్ములేపారు. ఈ క్రమంలో 356 పరుగులు భారీ స్కోరు చేసిన రోహిత్ సేన.. పాక్‌ను 128 పరుగులకే కట్టడి చేసింది. తద్వారా ఏకంగా 228 పరుగులతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు. లంక స్పిన్‌కు టీమిండియా ఆలౌట్ ఇక మంళవారం నాటి మ్యాచ్‌లో మాత్రం లంక స్పిన్ దాటికి టీమిండియా ఆలౌటైంది. గిల్, కోహ్లి, రాహుల్ తదితరులు విఫలం కావడంతో కేవలం 213 పరుగులు మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో.. లో స్కోరును డిఫెండ్ చేసుకోవడంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. బుమ్రా రెండు, కుల్దీప్ నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్, పాండ్యా ఒక్కో వికెట్, జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 172 పరుగులకు లంక ఆలౌట్ కాగా.. 41 పరుగులతో గెలిచిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. బ్యాటర్ల విషయంలో సందేహం లేదు ఈ పరిణామాల నేపథ్యంలో గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ మీద 228 పరుగుల తేడాతో భారీ విజయం కంటే శ్రీలంక మీద గెలుపే భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. మన బ్యాటింగ్ యూనిట్ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. కానీ బౌలర్లు మాత్రం అయితే, గాయం తర్వాత తిరిగొచ్చిన జస్ప్రీత్ బుమ్రా.. ఎలా ఆడతాడు? కుల్దీప్ యాదవ్.. ఇతర బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనే ఆందోళన ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో కొలంబో పిచ్‌పై 213 పరుగులు స్కోరు కాపాడుకోవడం సానుకూలాంశం. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల శ్రీలంకపై ఇలాంటి గెలుపు వరల్డ్‌కప్‌నకు ముందు టీమిండియాకు బూస్ట్‌ను ఇస్తుంది. ఎందుకంటే.. బుమ్రా, కుల్దీప్ మంచి ఫైర్ మీద ఉన్నారు కదా! కెప్టెన్ ఇక మరింత ధీమాగా ముందుకు వెళ్లొచ్చు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. చదవండి: 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? అద్భుత క్యాచ్.. రోహిత్‌ను హత్తుకున్న కోహ్లి.. సెలబ్రేషన్ మామూలుగా లేదు! Edged & takennnnnnnnn! 😍🥳@Jaspritbumrah93 makes inroads! In the corridor of uncertainty and Boom Boom gets the edge! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/mjQ2xvqJdh — Star Sports (@StarSportsIndia) September 12, 2023 Sharp catch & goneeee! 👆@mdsirajofficial gets his first wicket of the night with a peach of a delivery!#TeamIndia have their tails up! 🔥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Nsn4bJG5n1 — Star Sports (@StarSportsIndia) September 12, 2023 As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర!
Asia Cup 2023- India vs Sri Lanka- Kuldeep Yadav Records: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా సూపర్-4 దశలో తొలుత పాకిస్తాన్‌పై.. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అదరగొట్టాడు. కొలంబోలో దాయాదితో పోరులో 8 ఓవర్ల బౌలింగ్‌లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఇక మంగళవారం అదే వేదికపై మరోసారి మెరిశాడు కుల్దీప్. టీమిండియా 213 పరుగుల లో స్కోరును కాపాడుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 9.3 ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. లంక టెయిలెండర్ మతీశ పతిరణను బౌల్డ్ చేసి.. టీమిండియా గెలుపును ఖరారు చేశాడు. 150 వికెట్ల క్లబ్లో అత్యంత వేగంగా ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. తద్వారా బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్.. తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర అదే విధంగా.. టీమిండియా దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్‌లను అధిగమించాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన తొలి భారత స్పిన్నర్‌గానూ కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లో ప్రవేశించింది. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు ►మహ్మద్ షమీ- 80 మ్యాచ్‌లలో.. ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో.. ►అజిత్ అగార్కర్- 97 మ్యాచ్‌లలో.. ►జహీర్ ఖాన్- 103 మ్యాచ్‌లలో.. ►అనిల్ కుంబ్లే- 106 మ్యాచ్‌లలో.. ►ఇర్ఫాన్ పఠాన్- 106 మ్యాచ్‌లలో.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన స్పిన్నర్లు ►సక్లెయిన్ ముస్తాక్- 78 మ్యాచ్‌లలో ►రషీద్ ఖాన్- 80 మ్యాచ్‌లలో ►అజంత మెండిస్- 84 మ్యాచ్‌లలో ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో ►ఇమ్రాన్ తాహిర్- 89 మ్యాచ్‌లలో. చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్ Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్ As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్
Asia Cup 2023- India vs Sri Lanka, Super Fours- Rohit Sharma Comments: ‘‘ఇలాంటి చాలెంజింగ్ పిచ్‌పై.. తీవ్రమైన ఒత్తిడితో కూడిన సందర్భంలోనూ రాణించడం సంతోషాన్నిచ్చింది. నిజానికి.. ఇలాంటి పిచ్‌లపై ఆడినపుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. మ్యాచ్ అద్భుతంగా సాగింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. బౌలర్లు మెరుగ్గా రాణించారని కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ప్రశంసించాడు. వెల్లలగే ఆకాశమే హద్దుగా కాగా ఆసియా కప్-2023 సూపర్-4 దశలో భాగంగా మంగళవారం భారత జట్టు శ్రీలంకతో తలపడింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్‌పై భారీ విజయం తర్వాత 15 గంటల్లోపే తిరిగి ఆరంభమైన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన 49.1 ఓవర్లలో 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. స్పిన్‌కు అనుకూలించిన కొలంబో పిచ్‌పై లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలగే ఆకాశమే హద్దుగా చెలరేగి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక చరిత్ అసలంక సైతం నాలుగు, తీక్షణ ఒక వికెట్ తీశారు. జడేజా, కుల్దీప్ కుల్దీప్ నాలుగు వికెట్లతో.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా రెండు, మహ్మద్ సిరాజ్, హార్దిక్‌పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అత్యధికంగా నాలుగు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు కూల్చారు. దీంతో 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. వాళ్ల వల్లే గెలిచాం ఈ నేపథ్యంలో విజయంపై స్పందించిన రోహిత్ శర్మ కొలంబో పిచ్ తమకు సవాల్ విసిరిందని పేర్కొన్నాడు. ఇలాంటి పిచ్‌పై 213 పరుగుల స్కోరును డిఫెండ్ చేయడం తేలిక కాదని.. ఏదేమైనా తమ బౌలర్లు మెరుగ్గా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని తెలిపాడు. ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ప్రతి బంతికి వికెట్ తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాడంటూ కొనియాడాడు. రాత్రికి రాత్రే మార్పులు రావని.. గత రెండేళ్లుగా బౌలింగ్‌పై దృష్టి సారించిన పాండ్యా.. కఠినంగా శ్రమిస్తున్నాడని రోహిత్ పేర్కొన్నాడు. అతడు అద్భుతం ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గతేడాది కాలంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడన్న రోహిత్ శర్మ.. హార్డ్వర్క్తోనే అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని ప్రశంసించాడు. లోపాలు సరిచేసుకుని నూతనోత్సాహంతో దూసుకుపోతున్నాడంటూ కొనియాడాడు. కాగా టీమిండియా- శ్రీలంక మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న లంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అర్ధ శతకం(53) సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్ As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 Cannot keep @imjadeja out of the game! 🤯 Rewarded for his disciplined bowling, Jaddu sends skipper @dasunshanaka1 packing!#SriLanka in trouble. Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/vsI2M1TTDr — Star Sports (@StarSportsIndia) September 12, 2023 Edged & takennnnnnnnn! 😍🥳@Jaspritbumrah93 makes inroads! In the corridor of uncertainty and Boom Boom gets the edge! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/mjQ2xvqJdh — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
నాలుగో స్థానానికి ఎగబాకిన సిరాజ్.. టాప్-10లో కుల్దీప్
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 30) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఎలాంటి చెప్పుకోదగ్గ మార్పులు చోటు చేసుకోలేదు. బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్ (877), బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్ (705), ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ (371) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. నాలుగులో గిల్.. తొమ్మిదిలో విరాట్ బ్యాటింగ్ విభాగం టాప్-10లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (నాలుగో స్థానం), విరాట్ కోహ్లి (తొమ్మిదో ప్లేస్) తమ స్థానాలను పదిలంగా కాపాడుకోగా.. డస్సెన్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, హ్యారీ టెక్టార్, డేవిడ్ వార్నర్, డికాక్, స్టీవ్ స్మిత్ 2, 3, 5, 6, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు. నాలుగో స్థానంలో సిరాజ్.. 10 స్థానానికి ఎగబాకిన కుల్దీప్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. మహ్మద్ సిరాజ్ ఓ స్థానం మెరుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్ యాదవ్ టాప్-10లోకి (10వ స్థానం) చేరాడు. మిచెల్ స్టార్క్, ముజీబ్, రషీద్, మ్యాట్ హెన్రీ, బౌల్ట్, ఆడమ్ జంపా, షాహీన్ అఫ్రిది 2, 3, 5, 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచారు. హార్ధిక్ ఒక్కడే.. ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్-20లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. షకీబ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నబీ, సికందర్ రజా, రషీద్ ఖాన్, అస్సద్ వలా, జీషన్ మక్సూద్, సాంట్నర్, హసరంగ, మెహిది హసన్, క్రిస్ వోక్స్ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-20లో (12) ఉన్నాడు. -
వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్! సంజూకు
Matthew Hayden On Indias World Cup Squad: వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్ డౌన్ మొదలైంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి ఆగ్రశ్రేణి టీమ్స్ ఇప్పటికే తమ ప్రిలిమనరీ జట్లను కూడా ప్రకటించాయి. మరోవైపు భారత జట్టు కూడా వరల్డ్‌కప్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియాకప్‌లో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో ఆసియాకప్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టునే వరల్డ్‌కప్‌కు కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 15 మంది సభ్యులను ఖారారు చేసి సెప్టెంబర్ 15లోపు ఐసీసీకి బీసీసీఐ సమర్పించనుంది. కాగా ఈ టోర్నీతో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే.. ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యలతో కూడిన భారత జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఎంచుకున్నాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్,యజువేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. అదే విధంగా వికెట్ కీపర్లగా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఇద్దరికీ హేడన్ ఛాన్స్ ఇచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, అక్షర్‌పటేల్‌కు మాత్రమే చోటు దక్కింది. అదే విధంగా స్పెషలిస్ట్ బ్యాటర్లగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌కు హేడన్ అవకాశం కల్పించాడు. మరోవైపు సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్ రూపంలో నలుగురు పేసర్లు హేడన్ ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు. హేడన్ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ మరియు అక్షర్ పటేల్. చదవండి: IBSA World Games 2023: భారత్‌కు సిల్వర్ మెడల్ -
చహల్‌కు జట్టులో స్థానం పొందే అర్హతే లేదు: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup 2023: ‘‘ప్రస్తుతం యుజువేంద్ర చహల్‌కు టీమిండియాలో స్థానం దక్కించుకునే అర్హత లేదు. గత కొంతకాలంగా అతడు నిలకడలేమి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతూ జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తున్నాడు. చహల్‌ను కాదని సెలక్టర్లు కుల్దీప్ను ఎంపిక చేసి సరైన నిర్ణయం తీసుకున్నారు’’ పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా అన్నాడు. ఆసియా కప్-2023కి ఎంపిక చేసిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ చహల్‌కు స్థానం ఇవ్వకపోవడమే మంచిదైందని ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజీ చహల్‌కు మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. అందుకే చహల్‌పై వేటు అతడిని కాదని మరో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ఈ విషయం గురించి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు జట్టులో చోటు లేదని.. ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి చూడలేమని స్పష్టం చేశాడు. అదే విధంగా.. ఆసియా కప్ జట్టు జాబితా నుంచే వన్డే వరల్డ్‌కప్‌నకు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో.. కుల్దీప్ మెరుగ్గా రాణిస్తే ఐసీసీ ఈవెంట్‌పై కూడా చహల్ ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది. అంతటి మొనగాడు లేడు..అయినా ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు చహల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై మేనేజ్మెంట్ తీరును విమర్శిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్పిన్నర్లలో చహల్‌ను మించి మొనగాడు లేడని.. అలాంటిది తనకు జట్టులో చోటు లేకపోవడం ఏమిటని భజ్జీ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాత్రం బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. చదవండి: అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను భయపడ్డాను: గంభీర్ -
అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్..
India Asia Cup 2023 squad: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే.. అదే సమయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్న అతడి ఆటిట్యూడ్‌తో అభిమానుల మనసు గెలవడం విశేషం. ఆసియా కప్-2023లో పాల్గొనే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌లోనూ? వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్‌కు ప్రొవిజినల్ టీమ్‌గా భావిస్తున్న ఈ జట్టులో స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌వైపే మొగ్గు చూపింది మేనేజ్మెంట్. ఈ చైనామన్ స్పిన్నర్‌తో పాటు స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు చోటిచ్చింది. క్రిప్టిక్ ట్వీట్‌తో చహల్ ఈ నేపథ్యంలో నిరాశకు గురైన యుజీ చహల్ క్రిప్టిక్ ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. మబ్బుల్లో దాగిన సూర్యుడు... మళ్లీ ప్రకాశిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీలతో క్యాప్షన్ ఏమీ లేకుండానే పోస్ట్ చేశాడు. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అన్న అర్థంలో నర్మగర్భ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. ‘‘అవును.. నువ్వు చెప్పిందే నిజమే భాయ్. మళ్లీ నీకు మంచి రోజులు వస్తాయి’’ అని బదులిస్తున్నారు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ చహల్‌ను జట్టు నుంచి తప్పించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై నో కుల్-చా! చోటు లేదు గనుకే అతడిని ఎంపిక చేయలేదని, అయితే.. వన్డే వరల్డ్‌కప్‌లో చహల్ దారులు మూసుకుపోలేదని హిట్‌మ్యాన్ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి జట్టులో చూసే అవకాశం లేదని పేర్కొన్నాడు. ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు జట్టులో చోటివ్వలేమని.. చహల్ కంటే కుల్దీప్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో చైనామన్ బౌలర్‌కే ఓటు వేశామని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో చహల్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. అప్పుడు రోహిత్ సైతం.. ఇక గతంలో జట్టులో చోటు దక్కని నేపథ్యంలో ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ సైతం.. ‘‘సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు’’ అని ట్విటర్లో రాసుకొచ్చాడు. 2018లో టెస్టుల్లో అతడికి స్థానం లేకపోవడంతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే రీతిలో చహల్ సైతం తన బాధను వ్యక్తపరుస్తూనే.. మళ్లీ తిరిగివస్తాననే ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. చదవండి: WC 2023: ధావన్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్ ⛅️——> 🌞 — Yuzvendra Chahal (@yuzi_chahal) August 21, 2023 Sun will rise again tomorrow 😊 — Rohit Sharma (@ImRo45) July 18, 2018 -
అందుకే చహల్‌పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు
India Asia Cup 2023 squad: ‘‘టీమిండియా తరఫున అత్యద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. టెర్రిఫిక్ పర్ఫార్మర్. కానీ.. కొన్నిసార్లు సమతూకమైన జట్టును ఎంపిక చేసే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న వాళ్లలో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తను బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కూడా చాలా బాగుంది. నిజానికి ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం కష్టం. 15 మందితో కూడిన జట్టు అయితే, ఇప్పుడున్న వాళ్లలో ఒకరిద్దరిని తప్పించాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తూ చహల్ డ్రాప్! లక్కీగా 17 మందికి చోటు ఉంది కాబట్టి.. సరిపోయింది. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ అతడిని వదులుకోవాల్సి వచ్చింది. నిజానికి ప్రస్తుతం.. తన కంటే కుల్దీప్ ఓ అడుగు ముందే ఉన్నాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో మాకు మెరుగైన ఆప్షన్ అనిపించాడు. అందుకే చహల్ మిస్ అయ్యాడు’’ అని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆసియా కప్-2023 వన్డే టోర్నీ నేపథ్యంలో.. బీసీసీఐ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై మాత్రం మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. అందుకే చహల్‌పై వేటు! జట్టు ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చహల్ గురించి ప్రశ్న ఎదురుకాగా అజిత్ అగార్కర్ పైవిధంగా స్పందించాడు. ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్లే చహల్‌ను తప్పించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కుల్దీప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆసియాకప్ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆడనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. అంతకంటే ముందు అంటే.. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనుంది. మరి వరల్డ్‌కప్‌లో..? ఈ క్రమంలో ప్రపంచకప్‌నకు ఆసియా కప్ జట్టును ప్రొవిజినల్ టీమ్‌గా పరిగణిస్తున్న తరుణంలో చహల్‌పై వేటు పడటం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ కుల్దీప్‌నకు మద్దతుగా నిలవగా.. రోహిత్ శర్మ మాత్రం చోటు లేదు కాబట్టే అతడిని జట్టులోకి తీసుకోలేదన్నాడు. వరల్డ్‌కప్‌లో చహల్‌కు దారులు మూసుకుపోలేదని స్పష్టం చేయడం గమనార్హం. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో యుజీ చహల్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ గత రెండు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ తరఫున అదరగొడుతున్నాడు. చదవండి: Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్.. Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మ ఇన్.. పాపం సంజూ! -
సత్తా చాటిన శుబ్‌మన్, కుల్దీప్.. కెరీర్లోనే బెస్ట్ ర్యాంక్
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సత్తాచాటాడు. తన టీ20 కెరీర్లో ఉత్తమ ర్యాంక్‌ను గిల్ సాధించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ 43 స్ధానాలు ఎగబాకి 25వ స్ధానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో గిల్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గిల్ 77 పరుగులు సాధించాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా గిల్ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. మరోవైపు నాలుగో టీ20లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ ఏకంగా 1000 స్ధానాలు ఎగబాకి 88వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జైశ్వాల్ 84 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అద్బతప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ 907 రేటింగ్ పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సెకెండ్ ర్యాంక్‌లో పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్(811) ఉన్నాడు. బౌలర్ల విషయానికి వస్తే.. భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 23 స్థానాలు మెరుగుపర్చుకుని 28వ ప్లేస్‌కు చేరుకున్నాడు. చదవండి: IND vs WI: ఐర్లాండ్‌తో తొలి టీ20.. సంజూ శాంసన్‌పై వేటు! సిక్సర్ల కింగ్ ఎంట్రీ -
Ind Vs WI: అదరగొట్టిన అర్ష్‌దీప్! ఒకే ఓవర్లో కుల్దీప్.. వీడియోలు వైరల్
West Indies vs India, 4th T20I: అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా నాలుగో టీ20 ఆరంభంలోనే టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వెస్టిండీస్‌కు షాకిచ్చాడు. టాస్ గెలిచి దూకుడుగా బ్యాటింగ్ మొదలెట్టిన కరేబియన్లకు రెండో ఓవర్లోనే తన పేస్ పదును రుచి చూపించాడు.7 బంతుల్లో 17 పరుగులతో జోరు మీదున్న ఓపెనర్ కైల్ మేయర్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఓపెనర్ల పని పట్టి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసిన మేయర్స్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో రెండో వికెట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు అర్ష్‌దీప్. ఆరో ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్(18)ను అవుట్ చేశాడు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 ఒకే ఓవర్లో రెండు వికెట్లు ఇదిలా ఉంటే.. టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో బిగ్ హిట్టర్లు నికోలస్ పూరన్(1), రోవ్‌మన్ పావెల్(1)ను పెవిలియన్‌కు పంపాడు. ఏడో ఓవర్ ఆరంభంలోనే గూగ్లీతో పూరన్‌ను బోల్తా కొట్టించగా.. సూర్యకుమార్ యాదవ్ బంతిని ఒడిసిపట్టడంలో ఎటువంటి జాప్యం చేయలేదు. Two wickets in the 1st over of the spell! Chahal in 1st T20I Kuldeep today 💪#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/Vos81nSMbx — FanCode (@FanCode) August 12, 2023 వైరల్ వీడియోలు దీంతో వెస్టిండీస్ మూడో వికెట్ కోల్పోయింది. అయితే, మూడు బంతుల వ్యవధిలోనే కరేబియన్ జట్టు కెప్టెన్ పావెల్ ఇచ్చిన క్యాచ్‌ను శుబ్‌మన్ గిల్ అందుకోవడంతో కుల్దీప్ ఖాతాలో రెండో వికెట్ చేరింది. ఇలా ఆదిలోనే వెస్టిండీస్‌ను దెబ్బ కొట్టిన టీమిండియా బౌలర్లు అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్‌ల బౌలింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇప్పటికే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఫ్లోరిడాలో గెలిచి 2-2తో సమం చేయాలని హార్దిక్ సేన పట్టుదలగా ఉంది. తుది జట్లు టీమిండియా: యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రన్ హెట్‌మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, ఒబెడ్ మెకాయ్. -
సత్తా చాటిన శుభ్‌మన్.. దుమ్మురేపిన తిలక్ వర్మ
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 9) విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. విండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించగా.. టీ20 సిరీస్‌లో ఇరగదీస్తున్న తిలక్ వర్మ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో ఓ హాఫ్‌సెంచరీ సాయంతో 126 పరుగులు చేసిన శుభ్‌మన్ 2 స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. 3 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీల సాయంతో 184 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 9 స్థానాలు మెరుగుపర్చుకుని 36వ ప్లేస్‌కు చేరుకున్నాడు. టీ20ల విషయానికొస్తే.. విండీస్‌తో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో ఇరగదీసిన తిలక్ (39, 51, 49 నాటౌట్).. అరంగేట్రంలోనే 21 స్థానాలు మెరుగుపర్చుకుని 46వ స్థానానికి చేరాడు. టీ20 బౌలింగ్ విషయానికొస్తే.. విండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కుల్దీప్ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఫార్మాట్లో కుల్దీప్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకాడు. టీ20 బౌలర్ల విభాగంలో భారత బౌలర్లు అక్షర్ 7 స్థానాలు, హార్ధిక్ పాండ్యా ఓ స్థానం మెరుగపర్చుకుని 33, 37 స్థానాల్లో నిలిచారు. విండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ రాణించిన హార్ధిక్.. బ్యాటింగ్‌లో 10 స్థానాలు, ఆల్‌రౌండర్ల విభాగంలో 5 స్థానాలు మెరుగుపర్చుకుని 71, 11 స్థానాల్లో నిలిచాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు (8) పడగొట్టిన శార్దూల్ ఠాకూర్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 30వ ప్లేస్‌కు చేరుకున్నాడు. పై పేర్కొన్న మార్పులు మినహా వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులు జరగలేదు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ఫకర్ జమాన్ టాప్-3లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ టాప్-3లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. వన్డేల్లో హాజిల్‌వుడ్, స్టార్క్, రషీద్ ఖాన్ టాప్-3లో ఉండగా.. టీ20ల్లో రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, హసరంగ టాప్‌లో ఉన్నారు. వన్డేల్లో భారత ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్‌తో పాటు విరాట్ కోహ్లి (9) టాప్-10లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో వన్డేల్లో మహ్మద్ సిరాజ్ (4), కుల్దీప్ (10) టాప్-10లో ఉండగా.. టీ20ల్లో భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేరు. టీ20ల్లో మెరుగైన ర్యాంకింగ్ కలిగిన భారత బౌలర్‌గా అర్షదీప్ (17) ఉన్నాడు. -
కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర.. తొలి భారత బౌలర్‌గా!
కరేబియన్ గడ్డపై టీమిండియా వెటరన్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శరన కనబరిచిన కుల్దీప్ యాదవ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ అధిక్యాన్ని 1-2కు భారత్ తగ్గించింది. కుల్దీప్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మార్క్‌ను అందుకున్న భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 30 మ్యాచ్‌ల్లో కుల్దీప్ ఈ ఫీట్ సాధించాడు. అంతకముందు ఈ రికార్డు యజువేంద్ర చహల్ పేరిట ఉండేది. చాహల్ 34 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌తో చాహల్ రికార్డును కుల్దీప్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టీ20ల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. విండీస్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్.. 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెటరన్ పేపసర్ భువనేశ్వర్ కుమార్ రికార్డును యాదవ్ బ్రేక్ చేశాడు. భువీ 18 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Yashasvi Jaiswal: ఇషాన్‌ను కాదని నిన్ను ఆడిస్తే ఏం చేశావు? అప్పుడు సెంచరీ.. ఇప్పుడు రెండు సున్నాలు తగ్గాయంతే! ఫ్యాన్స్ ఫైర్ Charles ☝️ Nicholas Pooran ☝️ Brandon King ☝️ Kuldeep Yadav's sensational outing against the Windies! 🔥#KuldeepYadav #WIvsIND #Cricket pic.twitter.com/2jRC1Fs2Re — OneCricket (@OneCricketApp) August 8, 2023 -
వెస్టిండీస్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్
వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటన చివరి అంకానికి చేరుకుంది. కరేబియన్ టూర్లో చివరి సిరీస్ ఆడేందుకు భారత జట్టు సిద్దమైంది. ట్రినిడాడ్ వేదికగా గురువారం నుంచి భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. బ్రియాన్ లారా స్టేడియంలో జరగనున్న తొలి టీ20లో సత్తా చాటేందుకు హార్దిక్ పాండ్యా సారధ్యంలోని యువ భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్‌కు రోహిత్, కోహ్లిలకు సెలక్టర్లు ముందే విశ్రాంతి ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ మరో రెండు వికెట్ల సాధిస్తే.. టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలు రాయిని అందుకుంటాడు. తద్వారా టీ20 క్రికెట్లో 4000 పరుగులతో పాటు 150 వికెట్లు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. టీ20 క్రికెట్లో హార్దిక్ ఇప్పటివరకు 4348 పరుగులతో పాటు 148 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మరో నాలుగు వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్ల పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో చేరుతాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా యుజువేంద్ర చాహల్‌ను కుల్దీప్ అధిగమిస్తాడు. చాహల్ 34 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించాడు. కుల్దీప్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ! హైదరాబాదీ కూడా -
వన్డే ర్యాంకింగ్స్.. అదరగొట్టిన ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లు తన స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ 43వ ర్యాంక్, బౌలర్లలో కుల్దీప్ 14వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. విధ్వంసక ఓపెనర్ ఇషాన్ రెండో టెస్టు, మూడు వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు. దాంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 14 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ కూడా ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకొని 14 ర్యాంకులో నిలిచాడు. ఈ సిరీస్‌లో కుల్దీప్ మూడు వన్డేలు కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే వన్డే సిరీస్‌లో రెండు, మూడు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లి, రోహిత్‌లు ఒక్కో స్థానం కోల్పోయారు. ఇంతకుముందు టాప్ 10లో హిట్‌మ్యాన్ 11వ స్థానానికి, 8వ స్థానంలో ఉన్న కోహ్లీ 9వ ర్యాంక్‌కి పడిపోయారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో గాయంతో వన్డే సిరీస్‌కు దూరమైన మహ్మద్ సిరాజ్ ఒక స్థానం దిగజారి 677 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. 886 పాయింట్లతో బాబర్ ఆజం తొలి స్థానంలో ఉండగా.. వాండర్ డుసెన్ 777 పాయింట్లతో రెండు, 755 పాయింట్లతో ఫఖర్ జమాన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి శుబ్‌మన్ గిల్ 724 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ 705 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. 686 పాయింట్లతో మిచెల్ స్టార్క్, 682 పాయింట్లతో రషీద్ ఖాన్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత R Ashwin: 'టీమిండియా బజ్‌బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి' -
కుల్దీప్ను అంత మాటన్నాడా? ‘చెత్త’ వాగుడు కట్టిపెట్టు సూర్య.. ఇదేం పద్ధతి!
Suryakumar Slammed For On Field Comments On Kuldeep: టీ20 ఫార్మాట్లో దుమ్మురేపుతున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 50 ఓవర్ల క్రికెట్లో 25 మ్యాచ్‌లు ఆడిన అతడు 476 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 64. అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక ఇక శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో నంబర్ 4లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు సూర్య. అయితే, వెస్టిండీస్ పర్యటనలో రెండు వన్డేల్లోనూ అతడు విఫలమయ్యాడు. బార్బడోస్ మ్యాచ్‌లలో వరుసగా 19, 24 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో స్కై ఏదో మ్యాజిక్ చేస్తాడనుకుంటే నిరాశపరుస్తున్నాడంటూ అభిమానులు అతడిని ట్రోల్ చేస్తున్నారు. అయితే, రెండో వన్డే సందర్భంగా ఆటతో కాకుండా తన ‘అనుచిత’ ప్రవర్తనతో ట్రోలర్స్ చేతికి చిక్కాడు సూర్య. ఇంతకీ ఏం జరిగిందంటే.. కుల్దీప్ యాదవ్‌ను అలా అనగానే కెన్నింగ్టన్ ఓవల్‌లో విండీస్‌తో రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 181 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు దూకుడుగానే ఆడింది. ముఖ్యంగా కెప్టెన్ షాయీ హోప్.. హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. విండీస్ ఇన్నింగ్స్ 29వ ఓవర్లో.. విజయానికి 48 పరుగుల దూరంలో ఉన్న సమయంలో.. సూర్యకుమార్ యాదవ్ కవర్ పొజిషిన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయానికి భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఏడో ఓవర్ వేసేందుకు వచ్చాడు. నువ్వు మా కచ్రావి ఈ క్రమంలో కుల్దీప్ను ఉద్దేశించి.. ‘‘నువ్వు మా కచ్రావి’’ అంటూ సూర్య కామెంట్ చేశాడు. ఇది స్టంప్‌మైక్‌లో రికార్డైంది. ఇందుకు బదులివ్వని కుల్దీప్ తన పని తాను చేసుకుపోయాడు. అయితే, టీమిండియా ఫ్యాన్స్ మాత్రం సూర్య మాటలను తేలికగా తీసుకోలేకపోయారు. కుల్దీప్ ఈ విధంగా బదులిచ్చేవాడు అంటూ తమదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘ముందు మీరేగా పెంట చేసింది. ఇంక నేనేం చేయగలను’’ అని అన్నాడని ఓ యూజర్ పేర్కొన్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ బ్లాక్‌బ్లస్టర్ ‘లగాన్’లోని కచ్రా(స్పిన్ బౌలింగ్ చేసే వ్యక్తి)ని ప్రస్తావిస్తూ సూర్య ఈ విధంగా మాట్లాడి ఉంటాడన్న అర్థంలో కుల్దీప్ రిప్లే ఇలా ఉంటుందని పేర్కొన్నాడు. చెత్తలాగే కనిపిస్తాలే! అయితే, మరో యూజర్ మాత్రం.. కచ్రా(హిందీలో చెత్త అని అర్థం) పదాన్ని ఉపయోగించడాన్ని తప్పుబడుతూ.. ‘‘అవును.. నేను హ్యాట్రిక్ వికెట్లు తీసినా చెత్తలాగే కనిపిస్తా. అయితే, బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం నువ్వే అసలైన చెత్తవి’’ అంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా లగాన్ మూవీలో కచ్రా.. అంటరానితనం పేరిట సామాజికంగా వెలివేయబడిన క్యారెక్టర్. సమాజ దురాగతానికి మూల్యం చెల్లించే పాత్ర.. స్పిన్ బౌలింగ్ చేసే అతడు బ్రిటిష్ జట్టుతో క్రికెట్ ఆడే ఆమీర్ టీమ్‌లో కష్టమ్మీద చోటు సంపాదించి హ్యాట్రిక్ సాధిస్తాడు. అయితే, సూర్య.. ఈ మూవీలోని పాత్రను ఉటంకిస్తూ స్ఫూర్తిని నింపే క్రమంలో ఈ మాటలు అన్నాడని అతడి ఫ్యాన్స్ అంటుండగా.. నెటిజన్లు మాత్రం.. ‘‘సూర్య చెత్తవాగుడు ఆపి.. ఆటపై దృష్టి పెట్టకపోతే జట్టులో చోటు గల్లంతవుతుంది’’ అని చురకలు అంటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ రెండో వన్డేలో ఒక వికెట్ తీశాడు. చదవండి: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. 13 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! అతడికి కూడా pic.twitter.com/0VxpgDo7lh — Nihari Korma (@NihariVsKorma) July 31, 2023 "Aap ne pehle hi itna kachra kar diya, ab mere liye kya bacha hai karne ko!!", replied Kuldeep Yadav — Scorpion (@NovemberMan_11) July 29, 2023 Kuldeep replied - Sahi kaha maine bhi hat-trick li hai kachra ki tarah. Par batting section mei team ka kachra tu hai. Sirf ek difference hai vo final match mei out nhi hua tha. Kher jaane de 😂 — Cric Top Class (@crictopclass) July 29, 2023 -
సంచలన స్పెల్.. కానీ నీకే ఎందుకిలా? కుల్దీప్ నుంచి ఊహించని రిప్లై!
West Indies vs India, 1st ODI: ‘‘గతంలో చాలా సార్లు నాకిలా జరిగింది. పరిస్థితులు, జట్టు కూర్పునకు అనుగుణంగా మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకునే క్రమంలో నాకు ఆడే అవకాశం రాలేదు. జట్టులోకి రావడం, వెళ్లడం.. ఇప్పుడిదంతా సర్వసాధారణమైపోయింది. ఎన్నో ఏళ్లుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. దాదాపు ఆరేళ్లకు పైనే అయింది. ఇవన్నీ అత్యంత సాధారణ విషయాలు’’ అని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని పేర్కొన్నాడు. కాగా గత కొంతకాలంగా ఈ చైనామన్ స్పిన్నర్ టీమిండియాకు ఎంపికవుతున్నా అప్పుడప్పుడు మాత్రమే తుదిజట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నాడు. టెస్టు క్రికెట్లో కాస్త వెనుకబడ్డాడు! ముఖ్యంగా టెస్టు క్రికెట్లో సీనియర్లు రవిచంద్రన్ అశ్విన, రవీంద్ర జడేజాలు పాతుకుపోగా.. వీరితో పాటు ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ కూడా దూసుకుపోతున్నాడు. దీంతో గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైన కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా జట్టులోకి వచ్చాడు. సంచలన స్పెల్‌తో మెరిసి బార్బడోస్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 3 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విండీస్‌పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కుల్దీప్ యాదవ్‌కు జట్టులో సుస్థిర స్థానం లేకపోవడం గురించి ప్రశ్న ఎదురుకాగా పైవిధంగా స్పందించాడు. ఇక ఇప్పుడు కూడా తన దృష్టి కేవలం వికెట్లు తీయడంపై ఉండదని.. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో పొదుపుగా బౌలింగ్ చేయడమే ముఖ్యమని భావిస్తానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కుల్దీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! -
చరిత్ర సృష్టించిన కుల్దీప్- జడేజా! 49 ఏళ్లలో ఇదే తొలి సారి
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సరి కొత్త చరిత్ర సృష్టించారు. ఒక వన్డే మ్యాచ్‌లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జంటగా జడేజా, కుల్దీప్ యాదవ్ నిలిచారు. గురువారం బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో వీరిద్దరూ కలిసి 7 వికెట్లు పడగొట్టారు. తద్వారా ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు. 42 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటి సారి. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా.. జడేజా 37 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విండీస్‌ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (45 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది. చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్ మొత్తం వాళ్లకే! అతడు సూపర్: రోహిత్ శర్మ 🚨 Milestone Alert 🚨#TeamIndia pair of @imkuldeep18 (4⃣/6⃣) & @imjadeja (3⃣/3⃣7⃣ ) becomes the first-ever pair of Indian left-arm spinners to scalp 7⃣ wickets or more in an ODI 🔝 #WIvIND pic.twitter.com/F18VBegnbJ — BCCI (@BCCI) July 27, 2023 -
IND Vs WI: తీరు మారని వెస్టిండీస్.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని వెస్టిండీస్ నిరూపించింది. ‘అంచనాలకు తగినట్లుగా’ సాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కూడా కనబర్చలేక టీమ్ కుప్పకూలింది. టి20 మ్యాచ్‌కు మించి ఆడటం తమ వల్ల కాదన్నట్లుగా 23 ఓవర్లకే ఇన్నింగ్స్ ముగించింది. మొదటి మూడు వికెట్లు తీసి పేసర్లు శుభారంభం చేస్తే తర్వాతి 7 వికెట్లతో స్పిన్నర్లు కుల్దీప్, జడేజా పండుగ చేసుకున్నారు. అయితే టీమిండియాకు విజయం సులువుగా దక్కలేదు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదు వికెట్లు కోల్పోయి చివరకు గెలుపు సొంతం చేసుకుంది. రోహిత్, కోహ్లి తమ స్థానాల్లో ఆడకుండా ఇతర బ్యాటర్లను ముందుగా పంపగా... అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను అలవోకగా గెలుచుకున్న భారత జట్టు వన్డేల్లోనూ తమ స్థాయిని ప్రదర్శించింది. గురువారం ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (45 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ 6 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది. టపటపా... వన్డేల్లో తమ జట్టు బలహీనతను మరోసారి ప్రదర్శిస్తూ వెస్టిండీస్ కుప్పకూలింది. కెపె్టన్ హోప్ కొంత పోరాడగలిగినా... మిగతావారంతా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. హార్దిక్ తన రెండో ఓవర్లోనే కైల్ మేయర్స్ (2)ను అవుట్ చేసి భారత్‌కు సరైన ఆరంభం అందించాడు. హార్దిక్ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్... శార్దుల్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి అలిక్ అతనజ్ (18 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసినా అది ఎక్కువ సేపు సాగలేదు. జడేజా చక్కటి క్యాచ్‌తో అతను వెనుదిరిగాడు. ముకేశ్‌కు ఇది తొలి వికెట్ కావడం విశేషం. మరో మూడో బంతులకే బ్రెండన్ కింగ్ (17)ను శార్దుల్ అవుట్ చేయడంతో స్కోరు 45/3కి చేరింది. ఈ దశలో హోప్ కొన్ని చక్కటి షాట్లతో కాస్త పట్టుదల కనబర్చాడు. అయితే మరో ఎండ్‌లో 8 పరుగుల వ్యవధిలో హెట్‌మైర్ (11), రావ్మన్ పావెల్ (4), షెఫర్డ్ (0) వెనుదిరగడంతో విండీస్ కోలుకోలేకపోయింది. తర్వాతి నాలుగు వికెట్లూ కుల్దీప్ ఖాతాలోకే వెళ్లాయి. తన తొలి, రెండో ఓవర్లో ఒక్కో వికెట్ తీసిన అతను మూడో ఓవర్లో మరో రెండు వికెట్లతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. వెస్టిండీస్ తరఫున 1972–79 మధ్య 12 టెస్టులు ఆడి 29 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ రఫీక్ జుమాదిన్ గురువారం మరణించడంతో సంతాప సూచకంగా విండీస్ ఆటగాళ్లు భుజానికి నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. తడబడినా... ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ అలవోకగా సాగలేదు. రోహిత్ శర్మ కాకుండా కిషన్, గిల్ (7) ఓపెనర్లుగా బరిలోకి దిగారు. గిల్ విఫలం కాగా, మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (19) కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ప్రమోట్ అయిన హార్దిక్ పాండ్యా (5) రనౌట్ కాగా, మరో ఎండ్‌లో ఇషాన్ మాత్రం నిలకడగా ఆడుతూ 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే ఇషాన్‌తో పాటు శార్దుల్ (1) వెనుదిరగడంతో రోహిత్ (12 నాటౌట్) క్రీజ్‌లోకి రాక తప్పలేదు. ఆపై మరో వికెట్ పడకుండా జడేజా (16 నాటౌట్)తో రోహిత్ మ్యాచ్‌ను ముగించడంతో కోహ్లి బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకపోయింది. ముకేశ్@ 251 వెస్టిండీస్‌తో రెండో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన పేస్ బౌలర్ ముకేశ్ కుమార్‌కు ఇదే టూర్లో వన్డే అవకాశం కూడా దక్కింది. గురువారం మ్యాచ్‌తో అతను వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 251వ ఆటగాడిగా ముకేశ్ నిలిచాడు. 2విండీస్‌కు భారత్‌పై వన్డేల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. 2018లో 104 పరుగులకు ఆలౌటైంది. ఆలౌట్ అయిన సందర్భాల్లో ఎదుర్కొన్న బంతులపరంగా కూడా విండీస్‌కు ఇది రెండో చెత్త ప్రదర్శన. 2011లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 22 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (బి) శార్దుల్ 17; మేయర్స్ (సి) రోహిత్ (బి) హార్దిక్ 2; అతనజ్ (సి) జడేజా (బి) ముకేశ్ 22; హోప్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 43; హెట్‌మైర్ (బి) జడేజా 11; పావెల్ (సి) గిల్ (బి) జడేజా 4; షెఫర్డ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; డ్రేక్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 3; కారియా (ఎల్బీ) (బి) కుల్దీప్ 3; మోతీ (నాటౌట్) 0; సీల్స్ (సి) హార్దిక్ (బి) కుల్దీప్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (23 ఓవర్లలో ఆలౌట్) 114. వికెట్ల పతనం: 1–7, 2–45, 3–45, 4–88, 5–96, 6–96, 7–99, 8–107, 9–114, 10–114. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 3–0–17–1, ముకేశ్ 5–1–22–1, శార్దుల్ 3–1–14–1, జడేజా 6–0–37–3, ఉమ్రాన్ 3–0–17–0, కుల్దీప్ యాదవ్ 3–2–6–4. భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) పావెల్ (బి) మోతీ 52; గిల్ (సి) కింగ్ (బి) సీల్స్ 7; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) మోతీ 19; హార్దిక్ (రనౌట్) 5; జడేజా (నాటౌట్) 16; శార్దుల్ (సి) అతనజ్ (బి) కారియా 1; రోహిత్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (22.5 ఓవర్లలో 5 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–18, 2–54, 3–70, 4–94, 5–97. బౌలింగ్: డ్రేక్స్ 4–0– 19–0, సీల్స్ 4–0–21–1, మేయర్స్ 1–0– 6–0, షెఫర్డ్ 1–0–2–0, మోతీ 6.5–0– 26–2, కారియా 5–0–35–1, అతనజ్ 1–0–7–0. -
కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్.. వెస్టిండీస్ 114 ఆలౌట్
ఇటీవలే టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న వెస్టిండీస్ వన్డే సిరీస్‌లోనూ అదే తరహా ఆటతీరును ప్రదర్శించింది. ఈ సిరీస్‌ను టీమిండియా వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకున్నా విండీస్ కనీసం 30 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. అసలు ఆడుతుంది వన్డేనా లేక టి20 మ్యాచ్ అన్న అనుమానం కలిగింది. విషయంలోకి వెళితే.. గురువారం బార్బడోస్ వేదికగా తొలి వన్డేలో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. కనీసం పోరాడే ప్రయత్నం చేయని విండీస్ బ్యాటర్లలో షెయ్ హోప్ ఒక్కడే 43 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. మూడు ఓవర్లలో రెండు మెయిడెన్లు సహా కేవలం ఆరు పరుగలిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, శార్దూల్, ముకేశ్ కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: WI Vs IND 1st ODI: టాస్ గెలిచిన టీమిండియా.. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు -
అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు
Anil Kumble Comments: ‘‘టీమిండియా స్పిన్ విభాగంలో అశ్విన్- జడేజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ అత్యంత నాణ్యమైన స్పిన్ బౌలర్లు. మూడో స్పిన్నర్‌గా ఉన్న అక్షర్ పటేల్ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే వీరితో పాటు కుల్దీప్ యాదవ్‌కు కూడా వరుస ఛాన్స్‌లు ఇస్తే బాగుంటుంది’’ అని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో అశ్విన్, జడేజా అదరగొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అశూ ఏకంగా 12 వికెట్లతో చెలరేగి విండీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. మరోవైపు జడ్డూ సైతం 5 వికెట్లతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో టీమిండియా.. ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అద్భుత నైపుణ్యాలు కలిగిన వాడు ఈ నేపథ్యంలో అశూ- జడ్డూలను కొనియాడిన అనిల్ కుంబ్లే.. కుల్దీప్ యాదవ్‌ను కూడా అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. ‘‘కుల్దీప్ అద్భుత నైపుణ్యాలు కలవాడు. అతడికి కచ్చితంగా జట్టులో చోటివ్వాలి. నిజానికి లెగ్ స్పిన్నర్లు అటాకింగ్‌గా ఉంటారు. అయితే కొన్నిసార్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు కూడా! అలా అని వాళ్లను పక్కనపెట్టకూడదు. నైపుణ్యాలకు మరింతసాన బెట్టుకునేలా ప్రోత్సహించాలి. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలి. టెస్టు జట్టులోకి తీసుకురావాలి టెస్టులకు కుల్దీప్ పనికివస్తాడు. తనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా మంది మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. కానీ మనం వాళ్ల సేవలను టెస్టుల్లో వినయోగించుకోలేకపోతున్నాం’’ అని కుంబ్లే జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో చివరిగా కాగా 28 ఏళ్ల కుల్దీప్ యాదవ్ చివరిగా గతేడాది డిసెంబరులో టీమిండియా తరఫున ఆడాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో స్థానం దక్కింది కానీ ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌లను ఉద్దేశిస్తూ కుంబ్లే ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. -
Ind Vs WI: అందుకే జడ్డూను కాదని అతడికి జట్టులో చోటు! అంతేతప్ప..
Ind Vs WI 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టులో నలుగురు స్పిన్ బౌలర్లకు చోటు దక్కింది. ఇద్దరు లెగ్ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి.. ఇద్దరు లెఫార్మ్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ టీ20 జట్టులో స్థానం సంపాదించారు. విండీస్ గడ్డపై మ్యాచ్‌కు సెలక్టర్లు ఈ మేరకు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సమర్థించాడు. కరేబియన్ దీవిలో ప్రస్తుతం స్లో, టర్నింగ్ పిచ్‌లు ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డాడు. ఇక విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజాకు చోటు ఇవ్వకపోవడంపై కూడా ఆకాశ్ చోప్రా స్పందించాడు. అందుకే జడ్డూ జట్టులో లేడు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్‌తో టీ20 జట్టులో నలుగురు స్పిన్నర్లు అక్షర్ పటేల్, యుజీ చహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయికి సెలక్టర్లు చోటిచ్చారు. రవీంద్ర జడేజా లేడు కాబట్టి ఆల్‌రౌండర్ స్థానంలో అక్షర్ పటేల్‌కు తప్ప మరొకరికి స్థానం లేదు. నా అభిప్రాయం ప్రకారం.. కేవలం జడ్డూపై పని ఒత్తిడి తగ్గించడానికి మాత్రమే అతడిని పక్కన పెట్టి ఉంటారు. నిజానికి టీ20 ఫార్మాట్లో రవీంద్ర జడేజా ప్రదర్శనపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, అతడు కరేబియన్ గడ్డపై టెస్టులు, వన్డేలు ఆడాల్సి ఉంది. పాండ్యా సారథ్యంలో కాబట్టి జడ్డూకు విశ్రాంతినిచ్చే క్రమంలో మాత్రమే అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. అంతేతప్ప జడ్డూను జట్టు నుంచి తప్పించినట్లు కాదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా ఆగష్టు 3- 13 వరకు టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. విండీస్‌తో టి20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ రింకూ సింగ్‌కు గుడ్ న్యూస్.. భారత జట్టులో చోటు! వాళ్లకు కూడా -
అప్పుడు పీయూశ్ చావ్లా ఆకట్టుకున్నాడు! ఈసారి టీమిండియా: గంగూలీ
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభానికి దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. భారత్ వేదికగా పుష్కర కాలం తర్వాత మరోసారి ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న ప్రపంచకప్ సమరానికి తెరలేవనున్నట్లు గత మంగళవారం ప్రకటించింది. ఆతిథ్య టీమిండియా సహా పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నేరుగా పోటీకి అర్హత సాధించాయి. మరోవైపు.. మాజీ చాంపియన్ వెస్టిండీస్ క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమించగా.. శ్రీలంక, జింబాబ్వే టాప్-10లో అడుగుపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఆ ముగ్గురు ఉంటారు.. అయితే ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సంబంధించి జట్ల కూర్పులపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ రిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాల్సిన ఆవశ్యకత గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్‌కప్ కోసం ఈసారి టీమిండియా ప్రత్యేకంగా మణికట్టు స్పిన్నర్‌ను ముందుగానే సన్నద్ధం చేసుకోవాలి. నాకు తెలిసి జడేజా, రవిచంద్రన్ అశ్విన్(ఫింగర్ స్పిన్నర్లు), అక్షర్ పటేల్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా అక్షర్.. ఎందుకంటే తను పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్. చహల్‌పై కూడా కన్నేసి ఉంచాలి అయితే.. రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్ వంటి రిస్ట్ స్పిన్నర్లపై కూడా దృష్టి సారించాలి. నిజానికి యజువేంద్ర చహల్ టీ20, వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. కానీ చాలా వరకు ప్రధాన టోర్నీల్లో అతడికి అవకాశం రావడం లేదు. కాబట్టి బిష్ణోయి, కుల్దీప్లతో పాటు చహల్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు. అప్పుడు పీయూశ్ చావ్లా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై రిస్ట్ స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపగలరని అభిప్రాయపడ్డాడు. 2011 వరల్డ్‌కప్‌లో తనకున్న పరిమితిలో పీయూశ్ చావ్లా(మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ గుర్తు చేశాడు. అదే విధంగా 2007లో సౌతాఫ్రికాలో ఫాస్ట్‌బౌలర్లతో పాటు మణికట్టు మాంత్రికులు కూడా రాణించారని దాదా చెప్పుకొచ్చాడు. ఈసారి ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుంది కాబట్టి రిస్ట్ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు! -
ఈజీ క్యాచ్ డ్రాప్.. కోపంతో ఊగిపోయిన కుల్దీప్ యాదవ్! వీడియో వైరల్
IPL 2023 DC Vs PBKS: ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట విజయం లభించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో 15 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందినప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరిచింది. పంజాబ్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో.. లియామ్ లివింగ్‌స్టోన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో బంతి డిప్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అన్రిచ్ నోర్జే సునాయాస క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో కుల్దీప్ యాదవ్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. నోర్జే వైపు చూస్తూ కుల్దీప్ గట్టిగా అరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లివింగ్‌స్టోన్ ఏకంగా 94 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో యష్‌దుల్ కూడా అథర్వ తైడే ఇచ్చిన ఓ ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. ఈ క్రమంలో డౌగట్‌లో కూర్చుకున్న ఢిల్లీ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ సైతం నిరాశచెందాడు. చదవండి: IPL 2023: చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం! ప్రతీ సారి ఇంతే: ధావన్ pic.twitter.com/5fMNbJv9mG — ChhalRaheHainMujhe (@ChhalRahaHuMain) May 18, 2023 pic.twitter.com/5fMNbJv9mG — ChhalRaheHainMujhe (@ChhalRahaHuMain) May 18, 2023 -
నేను చెబితే వినలేదు.. ఇప్పుడు ఇది ఏంటి కుల్దీప్? మరోసారి సీరియస్ అయిన రోహిత్
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు పర్వాలేదనిపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(47), కారీ(38), హెడ్(33) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా..అక్షర్ పటేల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య ఆసక్తకిర సంభాషణ చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 38 ఓవర్లో కుల్దీప్ వేసిన ఓ గుగ్లీ బంతి ఆష్టన్ అగర్ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ క్రమంలో కుల్దీప్ రివ్యూ తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించాడు. అయితే రోహిత్ మాత్రం రివ్యూ తీసుకోవడానికి నిరాకరించాడు. అయినప్పటికీ కుల్దీప్ మాత్రం రోహిత్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఆఖరి సెకన్లలో రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. అది రివ్యూలో కూడా నాటౌట్‌గా తేలింది. అయితే రివ్యూ తీసుకునే క్రమంలో కుల్దీప్పై రోహిత్ కాస్త సీరియస్ అయ్యాడు. రోహిత్‌కు కోపం రావడానికి ఓ కారణం కూడా ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్ 25 ఓవర్లో కుల్దీప్ వేసిన ఓ బంతి అలెక్స్ కారీ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు రోహిత్, విరాట్ ఎల్బీకీ అప్పీల్ చేశారు. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో వెంటనే రోహిత్ శర్మ రివ్యూ తీసుకోవాలని భావించాడు. అయితే కుల్దీప్ మాత్రం రోహిత్ నిర్ణయాన్ని తిరస్కరించాడు. కనీసం రోహిత్ మాటలను కూడా వినిపించుకోకుండా కుల్దీప్ బౌలింగ్ ఎండ్‌వైపు వెళ్లిపోయాడు. కుల్దీప్ ప్రవర్తన రోహిత్ పాటు విరాట్ కోహ్లికి కూడా ఆగ్రహం తెప్పించింది. రిప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను తాకినట్లు తేలింది. ఇక మరోసారి అవసరం లేని చోట రివ్యూ కోరడంతో రోహిత్ సీరియస్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Rohit sharma and Kuldeep yadav bond 💙🙌pic.twitter.com/oJSa9Y3Uhw — Saurabh Yadav (@Saurabhkry_45) March 22, 2023 Different shades of Rohit Sharma 😭😂🤣 Bechara kuldeep#INDvsAUS #RohitSharmapic.twitter.com/Sjsts9FvFP — 𝑺𝑶𝑯𝑨𝑰𝑳' (@pratikxlucifer) March 22, 2023 చదవండి: IND vs AUS: అయ్యో స్మిత్.. ఇలా జరిగింది ఏంటి? ప్రతీకారం తీర్చుకున్న హార్దిక్! వీడియో వైరల్ -
షేన్ వార్న్ పూనాడా ఏంది కుల్దీప్, అంతలా తిప్పేశావు..?
చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్ సిరాజ్ (7-1-37-2), అక్షర్ పటేల్ (8-0-57-2), హార్ధిక్ పాండ్యా (8-0-44-3), కుల్దీప్ యాదవ్ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కానప్పటికీ టీమిండియా ముందు రీజనబుల్ టార్గెట్‌ను ఉంచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మినహా (0) జట్టులో ప్రతి ఒక్కరు రెండంకెల స్కోర్ చేశారు. ట్రవిస్ హెడ్ (33), మిచెల్ మార్ష్ (47), డేవిడ్ వార్నర్ (23), లబూషేన్ (28), అలెక్స్ క్యారీ (38), స్టోయినిస్ (25), సీన్ అబాట్ (26), అస్టన్ అగర్ (17), స్టార్క్ (10), జంపా (10 నాటౌట్) తమకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక భారీ స్కోర్లు చేయలేకపోయారు. Peach of a Delivery by Kuldeep Yadav to dismiss Alex Carey 🔥pic.twitter.com/9vxNV4fJ81 — Kriti Singh (@kritiitweets) March 22, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్.. అలెక్స్ క్యారీని క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. తొలి బంతి నుంచే గింగిరాలు తిరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన కుల్దీప్.. 39వ ఓవర్ తొలి బంతికి స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ పునాడా అని డౌట్ వచ్చేలా బంతిని మెలికలు తిప్పి క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. బంతి అంతలా టర్న్ అవుతుందని ఊహించని క్యారీ, బౌల్డ్ అయ్యాక పెట్టిన ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం వైరలవతోంది. 10 years ago today !!! This is one of my favourite deliveries.... Thanks boys.... pic.twitter.com/MXGlDNVHTV — Shane Warne (@ShaneWarne) July 6, 2015 వాస్తవానికి కుల్దీప్ కూడా ఆ బంతి అంతలా టర్న్ అవుతుందని ఊహించి ఉండడు. లెగ్ స్టంప్ అవల పడ్డ బంతి ఏకంగా హాఫ్ స్టంప్‌ను గిరాటు వేయడంతో బ్యాటర్‌తో పాటు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. ఈ తరహా బంతులు ఎక్కువగా లెజెండరీ షేన్ వార్న్ వేయడం చూశాం. తాజాగా కుల్దీప్ అలాంటి బంతి వేయడంతో ఇతనికి షేన్ వార్న్ ఏమైనా పూనాడా అని నెటిజన్లు అనుకుంటున్నారు. కుల్దీప్ కూడా మంచి టర్నరే అయినప్పటికీ, బంతి ఇంతలా టర్న్ అయిన దాఖలాలు లేవు. కుల్దీప్ మ్యాజిక్ డెలివరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. -
కుల్దీప్పై కోపంతో ఊగిపోయిన రోహిత్, కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌ను డిసైడ్ చేసే మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 38 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు తలా మూడు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కోపంతో ఊగిపోయారు. ఏం జరిగిందంటే? ఆసీస్ ఇన్నింగ్స్ 25 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్.. మూడో బంతికి డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం నాలుగో బంతిని అద్భుతమైన గూగ్లీగా కుల్దీప్ సంధించాడు. ఈ క్రమంలో బంతి క్రీజులోకి వచ్చిన అలెక్స్ కారీ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు రోహిత్, విరాట్ ఎల్బీకీ అప్పీలు చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, స్లిప్‌లో ఉన్న కోహ్లితో చర్చలు జరిపి రివ్యూ తీసుకోనేందుకు సిద్దమయ్యాడు. అయితే బౌలర్ కుల్దీప్ మాత్రం రోహిత్ నిర్ణయాన్ని తిరష్కరించి బౌలింగ్ వేసేందుకు తన స్ధానానికి వెళ్లిపోయాడు. దీంతో కుల్దీప్పై రోహిత్, కోహ్లి కోపంతో ఊగిపోయారు. అయితే తర్వాతి రిప్లేలో బంతి లెగ్‌స్టంప్‌ను తాకినట్లు కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ICC Rankings: నెం1 ర్యాంక్‌ను కోల్పోయిన సిరాజ్.. టాప్ ర్యాంక్ ఎవరిదంటే? pic.twitter.com/Kx9usQnB0f — javed ansari (@javedan00643948) March 22, 2023