MS Dhoni
-
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఈ రెండు పేర్లను విడివిడిగా చూడటం కష్టం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై నిలవడానికి ప్రధాన కారణం ధోని. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలు మొదలు.. మైదానంలో అమలు చేసే ప్రణాళికల వరకు అంతా తానే!ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ దిగ్గజ కెప్టెన్.. గతేడాది సారథ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొన్నాడు. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను తన వారసుడిగా ఎంపిక చేశాడు. అయితే, మైదానంలో రుతుకు సూచనలు ఇస్తూ అతడికి దిశానిర్దేశం చేసే పాత్రలో ధోని ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రెప్పపాటులో స్టంపౌట్లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే ధోని 43 ఏళ్ల వయసులోనూ.. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. మెరుపు వేగంతో స్టంపౌట్లు చేయడంలోనూ దిట్ట. ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆదివారం నాటి పోరులో ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను రెప్పపాటులో స్టంపౌట్ చేసి ఔరా అనిపించాడు.𝙁𝙖𝙨𝙩. 𝙁𝙖𝙨𝙩𝙚𝙧. 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 🫡📹 Watch #CSK legend's jaw-dropping reflexes behind the stumps 🔥Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/S26cUYzRd8— IndianPremierLeague (@IPL) March 23, 2025ఇక మిచెల్ సాంట్నర్ వికెట్‌కు సంబంధించి.. డీఆర్ఎస్ విషయంలోనూ రుతును సరైన సమయంలో అలర్ట్ చేసి.. జట్టుకు వికెట్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే సీఎస్కేను, ధోనిని వేరువేరుగా చూడలేము అనేది!అలా అయితే.. నాతో నయాపైసా ఉపయోగం ఉండదుఅయితే, ఈ మ్యాచ్‌కు ముందు ధోని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఒకవేళ తాను వికెట్ కీపర్‌గా బరిలోకి దిగకపోతే.. జట్టులో ఉండీ ఏమాత్రం ఉపయోగం లేదంటూ.. ఈ ఫైవ్టైమ్ చాంపియన్ అన్నాడు. జియోహాట్‌స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ ఆటగాడిగా కొనసాగడం అతిపెద్ద సవాలు.ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఒకవేళ నేను కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించకపోతే.. మైదానంలో నేను ఉండీ నయాపైసా ఉపయోగం ఉండదు. ఎందుకంటే.. వికెట్ల వెనుక నుంచే నేను మ్యాచ్ పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటాను.వికెట్ల వెనుక నుంచి విశ్లేషించగలుగుతాబౌలర్ ఎలా బంతిని వేస్తున్నాడు? పిచ్ స్వభావం ఎలా ఉంది?.. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలి? వంటి విషయాలన్నీ ఆలోచించగలను. ముఖ్యంగా మొదటి ఆరు ఓవర్లలో కొత్త బంతి ఎలాంటి ప్రభావం చూపుతోందని గమనిస్తా.ఆ తర్వాత పరిస్థితులు ఏవిధంగా మారుతున్నాయి? బౌలర్లను మార్చాలా? లేదంటే ప్రణాళికలు మార్చాలా? లాంటి అంశాల గురించి కెప్టెన్‌కు సరైన సందేశం ఇవ్వగలుగుతా. ఉత్తమ బంతికి బ్యాటర్ సిక్సర్ బాదాడా?లేదంటే.. చెత్త బంతికి షాట్ కొట్టాడా? అన్నది వికెట్ల వెనుక నుంచి విశ్లేషించగలుగుతా’’ అని ధోని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోని.. గతేడాది నుంచి వికెట్ కీపర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.బౌలర్ల విజృంభణఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్‌లో చెన్నై ముంబైని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. సొంతమైదానం చెపాక్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రుతుసేన తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా ముంబైని 155 పరుగులకే కట్టడి చేసింది.రచిన్, రుతు హాఫ్ సెంచరీలులక్ష్య ఛేదనలో ఓపెనర్ రచిన్ రవీంద్ర అర్ధ శతకం(45 బంతుల్లో 65 నాటౌట్)తో చెలరేగగా.. కెప్టెన్ రుతురాజ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 53)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు ఉండగానే టార్గెట్ పూర్తి చేసిన చెన్నై.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. ముంబైని స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ నూర్ అహ్మద్ (4/18)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా.. అజేయంగా నిలిచాడు. -
కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ముంబై ఇండియన్స్ (MI)మధ్య పోరు అని చెప్పవచ్చు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఐపీఎల్-2025లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన తీరు ఇందుకు నిదర్శనం.ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే స్టార్లు రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53)ల మెరుపులు.. మహేంద్ర సింగ్ ధోని మెరుపు స్టంపింగ్‌లతో పాటు.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఓ కుర్రాడు హైలైట్‌గా నిలిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ధోని చేత ప్రశంసలు అందుకున్నాడు.ఇంతకీ ఎవరా ప్లేయర్?అతడిపేరు విఘ్నేశ్ పుతూర్. లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ కుర్ర బౌలర్ స్వస్థలం కేరళలోని మలప్పురం. పదకొండేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన విఘ్నేశ్.. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దృష్టిని ఆకర్షించాడు.అతడి ప్రతిభకు ఫిదా అయిన ముంబై యాజమాన్యం.. ఇంతవరకు కేరళ తరఫున కనీసం దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టకపోయినప్పటికీ... ఐపీఎల్ కాంట్రాక్టు ఇచ్చింది. రూ. 30 లక్షలకు ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసింది.ఈ క్రమంలో పద్దెనిమిదవ ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా సీఎస్కేతో పోరు సందర్భంగా విఘ్నేశ్‌ను బరిలోకి దించింది. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన ఈ స్పిన్ బౌలర్.. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే (9), దీపక్ హుడా (3) రూపంలో మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.చెన్నై చేతిలో ముంబై సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందా? అనే పరిస్థితి నుంచి .. చివరి ఓవర్ దాకా మ్యాచ్ సాగేలా చేయడంలో విఘ్నేశ్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అతడి భుజం తట్టి శెభాష్ అంటూ తలా.. ఈ కుర్రాడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.The men in 💛 take home the honours! 💪A classic clash in Chennai ends in the favour of #CSK ✨Scorecard ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/ZGPkkmsRHe— IndianPremierLeague (@IPL) March 23, 2025 తండ్రి ఆటో డ్రైవర్.. కొడుకు ఐపీఎల్ స్టార్అన్నట్లు విఘ్నేశ్ పుతూర్ తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. కష్టపడుతూ కుటుంబాన్ని పోషించే ఆయన.. కొడుకులోని ప్రతిభను గుర్తించి క్రికెట్ ఆడేలా ప్రోత్సహించాడు. కేరళ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో మీడియం పేసర్ బౌలర్ నుంచి స్పిన్నర్‌గా మారిన విఘ్నేశ్ ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. కలకాలం గుర్తుండిపోతుంది!‘‘ధోని.. విఘ్నేశ్ పుతూర్ భుజం తట్టి అభినందించాడు. నాకు తెలిసి తన జీవితకాలం ఈ కుర్రాడు ఈ సంఘటనను గుర్తుంచుకుంటాడు’’- కామెంటేటర్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును.. విఘ్నేశ్ పుతూర్‌కు ఇది లైఫ్‌టైమ్ మొమరీగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, ఈ సీజన్లో బౌలర్‌గా తనదైన ముద్ర వేయగలిగితే.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాలో చోటు సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో.. త్వరలోనే విఘ్నేశ్ కూడా చేరే అవకాశాలను కొట్టిపారేయలేము!! ఏమంటారు?!ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై👉టాస్: చెన్నై.. తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 155/9 (20)👉చెన్నై స్కోరు: 158/6 (19.1)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నూర్ అహ్మద్ (చెన్నై స్పిన్నర్- 4/18).చదవండి: జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్‌కు ఇంతకంటే ఏం కావాలి? -
IPL 2025: ఈ ఏడాది ధోని మరింత ఫిట్‌గా ఉన్నాడు.. యవ్వనంగా కనిపిస్తున్నాడు: రుతురాజ్
ఐపీఎల్-2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడటం ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా 13వ సారి. ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ నుంచి ఇప్పటివరకు ముంబైతో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో సీఎస్కే ఏడింట విజయాలు సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో సీఎస్కేను అరంగేట్రం ఆటగాడు నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనలతో గెలిపించారు.తొలుత నూర్ (4-0-18-4) తన మాయాజాలం ప్రదర్శించి ముంబైని 155 పరుగులకే పరిమితం చేయగా.. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ బ్యాటింగ్ విన్యాసాలతో సీఎస్కేను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ (4-0-29-3) కూడా రాణించాడు. ధోని మెరుపు స్టంపింగ్ (సూర్యకుమార్ యాదవ్) చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.ఈ మ్యాచ్‌లో ముంబై స్వల్ప స్కోర్‌కే పరిమితమైనా.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ముంబై బౌలర్లు సీఎస్కేను అంత ఈజీగా గెలవనివ్వలేదు. రుతురాజ్ క్రీజ్‌లో ఉన్నంత సేపు సీఎస్కే వైపే ఏకపక్షంగా సాగిన మ్యాచ్.. ఆతను ఔటయ్యాక మలుపులు తిరిగింది. ఓ దశలో ముంబై అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) రెచ్చిపోవడంతో సీఎస్కే కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (17) రనౌట్ కావడంతో ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. ధోని బ్యాటింగ్‌కు దిగినా పరుగులేమీ చేయలేదు (2 బంతులు ఎదుర్కొని). ధోని రాకతో చెపాక్ స్టేడియం హోరెత్తింది. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను తెగ ఇబ్బంది పెట్టారు. అంతకుముందు ముంబై బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటై నిరాశపర్చగా.. విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. మరింత క్లినికల్‌గా ఉండటం నాకు చాలా ఇష్టం. కానీ ఆట ఇలాగే సాగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో రావడంపై స్పందిస్తూ.. అది జట్టు అవసరం. నేను మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం జట్టుకు మరింత సమతుల్యతను ఇస్తుంది. నా స్థానాన్ని మార్చుకోవడం (గతంలో ఓపెనర్‌గా వచ్చే వాడు) పట్ల నాకు ఎలాంటి బాధ లేదు. వాస్తవానికి ఇంకా సంతోషంగా ఉంది.స్పిన్నర్లు సరైన పాయింట్‌పై ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వారు ముగ్గురు (నూర్, అశ్విన్, జడేజా) మంచి లయతో బౌలింగ్ చేశారు. ఇది మాకు శుభసూచకం. ఖలీల్ అనుభవజ్ఞుడు. అతని అనుభవం మాకు కలిసొచ్చింది. నూర్ ఓ ఎక్స్ ఫ్యాక్టర్, అందుకే అతన్ని జట్టులో చేర్చుకోవాలనుకున్నాము. అశ్విన్ జట్టులో ఉండటం మాకు బలాన్ని ఇస్తుంది. ధోని ఈ సంవత్సరం మరింత ఫిట్‌గా ఉన్నాడు. అతను ఇప్పటికీ యవ్వనంగా కనిపిస్తున్నాడు. -
వారెవ్వా ధోని.. కేవలం 0.12 సెకన్లలోనే! వీడియో వైరల్
ఎంఎస్ ధోని.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. ఈ జార్ఖండ్ డైన్‌మేట్.. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు అద్బుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్‌కు పెట్టింది పేరు. తాజాగా ధోని మరోసారి తన కీపింగ్ స్కిల్స్‌తో అభిమానులను అలరించాడు.ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే తరపున ఆడుతున్న ధోని.. అద్బుతమైన స్టంపింగ్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మెరుపు స్టంప్ ఔట్ చేసి ధోని పెవిలియన్‌కు పంపిచాడు.అసలేమి జరిగిదంటే?ముంబై ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన లెగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్.. మూడో బంతిని సూర్యకు గూగ్లీగా సంధించాడు. ఆ బంతిని సూర్యకుమార్ క్రీజు నంచి బయటకు వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్ అయ్యి అతడి బ్యాట్‌ను మిస్ అయ్యి వికెట్ల వెనక ఉన్న ధోని చేతికి వెళ్లింది.ఈ క్రమంలో మిస్టర్ కూల్.. తన వింటేజ్ స్టైల్లో రెప్పపాటులో బెయిల్స్‌ను పడగొట్టాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసినప్పటికి.. సూర్య మాత్రం కనీసం వెనక్కి తిరగకుండా మైదానం విడిచివెళ్లిపోయాడు. ధోని కేవలం 0.12 సెకండ్ల వ్యవధిలోనే స్టంప్ ఔట్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు. 𝙁𝙖𝙨𝙩. 𝙁𝙖𝙨𝙩𝙚𝙧. 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 🫡📹 Watch #CSK legend's jaw-dropping reflexes behind the stumps 🔥Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/S26cUYzRd8— IndianPremierLeague (@IPL) March 23, 2025 -
ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, ధోనీ.. హెయిర్ కట్ కోసం ఎంత చెల్లిస్తారంటే..
జీవితంలో ఏదైనా జరగవచ్చు. సాధారణ వృత్తి అనుకున్న దానిలో కూడా లక్షలు గడించవచ్చు. అందరూ చేసే అదే వృత్తిలో కొందరు మాత్రమే పాపులర్ అవుతుంటారు. దీన్నే లక్ అంటారనుకుంటా.. కానీ, దాని వెనుక ఎంతో కష్టం కూడా ఉండొచ్చు. కొందరి జీవిత సక్సెస్ స్టోరీలు చూస్తే మనకు నిజమే అనిపిస్తుంది. అందుకు చిన్న ఉదాహరణ ఆలీమ్ హకీమ్. సాధారణంగా ఒక సెలూన్ షాప్‌నకు వెళితే అక్కడ ఒక మనిషి హెయిర్ కటింగ్‌కు రూ.150 తీసుకుంటారు. లగ్జరీ సెలూన్ అయితే రూ.500 తీసుకుంటారు. ఇక సెలబ్రిటీస్‌కు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండవచ్చు. అయితే ఒక్కసారి కటింగ్‌కు లక్షల్లో చెల్లించడం అనేది ఎప్పుడైనా విని ఉంటామా..? మనం విని ఉండకపోవచ్చు. ఇది జరుగుతున్న వాస్తవం. ఆలీమ్ హకీమ్ అనే హెయిర్‌స్టర్ గురించే ఇదంతా. ఇతను హాలీవుడ్ హెయిర్‌స్టర్. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే రూ.20 తీసుకునేవారట. ఆ తరువాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇప్పుడు మినిమమ్ లక్ష రూపాయల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఏంటి ఒకసారి జుత్తు కట్ చేస్తే లక్ష ఎవరు చెల్లిస్తారు ? అని ఆశ్చర్యపోతున్నారా. నిజమేనండి..? ఇది కూడా మినిమమ్ ధర మాత్రమేనట.. అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. ఆలీమ్ హకీమ్ ఇప్పుడు సాదారణ హెయిరిస్ట్ కాదు. సెలబ్రిటీల హెయిరిస్ట్. అదీ మామూలు సెలబ్రిటీలకు కాదు. సూపర్‌స్టార్స్‌కు హెయిర్‌స్టర్. ఈయన తల మీద కత్తెర పెట్టారంటే అక్షరాలు లక్ష చెల్లించాల్సిందేనట. హాలీవుడ్‌కు చెందిన ఈయనకు కస్టమర్స్ అందరూ ఇండియాకు చెందిన వారే కావడం విశేషం. ఆలీమ్ హకీమ్ కస్టమర్స్ లిస్ట్ ఇదేఈయనకు సినీ, క్రికెట్ క్రీడాకారుల మధ్య మంచి క్రేజ్ ఉంది. ఈయన కస్టమర్లంతా సినీస్టార్స్, క్రికెట్స్టార్స్ వంటి వారే. అందులో సూపర్‌స్టార్ రజనీకాంత్,విజయ్ సేతుపతి, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ స్టార్ ఎంఎస్.ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్,చాహల్ వంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. రజనీకాంత్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్స్టర్గా పని చేసింది ఆలీమ్ హకీమే. అటువంటింది ఆయన హెయిర్‌స్టైల్ పని తనం. ఏదైనా ఒక్కసారి పాపులర్ అయితే ఆ తరువాత పేరైనా, డబ్బైనా వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. -
MS Dhoni: ఆ ఒక్కటీ అడక్కు!
ఐపీఎల్(IPL) రాగానే ఎమ్మెస్ ధోనికి(MS Dhoni) ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్లీ నాట్’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్‌లో బ్యాటర్‌గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు. తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్‌కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. ఒక రకంగా టీమ్ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్ కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్‌కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్‌గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో. -
IPL 2025: స్పిన్-టు-విన్ వ్యూహం.. ఆరో టైటిల్‌కు గురి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). రికార్డు స్థాయిలో ఆరవ టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈసారి బరిలోకి దిగుతోంది. 2024లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన బాధ ఇంకా చెన్నై ఆటగాళ్ల మనసులో కదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి పూర్వ వైభవం సాధించాలని సీఎస్కే పట్టుదలతో ఉందనడంలో సందేహం లేదు.యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్‌కు ముందు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంత అనుభవం గడించిన నేపథ్యంలో ఈ సీజన్లో కొత్త కెప్టెన్ మరింత మెరుగ్గా వ్యవహరించే అవకాశముందని భావిస్తున్నారు. కాగా.. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ స్థానాన్ని కూడా సాధించలేకపోయింది.7 విజయాలు, 7 ఓటములతో కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించి గత సీజన్లో పేలవంగా ఐదో స్థానం తో ముగించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న చెన్నైలోని ఎం ఎ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ తో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.స్పిన్-టు-విన్ వ్యూహంఈ నేపథ్యంలో ఈ సారి భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరియు చెన్నై అభిమానుల ఫేవరెట్ ఆటగాడు సామ్ కుర్రాన్‌తో సహా అనేక సుపరిచితమైన ఆటగాళ్లను చెన్నై మళ్ళీ జట్టులోకి తీసుకుంది. భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెనుక నుంచి తన వ్యూహరచనలో జట్టును ముందుండి నడిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇక జట్టును చూస్తే, గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాల్ని ఇచ్చిన 'స్పిన్-ట్రిక్' కు కట్టుబడి ఉండాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రవీంద్ర జడేజా, న్యూజిలాండ్‌కు చెందిన భారత్ సంతతి ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రతో పాటు నూర్ అహ్మద్, అశ్విన్‌లను చేర్చడం, ముఖ్యంగా సొంత గడ్డ పై గరిష్ట ప్రభావాన్ని చూపడానికి టర్నర్లను ఉపయోగించాలనే వారి ధోరణిని గుర్తుచేస్తుంది.అశ్విన్, నూర్ లతో పాటు జడేజా ఎడమచేతి ఫింగర్స్పిన్, గోపాల్ లెగ్‌స్పిన్, ఇంకా దీపక్ హుడా పార్ట్-టైమ్ ఆఫ్‌స్పిన్ వంటి బౌలర్లు చెన్నై స్పిన్ బౌలింగ్ కి వెరైటీ సమకూరుస్తున్నారు. ఇది చెపాక్‌లో స్పిన్-టు-విన్ వ్యూహానికి సరిగ్గా సరిపోతుంది.బలీయంగా కనిపిస్తున్న బ్యాటింగ్ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, న్యూ జిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి బ్యాటింగ్‌ను ప్రారంభించే అవకాశముంది. ఈ జంట 2023 సీజన్లో చాలా విజయవంతమైంది. కానీ గత సీజన్లో గాయం కారణంగా కాన్వే ఆడలేక పోయాడు. ఈ సీజన్లో ఈ ఇద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో చెన్నై మళ్ళీ పుంజుకోవాలని భావిస్తోంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజృంభించిన ఆడిన రచిన్ రవీంద్రను మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది.కీలకమైన నాల్గవ స్థానంలో దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి లేదా విజయ్ శంకర్ ఒకరు వచ్చే అవకాశముంది. ఆ తర్వాత హార్డ్ హిట్టింగ్ శివమ్ దూబేను ఐదవ స్థానంలో, ఆ తర్వాత ఆరో స్థానంలో వచ్చే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ తన నైపుణ్యంతో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. జడేజా తర్వాత, ఎంఎస్ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశముంది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో గత సీజన్లో కీలక పాత్ర పోషించిన ధోని మరోసారి ప్రభావం చూపే అవకాశం ఉంది.జట్టులో ప్రధాన ఆటగాళ్ళు:రుతురాజ్ గైక్వాడ్: గత కొన్ని సీజన్లగా చెన్నై తరఫున నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నవారిలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. రుతురాజ్ తన జట్టు బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలిచాడు, 41.75 సగటుతో మరియు 136.86 స్ట్రైక్ రేట్‌తో 2380 పరుగులు సాధించాడు. అతని నాయకత్వంలో పసుపు బ్రిగేడ్ గత సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేక పోయినా, గైక్వాడ్ ఈ సీజన్లో మెరుగైన ఆటతీరుతో చెన్నై ని ముందుకు నడిపించాలని పట్టుదలతో ఉన్నాడు.రవిచంద్రన్ అశ్విన్: అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్, తన కెరీర్ ప్రారంభ దశలో తనను వెలుగులోకి తెచ్చిన ఫ్రాంచైజీ అయిన చెన్నై కి ఐపీఎల్ టైటిల్‌ను అందించాలని భావిస్తున్నాడు. 212 మ్యాచ్‌ల్లో 7.12 ఎకానమీ రేటుతో 180 వికెట్ల తో అశ్విన్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఆఫ్ స్పిన్నర్ తాను బ్యాట్‌తో దూకుడుగా ఉండగలనని మరియు అవసరమైనప్పుడు ఫ్లోటర్‌గా వ్యవహరించగలనని చూపించాడు.నాథన్ ఎల్లిస్: వేగంగా బౌలింగ్ చేయగల మరియు తన వైవిధ్యాలను చాలా చక్కగా ఉపయోగించుకునే సామర్థ్యంతో, నాథన్ ఎల్లిస్ చెన్నై జట్టులో కీలకమైన బౌలర్‌గా రాణిస్తాడని భావిస్తున్నారు.శివం దూబే: దూకుడుతో బ్యాటింగ్ చేసే శివం దూబే చెన్నై జట్టుకు మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు. సూపర్ కింగ్స్ తరఫున 39 ఇన్నింగ్స్‌లలో 34.47 సగటు మరియు 159.16 స్ట్రైక్ రేట్‌తో 1103 పరుగులు చేశాడు. చెన్నై జట్టుకి మిడిల్ ఓవర్లలో శివం దూబే ను గేమ్-ఛేంజర్ గా భావించవచ్చు.రాహుల్ త్రిపాఠి: డైనమిక్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మూడు లేక నాలుగో స్థానంలో ఆడే అవకాశముంది. త్రిపాఠి ఐపీఎల్లో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 27.27 సగటుతో, 139.3 స్ట్రైక్ రేట్‌తో 2236 పరుగులు చేశాడు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్.చదవండి: అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే: సీఎస్కే మాజీ స్పిన్నర్ -
సందీప్ వంగా 'యానిమల్'.. ఒకవేళ ధోనీ చేస్తే?
సందీప్ రెడ్డి పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలే గుర్తొస్తాయి. రా అండ్ రస్టిక్ స్టోరీలతో తీసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్న సందీప్.. సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు ధోనీతో కలిసి ఓ యాడ్ లో కనిపించాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్ని పక్కనపడేసిన తమన్)ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఓ ప్రముఖ కంపెనీ యాడ్ తాజాగా రిలీజ్ చేసింది. 'యానిమల్' సినిమాలో ధోనీ నటిస్తే ఎలా ఉంటుందో.. అచ్చుగుద్దినట్లు ఈ యాడ్ ని అలానే రూపొందించారు. బ్లూ కోట్ లో బ్లాక్ కలర్ కార్ నుంచి దిగే సీన్, సినిమా ప్రారంభంలో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లే సీన్, క్లైమాక్స్ లో హీరో చేతితో సైగ చేసి చూపించే సీన్.. ఇలా ఫుల్ సీరియస్ గా ఉంటే మూడు సీన్స్ తీసుకుని వాటితో యాడ్ చేశారు.'యానిమల్' సీరియస్ మూవీ కాగా.. ఈ యాడ్ ఏమో ఫుల్ నవ్వు తెప్పిస్తోంది. ఇందులో ధోనీతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కనిపించడం విశేషం. ఏదేమైనా మూవీ స్ఫూప్ లా తీసిన ఈ యాడ్.. ఇప్పుడు వైరల్ అయిపోయవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
RC16లో ధోని
-
ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే?
ఐపీఎల్-2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అన్ని విధాల సిద్దమవుతోంది. చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో సీఎస్కే ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత సీజన్లో గ్రూపు స్టేజికే పరిమితమైన సీఎస్కే.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అదరగొట్టాలన్న పట్టుదలతో ఉంది.రికార్డు స్ధాయిలో ఆరో ఐపీఎల్ ట్రోఫీపై మెన్ ఇన్ ఎల్లో కన్నేసింది. అందుకోసం సీఎస్కే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ ఏడాది సీజన్ కోసం సామ్ కుర్రాన్, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు సీఎస్కే జట్టులోకి వచ్చారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివమ్ దూబే, ధోని వంటి ఆటగాళ్లతో సీఎస్కే బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కన్పిస్తోంది. బౌలింగ్‌లోనూ పతిరానా, నాథన్ ఈల్లీస్, నూర్ ఆహ్మద్ వంటి యువ సంచలనాలతో సీఎస్కే బలంగా ఉంది. ఈ ఏడాది సీజన్లో సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్కే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు అంచనా వేశాడు.సీఎస్కే ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు డెవాన్ కాన్వే ప్రారంభించాలని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా గత సీజన్లో గైక్వాడ్‌కు ఓపెనింగ్ భాగస్వామిగా రచిన్ రవీంద్ర వచ్చాడు. కానీ గత సీజన్లో రవీంద్ర తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ క్రమంలోనే రవీంద్రను మూడో స్దానంలో బ్యాటింగ్‌కు పంపించాలని రాయుడు సూచించాడు. అదేవిధంగా నాలుగో స్ధానం కోసం దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంటుందని ఈ భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో శివమ్ దూబే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజాలకు అంబటి చోటు ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా మతీషా పతిరాన, అన్షుల్ కాంబోజ్.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా అశ్విన్‌కు తుది జట్టులో అతడు అవకాశమిచ్చాడు. కాగా ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.రాయుడు ఎంపిక చేసిన సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా/రాహుల్ త్రిపాఠి/విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, సామ్ కర్రాన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్బెంచ్: ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, జామీ ఓవర్టన్చదవండి: IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో రహానే.. -
రామ్ చరణ్ సినిమాలో ధోని.. నిజమెంత?
సినిమా వాళ్లతో క్రికెటర్లకి మంచి స్నేహబంధం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ తారలతో క్రికెటర్లంతా టచ్‌లో ఉంటారు. యాడ్స్‌లో కలిసి నటిస్తుంటారు. ఈ మధ్యకాలంలో వెండితెరపై కూడా కనిపిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ ప్లే చేస్తూ అలరిస్తున్నారు. అయితే మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించిన క్రికెటర్లు..ఇప్పుడు తెలుగు తెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక తాజాగా మరో స్టార్ క్రికెటర్ కూడా తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతంది. ఆయన ఎవరో కాదు..తనదైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni).నిజమెంత?రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 16 (RC 16) అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్‌కు ట్రైనర్‌గా ధోని కనిపించబోతున్నాడనే గాసిప్ బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. ధోని ఈ చిత్రంలో నటించడం లేదు. ఇదంతా ఒట్టి పుకారు మాత్రమేనని రామ్ చరణ్ పీఆర్ టీమ్ పేర్కొంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
15 ఏళ్ల నాటి ఆభరణాలతో, అందర్నీ కట్టి పడేసిన సాక్షి ధోనీ
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి ధోని హాజరయ్యారు. సతీసమేతంగా ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ధోని సందడి చేశాడు. రణబీర్ కపూర్ 2009 బ్లాక్ బస్టర్ “అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ”లోని “తు జానే నా” అనే సాంగ్‌కు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ పెళ్లిలో ఇంకో విశేషం కూడా చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని తన ఆకర్షణీయమైన శైలితో వార్తల్లో నిలిచింది.సాక్షి ధోని ఫ్యాషన్, స్టైల్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుకలో పెళ్లైన ఇన్నాళ్ల తరువాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత తన పెళ్లి రోజున ఆభరణాలను ఆభరణాలను తిరిగి ధరించింది.ఆ ఆభరణాలే అందరి దృష్టిని ఆకర్షించాయి. డైమండ్స్ ఆర్ ఫరెవర్ అన్నట్టు వజ్రాలు, పచ్చలు పొదిగిన గోల్డ్ జ్యుయల్లరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోల్డ్ చోకర్ నెక్‌పీస్, లేయర్డ్ నెక్లెస్, ముక్కెర, జుమ్కాలతో తన లుక్కు మరింత స్టైల్ యాడ్ చేసింది. లెమన్ గ్రీన్ కలర్ పట్టుచీర, స్కాలోప్-నెక్ డిజైన్ ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్, దీనికి జతగా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిర్రర్ దుపట్టాతో తన లుక్‌ను మరింత ఎలివేట్ చేసుకొని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే సాక్షి, దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.మరోవైపు పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ధోనీ, సాక్షి, పంత్ మధ్య ఆకర్షణీయ సంభాషణ కూడా వైరల్‌గామారింది. తమ రిలేషన్ షిప్ లో ధోనీనే లక్కీ అని సాక్షి సిగ్గుల మొగ్గలవుతూ చెప్పింది. ఇంతలో మధ్యలో కల్పించుకున్న పంత్, ఆడవాళ్లందరూ ఇలాగే అనుకుంటారని తుంటరి కమెంట్ చేయడంతో అక్కడంతా నవ్వులు పువ్వులు పూశాయి. ఈ వీడియోపై కామెంట్లు వెల్లువెత్తాయి.సాక్షి ధోని పెళ్లి రోజు లుక్15 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహానికి, భారీ నెక్లెస్, చూడామణి లాంటి ఆభరణాలు సహా బుటీ వర్క్, జర్దోసి ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు, ఆకుపచ్చ రంగు లెహంగా ధరించింది 2010 జూలై 10న డెహ్రాడూన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నిన్న ఆట.. ఇవాళ పాట.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ధోని వీడియోలు
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలు గత రెండు రోజులుగా ముస్సోరిలోని ఐటీసీ హోటల్లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సతీసమేతంగా హాజరయ్యాడు. ధోని.. భార్య సాక్షి ధోనితో కలిసి మెహంది, సంగీత్, హల్దీ ఫంక్షన్లలో సందడి చేశాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులోని ఓ వీడియో నిన్న ఇంటర్నెట్ను మొత్తం షేక్ చేసింది. ఇందులో ధోని, పంత్, రైనా కలిసి గ్రూప్‌గా డ్యాన్స్ చేశారు. ధోనిని చాలాకాలం తర్వాత డ్యాన్స్ చేసిది చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఇదే ఫంక్షన్‌కు సంబంధించిన మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ధోని.. భార్య సాక్షితో కలిసి రణబీర్ కపూర్ 2009 బ్లాక్ బస్టర్ "అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ"లోని "తు జానే నా" అనే పాట పాడుతూ కనిపించాడు. పాట పాడుతున్న సమయంలో మ్యూజిక్కు తగ్గట్టుగా ఆడాడు. ఆ సమయంలో ధోని ముఖం ఆనందంతో వెలిగిపోతూ కనిపించింది. పక్కనే ధోని భార్య సాక్షి కూడా పాటలో లీనమైపోయి కనిపించింది. This was my all time favourite song 😭😭.. I was listening this morning also 😭💛!!Tu Jaane naa 🫶🏻!!pic.twitter.com/Wb3wulVjVL— 𝑻𝑯𝑨𝑳𝑨 (@Vidyadhar_R) March 12, 2025ధోని దంపతులు లైవ్ మ్యూజిక్ ప్లే అవుతుండగా పెద్ద సంఖ్యలో జనసమూహంతో కలిసి ఆడిపాడారు. ఈ వీడియోను లక్షల సంఖ్యలో లైక్‌లు వస్తున్నాయి. పంత్ సోదరి వివాహ వేడుకల్లో ధోని జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలకు సురేశ్ రైనా కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. వీరిద్దరు సతీసమేతంగా ప్రతి ఈవెంట్లో పాల్గొని తెగ హడావుడి చేశారు. ధోని అయితే తమ ఇంట్లో ఫంక్షన్ అన్నట్లు లీనమైపోయి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. Rishabh Pant, MS Dhoni and Suresh Raina dancing at Rishabh Pant's sister's sangeet ceremony 🕺🏻❤️ pic.twitter.com/pw232528w8— Sandy (@flamboypant) March 11, 2025ఈ వేడుకలకు ధోని, రైనాతో పాటు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్ హీరోలైన ఈ ఇద్దరూ పంత్ మరియు కొత్తగా పెళ్లైన దంపతులతో కలిసి ఫోటోలకు పోజిచ్చారు. ఈ ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటోలో ధోని, గంభీర్ నలుపు రంగు టీ షర్ట్లు ధరించి కనిపించారు. ఎప్పడూ రిజర్వగా ఉండే గంభీర్ ఈ వివాహ వేడుకల్లో చాలా ఆనందంగా కనిపించాడు. గంభీర్.. తాజాగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2013లో ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు.. 12 ఏళ్ల తర్వాత గంభీర్ ఆథ్వర్యంలో మరోసారి టైటిల్ చేజిక్కించుకుంది. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా గెలుపులో ధోని, గంభీర్ కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే.కాగా, పంత్ సోదరి సాక్షి పంత్ తన చిరకాల ప్రియుడు అంకిత్ చౌదరీని నిన్న (మార్చి 12) ఉదయం మనువాడింది. సాక్షి-అంకిత్ పదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతేడాది జనవరి 6న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. సాక్షి ఎంబీఏ పూర్తి చేసి నేషనల్ ఫార్మసీ అసోసియేషన్‌లో పని చేస్తుంది. ఆమె భర్త అంకిత్ లండన్‌లో వ్యాపారం చేస్తున్నాడు. సాక్షికి సోదరుడు రిషబ్‌తో చాలా బాండింగ్ ఉంది. పంత్‌కు కారు ప్రమాదం జరిగినప్పుడు సాక్షి అన్నీ తానై చూసుకుంది. పంత్ కోలుకుని తిరిగి క్రికెట్ బరిలోకి దిగేందుకు సాక్షి ఎంతో తోడ్పడింది. -
రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుక.. డ్యాన్స్‌లతో పిచ్చెక్కించిన ధోని, రైనా
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలో భారత మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోని, సురేశ్ రైనా సందడి చేశారు. నిన్న రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరు డ్యాన్స్‌లతో పిచ్చెక్కించారు. ఈ వేడకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ధోని, పంత్, రైనా కలిసి గ్రూప్‌గా డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. Rishabh Pant, MS Dhoni and Suresh Raina dancing at Rishabh Pant's sister's sangeet ceremony 🕺🏻❤️ pic.twitter.com/pw232528w8— Sandy (@flamboypant) March 11, 2025నెటిజన్ల నుంచి ఈ వీడియోకు విపరీతమైన స్పందన వస్తుంది. ఈ వీడియోలో ధోని, రైనా చాలా హుషారుగా కనిపించారు. ఇంట్లో పెళ్లిలా అందరితో కలియతిరిగారు. ధోని, రైనాను ఇలా చూసి చాలా కాలమైందని వారి అభిమానులు అనుకుంటున్నారు. ధోని ఐపీఎల్ 2025 సన్నాహకాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ వేడకకు హాజరయ్యాడు. ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. పంత్ ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి హుషారుగా ఉన్నాడు. పంత్ త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. పంత్‌ను ఎల్ఎస్జీ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.కాగా, పంత్ సోదరి సాక్షి పంత్ తన చిరకాల ప్రియుడు అంకిత్ చౌదరీని ఇవాళ (మార్చి 12) ఉదయం మనువాడింది. వీరి వివాహం ముస్సోరిలోని ఐటీసీ హోటల్లో జరిగింది. వీరి వివాహాని ధోని, రైనా సతీసమేతంగా రెండు రోజుల ముందే హాజరయ్యారు. మెహంది, సంగీత్, హల్దీ ఫంక్షన్లలో సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సాక్షి పంత్ స్వయంగా సోషల్‌మీడియాలో షేర్ చేసింది.సాక్షి-అంకిత్ పదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతేడాది జనవరి 6న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. సాక్షి ఎంబీఏ పూర్తి చేసి నేషనల్ ఫార్మసీ అసోసియేషన్‌లో పని చేస్తుంది. ఆమె భర్త అంకిత్ లండన్‌లో వ్యాపారం చేస్తున్నాడు. సాక్షికి సోదరుడు రిషబ్‌తో చాలా బాండింగ్ ఉంది. పంత్‌కు కారు ప్రమాదం జరిగినప్పుడు సాక్షి అన్నీ తానై చూసుకుంది. పంత్ కోలుకుని తిరిగి క్రికెట్ బరిలోకి దిగేందుకు సాక్షి ఎంతో తోడ్పడింది.రిషబ్ పంత్‌కు ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం రాలేదు. మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్‌ను ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఎంపిక చేయడంతో పంత్ బెంచ్‌కు పరిమితం కాక తప్పలేదు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత పంత్ గతేడాది ఐపీఎల్ ఆడాడు. ఆ సీజన్లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతూ మంచి ప్రదర్శనలు చేశాడు. ఆతర్వాత పంత్ టీ20 వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. ఆ టోర్నీలోనూ పంత్ చక్కగా రాణించాడు. తద్వారా భారత్ రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం పంత్ ముందు ఐపీఎల్ టాస్క్ ఉంది. ఈ లీగ్‌లో పంత్ లక్నోను ఎలా నడిపిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుక.. డ్యాన్స్‌లతో పిచ్చెక్కించిన ధోని, రైనా (ఫొటోలు)
-
బీసీసీఐ నుంచి ధోనికి పెన్షన్.. నెలకు ఎంతో తెలుసా? (ఫోటోలు)
-
All Time India ODI XI: రోహిత్, కోహ్లిలకు చోటు.. కెప్టెన్‌గా ఎవరంటే?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) విజేతగా నిలవడంతో టీమిండియా ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ సేన ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. పటిష్ట వెస్టిండీస్ జట్టును ఓడించి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది.ఫలితంగా టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా కపిల్ దేవ్(Kapil Dev).. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును అజరామరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కలేదు. అయితే, మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆ లోటును తీర్చేశాడు.ధోని ఖాతాలో ముచ్చటగా మూడుఅంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించాడు. అనంతరం 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గానూ ధోని నిలిచాడు. అంతేనా.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపి.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత కెప్టెన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రోహిత్ ‘డబుల్’ హ్యాపీఇక తాజాగా రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన హిట్‌మ్యాన్.. తాజా ఈ వన్డే టోర్నమెంట్లోనూ జట్టును అజేయంగా ముందుకు నడిపి ట్రోఫీని ముద్దాడాడు. తద్వారా ధోని తర్వాత అత్యధిక సార్లు టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా నిలిచాడు ఈ వన్డే ‘ట్రిపుల్’ డబుల్ సెంచరీల వీరుడు.మరి కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ.. కెప్టెన్లుగా ఈ ఘనతలు సాధించారంటే అందుకు అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లది కూడా కీలక పాత్ర. 1983లో ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.ఇక 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలు కూడా అద్భుతంగా ఆడారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తమ వంతు పాత్ర పోషించగా.. తాజా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కూడా రాణించారు.బుమ్రాకు దక్కని చోటుఈ నేపథ్యంలో తన ఆల్‌టైమ్ వన్డే తుదిజట్లులో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ వీరందరికి చోటివ్వడం గమనార్హం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత చిన్నపిల్లాడిలా గంతులేసిన ఈ మాజీ సారథి... తాజాగా తన వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను పంచుకున్నాడు. ఈ జట్టులో క్రికెట్ దేవుడ్, వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్‌కు ఓపెనర్‌గా గావస్కర్ చోటిచ్చాడు. అయితే, ఈ జట్టుకు టీమిండియా ప్రధాన పేసర్, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం గావ స్కర్ ఎంపిక చేయలేదు.సునిల్ గావస్కర్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్:సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మొహిందర్ అమర్నాథ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్. భారత్ గెలిచిన ఐసీసీ టైటిళ్లు ఇవే1983- వన్డే వరల్డ్‌కప్2002- చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2007- టీ20 ప్రపంచకప్2011- వన్డే వరల్డ్‌కప్2013- చాంపియన్స్ ట్రోఫీ2024- టీ20 ప్రపంచకప్2025- చాంపియన్స్ ట్రోఫీ.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్‌బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్‌కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్‌కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్‌ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్‌లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్‌లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్‌పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్‌గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి! -
ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్‌కు రూ.18 లక్షలు చెల్లింపు.. ఎందుకంటే..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇద్దరు ప్రముఖ భారతీయ వ్యక్తులు మహేంద్ర సింగ్ ధోనీ, అభిషేక్ బచ్చన్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తూ వార్తల్లో నిలిచింది. ప్రముఖ క్రికెటర్ ధోనికేమో బ్యాంక్ బ్రాండ్‌ను ఎండార్స్ చేస్తున్నందుకు డబ్బు చెల్లిస్తుంటే.. అభిషేక్ బచ్చన్‌కు తన ప్రాపర్టీని బ్యాంకు అద్దెకు తీసుకున్నందుకు చెల్లింపులు చేస్తుంది.ఎంఎస్ ధోనీతో డీల్కెప్టెన్ కూల్‌గా పిలవబడే మహేంద్ర సింగ్ ధోనీని ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. క్రికెట్ జట్టులో అసాధారణ నాయకత్వ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన ధోని ఎస్బీఐతో కలిసి పనిచేయడం సంస్థ ఉత్పత్తులను, రెవెన్యూ వృద్ధికి ఎంతో తోడ్పడుతుందని బ్యాంకు నమ్ముతుంది. ధోనీకి తమ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం ఎస్బీఐ రూ.ఆరు కోట్లు చెల్లిస్తుంది. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న చివరి భారత కెప్టెన్‌గా ధోనీకి ఎంతో గుర్తింపు ఉంది. క్రికెట్ అభిమానులను తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.ఇదీ చదవండి: ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలుఅభిషేక్ బచ్చన్‌తో ప్రాపర్టీ లీజు ఒప్పందంబాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఎస్బీఐ నుంచి ప్రతి నెల రూ.18,00,000 అద్దె పొందుతున్నారు. ముంబయిలోని ప్రముఖులు నివసించే జుహు ప్రాంతాలోని బచ్చన్ కుటుంబానికి చెందిన జుహు బంగ్లాను లీజుకు ఇవ్వడానికి బ్యాంకుతో 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో లీజు ఒప్పందంలో భాగంగా బచ్చన్ కుటుంబానికి స్థిరమైన ఆదాయ సమకూరుతోంది. ఈ ఒప్పందంలో కాలానుగుణ అద్దె పెంపు కోసం క్లాజులు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్ విజయవంతమైన నటుడిగానే కాకుండా వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా తన వ్యాపార చతురతను నిరూపించుకున్నారు. జుహు బంగ్లాను ఎస్బీఐకు లీజుకు ఇవ్వాలని ఆయన తీసుకున్న నిర్ణయం మెరుగైన ఆర్థిక ప్రణాళికల్లో ఒకటిగా చూస్తున్నారు. -
నీట్లో 720/720.. ధోనీతో లింక్.. ‘మానవ్’ సక్సెస్ స్టోరీ
నీట్ సక్సెస్ స్టోరీస్ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. మానవ్ ప్రియదర్శి నీట్లో సాధించిన విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది. జార్ఖండ్‌కు చెందిన మానవ్ ప్రియదర్శి(Manav Priyadarshi) కుటుంబాన్ని డాక్టర్ల ఫ్యామిలీ అని అంటారు. ఇప్పటికే ముగ్గురు డాక్టర్లున్న ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మానవ్ ప్రియదర్శి తన ఎంబీబీఎస్ పూర్తిచేశాక నాల్గవ డాక్టర్ కానున్నాడు.చిన్నప్పటి చదువులో ఎంతో చురుకైన మానవ్ ప్రియదర్శి నీట్(NEET) యూజీలో మొదటి ప్రయత్నంలోనే 720 మార్కులకు 720 మార్కులు తెచ్చుకోవడం విశేషం. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంటున్న మానవ్ 2024లో జరిగిన నీట్ యూజీ పరీక్షలో జార్ఖండ్‌లో టాపర్‌గా నిలిచాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 57 తెచ్చుకుని, టాప్ 100 నీట్ టాపర్స్‌లో ఒకనిగా నిలిచాడు. నాడు మీడియాతో మానవ్ ప్రియదర్శి మాట్లాడుతూ తనకు టాపర్‌గా నిలుస్తాననే నమ్మకం ఉందని, కానీ స్టేట్ నంబర్ వన్‌గా నిలుస్తానని అనుకోలేదన్నారు.మానవ్ ప్రియదర్శికి ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి(Dhoni) మధ్య ఒక సంబంధం ఉంది. రాంచీలో జేవీఎం శ్యామలీ స్కూలుకు మంచి పేరు ఉంది. ఇదే స్కూలులో ఎంఎస్ ధోనీ చదువుకున్నాడు. ఇప్పుడు ఇదే స్కూలు నుంచి మానవ్ 12వ తరగతి పూర్తి చేశాడు. తాను సాధించిన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని మానవ్ చెప్పుకొచ్చాడు. మానవ్ ప్రియదర్శి నీట్ యూజీ పరీక్షలో 99.9946856 పర్సంటేజీ తెచ్చుకున్నాడు.మానవ్ ప్రియదర్శి తండ్రి సుధీర్ కుమార్ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్(Physics professor). మానవ్ పెద్దక్క డాక్టర్ నిమిషా ప్రియ భాగల్పూర్ మెడికల్ కాలేజీలో డాక్టర్. మానవ్ చిన్నాన్న డాక్టర్ ప్రిన్స్ చంద్రశేఖర్ సహరసాలో మెడికల్ ఆఫీసర్. మానస్ మామ డాక్టర్ రాజీవ్ రంజన్ రాంచీ ప్రభుత ఆస్పత్రి వైద్యులు. మానవ్ మీడియాతో మాట్లాడుతూ విజయానికి దగ్గరి దారులుండవని, లక్ష్యాన్ని నిర్థారించుకుని, పట్టుదలతో చదివితే ఓటమి ఎదురు కాదన్నాడు. ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో హిట్‌మ్యాన్ తప్పక బ్యాట్ ఝులిపిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్-2023 మాదిరి ఈ మెగా టోర్నీలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడుగానే ఆడతాడని అంచనా వేశాడు.ఘోర పరాభవాలుకాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ముంబైకర్.. గతేడాది ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఘోర పరాభవం పాలైంది.దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే ద్వైపాక్షిక సిరీస్ కోల్పోయింది. అనంతరం.. టెస్టులతో బిజీ అయిన రోహిత్ శర్మ.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో, ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో ఈ రెండు సిరీస్‌లనూ టీమిండియా కోల్పోయింది.అనంతరం రంజీ బరిలో దిగిన రోహిత్ శర్మ అక్కడా ముంబై ఓపెనర్‌గా విఫలమయ్యాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానున్నాడు. ఈ నేపథ్యంఓ 37 ఏళ్ల రోహిత్ శర్మను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడుతూ.. అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ కానుందని పేర్కొన్నాడు.అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం‘‘చాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ శర్మ దూకుడుగానే ఆడతాడని అనుకుంటున్నా. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లోనూ అతడు అగ్రెసివ్‌గా ముందుకెళ్లాడు. కాబట్టి ఈసారీ అదే జోరు కొనసాగిస్తాడు. అయితే, అతడితో పాటు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగేది ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశం.శుబ్‌మన్ గిల్ వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ గిల్ గనుక ఓపెనర్‌గా ఉంటే.. అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం. ఏదేమైనా రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇదే చివరి ఐసీసీ ఈవెంట్ కానుంది. ఒకవేళ ఇందులో గనుక భారత్ గెలిస్తే.. నాలుగు ఐసీసీ ట్రోఫీలు ముద్దాడిన తొలి టీమిండియా ప్లేయర్‌గా అతడు చరిత్రకెక్కుతాడు.ఇక సారథిగా ఇప్పటికే టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ.. చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. అయితే, అతడు ఈ టోర్నీలో బ్యాటర్‌గానూ రాణించాల్సి ఉంది’’ అని సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు. ఇక కెప్టెన్‌గా 2024 టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీనీ ముద్దాడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి రెండున న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక ఈ టోర్నీలో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ టైటిల్ కోసం తలపడుతున్నాయి.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
ధోనిని అధిగమించిన దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ టీ20ల్లో ఓ భారీ రికార్డును సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు. టీ20ల్లో ధోని 391 మ్యాచ్‌ల్లో 7432 పరుగులు చేయగా.. డీకే 409 మ్యాచ్‌ల్లో 7451 పరుగులు సాధించాడు. ఐపీఎల్ సహా భారత క్రికెట్ మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించిన డీకే ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డీకే.. నిన్న (జనవరి 27) డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 2 భారీ సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసిన కార్తీక్ మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోని రికార్డును బద్దలు కొట్టాడు.39 ఏళ్ల దినేశ్ కార్తీక్ పొట్టి ఫార్మాట్లో 26.99 సగటున, 136.84 స్ట్రయిక్‌రేట్‌తో 34 హాఫ్ సెంచరీల సాయంతో 7451 పరుగులు చేశాడు. ఇందులో 718 బౌండరీలు, 258 సిక్సర్లు ఉన్నాయి. ధోని విషయానికొస్తే.. ఈ మాజీ సీఎస్కే కెప్టెన్ తన టీ20 కెరీర్లో 38.11 సగటున, 135.64 స్ట్రయిక్‌రేట్‌తో 28 హాఫ్ సెంచరీల సాయంతో 7432 పరుగులు చేశాడు. ఇందులో 517 ఫోర్లు, 338 సిక్సర్లు ఉన్నాయి. 43 ఏళ్ల ధోనికి కార్తీక్ రికార్డును తిరిగి అధిగమించేందుకు మరో అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. తదుపరి ఐపీఎల్ సీజన్లో ధోని మరి కొన్ని పరుగులు చేసినా డీకేను అధిగమిస్తాడు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండో ఎడిషన్‌లో డీకేకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. ఈ సీజన్లో అతను ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఐదుసార్లు మాత్రమే బ్యాటింగ్‌కు దిగాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కూడా నిన్న జరిగిన మ్యాచ్‌లో చేసిన స్కోరే అత్యధికం. కార్తీక్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేకపోయినా పార్ల్ రాయల్స్ ఈ సీజన్లో అదరగొట్టింది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. తాజా గెలుపుతో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాయల్స్ చేతిలో ఓటమితో డర్బన్ సూపర్ జెయింట్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. డర్బన్ సూపర్ జెయింట్స్‌పై పార్ల్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్ జెయింట్స్ తరఫున మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ మరో బంతి మిగిలుండగా 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ జో రూట్ డకౌటై నిరాశపర్చగా.. డ్రి ప్రిటోరియస్ (43), రూబిన్ హెర్మన్ (59) రాయల్స్‌ను గెలిపించారు. చివర్లో దినేశ్ కార్తీక్ (15 బంతుల్లో 21) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. -
అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: మాజీ క్రికెటర్
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ తెలుగు తేజం.. ఇప్పటికే రెండు శతకాలు సాధించాడు. కష్టతరమైన సౌతాఫ్రికా పిచ్‌లపై వరుస సెంచరీలతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్(India vs England)లోనూ అదరగొడుతున్నాడు.స్వదేశంలో ఇంగ్లిష్ జట్టుతో కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట.. తాను మాత్రం బ్యాట్ ఝులిపించాడు.సూపర్ ఫినిషింగ్ టచ్ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఫోర్ బాది జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 72 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో.. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. ఈ రెండు సందర్బాల్లోనూ 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి టీమిండియాను గెలిపించడం విశేషం.ఈ నేపథ్యంలో తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్‌ను ఏకంగా మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)తో పోలుస్తూ ఆకాశానికెత్తడం విశేషం. ‘‘ఆఖరి వరకు అతడి ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. పద్దెమినిదవ ఓవర్లోనూ ఏమాత్రం భయపడలేదు.తిలక్ వర్మ అచ్చం ఆ దిగ్గజం మాదిరేఅంతెందుకు పందొమ్మిదవ ఓవర్లో టీమిండియాకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. అప్పుడూ అతడు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. ఫోర్‌తో ఫినిష్ చేశాడు. అతడు ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు జట్టును కూడా కాన్ఫిడెంట్‌గా ఉంచుతున్నాడు.ధోని కంటే కాస్త మెరుగేగతంలో మనకు ఇలాంటి దిగ్గజం ఒకరు ఉండేవారు. అతడు మరెవరో కాదు మహేంద్ర సింగ్ ధోని. తను కూడా ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ముగించేవాడు. అతడిలాంటి వ్యక్తి.. అది కూడా మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇలాంటి ఫలితాలు రాబట్టడం మామూలు విషయం కాదు’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో టైమ్అవుట్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా తిలక్ వర్మ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడి 156కు పైగా స్ట్రేక్రేటుతో 707 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 120. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా రెండు గెలిచింది. ఆధిక్యంలో టీమిండియాతొలి టీ20లో ఏడు వికె ట్ల తేడాతో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రెండో మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగనుంది. తదుపరి పుణె, ముంబైలలో మిగిలిన టీ20లు జరుగుతాయి.చదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణం ఇదే!2️⃣-0️⃣ 🙌Tilak Varma finishes in style and #TeamIndia register a 2-wicket win in Chennai! 👌Scorecard ▶️ https://t.co/6RwYIFWg7i #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/d9jg3O02IB— BCCI (@BCCI) January 25, 2025 -
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే అత్యధిక వయస్కులు వీరే..!
ఐపీఎల్-2025లో పాల్గొనే అత్యధిక వయస్కుల వివరాలను ఈ ఐటంలో చూద్దాం. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనబోయే అత్యధిక వయస్కుడిగా ధోని రికార్డు సృష్టించాడు. ధోని 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 ఆడతాడు. ధోనిని ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్ చేసుకుంది. సీఎస్కేకు ఐదు సార్లు టైటిళ్లు అందించిన ధోని ఈసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే రెండో అత్యధిక వయస్కుడు ఫాఫ్ డుప్లెసిస్. డుప్లెసిస్ 40 ఏళ్ల వయసులో క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్ 2025 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. మెగా వేలంలో డీసీ డుప్లెసిస్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. డుప్లెసిస్ ఐపీఎల్లో 145 మ్యాచ్‌లు ఆడి 4571 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో మూడో అత్యధిక వయస్కుడు రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ 38 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడతాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యష్‌ను 9.75 కోట్లకు సొంతం చేసుకుంది. అశ్విన్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు.ఐపీఎల్-2025 నాలుగో అత్యధిక వయస్కుడు రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్ 37 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్‌కు ఆడతాడు. ముంబై ఇండియన్స్ 16.3 కోట్లకు రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ తదుపరి సీజన్లో సాధారణ ఆటగాడిగా బరిలో ఉంటాడు. రోహిత్ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడి 6628 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనే ఐదో అత్యధిక వయస్కుడు మొయిన్ అలీ. మొయిన్ అలీ 37 ఏళ్ల వయసులో (రోహిత్ కంటే చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. మెగా వేలంలో కేకేఆర్ మొయిన్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. మొయిన్ తన ఐపీఎల్ కెరీర్లో 67 మ్యాచ్‌లు ఆడి 1162 పరుగులు చేసి 35 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఆరో అత్యధిక వయస్కుడు కర్ణ్ శర్మ. కర్ణ శర్మ 37 ఏళ్ల (రోహిత్, మొయిన్ కంటే రోజుల్లో చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. కర్ణ్ శర్మను మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. కర్ణ్ శర్మ ఐపీఎల్లో 84 మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఏడో అత్యధిక వయస్కుడు ఆండ్రీ రసెల్. రసెల్ 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు రసెల్‌ను కేకేఆర్ రీటైన్ చేసుకుంది. రసెల్ ఐపీఎల్లో 126 మ్యాచ్‌లు ఆడి 2484 పరుగులు చేసి 115 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఎనిమిదో అత్యధిక వయస్కుడు సునీల్ నరైన్. నరైన్ 36 ఏళ్ల వయసులో (రసెల్ కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు కేకేఆర్ నరైన్‌ను రీటైన్ చేసుకుంది. నరైన్ ఐపీఎల్లో 1534 పరుగులు చేసి 180 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే తొమ్మిదో అత్యధిక వయస్కుడు అజింక్య రహానే. రహానే 36 ఏళ్ల (రసెల్, నరైన్ కంటే రోజుల్లో చిన్నవాడు) వయసులో క్యాష్ రిచ్ లీగ్ ఆడనున్నాడు. రహానేను మెగా వేలంలో కేకేఆర్ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. రహానే తన ఐపీఎల్ కెరీర్లో 185 మ్యాచ్‌లు ఆడి 30.14 సగటున 4642 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే పదో అత్యధిక వయస్కుడు ఇషాంత్ శర్మ. ఇషాంత్ 36 ఏళ్ల వయసులో (రసెల్, నరైన్, రహానే కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. ఇషాంత్‌ను 2025 సీజన్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఇషాంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి వేలంలో అమ్ముడుపోయిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇషాంత్ ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. -
విజయ్ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడి విధ్వంసం
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు, మాజీ సీఎస్కే ప్లేయర్ ఎన్ జగదీశన్ (తమిళనాడు) అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో జగదీశన్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. రాజస్థాన్ పేసర్ అమన్ సింగ్ షెకావత్ బౌలింగ్‌లో జగదీశన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన షెకావత్.. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఈ బంతిని వికెట్ కీపర్ పట్టుకోలేకపోవడంతో బౌండరీకి వెళ్లింది. దీంతో రెండో ఓవర్లో బంతి పడకుండానే తమిళనాడు ఖాతాలో ఐదు పరుగులు చేరాయి. అనంతరం షెకావత్ వేసిన ఆరు బంతులను ఆరు బౌండరీలుగా మలిచాడు జగదీశన్. ఫలితంగా రెండో ఓవర్లో తమిళనాడుకు 29 పరుగులు వచ్చాయి. జగదీశన్ షెకావత్‌కు సినిమా చూపించిన వీడియో (ఆరు బౌండరీలు) సోషల్‌మీడియాలో వైరలవుతుంది.4⃣wd,4⃣,4⃣,4⃣,4⃣,4⃣,4⃣29-run over! 😮N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls in the second over to provide a blistering start for Tamil Nadu 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/pSVoNE63b2 pic.twitter.com/JzXIAUaoJt— BCCI Domestic (@BCCIdomestic) January 9, 2025తమిళనాడు వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన జగదీశన్ 2018 నుంచి 2022 వరకు ధోని అండర్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277) చేసిన రికార్డు జగదీశన్ పేరిటే ఉంది. జగదీశన్‌ను 2023 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ 90 లక్షలకు సొంతం చేసుకుంది. 2024, 2025 ఎడిషన్లలో జగదీశన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన జగదీశన్ 110.20 స్ట్రయిక్‌రేట్‌తో 162 పరుగులు మాత్రమే చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0), ఎన్ జగదీశన్ (65; 10 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (37) ఔట్ కాగా.. విజయ్ శంకర్ (18), మొహమ్మద్ అలీ (23) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీ, అమన్ సింగ్ షెకావత్, అజయ్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 104 పరుగులు చేయాలి. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సచిన్ టెండుల్కర్, యువీ.. కూతురి కోసం ధోని అలా!(ఫొటోలు)
-
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 19) రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌కు శుభారంభం లభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడో టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. పాక్ క్రికెట్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది.ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ లాంగ్ స్టాండింగ్ బ్యాటింగ్ రికార్డుపై కన్నేశాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో బాబర్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఏడు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4732 పరుగులు చేశాడు. మరోవైపు ధోని SENA దేశాల్లో 38 హాఫ్ సెంచరీ సాయంతో 5273 పరుగులు చేశాడు. SENA దేశాల్లో ధోని, బాబర్ ప్రస్తుతం 38 యాభై ప్లస్ స్కోర్లు కలిగి ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డేలో బాబర్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. SENA దేశాల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని అధిగమిస్తాడు.తొలి వన్డేలో పాక్ ఘన విజయంతొలి వన్డేలో అఘా సల్మాన్ ఆల్‌రౌండర్ షో, సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డేలో బాబర్ ఆజమ్ 23 పరుగులు చేసి ఓట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బాబర్‌కు శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. బాబర్ గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమవుతున్నాడు. అతను హాఫ్ సెంచరీ మార్కు తాకి కూడా చాన్నాళ్లవుతుంది. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అరుదైన ఘనత నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో 150 ఔట్లు సాధించిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అందుకున్న పంత్.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ ఇప్పటివరకు 41 టెస్టు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా 135 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు చేశాడు. పంత్ కంటే ముందు ఎంఎస్ ధోనీ, సయ్యద్ కిర్మాణి మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. మిస్టర్ కూల్ 256 క్యాచ్‌లు, 36 స్టంపింగ్‌లతో 294 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు.అదే విధంగా రెండో స్ధానంలో ఉన్న సయ్యద్ కిర్మాణి 160 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లతో మొత్తంగా 198 ఔట్ల్లో పాలుపంచుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు వరుణుడు కరుణించాడు. తొలిసెషన్లో ఆస్ట్రేలియాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు.28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే తొలి సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటకీ.. తర్వాత ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. 53 ఓవర్లకు ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్! వీడియో -
'ధోని లాంటి కెప్టెన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్'
మహేంద్ర సింగ్ ధోని.. భారత అభిమానులందరూ ఆరాధించే క్రికెటర్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికి నాలుగేళ్లు అవుతున్నప్పటికి.. ఈ టీమిండియా లెజెండ్‌పై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. ఏడాదికి ఓ సారి ఐపీఎల్లో ఆడే తలైవా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటారు.ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ అలరించేందుకు మిస్టర్ కూల్ సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ధోనిపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని అద్బుతమైన కెప్టెన్ అని, అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని గోయోంకా తెలిపాడు."భారత క్రికెట్ చరిత్రలో ధోని పేరు నిలిచిపోతుంది. ధోని లాంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. అతడి ఆలోచిన విధానం, పరిపక్వత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతి చిన్న వయస్సులోనే ఎంఎస్ తనను తను తీర్చుదిద్దుకున్న విధానం నిజంగా అద్బుతం.ధోని తన అనుభవంతో ఎంతో మంది యువ క్రికెటర్లను సైతం తీర్చిదిద్దాడు. మతీషా పతిరానానే ఉదాహరణగా తీసుకుండి. పతిరానాను ధోని ఏకంగా మ్యాచ్ విన్నర్‌గా తాయారు చేశాడు. తన ఆటగాళ్లను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ధోనికి బాగా తెలుసు.ధోనిని కలిసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఓసారి లక్నో, చెన్నై మ్యాచ్ సందర్భంగా నేను ధోనిని కలిశాను. నాతో 11 ఏళ్ల నా మనవడు కూడా ఉన్నాడు. అతడికి క్రికెట్ అంటే పిచ్చి. ఐదారేళ్ల కిందట ధోనినే నా మనవడికి క్రికెట్ ఆడటం నేర్పించాడు.ఈ సందర్భంగా అతడు ధోనికి కంటిన్యూగా ఏవో ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అందుకు ధోని విసుగు చెందకుండా సమాధానాలు చెబుతూ వచ్చాడు. చివరికి నేనే ధోని దగ్గరకు వెళ్లి అతడిని విడిచిపెట్టేయండి అని చెప్పా. కానీ ధోని మాత్రం నా మనవుడితో సంభాషణను ఆస్వాదిస్తున్నాను చెప్పాడు.దాదాపు అరగంట పాటు అతడితో ముచ్చటించాడు. ఒక పిల్లవాడి కోసం అంత సమయం వెచ్చించిన ధోని నిజంగా గొప్పవాడు. అతడి క్యారక్టెర్ ఇతరులతో మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అందుకే అతడు ధోని అయ్యాడు. అతడు ఎప్పుడు లక్నోతో మ్యాచ్ ఆడినా, స్టేడియం మొత్తం ఎంఎస్‌కి సపోర్ట్‌గా పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది" అని టీఆర్ఎస్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయెంకా పేర్కొన్నాడు.చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
2024 జనవరి నుంచి జూన్ వరకు టాప్ 10 బ్రాండ్ ప్రమోటర్లు (ఫోటోలు)
-
బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్
ఏదైనా ఉత్పత్తులను తయారు చేసిన తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆదరణ పొందేలా చేసేది ప్రచారాలే. తమ వ్యాపారాలను మరింత మందికి చేరువ చేసేందుకు చాలామంది విభిన్న ప్రచారపంథాను ఎంచుకుంటారు. కొందరు ఫ్లెక్సీలపై అందరికీ కనిపించేలా తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తే.. ఇంకొందరు టీవీల్లో అడ్వర్టైజ్ ఇస్తారు. ఇలా చాలామంది విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే, దాదాపు అన్ని ప్రచార హోర్డింగ్‌లపై ప్రముఖుల ఫొటోలను మాత్రం కామన్‌గా చూస్తూంటాం. ఓ క్రికెటర్, సినీ యాక్టర్, మోడల్.. ఇలా మన సమాజంలో బాగా పేరున్న వారిని కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు వాడుతుంటాయి. అందుకు కొంత పారతోషికం చెల్లిస్తుంటాయి. భారత్‌లో గతేడాదితో పోలిస్తే తమ బ్రాండ్ ప్రమోషన్లు పెరిగిన వ్యక్తుల వివరాలను టామ్ మీడియా రిసెర్చ్ విడుదల చేసింది. ఈ సంస్థ యూఎస్ఏ నీల్సెన్, యూకే కాంటర్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ వివరాలు ప్రకటించింది.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?ఈ లిస్ట్‌లో గతేడాది టాప్‌లో నిలిచిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (40 బ్రాండ్లకు ఎండార్స్మెంట్)ను ఈసారి కెప్టెన్ కూల్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ(42 బ్రాండ్లకు ఎండార్స్మెంట్) వెనక్కినెట్టారు. -
చెత్త రికార్డు సమం చేసిన రోహిత్.. ధోని, విరాట్‌తో పాటు..!
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది.చెత్త రికార్డు సమం చేసిన రోహిత్తాజా ఓటమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఓటములు (4) చవిచూసిన మూడో భారత సారథిగా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, దత్తా గైక్వాడ్ సరసన నిలిచాడు. రోహిత్ సారథ్యంలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ధోని, విరాట్ నేతృత్వాల్లో కూడా భారత్ వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది. టెస్టుల్లో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన భారత కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పటౌడి (6 ఓటములు, 1967-68), సచిన్ టెండూల్కర్ (5 ఓటములు, 1990-2000) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ధోని (4 ఓటములు, 2011, 2014), విరాట్ (4 ఓటములు, 2020-21), రోహిత్ (4 ఓటములు, 2024) ఉన్నారు. కాగా, ఆసీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా స్వదేశంలో రోహిత్ నేతృత్వంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’
‘‘లేదు.. నేను ధోనితో మాట్లాడటం లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడినపుడు.. అప్పుడప్పుడు ఆట గురించి మాట్లాడుకునేవాళ్లం. అయితే, ధోనితో మనసు విప్పి మాట్లాడి పదేళ్లకు పైగానే అయింది. ఇందుకు నా దగ్గర ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు.ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదుబహుశా ధోని దగ్గర రీజన్ ఉండవచ్చు. అయితే, ఆ కారణం ఏమిటో నాకు మాత్రం తెలియదు. సీఎస్కేతో ఉన్నపుడు కూడా మైదానంలో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడేవాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదు. నేను కూడా అతడి గదికి వెళ్లేవాడిని కాదు.ధోని పట్ల నాకెలాంటి వ్యతిరేక భావం లేదు. కానీ అతడికి నా మీద ఏదైనా కోపం ఉందేమో! ఒకవేళ అదే నిజమైతే అతడు ఆ విషయం గురించి నాతో మాట్లాడవచ్చు. నేనెప్పుడూ అతడికి కనీసం కాల్ కూడా చేయలేదు. ఎందుకంటే.. నేను ఫోన్ చేసినపుడు లిఫ్ట్ చేసి మాట్లాడితేనే మరోసారి ఫోన్ చేయాలనిపిస్తుంది.అలాంటి వాళ్లతో నేనెందుకు మాట్లాడాలి?లేదంటే.. అటువంటి వాళ్లను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే బంధం అనేది రెండువైపులా ఉండాలి. మనం ఎదుటివారికి గౌరవం ఇస్తేనే.. మనకు కూడా గౌరవం దక్కుతుంది. నేను రెండుసార్లు ఫోన్ చేసినా.. అటువైపు నుంచి స్పందన లేకపోతే.. నేనెందుకు అలాంటి వ్యక్తితో మాట్లాడతా!’’ అంటూ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరి మధ్య మాటలులేక దశాబ్దకాలం గడిచిందన్నాడు భజ్జీ. తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా ధోని నుంచి స్పందన లేకపోవడంతో తాను కూడా అతడికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు భజ్జీ తెలిపాడు.అదంతా నిజమేకాగా ధోని- భజ్జీ మధ్య విభేదాలున్నాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా క్రికెట్నెక్స్ట్తో మాట్లాడిన హర్భజన్ సింగ్ అదంతా నిజమేనని ధ్రువీకరించాడు. కాగా 2007లో ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో.. అదే విధంగా.. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాలోనూ హర్భజన్ సింగ్ సభ్యుడు. అంతేకాదు.. 2018 నుంచి 2020 వరకు ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భజ్జీ ఆడటం గమనార్హం. అయితే, వీరిద్దరి బంధం బీటలు వారడానికి గల కారణంపై మాత్రం స్పష్టత లేదు. చదవండి: Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్ -
సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ తండ్రి భారత క్రికెట్ దిగ్గజాలపై ఇష్టారీతిన కామెంట్లు చేయడం తగదని.. ఆయన క్షమాపణ చెబితే బాగుంటుందని హితవు పలికాడు. లేదంటే.. ఆ ప్రభావం సంజూ ఆటపై కచ్చితంగా పడుతుందని పేర్కొన్నాడు.కాగా కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక టెస్టుల్లో ఇంత వరకు సంజూ స్థానం దక్కించుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అతడికి అరకొర అవకాశాలే వచ్చేవి. అయితే, ఆ సమయంలోనూ నిలకడలేమి ఆటతో చోటు కోల్పోయేవాడు.సఫారీ గడ్డపై శతకాలు బాదిఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. సంజూకు టీ20 జట్టులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో, సౌతాఫ్రికా గడ్డపై సంజూ బ్యాట్‌తో సత్తా చాటాడు. సఫారీలతో టీ20 సిరీస్‌లో రెండు శతకాలు బాది.. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.ఆ నలుగురి కారణంగానేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఓ మలయాళ చానెల్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ వల్లే తన కుమారుడి పదేళ్ల కెరీర్ నాశనమైనందని ఆయన ఆరోపించాడు. విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ లెజెండ్ బ్రాడ్ హాగ్ తాజాగా స్పందించాడు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదుఈ మేరకు.. ‘‘సంజూ శాంసన్ తండ్రి బహిరంగంగా ధోని, కోహ్లి, రోహిత్, ద్రవిడ్ పేర్లు చెబుతూ.. తన కొడుకు కెరీర్లో పదేళ్లు వెనకబడటానికి కారణం వాళ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. భారత క్రికెట్లో ముఖ్యమైన, కీలకమైన నాలుగు పేర్లను ఆయన ప్రస్తావించారు.వాళ్లంతా తమ హయాంలో టీమిండియాను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తులు. నిజానికి సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నాడు. రెండు సెంచరీలతో సత్తా చాటి.. తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు.సంజూ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుందిఇలాంటి సమయంలో సంజూ కుటుంబం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం.. అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. సంజూ కెరీర్ సాఫీగా, ప్రశాంతంగా సాగాలంటే.. అతడి తండ్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే.. తండ్రి వ్యాఖ్యల వల్ల ఒత్తిడికి లోనైతే.. సంజూ ఆట తీరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.నోళ్లను అదుపులో పెట్టుకునిఐపీఎల్లో ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. సంజూతో పాటు భారత్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. కాబట్టి ఎవరైనా సరే.. నోళ్లను అదుపులో పెట్టుకుని.. బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానం ఇస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అంటూ బ్రాడ్ హాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్ -
ఆ నలుగురు మావాడి కెరీర్‌ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తర్వాతి మ్యాచ్‌ల్లో తన జోరును కొనసాగించలేకపోతున్నాడు. వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించి చరిత్రకెక్కిన శాంసన్.. ఇప్పుడు అదే వరుస మ్యాచ్‌ల్లో డకౌటై తీవ్ర నిరాశపరిచాడు.ఏదైమైనప్పటకి బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై వరుసగా సెంచరీలు సాధించిన సంజూ భారత టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడనే చెప్పుకోవాలి. 2015లో టీమిండియా తరపున టీ20 అరంగేట్రం చేసిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఎక్కువ సందర్భాల్లో జట్టు బయటే ఉన్నాడు.కొన్ని సార్లు జట్టులోకి వచ్చినప్పటికి తన పేలవ ప్రదర్శనతో నిరాశపరిచేవాడు. దీంతో అతడిని సెలక్టర్లు పక్కన పెట్టేవారు. అయితే ఇటీవల కాలంలో సీనియర్ ఆటగాళ్లు బీజీ షెడ్యూల్ కారణంగా సంజూకు టీ20 జట్టులో రెగ్యూలర్‌గా చోటు దక్కుతుంది.ఈసారి మాత్రం సంజూ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. దీంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కానీ సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవకాశాలు ఇవ్వకుండా తన కొడుకు 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించాడు. ఆ నలుగురే!"ముగ్గురు-నలుగురు వ్యక్తులు నా కొడుకు 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారు. విరాట్ కోహ్లి, ధోని, రోహిత్ శర్మ వంటి కెప్టెన్లు సంజూ శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వలేదు. వారితో కూడా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సంజూవైపు పెద్దగా మొగ్గు చూపలేదు.ఈ నలుగురు అతడి కెరీర్‌ను నాశనం చేయడంతో పాటు అతడిని తీవ్రంగా బాధపెట్టారు. కానీ సంజూ మాత్రం వాటన్నంటిని బలంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాడు"అని మలయాళం అవుట్లెట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
థాయ్‌లాండ్ ట్రిప్‌లో ధోని కుటుంబం.. బీచ్ ఒడ్డున అలా (ఫొటోలు)
-
‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అని ద్రవిడ్ డైరెక్ట్‌గానే చెప్పేశాడు!
‘సంతోషకరమైన నా క్రికెట్ ప్రయాణంలో ఇది నా చివరి సీజన్. రిటైర్మెంట్‌లోగా రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడతాను. బెంగాల్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఈ సీజన్‌ను మర్చిపోలేనిదిగా మార్చుకుంటాం’ అంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా చెప్పుకోదగ్గ సాహాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పవచ్చు.ధోని నీడలో..నిజానికి వికెట్ కీపర్‌గా సాహా అద్భుత ప్రతిభావంతుడు. గత కాలపు భారత కీపర్లు సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా తరహాలో అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో పాటు అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల సమర్థుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కీపర్‌గా పేరు వచ్చినా... టీమిండియాను శాసిస్తున్న ధోని ఉండటంతో అతను తన చాన్స్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.2010లో నాగపూర్ టెస్టుకు ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా గాయపడటంతో సాహాకు బ్యాటర్‌గా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. మరో రెండేళ్ల తర్వాత స్లో ఓవర్‌రేట్ కారణంగా ధోనిపై నిషేధం పడటంతో రెండో టెస్టు దక్కింది. ఎట్టకేలకు 2014–15 ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు తర్వాత ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా అసలు కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు ప్రధాన కీపర్‌గా సాహా తన సత్తాను ప్రదర్శిస్తూ ప్రపంచ అత్యుత్తమ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.పంత్ రాకతో పాత కథ మళ్లీ మొదలుస్వదేశంలో గిర్రున తిరిగే అతి కష్టమైన స్పిన్ బంతులనైనా, విదేశీ గడ్డపై సీమ్ బంతులనైనా స్టంప్‌ల వెనక చురుగ్గా, సమర్థంగా అందుకోవడంలో అతనికి అతనే సాటిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో కూడా కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ దూసుకొచ్చిన తర్వాత సాహా వెనుకబడిపోయాడు. పంత్ ఉన్నప్పుడు కూడా కొంత కాలం రెండో కీపర్‌గా జట్టులో అవకాశం దక్కినా అది ఎంతో కాలం సాగలేదు. కోచ్ ద్రవిడ్ ‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అంటూ సాహాకు నేరుగా చెప్పేయడంతో అతని టెస్టు కెరీర్ ముగిసింది. ఐపీఎల్లో అదే హైలైట్2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో సాహా కూడా ఉన్నాడు. కోల్‌కతా, చెన్నై, పంజాబ్, హైదరాబాద్, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రయిక్‌రేట్‌తో 2934 పరుగులు సాధించాడు.ఇక 2014లో ఫైనల్లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు సాధించిన ప్రదర్శన అతని ఐపీఎల్ కెరీర్లో హైలైట్. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు.అతడిని తన వారసుడిగా తీర్చిదిద్దిబెంగాల్ యువ కీపర్ అభిషేక్ పొరేల్కు మెంటార్‌గా వ్యవహరించి తన వారసుడిగా అతడిని సాహా తీర్చిదిద్దాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో విభేదాల కారణంగా రెండేళ్లు త్రిపుర తరఫున ఆడిన సాహా ఈ సీజన్లో మళ్లీ తిరిగొచ్చాడు.అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా... ఈ టోర్నీనే తనకు చివరిదని వెల్లడించాడు. మూడేళ్ల క్రితమే చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల సాహా రంజీ తర్వాత దేశవాళీ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ రంజీలో బెంగాల్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా...లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆడిన ఒకే ఒక ఇన్నింగ్స్‌లో అతను డకౌటయ్యాడు.కాగా టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడిన సాహా 29.41 సగటుతో సాహా 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 92 క్యాచ్‌లు అందుకున్న అతను 12 స్టంపింగ్‌లు చేశాడు. టీమిండియా తరఫున 9 వన్డేలు కూడా ఆడిన సాహాకు అంతర్జాతీయ టీ20లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 138 మ్యాచ్‌లు ఆడటం విశేషం.చదవండి: Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ -
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IPL 2025: సీఎస్కే సంచలన నిర్ణయం!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను వేలంలోకి విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని నిశ్చయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆ ముగ్గురిని రిటైన్ చేసుకుని...కాగా తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంఛైజీలకు గురువారం వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అట్టిపెట్టుకోనుందట.ధోని వారసుడి కోసంఅయితే, లెజెండరీ వికెట్ కీపర్ ధోనికి సరైన వారసుడిని ఎంపిక చేసే క్రమంలో జడేజా విషయంలో రిస్క్ తీసుకునేందుకు సీఎస్కే సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రిషభ్ పంత్ తెగదెంపులు చేసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో.. అతడు వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే ఎలా?ఒకవేళ అదే జరిగితే పంత్ భారీ ధర పలకడం ఖాయం. అతడి ప్రైస్ ట్యాగ్ గనుక రూ. 20 కోట్లు దాటితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నల నేపథ్యంలో సీఎస్కే తన రిటెన్షన్ లిస్టు మార్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పంత్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన సీఎస్కే.. రవీంద్ర జడేజాను వేలంలోకి వదిలి.. రైట్ టు మ్యాచ్(RTM) కార్డు ద్వారా అతడిని మళ్లీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.వరల్డ్ కప్ విన్నర్.. కానీకాగా జడ్డూ ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత అతడు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అంతేకాదు ఇటీవలి కాలంలో అతడి టీ20 గణాంకాలు ముఖ్యంగా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో జడ్డూను విడిచిపెట్టినా.. మళ్లీ ఆర్టీఎమ్ కార్డుతో కొనవచ్చని సీఎస్కే భావిస్తోందట.అంటే.. జడ్డూకి డిమాండ్ లేకపోతే.. వేరే ఫ్రాంఛైజీ అతడిని తక్కువ ధరకు కొన్నట్లయితే.. అంతే మొత్తం చెల్లించి అతడిని తిరిగి తాము సొంతం చేసుకునేందుకు ఆర్టీఎమ్ కార్డును వాడుకోనుందన్న మాట. అలా కాకుండా ఒకవేళ జడ్డూను రిటైన్ చేసుకుంటే అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది.అందుకే రిలీజ్ చేయాలనే యోచనలోఅలా అయితే, వేలంలో పంత్‌ను కొనుక్కునేందుకు తగినంత సొమ్ము ఉండకపోవచ్చు. అందుకే పంత్ కోసం జడ్డూను రిలీజ్ చేయాలని సీఎస్కే నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమ రిటెన్షన్‌లో భాగంగా రుతుకు రూ. 18 కోట్లు, పతిరణకు రూ. 14 కోట్లు, ధోనికి రూ. 4 కోట్లు చెన్నై ఫ్రాంఛైజీ చెల్లించనుందట!! కెప్టెన్‌గా నియమించినా..కాగా జడ్డూకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. జట్టును చాంపియన్‌గా నిలపడంలో అతడి పాత్ర కీలకం. కాగా 2012లో జట్టులో చేరిన జడ్డూ.. తర్వాత గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. అనంతరం మళ్లీ 2018లో చెన్నైతో జట్టు కట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటికీ అదే టీమ్‌లో ఉన్నాడు. అయితే, 2022లో కెప్టెన్‌గా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో జడ్డూ 240 మ్యాచ్‌లు ఆడి 2959 రన్స్ చేయడంతో పాటు 160 వికెట్లు తీశాడు.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం -
‘నీకు క్రికెట్ రూల్స్ తెలియవు.. నేను చెప్పినట్టే జరుగుతుంది’
ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. భారత్‌కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ జార్ఖండ్ డైనమైట్ హయాంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్లు వెలుగులోకి వచ్చారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోని సొంతం.అలాంటి ఈ లెజెండరీ ఆటగాడికే క్రికెట్ రూల్స్ తెలియవట!.. ఈ మాట అన్నది మరెవరో కాదు.. ధోని సతీమణి సాక్షి. ‘నీకు రూల్స్ తెలియవు.. నేను చెప్పినట్లే జరుగుతుంది’ అని భర్తకే పాఠాలు చెప్పినంత పనిచేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ధోనినే వెల్లడించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..?!బౌలర్ వైడ్ బాల్ వేశాడు‘‘ఓరోజు నేను, సాక్షి కలిసి ఇంట్లో వన్డే మ్యాచ్ చూస్తున్నాం. సాధారణంగా ఇద్దరం కలిసి టీవీ చూస్తున్నపుడు మేము క్రికెట్ గురించి మాట్లాడుకోము. అయితే, ఆరోజు మ్యాచ్‌లో.. బౌలర్ వైడ్ బాల్ వేశాడు. బ్యాటర్ మాత్రం షాట్ ఆడేందుకు ముందుకు రాగా.. వికెట్ కీపర్ బంతిని అందుకుని స్టంపౌట్ చేశాడు. అయితే, నా భార్య మాత్రం అతడు అవుట్కాలేదనే అంటోంది.అప్పటికు ఆ బ్యాటర్ పెవిలియన్ వైపు వెళ్లిపోతున్నాడు. అయినా సరే.. అంపైర్లు అతడిని వెనక్కి పిలిపిస్తారని.. వైడ్ బాల్లో స్టంపౌట్ పరిగణనలోకి తీసుకోరని వాదిస్తోంది. అప్పుడు నేను.. వైడ్‌బాల్‌కి స్టంపౌట్ అయినా అవుటైనట్లేనని.. కేవలం నో బాల్ వేసినపుడు మాత్రమే బ్యాటర్ స్టంపౌట్ కాడని చెప్పాను. అయినా సరే తను వినలేదు.నీకు క్రికెట్ గురించి తెలియదు.. ఊరుకో అంటూ నన్ను కసిరింది. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత సదరు బ్యాటర్ వెనక్కి వస్తాడు చూడంటూ చెబుతూనే ఉంది. అయితే, అప్పటికే ఆ బ్యాటర్ బౌండరీ లైన్ దాటి వెళ్లిపోవడం.. కొత్త బ్యాటర్ రావడం జరిగింది. ఏదో తప్పు జరిగిందిఅప్పుడు కూడా సాక్షి.. ‘ఏదో తప్పు జరిగింది’ అంటూ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది’’ అంటూ ధోని ఓ ఈవెంట్లో చెప్పాడు. తన భార్యతో జరిగిన సరదా సంభాషణను ప్రేక్షకులతో పంచుకుని నవ్వులు పూయించాడు. అదీ సంగతి!! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ధోని ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజు ఆడుతూనే ఉంటానని 43 ఏళ్ల తలా అభిమానులకు శుభవార్త అందించాడు.చదవండి: శతక్కొట్టిన కృనాల్ పాండ్యా.. ‘మా అన్న’ అంటూ హార్దిక్ పోస్ట్ వైరల్ -
IND VS NZ 2nd Test: ధోని తరహాలో రనౌట్ చేసిన జడ్డూ
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని తరహాలో ఓ రనౌట్ చేశాడు. జడేజా బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ బంతిని నాన్ స్టయికర్ వైపు విసిరాడు. వికెట్ల వద్ద బాల్‌ను కలెక్ట్ చేసుకున్న జడేజా చూడకుండా బంతిని వికెట్లపైకి విసిరాడు. ఈ లోపు నాన్ స్ట్రయికర్ వైపు పరుగు తీస్తున్న విలియమ్ ఓరూర్కీ క్రీజ్‌ను చేరుకోలేకపోయాడు. జడేజా డౌట్ ఫుల్‌గా అప్పీల్ చేయగా.. రీప్లేలో అది ఔట్‌గా తేలింది. గతంలో ధోని చాలా సార్లు ఇలా ఫీల్డర్లు విసిరిన బంతిని చూడకుండానే వికెట్లపైకి నెట్టి రనౌట్స్ చేశాడు. జడ్డూ రనౌట్ చేసిన విధానాన్ని చూసిన నెటిజన్లు ధోని శిష్యుడివి అనిపించుకున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.The Thala effect in Ravindra Jadeja's run out. 😄pic.twitter.com/tBoXdr27O6— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2024కాగా, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ టీమిండియా ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో నెగ్గిన విషయం తెలిసిందే. -
జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎమ్ఎస్ ధోనీ
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎస్ ధోనీ ఫోటోను ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ వెల్లడించారు. ‘‘తన ఫోటోను ఉపయోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అంగీకారం తెలిపారు. ఇతర వివరాల కోసం మేము ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం. మహేంద్ర సింగ్ ధోని ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారు’’ అని జార్ఖండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.కుమార్ అన్నారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. ముఖ్యంగా ఓటర్లకు.. ఎక్కువ సంఖ్యలో ఓటు వేయాలనే ఉత్సాహాన్ని పెంచేందుకు ధోనీ విజ్ఞప్తిని, ప్రజాదరణను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
IND VS NZ 2nd Test: ధోని సరసన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరసన చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు డకౌటైన భారత కెప్టెన్ల జాబితాలో ఈ ఇద్దరూ సరిసమానంగా నిలిచారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ధోని, రోహిత్ చెరో 11 సార్లు డకౌటయ్యారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ డకౌటయ్యాడు. భారత కెప్టెన్‌గా రోహిత్ డకౌట్ కావడం 143 ఇన్నింగ్స్‌ల్లో ఇది 11వ సారి.ఈ విభాగపు జాబితాలో విరాట్ కోహ్లి టాప్‌లో ఉన్నాడు. విరాట్ భారత కెప్టెన్ 250 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు డకౌటయ్యాడు. ఆతర్వాత సౌరవ్ గంగూలీ అత్యధికంగా 13 సార్లు, ధోని, రోహిత్ 11 సార్లు, కపిల్ దేవ్ 10 సార్లు భారత కెప్టెన్లుగా డకౌట్లయ్యారు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి రోజు ఆఖరి సెషన్లో బ్యాటింగ్‌కు దిగి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్ (6), శుభ్‌మన్ గిల్ (10) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) ధాటికి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. వీరిద్దరే 10 వికెట్లు తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను పరిసమాప్తం చేశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలు చేయగా.. మిగిలిన వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.చదవండి: చరిత్ర సృష్టించిన వాషింగ్టన్.. తొలి భారత ప్లేయర్‌గా -
Ind vs NZ: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. సచిన్ సరసన
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా ఇటీవల స్వదేశంలో టీమిండియా బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి ఫైనల్‌కు మరింత చేరువైంది. ఈ క్రమంలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు గెలిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టేదే! అయితే, వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేనకు కివీస్ ఊహించని షాకిచ్చింది.కివీస్ 36 ఏళ్ల తర్వాతబెంగళూరులో ఘన విజయం సాధించి.. భారత గడ్డపై 36 ఏళ్ల తర్వాత తొలి గెలుపు నమోదు చేసింది. చివరగా 1988లో ముంబైలోని వాంఖడేలో టెస్టు మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్.. ఇప్పుడిలా తాజాగా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మరోవైపు.. స్వదేశంలో కెప్టెన్‌గా రోహిత్‌కు టెస్టుల్లో ఇది మూడో పరాజయం.రోహిత్ శర్మ చెత్త రికార్డు.. సచిన్ సరసనఈ నేపథ్యంలో సొంతగడ్డపై అత్యధిక టెస్టులు ఓడిన టీమిండియా సారథుల జాబితాలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లిని అధిగమించాడు. బిషన్ బేడి, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీల సరసన చేరాడు. ఇప్పటి వరకు భారత్‌లో అత్యధికంగా తొమ్మిది మ్యాచ్‌లు ఓడి ఈ జాబితాలో మన్సూర్ అలీ పటౌడీ ఖాన్ ప్రథమ స్థానంలో ఉన్నాడు.కోహ్లి అలా.. రోహిత్ ఇలాకాగా కోహ్లి సారథ్యంలో భారత గడ్డపై టీమిండియా 2017లో ఆస్ట్రేలియా చేతిలో, 2021లో ఇంగ్లండ్ చేతిలో టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఆ రెండు సందర్భాల్లోనూ భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2023-24 బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో, 2024 ఆరంభంలో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది.అయితే, అప్పుడు కూడా సిరీస్‌లను 2-1, 4-1తో గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య గురువారం(అక్టోబరు 24) నుంచి పుణె వేదికగా రెండో టెస్టు మొదలుకానుంది. ఇక తొలి టెస్టులో భారత జట్టు ఓడినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్(150), రిషభ్ పంత్(99) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. మరోవైపు రోహిత్ శర్మ మొత్తంగా 54 పరుగులు రాబట్టాడు.స్వదేశంలో అత్యధిక టెస్టులు ఓడిన టీమిండియా కెప్టెన్లు👉మన్సూర్ అలీ పటౌడీ ఖాన్- 9👉కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్- 4👉రోహిత్ శర్మ, బిషన్ బేడి, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ- 3👉విరాట్ కోహ్లి- 2.చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన -
IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల (అక్టోబరు) 31 నాటికి.. అట్టిపెట్టకునే ఆటగాళ్ల తుదిజాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) రిటెన్షన్స్‌కు సంబంధించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.కాగా ఐపీఎల్ పాలక మండలి రిటెన్షన్ విధానంలో భాగంగా కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు(ఆర్టీఎమ్) ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో రిటెన్షన్ స్లాబ్‌లో మొదటి ఆటగాడికిరూ. 18 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 14 కోట్లు, మూడో క్రికెటర్‌కు రూ. 18 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 14 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 11 కోట్లు, ఆరో ఆటగాడికి రూ. 4 కోట్లు(అన్క్యాప్డ్) చెల్లించాల్సి ఉంటుంది.సీఎస్కే రిటైన్ చేసుకునేది వీరినే? ఎవరికి ఎన్ని కోట్లుఇక తాజా సమాచారం ప్రకారం సీఎస్కే తమ టాప్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనిని అన్క్యాప్డ్ కోటాలో ఎంపిక చేసుకుని రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీ.. రుతుతో పాటు జడ్డూకు రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. జట్టును అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అయితే, గతేడాది సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని ఆటగాడిగా కొనసాగాడు.సీఎస్కే అంటే ధోనినిజానికి ధోని అంటే సీఎస్కే.. సీఎస్కే అంటే ధోని. ధోని బ్రాండ్ వల్లే చెన్నై ఫ్రాంఛైజీకి ఆదరణ పెరుగిందనేద కాదనలేని వాస్తవం. అంతేకాదు.. వేలం మొదలు కెప్టెన్సీ వరకు ధోని ఆజ్ఞ లేనిదే అక్కడ ఏ పని జరగదని సన్నిహిత వర్గాలు అంటాయి. మరి అలాంటి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఎలా? అంటే.. బీసీసీఐ నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లను ఫ్రాంఛైజీలో ఈ కోటాలో వేసుకోవచ్చు.PC: BCCIఇద్దరు శిష్యులుచెన్నైకి రుతుతో పాటు జడేజా కూడా ముఖ్యం కాబట్టి వాళ్లిద్దరికి రూ. 18 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. కాగా రుతురాజ 2019లో సీఎస్కేలో చేరాడు. 2020లో అరంగేట్రం చేసిన అతడు ఆ మరుసటి ఏడాదే ఆరెంజ్‌క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత.. ఈఏడాది సీఎస్కే పగ్గాలు చేపట్టాడు.ఇక రవీంద్ర జడేజాకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2022లో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. కానీ వరుస ఓటముల నేపథ్యంలో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఈ ఇద్దరికి వరుస అవకాశాలు ఇచ్చి జట్టులో కీలక సభ్యులుగా నిలబెట్టింది మాత్రం ధోనినే!చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన -
వారెవ్వా పంత్.. దెబ్బకు ధోని రికార్డు బద్దలు
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఓ వైపు గాయం బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన 12వ టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. గాయం కారణంగా మూడో రోజు ఆటకు దూరమైన పంత్.. కీలకమైన నాలుగో రోజు ఆటలో తిరిగి మైదానంలో మళ్లీ అడుగుపెట్టాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టిస్తున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన రిషబ్.. నెమ్మదిగా తన బ్యాటింగ్‌లో స్పీడ్‌ను పెంచాడు. 54 పరుగులతో పంత్ ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.ధోని రికార్డు బద్దలుఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన పంత్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని ఈ మైలు రాయిని 69 ఇన్నింగ్స్‌లలో అందుకోగా.. రిషబ్ కేవలం 62 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! -
ధోని కోసమే ఆ రూల్స్‌ను మార్చారు: మహ్మద్ కైఫ్
ఐపీఎల్-2025 సీజన్లో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ను తిరిగి తీసుకురావడంతో.. ధోని రిటెన్షన్‌కు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది సీజన్లో ధోని అన్క్యాప్డ్ కోటాలో సీఎస్కే తరపున బరిలోకి దిగనున్నాడు. అతడిని రూ. 4 కోట్ల కనీస ధరకు సీఎస్కే రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిలో ఆడాలనే కోరిక ఉన్నంతవరకు ఐపీఎల్ నియమాలు మారుతూనే ఉంటాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు."వచ్చే ఏడాది సీజన్లో కూడా ధోని ఆటను మనం చూడబోతున్నాం. అతడు ఫిట్‌గా ఉన్నాడు. అంతేకాకుండా తన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ల వెనక కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఎంఎస్ ఆడాలనుకున్నంత కాలం, నియమాలు మారుతూనే ఉంటాయి. ధోని కోసం రూల్స్ మార్చిన తప్పులేదు. అతడొక లెజెండ్, సీఎస్కేకు మ్యాచ్ విన్నర్. అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ను ధోని కోసమే తిరిగి తీసుకు వచ్చారని నేను భావిస్తున్నాను. ధోనికి మనీతో పనిలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడే చాలా సార్లు చెప్పాడు.టీమ్ మేనేజ్మెంట్ ఏం కోరుకుంటే అది చేస్తానని తలా గతంలో స్పష్టం చేశాడు. రూ. 4 కోట్లు అనేది అతడికి చిన్నమొత్తం అయినప్పటకి, సీఎస్కే రిటైన్ చేసుకునేందుకు సిద్దంగా ఉంది. సీఎస్కేతో అతడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు.అసలేంటి ఈ అన్క్యాప్డ్ పాలసీ?ఐపీఎల్ తొలి సీజన్(2008)లో అన్క్యాప్డ్ పాలసీని నిర్వహకులు తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడనైనా అనక్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించవచ్చు. కానీ ఈ నియమాన్ని ఫ్రాంచైజీలు పెద్దగా ఉపయోగించకోకపోవడంతో ఐపీఎల్ నిర్వహకులు 2021 సీజన్లో తొలగించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ నియమం మళ్లీ అమలులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ రూల్ ద్వారా రిటైన్ అవ్వడానికి ధోనితో పాటు మోహిత్ శర్మ(గుజరాత్ టైటాన్స్), సందీప్ శర్మ(రాజస్తాన్), పియూష్ చావ్లా(ముంబై ఇండియన్స్) మాత్రమే అర్హులు. వీరిందరూ గత ఐదేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు.చదవండి: పాక్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. అతడి సారథ్యంలో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచింది. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ ఈ జార్ఖండ్ డైనమైట్.. 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆది నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ఆడుతున్నాడు. సారథిగా సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడు. మరోవైపు.. రోహిత శర్మ.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్. ఇటీవలే టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా ఉండి.. ధోని కంటే ముందుగానే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సారథిగా చరిత్రకెక్కాడు.ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్‌కాగా టీమిండియాలో ఇద్దరితో కలిసి, ఐపీఎల్లో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడాడు టీమిండియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ నేపథ్యంలో ఇద్దరి నాయకత్వ శైలిని పోలుస్తూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్ అని తన మనసులోని మాట బయటపెట్టాడు. అందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ..ధోని ఎవరితో మాట్లాడడు‘‘ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే.. నేను ధోనిని కాదని రోహిత్ వైపే మొగ్గుచూపుతాను. ఎందుంకటే రోహిత్ ప్లేయర్స్ కెప్టెన్. ప్రతి ఒక్క ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటాడు. సహచరులతో అతడికి మంచి అనుబంధం ఉంటుంది.అయితే, ధోని కెప్టెన్సీ స్టైల్ వేరుగా ఉంటుంది. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన మౌనం ద్వారానే ఎదుటివారికి తన మనసులోని మాట చేరాలని భావిస్తాడు. ఇతరులతో ధోని సంభాషించే విధానం ఇలాగే ఉంటుంది’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు స్నేహితులే తప్ప.. అతడికి విరుద్ధంగా మాట్లాడేవారు ఒక్కరూ ఉండరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పోర్ట్స్ యారీ ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..Rohit Sharma is a better captain than MS Dhoni says Harbhajan Singh Full podcast at 9pm tonight, only on Sports Yaari YouTube Channel 🇮🇳pic.twitter.com/6tVAdJh6qx— Sushant Mehta (@SushantNMehta) October 2, 2024 -
ధోనిని చిన్న పిల్లాడిలా మార్చిన విజయం..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అన్న బిరుదు ఉంది. ధోని ఆన్ ఫీల్డ్ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చాలా నింపాదిగా కనిపించేవాడు. టెన్షన్ అన్నది అతని ముఖంలో కనపడేది కాదు. విజయాలకు ఉప్పొంగిపోవడం.. ఓటములకు ఢీలా పడిపోవడం ధోనికి తెలీదు. అలాంటి ధోని ఒకానొక సందర్భంలో చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఎగిరెగిరి గంతులేశాడు. ఆ సందర్భం 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నాటిది.2013, జూన్ 23న ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఫైనల్లో భారత్.. ఆతిథ్య ఇంగ్లండ్‌పై 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది, రెండో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో గెలుపు ఖరారైన వెంటనే మిస్టర్ కూల్ కెప్టెన్ మిస్టర్ జాలీ కెప్టెన్‌గా మారిపోయాడు. ఆ విజయం ధోనికి, అటూ టీమిండియాకు చాలా సంతృప్తినిచ్చింది. అందుకే ధోని తన శైలికి భిన్నంగా ప్రవర్తించాడు.Relive @ashwinravi99's magical ball in #CT13 🪄He bowled 4 overs, gave 15 runs including a maiden and took key wickets of Joe Root & Jonathan Trott in the final 👌pic.twitter.com/zBr1VkBVy8— CricTracker (@Cricketracker) September 17, 2024ధోని వరల్డ్‌కప్‌లు గెలిచినప్పుడు కూడా అంత ఎగ్జైట్ కాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ధోనికి అంత తృప్తినిచ్చింది. ఈ విషయాన్ని ధోని స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఫైనల్లో భారత్ గెలిచిన తీరు.. నాటి మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయి. అందుకే భారత్‌కు అది చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ముఖ్యంగా ధోని కెరీర్లో హైలైట్‌గా నిలిచిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో మూడు ఐసీసీ టైటిల్స్ (టీ20, వన్డే వరల్డ్‌కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన తొలి కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ఫార్మాట్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా టీ20 మ్యాచ్‌గా మార్చబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 43, రవీంద్ర జడేజా 33 నాటౌట్, శిఖర్ ధవన్ 31 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 9, దినేశ్ కార్తీక్ 6, సురేశ్ రైనా 1, ధోని 0, అశ్విన్ 1 పరుగుకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రవి బొపారా 3, ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ట్రెడ్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు కలిసి కట్టుగా రాణించడంతో 5 పరుగుల స్వల్ప తేడాతో పరాజయంపాలైంది. రవిచంద్రన్ అశ్విన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లు వేసి ఓ మెయిడిన్ సహా రెండు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ చివరి ఓవర్లో అశ్విన్ 15 పరుగులను విజయవంతంగా కాపాడుకుని భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అశ్విన్ వేసిన మ్యాచ్ చివరి బంతిని మ్యాజిక్ డెలివరీగా ఇప్పటికీ చెప్పుకుంటారు.భారత విజయంలో అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ధోని కూడా కీలక భూమికలు పోషించారు. ఇషాంత్, జడ్డూ చెరో 4 ఓవర్లు వేసి తలో 2 వికెట్లు తీయగా.. ధోని రెండు కీలకమైన స్టంపౌట్లు, ఓ రనౌట్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇయాన్ మోర్గన్ (33), రవి బొపారా (30), జోనాథన్ ట్రాట్ (20), ఇయాన్ బెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. కుక్ (2), రూట్ (7), బట్లర్ (0), బ్రేస్నెన్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఈ గెలుపు అనంతరం భారత సంబురాలు అంబరాన్నంటాయి. ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే షైన్ అవుతున్న కోహ్లి ఈ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు.భారత క్రికెట్ అభిమానులకు ఈ విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. మినీ వరల్డ్‌కప్‌గా చెప్పుకునే ఈ టైటిల్‌ను గెలిచిన అనంతరం భారత్ 11 ఏళ్ల పాటు ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా సాధించలేకపోయింది. చివరికి 2024లో టీమిండియా కల సాకారమైంది. భారత్ 2024 టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు టైటిల్‌ను అందించాడు. భారత్ మొత్తంగా రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), రెండు టీ20 ప్రపంచకప్‌లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు (2002, 2013) గెలిచింది. -
‘ధోని, రోహిత్‌లకే చోటు.. కోహ్లిని అమ్మేస్తాను’
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్ టోర్నీ. ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే కాసుల వర్షం కురవడం ఖాయం. ఇంతటి ఖ్యాతి ఉన్న పొట్టి లీగ్‌లో.. కెప్టెన్లుగా ఇప్పటికే తమ జట్లను ఐదుసార్లు చాంపియన్లుగా నిలిపిన ఘనత టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)ల సొంతం.ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడితే కానీ.. మరో స్టార్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం ఐపీఎల్ ట్రోఫీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక ఈ ముగ్గురు మేటి క్రికెటర్లలో ధోని 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తోనే ఉండగా.. కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రోహిత్ మాత్రం ఆరంభంలో దక్కన్ చార్జర్స్‌కు ఆడినా.. తర్వాత ముంబై ఇండియన్స్‌లో చేరాడు.ఇదిలా ఉంటే... ఈ ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది? ముగ్గురిలో ఒకరిని మాత్రమే తుదిజట్టులోకి తీసుకోవాలనే నిబంధన ఉంటే?.. ఇలాంటి క్రేజీ ప్రశ్నే ఎదురైంది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్లకు ఎదురైంది. ఇందుకు మైకేల్ వాన్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.ధోనిని ఆడిస్తాను.. కెప్టెన్‌గా‘‘నేనైతే ఎంఎస్ ధోనిని ఆడిస్తాను. అతడి కంటే మెరుగైన ఆటగాడు మరొకరు ఉండరు. అంతేకాదు నా జట్టుకు ధోనినే కెప్టెన్. విరాట్‌కు నా జట్టులో స్థానం ఉండదు. అతడిని వేరే జట్టుకు అమ్మేస్తాను. ఎందుకంటే అతడు ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. రోహిత్ ఓవరాల్‌గా ఆరుసార్లు గెలిచాడు. ధోనికి ఐదు ట్రోఫీలు ఉన్నాయి. కాబట్టి ధోనిని ఆడించి.. రోహిత్‌ను అతడికి సబ్‌స్టిట్యూట్‌గా పెడతా. విరాట్‌కు మాత్రం చోటివ్వను’’ అని మైకేల్ వాన్ ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. చదవండి: టీమిండియాకు అతడే కీలకం.. ఆ ఒక్కడిని కట్టడి చేస్తే: కమిన్స్ View this post on Instagram A post shared by cricket.com (@cricket.com_official) -
చరిత్ర సృష్టించిన పంత్.. ఎంఎస్ ధోని రికార్డు సమం
టీమిండియా కీపర్ రిషబ్ పంత్ తన టెస్టు క్రికెట్ రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్భుతమైన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో రాణించిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సూపర్ సెంచరీతో చెలరేగాడు. టీ20 క్రికెట్‌ను తలపిస్తూ బంగ్లా బౌలర్లను ఊతికారేశాడు. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 128 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. పంత్‌కు ఇది ఆరువ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఎంఎస్ ధోని రికార్డు సమం..టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ధోనీ 90 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకోగా, పంత్ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. మరో సెంచరీ చేస్తే ధోనిని పంత్ అధిగమిస్తాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ముందు భారత్ 515 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఇంకో 357 పరుగులు అవసరం.చదవండి: 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!WELCOME BACK TO TEST CRICKET, RISHABH PANT! 🙌🏻💯#RishabhPant #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/C4gJuv29Y1— JioCinema (@JioCinema) September 21, 2024 -
ఎంఎస్ ధోని కూతురు జివా స్కూల్ ఫీజు ఎంతో తెలుసా? (ఫొటోలు)
-
స్నేహితులతో వెకేషన్లో ధోని (ఫొటోలు)
-
మిడిలార్డర్లో కపిల్ దేవ్.. గంభీర్, దాదాకు దక్కని చోటు
భారత క్రికెట్లో పాతతరం నుంచి నేటివరకు తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.. చెప్పుకొంటూ పోతే జాబితా పెరుగుతూనే ఉంటుంది.పీయూశ్ చావ్లా ఏమన్నాడంటేఇంతమంది ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలంటే కష్టమే మరి! అయితే, భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం తనకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2006 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. కెరీర్లో మొత్తంగా 6 టెస్టుల్లో 7, 25 వన్డేల్లో 32, ఏడు టీ20లలో 4 వికెట్లు పడగొట్టాడు.స్వల్ప కాలమే టీమిండియాకు ఆడినా పీయూశ్ చావ్లా ఖాతాలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలు ఉండటం విశేషం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో పీయూశ్ సభ్యుడు. గత పన్నెండేళ్లుగా ఐపీఎల్‌కే పరిమితమైన ఈ వెటరన్ స్పిన్నర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ధోని.. నాలుగోస్థానంలో కోహ్లిఈ క్రమంలో శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూశ్ తన ఆల్‌టైమ్ ఇండియా వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు. తన జట్టుకు ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న పీయూశ్.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్‌కు మూడు, విరాట్ కోహ్లికి నాలుగో స్థానం ఇచ్చాడు. మిడిలార్డర్లో ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్, కపిల్ దేవ్లను ఎంపిక చేసుకున్న పీయూశ్.. ఆ తర్వాత ధోనిని నిలిపాడు. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లకు చోటిచ్చిన అతడు.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేసుకున్నాడు.దాదా, గంభీర్‌కు చోటు లేదుఅయితే, వరల్డ్‌కప్(2007, 2011) హీరో గౌతం గంభీర్, స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలకు పీయూశ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. నంబర్ 3లో హిట్టయిన కోహ్లిని నాలుగో స్థానానికి ఎంచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల పీయూశ్ చావ్లా ఐపీఎల్ రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.పీయూశ్ చావ్లా ఆల్‌టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
’ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసినట్టే’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో హిట్‌మ్యాన్ ప్రయాణం ముగిసినట్లేనని.. అతడు ఈసారి మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. లేనిపక్షంలో.. ట్రేడింగ్ ద్వారానైనా వేరే ఫ్రాంఛైజీకి బదిలీ కావొచ్చని అభిప్రాయపడ్డాడు.ఐదుసార్లు ట్రోఫీ అందించిఐపీఎల్లో ఓ జట్టును అత్యధిక సార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మ సొంతం. అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచింది. ఐపీఎల్- 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదురైనా గతేడాది ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది.రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలుఅయినప్పటికీ ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తన కెప్టెన్‌ను మార్చింది. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకుని సారథిగా నియమించింది. దీంతో రోహిత్‌ను అవమానించిన జట్టుకు మేము మద్దతుగా నిలవబోమంటూ అభిమానులు ముంబై ఫ్రాంఛైజీతో పాటు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.దారుణ ఫలితంఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా సారథ్యంలో ఐపీఎల్-2024లో ముంబై దారుణ ఫలితం చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. అంబానీల యాజమాన్యంలోని ముంబై జట్టుతో రోహిత్‌కు సుదీర్ఘ అనుబంధం ఉన్నప్పటికీ.. తనను అవమానకరరీతిలో కెప్టెన్సీ తప్పించారని అతడు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ముంబై జట్టుతో రోహిత్ ప్రయాణం ముగిసిందిఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా రోహిత్ ముంబైని వీడనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల ఆధారంగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతాడా లేదా? అన్నది ప్రశ్నార్థకం. అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడు ఇక ఆ ఫ్రాంఛైజీతో ఉండడు.అతడేమీ ధోని కాదుఎందుకంటే.. మహేంద్ర సింగ్ ధోని- చెన్నై సూపర్ కింగ్స్ మాదిరి ముంబై- రోహిత్ మధ్య అలాంటి అనుబంధం లేదనిపిస్తోంది. అందుకే రోహిత్ బయటకు రావడం ఖాయమని చెప్పవచ్చు. ముంబై సైతం అతడిని రిటైన్ చేసుకోకపోవచ్చు. కాబట్టి రోహిత్ ట్రేడ్ విండో ద్వారా లేదంటే మెగా వేలంలోకి రావడం ద్వారా వేరే జట్టుకు మారే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసింది’’ అని పేర్కొన్నాడు. విభేదాలు వచ్చిన తర్వాత కలిసి ప్రయాణించడం కుదరబోదని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.ధోని-చెన్నై అనుబంధం వేరుకాగా రోహిత్ మాదిరే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ధోని సైతం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2008 నుంచి అదే ఫ్రాంఛైజీలో కొనసాగుతున్న తలా... ఈ ఏడాది తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు చెన్నై జట్టు పగ్గాలు అప్పగించాడు. అంతేకాదు వేలం దగ్గర నుంచి తుదిజట్టు ఎంపిక దాకా చెన్నై ఫ్రాంఛైజీ ధోనికి పూర్తి స్వేచ్ఛనిస్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నమని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
సంచలన కామెంట్స్ చేసిన డైరెక్టర్ వెంకట్ ప్రభు
-
ధోనీని హైలైట్ చేయడం తెలుగు వాళ్లకు నచ్చలేదు: వెంకట్ ప్రభు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లెటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే కోలీవుడ్‌లో హిట్ టాక్ వచ్చినా.. బాలీవుడ్, టాలీవుడ్లో మాత్రం ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రివ్యూస్ కూడా నెగటివ్‌గా రావడంతో ఈ రెండు చోట్ల కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. తాజాగా ఈ విషయంపై వెంకట్ ప్రభు స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని, అందుకే అక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని అభిప్రాయపడ్డాడు. వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ధోనీని హైలైట్ చేయడం వల్ల ఫలితం రాలేదనడం కరెక్ట్ కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్ చేశారు: బాబీ డియోల్)మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, లైలా, స్నేహ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో దివంగత నటుడు విజయకాంత్‌ని, ఐపీఎల్ విజువల్స్ ద్వారా ధోనీని వెండితెరపై చూపించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. -
ఒకే ఇన్నింగ్స్‌లో 7 క్యాచ్‌లు.. ధోని రికార్డు సమం చేసిన ధ్రువ్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అరుదైన రికార్డు సాధించాడు. దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును జురెల్ సమం చేశాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఈ అరుదైన ఫీట్‌ను ధ్రువ్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఇండియా- A జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్.. భారత-బి జట్టుపై ఈ ఘనతను అందుకున్నాడు. ఇండియా బి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్ ఏకంగా 7 క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా మిస్టర్ కూల్ సరసన ఈ యంగ్ వికెట్ కీపర్ నిలిచాడు. దులీప్ ట్రోఫీ 200-2005 సీజన్లో ఈస్ట్‌జోన్ తరపున ఒకే ఇన్నింగ్స్‌లో ధోని 7 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా ఎ జట్టు విజయానికి 169 పరుగులు అవసరమవ్వగా.. ఇండియా బి జట్టు గెలపునకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఇండియా ఎ ఆశలు అన్నీ కేఎల్ రాహుల్‌పైనే ఉన్నాయి. రాహుల్ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.చదవండి: IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. టీమిండియా క్యాంపులోకి యువ ఆటగాడు! ఎవరంటే? -
ధోని కంటే రోహిత్ చాలా బెస్ట్...
-
విజయ్ సినిమాలో ఎంఎస్ ధోని.. ఆ సీన్ చూశారా?
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'ది గోట్'(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజో ది గోట్ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం 4 గంటలకే చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు మొదలయ్యాయి. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ వస్తోంది. దీంతో థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.అయితే ఈ మూవీలో ఓ సీన్లో భారత మాజీ కెప్టెన్ ధోని కనిపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా కేరింతలు కొడుతూ.. తలా అంటూ నానా హంగామా చేశారు. ఆ సీన్లో ఎంఎంస్ ధోని ఐపీఎల్ బ్యాటింగ్‌కు వెళ్తూ కనిపించగా.. విజయ్ బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. ఈ సీన్‌తో విజయ్, ధోని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఐపీఎల్లో చెన్నై టీమ్‌కు మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ధోనికి పెద్దఎత్తున వీరాభిమానులు ఉన్నారు.కాగా.. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరో, విలన్ పాత్రల్లో ఆయన మెప్పించనున్నారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్.. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇదే చివరి చిత్రం కానుంది. #Dhoni cameo 🔥🔥#Kanguva FL 💪💪🔥🔥#Trisha cameo#ThalaAJITH cameo 💥💥#Sivakarthikeyan cameo 🥱#goat#GOATFDFS#TheGreatestOfAllTime#ThalapathyVijay pic.twitter.com/VmYr3UOhOX— pushparaj(🔥🔥 ) (@Pushparaaj_AA) September 5, 2024 -
మా నాన్నకు ఆ సమస్య ఉంది: యువీ కామెంట్స్ వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిలపై మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కపిల్ వల్ల తన కెరీర్ సజావుగా సాగలేదన్న యోగ్రాజ్.. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోని నాశనం చేశాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో యువీ గతంలో తన తండ్రి యోగ్రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.‘‘మా నాన్నకు మానసిక సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అదే ఆయనకున్న అతి పెద్ద సమస్య. ఇది ఆయనకు తెలిసినా మారేందుకు సిద్ధంగా లేరు’’ అంటూ యువరాజ్ సింగ్ గతేడాది నవంబరులో రణ్వీర్ అల్హాబ్దియా పాడ్‌కాస్ట్‌లో యోగ్రాజ్ గురించి చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. ధోని అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ధోని వంటి టాప్ క్రికెటర్‌ను టార్గెట్ చేయడం ద్వారా యోగ్రాజ్ వార్తల్లో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నాడని.. అయితే, ఇప్పుడు ఇలాంటి చవకబారు మాటలను ఎవరూ పట్టించుకోరని కామెంట్లు చేస్తున్నారు. యువీ తన తండ్రి గురించి చెప్పింది వందకు వంద శాతం నిజమని పేర్కొంటున్నారు. యోగ్రాజ్ ఇలాగే మాట్లాడితే యువరాజ్‌కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని.. ఇకనైనా ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.కాగా టీమిండియా తరఫున 1980-81 మధ్య కాలంలో ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు యోగ్రాజ్. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ వల్లే తనకు అవకాశాలు కరువయ్యాయని గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్న అతడు.. తన కుమారుడిని విజయవంతమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని భావించాడు. తండ్రి ఆశయాలకు తగ్గట్లుగానే మేటి ఆల్‌రౌండర్‌గా ఎదిగిన యువీ.. క్యాన్సర్‌ను జయించి మరీ ఆటను కొనసాగించాడు.అయితే, 2015 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువీకి ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే నాడు ధోని కెప్టెన్‌గా ఉండటం గమనార్హం. అంతేకాదు.. యువీ-ధోని అండర్-19 క్రికెట్లోనూ సమకాలీకులే. ఇద్దరు ప్రతిభావంతులే అయినా ధోని తన అసాధారణ నైపుణ్యాలతో కెప్టెన్‌గా ఎదిగాడు.ఈ నేపథ్యంలో ధోని గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘నేను ధోనిని ఎన్నటికీ క్షమించను. ఒకసారి అతడు అద్దంలో తన ముఖం చూసుకోవాలి. అతడొక పెద్ద క్రికెటరే కావొచ్చు. కానీ నా కుమారుడి విషయంలో అతడేం చేశాడు? నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు. అతడు కనీసం మరో నాలుగేళ్లపాటు ఆడేవాడు.కానీ ధోని వల్లే ఇదంతా జరిగింది. యువరాజ్ వంటి కొడుకును ప్రతి ఒక్కరు కనాలి’’ అని యోగ్రాజ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా కపిల్ దేవ్ గురించి ప్రస్తావిస్తూ.. కపిల్ కంటే తన కొడుకు యువీనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని చెప్పుకొచ్చాడు. అయితే, యువీ ఇంత వరకు తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించలేదు. My Father has mental issues : Yuvraj #MSDhoni pic.twitter.com/KpSSd4vDzA— Chakri Dhoni (@ChakriDhonii) September 2, 2024 -
ధోని కంటే రోహిత్ చాలా డిఫరెంట్ కెప్టెన్: హర్భజన్
ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ.. ఇద్దరూ భారత క్రికెట్ జట్టుకు వరల్డ్‌కప్‌లు అందించిన కెప్టెన్లు. అయితే రోహిత్ గొప్ప, ధోని గొప్ప అంటే మాత్రం సమాధనం చెప్పలేం. ఎందుకంటే కెప్టెన్సీలో గానీ, ఆటలో గానీ ఎవరికి వారే మేటి. తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలుల గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని, రోహిత్ ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ స్టైల్స్‌ను కలిగి ఉన్నారని భజ్జీ చెప్పుకొచ్చాడు.కెప్టెన్సీలో ధోని, రోహిత్‌లకు ఎటువంటి పోలిక లేదు. ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ శైలిలను కలిగి ఉన్నారు. ధోని కెప్టెన్సీలో నేను భారత జట్టుతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ వరసుగా బౌండరీలు బాది ఒత్తడిలోకి నెట్టాడు. ఆ సమయంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. వెంటనే ధోని వద్దకు వెళ్లి ఠాకూర్ తన బౌలింగ్ లెంగ్త్‌ను మార్చుకుంటే బాగుంటుందని సూచించాను. కానీ ధోని మాత్రం పాజీ నేను ఇప్పుడు అతనితో చెబితే, శార్ధూల్ ఎప్పటికీ నేర్చుకోడు. తనంతట తానే నేర్చుకోనివ్వండి అంటూ నాతో అన్నాడు. ఇది ధోని స్టైల్ కెప్టెన్సీ. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ మరో రకం. రోహిత్ చాలా డిఫరెంట్. అతను వెళ్లి ప్రతి ప్లేయర్‌తో మాట్లాడతాడు. ఆటగాడి భుజం మీద చేయి వేసి తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో చెబుతాడు. మీరు చేయగలరన్న నమ్మకం అతడు కలిగిస్తాడు. టెస్టు క్రికెట్లో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటి నుంచి హిట్‌మ్యాన్ మరింత మెరుగయ్యాడు. ఎవరైనా టెస్టుల్లో జట్టును నడిపించినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు. టెస్ట్ క్రికెట్‌కు ఖచ్చితమైన వ్యూహాలు, వాటని అమలు చేయడం చాలా అవసరం. దీంతో ఒక ఉత్తమ నాయకుడిగా నిలుస్తారని "తరువర్ కోహ్లీ పోడ్కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. -
గంభీర్ ఆల్‌టైమ్ భారత జట్టు ఇదే.. రోహిత్, బుమ్రాకు దక్కని చోటు?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ తన ప్రయాణం ఆరంభంలోనే గెలుపోటముల రుచి చూశాడు. అతడి నేతృత్వంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో విజయం సాధించిన భారత్.. వన్డే సిరీస్‌లో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం గంభీర్ తన తదుపరి సవాల్‌కు సిద్దమవుతున్నాడు. ఈ నెల 18 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ అనంతరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు భారత్ ఆడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. లంకతో వన్డే సిరీస్ తర్వాత భారత జట్టుకు దాదాపు నెల రోజులు విశ్రాంతి లభించడంతో గౌతీ వరుస ఇంటర్వ్యూలో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ తన ఆల్‌టైమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌కు ఎంచుకున్నాడు.కెప్టెన్‌గా ఎంఎస్ ధోని..గంభీర్ తన ఎంచుకున్న ఆల్‌టైమ్ జట్టుకు భారత మాజీ సారథి ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. అదేవిధంగా ఈ జట్టులో ఓపెనర్లగా తనతో పాటు దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గౌతీ ఎంచుకున్నాడు. ఫస్ట్ డౌన్లో భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెకెండ్ డౌన్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లకు గంభీర్ చోటిచ్చాడు. అదే విధంగా విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్‌లకు వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో ఛాన్స్ ఇచ్చాడు. వికెట్ కీపర్ జాబితాలో ధోనికి చోటు దక్కింది. ఇక తన జట్టులో ఫాస్ట్ బౌలర్లగా ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్‌లను గంభీర్ అవకాశమిచ్చాడు. అదేవిధంగా స్పిన్నర్ల కోటాలో దిగ్గజాలుఅనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్‌లను అతడు ఎంపిక చేశాడు. అయితే ఈ జట్టులో భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లు లేకపోవడం గమనార్హం.గంభీర్ ఎంచుకున్న ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేవీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని (కెప్టెన్/ వికెట్ కీపర్), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ -
'నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు.. ధోనిని ఎప్పటికీ క్షమించను'
ఎంస్ ధోని.. భారత క్రికెట్ రూపరేఖలను మార్చేసిన నాయకుడు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఏకైక కెప్టెన్. తన అద్బుత కెప్టెన్సీతో, ఆటతీరుతో టీమిండియాను నెం1 జట్టుగా నిలిపిన ఘనత మిస్టర్ కూల్ది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఎంఎస్‌డి సొంతం చేసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు నాలుగేళ్లు అవుతున్నప్పటకి అతడిపై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న ధోనిని మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ ప్రతీ ఏటా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అంతలా ఆరాధించే ధోనిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి విమర్శల వర్షం కురిపించాడు. ధోని వల్లే యువరాజ్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిందని యోగరాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఎప్పటికీ క్షమించను..యువరాజ్ సింగ్ కెరీర్‌ను ఎంఎస్ ధోని నాశనం చేశాడు. అతడిని నేను ఎప్పటకి క్షమించను. తనను తను అద్దంలో చూసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ధోని చాలా పెద్ద క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు నా కొడుకు పట్ల పక్షపాతంగా వ్యవహరించాడు.ప్రతీ విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. నేను ఎవరైనా తప్పు చేశారని భావిస్తే వారిని జీవితంలో క్షమించను. అది నా కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. యువరాజ్ ఇంకా నాలుగైదేళ్లు ఈజీగా ఆడేవాడు. కానీ ధోని మాత్రం నా కుమారుడికి సపోర్ట్ చేయలేదు.అందుకే తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. క్యాన్సర్‌తో బాధపడుతూనే దేశం కోసం ఆడి.. ప్రపంచకప్ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్‌ను భారతరత్నతో సత్కరించాలని జీస్వీచ్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.యువీది చెరగని ముద్ర..కాగా యువరాజ్ కూడా భారత క్రికెట్లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ సొంతం చేసుకోవడం యువీ కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరపున 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్.. 11,178 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 17 సెంచరీలు,71 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. Yograj Singh's latest explosive interview on MS Dhoni.😨Also, demands Bharat Ratna for his son Yuvraj Singh for his outstanding and selfless contribution to Cricket. pic.twitter.com/JDoJrLMeIW— Abhishek (@vicharabhio) August 31, 2024 -
బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. రోహిత్‌కు నో ఛాన్స్!?
ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. తను ఎంచుకున్న జట్టుకు కెప్టెన్‌గా భారత క్రికెట్ దిగ్గజం, సీఎస్కే మాజీ సారధి ఎంఎస్ ధోనిని భోగ్లే ఎంపిక చేశాడు. అదే విధంగా తన జట్టు ఓపెనర్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్స్ క్రిస్ గేల్, విరాట్ కోహ్లిలకు అవకాశమిచ్చాడు. ఐపీఎల్లో వీరిద్దరూ ఓపెనర్లుగా 28 ఇన్నింగ్స్‌లలో 1210 పరుగుల సాధించారు. నాలుగు సార్లు 50కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక మూడో స్ధానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాకు భోగ్లే చోటిచ్చాడు. ఐపీఎల్లో 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్ రైనానే. తన ఐపీఎల్ కెరీర్లో ఏకంగా 109 క్యాచ్‌లను రైనా అందుకున్నాడు. అతడిని అభిమానులు ముద్దగా చిన్న తలా పిలుచుకుంటున్నారు. ఇక నాలుగో స్ధానంలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భోగ్లే ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 2017 నుంచి ముంబై ఇండియన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్య.. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లను ఆడాడు.అదే విధంగా హర్ష తన జట్టుకు కెప్టెన్‌తో పాటు వికెట్ కీపర్‌గా ధోనినే ఎంచుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్, వికెట్ కీపర్లలో ఒకడిగా ధోని పేరు గాంచాడు. ఇక ఈ జట్టులో ఆల్‌రౌండర్‌గా భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు హర్షా అవకాశమిచ్చాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగా, టీమిండియా పేసర్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు చోటు దక్కింది. ఇక చివరగా స్పిన్నర్లగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్‌లకు ఛాన్స్ లభించింది. అయితే ఈ జట్టులో భారత కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం గమనార్హం.హర్షా భోగ్లే ఐపీఎల్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేవిరాట్ కోహ్లి, క్రిస్ గేల్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోని (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్, సునీల్ నరైన్ -
సచిన్, కోహ్లి కాదు!.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే!
భారత్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో క్రికెటర్లే అగ్రస్థానంలో ఉంటారు. వారిలోనూ టీమిండియా లెజెండరీ ఆటగాడు, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అటు ఆట ద్వారా.. ఇటు పలు ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడం ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్లు ఒక్కొక్కొరు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని వినికిడి. మరి వీరికంటే ధనవంతుడైన భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. అతడి ఒక్కడి సంపాదనే వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కో ట్ల సంపదకు అతడు వారసుడు. బిజినెస్ టైకూన్ కుమారుడుదేశంలోనే.. కాదు కాదు.. బహుశా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ అయిన అతడు మరెవరో కాదు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. దిగ్గజ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. జూలై 9, 1997లో ముంబైలో జన్మించాడు. పుట్టుకతోనే రిచ్‌కిడ్ అయిన ఆర్యమన్.. క్రికెటర్‌గా తొలి అడుగులు వేశాడు. మధ్యప్రదేశ్ తరఫున 2017- 18లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఆర్యమన్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి 414 పరుగులు సాధించాడు ఆర్యమన్ బిర్లా. రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్స్ఇందులో ఓ శతకం, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు 36 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆర్యమన్ బిర్లా.. 2018 ఐపీఎల్ వేలంలోకి రాగా.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా 2019లోనే క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు ఆర్యమన్. కుటుంబ వ్యాపారాలతో బిజీ అయ్యాడు. తన సోదరి అనన్య బిర్లాతో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. సొంతంగా ముంబైలో ఓ క్లబ్ కూడా కలిగి ఉన్న ఆర్యమన్.. పెంపుడు జంతువు ఓ స్టోర్ కూడా నడుపుతున్నాడు.రెండు లక్షల కోట్లకు పైగా సంపదహురున్ విడుదల చేసిన దేశీయ అత్యంత ధనవంతులు జాబితాలో కుమార్ మంగళం బిర్లా చోటు దక్కించుకోవడంతో.. ఆర్యమన్ బిర్లా పేరు మరోసారి ఇలా తెరపైకి వచ్చింది. ఇక హురున్ రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ముకేశ్ అంబానీ 10.14 లక్షల కోట్ల నికర ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆరోస్థానంలో ఉన్న కుమార్ మంగళం బిర్లా 2,35,200 కోట్ల నికర సంపద కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆర్యమన్ నెట్‌వర్త్ డెబ్బై వేల కోట్లకు పైగానే ఉంటుందని వ్యాపారవర్గాలు అంటున్నాయి.చదవండి: క్రికెటర్ సంచలన నిర్ణయం.. 26 ఏళ్లకే ఆటకు వీడ్కోలు! -
ధోనీ విషయంలో తప్పు చేశాను, క్షమించండి: దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ గత వారం తన ఆల్‌టైమ్, ఆల్ ఫార్మాట్ ఫేవరెట్ టీమిండియాను ప్రకటించాడు. ఇందులో రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా డీకే ఈ జాబితాలో ఎంఎస్ ధోనికి చోటివ్వలేదు. ఈ కారణంగా అతను ధోని అభిమానుల నుంచి దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో డీకే తాజా వివరణ ఇచ్చాడు.ధోని విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నాడు. పొరపాటున ధోని పేరును లిస్ట్‌లో చేర్చలేదని వివరణ ఇచ్చాడు. స్వతహాగా వికెట్‌కీపర్‌ను అయి ఉండి, ధోని పేరును చేర్చకపోవడం నిజంగా పెద్ద పొరపాటని అన్నాడు. రాహుల్ ద్రవిడ్ జట్టులో ఉండటంతో అందరూ అతనే వికెట్‌కీపర్ అనుకున్నారని పేర్కొన్నాడు. ఈ అంశానికి సంబంధించిన ఎపిసోడ్ బయటికి వచ్చే వరకు ధోనిని ఎంపిక చేయలేదని తనకు కూడా తెలీదని వివరణ ఇచ్చాడు. జట్టు ఎంపిక సమయంలో తన మదిలో చాలా విషయాలు ఉన్నాయని, అందుకే పొరపాటు జరిగిందని అన్నాడు.తన జట్టులో ధోని తప్పనిసరిగా ఉంటాడని తెలిపాడు. ధోని ఏడో స్థానంలో వికెట్‌కీపర్‌గా మాత్రమే కాకుండా జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరిస్తాడని అన్నాడు. ధోని ఈ జట్టులోనే కాదు, తాను ఎంపిక చేసే ఏ జట్టులోనైనా ఉంటాడని తెలిపాడు. కాగా, ధోని నేతృత్వంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచిన విషయం తెలిసిందే. -
గిల్‌క్రిస్ట్ టాప్-3 వికెట్ కీపర్లు వీరే.. ధోనికి ఛాన్స్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. తన బ్యాటింగ్, కీపింగ్ స్కిల్స్‌తో ప్రత్యర్ధిలకు చుక్కలు చూపించిన చరిత్ర గిల్ క్రిస్ట్ది. ఈ ఆసీస్ క్రికెట్ దిగ్గజం తనకు ఇష్టమైన ముగ్గురు వికెట్ కీపర్లను తాజాగా ఎంచుకున్నాడు. అందులో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంస్ ధోనికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో మొదటి స్థానం తన రోల్ మోడల్ అయిన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్‌కు గిల్‌క్రిస్ట్ ఇచ్చాడు."రోడ్నీ మార్ష్ నా రోల్‌మోడల్. అతడిని ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్‌గా ఎదిగాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. ఫీల్డ్‌లో ధోని ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతడి కూల్‌నెస్ అంటే నాకెంతో ఇష్టం. ఇక చివరగా నా మూడో ఫేవరేట్ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర. అతడొక క్లాస్. వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు టాప్ ఆర్డర్లో విజయవంతమైన బ్యాటర్" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. -
కోహ్లి ఇప్పుడు కెప్టెన్ కాదు.. కానీ: బుమ్రా
ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్బౌలర్లలో టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఒకడు. తనదైన ప్రత్యేక బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే ఈ పేస్ గుర్రం ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఈ క్రమంలో శ్రీలంక పర్యటనకు గైర్హాజరైన రైటార్మ్ పేసర్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలవులను పొడిగించింది. ఫాస్ట్ బౌలర్లు గాయాల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ వరకు అతడికి విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. అందుకే సెప్టెంబరులో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌తో పాటు దులిప్ ట్రోఫీకి కూడా బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్లను ఉద్దేశించి జస్ప్రీత్ బుమ్రా చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా 2016లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు బుమ్రా. ఆ తర్వాత విరాట్ కోహ్లి.. ప్రస్తుతం రోహిత శర్మ సారథ్యంలో ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఎదుగుదలకు సహకరించిన కెప్టెన్ ధోని అని బుమ్రా పేర్కొన్నాడు.ధోని ఉంటే చాలు‘‘ఎంఎస్.. అభద్రతాభావం నా దరిచేరకుండా చూసుకున్నాడు. తన నిర్ణయాలపై.. జట్టు కూర్పుపై అతడికి మంచి పట్టు ఉంటుంది. అంతేగానీ.. ప్రణాళికలు వేసుకుని గుడ్డిగా వాటినే అనుసరించే రకం కాదు’’ అని బుమ్రా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘విరాట్ ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. ఆట పట్ల అంకితభావం మెండు.కోహ్లి ఎల్లప్పుడూ నాయకుడేప్రాణం పెట్టి ఆడతాడు. ఇక ఫిట్నెస్ విషయంలో అతడు ఎప్పుటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతడు కెప్టెన్ కాకపోవచ్చు. కానీ ఇప్పటికీ జట్టుకు నాయకుడే. కెప్టెన్సీ అనేది ఒక పదవి మాత్రమే. జట్టులోని 11 మంది రాణిస్తేనే ఫలితం రాబట్టగలం’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.ఇక బౌలర్లను అర్థం చేసుకొనే కెప్టెన్లలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడని బుమ్రా ప్రశంసించాడు. కాగా బుమ్రా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 89 వన్డేలు, 70 టీ20లు, 36 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.బుమ్రా కూడా సారథిగావన్డేల్లో 149, టీ20లలో 89, టెస్టుల్లో 159 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. కాగా 2022, జూలై 1న బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా తొలిసారిగా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. గతేడాది ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, శుబ్‌మన్ గిల్‌తో అతడి స్థానాన్ని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. -
IPL 2025: ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..?
ఐపీఎల్-2025లో భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని ‘అన్క్యాప్డ్’ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో ‘అన్క్యాప్డ్’ ఓల్డ్ పాలసీని తిరిగి తీసుకురావాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగించేందుకు వీలు ఉంటుంది. కాగా గత నెలలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో అన్క్యాప్డ్ పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలని సీఎస్కే ప్రతిపాదించింది. కానీ ఇతర ప్రాంఛైజీల నుంచి మాత్రం సీఎస్కేకు మద్దతు లభించలేదు. అయితే మిగితా ఫ్రాంచైజీల నుంచి చెన్నైకు సపోర్ట్ లభించకపోయినప్పటికి.. బీసీసీఐ మాత్రం అన్క్యాప్డ్ రిటర్న్ పాలసీని పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ధోని మరో ఐపీఎల్ ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. మిస్టర్ కూల్‌ను ఆన్క్యాప్డ్ ప్లేయర్‌గా సీఎస్కే రిటైన్ చేసుకోనుంది. అయితే అందుకు ధోని మరి ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.‘అన్క్యాప్డ్’ పాలసీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. గత నెలలో జరిగిన సమావేశంలో ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చజరిగింది. త్వరలోనే ప్లేయర్స్ రిటెన్ష్ రూల్స్‌తో పాటు ఈ పాలసీ కోసం ప్రకటించే ఛాన్స్ ఉందని బీసీసీఐ మూలాలు వెల్లడించాయి.కాగా ప్రస్తుత రూల్స్ ప్రకారం మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవాలి. అయితే ఈ రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యలను పెంచాలని ఆయా ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం అందుకు మొగ్గు చూపడం లేదు. బీసీసీఐ మెగా వేలాన్ని నిర్వహించాలనే పట్టుదలతో ఉంది.అసలేంటి ఈ అన్క్యాప్డ్ పాలసీ?ఐపీఎల్ తొలి సీజన్(2008)లో అన్క్యాప్డ్ పాలసీని నిర్వహకులు తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడనైనా అనక్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించవచ్చు. కానీ ఈ నియమాన్ని ఫ్రాంచైజీలు పెద్దగా ఉపయోగించకోకపోవడంతో ఐపీఎల్ నిర్వహకులు 2021 సీజన్లో తొలగించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ నియమం మళ్లీ అమలులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. -
ధోనీ రిటైర్మెంట్ గుట్టు విప్పిన రైనా!
2020 ఆగస్టు 15.. భారత క్రికెట్లో మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని శకం ముగిసింది. ఆ రోజు రాత్రి 7:29 గంటలకు మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలుకుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే మరో స్టార్ క్రికెటర్, చిన్న తలా సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ తప్పుకుంటున్నానని షాకింగ్ ప్రకటన చేశాడు. దీంతో ఒకే రోజు ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల ప్రయాణం ముగిసింది. ఆ సమయంలో వీరిద్దరూ ఐపీఎల్-2020 సీజన్ బయోబబుల్‌లో ఉన్నారు. కాగా ఒకే రోజు ఇద్దరు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం అప్పటిలో తీవ్ర చర్చనీయంశమైంది. అయితే ఒకే రోజు తను ధోని రిటైర్మెంట్ ప్రకటించడం వెనకగల కారణాన్ని అక్కడికి రెండు రోజుల తర్వాత సురేష్ రైనా వెల్లడించాడు.అసలు కారణమిదే?"శనివారం(2020 ఆగస్టు 15) రిటైర్మెంట్ ప్రకటించాలని మేమిద్దరం ముందే నిర్ణయించుకున్నాము. అందుకు ఓ కారణముంది. ధోనీ జెర్సీ నంబర్ 7, నా జెర్సీ నంబర్ 3. రెండు కలిపితే 73 అవుతుంది. ఆ రోజు(ఆగస్టు 15)న మన దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదు అని భావించాము. అందుకే ఒకేసారి ఇద్దరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాము. ధోనితో నాకు మంచి అనుబంధం ఉంది. ధోనీ తన కెరీర్‌ను డిసెంబర్ 23 (2004)న బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో ప్రారంభించగా, నేను జూలై 30 (2005)న శ్రీలంకపై అరంగేట్రం చేశాను. మేమిద్దరం అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 15 ఏళ్లు కలిసి ప్రయాణించాము. రిటైరయ్యాక ఐపీఎల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నామని" అప్పటిలో దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. -
ఎన్నేళ్లయిందో.. నిన్ను కలవడం సంతోషంగా ఉంది మహీ (ఫొటోలు)
-
అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ధోని?.. కావ్యా మారన్ కామెంట్స్ వైరల్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 మెగా వేలం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) చేసిన ప్రతిపాదనను.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. పాత నిబంధనలు మళ్లీ ప్రవేశపెట్టి.. మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజాలను అవమానపరచడం సరికాదని ఆమె చెన్నై ఫ్రాంఛైజీకి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి టీమిండియా లెజెండరీ కెప్టెన్ ధోని సీఎస్కేతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చెన్నైని అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. సీఎస్కేకు పర్యాయపదంగా మారిపోయాడు ఈ మిస్టర్ కూల్. అయితే, ఐపీఎల్-2024లో రుతురాజ్ గైక్వాడ్‌ను తన వారసుడిగా ఎంపిక చేసుకున్న 43 ఏళ్ల ధోని.. వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగాడు. అవసరమైనపుడు రుతుకు సూచనలు, సలహాలు ఇస్తూ జట్టును ముందుకు నడిపించడంలో సహాయపడ్డాడు.నలుగురికే అవకాశం?అయితే, వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ధోని వచ్చే ఏడాది ఆటగాడిగా కొనసాగే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జట్టుకు వెన్నెముక అయిన ధోనిని ఇప్పుడే వదులుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేదని.. ధోని కూడా మరో ఏడాది పాటు ఫ్రాంఛైజీతో కొనసాగాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, మెగా వేలం నేపథ్యంలో కేవలం నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకునే అవకాశం ఉందన్న వార్తల నడుమ.. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరానా కోసం ధోని తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.అదే జరిగితే.. ఒకవేళ ధోని ఇంకా ఐపీఎల్లో ఆటగాడిగా కొనసాగాలనుకుంటే వేలంలోకి రావాల్సి ఉంటుంది. అయితే, సీఎస్కే యాజమాన్యం ఇందుకు ఇష్టపడటం లేదట. ఈ నేపథ్యంలో జూలై 31న భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులతో భేటీ సందర్భంగా ఆసక్తికర చర్చ లేవలెత్తినట్లు సమాచారం. ధోని కోసం పాత రూల్‌ను తిరిగి తీసుకురావాలని కోరినట్లు సమాచారం.అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనిఇందులో భాగంగా ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా గుర్తించాలని బీసీసీఐకి విన్నవించినట్లు తెలుస్తోంది. కాగా ఓ క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ ఏళ్లు గడిస్తే అతడిని అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలోకి తీసుకోవచ్చని.. 2008- 2021 వరకు ఐపీఎల్లో నిబంధన ఉండేది. ఈ రూల్‌ను తిరిగి తీసుకువస్తే.. ధోనిని ఆ విభాగంలో ఆటగాడిగా చేర్చి.. అన్క్యాప్డ్ప్లేయర్గా రిటైన్ చేసుకోవాలని సీఎస్కే తమ అభిప్రాయాన్ని సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.అలా చేస్తే అవమానించినట్లే ఇందుకు స్పందించిన సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్.. సీఎస్కే ప్రపోజల్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఘనతలు సాధించిన ఆటగాళ్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు. ఇలా చేస్తే వారి విలువను తగ్గించినట్లే అవుతుంది. అలా కాదని.. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో ఇలాంటి వాళ్లను రిటైన్ చేసుకుంటే వారికి చెల్లించే మొత్తం మిగతా వాళ్లకు వేలంలో లభించే కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పాత నిబంధనలు తిరిగి తీసుకురావాల్సిన అవసరం లేదు. ధోని ఐపీఎల్-2025 మెగా వేలంలోకి వస్తేనే మంచిది’’ అని కావ్యా మారన్ అన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది. -
Paris Olympics 2024: షూటింగ్లో కాంస్య పతకం.. ఎవరీ స్వప్నిల్ కుసాలె..?
పారిస్ ఒలింపిక్స్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్‌కు చెందిన స్వప్నిల్ కుసాలె కాంస్య పతకం సాధించాడు. ఈ పతకంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది. భారత్ సాధించిన మూడు పతకాలు షూటింగ్లో సాధించనవే కావడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత్ జోడీ కాంస్య పతకాలు సాధించారు.ఎవరీ స్వప్నిల్ కుసాలె..?29 ఏళ్ల స్వప్నిల్ కుసాలె మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు సమీపంలో గల కంబల్వాడి అనే గ్రామంలో పుట్టిపెరిగాడు. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అతనికి 12 ఏళ్లు పట్టింది. స్వప్నిల్ అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే పతకం సాధించి ఔరా అనిపించాడు. ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ షూటర్ స్వప్నిల్ కుసాలేనే కావడం విశేషం.మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని స్పూర్తితో..!స్వప్నిల్ కుసాలే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నుంచి ప్రేరణ పొందాడు. ధోనిని ఆరాధిస్తాడు. స్వప్నిల్ కూడా ధోనిలాగే కెరీర్ ఆరంభంలో రైల్వే టికెట్ కలెక్టర్‌గా పని చేశాడు. ధోని బయోపిక్‌ను స్వప్నిల్ చాలాసార్లు చూశాడు. అతని స్పూర్తితో విజయాలు సాధించాలని కలలు కనేవాడు. ఎట్టకేలకు స్వప్నిల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.ధోనిలాగే ఓపికగా, ప్రశాంతంగా ఉంటాడు..!షూటర్‌కు ఓపిక, ప్రశాంతత చాలా అవసరం. ఈ రెండు లక్షణాలు స్వప్నిల్లో మెండుగా ఉన్నాయి. క్రికెట్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన ధోనిలోనూ ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. వాస్తవానికి ధోని సక్సెస్‌కు ఈ రెండు లక్షణాలే ప్రధాన కారణం. అతనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అని బిరుదు కూడా ఉంది. ఇప్పుడు స్వప్నిల్ ధోనిని స్పూర్తిగా తీసుకుని భారత్‌కు పతకం సాధించి పెట్టాడు.స్వప్నిల్ కుటుంబ నేపథ్యంస్వప్నిల్ తండి, సోదరుడు ప్రభుత్వ టీచర్లు. స్వప్నిల్ తల్లి కంబల్వాడి గ్రామ సర్పంచ్. స్వప్నిల్ 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నాడు. -
షమీ, అశ్విన్ కాదు..! అతడే నా ఫేవరేట్ బౌలర్: ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత క్రికెట్లో తన ఫేవరేట్ బౌలర్ ఎవరో చెప్పేశాడు. ధోని తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ధోనికి తన ఫేవరేట్ బౌలర్ ఎవరు? తనకు ఇష్టమైన బ్యాటర్ ఎవరన్న రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి. మొదటి ప్రశ్నకు వెంటనే సమాధానమిచ్చిన మిస్టర్ కూల్.. రెండో ప్రశ్నకు మాత్రం తన వద్ద ఆన్సర్ లేదని ఈజీగా తప్పించుకున్నాడు. తొలి ప్రశ్నకు బదులుగా వరల్డ్ క్రికెట్లో తన ఫేవరేట్ బౌలర్ టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అని ధోని చెప్పుకొచ్చాడు."మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా సులువు. నా ఫేవరెట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. కానీ నాకు ఇష్టమైన బ్యాటర్ ఎవరో మాత్రం చెప్పలేను. ఎందుకంటే మన దగ్గర చాలా మంది మంచి బ్యాటర్లు ఉన్నారు. అయితే బౌలర్లు మంచి వారు లేరని కాదు. బ్యాటర్లను ఎంచుకోవడం కష్టమని చెబుతున్నా.జట్టులో ప్రతీఒక్క ఆటగాడు అద్భుతంగా రాణిస్తున్నారు. అందుకే బ్యాటర్లలో ఏ ఒక్కరి పేరో చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్లు ఇంకా పరుగులు చేయాలి, టీమిండియాకు మంచి విజయాలు అందించాలని ఆశిస్తున్నాని" ధోని పేర్కొన్నాడు. కాగా బుమ్రా భారత జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ తన బౌలింగ్‌తో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. -
ఆ నలుగురి కోసం త్యాగం.. ఆటకు ధోని గుడ్‌బై?.. కారణం ఇదే!
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే).. మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేర్లు పర్యాయపదాల్లాంటివి అనడం అతిశయోక్తి కాదు. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే ఉన్నాడు. పదిహేడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత అతడి సొంతం. వేలం మొదలు కెప్టెన్‌గా తుదిజట్టు ఎంపిక దాకా ప్రతీ విషయంలోనూ ధోని మార్కు కనబడుతుంది.ఎంతో మంది యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇచ్చి.. వారిలోని ప్రతిభకు పదునుపెట్టేలా మార్గదర్శనం చేశాడు ధోని. శ్రీలంక బౌలర్లు మహీశ్ తీక్షణ, మతీశ పతిరానా వంటి వాళ్లు అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదగడంలో ‘తలా’ పాత్ర ఉందని చెప్పడం ఇందుకు నిదర్శనం. ఇక ‘డాడీ’స్ గ్యాంగ్(సీనియర్ ఆటగాళ్లు)తోనూ ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన ధోని.. ఐపీఎల్-2022లోనే తన వారసుడిగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎంచుకున్నాడు.సీఎస్కే పగ్గాలు అతడికి అప్పగించి తాను ప్లేయర్‌గా కొనసాగాలని భావించాడు. అయితే, ధోని తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వలేదు. అంతకుముందు కెప్టెన్‌గా అనుభవం లేని జడ్డూ దారుణంగా విఫలమయ్యాడు. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ వదిలేసి జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోని మళ్లీ సారథ్య బాధ్యతలు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జట్టు అవమానకరరీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఫలితంగా మరుసటి ఏడాది ధోనినే కెప్టెన్‌గా కొనసాగాడు. ఐపీఎల్-2023లో సీఎస్కేకి ఐదో టైటిల్ అందించాడు. ఈ క్రమంలో అతడు ఇక ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడనే వార్తలు రాగా.. అనూహ్యంగా ఐపీఎల్-2024లోనూ ‘తలా’ భాగమయ్యాడు. ఈసారి రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా.. చెన్నై మెరుగైన ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచినా నెట్రన్ రేటు పరంగా వెనుకబడి టాప్-4 నుంచి నిష్క్రమించింది.అయితే, ఈ సీజన్లో 42 ఏళ్ల ధోని మోకాలి నొప్పితోనే మ్యాచ్‌లు ఆడాడు. వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తూ బ్యాటర్‌గానూ తనదైన ముద్ర వేశాడు. కానీ ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ధోని చెన్నై ప్లేయర్‌గా కొనసాగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆటగాళ్ల రిటెన్షన్ విధానం విషయంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, బీసీసీఐ మధ్య జూలై 31న సమావేశం జరుగనున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. ఫ్రాంఛైజీలకు ఒకవేళ ఐదుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఇస్తేనే ధోని ఆటగాడిగా కొనసాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సంఖ్య నాలుగుకే పరిమితమైతే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీశ పతిరానా, శివం దూబేలను చెన్నై రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ విషయం గురించి ధోని ఇప్పటికే చెన్నై ఫ్రాంఛైజీ యజమాని ఎన్.శ్రీనివాసన్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోని.. చెన్నై మెంటార్‌గా కనిపించనున్నాడని క్రిక్‌బజ్ అంచనా వేసింది. చెన్నై జట్టు ముఖచిత్రమైన ధోని మెంటార్ లేదంటే కోచ్ రూపంలో తిరిగి వస్తాడని పేర్కొంది. -
అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్: భజ్జీ ఫైర్
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జర్నలిస్ట్‌కు అదరి పోయే కౌంటరిచ్చాడు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌తో పోల్చినందుకు సదరు జర్నలిస్ట్‌పై హర్భజన్ మండిపడ్డాడు.ఫరీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎంఎస్ ధోని, మహ్మద్ రిజ్వాన్‌లలో ఎవరు బెటర్ అన్న పోల్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన భజ్జీ ఇదేమి చెత్త ప్రశ్న అంటూ ఫైరయ్యాడు. "ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. భయ్యా అతడికి ఎవరైనా చెప్పండి.ధోనితో రిజ్వాన్‌కు పోలికా? రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విషయం రిజ్వాన్‌ను అడిగినా అతడు నిజాయితీగా సమాధానం చెబుతాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అతడు జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం చాలా తప్పు.ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ ధోనినే నంబర్ వన్. వికెట్ల వెనక ధోనిని మించిన వారే లేరు" అంటూ ఎక్స్‌లో భజ్జీ రిప్లే ఇచ్చాడు. ఇక భారత క్రికెట్లో ధోని కంటూ ఒక ప్రత్యేకస్ధానముంది.భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనినే. అతడి సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4— Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024 -
ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న రాధిక.. తలా ఎమోషనల్ నోట్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప మహీ ఫొటోలు పోస్ట్ చేయడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మిస్టర్ కూల్‌కు 49.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు అతడు పెట్టిన పోస్టులు కేవలం 111. అయితే, తాజాగా ధోని ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ జతచేశాడు.గ్రాండ్ వెడ్డింగ్ప్రస్తుతం అతడి పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటంటే.. భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ పెళ్లి జరిగింది. ముంబైలో జూలై 12న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్రపంచ నలుమూలల నుంచి క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.మహేంద్ర సింగ్ ధోని సైతం తన సతీమణి సాక్షి, కుమార్తె జివా ధోనితో కలిసి అనంత్- రాధికల పెళ్లికి వెళ్లాడు. బారాత్‌లో డాన్స్ చేస్తూ సందడి చేశాడు కూడా!ఇక వివాహ తంతు ముగిసిన అనంతరం ధోని దంపతులు ప్రత్యేకంగా కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నవ వధువు రాధికా మర్చంట్ నవ్వులు చిందిస్తూ ధోనిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగా.. అనంత్ చిరునవ్వుతో మహీ చేతిని పట్టుకున్నాడు.రాధికా.. అనంత్ అంటూ ధోని ఎమోషనల్ నోట్ఇందుకు సంబంధించిన ఫొటోను మహేంద్ర సింగ్ ధోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. అంబానీల నూతన జంటను ఉద్దేశించి.. ‘‘రాధికా.. నీ ప్రకాశవంతమైన చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే వెలిగిపోతూ ఉండాలి.అనంత్.. మేమందరం చుట్టూ ఉన్నపుడు ఎలాగైతే నువ్వు రాధిక పట్ల ప్రేమను కురిపించావో.. ఎల్లప్పుడూ అలాగే ఉండు ప్లీజ్.మీ వైవాహిక జీవితం సంతోషాలతో నిండిపోవాలి. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. వీరేన్ అంకుల్ కోసం ఓ పాట’’ అంటూ ధోని ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు. ఈ ఫొటోకు ఇప్పటికే 8 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం.కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అందించిన జార్ఖండ్ ‘డైనమైట్’ ధోని.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపాడు.ఇక ఈ ఏడాది చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన 43 ఏళ్ల ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: Copa America 2024: కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్ View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) -
Yuvraj Singhs all-time playing XI: యువరాజ్ బెస్ట్ టీమ్ ఇదే.. ధోనికి నో ఛాన్స్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర ఎడిషన్ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు.. ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను ఓడించింది. ఈ టోర్నీలో కెప్టెన్ యువరాజ్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.నాయకుడుగా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా ఆటగాడిగా యువీ రాణించాడు. కీలక సెమీస్‌లో సత్తాచాటి ఇండియాను ఫైనల్‌కు చేర్చాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా 12 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ ఫైనల్లో విజయనంతరం యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.తన అత్యుత్తుమ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు మాత్రమే యువీ ఛాన్స్ ఇచ్చాడు. అయితే భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి యువరాజ్ చోటు ఇవ్వకపోవడం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక యువ ఎంచుకున్న జట్టులో కోహ్లి, రోహిత్, సచిన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌లకు చోటు దక్కింది.యువరాజ్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్. pic.twitter.com/Fim1k9uvBL— Out Of Context Cricket (@GemsOfCricket) July 13, 2024 -
అంబానీ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ వీళ్లదే.. పిక్ అదిరిపోయింది!
అంబానీ ఇంట్లోని పెళ్లి గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే టాలీవుడ్, బాలీవుడ్, టీమిండియా.. ఇలా దాదాపు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు.. అనంత్ అంబానీ పెళ్లిలో కనిపించారు. జస్ట్ కనిపించడమే కాకుండా డ్యాన్సులతో రచ్చ రచ్చ చేశారు. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి మహేశ్, వెంకటేశ్, రామ్ చరణ్ తదితరులు సతీసమేతంగా పెళ్లికి హాజరయ్యారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ మహేశ్, టీమిండియా లెజెండ్ ధోనీతో పిక్ తీసుకోవడం మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: వీడియో కాల్లో ప్రముఖ నటుడి కొడుకు నిశ్చితార్థం.. ఎందుకిలా?)టీమిండియా దిగ్గజం ధోనీకి అభిమానులు కాని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అలా మహేశ్ కూడా ఆయనకు ఫ్యాన్స్ అనుకుంట. అందుకే అంబానీల పెళ్లిలో ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే అవకాశం దొరకడంతో ధోనీతో ఓ ఫొటో దిగాడు. తాజాగా ఆ పిక్‌ని ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. 'లెజెండ్‌తో..' అని క్యాప్షన్ పెట్టాడు. దీనిబట్టి ధోనీకి మహేశ్ ఎంత పెద్ద అభిమానో అర్థమైపోతోంది.మహేశ్ బాబు తెలుగు హీరో కావడం వల్ల ఈ పెళ్లిలో ఆయన్ని గుర్తుపట్టి పలకరించిన వాళ్లు తక్కువమందే. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు కదా. దీని రిలీజ్ తర్వాత కచ్చితంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోతాడు. అప్పుడు మహేశ్‌తో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎగబడటం గ్యారంటీ. ఏదేమైనా మహేశ్-ధోనీ పిక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
ధోనికి కోపం వచ్చింది.. అతడి వల్లే: అశ్విన్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్‌కు ‘మిస్టర్ కూల్’గానూ పేరుంది. పరిస్థితి చేయిదాటి పోతే తప్ప తలా.. మైదానంలో కోపం, అసహనం ప్రదర్శించడు. అయితే, శ్రీశాంత్ చేసిన పని వల్ల తొలిసారి ధోనికి ఆగ్రహానికి గురికావడం చూశానంటున్నాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.తొలిసారి ధోని కోప్పడటం చూశా2010 నాటి సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని తన పుస్తకం ‘ఐ హావ్ ది స్ట్రీట్స్- ఏ కుట్టీ క్రికెట్ స్టోరీ’(I Have The Streets- A Kutty Cricket Story)లో అశూ వెల్లడించాడు. నాటి మ్యాచ్ సంగతులను ప్రస్తావిస్తూ..‘‘ఆరోజు నేను డ్రింక్స్ అందించే పని చేస్తున్నా. అప్పుడు ధోని హెల్మెట్ తీసుకురమ్మని చెప్పాడు. నాకెందుకో మహీ కోపంగా ఉన్నట్లు కనిపించింది.అతడు సహనం కోల్పోవడం నేను అంతకు ముందెన్నడూ చూడలేదు. ‘శ్రీ(శ్రీశాంత్) ఎక్కడ ఉన్నాడు? అతడు అసలేం చేస్తున్నాడు?’ అని ఎంఎస్ అడిగాడు.శ్రీశాంత్‌కు ఈ సందేశం చేరవేరుస్తానని నేను చెప్పాను. ఆ తర్వాత ఎంఎస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే, మరుసటి ఓవర్లో నన్ను మళ్లీ పిలిచి మహీ హెల్మెట్ రిటర్న్ చేశాడు.శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో!అప్పుడు కామ్‌గానే ఉన్నట్లు అనిపించింది. నాకు హెల్మెట్ ఇచ్చే సమయంలో.. ‘ఒక పనిచెయ్.. రంజీబ్ సర్(టీమ్ మేనేజర్) దగ్గరికి వెళ్లు.శ్రీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పు. వెంటనే అతడికి టికెట్ బుక్ చేయమని చెప్పు. అతడు ఎంచక్కా ఇండియాకు తిరిగి వెళ్లిపోతాడు. సరేనా’ అని నాతో అన్నాడు.ధోని అలా అనడం ఊహించని నాకు షాక్ తగిలినట్లయింది. అసలు నేను ఈ మాటలు విన్నది ధోని నుంచేనా అని కాసేపు అయోమయానికి గురయ్యాను’’ అని అశ్విన్ తన పుస్తకంలో రాశాడు.ఆ మరుసటి ఓవర్లో తనతో పాటు శ్రీశాంత్ కూడా భారత ఆటగాళ్లకు మైదానంలో డ్రింక్స్ అందించాడని అశూ తెలిపాడు. అయినప్పటికీ ధోని శాంతించలేదని.. అతడి నుంచి డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదని పేర్కొన్నాడు.మళ్లీ తననే పిలిచి.. శ్రీశాంత్ టికెట్ గురించి మేనేజర్‌తో చెప్పావా?లేదా అని తనను గట్టిగా ప్రశ్నించాడని అశూ తెలిపాడు. కాసేపయ్యాక అంతా మామూలుగా మారిపోయిందని.. సమస్య సమసిపోయిందని అశ్విన్ వెల్లడించాడు.ధోని కోపానికి కారణం ఇదేకాగా రిజర్వ్ ఆటగాళ్లతో పాటు డగౌట్లో కూర్చోకుండా పేసర్ శ్రీశాంత్ డ్రెస్సింగ్రూంలోనే ఉండిపోవడమే ధోని ఆగ్రహానికి కారణం. ఆ తర్వాత అశ్విన్‌తో మెసేజ్ పంపగా.. శ్రీశాంత్ జెర్సీ వేసుకుని డగౌట్‌కు రావడంతో పాటు.. ధోని దెబ్బకు డ్రింక్స్ కూడా సర్వ్ చేశాడట. అదీ సంగతి!చదవండి: బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి -
రోహిత్‌కు రూ. 5 కోట్లు.. మూడు టైటిళ్ల ధోనికి ఎంత? కపిల్ డెవిల్స్ పాపం!
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ ట్రోఫీ చేరింది. ఈ మెగా టోర్నీ ముగిసి వారం రోజులు దాటినా ఆ గెలుపు తాలుకా సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో రోహిత్ సేనకు బీసీసీఐ అందించిన రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రత్యేకంగా హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన పంపకాల గురించి కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. ఆటగాళ్లకు రూ. 5 కోట్ల మేర అందించడం అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ క్రమంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ సాధించిన ధోని సేనకు బోర్డు ఎంత క్యాష్ రివార్డు ప్రకటించింది? ఎవరెవరికి ఎంత మొత్తం దక్కిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు నెటిజన్లు. మరి ఆ వివరాలు చూద్దామా?పొట్టి కప్ మొదటగా మనకే2007లో టీమిండియా తొలిసారి పొట్టి వరల్డ్‌కప్ గెలిచింది. ధోని సారథ్యంలో తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. నాడు జట్టు మొత్తానికి కలిపి బీసీసీఐ 12 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది.సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్ఇక సొంతగడ్డపై 2011లో ధోని సేన మరోసారి మ్యాజిక్ చేసింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి.. వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఆనాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలుత.. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. కోటి మేర క్యాష్ రివార్డు అందిస్తామని తెలిపింది.అయితే, అనంతరం దీనిని రూ. 2 కోట్లకు పెంచింది. అదే విధంగా.. సహాయక సిబ్బందికి రూ. 50 లక్షలు, సెలక్టర్లకు రూ. 25 లక్షల చొప్పున క్యాష్ రివార్డు అందించింది.చాంపియన్స్ ట్రోఫీ విజేతలకు ఎంతంటే?2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు బీసీసీఐ రూ. కోటి చొప్పున నజరానా అందించింది. అదే విధంగా సహాయక సిబ్బందికి రూ. 30 లక్షల మేర కానుకగా ఇచ్చింది.మరి మొట్టమొదటి వరల్డ్‌కప్ గెలిచిన కపిల్స్ డెవిల్స్‌కు ఎంత?1983లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ దేవ్ సేన ఏకంగా వన్డే వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే, అప్పటికే క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడం.. బీసీసీఐ వద్ద కూడా తగినన్ని నిధులు లేక సంబరాలు కూడా సాదాసీదాగా జరిగాయి.నాడు ఒక్కో ఆటగాడికి కేవలం పాతికవేలు మాత్రమే బీసీసీఐ రివార్డుగా ఇచ్చినట్లు సమాచారం. అయితే, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తన మ్యూజిక్ కన్సర్ట్ ద్వారా నిధులు సమీకరించడంతో ఈ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుమహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), యువరాజ్ సింగ్ (వైస్ కెప్టెన్), అజిత్ అగార్కర్, పీయూష్ చావ్లా, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, దినేశ్ కార్తీక్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఆర్పీ సింగ్, ఎస్. శ్రీశాంత్, రాబిన్ ఉతప్ప.2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుమహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, శ్రీశాంత్, ఆశిష్ నెహ్రా, రవిచంద్రన్ అశ్విన్, పీయూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్.2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు:మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, వినయ్ కుమార్, అమిత్ మిశ్రా, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, మురళీ విజయ్, ఉమేశ్ యాదవ్.1983 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాకపిల్ దేవ్(కెప్టెన్), మొహిందర్ అమర్నాథ్(వైస్ కెప్టెన్), కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సునిల్ గావస్కర్, సయ్యద్ కిర్మాణీ(వికెట్ కీపర్), మదన్ లాల్, సందీప్ పాటిల్, బల్విందర్ సంధు, యశ్పాల్ శర్మ, రవి శాస్త్రి, క్రిష్ణమాచారి శ్రీకాంత్, సునిల్ వాల్సన్, దిలిప్ వెంగ్‌సర్కార్. -
MS Dhoni birthday special: యుగానికి ఒక్కడు.. మహీ.. ది వారియర్
2004 డిసెంబర్ 23.. ఈ తేదికి భారత క్రికెట్లో ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజున జులపాల జట్టుతో ఓ యవ ఆటగాడు టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ రోజు ఎవరూ అనుకోలేదు.. ఆ యువకుడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని. ఆ రోజు ఎవరూ ఊహించలేదు.. ఆ జులుపాల ఆటగాడే భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పుతాడని. తన తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్ డకౌటై విమర్శలు అందుకున్న ఆ యువ ఆటగాడే.. ఇప్పుడు కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య దైవమయ్యాడు.ఆ యువ సంచలనమే మూడు దశాబ్దాలుగా ఎంతోమంది కెప్టెన్లకు సాధ్యం కానీ వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించాడు. అతడే భారత మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ సారధిగా నిలిచిన ధోని ఆదివారం(జూలై 7) తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనిపై ఈ ప్రత్యేక కథనం.ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్ రూపరేఖలను మార్చేశాడు. అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే కెప్టెన్‌గా మారిన మిస్టర్‌కూల్.. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అతడి సారథ్యంలో ఇండియన్ క్రికెట్ టీమ్ తిరిగిలేని శక్తిగా అవతరించింది. అప్పటివరకు ఆడదడప విజయాలను చూసిన భారత్.. అతడి నాయకత్వంలో వరుస విజయాలు సాధించింది. 2007లో జరిగిన తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌లో ధోని సారథ్యంలో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు అద్భుతాలు సృష్టించింది. ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చిత్తు చేసిన భారత్.. విశ్వవిజేతగా నిలిచింది.ఆ తర్వాత కెప్టెన్‌గా ధోని వెనక్కి తిరిగిచూడలేదు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ను అందించి 30 ఏళ్ల భారత నిరీక్షణకు తెరిదించాడు. మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలకు సాధ్యం కానిది మిస్టర్ కూల్ చేసి చూపించాడు. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫిని కూడా భారత్‌కు అందించాడు. అతడి సారథ్యంలో భారత జట్టు కొన్నాళ్లపాటు వరల్డ్ నెం1గా కొనసాగింది. ఝార్ఖండ్ డైనమెట్‌గా పేరుగాంచిన ఎంస్ ధోని.. ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్కు ప్రకటించాడు. ఇక తన 16 ఏళ్ల కెరీర్లో ధోని ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘనతలను ధోని అందుకున్నాడు.ధోని సాధించిన ఘనతలు ఇవే..ధోని 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుపెట్టాడు. కానీ ఆ సిరీస్ మొత్తం విఫలమై కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ధోని కెరీర్‌ను మార్చేసింది. ఆ సిరీస్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ధోని విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 123 బంతుల్లో 148 పరుగులు చేసి విమర్శకుల నోళ్లను మూయించాడు. ధోనికి తన కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం.ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 145 బంతుల్లో 183 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. వన్డేల్లో భారత తరుపన అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్‌గా ధోని నిలిచాడు. ఇప్పటికి ఈ రికార్డు ధోనీ పేరిటే ఉంది.అత్యధిక స్టంపౌట్స్ చేసిన రికార్డు కూడా ధోని పేరిటనే ఉంది. ధోని మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 538 మ్యాచ్‌ల్లో 195 స్టంపౌట్స్ చేశాడు.భారత్‌కు ఐసీసీ మూడు మేజర్ ట్రోపీలు అందించిన ఏకైక భారత కెప్టెన్ కూడా ధోనినే. అతడి సారథ్యంలోనే 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది.మూడు ఫార్మాట్లలో 332 మ్యాచులలో కెప్టెన్ గా సేవలందించిన ధోని.. 178 మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలను అందించాడు. ఇక భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేలకు సారధ్యం వహించిన కెప్టెన్ కూడా ధోనినే.అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడు కూడా ధోనినే.వరల్డ్‌క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో 84 సార్లు అజేయంగా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ ధోనినే కావడం గమనార్హం.ధోని ఐపీఎల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ధోని సారథిగా ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ఇక చివరిగా.. "భారత క్రికెట్ జట్టుకు ఎంతో మంది కెప్టెన్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. అందులో కచ్చితంగా మిస్టర్ కూల్ మాత్రం ఉంటాడు. హ్యాపీ బర్త్‌డే మహీ. -
MS Dhoni Rare Photos: మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
విడాకులు నిజమే అనేలా హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన జోష్‌లో ఉన్న భారత క్రికెటర్లు ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించారు. కుటుంబాలతో సరదాగా సమయం గడుపుతున్నారు.ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని సహా పలువురు క్రికెటర్లు అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట నెలకొన్న పెళ్లి సందడిలో భాగమయ్యారు.VIDEO | Anant Ambani-Radhika Merchant's sangeet ceremony: Former India cricketer Zaheer Khan and his wife Sagarika Ghatge arrive at Nita Mukesh Ambani Cultural Centre in BKC, Mumbai for the sangeet ceremony. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/W8h0FDcBDB— Press Trust of India (@PTI_News) July 5, 2024 భార్యలతో ఆ క్రికెటర్లునీతా- ముఖేశ్ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్‌లో తళుక్కుమన్నారు. రోహిత్, ధోని, హార్దిక్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, జహీర్ ఖాన్, ఇషాన్ కిషన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.ధోని, సూర్య, జహీర్, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా తమ భార్యలతో కలిసి ఈ ఈవెంట్లో సందడి చేయగా.. హార్దిక్ పాండ్యా మాత్రం ఒంటరిగా వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.#WATCH | Cricketers Hardik Pandya, Krunal Pandya and Ishan Kishan arrive at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant's 'Sangeet ceremony' pic.twitter.com/bLy33tmZB8— ANI (@ANI) July 5, 2024 కాగా హార్దిక్- నటాషా మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీశాంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ ఇలా ఒంటరిగా అంబానీ ఇంట సంగీత్‌కు హాజరుకావడం వీటికి మరింత బలాన్నిచ్చింది.అదే సమయంలో అతడి సతీమణి నటాషా స్టాంకోవిక్ తమ కుమారుడు అగస్త్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని.. ఇందుకు ఎల్లప్పుడూ తాను అన్నింటికి కృతజ్ఞురాలిగా ఉంటానంటూ వేదాంత ధోరణిలో క్యాప్షన్ జతచేసింది.విడాకులు నిజమేనన్న వార్తలు ఈ నేపథ్యంలో హార్దిక్- నటాషా విడాకులు నిజమేనన్న వార్తలు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది.అంబానీల యాజమాన్యంలోని ఈ జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం అద్భుతంగా రాణించిన హార్దిక్.. టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో.. విమర్శలు- ప్రశంసల సమయంలో హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి నటాషా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. ఇప్పుడిలా హార్దిక్ అంబానీ ఇంట వేడుకలకు ఒక్కడే హాజరుకావడంతో విభేదాలు నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.VIDEO | Anant Ambani-Radhika Merchant's sangeet ceremony: Indian cricketer KL Rahul arrives at Nita Mukesh Ambani Cultural Centre in BKC, Mumbai for the sangeet ceremony. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/es5B8zIfNJ— Press Trust of India (@PTI_News) July 5, 2024 -
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సత్తాచాటుతున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టుకు అద్బుతమైన విజయాలు అందిస్తున్నాడు.తాజాగా ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో ఆజేయ అర్ధశతకం సాధించిన పాండ్యా.. బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో హార్దిక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.హార్దిక్ సాధించిన రికార్డులు ఇవే..→టీ20 ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులు, 20+ వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ .. 137.89 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో పాండ్యా ఐదో స్ధానంలో నిలిచాడు.షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 853 పరుగులు, 50 వికెట్లుషాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 546 పరుగులు, 39 వికెట్లుషేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)- 537 పరుగులు, 22 వికెట్లుడ్వేన్ బ్రావో (వెస్టిండీస్)- 530 పరుగులు, 27 వికెట్లు→టీ20 ప్రపంచకప్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా పాండ్యా రికార్డు సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు సురేశ్ రైనా (45 పరుగులు), ధోనీ (45) పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు.2012 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతోనే జరిగిన మ్యాచ్‌లో ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన సురేశ్ రైనా 34 బంతుల్లో 45 పరుగులే చేశాడు. కాగా తాజా మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన పాండ్యా వారిద్దరి రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్‌కు ఊరట విజయం లభించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 3 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా బాబర్ రికార్డులకెక్కాడు.పొట్టి ప్రపంచకప్‌లో బాబర్ ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లలో 549 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని 29 ఇన్నింగ్స్‌లలో 529 పరుగులు చేశాడు.తాజా మ్యాచ్‌తో ధోని ఆల్‌టైమ్ రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఇక ఈ జాబితాలో బాబర్, ధోని తర్వాత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(527) ఉన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అమెరికా వంటి పసికూనపై ఓటమి పాలై సూపర్-8కు చేరే అవకాశాలను పాక్ కోల్పోయింది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ రికార్డ్ బ్రేక్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రెకార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బుధవారం అమెరికాపై టీమిండియా విజయనంతరం రోహిత్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.7 వికెట్ల తేడాతో అమెరికాను భారత్ చిత్తు చేసింది. ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్‌గా రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు భారత జట్టుకు అందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని హిట్‌మ్యాన్ అధిగమించాడు. దాదా కెప్టెన్‌గా 22 మ్యాచ్‌ల్లో 16 విజయాలు టీమిండియాకు అందించాడు. తాజా మ్యాచ్‌తో గంగూలీ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ధోని కెప్టెన్‌గా 58 మ్యాచ్‌ల్లో 41 విజయాలు భారత్‌కు అందించాడు. ధోని సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను భారత్ సొంతం చేసుకుంది.అప్పటినుంచి ఇప్పటివరకు కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకోలేకపోయింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆఖరి మొట్టుపై భారత్ బోల్తా పడింది. ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్-8 అర్హత సాధించిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్! -
MS Dhoni: ప్యారిస్ టూర్లో జీవాతో పాటు ధోని- సాక్షి (ఫొటోలు)
-
ధోని మాస్టర్ మైండ్.. విరాట్ ఊచకోత! పాక్‌పై ఎన్నో అద్బుతాలు
భారత్-పాకిస్తాన్ యుద్దానికి సర్వం సిద్దమైంది. అయితే మీరు అనుకుంటున్నట్లు ఈ యుద్దం బోర్డర్లో కాదు క్రికెట్ మైదానంలో. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆదివారం(జూన్ 9)న న్యూయర్క్ వేదికగా భారత్-పాక్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి పాక్‌ను మరోసారి చిత్తు చేయాలని భారత జట్టు భావిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం టీ20 వరల్డ్‌కప్-2021ను మళ్లీ రీపీట్ చేయాలని వ్యూహాలు రచిస్తోంది.అగ్రరాజ్య నడిబొడ్డున జరుగుతున్న ఈ దాయదుల పోరు కోసం ఇరు దేశాల అభిమానులు మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్యజరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దం.బాల్ అవుట్.. ధోని మాస్టర్ మైండ్దక్షిణాప్రికా వేదికగా 2007లో తొట్టతొలి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ చిరకాల ప్రత్యర్ధులు తలపడిన తొలి మ్యాచే అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 141 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ కూడా 141 పరుగులే చేసింది. ఇరు జట్లు సమంగా పోరాడడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే అప్పటికి సూపర్ ఓవర్ రూల్ అమలు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు బౌల్ అవుట్ పద్దతిని ఎంచుకున్నారు. ఈ రూల్ ఫుట్‌బాల్‌లో పెనాల్టీ షూట్‌ను పోలి ఉంటుంది.బాల్ అవుట్‌కు అంతా సిద్దమైంది. అందరిలో ఒకటే ఉత్కంఠ. ఇందుకోసం టీమిండియా సెహ్వాగ్, ఊతప్ప, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, హార్భజన్సింగ్ పేర్లను ప్రకటించగా.. పాక్ జట్టు ఉమర్‌గుల్, సోహైల్ తన్వీర్, అరాఫత్, షాహిద్ అఫ్రిది, అసిఫ్‌లను ఎంచుకుంది.హార్భజన్ సింగ్‌లు నేరుగా బంతి వికెట్లను తాకేలా బౌలింగ్ చేయగా.. పాక్ బౌలర్లు యాసిర్ ఆరాఫత్, ఉమర్ గుల్, షాహిద్ ఆఫ్రిదిలు విఫలమయ్యారు. దీంతో టీమిండియా 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక బాల్ అవుట్లో భారత్ విజయం సాధించడంలో కెప్టెన్ ధోనిది కీలక పాత్ర. త్రో చేసే క్రమంలో ప్లేయర్ల ఏకాగ్రత చెదరకుండా ఉండటం కోసం వికెట్ల వెనుక మోకాళ్ల మీద కూర్చున్నాడు. దీంతో భారత ప్లేయర్లు పాక్‌పై సాధించారు.ఫైనల్లో ఉత్కంఠ..ఇక అనుహ్యంగా మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరు పాక్‌పై భారత్ విజయం సాధించింది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ ఆఖరి బంతికి పాక్‌ను ఓడించి తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ ధోనీ జోగిందర్ శర్మకు అప్పగించాడు. క్రీజులో మిస్బా ఉల్ హక్ ఉన్నాడు. ఈ క్రమంలో మొదటి బంతిని జోగిందర్ వైడ్ వేయగా.. రెండో బంతిని డాట్ చేశాడు. కానీ మూడో బంతికి మాత్రం భారీ సిక్స్ సమర్పించుకున్నాడు. చివరి 4 బంతుల్లో పాక్ విజయానికి 6 పరుగులు అవసరం కాగా.. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. ఈ దశలో స్కూప్ షాట్ ఆడిన మిస్బా ఉల్ హక్ షార్ట్ ఫైన్ లెగ్‌లో శ్రీశాంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ తొట్టతొలి టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌గా నిలిచింది.విరాట్ కోహ్లి సూపర్ ఇన్నింగ్స్..ఇక పాకిస్తాన్‌పై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌లు అన్ని ఒక ఎత్తు.. టీ20 వరల్డ్‌కప్-2022లో దాయాదిపై ఆడిన ఇన్నింగ్స్ ఒక ఎత్తు. 2022లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాక్ విరాట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి తప్పదనుకున్న చోట కోహ్లి తన విరోచిత పోరాటంతో టీమిండియాకు సంచలన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఇఫ్తికార్ అహ్మద్ (51), షాన్ మసూద్ (52) హాఫ్ సెంచరీలు చేయడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 10 ఓవర్లు ముగిసే సరికి 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో పాక్ విజయం తథ్యమని అంతా భావించారు. కానీ క్రీజులో ఒక పోరాట యోధుడు ఉన్నాడన్న విషయం అందరూ మర్చిపోయారు. విరాట్ హార్దిక్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ టీమిండియాను మ్యాచ్‌లో ఉంచాడు. చివరి 6 బంతుల్లో టీమ్ఇండియాకు విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. మహ్మద్ నవాజ్ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా ఔటైనా, విరాట్ కోహ్లీ నోబాల్ ను సిక్స్‌గా మలిచి టీమిండియా డగౌట్లో జోష్‌ను నిప్పాడు. ఆ తర్వాత ఫ్రీహిట్ బంతికి 3 పరుగులు తీశారు. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. -
MS Dhoni: ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!
మహేంద్ర సింగ్ ధోని.. ఈ టీమిండియా దిగ్గజ కెప్టెన్ తన అద్బుత ఆట తీరు, నిరాండంబరతతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ తర్వాత కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. ‘తలా’గా అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. అయితే, ధోని మైదానంలో దిగుతున్నాడంటే సీఎస్కే ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు.. జట్లకు అతీతంగా అందరిలోనూ ఉత్సాహం నిండిపోతుంది.ఏ జట్టుకు మద్దతు ఇచ్చే వారైనా ధోని బ్యాటింగ్‌కు వచ్చాడంటే .. క్రీజులో ఉన్నంత సేపు అతడికే మద్దతుగా నిలుస్తారు. ఇక మరికొంత మందైతే తలాను నేరుగా కలిసేందుకు దెబ్బలు తినైనా సరే మైదానంలోకి దూసుకువస్తారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.ధోని బ్యాటింగ్‌కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పిఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగానూ ఓ వ్యక్తి ఇలాగే ఫీల్డ్‌లోకి దూసుకువచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ధోని బ్యాటింగ్‌కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి ప్రవేశించి.. ధోని పాదాలను చుట్టేశాడు.ఆ సమయంలో ధోని ఏమాత్రం సహనం కోల్పోకుండా తన అభిమాని సమస్యను అర్థం చేసుకోవడమే గాకుండా.. సర్జరీ చేయిస్తానని మాట ఇచ్చాడట. నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!‘‘ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లాను. మహీ భాయ్ అప్పుడు.. ‘సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా’ అన్నాడు.మహీ భాయ్‌ను చూశానన్న ఆనందంలో నాకైతే పిచ్చిపట్టినట్లయింది. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయనొక లెజెండ్. నేరుగా ఆయనను చూడగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.ఆ సమయంలో నేను భారంగా శ్వాస తీసుకోవడం గమనించి.. ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగా పనిచేయదని.. శ్వాస విషయంలో ఇబ్బంది పడుతున్న అని చెప్పాను. వెంటనే ఆయన.. ‘బాధపడకు.. నీ సర్జరీ గురించి నేను చూసుకుంటా. నీకేం కానివ్వను’ అని భరోసా ఇచ్చారు’’ అని సదరు అభిమాని ఫోకస్డ్ ఇండియన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ధోని గ్రేట్అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ధోని గ్రేట్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. కాగా 42 ఏళ్ల వయసులో సీఎస్కే కెప్టెన్‌గా వైదొలిగిన ధోని.. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు.గైక్వాడ్ సారథ్యంలో వికెట్ కీపర్బ్యాటర్గా కొనసాగాడు ధోని. అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్Conversation between @msdhoni and fan 🥹💛Fan told him he has some breathing issues and there is surgery of it. He wanted to meet him before surgery. Mahi replied "Teri surgery ka mai dekh lunga. Tujhe kuch nahi hoga, tu ghabara mat. Mai tujhe kuch nahi hone dunga" pic.twitter.com/wKz9aZOVGQ— ` (@WorshipDhoni) May 29, 2024 -
MS Dhoni: ఓటేసిన ధోని.. వీడియో వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్వస్థలం రాంచిలో శనివారం ఓటు వేశాడు. కాగా లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఆరో విడత పోలింగ్ జరుగుతోంది.ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బిహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, జమ్మూ-కశ్మీర్లో ఒకటి, జార్ఖండ్‌లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్‌లో పద్నాలుగు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 889 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.భారీ భద్రత నడుమ ఓటేసిన ధోనిఈ నేపథ్యంలో ధోని కుటుంబంతో సహా రాంచిలోని సమీప పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. ఈ క్రమంలో మిగతా ఓటర్లు అతడిని చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే, భారీ భద్రత నడుమ ధోని ఓటేసి వచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. భారత ఎన్నికల సంఘం సైతం.. ‘‘తలా ఫర్ రీజన్’’ అంటూ ప్రజాస్వామ్యంలో ధోని సిక్సర్ బాదాడంటూ ఫొటోను షేర్ చేసింది.ఇదిలా ఉంటే.. మరో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, గౌతం గంభీర్, రెజ్లర్ బబితా ఫొగట్ తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానేఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వైదొలిగిన ధోని.. ఆ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. తాను మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్‌గా కొనసాగాడు.వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకోవడంతో పాటు మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 161 పరుగులు సాధించాడు.అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే జార్ఖండ్ చేరుకున్న ధోని కుటుంబానికి సమయం కేటాయించాడు.#WATCH | Jharkhand: Former Indian Captain MS Dhoni arrives at a polling station in Ranchi, to cast his vote for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/W5QQsIu90C— ANI (@ANI) May 25, 2024 -
MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై?.. ధోని కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయసులోనూ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్-2024లో వికెట్ కీపర్‌గా కళ్లు చెదిరే క్యాచ్‌లతో అదరగొట్టిన తలా.. లోయర్ ఆర్డర్లో బ్యాటర్‌గానూ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు.వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ పవర్ఫుల్ సిక్సర్లతో విరుచుకుపడుతూ కావాల్సినంత వినోదం పంచాడు. అయితే, ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో అభిమానులు నిరాశ చెందారు.లీగ్ దశలోనే ముగిసిన ప్రయాణంచావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సేన ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిపోయింది.అయితే, ఈ మ్యాచ్‌లో ధోని మెరుపులు మెరిపించడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. 13 బంతుల్లో 3 ఫోర్లు, ఓ భారీ సిక్సర్ సాయంతో తలా 25 పరుగులు సాధించాడు. ఇక 42 ఏళ్ల ఈ ‘జార్ఖండ్ డైనమైట్’కు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ధోని ఫిట్నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.క్రికెటర్‌గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాలియువ ఆటగాళ్లతో పోటీ పడటం అంత తేలికేమీ కాదని.. క్రికెటర్‌గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘నేను ఏడాదంతా క్రికెట్ ఆడుతూనే ఉండను.కేవలం లీగ్ క్రికెట్ కోసమే మైదానంలో దిగుతాను. అయినా ఎల్లప్పుడూ ఫిట్‌గానే ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్న యువ ఆటగాళ్లను ఎదుర్కోవాలి కాబట్టి నేనూ వారిలాగే ఫిట్‌గా ఉండాలి.వయసును సాకుగా చూపలేంఎందుకంటే ప్రొఫెషనల్ క్రికెట్లో వయసు కారణంగా ఎవరూ మనకు డిస్కౌంట్ ఇవ్వరు. ఒకవేళ మనం ఆడాలని నిర్ణయించుకుంటే కచ్చితంగా అందుకు తగ్గట్లుగా ఫిట్నెస్ మెయింటెన్ చేయాలి.వయసును సాకుగా చూపి మనం ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. అందుకే ఆహారపుటలవాట్లు మొదలు వ్యాయామం, ప్రాక్టీస్ వంటి విషయాల్లో కచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఉండాల్సిందే’’ అని ధోని పేర్కొన్నాడు. దుబాయ్ ఐ 103.8 చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది సీఎస్కేను చాంపియన్‌గా నిలిపిన ధోని.. ఈ ఏడాది కెప్టెన్సీ నుంచి వైదొలిగి పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2024: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024 -
భారత హెడ్‌కోచ్ సెలక్షన్.. అతడిని ఒప్పించే బాధ్యత ధోనీదే!
టీమిండియా హెడ్ కోచ్ పదవికి కోసం బీసీసీఐ దరఖాస్తులను అహ్హనించిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈ నెల 27. సాయంత్రం 6 గంటల్లోగా బీసీసీఐకి తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా పలు దిగ్గజాలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్‌కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్. భారత జట్టు హెడ్‌కోచ్ బాధ్యతలను ఎలాగైనా ఫ్లెమింగ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కానీ ఫ్లెమింగ్ మాత్రం టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతలు చెపట్టేందుకు సిద్దంగా లేనిట్లు సమాచారం. 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 ఫ్రాంచైజీలతో కోచ్‌గా అతడు ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు కారణం. అయితే జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, మహేల జయవర్ధనే వంటి ఇతర అభ్యర్థులతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నప్పటికీ.. ఈ మాజీ న్యూజిలాండ్ క్రికెటర్‌ను ఒప్పించడంపై బోర్డు ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను బీసీసీఐ.. సీఎస్కే మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి."భారత హెడ్‌కోచ్ పదవి కోసం స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను బీసీసీఐ సంప్రదించింది. అందుకు ఫ్లెమింగ్ నో చెప్పలేదు. కానీ అతడు ఫ్రాంచైజీలతో తన కాంట్రాక్ట్ పదవీకాలం గురించి ఆలోచిస్తున్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ కూడా తొలుత భారత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ అతడిని ఒప్పించారు. ఇప్పుడు ఫ్లెమింగ్ విషయంలో కూడా అదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ బాధ్యతను ఎంఎస్ ధోనికి అప్పగించారు. ఎందుకంటే స్టీఫెన్‌తో ధోనికి మంచి సంబంధాలు ఉన్నాయని" ఓ బీసీసీఐ అధికారి ఒకరు హిందుస్థాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు. -
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
‘‘ప్రపంచకప్ ఫైనల్ గెలిచినా.. భావోద్వేగాలు ప్రతిబింబించేలా సంబరాలు చేసుకుంటున్న సమయంలోనూ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడం మర్యాద. ‘మన మధ్య పోరు ముగిసిపోయింది.మన మధ్య ఇక ఎలాంటి శత్రుత్వం లేదు. ఇప్పటికి ఇది ముగిసిపోయింది’ అని ఇరు జట్లు పరస్పరం చెప్పుకోవడానికి ఇది(షేక్‌హ్యాండ్) ప్రతీక’’- హర్షా భోగ్లే, కామెంటేటర్.‘‘అతడొక ఐకానిక్ ప్లేయర్. వచ్చే ఏడాది ఆడతాడో లేదో కూడా తెలియదు. బహుశా ఇదే చివరి మ్యాచ్ కూడా అయి ఉండవచ్చు. అలాంటి లెజెండ్‌ను కలవడానికి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం.ఆ తర్వాత ఎంతసేపు సంబరాలు చేసుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ అంతా ముగిసి తెల్లారిన తర్వాత.. ‘అయ్యో.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు.కానీ మనం ఆయనకు డీసెంట్‌గా ఓ షేక్‌హ్యాండ్‌తో వీడ్కోలు పలకలేకపోయామే’ అని బాధ పడితే ప్రయోజనం ఉంటుందా?’’- ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.ధోనికి అవమానంచెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపట్ల ఇలా కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)తో పాటు ఐదుసార్లు ట్రోఫీ సాధించిన దిగ్గజం పట్ల ఆర్సీబీ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం అవమానకరమని మండిపడుతున్నారు.ఇక ధోని అభిమానులైతే ఆర్సీబీ జట్టును సోషల్ మీడియా వేదికగా పదునైన కామెంట్లతో తూర్పారబడుతున్నారు. అయితే, తాజాగా ఓ నెటిజన్ కొత్త వీడియోను తెరమీదకు తెచ్చారు. ధోనికి మద్దతుగా మాట్లాడే వారందరూ ఒక్కసారి ఈ దృశ్యాలను చూడాలంటూ కొత్త చర్చకు దారితీశారు.ఇంతకీ ఏం జరిగింది?... ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ రేసులో వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.లీగ్ దశలో సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా చెన్నైని ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది.ధోనిని పట్టించుకోని ఆర్సీబీ ఆటగాళ్లు?ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఫైనల్ గెలిచినంతంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధోని సహా మిగిలిన చెన్నై ఆటగాళ్లు కరచాలనం చేసేందుకు వచ్చారు. అయితే, ఆర్సీబీ సెలబ్రేషన్స్ పూర్తికాకపోవడంతో వీళ్లను పట్టించుకోలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న ధోని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కాసేపు వేచి చూడగా.. ఎట్టకేలకే ఆర్సీబీ ప్లేయర్లు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో ధోని మూడు నిమిషాల పాటు ఎదురుచూసినా ఆర్సీబీ ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ కోసం రాలేదని.. తలాను ఘోరంగా అవమానించారంటూ విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లందరిపై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడ్డారు.అసలు నిజం ఇదేనంటూఈ క్రమంలో ఓ వ్యక్తి నిజం ఇదేనంటూ.. ‘‘ధోని మూడు నిమిషాలు వేచి చూశాడని అభిమానులు అంటున్నారు. అయితే, అతడు కాసేపు కూడా ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. గెలిచిన జట్టుకు ఆమాత్రం సెలబ్రేట్ చేసుకునే హక్కులేదా? సీఎస్కే గతేడాది ట్రోఫీ గెలిచినపుడు సంబరాలు చేసుకుందా? లేదంటే షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లిందా? ’’ అని ఓ వీడియోను పంచుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్సీబీ- సీఎస్కే ఫ్యాన్స్ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్I can understand he’s pissed but every other player came to shake hands. Those players deserved to have that moment. When CSK won last year should they have gone around celebrating or gone to shake hands? https://t.co/MPXQ9zVOYo pic.twitter.com/TxKA2My6xD— Pradhyoth (@Pradhyoth1) May 19, 2024#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024 -
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్..
ఐపీఎల్-2024 లీగ్ దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడిపోయింది. రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.సీఎస్కే, ఆర్సీబీ 14 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికి.. రన్‌రేట్ పరంగా బెంగళూరు మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్ తర్వాత ధోని ఐపీఎల్‌కు విడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ధోని నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ వార్తలపై సీఎస్కే ప్రతినిథి ఒకరు స్పందించారు. ధోని తన రిటైర్మెంట్ గురించి ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు తెలియజేయలేదని సదరు ప్రతినిథి తెలిపారు."ఐపీఎల్ రిటైర్మెంట్ గురుంచి ధోని ఇప్పటివరకు సీఎస్కేలో ఎవరితోనూ చర్చించలేదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం తీసుకుంటాని మెనెజ్‌మెంట్‌తో ధోని చెప్పాడు. అతడు ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు. అది మాకు కలిసొచ్చే అంశం. వికెట్ల మధ్య పరిగెత్తడంలో అతడు ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చాలా మంది దిగ్గజ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు అయితే వచ్చే సీజన్లో ఈ రూల్‌ను ఉపయోగించుకుని ధోనిని కేవలం బ్యాటింగ్‌కే దిగేలా చూడాలి కోరుతున్నారు. ఇది గానీ ధోని ఏమి నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదు. తను ఏ నిర్ణయం తీసుకున్న మేము అంగీకరిస్తాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని ఏ నిర్ణయమైన తీసుకుంటాడని" సీఎస్కే సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. -
యశ్ దయాల్‌పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా సాగిన ఈ పోరులో ఎట్టకేలకు ఆర్సీబీదే పైచేయి అయింది.ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నైకి చెక్ పెట్టి టాప్-4కు అర్హత సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు ఓవర్ల పాటు ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తైన తరుణంలో వరణుడి రాక అభిమానులను కలవరపెట్టింది. అయితే, కాసేపటికే మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. ఈ క్రమంలో ఓపెనర్లు విరాట్ కోహ్లి(47), ఫాఫ్ డుప్లెసిస్(54).. వన్‌డౌన్ బ్యాటర్ రజత్ పాటిదార్(41) రాణించారు.వీరికి తోడు నాలుగో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ధనాధన్ ఇన్నింగ్స్(17 బంతుల్లో 38 నాటౌట్)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో దినేశ్ కార్తిక్ 14, మాక్స్వెల్(16) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(61) రాణించగా.. అజింక్య రహానే(33) అతడికి సహకరించాడు.రవీంద్ర జడేజా సైతం 22 బంతుల్లో 42 పరుగులతో దుమ్ములేపాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా మెరుపులు(13 బంతుల్లో 25) మెరిపించాడు. కానీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు.కాగా అనూహ్య రీతిలో చివరి ఓవర్లో ఆర్సీబీ సారథి డుప్లెసిస్ బంతిని యశ్ దయాల్ చేతికి ఇచ్చాడు.అతడి బౌలింగ్‌లో తొలి బంతికే ధోని సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.దయాల్ అప్పటికే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లి అతడికి దగ్గరికి దిశా నిర్దేశం చేశాడు. ధోని లాంటి లెజెండ్ క్రీజులో ఉన్నపుడు యార్కర్ కాదు స్లో బాల్ వేయాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు.దీంతో యశ్ దయాల్ ధోనికి స్లో బాల్ సంధించగా.. ట్రాప్‌లో చిక్కుకున్న తలా స్వప్నిల్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో సీఎస్కే కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది.అలా కోహ్లి దెబ్బకు సెట్ అయిన యశ్ దయాల్ కీలక వికెట్ తీసి ఆర్సీబీ గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆద్యంతం కీలక సమయంలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ సానుకూల ఫలితాలు రాబట్టడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్ తన అవార్డును యశ్ దయాల్‌కు అంకితమివ్వడం మరో విశేషం. Nail-biting overs like these 📈Describe your final over emotions with an emoji 🔽Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/XYVYvXfton— IndianPremierLeague (@IPL) May 18, 2024pic.twitter.com/xgmfhb0Fri— The Game Changer (@TheGame_26) May 19, 2024 -
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నె సూపర్ కింగ్స్‌కు షాకిస్తూ మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్‌ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్‌కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్‌ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్‌లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్‌తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్‌తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు. -
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు తుది అంకానికి చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గట్టి పోటీ నెలకొంది.బెంగళూరు వేదికగా ఈ రెండు జట్లు శనివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే మాత్రం ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా చెన్నై టాప్-4కు దూసుకువెళ్తుంది.బహుశా ఇదే ఆఖరిసారిఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆర్సీబీ మేటి క్రికెటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహీ భాయ్.. నేను మరోసారి కలిసి(ప్రత్యర్థులుగా) ఆడబోతున్నాం.బహుశా ఇదే ఆఖరిసారి కావొచ్చేమో ఎవరికి తెలుసు! ఏదేమైనా మా అభిమానులకు ఇదొక గొప్ప కానుకలాంటిదే. టీమిండియాలో ఇద్దరం కలిసి ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాం.మహీ భాయ్ తన ఫినిషింగ్ టచ్‌తో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడని అందరికీ తెలిసిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్లో ధోనితో కలిసి ఆడే ఆఖరి మ్యాచ్ ఇదే కావొచ్చంటూ.. ధోని రిటైర్మెంట్పై కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలుకాగా 42 ఏళ్ల ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన తలా.. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో పలు మ్యాచ్‌లలో వింటేజ్ ధోనిని తలపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించిన మహీ.. 10 ఇన్నింగ్స్‌లో కలిపి 136 పరుగులు సాధించాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా సీఎస్కే తరఫున బరిలోకి దిగిన అతడు.. వచ్చే సీజన్లో ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి.చదవండి: MI: అంతా ఫేక్!.. అర్జున్ టెండుల్కర్ ఓవరాక్షన్.. ఆ తర్వాత ఇలా! -
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
-
MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్– రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం చెపాక్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించారు. ఈ పోటీని చూడడానికి ఢిల్లీ నుండి చెన్నైకి వచ్చిన గౌరవ్ (19) అనే యువకుడు.. చెన్నై సూపర్‌స్టార్ మహేంద్ర సింగ్ ధోనీని వ్యక్తిగతంగా చూసిన తరువాతనే ఢిల్లీకి వెళ్తానంటూ అభిమానాన్ని చాటుకున్నాడు.ధోనీకి వీరాభిమాని అయిన గౌరవ్ తలాను కలిసేందుకు సైకిల్‌పై 23 రోజుల పాటు ప్రయాణించి ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చాడు. దాదాపు 2100 కిలో మీటర్ల ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయక చెన్నై చేరుకున్నాడు. స్నేహితులు ఇచ్చిన టికెట్‌తో రాజస్తాన్ రాయల్స్, చెన్నై మధ్య మ్యాచ్‌ను చూశాడు. ఈ క్రమంలో ధోనిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ఢిల్లీకి తిరిగి వెళుతానంటూ చేపాక్కం మైదానం 9వ గేట్ ప్రవేశ ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. తానూ క్రీడాకారుడిగా ఎదగాలనుకుంటున్నానని.. ధోని అంటే అభిమానం ఉన్నందు వల్లే ఈ సాహసం చేశానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. From Delhi to Den! Yellove has no boundaries 🫶A tale of sheer passion and unconditional love that transcends distance and time!🥹💛#WhistlePodu #Yellove pic.twitter.com/YtrG96yHXp— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2024ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో చెన్నై రాజస్తాన్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్ సేనను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రుతురాజ్ గైక్వాడ్ బృందం ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియమంతా తిరుగుతూ ఉత్సాహపరిచిన విషయం తెలిసిందే. కాగా.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా చెన్నై జట్టు ఆర్సీబీతో తలపడనుంది. బెంగళూరు వేదికగా మే 18న ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్‌పై సంచలన వ్యాఖ్యలు -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 2008 నుంచి ఇప్పటి దాకా.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ జట్టుకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీకి ఉన్నంత విశ్వసనీయమైన ఫ్యాన్ బేస్ మరే జట్టుకు లేదంటారు.నాయకుడి స్థానం నుంచి వైదొలిగిఇంతటి క్రేజ్‌కు కారణం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అన్న విషయం తెలిసిందే. ఇక్కడే తన ఫ్రాంఛైజీ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రన్‌మెషీన్.. ఇప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనూ కెప్టెన్‌గానూ బాధ్యతలు చేపట్టిన కోహ్లి పనిఒత్తిడిని తగ్గించుకుని.. కేవలం బ్యాటింగ్‌పై ఫోకస్ చేసే క్రమంలో నాయకుడి స్థానం నుంచి 2021 తర్వాత తప్పుకొన్నాడు.గత రెండు సీజన్లుగా సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. కోహ్లి ఓపెనింగ్ బ్యాటర్‌గా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతడి సారథ్యంలో గతేడాది ఆరో స్థానంతో ముగించిన ఆర్సీబీ.. ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములు చవిచూసింది.వరుసగా ఐదు విజయాలు సాధించితర్వాత తిరిగి పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే, కేజీఎఫ్‌గా ప్రసిద్ధి పొందిన ఆర్సీబీ బ్యాటింగ్ త్రయం కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్లలో కేవలం కోహ్లి ఒక్కడే రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 661 పరుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడం మాత్రం కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్‌గా ప్రకటించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్కు సూచించాడు.ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగేఈ మేరకు.. "ఈసారి వాళ్లు(ఆర్సీబీ గనుక ) ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించకపోతే.. భారత క్రికెటర్‌ను కెప్టెన్‌గా తీసుకురావాలి. అయినా ఎవరో ఎందుకు? మళ్లీ కోహ్లినే కెప్టెన్‌ను చేస్తే సరిపోతుంది కదా! చెన్నై జట్టు మీద ధోని ప్రభావం ఎంత ఉంటుందో.. ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే!బలమైన నాయకుడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. ప్రస్తుతం వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. కోహ్లి సారథిగా వస్తే మరింత బాగుంటుంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడితే చూడాలని ఉంది" అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్‌పై సంచలన వ్యాఖ్యలు -
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశించి ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల వారి అభిమానం తనకు, రవీంద్ర జడేజాకు చిరాకు తెప్పించేందన్నాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. దీనికి ముఖ్య కారణం టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు అతడి సారథ్యంలో మెరికల్లా తయారై జాతీయ జట్ల తరఫున అదరగొడుతున్నారు.ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జట్టుపై నిషేధం పడినా.. తిరిగి సీఎస్కేను నిలబెట్టిన ఘనత ధోని సొంతం. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) తర్వాత రికార్డు స్థాయిలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌గా ధోని మాత్రమే నిలవగలిగాడు.తదుపరి తన వారసుడిగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే.. ఒత్తిడి తట్టుకోలేక 2022 మధ్యలోనే బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో 42 ఏళ్ల ధోని 2023లో టైటిల్ సాధించిన తర్వాత.. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్‌కు తన బాధ్యతలను బదిలీ చేశాడు.ఇక చాలా ఏళ్లుగా సీఎస్కే ముఖచిత్రమైన మిస్టర్ కూల్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలా అని ముద్దుగా పిలుచుకునే తమ నాయకుడిని చూసేందుకు కేవలం చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడున్నా అతడి అభిమానులు మ్యాచ్ చూసేందుకు మైదానానికి పోటెత్తుతారు.ఈ క్రమంలో అతడు త్వరగా బ్యాటింగ్‌కు రావాలంటూ కోరుకునే అభిమానులు బ్యాటింగ్ ఆర్డర్లో ముందున్న జడ్డూ లాంటి వాళ్లు త్వరగా అవుట్ కావాలంటూ గతంలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో జడ్డూ వాళ్లపై అసహనం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డాడు. దీంతో ఫ్యాన్స్ సైతం అతడికి ధీటుగానే బదులిచ్చారు.ఈ నేపథ్యంలో అంబటి రాయుడు తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "మనం సిక్స్, ఫోర్ కొట్టినా ప్రేక్షకులు సైలెంట్‌గా ఉంటారు. జడేజాకు, నాకు ఈ విషయం విసుగు తెప్పించేది.నిజానికి సీఎస్కే ఫ్యాన్స్ ముందు జట్టుకు అభిమానులు కాదు.. వాళ్లు కేవలం ధోని అభిమానులు మాత్రమే. అందుకే జడ్డూకు కూడా చిరాకు వచ్చేది. కానీ అతడు మాత్రం ఏం చేయగలడు అని వ్యాఖ్యానించాడు. కాగా 2018 నుంచి 2023 వరకు సీఎస్కే ఆడిన అంబటి రాయుడు గతేడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో సీఎస్కే పదమూడింట ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. -
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియం అద్భుత దృశ్యానికి వేదికైంది. రాయల్స్‌పై విజయానంతరం సీఎస్కే స్టార్ మహేంద్ర సింగ్ ధోని స్టేడియమంతా కలియదిరుగుతూ టెన్నిస్ బంతులు స్టాండ్స్‌లోకి విసిరాడు.జట్టు వెంటరాగా ముందుండి నడుస్తూ ఉత్సాహంగా కనిపించాడు తలా. దీంతో చెపాక్‌లో ఒకరకమైన భావోద్వేగపూరిత వాతావరణం ఏర్పడింది. 42 ఏళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తల నేపథ్యంలో చెన్నై ఫ్యాన్స్‌ను తలా వీడ్కోలు పలుకుతున్నట్లుగా అనిపించింది. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl)ఇక ధోని స్టేడియాన్ని చుట్టేస్తున్న వేళ చిన్న తలా సురేశ్ రైనా కూడా జతకలిశాడు. ఈ క్రమంలో రైనాకు కూడా బంతిని ఇచ్చిన తలా.. అనంతరం అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ గురించి ఎదురైన ప్రశ్నకు రైనా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. జియో సినిమాలో సహ కామెంటేటర్ అభినవ్ ముకుంద్ రైనాను ఉద్దేశించి.. ఒక యుగం ముగిసిపోయినట్లేనా? అని అడిగాడు.ఇందుకు రైనా బదులిస్తూ.. ‘‘కచ్చితంగా కానే కాదు’’ అని పేర్కొన్నాడు. దీంతో తలా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సీఎస్కే మాజీ స్టార్ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 లీగ్ దశలో చెన్నైలో సీఎస్కే తమ చివరి మ్యాచ్ ఆడేసింది. రాజస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. కాగా క్వాలిఫయర్-2, ఫైనల్ మాత్రం చెపాక్ వేదికగానే జరుగనున్నాయి.చదవండి: ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్‌స్టార్? గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
MS Dhoni: తలా ధోనిపై అభిమానంతో మ్యాచ్ మధ్యలో వీరాభిమాని పాదాభివందనం (ఫొటోలు)
-
మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మిస్టర్ కూల్ అని నిరూపించుకున్నాడు. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.గుజరాత్ టైటాన్స్- సీఎస్కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడ్డాయి.సొంతమైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతకాల మోతసాయి సుదర్శన్(103), శుబ్‌మన్ గిల్(104) శతకాల మోతతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్ ఆదుకుంది. కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్ ముందు తలవంచింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాది ధోని జోరు మీద ఉండగా... మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు. కానీ బాల్ వికెట్స్ మిస్ చేసినట్లుగా తేలడంతో ధోని నాటౌట్‌గా నిలిచాడు.పాదాలకు నమస్కరించగానేఅయితే, ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు. అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్‌గా డీల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలా క్రేజ్, ఫ్యాన్స్ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చదవండి: కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్‌లోనూ అలా! పాపం..Best moments of IPL 🥹💛That Hug and That smile Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024Ms Dhoni knows exactly how to make the stadium roar with his mass entry 🥹🔥🔥#CSKvsGT | #DHONI𓃵pic.twitter.com/U5DA5meNaw— 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) May 10, 2024The Helicopter Shot 🚁A maximum from #CSK's Number 7️⃣💥Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvCSK pic.twitter.com/2QAN3jPjTb— IndianPremierLeague (@IPL) May 10, 2024 -
MS Dhoni: ధోనిని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ గురించి ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నాడు.అదే విధంగా.. ధోని ఏ స్థానంలోనైనా ఆడగలడని అందుకే గత మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడని ఫ్లెమింగ్ తెలిపాడు. కాగా గతేడాది నుంచి ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.అయినప్పటికీ 42 ఏళ్ల తలా ఐపీఎల్-2024 బరిలో దిగాడు. ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ ఆడి 110 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని తన టీ20 కెరీర్లో తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని తప్పుబట్టారు. జట్టు కోసం అతడు ఏడో స్థానంలోనే రావాలని.. అలా కాని పక్షంలో తుదిజట్టులో ఉండకూడదని ఘాటు విమర్శలు చేశారు.ఈ క్రమంలో మోకాలి నొప్పి కారణంగానే బ్యాటింగ్ తగ్గించి.. వికెట్ కీపర్‌గా పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు.గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం చెన్నై మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు కేవలం సిక్సర్లు, ఫోర్లు కొట్టడమే కాదు.. ఏ స్థానంలో వచ్చినా తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు.అతడు తొమ్మిదో స్థానంలో వచ్చినంత మాత్రాన ప్రభావం చూపలేడని భావించవద్దు. జట్టు కోసం తనేం చేయగలడో తప్పకుండా చేస్తాడు.అతడి సేవలను అన్ని రకాలుగా మేము ఉపయోగించుకుంటాం. అయితే, ఒత్తిడి పెంచి అతడు జట్టుకు దూరమయ్యేలా చేసుకోలేం. జట్టు కోసం తను ఎల్లప్పుడూ పరితపిస్తాడు. అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు. ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌కు వచ్చిన ఇబ్బందులేమీ లేవు’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అహ్మదాబాద్‌లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది. చదవండి: Mohammed Shami Slams LSG Owner: కాస్తైనా సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా? -
ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్‌ను చేరుకున్న తొలి భారత క్రికెటర్‌గా శాంసన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసకున్నాడు. శాంసన్ కేవలం 159 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును సాధించాడు. ఇప్పటివవరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఎంఎస్ ధోని 165 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024ఓవరాల్‌గా పదో ప్లేయర్ఇక ఐపీఎల్లో ఓవరాల్‌గా 200 సిక్స్‌లు మైలు రాయిని అందుకున్న 10వ ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, సురేష్ రైనా ఉన్నారు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఢిల్లీ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65) దంచికొట్టారు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024 వీరికి తోడు ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పంత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 201 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలం కాగా సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. The home side emerge victorious in tonight's run-fest here in Delhi 💥And with that win, Delhi Capitals move to number 5⃣ on the Points Table 🔥🔥Scorecard ▶️ https://t.co/nQ6EWQGoYN#TATAIPL | #DCvRR pic.twitter.com/vQvWMSk5lt— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై క్రీడా వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ధోని నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేశారు.జట్టుకు అవసరమైనపుడు ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు. ధోని ఇలాంటి తప్పు చేస్తాడని అసలు ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. అతడికి బదులు జట్టులో మరో అదనపు పేసర్‌ను తీసుకోవాలని సూచించాడు.మరోవైపు.. ఇర్ఫాన్ పఠాన్ సైతం.. 42 ఏళ్ల పైబడినా బ్యాటింగ్ చేయగల సత్తా ధోనికి ఉందని.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కనీసం 4-5 ఓవర్ల పాటు తలా క్రీజులో ఉండాలని సలహా ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో అంతకు ముందు మ్యాచ్‌లోనూ ధోని డారిల్ మిచెల్‌తో కలిసి పరుగు తీసేందుకు వెనుకాడగా.. అదృష్టవశాత్తూ అతడు రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోగా.. ధోని తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ రెండు సందర్భాల్లోనూ ధోనిని తప్పుబట్టిన వాళ్లకు అతడి అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఇలా చేయడానికి ఇదే కారణమంటూ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ధోని.. వికెట్ కీపర్‌గా సేవలు అందించే క్రమంలో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడన్నది దాని సారాంశం.ఇందుకు సంబంధించి సీఎస్కే వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మా ద్వితీయ శ్రేణి జట్టుతోనే ఎక్కువగా ఆడుతున్నాం. ధోనిని విమర్శించే వాళ్లకు అతడు చేస్తున్న త్యాగాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.జట్టు కోసం అతడు ఎంతగానో పరితపిస్తాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా అవసరమైనపుడు బ్యాటింగ్ చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్-2024లో కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ఇప్పటికే అదనపు వికెట్ కీపర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోనినే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే, మోకాలి నొప్పి తీవ్రం కాకుండా చూసుకునేందుకే బ్యాటింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో సీఎస్కే ఆరు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. -
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చిన నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు ధోని నిర్ణయాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా తన టీ20 కెరీర్లో ధోని తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్లు మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో బరిలోకి దిగగా.. వారి తర్వాత వచ్చిన ధోని గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.తుదిజట్టులో ధోని అవసరమా?పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని ఒకవేళ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటే.. అతడు అసలు ఆడనేకూడదు.అలాంటపుడు ధోని బదులు తుదిజట్టులో మరో అదనపు ఫాస్ట్ బౌలర్‌ను తీసుకోవడం మంచిది. నిజానికి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నది ధోని స్వతహాగా తీసుకున్న నిర్ణయమే అయి ఉంటుంది.అలా చేయడం ద్వారా తన జట్టును ప్రమాదంలోకి నెట్టాడు. ధోని కంటే ముందు శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ రావడం ఏమిటి? ఠాకూర్ ఎప్పుడైనా హిట్టింగ్ ఆడాడా?ధోని కావాలనే చేశాడు.. నాకైతే నచ్చలేదుధోని అనుమతి లేకుండా జట్టులో ఏమీ జరుగదు. కానీ ధోని ఈరోజు ఎందుకు ఇలాంటి తప్పు చేశాడో అర్థం కావడం లేదు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలన్న ధోని నిర్ణయం నాకైతే అస్సలు నచ్చలేదు’’ అని భజ్జీ కుండబద్దలు కొట్టాడు.డెత్ ఓవర్లలో సీఎస్కే ఎక్కువ పరుగులు రాబట్టాలనుకుంటే ధోని కచ్చితంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తేనే బాగుంటుందని హర్భజన్ సింగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.రవీంద్రుడి మాయాజాలం కాగా ధర్మశాల వేదికగా పంజాబ్‌తో ఆదివారం నాటి మ్యాచ్ సీఎస్కే 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43 పరుగులు, 3/20) వల్లే ఈ గెలుపు సాధ్యమైంది. ఇక ఫినిషింగ్ స్టార్ ధోని ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 110 పరుగులు చేశాడు.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024 -
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్‌పై జైత్రయాత్రను కొనసాగించాలనుకున్న పంజాబ్ కింగ్స్‌కు భంగపాటు ఎదురైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 28 పరుగుల తేడాతో సామ్ కరన్ బృందాన్ని చిత్తు చేసింది.తద్వారా ఐపీఎల్లో వరుసగా ఆరోసారి సీఎస్కేపై గెలుపొందాలని భావించిన పంజాబ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ మెరుపులతో పాటు.. స్పిన్ మాయాజాలంతో గైక్వాడ్ సేనకు ఈ విజయాన్ని అందించాడు.ఫలితంగా 2021 నుంచి చెన్నైపై పంజాబ్ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి గండిపడింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం మాత్రం నిరాశను కలిగించింది.ఐపీఎల్-2024లో మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్ మొదలుపెట్టిన తలా.. పంజాబ్‌తో పోరుకు ముందు ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు.కానీ ధర్మశాల మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు.ఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్‌తో పాటు ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధోని బౌల్డ్ కాగానే సీఎస్కే ఫ్యాన్స్ అంతా సైలెంట్ అయిపోగా.. ప్రీతి జింటా అయితే సీట్లో నుంచి లేచి నిలబడి మరీ ధోని వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024కాగా సీఎస్కేతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(21 బంతుల్లో 32), వన్‌డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్(19 బంతుల్లో 30)తో పాటు రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43) రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ను జడ్డూ దెబ్బ కొట్టాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్(30), సామ్ కరన్(7), అశుతోశ్ శర్మ(3) రూపంలో కీలక వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో సీఎస్కే పంజాబ్‌ను 139 పరుగులకే పరిమితం చేసి.. ‘కింగ్స్’ పోరులో తామే ‘సూపర్’ అనిపించుకుంది.Full highlight of MS DHONI's greatest knock, 0(1). pic.twitter.com/FrlDKHKE5H— bitch (@TheJinxyyy) May 5, 2024 -
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో తొలుత బ్యాటింగ్‌లో 42 పరుగులతో అదరగొట్టిన జడ్డూ.. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను జడ్డూకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరిచింది.ఈ క్రమంలో జడేజా పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. జడేజా ఇప్పటివరకు ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో 16 సార్లు మ్యాన్ ఆఫ్‌ది అవార్డులను గెలుచుకున్నాడు.ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మరో రికార్డును జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 40 పైగా పరుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయర్‌గా యువరాజ్ సింగ్, షేన్ వాట్సన్ సరసన జడేజా చేరాడు. జడేజా ఇప్పటివరకు మూడు సార్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్సన్ కూడా మూడు సార్లు ర్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశారు. -
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్)లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో జితేష్ శర్మ క్యాచ్‌ను పట్టిన ధోని.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్లో ధోని ఖాతాలో ఇప్పటివరకు 141 క్యాచ్‌లతో పాటు 42 స్టంపింగ్‌లు కూడా ఉన్నాయి. ఈ ఘనత సాధించిన జాబితాలో ధోని తర్వాత ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ ఇప్పటివరకు ఐపీఎల్లో 141 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై సీఎస్కే 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 43 పరుగులు చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. చెన్నై బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, సిమ్రాజిత్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. -
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్, శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని పేర్కొన్నాడు. తన కన్న తండ్రి మాదిరే ధోని కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపాడు.కాగా ఐపీఎల్-2022కు సిసంద మగల దూరం కాగా అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడుగుపెట్టాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే 2023లో 12 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు.ధోని నాయకత్వంలో సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బేబీ మలింగగా ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.అయితే, దీనకంతటికి కారణం ధోనినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువ పేసర్ ఆరంభంలో తడబడ్డా తలా అతడికి అండగా నిలిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సమయంలోనూ నైతికంగా మద్దతునిచ్చాడు.ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్కే ‘లయన్స్ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశ పతిరణ మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘మా నాన్న తర్వాత నా క్రికెట్ లైఫ్‌లో తండ్రి పాత్ర పోషించింది ధోనినే.నన్నొక చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. నా పట్ల శ్రద్ధ వహిస్తారు. అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ ఉంటారు.ఇంట్లో మా నాన్న నాతో ఇలా ఉంటారో ఇక్కడ ధోని కూడా నాతో అలాగే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు చెబుతారు. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా మోటివేట్ చేస్తారు.మైదానం వెలుపల మేము ఎక్కువగా మాట్లాడుకోము. అయితే, నన్ను కలిసిన ప్రతిసారీ.. ‘‘ఆటను ఆస్వాదించు. ఫిట్నెస్ కాపాడుకో’’ అని చెబుతారు.మహీ భాయ్.. మీరు వచ్చే సీజన్లోనూ ఆడాలి. ప్లీజ్ మాతో కలిసి ఆడండి.. అప్పటికీ నేనిక్కడ ఉంటే(నవ్వుతూ)’’ అంటూ పతిరణ ధోని పట్ల అభిమానం చాటుకున్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక పతిరణ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. సీఎస్కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.The bond beyond the field 💛🫂#LionsupClose Full video 🔗 - https://t.co/xt5t6K9SjR #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/odZdVvlrF6— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2024 -
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్‌కు వచ్చి.. వరుసగా ఏడు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచాడు. అంతేకాదు ధనాధన్ ఇన్నింగ్స్‌తో వింటేజ్ తలాను గుర్తు చేస్తూ అభిమానులను అలరించాడు.కానీ పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌తో ఈ ఫీట్లకు తెరపడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి.. రనౌట్ అయ్యాడు.నిజానికి రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 62) అవుటైన తర్వాత ఏడో స్థానం(పద్దెనిమిదో ఓవర్ ఆఖరి బంతి)లో క్రీజులోకి వచ్చిన ధోని ప్రమాదకరంగా మారతాడని భావించగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అనూహ్యంగా స్పిన్నర్ రాహుల్ చహర్‌ను బరిలోకి దించాడు.అప్పటికి పేసర్ హర్షల్ పటేల్ ఒక్క ఓవర్ మాత్రమే వేసి ఉన్నా.. చహర్ వైపే మొగ్గు చూపి సామ్ కరన్ కీలక సమయంలో ప్రయోగానికి దిగాడు. అయితే, అతడి అంచనాలను నిజం చేస్తూ రాహుల్ చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ధోని లాంటి అద్భుతమైన ఫినిషర్ క్రీజులో ఉన్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. కీలకమైన పందొమ్మిదో ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో పాటు మొయిన్ అలీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో చెన్నై విజయానంతరం పంజాబ్ సారథి సామ్ కరన్ మాట్లాడుతూ.. ‘‘ప్రయోగాలు అన్నిసార్లూ ఫలితాలను ఇస్తాయనే నమ్మకం లేదు. కానీ నేను రాహుల్ చహర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి అతడి చేతికి బంతినిచ్చాను.అతడు తన ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితం రాబట్టాడు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో సీఎస్కే విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలోనే ఛేదించి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. The artist performing his art 🎨 😎Chepauk roars to MS Dhoni's fireworks 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/WE7AnyBR8e— IndianPremierLeague (@IPL) May 1, 2024 -
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్ మూడో బంతికి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధోని షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్ మిచెల్ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.కానీ సింగిల్ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ధోని చర్యను తప్పుబట్టాడు.చదవండి: గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024 -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రుతురాజ్ మెరిశాడు. 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రుతురాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన సీఎస్కే కెప్టెన్‌గా గైక్వాడ్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 509 పరుగులు చేసిన గైక్వాడ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే లెజెండ్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఐపీఎల్-2013లో 461 పరుగులు చేశాడు. తాజా సీజన్‌తో ధోని ఆల్‌టైమ్ రికార్డును గైక్వాడ్ బ్రేక్ చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రుతురాజ్(509) కొనసాగుతున్నాడు. రెండో స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(500) పరుగులతో ఉన్నాడు. Most runs by a CSK captain in an IPL season:509* - R Gaikwad in 2024 (10 mat)461 - MS Dhoni in 2013 (18 mat)455 - MS Dhoni in 2018 (16 mat)416 - MS Dhoni in 2019 (15 mat)414 - MS Dhoni in 2008 (16 mat)Ruturaj Gaikwad becomes the first CSK captain to score 500+ runs in an… pic.twitter.com/T73Q8Y3aac— CricTracker (@Cricketracker) May 1, 2024 -
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. సీఎస్కే బ్యాటర్లు కాస్త తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టినప్పటికి రుతురాజ్ మాత్రం ఆచితూచి ఆడి తన జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందిచాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. రుతురాజ్‌తో పాటు ధోని 14 పరుగులతో రాణించాడు.పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, రబాడ తలా వికెట్ సాధించారు. -
ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 150 మ్యాచ్‌ల విజయాలలో భాగమైన మొదటి ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించడంతో ధోని ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ధోనికి ఇది ఆటగాడిగా 150వ విజయం. ఐపీఎల్లో ఇప్పటివరకు 259 మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్.. 150 విజయాలు, 109 ఓటుముల్లో భాగమయ్యాడు.42 ఏళ్ల ధోని ఐపీఎల్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతనిథ్యం వహించాడు. సీఎస్కే తరపున 135 మ్యాచ్‌లు, పూణె తరపున 15 మ్యాచ్‌ల విజయాల్లో ధోని పలుపంచుకున్నాడు. ఇక సీఎస్కేను సారథిగా ధోని 5 సార్లు రికార్డు స్థాయిలో టైటిల్‌ను అందించాడు. అయితే ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అప్పగించేశాడు. ఐపీఎల్లో అత్యధిక విజయాలను అందుకున్న ప్లేయర్స్ వీరే..ఎంఎస్ ధోని - 150రవీంద్ర జడేజా - 133రోహిత్ శర్మ - 133దినేష్ కార్తీక్ - 125సురేష్ రైనా - 122 -
బేబీ రాబోతోంది.. నొప్పులు మొదలయ్యాయి: సాక్షి ధోని పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో వరుసగా రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. చెపాక్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి సొంతగడ్డపై సత్తా చాటింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆరు నుంచి ఏకంగా మూడో స్థానానికి దూసుకువచ్చింది.హైదరాబాద్‌లో తమకు సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాభవానికి సీఎస్కే బదులు తీర్చుకోవడంతో జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అభిమానుల ఆనందానికి కూడా హద్దుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో... సీఎస్కే విజయానికి చేరవవుతున్న క్రమంలో చెన్నై స్టార్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. డారిల్ మిచెల్(32 బంతుల్లో 52) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. శివం దూబే మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్(20 బంతుల్లో 39 నాటౌట్) దుమ్ములేపాడు.134 పరుగులకే ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. సీఎస్కే బౌలర్ల దెబ్బకు 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా ఉన్న రైజర్స్ ఇన్నింగ్స్‌లో 32 టాప్ స్కోరు(ఐడెన్ మార్క్రమ్)గా నమోదైంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీశ పతిరణ చెరో రెండు, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. వీరి అద్భుత ప్రదర్శన కారణంగా హైదరాబాద్ జట్టు 78 పరుగుల తేడాతో ఓడిపోయింది.పురిటి నొప్పులు మొదలయ్యాయిఈ నేపథ్యంలో సాక్షి సింగ్ ధోని.. ‘‘ఈరోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాచ్ పూర్తి చేయండి. చిన్నారి రాబోతోంది... పురిటి నొప్పులు మొదలయ్యాయి. కాబోయే మేనత్త నుంచి మీకిదే నా అభ్యర్థన’’ అంటూ సాక్షి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. సీఎస్కే విజయం తర్వాత ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చెన్నై గెలుపు నేపథ్యంలో.. ‘‘కాబోయే అత్తకు రెండు శుభవార్తలు.. కంగ్రాట్స్’’ అంటూ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 -
సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ (ఫొటోలు)
-
CSK Vs LSG: ‘నన్నెందుకు చూపిస్తున్నావు?’.. ధోని సీరియస్.. వీడియో వైరల్
‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనికి కోపమొచ్చింది. ‘‘కొట్టేస్తా నిన్ను జాగ్రత్త’’ అన్నట్లుగా ధోని హెచ్చరించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ తలాకు ఎవరిపై కోపమొచ్చింది?ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. సొంతమైదానం చెపాక్ వేదికగా టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో ఓపెనర్ అజింక్య రహానే(1) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. వరుసగా వికెట్లు పడ్డా పట్టుదలగా నిలబడి.. శివం దూబే(66)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.అజేయ శతకం(60 బంతుల్లో 108)తో రాణించి సీఎస్కే 210 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ.. మార్కస్ స్టొయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్(63 బంతుల్లో 124*) కారణంగా గైక్వాడ్ సెంచరీ వృథాగా పోయింది.లక్నో చేతిలో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సీఎస్కే మ్యాచ్ అంటే అందరి కళ్లు ఎవరి మీద ఉంటాయో తెలిసిందే. ధోని ఒక్కసారి మైదానంలో దిగాడంటే అభిమానులకు పండుగే.ఇక తలాకు సంబంధించిన ప్రతీ మూమెంట్‌ను తన కన్నుతో బంధించడానికి కెమెరామెన్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. లక్నోతో మ్యాచ్ సందర్భంగా ఇంకాస్త ఎక్కువే ధోనిపై ఫోకస్ చేశాడు కెమెరామెన్. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే దంచికొడుతున్న తరుణంలో డ్రెసింగ్‌రూం నుంచి చూస్తున్న ధోని.. హెయిర్ సెట్ చేసుకుంటుండగా క్యాప్చర్ చేశాడు. దీంతో ఒకింత అసహనానికి గురైన తలా.. బాటిల్ చూపిస్తూ కొట్టేస్తానంటూ కెమెరామెన్‌ను బెదిరించాడు. MS DHONI reaction after camera man focusing on him 😭😭#CSKvLSG pic.twitter.com/tkdk0CAS9q— 𝕏⁷ (@LuciferianVerse) April 23, 2024గైక్వాడ్- దూబే సూపర్ ఇన్నింగ్స్ ఆడుతుంటే అక్కడ ఫోకస్ చేయకుండా.. నాపై దృష్టి పెడతావేంటి అన్నట్లుగా చిరుకోపం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా ఈమ్యాచ్‌లో ధోని ఆరో స్థానంలో వచ్చి ఒకే ఒక్క బంతి ఎదుర్కొని ఫోర్ బాది నాటౌట్‌గా నిలిచాడు.చదవండి: HBD Sachin Tendulkar: పరుగుల వీరుడి గురించి ఈ విషయాలు తెలుసా?Dhoni to Cameraman 😂😂#MSDhoni #CSKvsLSG #IPL2024 #MSDhoni #ruturajgaikwad pic.twitter.com/ue2b1MxUgH— Tanay (@tanay_chawda1) April 23, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్‌ను నిందిస్తారా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్‌కు పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. Ambati Rayudu - Poor field placements in deaths overs by Ruturaj. We clearly saw lack of experience as captainN. Sidhu - If you credit Dhoni for CSK wins then blame him for the losses too. Dhoni is still the main think tank#LSGvsCSK #CSKvLSG #CSKvsLSG pic.twitter.com/R4VnEwWUKY— Richard Kettleborough (@RichKettle07) April 24, 2024 తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్‌ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్ విధ్వంసకర మూడ్‌లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్‌ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ మెరుపులకు శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్కే భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్.. పూరన్, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్ బౌలింగ్‌లో ప్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
కుటుంబంలో పెను విషాదం.. అందుకే ఆ నిర్ణయం: రైనా
‘‘అప్పుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందుకే పంజాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. మా అంకుల్ కుటుంబంలో మరణాలు సంభవించాయి. ఒంటికి నూనె రాసుకుని దాడులకు పాల్పడే కచ్చా గ్యాంగ్.. గ్యాంగ్స్టర్స్ వాళ్ల కుటుంబం మొత్తాన్ని చంపేశారు. అప్పుడు మా బామ్మ కూడా అక్కడే ఉంది. పఠాన్‌కోట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే నేను అక్కడికి వెళ్లాను. అప్పటికే ఐపీఎల్లో బయో బబుల్ నిబంధనలు మొదలయ్యాయి. కాబట్టి తిరిగి జట్టుతో కలిసే పరిస్థితి లేదు. ఆ ఘటనతో మా నాన్న అప్పటికే నైరాశ్యంలో మునిగిపోయారు. అప్పుడు నాకు నా కుటుంబమే మొదటి ప్రాధాన్యంగా కనిపించింది. క్రికెట్ కావాలంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కష్టకాలంలో మాత్రం ఫ్యామిలీకి అండగా ఉండాలని ఆలోచించాను. ఈ విషయాన్ని నేను ఎంఎస్ ధోని, మేనేజ్మెంట్కు చెప్పాను. అందుకే జట్టును వీడాను. నేను తిరిగి వచ్చిన తర్వాత 2021 సీజన్ ఆడాను. 2021లో ట్రోఫీ గెలిచాం. అయితే, అంతకు గతేడాది ముందు మా కుటుంబంలో ఇలాంటి పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటికే కోవిడ్-19 కారణంగా అందరూ డిప్రెషన్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో ఇలా ఆప్తులను కోల్పోవడం నిజంగా మా అందరినీ కుంగదీసింది. కాబట్టి ఆట కంటే ఫ్యామిలీ వైపే మొగ్గుచూపాను’’ అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్-2020 ఆరంభానికి ముందే జట్టును వీడేందుకు గల కారణాలను తాజాగా లలన్‌టాప్ షోలో వెల్లడించాడు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యానని రైనా చెప్పుకొచ్చాడు. అయితే, మరుసటి ఏడాది తిరిగి వచ్చిన తర్వాత సీఎస్కే మరోసారి చాంపియన్‌గా నిలవడం సంతోషాన్నిచ్చిందని రైనా హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2020లో చెన్నై దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి పాయింట్ల పట్టిక(అప్పటికి ఎనిమిది జట్లు)లో ఏడో స్థానంలో నిలిచింది. రైనాతో పాటు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో విఫలమై పరాభవం మూటగట్టుకుంది. అయితే, 2021లో విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది సీఎస్కే. 2022లో మళ్లీ దారుణంగా ఆడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానాని(పద్నాలుగు గెలిచినవి నాలుగు)కి దిగజారిన సీఎస్కే అనూహ్య రీతిలో గతేడాది ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ రైనా తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తన ఆట తీరుతో రైనా ‘మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి పొందాడు. అదే విధంగా ‘చిన్న తలా’గా సీఎస్కే ఫ్యాన్స్ అభిమానం పొందాడు. కాగా రైనా ధోనికి అత్యంత ఆప్తుడన్న విషయం తెలిసిందే. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ -
వింటేజ్ మహి.. ధోని మెరుపు ఇన్నింగ్స్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని మరోసారి అదరగొట్టాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎంఎస్ ధోని మెరుపులు మెరిపించాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన మిస్టర్ కూల్.. లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 42 ఏళ్ల వయస్సులోనూ ధోని తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ధోని(28), మొయిన్ అలీ(30) పరుగులతో రాణించారు. pic.twitter.com/ZkcCOZBogc — Cricket Videos (@cricketvid123) April 19, 2024 -
రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కేపై లక్నో ఘన విజయం
IPL 2024 CSK vs LSG Live Updates: రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కేపై లక్నో ఘన విజయం ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిష్, మోహ్షిన్ ఖానా తలా వికెట్ సాధించారు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. 134 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. ముస్తఫిజుర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో కేఎల్ రాహుల్(73), పూరన్ ఉన్నారు. కేఎల్ రాహుల్ ఫిప్టీ.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీని రాహుల్ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లకు లక్నో స్కోర్: 103/0 9 ఓవర్లకు లక్నో స్కోర్: 84/0 9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(46), క్వింటన్ డికాక్(34) పరుగులతో ఉన్నారు. 4 ఓవర్లకు లక్నో స్కోర్: 32/0 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(19), క్వింటన్ డికాక్(23) పరుగులతో ఉన్నారు. ఆఖరిలో ధోని మెరుపులు.. లక్నో టార్గెట్ 177 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిష్, మోహ్షిన్ ఖానా తలా వికెట్ సాధించారు. సీఎస్కే ఆరో వికెట్ డౌన్.. మొయిన్ అలీ రూపంలో సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన అలీ.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ధోని వచ్చాడు. 18 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 142/6 రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ.. 17 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(53), మొయిన్ అలీ(12) పరుగులతో ఉన్నారు. సీఎస్కే ఐదో వికెట్ డౌన్.. రిజ్వీ ఔట్ సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసిన సమీర్ రిజ్వీ.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. సీఎస్కే నాలుగో వికెట్ డౌన్.. దూబే ఔట్ శివమ్ దూబే రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన శివమ్ దూబే.. స్టోయినిష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 89/4 సీఎస్కే మూడో వికెట్ డౌన్.. రహానే ఔట్ అజింక్య రహానే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన అజింక్య రహానే.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(20) పరుగులతో ఉన్నారు. 8.1 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 68/3 సీఎస్కే రెండో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్ సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. యష్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే(24), రవీంద్ర జడేజా(1) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. రవీంద్ర ఔట్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కేకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో రవీంద్ర క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగగా.. లక్నో ఒక మార్పు చేసింది. సీఎస్కే జట్టులోకి మొయిన్ అలీ, దీపక్ చాహర్ వచ్చారు. అదే విధంగా లక్నో తరపున మాట్ హెన్రీ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తుది జట్లు చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ -
ధనాధన్ ధోని కథ వేరు.. అందుకే కాస్త ముందుగానే: డేల్ స్టెయిన్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఐసీసీ టైటిళ్ల(3) వీరుడికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతూ అభిమానుల అలరిస్తున్న తలా.. 42 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నాడు. వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ ఐపీఎల్-2024లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతున్నాడు. నిజానికి ధోనిని చూసేందుకే చాలా మంది స్టేడియాలకు వెళ్తుండగా.. ధోని బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు కోకొల్లలు. అందులో నేనూ ఒకడినే అంటున్నాడు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్. ‘‘ఐపీఎల్‌తో ఇక్కడ మాత్రమే కాదు.. సౌతాఫ్రికాలో నాలాంటి ఎంతో మందికి ఎనలేని సంతోషాన్నిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నేను టీవీ ఎక్కువగా చూడను. అయితే, ఐపీఎల్ సమయంలో మాత్రం సీటుకు అతుక్కుపోయి మరీ కళ్లప్పగించి చూస్తుంటా. కానీ నా గర్ల్‌ఫ్రెండ్ టీవీ పగిలిపోతుందని అంటూ ఉంటుంది. ఎందుకంటూ ఎప్పుడూ అది.. ఐపీఎల్‌కు స్టక్ అయిపోయింది ఉంటుందిలెండి. ఎంఎస్ షాట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా. ఓ అభిమానిగా ఆ కోణంలోనే ధోని ఆటను చూస్తున్నా. అతడు కొట్టే ప్రతీ షాట్‌ను ఆస్వాదిస్తున్నా. నిజం చెప్తున్నా తన ఇన్నింగ్స్ చూసినప్పుడల్లా నాకు ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. కాబట్టి ధోనిని మిడిలార్డర్లో తీసుకువస్తే ఇంకా బాగుంటుంది కదా’’ అని స్టెయిన్ గన్ డేల్ స్టెయిన్ జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై శుక్రవారం నాటి మ్యాచ్ నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక స్టెయిన్ వ్యాఖ్యలకు ఫిదా అవుతున్న ధోని ఫ్యాన్స్.. ‘‘మా మనసులోని మాట నువ్వు చెప్పావు.. తలా ఫినిషర్‌గా కాకుండా మిడిలార్డర్లో వస్తే మరిన్ని మెరుపులు చూడవచ్చు’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, అదే సమయంలో ధోని మోకాలి నొప్పిని గుర్తుచేసుకంటూ .. ‘‘తలా అలా క్రీజులోకి వచ్చి ఒక్క షాట్ ఆడినా సంతోషమే. తను బాగుండటమే ముఖ్యం’’ అని సర్దిచెప్పుకొంటున్నారు. #Dhoni can reach anything and everything. 🔥💪 pic.twitter.com/bAaxqdezgb — Satan (@Scentofawoman10) March 31, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని.. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చి 4 బంతుల్లోనే 20 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. సీఎస్కే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఐపీఎల్ హిస్టరీలో?
ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 250 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో మైదానంలో అడుగుపెట్టిన హిట్‌మ్యాన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అగ్రస్ధానంలో ఉన్నాడు. ధోని ఇప్పటివరకు 256 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాతి స్ధానాల్లో రోహిత్(250), దినేష్ కార్తీక్ ఉన్నాడు. రోహిత్ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు డెక్కన్ ఛార్జర్స్ తరపున 45 మ్యాచ్‌లు, ముంబై ఇండియన్స్ తరపున 205 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా 250 మ్యాచ్‌ల్లో రోహిత్ 6472 పరుగులు చేశాడు. -
IPL 2024: టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ అతడిదే.. కేన్ మామ జోస్యం
బ్యాటర్ల సంపూర్ణ ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 డబుల్ సెంచరీ అనేది ఎక్కువ దూరం లేదన్న విషయం అర్దమవుతుంది. బ్యాటర్ల ఊచకోత ధాటికి టీ20 డబుల్ ఇప్పుడా అప్పుడా అన్నట్లుంది. అతి త్వరలో ఈ అపురూప ఘట్టాన్ని చూడటం ఖాయమన్న విషయం తేలిపోయినప్పటికీ.. ఎవరు తొలి డబుల్ సాధిస్తారనే విషయంపై మాత్రం ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. జోస్ బట్లర్, రోహిత్ శర్మ సాధిస్తాడని కొందరంటుంటే.. ట్రవిస్ హెడ్, క్లాసెన్‌కు అవకాశం ఉందని మరికొందరంటున్నారు. వీరిద్దరి పేర్లే కాకుండా చాలామంది క్రికెటర్ల పేర్లు తొలి టీ20 డబుల్ రేసులో వినబడుతున్నాయి. ఈ విషయంపై చాలా మంది తరహాలోనే న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉందని అభిప్రాయపడ్డాడు. రోహిత్‌కు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన అనుభవం ఉంది కాబట్టి టీ20 డబుల్ అతనికి ఈజీ అవుతుందని అన్నాడు. రోహిత్ ఎలాగూ ఓపెనర్‌గానే బరిలోకి దిగుతాడు కాబట్టి ఏ క్షణంలోనైనా అతని బ్యాట్ నుంచి టీ20 డబుల్ జాలు వారే అవకాశం ఉందని తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే ఈ ఫీట్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2024 ఐపీఎల్లో బ్యాటర్ల దూకుడు చూస్తుంటే ఇది ఎంతో దూరం లేదని అనిపిస్తుందని పేర్కొన్నాడు. ఈ సీజన్లో బ్యాటర్ల విధ్వంసం రెట్టింపైందని.. ఈ సీజన్లో నమోదైన జట్టు స్కోర్లే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశాడు. ఇదే సందర్భంగా కేన్ ఎంఎస్ ధోనిని తన ఆల్‌టైమ్ ఉత్తమ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నుకున్నాడు. కాగా, టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్లో గేల్ పూణే వారియర్స్‌పై 66 బంతుల్లో 175 (నాటౌట్) పరుగులు చేశాడు. టీ20ల్లో నేటి వరకు ఇదే అత్యుత్తమ స్కోర్‌గా చలామణి అవుతుంది. ప్రస్తుత పరిస్థితులకు చూస్తుంటే గేల్ రికార్డు మూడినట్లు అనిపిస్తుంది. -
IPL 2024: ధోని బాగా ఆడాలి.. కానీ, మ్యాచ్ మాత్రం మేమే గెలవాలి..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రేపు (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే లక్నోకు చేరుకున్నాయి. ఇరు జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో నిన్నటి నుంచే లక్నోకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. నగరంలో ఎక్కడ చూసినా మ్యాచ్‌కు సంబంధించిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఓ హోర్డింగ్‌పై రాసిన కంటెంట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ ఆ హోర్డింగ్‌పై ఏముందంటే.. ధోని బాగా ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ మ్యాచ్ మాత్రం ఎల్‌ఎస్‌జీనే గెలవాలని ఉంది. Lucknow welcomes MS Dhoni. - The Craze is unmatched 💥 pic.twitter.com/b7WUge2bQw — Johns. (@CricCrazyJohns) April 18, 2024 ఈ కంటెంట్ చూస్తే లక్నో అభిమానులకు సైతం ధోనిపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్దమవుతుంది. ఐపీఎల్ కోసం ధోని ఎక్కడికి వెళ్లినా ఇలాంటి క్రేజే కనిపిస్తుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమైనా అభిమానులు ఇంకా అతన్ని నామాన్నే జపిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇంచుమించు ఒకటే తరహా ప్రదర్శనలతో ముందుకు పోతున్నాయి. లక్నోతో పోలిస్తే సీఎస్కే ఓ అడుగు ముందుంది. సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో ఆరింట మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రస్తుతం సీఎస్కే మూడు, లక్నో ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
నన్ను నవ్వించగలిగేది అతనే.. అప్పుడు చాలా బాధ పడ్డాను: రోహిత్ శర్మ
క్లబ్ ప్రియారీ ఫైర్ అనే పోడ్కాస్ట్తో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న హిట్‌మ్యాన్ ఖాళీ సమయంలో క్లబ్ ప్రియారీతో మాట్లాడుతూ.. ధోని, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. నన్ను నవ్వించగలిగేది అతనే.. రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ.. టీమిండియాలో నన్ను ఎవరైనా నవ్వించగలరంటే అది పంత్ మాత్రమే. అతన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటాడు. నాకు నవ్వుకోవాలని అనిపించిన ప్రతిసారి అతనితో మాట్లాడతాను. ఏదో ఒకటి చెప్పి నవ్వించేస్తాడు. వికెట్ల వెనక పంత్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అందరూ పగలబడి నవ్వుతారు. అయితే కారు ప్రమాదం కారణంగా పంత్ అమూల్యమైన కెరీర్‌ను మిస్ కావడం నన్ను చాలా బాధించింది. ఇప్పటికైనా అతను బెస్ట్ అంటూ హిట్‌మ్యాన్ కితాబునిచ్చాడు. ధోనిని ఒప్పించడం చాలా కష్టం.. డీకే అయితే ఈజీ టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం చాలా మంది రిటైర్డ్ క్రికెటర్లు (పాకిస్తాన్) తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారనే అంశంపై మాట్లాడుతూ.. రిటైర్మెంట్ వెనక్కు తీసుకోమని ధోనిని ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే అతను బాగా అలసిపోయి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో అతన్ని రిటైర్మెంట్ వెనక్కు తీసుకుని వరల్డ్‌కప్ ఆడమని అడగలేం. అడిగినా అతను ఒప్పుకోడు. ఇదే విషయంలో దినేశ్ కార్తీక్‌ను ఒప్పించడమయితే చాలా సులువే అని హిట్‌మ్యాన్ అన్నాడు. శభాష్ డీకే.. వరల్డ్‌కప్ ఆడాలని ఉన్నట్లుంది.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోని, దినేశ్ కార్తీక్ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారని రోహిత్ కితాబునిచ్చాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రోహిత్ డీకేను సరదాగా ఆటపట్టించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కార్తీక్ హిట్టింగ్ చేస్తుండగా రోహిత్ సరదాగా చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. శభాష్ డీకే.. టీ20 వరల్డ్‌కప్‌కు సెలెక్ట్ కావాలని అడుతున్నట్లుంది. నీ మైండ్‌లో కూడా ఇదే నడుస్తున్నట్లుందని రోహిత్ డీకేను ఆటపట్టించాడు. ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది.. ఇదే సందర్భంగా రోహిత్.. ధోని ముంబైతో ఆడిన ఇన్నింగ్స్‌పై (4 బంతుల్లో 20 నాటౌట్) కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది. నాలుగు బంతులు ఆడి అతను మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతన్ని ఇన్నింగ్స్ తమ ఓటమిని శాశించింది. ధోని చేసిన 20 పరుగులే తమకు వారికి వ్యత్యాసం అంటూ గుర్తు చేసుకున్నాడు. -
T20 WC 2024: ధోని యూఎస్ వస్తాడు: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు టైటిల్ అందించిన హిట్‌మ్యాన్ ఈసారి మాత్రం కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. ఫ్రాంఛైజీ నిర్ణయం మేరకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆరు మ్యాచ్‌లు ఆడి 261 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(105*) కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఆట నుంచి విరామం దొరికిన సమయంలో రోహిత్ శర్మ క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్‌కాస్ట్‌లో భాగంగా మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, ఆడం గిల్ క్రిస్ట్‌లతో సరదాగా ముచ్చటించాడు. ధనాధన్ ధోని యూఎస్ వస్తాడు ఈ సందర్భంగా ఐపీఎల్-2024లో అదరగొడుతున్న టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఎంఎస్ ధోనిని ఒప్పించడం కష్టం. ఇప్పటికే తను కాస్త అనారోగ్యంతో ఉన్నాడు. బాగా అలసిపోయాడు. అతడు యూఎస్‌కు రావడమైతే ఖాయం. కానీ అక్కడ గోల్ఫ్ ఆడతాడు. ఇటీవలి కాలంలో ధోని గోల్ఫ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు’’ అని రోహిత్ పేర్కొన్నాడు. డీకేను ఒప్పించడం తేలిక ఏదేమైనా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ సీఎస్కే స్టార్ నాలుగు బంతుల్లోనే 20 రన్స్ రాబట్టిన తీరు అమోఘమని కొనియాడాడు. ఇక మరో వెటరన్ ప్లేయర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ గురించి ప్రస్తావిస్తూ.. డీకేను వరల్డ్‌కప్‌లో ఆడేలా కన్విన్స్ చేయడం చాలా సులువని రోహిత్ సరదాగా కామెంట్ చేశాడు. అదే విధంగా.. యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ గురించి మాట్లాడుతూ.. ‘‘క్రేజీ. అందరు యువ ఆటగాళ్లు ఇలాగే ఉంటారనుకోండి. అందులో పంత్ మరింత క్రేజీ. నేను ఎప్పుడైనా ముభావంగా ఉన్నపుడు నవ్వేలా చేస్తాడు. పంత్ అత్యుత్తమ ప్రదర్శన అతడు పిల్లాడిగా ఉన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నాను. అయితే.. గతేడాది ఆ దుర్ఘటన కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావడం బాధనిపించింది. తను తిరిగిరావడం సంతోషంగా ఉంది. వికెట్ కీపర్‌గానూ పంత్ అదరగొడుతున్నాడు. గాయాల నుంచి కోలుకుని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వికెట్ కీపర్‌గా అతడే? కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్‌కప్-2024 ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే టీమిండియాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్‌గా పంత్ పేరు ఖరారైందని రోహిత్ శర్మ పరోక్షంగా చెప్పాడంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి, ధోని గురించే మాట్లాడాలా?... అతడూ ఓ లెజెండ్
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అతడొక ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు అంటూ ఈ ఇంగ్లండ్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆఖరి బంతి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో బట్లర్ రాజస్తాన్‌ను గెలిపించాడు. కేకేఆర్ విధించిన 224 పరుగుల భారీ లక్ష్యం ముందున్న వేళ.. 14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులే చేసిన తరుణంలో పట్టుదలగా నిలబడిన బట్లర్.. ఒత్తిడిలోనూ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 అజేయ శతకం(60 బంతుల్లో 107)తో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆఖరి ఓవర్ చివరి బంతికి సింపుల్‌గా సింగిల్ తీసి రాజస్తాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో ఆరో విజయం నమోదైంది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ బట్లర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి, ధోని గురించే ఎందుకు మాట్లాడాలి? ‘‘అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. వేరే లెవల్ అంతే! బట్లర్ ఇలాంటి ప్రదర్శనతో ఆకట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా అతడు ఇదే పని చేస్తున్నాడు. మున్ముందు కూడా చేస్తాడు. అసాధారణమైన ప్రతిభ అతడి సొంతం. అయితే, బట్లర్ భారత ఆటగాడు కాదు కాబట్టి మనం అతడి గురించి ఎక్కువగా మాట్లాడుకోం. ఒకవేళ ఇదే సెంచరీ గనుక విరాట్ కోహ్లి చేసి ఉంటే.. కనీసం రెండు నెలల పాటు అతడిని ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్లం. అంతెందుకు ధోని కొట్టిన మూడు.. నాలుగు సిక్సర్ల గురించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చిస్తాం. అతడొక లెజెండ్ మన ప్లేయర్ల గురించి సెలబ్రేట్ చేసుకున్నట్లుగానే బట్లర్ గురించి కూడా సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే అతడొక క్రికెట్ లెజెండ్’’ అని హర్భజన్ సింగ్ జోస్ బట్లర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఐపీఎల్లో బట్లర్‌కు ఇది ఏడో సెంచరీ. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా బట్లర్ కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి 250 పరుగులు చేశాడు. చదవండి : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. మాకు దొరికిన విలువైన ఆస్తి అతడు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పేరులో 'మహీ' ఉన్నందుకు గర్వపడుతున్న ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా?
మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇన్నింగ్స్‌ను ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆదివారం వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో MS ధోనీ వరుస సిక్స్‌లతో చెలరేగిపోయారు. ధోనీ కంటే గొప్పగా ఆడుతున్న మరో ఆటగాడిని చూపించగలరా? నా పేరులో ''మహీ'' ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అంటూ.. ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇప్పటికే 51వేలకంటే ఎక్కువ లైక్స్ పొందింది. లక్షల మంది వీక్షించిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Show me one sportsperson who thrives more than this man—on unrealistic expectations & pressure… It only seems to add fuel to his fire Today, I’m simply grateful that my name is Mahi-ndra…. 🙂 https://t.co/u9Hk6H6xiy — anand mahindra (@anandmahindra) April 14, 2024 -
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ధోనికి గాయం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి మెరుపులు మెరిపించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నాలుగు బంతులు మిగిలి ఉండగా బ్యాటింగ్‌కు వచ్చిన ధోని హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యాకు మిస్టర్ కూల్ చుక్కలు చూపించాడు. కేవలం 4 బంతుల్లోనే మూడు సిక్సర్లతో 20 పరుగులు ధోని చేశాడు. ధోని చేసిన ఈ 20 పరుగులే సీఎస్కే విజయానికి కారణమయ్యాయి. గాయపడిన ధోని.. అయితే ఈ మ్యాచ్‌లో ధోని గాయపడ్డాడు. పేసర్ పతిరానా వేసిన ఓవర్లో బంతిని ఆపే క్రమంలో మిస్టర్ కూల్ కాలికి గాయమైంది. అయినప్పటికి ధోని నొప్పితో బాధపడుతూనే తన వికెట్ కీపింగ్ బాధ్యతలను కొనసాగించాడు. అయితే మ్యాచ్ అనంతరం సీఎస్కే టీమ్ హోటల్‌కు వేళ్లే క్రమంలో ధోని కుంటుతూ నడవడం కన్పించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధోని గాయంపై సీఎస్కే మెనెజ్‌మెంట్ అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సీఎస్కే తమ తదుపరి ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు నాలుగు రోజులు విరామం లభించడంతో ధోని తన గాయం నుంచి కోలుకునే అవకాశముంది. View this post on Instagram A post shared by MS Dhoni Fanpage | MS Dhoni | Chennai Super Kings (@07mahi.saviour) -
ధోని షాట్లకు ఫిదా.. భయపెట్టేసింది! ఈమె ఎవరో గుర్తుపట్టారా?
ఐపీఎల్-2024.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ మ్యాచ్.. మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగగానే వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. ముంబై ఇండియన్స్ అభిమానులు సైతం ఈ సీఎస్కే స్టార్ హిట్టింగ్ బాదితే చూడాలని తహతహలాడిపోయారు. వారి అంచనాలను నిజం చేస్తూ ధోని ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు. వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో (చివరి ఓవర్ మూడు, నాలుగు, ఐదో బంతికి) హ్యాట్రిక్ సిక్సర్లతో ధోని కనువిందు చేశాడు. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి.. గంతులేస్తూ ‘తలా’ ఇన్నింగ్స్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కోడలు, బాలీవుడ్ నటి నేహా ధుపియా అయితే ధోని బాదిన షాట్లకు ఫిదా అయింది. సంతోషం పట్టలేక పెద్దగా అరుస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నేహా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు.. ‘‘వామ్మో.. నీ రియాక్షన్ భయపెట్టేలా ఉంది. మరీ అంత ఆనందమా?’’ అంటూ తమదైన శైలిలో నేహాను సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ముంబై- చెన్నై మ్యాచ్‌కు నేహా ధుపియా తన భర్త అంగద్ బేడి, స్నేహితులు కరీనా కపూర్, జాన్ అబ్రహంలతో కలిసి హాజరైంది. కాగా అంగద్ బేడి అండర్-19 స్థాయిలో ఢిల్లీ తరఫున క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత మోడల్‌గా మారి నటుడిగానూ ఎదిగాడు. ముంబై వర్సెస్ చెన్నై స్కోర్లు ►వేదిక: వాంఖడే, ముంబై- ఆదివారం ►టాస్: ముంబై.. బౌలింగ్ ►చెన్నై స్కోరు: 206/4 (20) ►ముంబై స్కోరు: 186/6 (20) ►ఫలితం: 20 పరుగుల తేడాతో ముంబైపై చెన్నై విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మతీశ పతిరణ(4/28). చదవండి: #Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా.. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ధోని 3 సిక్స్‌లు బాదాడు.. అయితే ఏంటి?: పొలార్డ్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని గురించి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఖరి ఓవర్లో ఎవరైనా హిట్టింగ్ ఆడటం సహజమేనని.. అదేమీ గొప్ప విషయం కాదన్నాడు. ముఖ్యంగా ధోని లాంటి వరల్డ్‌క్లాస్ ప్లేయర్ల నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడాన్ని బౌలర్ తప్పిదంగా చూడలేమని పొలార్డ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం చెన్నై జట్టుతో తలపడింది. సొంతమైదానం వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు చెత్త ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. గెరాల్డ్ కొయెట్జీ(1/35), జస్ప్రీత్ బుమ్రా(0/27) కాస్త మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేయగా.. హార్దిక్ పాండ్యా(2/43), రొమారియో షెఫర్డ్(0/33). ఆకాశ్ మధ్వాల్ (0/37) మాత్రం చెత్తగా ఆడారు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేసిన పాండ్యా బౌలింగ్‌లో ధనాధన్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లతో దుమ్ములేపాడు. పాండ్యా సంధించిన బంతులను లాంగాఫ్, లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్లుగా మలిచి.. మరో రెండు రన్స్ చేసి.. 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ముంబై 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బౌలర్‌గా, బ్యాటర్(6 బంతుల్లో 2), కెప్టెన్‌గా విఫలమైన హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అతడి బౌలింగ్‌లో ధోని సిక్సర్లు హైలైట్ కావడంతో.. ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ భిన్నంగా స్పందించాడు. ‘‘అవును.. అతడు మూడు సిక్సర్లు కొట్టాడు. చివరి ఓవర్లో 20 పరుగులు తీశాడు. అయితే, ఆఖరి ఓవర్లో ఎవరైనా 20 పరుగులు సాధించగలరు కదా! అందులో వింతేముంది? ఇక ఎంఎస్ చాలా ఏళ్లుగా వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంలో ఆశ్చర్యం లేదు. అతడు మైదానంలో అడుగుపెట్టి షాట్లు బాదుతుంటే చూడటాన్ని మేము కూడా ఆస్వాదిస్తాం. అయితే, ఈరోజు ధోనిని పెవిలియన్‌కు చేర్చేందుకు మేము రచించిన వ్యూహాలు ఫలితాన్నివ్వలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబైపై సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ ‘బేబీ మలింగ’ మతీశ పతిరణ(4/28)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: #Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు.. అతడిదంతా నటన
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ప్రయాణం ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. రోహిత్ శర్మను కాదని పాండ్యాను సారథి చేయడాన్ని ఇష్టపడని ‘ముంబై అభిమానులు’.. అవకాశం దొరికినప్పుడల్లా అతడిని హేళన చేస్తూనే ఉన్నారు. ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడేలోనూ హార్దిక్ పాండ్యాకు ఈ చేదు అనుభవాలు తప్పడం లేదు. టాస్ మొదలు.. మ్యాచ్ మధ్యలో ఫీల్డింగ్ సెట్ చేసే సమయంలో అతడిని గేళి చేయడం.. అతడి వ్యక్తిగత ఆట తీరును విమర్శించడం వంటివి చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. గుజరాత్ టైటాన్స్ సారథిగా గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించి.. ఓసారి టైటిల్ కూడా గెలిచిన హార్దిక్.. ఎంఐ జట్టుతో చేరిన తర్వాత ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. చిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ విమర్శలపాలవుతున్నాడు పాండ్యా. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఐపీఎల్ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ వ్యూహాలేమిటో అర్థం కాలేదు. మ్యాచ్ ఆరంభానికి ఓ ఐదు గంటల ముందు ప్లాన్ ‘ఏ’ అనుకుంటే.. మైదానంలో దిగిన తర్వాత పరిస్థితికి తగ్గట్లు ప్లాన్ ‘బి’ కూడా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలి కదా! పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో స్పిన్నర్‌ను బరిలోకి దించని కెప్టెన్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా?’’ అని హార్దిక్ పాండ్యా తీరును ఘాటుగా విమర్శించాడు. 2⃣nd win on the bounce 4⃣th win of the season @ChennaiIPL bag 2⃣ more points after a victory over #MI, despite a heroic Rohit Sharma TON! Scorecard ▶️ https://t.co/2wfiVhdNSY#TATAIPL | #MIvCSK pic.twitter.com/5mZMPulaNn — IndianPremierLeague (@IPL) April 14, 2024 అయితే, అదే సమయంలో హార్దిక్ పాండ్యాకు అండగా నిలబడ్డాడు పీటర్సన్. హార్దిక్ సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడని.. నిజానికి అతడు ఏమాత్రం సంతోషంగా లేడని అన్నాడు. అతడు కూడా మనిషేనని.. దయచేసి ఈ టీమిండియా ప్లేయర్‌ను గేళి చేయవద్దంటూ అభిమానులకు విజప్తి చేశాడు. ‘‘టాస్ సమయంలో హార్దిక్ మరీ ఎక్కువగా స్మైల్ ఇస్తున్నాడు. నిజానికి తాను సంతోషంగానే ఉన్నానని చెప్పడానికి చేస్తున్న నటన అది. చాలా మంది పాండ్యాను హేళన చేస్తూ అరుస్తూ ఉన్నారు. అదే ముంబై సొంతమైదానంలో సీఎస్కే బ్యాటర్ ధోని ముంబై మీద సిక్సర్లు(పాండ్యా బౌలింగ్) బాదుతుంటే కేరింతలు కొట్టారు. హోం గ్రౌండ్లో ఇలా జరగడం ఏ ఆటగాడినైనా బాధిస్తుంది. తనకూ భావోద్వేగాలు ఉంటాయి. అతడు టీమిండియా ప్రధాన ప్లేయర్లలో ఒకడు. అలాంటి వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని కెవిన్ పీటర్సన్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. 𝗔 𝗦𝘆𝗺𝗽𝗵𝗼𝗻𝘆 𝗶𝗻 𝗠𝗦 𝗗𝗛𝗢𝗡𝗜 💛🎶 📍 Wankhede Stadium, Mumbai The acts that make the child in you jump in joy ☺️ #TATAIPL | #MIvCSK | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/v9nE9wlLhI — IndianPremierLeague (@IPL) April 15, 2024 ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో ఓటమి నమోదు చేసింది. ఇప్పటి వరకు కేవలం రెండు విజయాలు సాధించింది. చదవండి: #DHONI: ‘మరేం పర్లేదు’.. రోహిత్‌ను ఓదార్చిన ధోని.. ఫొటోలు వైరల్ "It's affecting him, it's affecting his cricket and something needs to happen" - #KevinPietersen on Hardik's last over vs @msdhoni and the ups and downs of his captaincy! 📹 | Watch the legends of the game, #SunilGavaskar and @KP24 talk more about @hardikpandya7's leadership!… pic.twitter.com/QxCKE6KXf8 — Star Sports (@StarSportsIndia) April 14, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మరేం పర్లేదు’.. రోహిత్‌ను ఓదార్చిన ధోని.. ఫొటోలు వైరల్
చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ ధనాధన్ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 63 బంతులు ఎదుర్కొని 105 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫలితంగా 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హిట్‌మ్యాన్ సాధించి శతకం వృథాగా పోయింది. అసలే పొట్టి ఫార్మాట్లో నిలకడలేమి.. అందునా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపినా ముంబై కెప్టెన్‌గా వేటు.. ‘జూనియర్’ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతూ కష్టంగా కాలం నెట్టుకొస్తున్న తరుణంలో నిజానికి ఈ సెంచరీ రోహిత్‌కు మంచి బూస్ట్ లాంటిది. The Lone Warrior 👏 First IPL century by Rohit Sharma at the Wankhede 🫡#MIvCSK #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/vnf9Pbgd9v — JioCinema (@JioCinema) April 14, 2024 అయితే, తన ధనాధన్ ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ గెలుపునకు ఉపయోగపడకపోవడంతో రోహిత్ శర్మ చిన్నపాటి సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. చెన్నై పేసర్ మతీశ పతిరణ వేసిన ముంబై ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేయగా.. మూడో బంతికి రోహిత్ ఫోర్ బాది వంద పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో మూడో సెంచరీ(విరాట్ కోహ్లి, జోస్ బట్లర్ తర్వాత) నమోదు చేశాడు. కానీ అప్పటికే ముంబై పరాజయం దాదాపుగా ఖరారైపోయింది. ఫలితంగా రోహిత్ ముభావంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ విజయం తర్వాత.. మహేంద్ర సింగ్ ధోని రోహిత్ వద్దకు వచ్చి ఓదార్చాడు. హిట్‌మ్యాన్‌తో చేయి కలిపి అతడి వెన్నుతట్టిన తలా.. ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా రోహిత్‌ను దగ్గరికి తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ధోని, రోహిత్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి. వీరిద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా టీమిండియాలో రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేయడంలోనూ ధోనిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. 2⃣nd win on the bounce 4⃣th win of the season @ChennaiIPL bag 2⃣ more points after a victory over #MI, despite a heroic Rohit Sharma TON! Scorecard ▶️ https://t.co/2wfiVhdNSY#TATAIPL | #MIvCSK pic.twitter.com/5mZMPulaNn — IndianPremierLeague (@IPL) April 14, 2024 ఇక వాంఖడే వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సీఎస్కే స్టార్ ధోని (4 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ముంబై హీరో రోహిత్ శర్మ శతకం కూడా ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు ►వేదిక: వాంఖడే, ముంబై- ఆదివారం ►టాస్: ముంబై.. బౌలింగ్ ►చెన్నై స్కోరు: 206/4 (20) ►ముంబై స్కోరు: 186/6 (20) ►ఫలితం: 20 పరుగుల తేడాతో ముంబైపై చెన్నై విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మతీశ పతిరణ(4/28). చదవండి: MS Dhoni: ఆ యువ వికెట్ కీపర్ వల్లే ఇదంతా.. అతడు కూడా అదుర్స్: రుతురాజ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్వీట్ మెమోరీస్.. అద్భుతాలను నెమరువేసుకున్న ధోని
భారత క్రికెట్‌కు సంబంధించి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పరిచయం అక్కర్లేని పేరు. ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ తన కెరీర్లో సాధించిన ఘనతల ద్వారా భారత్‌లోనే కాకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నాడు. ధోని ఎక్కడికి వెళ్లినా అభిమానులు నీరాజనాలు పలుకుతారు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ధోనిని అభిమానించే వారు చాలామంది ఉన్నారు. ధోనిని స్టయిల్ ఐకాన్‌గా ఆరాధించే వారు కోకొల్లలు. ధోని తాజా లుక్కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. కెరీర్ ఆరంభంలో ధోని ఆహార్యం ఎలా ఉండిందో ప్రస్తుతం అలాగే ఉంది. జులపాల జట్టుతో ధోని సినిమా హీరోలను తలదన్నేలా ఉన్నాడు. 42 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడు. ధోనికి వయసు మీద పడుతున్నా వన్నె తగ్గడం లేదని అభిమానులు అనుకుంటారు. DHONI AT BCCI HQ TO SEE THE WORLD CUP 2011 TROPHY 🇮🇳 - Video of the day. pic.twitter.com/fvWowwrUu7 — Johns. (@CricCrazyJohns) April 14, 2024 అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్‌కు, సినిమాలకు మాత్రమే పరిమితమైన ధోని.. నిన్న (ఏప్రిల్ 14) ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడేందుకు ముంబైకి వచ్చాడు. ఈ సందర్భంగా బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌కు సందర్శించిన ధోని.. భారత క్రికెట్ తరఫున తాను సాధించిన అద్భుతాలను నెమరువేసుకున్నాడు. బీసీసీఐ ఆఫీస్‌లో తాను సాధించిన ఘనతలను తలచుకుంటూ మురిసిపోయాడు. తన సారధ్యంలో టీమిండియా సాధించిన టీ20 వరల్డ్‌కప్ (2007), వన్డే వరల్డ్‌కప్ (2011) ట్రోఫీలను స్పర్శించి పరవశించిపోయాడు. టీమిండియా జెర్సీని చూసుకుని మురిసిపోయాడు. వన్డే వరల్డ్‌కప్‌లో తానాడిన విన్నింగ్ షాట్ ఫోటోగ్రాఫ్‌పై ఆటోగ్రాఫ్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ధోని బీసీసీఐ ఆఫీస్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. నిన్నటి మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్ అనంతరం ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ముంబైతో మ్యాచ్‌లో చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన ధోని ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హార్దిక్ వేసిన ఆ ఓవర్లో అతను హ్యాట్రిక్ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి పాత ధోనిని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఆడిన మెరుపు ఇన్నింగ్సే ముంబై, సీఎస్కే స్కోర్ల మధ్య వ్యత్యాసంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కినప్పటికీ సీఎస్కే 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కెరీర్ చరమాంకంలో (ఐపీఎల్) ఉన్న ధోని పాత రోజులను గుర్తు చేయడంతో అతని అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. ధోని ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఈ సీజన్లోనూ సీఎస్కేదే టైటిల్ అని చెప్పుకుంటున్నారు. ధోని ఇటీవలే సీఎస్కే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ధోని స్వచ్ఛందంగా సీఎస్కే కెప్టెన్సీ నుంచి వైదొలిగి రుతురాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పాడు. ఈ సీజన్లో సీఎస్కే 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. -
Ruturaj Gaikwad: ఆ యువ వికెట్ కీపర్ వల్లే ఇదంతా.. అతడు కూడా అదుర్స్
మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయసులోనూ బ్యాట్‌తో దుమ్ములేపుతున్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ దిగ్గజ సారథి.. ప్రస్తుతం 27 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అవసరమైనప్పుడల్లా సలహాలు, సూచనలు ఇస్తూనే.. తనంతట తాను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పిస్తూ రుతుకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడంలో ధోని తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ ‘జార్ఖండ్ డైనమైట్’ కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్ల సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. తలా ఇన్నింగ్స్ చూడాలంటూ ఆశపడిన అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 శివం దూబే(38 బంతుల్లో 66 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక ధోని సునామీ ఇన్నింగ్స్ కారణంగా సీఎస్కే 200 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన ముంబై 186 పరుగులకే పరిమితం కావడంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ధోనిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా జట్టులో ఉన్న యువ వికెట్ కీపర్ ఆ మూడు సిక్స్‌లు బాదడం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. వాంఖడే పిచ్ మీద కచ్చితంగా మాకు 10- 15 అదనపు పరుగులు అవసరమైన వేళ ఈ ఇన్నింగ్స్ వల్ల మేలు చేకూరింది’’ అని ధోనిని ప్రశంసించాడు రుతు. We agree with captain @Ruutu1331! ☺️#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/g5oHfgUH37 — IndianPremierLeague (@IPL) April 14, 2024 అదే విధంగా.. ‘‘మా జట్టులోని మలింగ(పతిరణ) ఈరోజు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. యార్కర్లతో ప్రత్యర్థుల మతి పోగొట్టాడు. తుషార్, శార్దూల్ కూడా బాగా ఆడారు. ఇక నేను కూడా కేవలం ఓపెనర్‌గా కాకుండా ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నా’’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు ►టాస్: ముంబై.. బౌలింగ్ ►చెన్నై స్కోరు: 206/4 (20) ►ముంబై స్కోరు: 186/6 (20) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మతీశ పతిరణ(4/28). 2⃣nd win on the bounce 4⃣th win of the season @ChennaiIPL bag 2⃣ more points after a victory over #MI, despite a heroic Rohit Sharma TON! Scorecard ▶️ https://t.co/2wfiVhdNSY#TATAIPL | #MIvCSK pic.twitter.com/5mZMPulaNn — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
IPL 2024 MI VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన ధోని చివరి నాలుగు బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్య వేసిన ఈ ఓవర్లో శివాలెత్తిపోయిన ధోని.. హ్యాట్రిక్ సిక్సర్లు బాది జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టినప్పటికీ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని ఆఖరి ఓవర్లో చేసిన 20 పరుగులే ముంబై, సీఎస్కే స్కోర్లకు వ్యత్యాసం కావడం విశేషం. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తన బ్యాట్ నుంచి జాలువారిన సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా ధోని మరోసారి చరిత్రపుటల్లోకెక్కాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా సునీల్ నరైన్, నికోలస్ పూరన్ తర్వాత మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మరో నాలుగు బంతులు మిగిలుండగా బరిలోకి దిగిన ధోని 3, 4, 5 బంతులను సిక్సర్లుగా మలిచి, ఆఖరి బంతికి రెండు పరుగులు తీశాడు. హార్దిక్ వేసిన ఈ ఓవర్లో సీఎస్కే ఏకంగా 26 పరుగులు పిండుకుంది. ఈ ఓవరే ముంబై ఇండియన్స్ కొంప ముంచిందని అభిమానులు అనుకుంటున్నారు. ధోని సీఎస్కే తరఫున తన 250 మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. -
CSK Vs MI Highlights Photos: పతిరణ విజృంభణ..చెన్నైదే విజయం (ఫొటోలు)
-
CSK Vs MI: ముంబై కొంపముంచిన ధోని.. అలా జరగక పోయింటేనా? వీడియో
ఐపీఎల్-2024లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి తిరిగి పుంజుకున్న ముంబై ఇండియన్స్.. మళ్లీ పాత పంథానే ఎంచుకుంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ ఆజేయ శతకంతో చెలరేగినప్పటికి ఓటమి నుంచి మాత్రం తన జట్టును గట్టెక్కించ లేకపోయాడు. Dhoni Scored 20 runs . CSK won by 20 Runs . What a Player ❤️ pic.twitter.com/RfKO5h0jkR — MAHIYANK™ (@Mahiyank_78) April 14, 2024 కొంపముంచిన ధోని.. ఈ మ్యాచ్‌లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆడిన ఇన్నింగ్సే ముంబై ఇండియన్స్ కొంపముంచింది. సీఎస్కే బ్యాటింగ్ సందర్భంగా ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని మెరుపులు మెరిపించాడు. కేవలం 4 బంతుల్లోనే 3 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేసిన ధోని.. తమ జట్టు స్కోర్ 200 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. Dhoni Scored 20 Runs CSK won by 20 Runs What a Player 💛 Thala Score 20 Runs CSK won by 20 Runs #CSKvsMI #MIvsCSK pic.twitter.com/nUVVJ97DAa — Office Of Chaudhary Rohit Singh Yadav (@OfficeOfCRSY) April 14, 2024 అయితే సరిగ్గా ధోని చేసిన ఆ 20 పరుగులే ముంబై ఓటమికి, సీఎస్కే విజయానికి కారణమయ్యాయి. దీంతో 20 రన్స్ అనే కీవర్డ్ ఎక్స్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(66 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(69) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. . ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. Those 20 runs made all the difference..🔥#CSKvsMI pic.twitter.com/JfzFaOwpyF — CSK (Less active) (@CSK_myspace) April 14, 2024 -
CSK Vs MI: ధోని హ్యాట్రిక్ సిక్స్‌లు.. దద్దరిల్లిన స్టేడియం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ ఎంస్ ధోని మరోసారి ఫినిషర్ అవతరమెత్తాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాది ఔరా అనిపించాడు. తన ఎదుర్కొన్న తొలి బంతిని లాంగాఫ్ మీదగా భారీ సిక్సర్ బాదిన మిస్టర్ కూల్, ఆ తర్వాత బంతులను లాంగాన్, డీప్ స్వ్కెర్ లెగ్ దిశగా సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 4 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తలైవా.. మూడు సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధోని సిక్స్‌లు కొట్టగానే స్టేడియం అభిమానుల అరుపులతో దద్దరిల్లోపోయింది. ధోని బ్యాటింగ్ చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫినిషర్ అంటూ ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(66 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(69) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. . ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
IPL 2024 MI VS CSK: రోహిత్, ధోని ముంగిట భారీ రికార్డులు
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి బిగ్ ఫైట్ జరుగనుంది. చెరి ఐదు సార్లు ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ఎల్ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్ మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఇద్దరిని భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ధోని మరో 4 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున కేవలం సురేశ్ రైనా (5529) మాత్రమే ఈ ఘనత సాధించాడు. సీఎస్కే తరఫున ధోని 249 మ్యాచ్‌ల్లో 4996 పరుగులు చేశాడు. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్ సీఎస్కే తరఫున ధోనికి 250వ మ్యాచ్ కావడం మరో విశేషం. సీఎస్కేతో మ్యాచ్‌లో రోహిత్ మరో 11 పరుగులు చేస్తే.. ముంబై, సీఎస్కే ఎల్ క్లాసికో మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా 30 మ్యాచ్‌ల్లో 710 పరుగులు చేశాడు. 27 మ్యాచ్‌ల్లో 700 పరుగులు చేసిన రోహిత్.. మరో 11 పరుగులు చేస్తే రైనా రికార్డును బద్దలు కొడతాడు. ఈ రికార్డు విభాగంలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. సీఎస్కే, ముంబై మ్యాచ్‌ల్లో (35) ధోని 655 పరుగులు చేశాడు. -
గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025లో హిట్‌మ్యాన్ కచ్చితంగా జట్టు మారడతాడని అంచనా వేశాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో అతడు ప్రయాణం మొదలుపెట్టడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024కు ముందే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్‌ను కాదని హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఫ్రాంఛైజీ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ జట్టును వీడాలని ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే ‘‘రోహిత్ శర్మ చెన్నైకి వెళ్లిపోతాడా? ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడా? రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడా? వచ్చే ఏడాది రోహిత్ జట్టుతో చేరేంత వరకు తాత్కాలిక సారథిగా ఉంటాడా? నేనైతే రోహిత్‌ను చెన్నై జట్టులో చూస్తాననే అనుకుంటున్నా’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌కు ఆడినా బాగానే ఉంటుంది అయితే, ఇందుకు హోస్ట్ బదులిస్తూ.. ‘‘రోహిత్ ముంబై జట్టును వీడితే అభిమానుల హృదయాలు ముక్కలైపోతాయి కదా?’’ అని పేర్కొనగా.. అవునంటూ వాన్ సమాధానమిచ్చాడు. సీఎస్కేకు కాకపోతే రోహిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లినా బాగానే ఉంటుందని.. గతంలో అతడు డెక్కన్ చార్జర్స్‌కు ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా మైకేల్ వాన్ గుర్తు చేశాడు. కాగా కెప్టెన్ మార్పు విషయాన్ని ముంబై ఇండియన్స్, రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ పాండ్యాపై ఆగ్రహం వెళ్లగక్కుతూ స్టేడియంలోనే అతడికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఐపీఎల్-2024లో పాండ్యా సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడిన ముంబై.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలచింది. మరోవైపు రోహిత్ శర్మ ఇంత వరకు ఒక్క అర్ధ శతకం కూడా బాదలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిఇపి 156 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై ఐదింట మూడు విజయాలతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. చదండి: IPL 2024 LSG Vs DC: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతడి దెబ్బకు కన్ను వాచింది.. అలా ప్రతీకారం తీర్చుకున్నా: కోహ్లి
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి టెస్టుల్లో ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ పోరంటే ఈ రన్‌మెషీన్ మరింత జోరుగా బ్యాట్ ఝులిపిస్తాడు. ఇక 2014- 15లో తొలిసారిగా కంగారూ గడ్డ మీద భారత కెప్టెన్ హోదాలో ఆడిన కింగ్ కోహ్లి.. 692 పరుగులతో అదరగొట్టాడు. ఆ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచి సత్తా చాటాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుస సెంచరీలతో అదరగొట్టిన కోహ్లి.. తదుపరి బ్రిస్బేన్‌లో మాత్రం విఫలమయ్యాడు. అనంతరం మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే, ఆ సిరీస్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తొలి రెండింటిలో గెలిచిన ఆస్ట్రేలియా.. ఆఖరి రెండు టెస్టులను డ్రా చేసుకుని ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ సందర్భంగా జరిగిన ఆసక్తికర ఘటన గురించి ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటూ.. ‘‘ఆ టూర్లో మొదటి మ్యాచ్‌లో తమ మొదటి బంతినే మిచెల్ జాన్సెన్ విసురుగా విసరడంతో.. నా తలకు దెబ్బ తగిలింది. అసలేం జరిగిందో కాసేపటి వరకు నాకేం అర్థం కాలేదు. దాదాపు 60 రోజుల పాటు.. అలా ఆడాలా.. ఇలా ఆడాలా అంటూ షాట్ల విషయంలో తికమకపడ్డా. దెబ్బ అంత గట్టిగా తగిలింది మరి! నా ఎడమ కన్ను వాపు వచ్చేది. కంటిచూపు కూడా కాస్త మందగించింది. అయితే, చాలా రోజుల వరకు నేను ఈ విషయాన్ని గమనించలేకపోయాను. ఇక ఆరోజు లంచ్ సమయంలో.. నా ముందు రెండే ఆప్షన్లు మిగిలి ఉన్నాయని ఫిక్సయ్యాను. ఒకటి ఫైట్.. రెండోది ఫ్లైట్. పట్టుదలగా నిలబడి ఆడాలి లేదంటే వెళ్లిపోవాలి.. బాగా ఆలోచించి పోరాడాలనే నిర్ణయించుకున్నా. ఇంతలో ఒకరు.. నిన్ను తల మీద కొట్టడానికి అతడికి ఎంత ధైర్యం అని నాతో అన్నారు. అందుకు బదులుగా..‘అతడి(బౌలింగ్)ని ఈ సిరీస్‌లో ఎంతలా చితక్కొడతానో చూడు’ అని చెప్పాను. అన్నట్లుగా అతడి బౌలింగ్‌ను తుత్తునియలు చేశాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 2014 -15లో ఆసీస్‌తో సిరీస్‌లో తొలి టెస్టుకు నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరం కాగా.. కోహ్లి సారథ్యం వహించాడు. ఇక రెండు, మూడో టెస్టులకు అందుబాటులోకి వచ్చిన ధోని.. ఆ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించగా.. నాలుగో మ్యాచ్ నుంచి కోహ్లి అధికారికంగా టీమిండియా కెప్టెన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ దిగ్గజాలు ఇద్దరూ ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. “Isko mein itna maarunga naa, and that’s exactly what I did” Kohli saab talking about the 2014 Australia tour and his battle against Mitchell Johnson 👑💪🏻 pic.twitter.com/geP35IUz08 — Aani⁷ ★彡 (@wigglyywhoops) April 11, 2024 చదవండి: అంపైర్‌తో గొడవపడ్డ పంత్.. తప్పెవరిది?.. మండిపడ్డ ఆసీస్ దిగ్గజం -
కోహ్లి, ధోని కాదు.. ఐపీఎల్ సూపర్‌స్టార్ అతడే: భజ్జీ
‘‘మొదటి రోజు నుంచి ఇప్పటి దాకా అతడి బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో అందరికంటే తనే ముందుంటాడు. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాడు. ఈరోజు ఐదు వికెట్లు తీసినా సరే.. మళ్లీ రేపటి కోసం కొత్తగా సంసిద్ధమవుతాడు. తన వీడియోలన్నీ మరోసారి చూసుకుంటాడు. ఎక్కడ లోపాలున్నాయి.. వాటిని సరిచేసుకుని మరింత మెరుగ్గా ఎలా ఆడాలన్న అంశం మీదే దృష్టి పెడతాడు. కూల్‌గా.. కామ్‌గా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. ముఖ్యంగా ఒత్తిడిలో మరింత గొప్పగా రాణిస్తాడు. చాలా మంది విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది బ్యాటర్ల గేమ్ కాబట్టి అలా మాట్లాడతారు. కానీ నిజానికి సూపర్స్టార్ల గురించి మాట్లాడాల్సి వస్తే నా దృష్టిలో ఐపీఎల్ సూపర్ స్టార్ అతడే. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలవగల సత్తా ఉన్నవాడు. అతడిలా మ్యాచ్‌ను మలుపు తిప్పి గెలిపించిన బ్యాటర్లు ఎంత మంది ఉన్నారు? మహా అయితే.. ఓ నలుగురు.. ఐదుగురు బ్యాటర్ల పేర్లు చెప్తారేమో! అదే బౌలర్ల విషయానికొస్తే.. కేవలం బుమ్రా ఒక్కడి పేరే వినిపిస్తుంది. కొంతమంది లసిత్ మలింగ పేరు కూడా చెప్పవచ్చు. ఏదేమైనా ఎంత ఎదిగినా కొత్తగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూ రోజురోజుకు మరింత మెరుగవ్వాలన్న తపన ఉండటం గొప్ప విషయం. బుమ్రా అత్యంత నిరాడంబరంగా.. కఠిన శ్రమకోరుస్తూ.. సింపుల్‌గా ఉండటం తనకే చెల్లింది. యువకులందరికీ తను ఆదర్శం. గొప్ప పాఠం’’ అని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తాడు. ప్రస్తుతతరం బౌలర్లలో బుమ్రాను మించిన ఆటగాడు మరొకరు లేరంటూ ఈ ముంబై ఇండియన్స్ స్టార్‌ను భజ్జీ కొనియాడాడు. విరాట్ కోహ్లి, ధోని వంటి బ్యాటర్ల కంటే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల బుమ్రానే తన దృష్టిలో నిజమైన ఐపీఎల్ సూపర్ స్టార్ అని ప్రశంసించాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌లో బుమ్రా విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. 5/21తో దుమ్ములేపిన బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సంచలన ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐదింట మొదటి మూడు మ్యాచ్‌లు వరుసగా ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో బోణీ కొట్టి.. తాజాగా ఆర్సీబీని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఐపీఎల్-2024లో బుమ్రా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ తన దగ్గరపెట్టుకున్నాడు. చదవండి: Rohit Sharma: అప్పటి వరకు కెప్టెన్ రోహిత్ శర్మనే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); We have seen this one, it's a classic 🤌#IPLonJioCinema #TATAIPL #MIvRCB pic.twitter.com/spSGO73CwH — JioCinema (@JioCinema) April 11, 2024 Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 -
చరిత్ర సృష్టించిన ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి క్రికెటర్‌గా
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో చేజింగ్ సమయంలో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో ధోని ఒక్క పరుగుతో ఆజేయంగా నిలిచాడు. తద్వారా ఈ అరుదైన రికార్డను మిస్టర్ కూల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ధోని ఛేజింగ్‌లో అత్యధికంగా 28 సార్లు అజేయంగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేరిట ఉండేది. జడ్డూ 27 సార్లు అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌తో జడేజా ఆల్‌టైమ్ రికార్డును ధోని బ్రేక్ చేశాడు. ధోని, జడేజా తర్వాత స్ధానాల్లో దినేష్ కార్తీక్(23), యూసుఫ్ పఠాన్ (22), డేవిడ్ మిల్లర్(22) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: IPL 2024 CSK VS KKR: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ