Solar eclipse
-
PROBA-3: అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. రెండు ఉపగ్రహాలు... ఒకటిగా! ‘ప్రోబా–3’ రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచి్చతత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచి్చనప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. ఎందుకీ ప్రయోగం? సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు’’ అని ‘ప్రోబా–3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ‘‘సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం’’ అని ‘ప్రోబా–3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.ఉపయోగాలేమిటి? → సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. → విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యు డు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. → గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. → కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశా్రస్తాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగా–సి’ రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. – జమ్ముల శ్రీకాంత్ -
అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణ కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సైన్స్ బోధించేది వేరు. సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం ‘కృత్రిమ రావుకేతువుల’ సాయంతో కోరుకున్నప్పుడల్లా కృత్రిమ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో ఉన్నారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో జంట ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్‌బోర్డ్ అటానమీ3 (ప్రోబా3). ఇందులో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. కక్ష్యలో పరస్పరం దగ్గరగా మోహరించే ఈ శాటిలైట్లు... లేజర్లు, కాంతి సెన్సర్లతో అనుసంధానమై ఉంటాయి. రెండో ఉపగ్రహం నుంచి చూస్తే సూర్యుడు కనబడకుండా ఉండేలా మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ తరహా కృత్రిమ సూర్యగ్రహణాలు అక్కరకొస్తాయని పరిశోధకులు అంటున్నారు. విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యుడు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఈ ప్రయోగం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, మన సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో ఉండే గ్రహాల (ఎక్సో ప్లానెట్స్)కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అద్యయనాలకు ‘ప్రోబా3’ మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఉపగ్రహాలు... ఒకే ఉపగ్రహంగా! ‘ప్రోబా3’ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ‘ప్రోబా3’లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచ్చితత్వంతో రెండు ఉపగ్రహాలను అతి దగ్గరగా కలిపి ఉంచేలా (లాక్ చేసేందుకు) కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనప్పటికీ... 144 మీటర్ల పొడవుండే ఏకైక అబ్జర్వేటరీ మాదిరిగా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ‘ప్రోబా3’ అనేది రెండేళ్ళు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇందులో సౌరగోళం ఆకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం నిర్వహించే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. తన పక్కనే ఉండే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహానికి సూర్యబింబం తాత్కాలికంగా కనిపించకుండా ‘అకల్టర్’ ఉపగ్రహం అడ్డుపడుతుంది. అలా ‘అకల్టర్’ ఉపగ్రహం ఏర్పరచిన ఛాయలో ఉంటూ ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం సూర్యుడి కరోనాను నిశితంగా పరిశీలిస్తుంది. ఉభయ ఉపగ్రహాలు భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు ‘అకల్టర్’ ఉపగ్రహం తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా సదరు డిస్క్ లాంటి పరికరం సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తుంది. అంటే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహంలోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. ‘అకల్టర్’లో లేజర్, విజువల్ మెట్రాలజీ ఆప్టికల్ హెడ్స్, ‘కరోనాగ్రాఫ్’లో షాడో పొజిషన్ సెన్సర్లు ఉంటాయి. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుందని ఈఎస్ఏ ‘ప్రోబా3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వెల్లడించారు. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. దురదృష్టవశాత్తూ సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున ప్రతి రెండేళ్ళకోసారి మాత్రమే సంభవిస్తాయని, వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని గలీనో వివరించారు. అంత కష్టపడినా చివరికి ఫలితం వాతావరణం దయపై ఆధారపడివుంటుందని, వాతావరణం అనుకూలించకుంటే ఆ ప్రయత్నాలన్నీ వృథాయేనని చెప్పారు. అంతగా ప్రయాసపడినా ఏవో కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని గలీనో తెలిపారు. సవివర పరిశోధనలకు ఆ అతి స్వల్ప సమయం సరిపోదన్నారు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారని, అయితే అంతర కరోనాను ఆ ప్రయోగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయలేవని తెలిపారు. సూర్యుడి ఉపరితలంపై 6 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కాగా కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇది వైరుద్ధ్యభరిత అంశమని ‘ప్రోబా3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ అన్నారు. నిజానికి సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలని, కానీ కరోనా విషయంలో అలా జరగదని, అందుకే శాస్త్రవేత్తలు సూర్యుడి అంతర కరోనాను అధ్యయనం చేసేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తారని చెప్పారు. సూర్యుడి ఉపరితలం కంటే సూర్యుడికి బాహ్య పొర అయిన కరోనా ఎందుకు ఎక్కువ వేడిమితో ఉందో తెలుసుకునేందుకు అంతర కరోనాను తాము దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తామని, కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ‘ప్రోబా3’ అందిస్తుందని ఫ్రాన్సిస్కో డీగో చెప్పారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో అంతరిక్షంలోకి సూర్యుడు భారీ స్థాయిలో ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూమి ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతోపాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. ఈ అంశాలపై ‘ప్రోబా3’ అవగాహనను పెంచుతుందని, సౌర భౌతికశాస్త్రాన్ని అది పంపే ఫలితాలు సమూలంగా మార్చివేస్తాయని భావిస్తున్నారు. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహాన్ని బెల్జియం కేంద్రంగా ఉన్న లీగ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని 15 కంపెనీలు, పలు సంస్థల కన్సార్టియం ఈఎస్ఏ కోసం అభివృద్ధి చేసింది. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా3’ జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదికగా జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సివుంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగాసి’ రాకెట్ కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ఈఎస్ఏ, ఇస్రో ఈ ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సివుంది.జమ్ముల శ్రీకాంత్ -
పగలే కమ్ముకున్న చీకట్లు
మునుపెన్నడూ చేసుకోని పరిణామాలకు ఉత్తర అమెరికా వేదిక అయ్యింది. గ్రహణంతో పగలే కారుచీకట్లు కమ్ముకున్నవేళ.. లక్షల మంది ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించారు.ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించి అమెరికాకు చెందిన నాసా పూర్తి సూర్య గ్రహణం ఏర్పడిన చిత్రాన్ని, వీడియోను విడుదల చేసింది. సోమవారం చోటు చేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 2045 ఏడాదిన మళ్లీ ఏర్పడనుందని పేర్కొంది. Ever seen a total solar #eclipse from space? Here is our astronauts' view from the @Space_Station pic.twitter.com/2VrZ3Y1Fqz — NASA (@NASA) April 8, 2024 అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణ గమనానికి సంబంధించి ఓ వీడియోను కూడా నాసా షేర్ చేసింది. ఇందులో సూర్యగ్రహణ గమనం కారణంగా నెమ్మదిగా కదులుతూ.. ఉత్తర అమెరికాపై చీకటి ఛాయ వ్యాపించడాన్ని అంతరిక్ష కేంద్ర నుంచి వ్యోమగాములు గమనిస్తున్నారని తెలిపింది. పట్టపగలే కొంత సమయం పాటు ఉత్తర ఆమెరికా ప్రాంతం చీకటిగా మారిందని తెలిపింది. ఇండియానాపోలిస్ మొత్తాన్ని క్రాస్ చేస్తూ.. ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం సుమారు 800 ఏళ్లలో ఇదే మొదటిసారని వెల్లడించింది నాసా. Follow, follow the Sun / And which way the wind blows / When this day is done 🎶 Today, April 8, 2024, the last total solar #eclipse until 2045 crossed North America. pic.twitter.com/YH618LeK1j — NASA (@NASA) April 8, 2024 మరోవైపు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘సూర్యుడు భ్రమిస్తూ గ్రహణం ఏర్పడటం ఆర్బిట్ నుంచి కనిపిస్తుంది’ అని కామెంట్ జత చేశారు. View of the eclipse from orbit pic.twitter.com/2jQGNhPf2v — Elon Musk (@elonmusk) April 9, 2024 -
సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు !
వాషింగ్టన్: సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం(ఏప్రిల్ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2017 సూర్యగ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు 31 శాతం దాకా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం 2017లో గ్రహణం పూర్తిగా కనిపించే(ద పాత్ ఆఫ్ టొటాలిటీ) 70 మైళ్ల విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలోని ప్రాంతాలకు గ్రహణాన్ని చూసేందుకు వచ్చిన వారితో కోటి 20 లక్షల మంది జన సాంద్రత ఏర్పడిందని, సోమవారం ఏర్పడే గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించనుండగా మొత్తం 31.6 మిలియన్ల మంది ఈ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు వచ్చి దీనిని చూస్తారని నాసా అంచనా వేసింది. అయితే గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో దానిని చూసేందుకు ఎక్కడి వారు అక్కడే ఆగి పోవడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గ్రహణానికి ముందు అది పూర్తిగా కనిపించే ప్రాంతాలకు చేరుకోవడానికి, గ్రహణం తర్వాత సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 25 నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుండగా, ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలకు మూడు గంటల దూరంలో పూర్తిగా కనిపించగా ప్రస్తుత సూర్య గ్రహణం కెనడాలోని టొరంటో సహా ఎనిమిది పెద్ద నగరాలకు 3 గంటల ప్రయాణ దూరంలో పూర్తిగా కనిపించనుంది. దీంతో దీనిని వీక్షించేందుకు అబ్జర్వేటరీలకు వెళ్లడానికి రోడ్డెక్కేవారి సంఖ్య భారీగా పెరగనుంది. కాగా, సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని మెక్సికో, అమెరికా, కెనడాల మీద ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణం ప్రభావాన్ని బట్టి పూర్తిగా చీకటి కమ్ముకోనుంది. అయితే భారత్‌లో దీని ప్రభావం లేదు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజామున 2.22గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఇదీ చదవండి.. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే.. -
Solar Eclipse 2024: భారత్‌లో కనిపిస్తుందా? లేదా?
-
నేడే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే..
ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఇవాళ ఏర్పడనుంది. అయితే నేటి సూర్య గ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి సమయంలో గ్రహణ ఏర్పడనుంది. అయితే.. హిందూ సంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ముందు, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈసారి ఏర్పడబోయే సూర్యగ్రహణం సంపూర్ణంగా ఉంటుంది. 54 సంవత్సరాల తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘంగా ఉండే గ్రహణం కాబోతోంది. దాదాపు ఐదుగంటల 25 నిముషాలు ఉంటుంది. గ్రహాల స్థానం మారినప్పుడు, వ్యక్తి యొక్క విధి కూడా మారుతుంది. మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. వాటిలో సూర్యగ్రహణం , చంద్రగ్రహణం కూడా ముఖ్యమైనవి. 2024లో రెండు సూర్య గ్రహణాలు , రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. తొలి చంద్రగ్రహణం ఇప్పటికే ఏర్పడింది. ఏప్రిల్ 8న, అంటే ఇవాళ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం రాబోతుంది. 🌒🌘🌑🌔సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం మంచిది కాదని తెలిసిందే. సూర్యగ్రహణాలను వీక్షించడానికి కంచు పాత్రలలోని నీటి నుండి పనికిరాని ఎక్స్-రే ప్లేట్ల వరకు ప్రతిదీ ఉపయోగించబడింది. అయితే ఇప్పుడు గ్రహణాన్ని ప్రత్యేక సన్ గ్లాసెస్ తో చూడొచ్చని సూచిస్తుంటారు నిపుణులు. 🌒🌘🌑🌔జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య దేవుడు ప్రజల విధిని ప్రభావితం చేస్తాడు. కాబట్టి, ఈ ప్రత్యేకమైన రోజున మీరు తినడానికి , తిరగడానికి కొన్ని నియమాలను ఉన్నాయి. కాబట్టి ప్రజలు గ్రహణం రోజు ఏదైనా తినడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి , గ్రహణ సమయంలో తినకుండా ఉండాలి. 🌒🌘🌑🌔సైన్స్ ఉన్నప్పటికీ, గ్రహణం గురించి కొన్ని జానపద కథలు ఉన్నాయి. నీరు తీసుకోకూడదని, ఆహారం తినకూడదని ఎన్నో నియమాలున్నాయి. ఈ సమయంలో లైంగిక సంపర్కం నిషేధించబడింది. అయితే, ఈ ఆలోచనలకు స్పష్టమైన కారణం లేదు ఖచ్చితంగా శాస్త్రీయ వివరణ లేదు. 🌒🌘🌑🌔ఈ పరిస్థితిలో, గర్భిణీ స్త్రీలు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని నమ్ముతారు. గ్రహణం ప్రారంభమైన వెంటనే గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు. సూర్యగ్రహణం యొక్క దుష్ప్రభావాలు గర్భంలో ఉన్న శిశువును ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. 🌒🌘🌑🌔సూర్యగ్రహణం సమయంలో సాత్విక , తేలికపాటి ఆహారాన్ని తినాలని చెబుతారు ఆ సమయంలో చీకటిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది ఫలితంగా, పసుపు, అల్లం, తులసి మొదలైన ఆహారాలలో ఉండే మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మీరు కొబ్బరి నీరు, పండ్లను తినవచ్చు. ఏప్రిల్ 8న రాత్రి 9.12 గంటల నుంచి తెల్లవారుజామున వరకు జరుగుతుంది. సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి 4 గంటల 39 నిమిషాలు ఈ కాలంలో పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి. చంద్రగ్రహణం మాదిరిగానే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా గ్రహణ సమయం , ఇతర నియమాలు వర్తించవు. కానీ, పాటించేవాళ్లను కాదనలేం కదా!. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే.. ►వృషభం, మిథునం, కర్కాటకం, సింహ రాశికి చెందిన వ్యక్తులు లాభసడతారు. కోరుకున్న ఉద్యోగం లభించడంతోపాటు వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మేష, వృశ్చిక, కన్యా, కుంభ, ధనుస్సు రాశుల వారికి అశుభకరంగా ఉంటుంది. వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారస్తులకు సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు మానుకోవాలి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. గ్రహణం చెడు ప్రభావాన్ని నివారించేందుకు పేదలకు దానం చేయాలి. ►మేష, వృశ్చిక, కన్యా, కుంభ, ధనుస్సు రాశుల వారికి అశుభకరంగా ఉంటుంది. వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారస్తులకు సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు మానుకోవాలి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. గ్రహణం చెడు ప్రభావాన్ని నివారించేందుకు పేదలకు దానం చేయాలి. అయితే భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఉత్తర అమెరికాలోని విభాగాలతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు ఈ ఈ సూర్య గ్రహణం చూసే అవకాశం ఉంది. తగినంత కంటి రక్షణ లేకుండా సూర్యుడిని ప్రత్యక్షంగా చూడటం వలన తీవ్రమైన కంటి సమస్యలు వస్తాయన్నది తెలిసిందే. ఔ సాధారణంగా.. గ్రహణం వీక్షించేందుకు ప్రత్యేక సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్, టెలిస్కోప్‌లు, బైనాక్యులర్లు లేదా సోలార్ ఫిల్టర్లతో కూడిన కెమెరాలను ఉపయోగించడం మంచిది. అయితే కంటి భద్రతతో పాటు, సూర్య గ్రహణాల సమయంలో చర్మాన్ని కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం వల్ల కలిగే నష్టాలు. బహిరంగ గ్రహణ పరిశీలన కోసం సన్‌స్క్రీన్ అప్లికేషన్, టోపీలు ధరించడం , రక్షణ దుస్తులు ధరించడం మంచిది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల 12 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. ఆ మరుసటి తెల్లవారుజామున రెండు గంటల 22 నిమిషాలకు గ్రహణం పూర్తవుతుంది. మెక్సికో కెనడా, యూరప్, యూకే, ఐర్లాండ్ అమెరికా తదితర దేశాల్లో మాత్రమే ఈ సూర్య గ్రహణం కనిపించనుంది. వాతావరణ పరిస్థితులు అనుమతించినట్లయితే, మెక్సికోలోని మిలియన్ల మంది వ్యక్తులు, యునైటెడ్ స్టేట్స్‌లోని 15 రాష్ట్రాలు , తూర్పు కెనడాలోని కొన్ని ప్రాంతాలు భూమి , సూర్యుని మధ్య చంద్రుడు కదులుతున్నప్పుడు, సూర్యుని కాంతిని క్షణికంగా అడ్డుకోవడంతో ఒక అద్భుతమైన సంఘటనను చూసే అవకాశం ఉంటుంది. టోటాలిటీ.. నేటి సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావంతో.. మెక్సికో, యూఎస్, కెనడా మధ్య 185 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆకాశం మొత్తం చీకటిగా మారుతుంది. అందుకే దీనిని టోటాలిటీ అని కూడా పిలుస్తారు. యూఎస్‌లో సుమారు 18 రాష్ట్రాలు కూడా దీనిని చూడవచ్చు. మొత్తం గ్రహణ సమయంలో కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే టోటాలిటీ(పూర్తిగా చీకటి కావడం) ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ NASA ప్రకారం.. గరిష్ట దృశ్యం మొత్తం చీకటి మార్గంలో 4 నిమిషాల 27 సెకన్ల వరకు ఉంటుందట. గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ ప్రకారం.. టోటాలిటీ పూర్తి వ్యవధి 4 నిమిషాల 27 సెకన్ల వరకు ఉంటుంది, ఇది ఇంతకు ముందు.. ఆగస్టు 21, 2017 నాటి గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ కంటే రెట్టింపు. మధ్యరేఖ (పూర్తి మార్గం) వెంట చాలా ప్రదేశాలు 3.5 మరియు 4 నిమిషాల మధ్య మొత్తం వ్యవధిని చూస్తాయి. భారత్ ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేదు. అయితే చూడాలనుకునేవాళ్లకు ఆన్లైన్లో వీక్షించే అవకాశం ఉంటుంది. నాసా స్పేస్ ఏజెన్సీ యూట్యూబ్ అఫీషయిల్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10గం:30ని. ప్రారంభించి, అర్ధరాత్రి 1గం:30ని. వరకు లైవ్ ఇవ్వనుంది. నోట్: నిపుణుల అభిప్రాయాల సేకరణతో పైకథనం ఇవ్వబడింది -
అమెరికాలో సూర్య గ్రహణం సందడి
ఉత్తర అమెరికా ఆకాశంలో సోమవారం (ఏప్రిల్ 8) నాడు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అక్కడి జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. ఇది కెనడా నుండి నిష్క్రమించే ముందు టెక్సాస్‌తో పాటు 14 ఇతర అమెరికా రాష్ట్రాలను దాటనుంది. ఇది 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని పలు మార్కెట్లతో పాటు టూరిజం విభాగం గ్రహణ వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సౌత్‌వెస్ట్, డెల్టా వంటి విమానయాన సంస్థలు సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి విమాన మార్గాలను ప్రకటించాయి. అలాగే పలు మార్కెట్లలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ అమ్మకానికి అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ రంగురంగుల టీ షర్టులు, ఖగోళ సావనీర్లు విక్రయిస్తున్నారు. 2017లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు పలు కంపెనీలు దానిని ఆదాయమార్గంగా మార్చుకున్నాయి. వాటిలో క్రిస్పీ క్రీమ్ కూడా ఉంది. షార్లెట్, నార్త్ కరోలినాకు చెందిన ఈ సంస్థ 2017 సూర్య గ్రహణం సందర్భంగా పరిమిత-ఎడిషన్ చాక్లెట్ గ్లేజ్డ్ డోనట్లను విడుదల చేసింది. -
సోలార్ సీట్లు.. ఇలా కూడా వినియోగించుకోవచ్చా?
సోలార్ ఉత్పత్తులను తయారు చేసే అమెరికన్ కంపెనీ తాజాగా సోలార్ సీటును మార్కెట్లోకి తెచ్చింది. ఆరుబయట పచ్చిక మీద పరుచుకుని సేదదీరడానికి, ఆరుబయట విందు వినోదాలు చేసుకునేటప్పుడు కుర్చీ మీద అమర్చుకోవడానికి వీలుగా ఈ సోలార్ సీటును రూపొందించింది. చలికాలంలో ఎండ సోకుతున్నా, చలి తీవ్రత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సోలార్ సీటు మీద కూర్చుంటే, దీని వెనుకవైపు ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ సీటు బ్యాటరీకి చేరుతుంది. దీనిని ఆన్ చేసుకుంటే, ఈ సీటు క్షణాల్లోనే వెచ్చబడుతుంది. బయట ఎంత చల్లని వాతావరణం ఉన్నా, కాస్త ఎండసోకే చోటు ఈ సోలార్ సీటును అమర్చుకుని, కూర్చుంటే చాలు.. చలికాలాన్ని వెచ్చగా ఆస్వాదించవచ్చు. దీని ధర 249 డాలర్లు (రూ.20,763) మాత్రమే! -
నేడు వలయాకార సూర్య గ్రహణం
నేడు అరుదైన సూర్యగ్రహణం (Solar eclipse) ఏర్పడబోతోంది. పాక్షికమే అయినప్పటికీ.. వలయాకార గ్రహణం కావడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. నేటి రాత్రి 08గం. 34ని. నుంచి అక్టోబర్ 15 తెల్లవారుజామున 02గం.52 ని. వరకు గ్రహణం ఉండనుంది. అయితే.. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే గ్రహణం కాబట్టి భారత్‌లో ఇది కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అయితే.. రింగ్ ఆఫ్ ఫైర్‌ను నేరుగా వీక్షించడం మంచిదికాదని ఇప్పటికే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు. అలాగే.. ఈ సూర్యగ్రహణాన్ని అమెరికన్లందరూ తిలకించే అవకాశం లేదు. నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేయగలరు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏప్రిల్ 20వ తేదీన సూర్య గ్రహణం సంభవించింది. ఇవాళ సంభవించేంది రెండో గ్రహణం. మూడో గ్రహణం.. అక్టోబర్ 28-29 తేదీల మధ్య చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది పాక్షిక గ్రహణమే అయినా.. భారత్‌లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడ్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేయడం సూర్యగ్రహణం.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడతుంది. ఇది అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే జరుగుతుంది. అయితే, ప్రతీ అమావాస్య, పౌర్ణమికి గ్రహణాలు ఏర్పడవు. -
‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది?
వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు. సంవత్సరంలో చివరిసారిగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సంభవించే ప్రతీసారీ ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరగనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడనుంది. అక్టోబరు 14న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది కంకణాకృతి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సమయంలో కొన్నిసార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుని వెనుక దాక్కుంటాడు. కొన్నిసార్లు మెరుస్తున్న ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. సూర్యుని ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు చంద్రుని బ్లాక్ డిస్క్ చుట్టూ ఉండే రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. దీనినే యాన్యులస్ అంటారు. సాధారణ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. అయితే వార్షిక సూర్యగ్రహణంలో, చంద్రుడు.. భూమి కక్ష్యలో దానికి దూరంగా ఉంటాడు. ఈ కారణంగా చంద్రుడు ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా కనిపిస్తూ, సూర్యుడిని అడ్డుకుంటాడు. అంటే సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. ఈ స్థితిలో సూర్యుని స్థానంలో అగ్ని వలయం కనిపిస్తుంది. కాగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో రాత్రి సమయంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి, సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారతదేశ ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణాన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు చూడవచ్చు. అమెరికాలో, ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌లలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు! -
‘మూన్ కింగ్’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య
బ్రిటిష్ కొలంబియా: సౌర కుటుంబంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శని గ్రహం ‘మూన్ కింగ్’ కిరీటాన్ని తిరిగి చేజిక్కించుకుంది. ఈ గ్రహం చుట్టూ మరో 62 చంద్రులు పరిభ్రమిస్తున్నట్లు తాజాగా ఖగోళ పరిశోధకులు గుర్తించారు. దీంతో, శని చుట్టూ తిరుగుతున్న చంద్రుల సంఖ్య 83 నుంచి 145కు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించిన 12 చంద్రులతో కలిపి అత్యధికంగా 95 చంద్రులతో అగ్రభాగాన నిలిచిన గురుగ్రహం మూన్కింగ్గా కొనసాగుతోంది. అయితే, అకాడెమియా సినికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఎడ్వర్డ్ ఏస్టన్ మరో 62 చంద్రులు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. హవాయిలోని మౌనాకియాపై ఏర్పాటు చేసిన టెలీస్కోప్‌లో 2019–21 మధ్య నమోదైన డేటా ఆధారంగా సాగిస్తున్న పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు. సౌర కుటుంబంలో అత్యధిక చంద్రులతో ‘మూన్కింగ్’కిరీటాన్ని శని దక్కించుకున్నట్లయిందని ఆయన తెలిపారు. -
అంతరిక్షంలో అరుదైన దృశ్యం, సూర్య మామతో చంద్రుడి ఆటలు
-
Solar Eclipse 2023: సూర్యగ్రహణం రోజు గర్భిణీలు ఈ పనులు చేయొద్దు..!
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఉన్నాయి. ఈ రోజు గర్భిణీలు అసలు బయటకు రాకూడదని ప్రాచీన కాలం నుంచి విశ్వసిస్తున్నారు. గ్రహణం వల్ల కడుపులోని బిడ్డకు హానికరం అని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. అందుకే సూర్యగ్రహణం సమయంలో గర్భంతో ఉన్న మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోజు వాళ్లు ఏమేం చేయకూడదో చెప్పారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.. గ్రహణం వేళ గర్భిణీలు చేయకూడనివి.. ► సూర్యగ్రహణం పూర్తయ్యే వరకు గర్భిణీలు ఇంటి లోపలే ఉండాలి. ఈ సమయంలో బయటకు వెళ్తే పట్టుబోయే బిడ్డకు, తల్లికి హానికరం అని ప్రాచీన విశ్వాసం. గ్రహణం నీడ మీద పడినా కూడా తల్లీబిడ్డలకు మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. ► సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అసలు చూడవద్దు. చూస్తే కళ్లతో పాడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ► గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తినొద్దు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వసిస్తారు. ఈ సమయంలో బాగా ఆకలివేసి తప్పనిసరిగా తినాల్సి వస్తే మాత్రం పండ్లను శుభ్రంగా నీటితో కడిగి తినాలని పెద్దలు సూచిస్తున్నారు. ► గ్రహణం సమయంలో వీరు నిద్ర కూడా పోవద్దు. ► సూదులు, కత్తెర్లు, కత్తులు వంటి వస్తువులను గ్రహణం సమయంలో అసలు ఉపయోగించవద్దు. ఇలా చేస్తే కడుపులోని బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ► కత్తులు, పదునైన ఆయుధాలను అసలు ముట్టుకోకూడదు. గ్రహణం సమయంలో కత్తితో పండ్లు, కూరగాయలు కట్ చేయడం వంటి పనులు చేస్తే.. బిడ్డ పట్టేటపుడు అవయవాలు చీలి పోతాయి. అంటే శిశువులు పెదాలు చీలి పోయి జన్మించడం వంటివి జరగవచ్చు. ► గ్రహణం సమయంలో శారీ పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు కూడా ధరించకూడదు. ► ఈ సమయంలో గర్భిణీలు దుర్వ గడ్డి(గరికె)పై మంచం వేసుకొని కూర్చుని సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తే మంచిది. ఈ విశ్వాసాలు నిజం కాదని శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. అయినప్పటికీ గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. గ్రహణం అనేది సహజ చర్యకు విరుద్ధం కాబట్టి కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చని, కానీ ఏమేరకు హాని కలుగజేస్తాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పేవి వాస్తవం కాదంటున్నారు. కాగా.. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. ఏప్రిల్ 20న మొదటి, అక్టోబర్ 14న రెండో సూర్యగ్రహణం ఉంది. మే 5-6 మధ్య మొదటి చంద్ర గ్రహణం, అక్టోబర్ 28-29 మధ్య రెండో చంద్ర గ్రహణం ఉన్నాయి. అయితే మొదటి సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, సౌత్, ఈస్ట్ ఆసియా దేశాల్లో మాత్రమే కన్పించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌లో కన్పించకవోచ్చని పేర్కొన్నారు. చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..? -
గ్రహణ ప్రభావం.. ఆశ్చర్యం, ఆ వింతని చూసేందుకు ఎగబడ్డ జనం!
రామకుప్పం: మండలంలోని కెంచనబళ్ల పంచాయతీ, రెడ్డివానిపోడు గ్రామానికి చెందిన కర్ణ కుటుంబీకులు పూర్వీకుల కాలం నుంచి సూర్యగ్రహణం రోజు రోలుకు పూజలు చేసి రోకలిని నిలబెట్టేవారు. మంగళవారం సూర్యగ్రహణం వేళల్లో రోలుకు పూజలు చేసి అందులో నీరుపోసి రోకలిని నిలబెట్టారు. గ్రహణ ప్రభావం ఉండడం చేత రోకలి ఎటువంటి సపోర్టు (ఆధారం) లేకుండా రోలు మీద నిటారుగా నిలబడింది. గ్రహణ సమయంలో రోలు నుంచి రోకలిని వేరుచేసి తట్టలో నింపిన కుంకుమ నీళ్లలో రోకలిని నిలబెట్టగా రోకలి నిటారుగా నిలబడింది. రోకలిని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇదే వింత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. కృష్ణా జిల్లా కోడూరు మండలం స్వతంత్రపురం, మండల కేంద్రమైన తోట్లవల్లూరులో గ్రహణం ప్రభావంతో ఎటువంటి ఆధారం లేకుండా రోకళ్లు నిలబడటం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం -
Surya Grahan 2022: దేశ వ్యాప్తంగా సూర్యగ్రహణం(ఫోటోలు)
-
కృష్ణానది తీరాన సూర్యగ్రహణం వీక్షిస్తున్న జనం (ఫొటోలు)
-
గ్రహణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
-
ముగిసిన సూర్యగ్రహణం
దేశంలోని కొన్ని చోట్ల సూర్య గ్రహణం 4.29 గంటల సమయంలో మొదలై గరిష్ఠంగా గంటా 45 నిమిషాల పాటు కనిపించింది. సాయంత్రం 6.26 గంటలకు గ్రహణం పూర్తయింది. ఢిల్లీ, జమ్ము, అమృత్సర్, వారణాసి వంటి చోట్ల సూర్య గ్రహణం ముందుగా కనిపించింది. ఆయా ప్రాంతాలను బట్టి సూర్య గ్రహణం సమాయాల్లో తేడాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో సాయంత్రం 4.58 గంటల నుంచి 5.55 గంటల వరకు సూర్య గ్రహణం కనిపించింది. బిర్లా ప్లానిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. గ్రహణం వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు సందర్శకులు. గ్రహణం మధ్యకాలం సాయంత్రం 5.29 గంటలుగా నిపుణులు తెలిపారు. గాగుల్స్ పెట్టుకుని మాత్రమే గ్రహణం వీక్షించాలని సూచించారు. 22 ఏళ్ల తర్వాత ఏర్పడిన అరుదైన గ్రహణం కావటంతో చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. గ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. -
సూర్యగ్రహణం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేత
-
అరుదైన సూర్య గ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత (ఫొటోలు)
-
Solar Eclipse: 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్య గ్రహణం
సాక్షి, తిరుపతి/విజయవాడ: దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత అరుదైన సూర్య గ్రహణం ఈ రోజు ఏర్పడుతోంది. ఇది కేతు గ్రస్త సూర్య గ్రహణం కావడం విశేషం. సహజంగా రాహు, కేతు ప్రభావంతో ఏర్పడే గ్రహణాల్లో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహు గ్రస్తమని, కేతు ప్రభావంతో ఏర్పడే దానిని కేతు గ్రస్తమని అంటారు. సూర్య గ్రహణం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత కూడా ఉంటుంది. ఈ గ్రహణ కాలం దాదాపు గంట 15 నిముషాలు పాటు ఉంటుందని పంచాగకర్తలు చెబుతున్నారు. సూర్య గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేయనున్నారు. చదవండి: AP: మహిళలకు బ్యాంకుల రెట్టింపు రుణాలు ఉదయం 11 గంటలకు విజయవాడ దుర్గగుడి పాటు ఉపాలయాలు మూసివేయనున్నారు. నేడు ప్రదోషకాలంలో నిర్వహించే సేవలు కూడా రద్దు చేశారు. రేపు(బుధవారం) స్నపనాభిషేకాలు, అర్చన, హారతి, మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శనాలకు అనుమతించనున్నారు. రేపు ఉదయం నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. రేపు సాయంత్రం పంచహారతులు,పల్లకీ సేవ మాత్రమే ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆలయ తలుపులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పుణ్యా వచనం, స్వామివారికి అభిషేకం తరువాత దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. సూర్య గ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న ఆలయ ద్వారాలు, స్వామి, అమ్మవారి ఉభయ దేవాలయాల ద్వారాలను అధికారులు మూసివేశారు. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి,సంప్రోక్షణ చేయనున్నారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. యాదాద్రి ఆలయం మూసివేత యాదాద్రి భువనగిరి జిల్లా: సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 8:50 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు(బుధవారం) స్వాతి నక్షత్రం సందర్బంగా నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి కానున్నాయి -
గ్రహణాలు వీడాలి!
దీపాలు లేని లోకాన్ని ఊహించగలమా? దీపాలే లేకుంటే రోజులో సగం చీకటిమయమయ్యేది; జీవితాల్లో సగం అంధకారబంధురమయ్యేది. నాగరకత ఇంకా నత్తనడకనే కొనసాగే లోకంలో అలముకున్న తిమిరాన్ని తరిమికొట్టేవి దీపాలే! నిప్పు రాజెయ్యడం నుంచి వివిధ తైలాలతో ప్రమిదలను నింపి దీపాలు వెలిగించడం వరకు సాగిన పరిణామ క్రమానికి సహస్రాబ్దాల కాలం పట్టింది. విద్యుద్దీపాలను కనుగొన్న తర్వాత నాగరకత విద్యుద్వేగాన్ని పుంజుకుంది. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అంటూ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోల్చారు మన పూర్వులు. పరంజ్యోతి అంటే పరబ్రహ్మమే! మనుషుల్లో అజ్ఞానం తొలగిపోవాలంటే, జ్ఞాన దీపాలను వెలిగించాల్సిందే! దీపావళి పండుగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నరకాసుర వధకు సంబంధించిన గాథ ప్రసిద్ధమైనది. రావణ వధా నంతరం రాముడు అయోధ్యకు చేరుకుని ఈరోజే పట్టాభిషిక్తుడయ్యాడనే గాథ ప్రచారంలో ఉంది. బలి చక్రవర్తిని వామనుడు ఇదేరోజు పాతాళానికి అణగదొక్కాడని పురాణాల్లో ఉంది. దీపావళి ముందురోజు చతుర్దశినాడు యమధర్మరాజును దీపాలు పెట్టి పూజించితే పితృదేవతలు నరక విముక్తులవుతారని, అందువల్లనే దీనికి ‘నరక చతుర్దశి’గా పేరు వచ్చిందని కూడా చెబుతారు. పితృదేవతలను నరక విముక్తులను చేసే పర్వదినంగానే దీపావళిని జరుపుకోవడం మొదలైందని సురవరం ప్రతాపరెడ్డి ‘హిందువుల పండగలు’లో అభిప్రాయపడ్డారు. ఆరుద్ర కూడా సురవరం అభిప్రాయాన్నే బలపరుస్తూ ‘వాస్తవానికి నరకాసురుడికి, దీపావళికి సంబంధం లేదు. బలి చక్రవర్తితో కొంత సంబంధం ఉంది’ అంటూ ‘వ్యాసపీఠం’లో ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలను ఉటంకిస్తూ రాశారు. నరకాసుర వధ తదితర గాథలను తదనంతర కాలంలోనే దీపావళికి ఆపాదించుకున్నారని అనుకోవచ్చు. కథలూ గాథలూ ఎలా ఉన్నా, జనాలందరూ వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. దీపావళికి మన సంస్కృతిలోనే కాదు, దేశంలోని వివిధ భాషల సాహిత్యంలోనూ ఇతోధిక స్థానం ఉంది. దీపావళి ఆలంబనగా కొందరు హర్షాతిరేకాలను ప్రకటిస్తే, మరికొందరు నిరాశా నిర్వేదాలను పలికించారు. పురాణ ప్రబంధ సాహిత్యాల్లో దీపావళి వర్ణన పెద్దగా కనిపించదు గాని, ఆ తర్వాత వెలువడిన సాహిత్యంలో దీపావళి ప్రస్తావన కనిపిస్తుంది. ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి తొలికావ్యం ‘దీపావళి’. ‘లోన జ్వలియించు చున్న మహానలమున/ కొక స్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని/ శైశవమ్మాది ప్రేమ శ్మశానమైన/ జీవి కొకనాటి కేటి దీపావళి యిక’ అంటూ నిర్వేదాన్ని పలికిస్తారు. సరిగా అరవయ్యేళ్ల కిందట– 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు తిలక్ చైనాను నరకాసురుడితో పోలుస్తూ ‘మళ్లీ ఒక దీపావళి’ కవిత రాశారు. ‘మన ప్రధాని శ్రీకృష్ణుడు, ప్రజాశక్తి సత్యభామ/ దొంగచాటు బందిపోటు చైనాసురుడొరుగుతాడు/ మన పతాక హిమగిరిపై మళ్లీ ఆడుతుంది–/ మళ్లీ ఒక దీపావళి మళ్లీ ఒక దీపావళి’ని మనసారా ఆకాంక్షించారు. దాదాపు అదేకాలంలో మల్లవరపు జాన్ ‘కుమతులై దేశమును దురాక్రమణ జేయు/ ద్రోహచిత్తులు భీతిల్లి తొలగిపోవ/ ఢమ ఢమ యటంచు నశని పాతముల బోలి/ ధ్వని జనించె; దీపావళి దినముఖమున’ అంటూ దీపావళి విజయోత్సవ సంరంభాన్ని వర్ణించారు. హైదరాబాద్ విలీనమై తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు వానమామలై వరదాచార్యులు ‘దీనికె రాములు సెట్టి/ జీవితమును ముడిబెట్టి/ కడకు విశాలాంధ్ర గలుప/ కాస్త అయ్యెను పొట్టి... ఈ దీపావళి వెలుగున/ ఇరువురమును సోదరులుగ/ తెలిసికొంటి మెడద నెడద/ కలిపికొంటి మొకటైతిమి’ అంటూ ‘అపూర్వ దీపావళి’కి ఆహ్వానం పలికారు. ప్రపంచ దారుణాలకు మనసు చెదిరిన బైరాగి ‘పీడిత దరిద్ర శాపంతో/ క్రుంగిన ధరిత్రి కడుపు పగిలి/ వెలిగిన ప్రళయ ప్రదీపావళి/ దీపావళి వచ్చిందండీ’ అంటూ ‘చీకటి నీడలు’లో నిష్ఠుర పోయాడు. అమావాస్య రోజున వచ్చే వెలుగుల పండుగ దీపావళి. మన కవులలో కొందరు దీపావళిలో అమావాస్య చీకట్లనే చూస్తే, ఇంకొందరు ఆశల వెలుగులను తిలకించారు. వెలుగులు, చీకట్లను చూసిన కవులూ తమ సమకాలీన చారిత్రక పరిణామాలను నమోదు చేయడం విశేషం. ఈసారి దీపావళి గ్రహణాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. దీపావళి, సూర్యగ్రహణం ఒకేసారి రావడం చాలా అరుదు. ఇలాంటి పరిణామం ఇరవై ఏడేళ్ల కిందట ఒకసారి ఏర్పడింది. గ్రహణం శుభ సంకేతం కాదని చాలామంది నమ్ముతారు. అమవాస్య రోజు సూర్యగ్రహణం, పున్నమి రోజున చంద్రగ్రహణం ఏర్పడతాయి. భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు శతాబ్దాల కిందటే కనుగొన్నారు. అయినా గ్రహణాల చుట్టూ అల్లుకున్న నమ్మ కాలు జనాల్లో ఈనాటికీ సజీవంగానే ఉన్నాయి. ఖగోళ పరిణామాల వల్ల ఏర్పడే గ్రహణాల సంగతి అలా ఉంచితే, మనుషులు నిత్యం ఎదుర్కొనే గ్రహణాలు చాలానే ఉన్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడించి, అతలాకుతలం చేసిన ‘కరోనా’ గ్రహణం ఇప్పుడిప్పుడే వీడింది. అంతమాత్రాన సమాజానికి గ్రహణమోక్షం లభించిందని సంతోషించే పరిస్థితులు లేవు. ఆకలి బాధలు, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, కుల మత లింగ వివక్షలు, నేరాలు ఘోరాలు వంటి గ్రహ ణాలు సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ గ్రహణాలు వీడినప్పుడే మానవాళికి అసలైన దీపావళి! అంతవరకు ఆశల దీపాలను వెలిగించి ఉంచుదాం. -
25న యాదాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట: ఈ నెల 25న సూర్యగ్రహణం ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ఉదయం 8.50 గంటల్లోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 4.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం అవుతుందని తెలిపారు. దీంతో ఆ రోజు ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించారు. తిరిగి మర్నాడు ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరచి.. సంప్రోక్షణ అనంతరం 10 గంటల నుంచి భక్తులను దైవ దర్శనాలకు అనుమతించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిత్యపూజలు రద్దు చేసినట్టు చెప్పారు. -
గ్రహణం రోజుల్లో శ్రీవారి ఆలయం మూత
తిరుమల: ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. అలాగే, నవంబర్ 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ రెండు రోజులూ ఆలయ తలుపులు తెరిచిన తరువాత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ రెండు రోజులూ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. హోటళ్లు కూడా గ్రహణం పూర్తయ్యే వరకు మూసి ఉంచుతారు. దీనికనుగుణంగా తిరుమల యాత్రను రూపొందించుకోవాలని భక్తులను టీటీడీ కోరింది. శ్రీవారి దర్శనానికి 30 గంటలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 32 క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 83,223 మంది శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. 36,658 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించారు. దర్శనానికి 30 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలేశుని సేవలో ప్రముఖులు శ్రీవారిని మంగళవారం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాలతో సత్కరించారు. -
భక్తులకు అలర్ట్.. ఈ నెల 25న దుర్గగుడి మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఈ నెల 25వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంతోపాటు అన్ని ఉపాలయాలను మూసివేస్తామని ఆలయ వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పూజా కార్యక్రమాల అనంతరం దుర్గమ్మ దర్శనం నిలిపివేయడంతోపాటు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు. చదవండి: అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు తిరిగి 26 ఉదయం ఆరు గంటలకు దుర్గగుడి తెరుస్తామని, అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మహా నివేదన సమర్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.10 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ఈ నెల 26వ తేదీన తెల్లవారుజాముతోపాటు ఉదయం జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. -
సూర్య, చంద్ర గ్రహణ రోజుల్లో.. 12 గంటలు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ మేరకు బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. నవంబర్ 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. కాగా, తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్ట్మెంట్లు నిండాయి. దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. -
సాగరంలో సౌరవిహారం..
ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రపంచం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాల జోరు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. సౌరశక్తితో నడిచే వాహనాలు కూడా కొన్నిచోట్ల నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన జాహా హాడిడ్ ఆర్కిటెక్ట్స్ సంస్థ వందశాతం సౌరశక్తితో పనిచేసే 42 మీటర్ల పొడవైన విలాసవంతమైన నౌకను రూపొందించింది. ఈ నౌక పైకప్పుపై అమర్చిన సోలార్ ప్యానెల్స్ ఇందులోని బ్యాటరీలను నిరంతరం చార్జ్ చేస్తుంటాయి. ఫలితంగా పొద్దుగూకిన తర్వాత కూడా ఈ బ్యాటరీలు భేషుగ్గా పనిచేస్తాయి. మామూలు ఇంధనంతో పనిచేసే నౌకలు దాదాపు 40 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఈ సౌరనౌక నుంచి కార్బన్ డయాక్సైడ్ ఏమాత్రం విడుదల కాదు. ఇలాంటి వాహనాలు విరివిగా వినియోగంలోకి తెస్తే, ఉద్గారాల జోరుకు కళ్లాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
సూర్యగ్రహణం భారత్‌లో కనిపించనుందా?
ఏప్రిల్ 30వ తేదీ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం వచ్చే రోజు అమవాస్యతో పాటు శనివారం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు. వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అరుదుగా సంభవిస్తుంటుందని పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని సూచిస్తోన్నారు. సూర్యగ్రహణం, అమావాస్య, శనివారానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని చోట్ల అమావాస్య రోజున పాలు కూడా కొనరు. శనివారం నాడు వంటనూనెకు సంబంధించిన వస్తువులు తీసుకోరు. ఇప్పుడు శనివారం, అమవాస్యకు తోడు సూర్యగ్రహణం రాబోతుంది. భారత్‌లో సూర్యగ్రహణం కనిపించదు? భారత్‌లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. అమెరికా దక్షిణ ప్రాంతం, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ సముద్ర తీర ప్రాంత దేశాల ప్రజలు మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియ నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్రేయ ప్రాంత ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరని నాసా తెలిపింది. భారత్‌లో ఈ సూర్య గ్రహణం అర్ధరాత్రి ఆరంభమౌతుంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగుతుంది. తెల్లవారు జామున 4:07 నిమిషాలకు ముగుస్తుంది. అంటే భారత్‌లో ప్రజలు దీన్ని వీక్షించే అవకాశం లేదు. ఫలితంగా భారత్‌లో సూర్యగ్రహణ ప్రభావం దాదాపు ఉండదు. గ్రహణాలు ఏర్పడేటప్పుడు కొన్ని రాశులపై వాటి ప్రభావం ఉంటుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణమే అయినప్పటికీ కొన్ని రాశులపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ సూర్య గ్రహణం ప్రభావం మేష రాశిపై అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రవి మేష రాశిలో ఉండటం ఏప్రిల్ 30వ తేదీన చంద్రుడు మేషంలోకి రావడంతో ఈ రాశి వారిపై గ్రహణం ప్రభావం ఉండే అవకాశం ఉంది. -
డిసెంబర్ 4న సూర్యగ్రహణం.. మనదేశంలో కనిపిస్తుందా?
ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం డిసెంబర్ 4న ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం అంటార్కిటికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో కనిపిస్తుందని, అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని ఖగోళ నిపుణులు తెలిపారు. భారత కాలమాన ప్రకారం డిసెంబర్ 4న ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3.07 గంటలకు ముగియనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకదానితో ఒకటి సమాంతరంగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు. కొన్ని నిమిషాలు లేదా సెకండ్ల పాటు ఆకాశం చీకటిగా మారిపోయి, రాత్రిని తలపిస్తుంది. ఖగోళంలో జరిగే అరుదైన మార్పుల వల్లే సంపూర్ణ సూర్య గ్రహణాలు ఏర్పడతాయి. ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు, మరో రెండు సూర్యగ్రహణాలు ఏర్పడుతాయి ఈ మే 26న తొలి చంద్రగ్రహణం, నవంబర్ 19న రెండో చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక జూన్ 10న తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. వచ్చే నెల డిసెంబర్ 4న మరో సూర్యగ్రహణం సంభవించనున్నది. ఈ నెల 19న 580 సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాల అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. (చదవండి: కేవలం రూ.10 వేల పెట్టుబడితో రూ. 2 లక్షలు లాభం!) -
అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం
సౌర మంట అనేది సూర్యునిపై అకస్మాత్తుగా పెరిగిన ప్రకాశం, సాధారణంగా ఇది సూర్యని ఉపరితలం వద్ద లేదా సూర్యరశ్మి సమూహానికి దగ్గరగా ఉంటుంది. ఈ మంటల నుంచి రేడియో తరంగాల నుండి గామా కిరణాల వరకు అన్ని రకాల తరంగ దైర్ఘ్యాలు విద్యుదయస్కాంత వర్ణపటం అంతటా వ్యాపించి విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేస్తాయి. చాలా దృశ్య శక్తి పరిధి వెలుపల ఉన్న పౌనఃపున్యాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. వేగవంతమైన చార్జ్డ్ కణాలు ప్రధానంగా ఎలక్ట్రాన్లు, ప్లాస్మా మాధ్యమంతో సంకర్షణ చెందుతున్నప్పుడు ఈ మంటలు సంభవిస్తాయి. (చదవండి: అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!) అరోరా అనేది ఒక సహజ విద్యుత్ దృగ్విషయం. ఇది ఆకాశంలో.. ముఖ్యంగా ఉత్తర లేదా దక్షిణ అయస్కాంత ధ్రువం దగ్గర ఎరుపు లేదా ఆకుపచ్చని కాంతికి సంబంధించిన స్ట్రీమర్ల రూపాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో దీనిని వరుసగా అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్స్ అరోరా ఆస్ట్రాలిస్ లేదా సదరన్ లైట్స్ అని పిలుస్తారు. అయితే జీవిత కాలంలో ఎప్పుడో అరుదుగా లభించే చిత్రాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి థామస్ పెస్క్వెట్ తీశారు. We were treated to the strongest auroras of the entire mission, over north America and Canada. Amazing spikes higher than our orbit🤩, and we flew right above the centre of the ring, rapid waves and pulses all over. #MissionAlpha https://t.co/5rdb08ljhx pic.twitter.com/0liCkGvRCh — Thomas Pesquet (@Thom_astro) November 6, 2021 అంతేకాదు ఆయన గ్రహం ఉత్తర భాగంలో మిరుమిట్లు గొలిపే అరోరాస్ (ఎర్రటి లేదా ఆకుపచ్చ)తో బలమైన సౌర మంట వెలుగుతున్న క్షణాన్ని ఫోటో తీశాడు.పైగా ఈ మండుతున్న సూర్యుని కాంతి భూమి వైపు దూసుకుపోతున్న అద్భుతమైన సమయంలో తీశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫోటోతోపాటు "మా మిషన్ మొత్తం ఉత్తర అమెరికా నుంచి కెనడా మీదుగా ప్రసరిస్తున్న సౌర కాంతిని చూశాం. అయితే మా కక్ష్య కంటే అద్భుతమైన ఎత్తులో ఆ కాంతి ప్రసరిస్తుంది. మేము తరంగ ధైర్ఘ్యాల మధ్యలో ఉన్నాం" అని పెస్క్వెట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్‌కి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి మీరు చూడండి. (చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!) -
నేడే సూర్యగ్రహణం... ఈజీగా ఇలా చూడొచ్చు!
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం గురువారం (జూన్ 10) సంభవించనుంది. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సూర్య గ్రహణం గురించి ప్రకటన చేసింది. కాగా భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు గ్రహణం సంభవిస్తుంది. ఆ గ్రహణాన్ని సూర్య గ్రహణం అని పిలుస్తాం. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. దీంతో గ్రహణం నిప్పులు చెరుగుతూ అగ్నివలయంలా కనిపిస్తోంది. ఇలా కనిపించడాన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని అంటారు. అయితే నేటి సూర్యగ్రహణం భారత్‌లోని లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రమే పూర్తిగా కనిపించనుందని నాసా తెలిపింది. మిగిలిన ప్రాంతాల ప్రజల పాక్షిక గ్రహణాన్ని మాత్రమే వీక్షించవచ్చు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యాస్తమయానికి కొద్ది నిమిషాల ముందు ఈ సంఘటన కళ్ల ముందు ఆవిష్కృతం అవుతుందని వెస్ట్ బెంగాల్ ఐకానిక్ బుద్దిస్ట్ స్తూపం ఎంపి బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ డాక్టర్ డెబిప్రసాద్ డుయారి అన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. సాయంత్రం 6:41 గంటలకు ముగుస్తుంది. గరిష్ట సమయం సాయంత్రం 4:16 గంటలకు ప్రారంభం కానుంది. వృషభం గుర్తులో సరిగ్గా 25 డిగ్రీల వద్ద సూర్యుడు మరియు చంద్రుడు కలుస్తాడని డుయారి చెప్పారు. చదవండి: ‘గురు’ ఉపగ్రహం ఇలా ఉన్నాడు సూర్యగ్రహణం ఎలా చూడాలి? ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా వీక్షించకూడదు. గ్రహణ సమయంలో భూమిపై చేరే కిరణాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఆ సమయంలో మనం గ్రహణాన్ని చూసినప్పుడు అవి మన కళ్లకు హాని చేస్తాయి. కాబట్టి బైనాక్యూలర్లు లేదా టెలిస్కోప్ సహాయంతో వీక్షించాలి. ఇక ఆన్ లైన్ లో టైమండ్‌డేట్.కామ్‌లో మీరు గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. నాసా సైతం ప్రత్యక్షప్రసారాన్ని అందుబాటులో ఉంచింది. దీంతో పాటు ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ కెనడా సడ్బరీ సెంటర్ యొక్క లూక్ బోలార్డ్ gov / live. యూట్యూబ్‌లో వీక్షించవచ్చు. -
మరో బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఛండీగడ్ : కరోనా..సామాన్య ప్రజానీకం నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారిన పడగా తాజాగా హర్యానా బీజేపీ ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకింది. కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్ నియోజవర్గ శాసన సభ్యుడు సుభాష్ సుధా గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. గురుగ్రావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్ గులాటి మీడియాకు వెల్లడించారు. దీంతో సుభాష్ సుధా కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. కాగా జూన్ 21న సూర్యగ్రహణం నాడు బ్రహ్మ సరోవర్ ఒడ్డున నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సాధువులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులతో సహా దాదాపు 200 మంది సమావేశమయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరందరినీ ట్రేస్ చేసే పనిలో యంత్రాంగం సంసిద్దమైంది. వీరెవరిని కలిశారో అన్న దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. (మోసపోయిన మన్మోహన్ మాజీ సలహాదారు ) కురుక్షేత్ర జిల్లాలోనే ఇప్పటివరకు 115 కరోనా కేసులు నమోదవగా రాష్ర్ట వ్యాప్తంగా 13,829 కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే 402 కొత్త కోవిడ్ కేసులు వెలుగు చూశాయని హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. హర్యానా రాష్ర్ట వ్యాప్తంగా రికవరీ రేటు 64.48% ఉండగా ప్రస్తుతం 4,689 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. (ఉగ్రవాదరహిత జిల్లాగా అవతరించిన దోడా ) -
‘రింగ్ ఆఫ్ ఫైర్’ కనువిందు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం సంభవించిన సూర్యగ్రహణం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రజలను కనువిందు చేసింది. గ్రహణం ఆదివారం ఉదయం 9.16 గంటలు మొదలుకొని దశల వారీగా మధ్యాహ్నం 3.04 గంటల వరకు కనిపించింది. చాలా మంది గ్రహణా న్ని ఆన్లైన్లో తిలకించగా కొందరు ఔత్సాహికులు కోవిడ్ దృష్ట్యా రక్షణ మాస్కులు ధరించి, భవనాల పైకి చేరారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే గ్రహణం కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలు సరిగ్గా చూడలేకపోయారు. కోవిడ్–19 కారణంగా అమల్లో ఉన్న భౌతిక దూరం నిబంధనలు కూడా వీక్షకులను బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా అవరోధం కలిగించాయి. -
వందేళ్లలో ఈ ‘అగ్ని వలయం’ లోతైనది!
న్యూఢిల్లీ: ఆకాశంలో ఆదివారం అద్భుత ఖగోళ సంఘటన కనువిందు చేసింది. భారత్‌వ్యాప్తంగా పలు చోట్ల పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం కనిపించింది. దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమైన గ్రహణం మూడు గంటల వరకు కొనసాగింది. ఈఏడాది ఇది మూడో గ్రహణం కావడం విశేషం. ఇప్పటికే జనవరి, జూన్ మాసాల్లో రెండు చంద్రగ్రహణాలు కనిపించాయి. సరిగ్గా మధ్యాహ్నం 12.05 నిముషాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే మార్గంలోకి రావడంతో.. అగ్నివలయంగా సూర్యుడు దర్శనమిచ్చాడు. గుజరాత్లో సూర్యగ్రహణం ఈ శతాబ్దానికి ఇదే ‘లోతైన’ వలయాకార సూర్యగ్రహణమని జ్యోతిష్కులు, నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ దశాబ్దానికి ఇది చివరి వలయాకార సూర్యగ్రహణమని పేర్కొన్నారు. దాంతోపాటు నేటి సంపూర్ణ, వలయాకార సూర్యగ్రహణం ఖగోళ చరిత్రలో నాలుగో అత్యుత్తమైందని అంటున్నారు. కాగా, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, కోల్‌కత, లక్నో, ముంబై, పట్నా, షిల్లాంగ్, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపించింది. ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్, హిందూ మహాసముద్రాల ప్రాంతాల్లో, యూరప్, ఆస్ట్రేలియాలోనూ గ్రహణం కనిపించింది. (చదవండి: అగ్ని వలయంలో బీజేపీ ఎంపీ యోగా) పంజాబ్‌లో పాక్షిక సూర్యగ్రహణం -
వీడిన సూర్యగ్రహణం
సాక్షి, హైదరాబాద్ : ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం వీడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం ఆదివారం కనువిందు చేసింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తొలుత భారత్‌లో గుజరాత్‌లోని ద్వారకలో గ్రహణం కనిపించింది. ముంబైలో ఆకుపచ్చ వర్ణంలో సూర్యడు సాక్షాత్కరించాడు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై...మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగిసింది. సూర్యగ్రహణం వీడడంలో భారత్‌లో కొన్ని ఆలయాలు ఈ రోజు తెరచుకున్నాయి. సూర్యగ్రహణం అనంతరం తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశారు. అలాగే పుణ్యాహవచనం నిర్వహించారు. ఏకాంతంగానే శ్రీవారికి పూజా కైంకర్యాలు చేశారు. నేడు పూర్తిగా దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే విజయవాడలో దుర్గమ్మ ఆలయం తెరుచుకుంది. సాయంత్రం పంచహారతుల అనంతరం అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం లభించనుంది. -
విశాఖ శారదా పీఠాధిపతుల పుణ్య స్నానం
రిషికేశ్: విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ వద్ద గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచే రిషికేశ్‌లో శారదాపీఠం ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న గంగానదీ తీరానికి చేరుకున్నారు. తన పరివారంతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. పీఠాధిపతులు ఇద్దరూ దండ తర్పణం నిర్వహించారు. అనంతరం వేద విద్యార్ధులతో కలిసి చండీ పారాయణ చేసారు. స్వామి స్వాత్మానందేంద్ర గ్రహణ సమయాన్ని మొత్తం నదీ తీరంలోనే గడిపారు. నదీ జలాల్లో మునిగి ప్రత్యేక జపమాచరించారు. గ్రహణ కాలంలో విశాఖ శారదాపీఠం ఆవరణలోని సకల దేవతా మూర్తుల ఆలయాలను కూడా మూసివేశారు. సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడల్లా ఈ తరహా నియమాలను పాటించడం విశాఖ శారదా పీఠానికి ఆనవాయితీగా వస్తోంది. -
సూర్యగ్రహణంతో కరోనా తగ్గుతుందా?
సాక్షి, హైదరాబాద్ : ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం ఆదివారం ప్రారంభమైంది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.15 గంటలకు సూర్యగ్రహణం మొదలు కాగా, ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపిస్తోంది. భారత్‌లోనే మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా దర్శనం ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం. ఇది పాక్షిక సూర్య గ్రహణం కాగా, డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై...మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగియనుంది. అయితే తెలంగాణలో మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం వుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10 గంటల 21 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 49 నిమిషాల వరకు 46 శాతం గ్రహణం ఉండనుంది. (సూర్యగ్రహణం నేడే) సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది.. కాగా భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడి ప్రవేశంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడిని చంద్రుడు కప్పేయడం కారణంగా భూమిపై చంద్రుడి నీడ మాత్రమే కన్పిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఒక్క అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. డెహ్రాడూన్, సిర్సా, టెహ్రీ ప్రాంతాల్లో వలయాకారంలో కన్పించే సూర్యగ్రహణాన్ని, ఢిల్లీ, ఛండీగఢ్, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు పట్టణాల్లోని ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. ఇక గ్రహణం రోజున దేశంలోని అనేక ఆలయాలను మూసివేశారు. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం, స్నానం చేయరాదని పెద్దలు చెప్తుంటారు. దేవుళ్ల విగ్రహాలను తాకరాదని, గ్రహణం విడిచిన తర్వాత మాత్రమే స్నానం చేసి తినాలని చెప్తుంటారు. గ్రహణం అనంతరం ఆలయాలు సంప్రోక్షణ చేసి మరుసటి రోజు నుండి యధావిధిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. 0.001 శాతం మాత్రమే వైరస్ అంతం.. ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు హరిస్తాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది. -
నేడు శ్రీవారి దర్శనం నిలిపివేత
తిరుమల: సూర్యగ్రహణం కారణంగా ఆదివారం (నేడు) తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా టీటీడీ భక్తులను కోరుతోంది. కాగా, ఆదివారం సూర్యగ్రహణం సమయంలో ప్రపంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశుల క్షేమాన్ని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ జపయజ్ఙం నిర్వహించనుంది. ఇందులో భాగంగా అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీ ధన్వంతరి మంత్ర జపాలతోపాటు శ్రీపురుష సూక్త, శ్రీసూక్త, శ్రీ నారాయణ సూక్త పారాయణాలను నిర్వహించనున్నారు. -
సూర్యగ్రహణం నేడే
న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా పూర్తిస్థాయి వలయాకార సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఉంటుంది. భారత్‌లో గుజరాత్లో మొదట గ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపించనుంది. సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది. ► 2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ► దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ► ఇవాళ్టి వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చును. ► రాజస్తాన్‌లో సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలో సిర్సా, రాటియా, కురుక్షేత్రలోనూ, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, చంబా, చమోలిŠ‡లో రింగ్ ఆఫ్ ఫైర్ ఒక్కనిమిషం వరకు కనిపిస్తుంది. ► సెంట్రల్ ఆఫ్రికా, పాకిస్తాన్, దక్షిణ సెంట్రల్ చైనా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోనూ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ► సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్ ఆఫ్ ఫైర్ దృశ్యాన్ని చూడొచ్చు. – రఘునందన్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా -
రేపు అద్భుత ఖగోళ సంఘటన
సాక్షి, హైదరాబాద్ : రేపు(ఆదివారం) అద్భుత ఖగోళ సంఘటన జరగబోతోందని ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్ అన్నారు. పూర్తి స్థాయి వలయాకార సూర్య గ్రహణం జరుగుతుందని తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుండి మధ్యాహ్నం 3.04 వరకు సూర్య గ్రహణం ఉంటుందని వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ గ్రహణాన్ని మొదట చూస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంది. మామూలుగా సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడతాయి. కానీ రేపు గ్రహణం కారణంగా అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడతాయి. కాబట్టి కరోనా 0.001 శాతం చనిపోయే అవకాశం ఉంది. 100 శాతం అంతం కాదు. తెలంగాణలో సూర్యగ్రహణం రేపు ఉదయం 10.15 గంటల నుండి 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. ( 21న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ) ఆంద్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుండి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం ఉంటుంది. గ్రహణం సమయంలో తినకూడదు, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదంటూ ప్రచారం చేస్తున్నారు. కొందరు నరబలి ఇవ్వాలని చూస్తుంటారు. గతంలో హైదరాబాద్‌లో ఒక అమ్మాయిని కూడా నరబలి ఇచ్చారు. అవన్నీ మూఢనమ్మకాలు అలాంటి వాటిని నమ్మకూడదు. సూర్యుని ద్వారా కరోనా వచ్చింది అని ప్రచారం జరుగుతుంది. రేపటి గ్రహణంతో కరోనా అంతం అవుతుందని అంటున్నారు. అది అవాస్తవం’’ అని తెలిపారు. -
ద్వారక తిరుమల ఆలయం మూసివేత
సాక్షి, పశ్చిమ గోదావరి : జూన్ 21న సూర్య గ్రహణం సందర్భంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 20వ తేదీన రాత్రి యధావిధిగా ఆలయం మూసివేసి 21వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు మళ్లీ ఆలయం తెరిచి సంప్రోక్షణ నిర్వహించి శుద్ది జరుపుతారని అధికారులు పేర్కొన్నారు. అనంతరం రాత్రి 7గంటలకు భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు. కాగా సూర్య గ్రహణం సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. -
21న ‘రింగ్ ఆఫ్ ఫైర్’
కోల్‌కతా: ఈనెల 21న∙సూర్యగ్రహణం సంభవించనుంది. భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణ సమయంలో సూర్యుడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా కనిపిస్తాడు. గ్రహణంవేళ సూర్యుడిచుట్టూ ఉంగరం ఆకృతిలో వెలుగు కనిపించడమే రింగ్ ఆఫ్ ఫైర్. దేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణమే ఉంటుంది. రాజస్తాన్‌లోని ఘర్సానాలో ఉదయం 10.12 గంటలకు ప్రారంభమై.. 11.49 గంటలకు వలయాకార రూపు దాల్చి, 11.50 గంటలకు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ముగుస్తుందని బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేవీ ప్రసాద్ వెల్లడించారు. రాజస్తాన్‌లోని సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలోని కురుక్షేత్ర, సిర్సా, రథియా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, చంబా, చమోలీ, జోషిమఠ్ల్లో ఆ నిమిషం పాటు ఆ రింగ్ ఆఫ్ ఫైర్‌ను వీక్షించవచ్చు. గత సంవత్సరం డిసెంబర్ 26న కనిపించినంత స్పష్టంగా ఈ సారి రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించదని దురై తెలిపారు. ఢిల్లీలో ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 1.48 గంటల వరకు, చెన్నైలో ఉదయం 10.22 గంటల నుంచి మధ్యాహ్నం 1.41 గంటల వరకు, బెంగళూరులో ఉదయం 10.13 గంటల నుంచి మధ్యాహ్నం 1.31 గంటల వరకు పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. -
21న దుర్గమ్మ ఆలయం మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): వచ్చే ఆదివారం 21వ తేదీన సూర్యగ్రహణం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేయనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. ♦ 20వ తేదీ సాయంత్రం అమ్మవారికి పంచ హారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ♦ ఇక 21వ తేదీ ఉదయం 10–25 గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1–54 గంటలకు విడుస్తుందని పేర్కొన్నారు. గ్రహణం వీడిన అనంతరం మధ్యాహ్నం 2–30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు. అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం పంచహారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ♦ ఈ నేపథ్యంలో 21వ తేదీ అన్ని దర్శనాలను రద్దు చేశారు. ♦ 22వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు దర్శనాలు యథావిధిగా ప్రారంభమవుతాయని తెలిపారు. -
పింక్ సూపర్ మూన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే ఆకాశవీధిలో ఓ అందాల దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 7న చంద్రుడిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 7 రాత్రి 8.30 గంటలకు చంద్రుడు భూమి కక్ష్యలోకి మరింత దగ్గరగా వచ్చి, భారీ సైజులో కాంతులీనుతూ కనువిందు చేయనున్నాడు. దీనినే పింక్ సూపర్ మూన్ అని పిలుస్తారు. 2020 సంవత్సరంలో చంద్రుడు అత్యంత పెద్దగా కనిపించే రోజు ఇదే. భారత్‌లో 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఈ దృశ్యాన్ని చూడవచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ఇంటిపట్టునే ఉన్న ప్రజలు ఈ సూపర్ మూన్ అందాలను పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్‌లో ఉదయం సమయం కాబట్టి సూపర్ మూన్ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏమిటీ పింక్ సూపర్ మూన్ పున్నమి రోజుల్లో కనిపించే చంద్రుడు కంటే అత్యంత ప్రకాశవంతంగా, ఇంకా పెద్దగా ఆకాశ వీధిలో అందాల జాబిలి కనువిందు చేయడాన్నే సూపర్ మూన్ అంటారు. భూ కక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అంటారు. ఈ పెరోజీలోకి వచ్చినప్పడు చంద్రుడు మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించి అందరినీ అలరిస్తాడు. సాధారణంగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. ఉంటుంది. కానీ ఏప్రిల్ 7, 8వ తేదీల్లో ఆ దూరం 3,56,000 కి.మీ. తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా సూపర్ పింక్ మూన్ దర్శనమిస్తాడు. 20 ఏళ్లలో ఇప్పటివరకు 79 సూపర్ మూన్‌లు వచ్చాయి. సగటున మూడు నెలలకో సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ ఏడాది నెలకో సూపర్ మూన్ వస్తూనే ఉంది. -
ఆకాశంలో ఓ అద్భుతం..
సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు బిర్లాప్లానిటోరియం, ఉస్మానియా వర్సిటీలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కావడంతో సూర్య గ్రహణాన్నివీక్షించేందుకు గ్రేటర్ వాసులు ఆసక్తి కనబర్చారు. గురువారం ఉదయం 8.15 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం దాదాపు 3 గంటల పాటు సాగింది. గ్రహణాన్ని వీక్షించకూడదన్న అపోహలతో ప్రజలు బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోగా, సంప్రోక్షణ అనంతరం ఆలయాలుతెరుచుకున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. చాలా ఏళ్ల తర్వాత గురువారం ఉదయం వేళల్లో ఆకాశంలో సూర్యగ్రహణం కనువిందు చేయడంతో దానిని వీక్షించేందుకు నగరవాసుల్లో కొందరు ఇళ్లపై నిల్చుని ఆసక్తిగా ఆకాశం వైపు చూడగా....మరికొందరు అపోహలతో ఇంటి నుంచి కనీసం బయటికి కూడా రాలేదు. ఉదయం 8.15 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం దాదాపు 3 గంటల పాటు సాగింది. గ్రహణాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు దేవాలయాల్లో పూజలతో పాటు దర్శనాలను నిలిపివేశారు. ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. సూర్యగ్రహణంపై ఇప్పటికీ ప్రజల్లో అనేక అపోహలు ఉండటంతో చాలా మంది బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. సందర్శకులతో నిత్యం రద్దీగా కనిపించే చార్మినార్ సహా పలు పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. ఇదిలా ఉండగా అరుదుగా సంభవించే ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు బిర్లా ప్లానిటోరియం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సూర్యగ్రహణం అనంతరం ఆయా దేవాలయాల్లో సంప్రోక్షణ నిర్వహించి, మధ్యాహ్నం తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించా రు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని పేర్కొంటూ వారంతా స్వయంగా ఆహారం తీసుకుని చూపించారు. -
ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరానికి స్వాగత సన్నాహాలు చేస్తున్న వేళ ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారత్‌లో గురువారంనాడు ఏర్పడిన పాక్షిక సూర్య గ్రహణం దక్షిణాది రాష్ట్రాల్లో కనువిందు చేసింది. కర్ణాటక, తమిళనాడులో వేలాదిగా బయటకు వచ్చిన ప్రజలు అంతరిక్ష అద్భుతం చూసి ఎంజాయ్ చేశారు. చెన్నై, తిరుచిరాపల్లి, మదురైలో సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో సూర్యుడు మబ్బుల చాటుకి చేరడంతో సూర్యగ్రహణాన్ని వీక్షించాలన్న ప్రజల ఉత్సాహం ఆవిరైపోయింది. కేరళలో చెర్వతూర్లో మొదట సూర్యగ్రహణం కనిపించింది. తర్వాత కోజికోడ్, కన్నూర్‌లో కనువిందు చేసింది. వాయనాడ్‌లో చాలా మంది ప్రజలు ఆరుబయటకి వచ్చి గ్రహణ దృశ్యాల్ని వీక్షించాలని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వారికి నిరాశే మిగిలింది. మబ్బులు కమ్మేయడంతో గ్రహణం కనిపించలేదు. ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం పూర్తి స్థాయికి చేరుకున్న సమయంలో మబ్బులు పట్టేశాయి. ఉదయం దాదాపుగా 8 గంటలకు మొదలైన గ్రహణం 11 గంటల 15 నిమిషాలకు ముగిసింది. శబరిమలై ఆలయం, పద్మనాభస్వామి ఆలయం, గురువాయూర్ ఆలయాలను గ్రహణం సందర్భంగా మూసివేశారు. గ్రహణానంతరం ఆలయాన్ని శుద్ధి చేశాక భక్తుల్ని అనుమతించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తే ఒమన్‌లో అరేబియా సముద్ర తీర ప్రాంతంలో తొలుత సూర్యగ్రహణం కనిపించింది. అరబ్ దేశాలు, సింగపూర్, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేసింది. రింగ్ ఆఫ్ ఫైర్ ఎందుకు అంతటా కనిపించలేదంటే... ఖగోళ అద్భుతాన్ని వీక్షించి 2019 సంవత్సరానికి గుడ్ బై కొట్టాలన్న చాలా మంది ఆశలు ఆవిరయ్యాయి. రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుందని అంచనా వేశారు కానీ చాలాచోట్ల కనిపించలేదు. దీనికి గల కారణాలను తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ జాయింట్ డైరెక్టర్ ఎస్. సౌందరరాజపెరుమాళ్ వివరించారు. ‘ఈసారి గ్రహణం సమయంలో చంద్రుడు భూమికి 3.85 లక్షల కి.మీ. దూరంలో ప్రయాణిస్తున్నాడు. శీతాకాలం కావడంతో సూర్యుడికి అత్యంత సమీపంలోకి భూమి వచ్చింది. దీంతో సూర్యుడి పరిమాణం ప్రజలకి చాలా పెద్దదిగా కనిపించింది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పటికీ పూర్తిగా సూర్యుడి ఉపరితలానికి అడ్డుగా రాలేకపోవడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించలేదు’అని వెల్లడించారు. ప్రధానికీ నిరాశే! సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షించాలనే ప్రధాని మోదీ కోరిక తీరలేదు. ‘భారతీయుల్లాగే నేను కూడా ఏడాది చివర్లో వచ్చిన సూర్యగ్రహణాన్ని వీక్షించాలని ఉత్సాహం చూపించాను. దురదృష్టవశాత్తూ మబ్బులు అడ్డం రావడంతో చూడలేకపోయాను. అయితే కోజికోడ్, ఇతర ప్రాంతాల్లో సూర్యగ్రహణ దృశ్యాలను లైవ్‌లో చూశాను. ఈ సందర్భంగా కొంతమంది నిపుణులతో మాట్లాడి గ్రహణంపై అవగాహన పెంచుకున్నాను’’అని మోదీ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఎన్నో ఫోటోలను షేర్ చేశారు. మోదీ కళ్లకి నల్లకళ్లద్దాలు పెట్టుకొని సూర్యుడ్ని వీక్షిస్తున్న ఫొటోను ఒక ట్విట్టర్ వినియోగదారుడు షేర్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెల్సి ప్రధాని చాలా కూల్‌గా ‘ఎంజాయ్’ అంటూ బదులిచ్చారు. అహ్మదాబాద్‌లో ఫిల్టర్ అద్దాలతో గ్రహణాన్ని చూస్తున్న యువతి -
సొంత పిల్లల్ని మట్టిలో పాతిపెట్టి..
బెంగళూరు : ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మానవుడు విభిన్న రంగాల్లో అనూహ్య అభివృద్ధిని సాధిస్తూ, విశ్వ రహస్యాలను సైతం ఛేదిస్తున్నా... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు బలంగా పాతుకొని ఉన్నాయి. తాజాగా సూర్యగ్రహణం సందర్భంగా కర్ణాటకలో జరిగిన ఘటననే దీనికి నిదర్శనం. సూర్యగ్రహణం రోజున అంగవైకల్యం కలిగిన పిల్లల శిరస్సు వరకు మట్టిలో పాతితే.. అంగవైకల్యం పోతుందన్న భూత వైద్యుడి మాటలు నమ్మిన తల్లిదండ్రులు.. చెప్పిందే చేశారు. మెడ వరకు గొయ్యి తీసి.. పిల్లలను పాతిపెట్టారు. ఇలా ఒకరు ఇద్దరూ కాదు పదుల సంఖ్యలో చేశారు. కలబురాగి జిల్లా తాజ్‌సుల్తానాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ప్రజలు అంగవైకల్యంతో బాధపడుతున్న తమ చిన్నారులను మట్టిలో కప్పిపెట్టారు. వారు చేసిన వింత పని అందరిని విస్తుపోయేలా చేసింది. చిన్నారులు ఏడుస్తున్నా పట్టించుకోకుండా చాలా సేపు అలాగే ఉంచారు. ఈ విషయం స్థానిక అధికారులకు తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. కాగా గురువారం దేశవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనం ఇచ్చింది. ఉదయం 8.08 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం11.11 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా సప్తవర్ణాలతో సూర్యుడు వీక్షకులకు కనువిందు చేశాడు. పలుచోట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. అంతరిక్ష ఔత్సాహికులు సూర్యగ్రహాణాన్ని వీక్షించారు. -
సూర్యగ్రహణం: సొంత పిల్లల్ని మట్టిలో పాతిపెట్టి..
-
గ్రహణాన్ని చూడలేకపోయాను: మోదీ
న్యూఢిల్లీ : దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన సూర్యగ్రహణం కొద్ది సేపటి క్రితం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సూర్యుడు సప్తవర్ణాలతో కనువిందు చేశాడు. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, చిన్నారులు, ప్రముఖులు ఆసక్తి కనబరిచారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సూర్య గ్రహణాన్ని చూడలేకపోయానని తెలిపారు. ఆకాశంలో మబ్బులు ఉండటం వల్ల గ్రహణాన్ని వీక్షించే అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘చాలా మంది భారతీయుల మాదిరిగానే.. నేను కూడా ఈ అద్భుత సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు చాలా ఉత్సాహం కనబరిచాను. దురదృష్టవశాత్తు గ్రహణం ఏర్పడిన సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడం వల్ల నేను సూర్యున్ని చూడలేకపోయాను. అయితే కోజికోడ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో గ్రహణానికి సంబంధించిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాను. అలాగే నిపుణలతో మాట్లాడుతూ ద్వారా ఈ అంశానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంపొందిచుకున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. -
తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం
-
ముగిసిన సూర్యగ్రహణం
-
సూర్యగ్రహణం: అటు సందడి.. ఇటు చైతన్యం
సాక్షి, విజయవాడ/తిరుపతి: సూర్య గ్రహణం సందర్బంగా తిరుపతి సైన్స్ సెంటర్లో విద్యార్థులు సందడి చేశారు. ఉదయం నుంచి గ్రహణం ముగిసేవరకు అక్కడే ఉండి ప్రత్యేక గ్లాసెస్ ద్వారా ఈ అంతరిక్ష అబ్బురాన్ని వీక్షించారు. చాలా అరుదుగా వచ్చే సూర్యగ్రహణాన్ని వీక్షించడం ఆనందంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. సైంటిస్టులు మాత్రం గ్రహణం సందర్బంగా సూర్యుడిని డైరెక్ట్ గా చూడకూడదని, ప్రత్యేక గ్లాసుల ద్వారా చూడటం వల్ల కళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక విద్యార్థుల్లో చైతన్యం నిపేందుకు గురువారం విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రహణాల విషయంలో ఉన్న శాస్త్రీయ అంశాలను విద్యార్థులకు వివరించి.. ఈ విషయంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసింది. సోలార్ ఫిల్టర్ క్లిప్స్‌తో గ్రహణం వీక్షణ చేపట్టింది. సోలార్ పరికరాలతో గ్రహణాన్ని చూడండి.. మూఢనమ్మకాలు వీడండి అంటూ ఈ సందర్భంగా నినాదాలు ఇచ్చింది. -
సూర్యగ్రహణం: నిలబడిన రోకళ్లు.. ప్రత్యేక పూజలు
సాక్షి, శ్రీకాకుళం: సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఏ ఆధారం లేకుండా నిలబెట్టిన రోకళ్లకు స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యగ్రహణం రోజున రోకళ్లు వాటంతట అవే నిలబడతాయని ఇక్కడి స్థానికులు నమ్ముతారు. గిన్నెలో నీళ్లు పోసి రోకలిని ఏ ఆధారంలేకుండా నిలబెడతారు. సూర్యగ్రహణం ప్రభావంతో ఏ సపోర్ట్ లేకపోయినా రోకళ్లు నిటారుగా నిలబడతాయని శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రజలు విశ్వసిస్తారు. ఇలా నిలబెట్టిన రోకళ్లకు పూజలు చేస్తున్నారు. గురువారం సూర్యగ్రహణం సంభవించడంతో శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం కె.కొత్తవలస గ్రామంలో స్థానికులు రోకలిని నిలబెట్టి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళంలోని పలు మండలాల్లో, గ్రామాల్లో ఈ ఆచారాన్ని స్థానికులు పాటించడం కనిపిస్తోంది. గ్రహణం ఎఫెక్ట్ కారణంగానే సూర్యభగవానుడి శక్తితో రోకళ్లు ఇలా నిలబడతాయని స్థానికులు చెప్తున్నారు. -
సూర్యగ్రహణాన్ని వీక్షించిన ప్రధాని
-
శ్రీకాకుళం జిల్లాలో నిలబడిన రోకళ్లు
-
సూర్యగ్రహణం కనువిందు
-
గ్రహణం వేళ ఆ ఆలయానికి పోటెత్తిన భక్తులు
సాక్షి, చిత్తూరు: సూర్యగ్రహణం సందర్బంగా దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలను శాస్త్రోకంగా మూసివేస్తారు. కానీ చిత్తూరు జిల్లాలోనికి శ్రీకాళహస్తి ఆలయం యథావిధిగా తెరుచుకొని ఉంటుంది. గ్రహణం వేళ ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయి. గురువారం సూర్యగ్రహం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఉదయం నుంచే యథావిధిగా పూజలు కొనసాగాయి. దీంతో ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజల్లో పాల్గొంటున్నారు. ఇది శుభ పరిణామం అని పూజారులు అంటున్నారు. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారన్నది అందరికీ తెలిసినా...తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం మాత్రం గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. శ్రీకాళహస్తితోపాటు పిఠాపురం పాదగయ క్షేత్రంలోనే భక్తులు దర్శించుకునే వీలుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. పూర్వకాలం నుంచి ఈ పద్ధతిని పాటిస్తూ వస్తున్నామని వెల్లడించారు. -
తెలుగు రాష్టాల్లో పాక్షిక సూర్యగ్రహణం
-
ముగిసిన సూర్యగ్రహణం
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన సూర్యగ్రహణం ముగిసింది. నేటి (గురువారం) ఉదయం 8 గంటల 8నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం 11 గంటల 11నిమిషాలకు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సప్తవర్ణాలతో సూర్యుడు వీక్షకులకు కనువిందు చేశాడు. పలుచోట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. అంతరిక్ష ఔత్సాహికులు సూర్యగ్రహాణాన్ని వీక్షించారు. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మూడు గంటలకుపైగా గ్రహణం కొనసాగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్, సౌదీ, సింగపూర్ దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తోంది. సంపూర్ణ గ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్‌గా సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. ఆ సమయంలో చందమామ చుట్టూ సూర్యజ్వాలలు కనిపించనున్నాయి. హైదరాబాద్‌లో ముప్పావు వంతు మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. కోయంబత్తూర్, పాలక్కాడ్, మంగుళూరు, పిళికుల్ల, ఉడిపి ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యగ్రహణ ప్రభావం అంతగా ఉండదు. ఈ ఏడాదికాలంలో ఇది మూడో సూర్యగ్రహణం. తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు సూర్యగ్రహణం ముగియడంతో సంప్రోక్షణ అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను మూసివేశారు. 13 గంటలపాటు మూసివేసిన శ్రీవారి ఆలయ తలుపులు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తెరుచుకోనున్నాయి. ఆలయ సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తుల కోసం శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుంది. అధిక రద్దీ నేపథ్యంలో సర్వదర్శనం మినహా అన్ని దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలనూ పూర్తిగా రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా నేడు తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయాన్ని మూసివేశారు. నిన్నరాత్రి 8 గంటల నుంచి దర్శనాలు నిలిపివేశారు. ఇవాళ ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. 3 గంటల నుంచి వ్రతాలు, దర్శనాలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సైతం అర్చకులు మూసివేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆలయాన్ని అర్చకులు తిరిగి తెరవనున్నారు. సంప్రోక్షణ అనంతరం 3:30 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని మూసిశారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి.. ఈ ఆలయాలు తిరిగి తెరువనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుపతి: సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసి ఉంచుతున్నారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం గురువారం వీఐపీ బ్రేక్ దర్శనాలను (ప్రొటోకాల్ దర్శనాలు కూడా) రద్దుచేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును కూడా బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భవనాన్ని తెరుస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. శ్రీశైల ఆలయం మూత సూర్యగ్రహణం సందర్భంగా శ్రీశైల ఆలయ మహాద్వారాలను బుధవారం రాత్రి 10 గంటలకు మూసివేసినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆలయద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాత సేవ, స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, అనుబంధ ఆలయాలను గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.10 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో తెలిపారు. శుద్ధి అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి 8 గంటలకు మూసివేసినట్లు ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ తెలిపారు. గ్రహణం వీడిన అనంతరం శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించి గురువారం సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుస్తామని చెప్పారు. నేడు శ్రీకాళహస్తిలో గ్రహణకాల అభిషేకాలు శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వరుని ఆలయంలో గురువారం సూర్యగ్రహణం సందర్భంగా ప్రత్యేక గ్రహణకాల అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం తెలిపారు. -
సంపూర్ణ సూర్యగ్రహణం@ 40 ఏళ్లు
సాక్షి, ఆత్మకూరు: గ్రహణాలకు మానవ జీవితంతో ప్రత్యేక సంబంధం ఉంది. సూర్య, చంద్ర గ్రహణాలను దేశంలో విశిష్టంగా భావించడం, వీటి మంచి, చెడులను విశ్లేషించుకోవడం మన దేశంలో అనవాయితీగా సాగుతోంది. శతాబ్ద కాలంలో (100 ఏళ్లు) 5 లేక 6 గ్రహణాలు రావడం పరిపాటి. అయితే ఈ గ్రహణాల్లో సూర్య గ్రహణానికి తొలి నుంచి అధిక ప్రాధాన్యత సాగుతోంది. సూర్య గ్రహణాలకు అటు ఆధ్యాత్మిక వేత్తలు, ఇటు శాస్త్రజ్ఞులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఆది ఉంది. అయితే గురువారం కంకణాకార సూర్య గ్రహణం ఏర్పడనుంది. దీనిని పరిశోధించేందుకు ఇప్పటికే అంతరిక్ష రంగ శాస్త్రవేత్తలు ప్రయోగాలకు సిద్ధమయ్యారు. మన దేశంలో 19వ శతాబ్దంలో (16 ఫిబ్రవరి 1980)లో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణం దాని పరిస్థితులు, దాని ప్రభావం మనుషులు, జంతువులు, పక్షులపైన ఏ మేరకు ప్రభావం చూపింది.. ఇప్పటికీ విశేషంగా చెప్పుకుంటారు. 126 సంవత్సరాల అనంతరం అప్పట్లో (1980లో) సంపూర్ణ సూర్య గ్రహణం మనదేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాల్లో విశేషంగా కనిపిస్తుందన్న శాస్త్రజ్ఞుల అంచనాలతో ఆ ప్రాంతాల్లో వందలాది మంది అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆ రోజుల్లో పరిశోధనలకు వివిధ రకాల కెమెరాలు, పరికరాలతో మొహరించారంటే గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అప్పట్లో సూర్య గ్రహణం సంభవిస్తుందన్న కారణంతో రాష్ట్రంలో పాఠశాలలు, విద్యా సంస్థలకు, ఫ్యాక్టరీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అప్పటి సంపూర్ణ సూర్య గ్రహణం విశేషాలు ఒక్కసారి పరిశీలిస్తే. ప్రాణ భీతితో పరుగులు అప్పట్లో సంపూర్ణ సూర్య గ్రహణం రోజున నాగాల్యాండ్ రాష్ట్రంలోని కోహిమాలో గ్రహణ సమయంలో భూ కంపం రానుందన్న పుకార్లు వెల్లడవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు ప్రాణ భీతితో పరుగులు పెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిలోని అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టినట్లు ఆ నాటి దినపత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. మిట్ట మధ్యాహ్నం అసుర సంధ్య నాటి సంపూర్ణ సూర్య గ్రహణంతో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో దేశంలో చీకట్లు అలముకుని అసుర సంధ్య వేళలా కనిపించింది. ఆ సమయంలో పొలాలకు వెళ్లిన పశువులు సైతం మేత తింటూ మధ్యలోనే ఇళ్లకు మళ్లడం నాటి విశేషం. గ్రహణంతో లభించిన కంటి చూపు సాధారణంగా సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడరాదని శాస్త్రవేత్తలు పలు ముందస్తు జాగ్రత్తలు ప్రకటించారు. ఫిల్మ్‌ల ద్వారా, పారదర్శక అద్దాలకు నల్లటి మసి పూసి వాటి ద్వారా చూడాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే అప్పట్లో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని అప్పటి కడప జిల్లా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అప్పటికే క్యాటరాక్ట్ వల్ల కంటి చూపు కోల్పోయి మదనపడుతూ నేరుగానే గ్రహణ సమయంలో సూర్యుడిని చూశాడు. అనంతరం కొద్ది సేపటికే అతని కంటి చూపు కొద్దిగా మెరుగు పడి సమీపంలోని వస్తువులు స్పష్టంగా కనిపించేలా చూపు దక్కిందని వెల్లడించాడు. ఈ విషయం సైతం అప్పట్లో దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. జంతువులపై ప్రభావం అప్పటి సూర్య గ్రహణం జంతువులు, పక్షులపై విశేష ప్రభావం చూపింది. మధ్యాహ్నం 12:20 నుంచి 3:30 గంటల వరకు ఈ గ్రహణం సంభవించడంతో గ్రహణ సమయంలో పూర్తిగా చీకట్లు అలముకున్నాయి. దీంతో పక్షులు తమ గూళ్లను చేరుకోవడం శాస్త్రజ్ఞులు పరిశీలించారు. కొన్ని జంతువులు గ్రహణ సమయంలో నిద్రకు ఉపక్రమించాయి. గ్రహణం వీడిన అనంతరం జంతువులు పిచ్చి పిచ్చిగా అటూ ఇటూ తిరిగినట్లు, అప్పట్లో కుందేళ్లు, ఎలుకలపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారి పరిశోధనల్లో గ్రహణ సమయంలో జంతువుల నరాలను ‘ఆసిల్లో స్కోప్’ ద్వారా పరిశీలించారు. గ్రహణ అనంతరం పరిశీలించగా వాటి నరాల్లో ఉద్రిక్తత అధికమైందని, దీంతో అవి పిచ్చిపిచ్చిగా అటూ ఇటూ తిరగడం గమనించినట్లు అప్పట్లో శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఆహారం కోసం వెళ్లిన పక్షులు గ్రహణ సమయంలో చీకట్లు పడ్డాయని గ్రహించి మధ్యాహ్న సమయానికే వాటి గూళ్లు చేరుకున్నాయని, అనంతరం 3:30 గంటలకు గ్రహణం వీడి పోవడంతో రెక్కలు అల్లల్లాడిస్తూ దిక్కు తోచని విధంగా ప్రవర్తించాయని శాస్త్రజ్ఞులు అప్పట్లో పేరుకున్నారు. సూర్య చంద్రులు ఒకే సారి అప్పట్లో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణం సమయంలో గ్రహణంలో చిక్కుకున్న సూర్యుడు ఓ వైపు, చీకట్లు అలముకోవడంతో చంద్రుడు మరో వైపు ఒకే సారి ఆకాశంలో దేశ ప్రజలకు కనిపించడం నాటి విశేషం. పలు ప్రాంతాల్లో సూర్య చంద్రులను ఒకే సారి చూసిన ప్రజలు సంబరమాశ్చర్యాలకు గురయ్యారని నాటి వృద్ధులు తెలిపారు. ఏది ఏమైనా సూర్య గ్రహణం గురువారం సంభవించనున్న నేపథ్యంలో చూసేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యక్షంగా చూడరాదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. నేడు ఏర్పడనున్న కంకణాకార సూర్య గ్రహణాన్ని మరి కొద్ది సేపట్లో చూద్దామా మరీ. -
రాశులవారి పై సూర్యగ్రహణ ప్రభావం
-
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం
-
నేటి ఉదయం దైవదర్శనాలుండవు
సాక్షి, హైదరాబాద్: సూర్యగ్రహణం కారణంగా గురువారం ఉదయం తెలుగు రాష్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. ఉదయం 8.07 గంటలకు గ్రహణ స్పర్శ కాలం ప్రారంభం అవుతుండగా, మోక్ష కాలం ఉదయం 11.20 నిమిషాలకు ఉంది. మొత్తం మూడు గంటలకుపైగా గ్రహణ కాలం ఉంటుంది. ఆలయాల శుద్ధి అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత దైవ దర్శనాలకు వీలుగా ఆలయాల తలుపులు తెరుచుకోనున్నాయి. కొన్ని దేవాలయాలను మధ్యాహ్నం 3 గంటలకు తెరవనున్నారు. అన్ని దేవాలయాల్లో సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లోని ఆయా ఆలయాల్లో సంప్రోక్షణ, పుణ్య హవాచనం, మహా నివేదన తదితర సేవల అనంతరం భక్తులను సర్వ దర్శనాలకు అనుమతిస్తారు. -
నేడే సూర్యగ్రహణం
న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గుడ్‌బై కొట్టేస్తూ 2020 కొత్త సంవత్సరానికి స్వాగత ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో సూర్యగ్రహణం సంభవించడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం వస్తుంది. గురువారం నాడు సంభవించే వార్షిక సూర్యగ్రహణం ఈ సారి భారత్‌లో చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. దక్షిణ భారత దేశంలో ఈ సారి సూర్యగ్రహణం అధికంగా కనిపించనుంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ. అయితే ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కాదు. ఆకాశంలో సూర్యుడు ఒక ఉంగరంలా మారే అద్భుత దృశ్యం రింగ్ ఆఫ్ ఫైర్ ఆవిష్కృతం కానుంది. భూమికి చంద్రుడు చాలా దూరంగా ఉండడం వల్ల ఈ సారి పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే ఏర్పడుతోంది. ఎప్పటి నుంచి ఎప్పటివరకు.. ► ఈ సారి సూర్యగ్రహణం భారత్‌లో 3 గంటల 12 నిమిషాల సేపు కొనసాగుతుంది. ► భారత కాలమాన ప్రకారం ఉదయం 8:04గంటలకు ప్రారంభమవుతుంది ► ఉచ్ఛస్థితికి ఉదయం 9:27కి చేరుకుంటుంది. ► ఉదయం 11:05గంటలకు ముగుస్తుంది. భారత్‌లో రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించే ప్రాంతాలు ► ఊటీ, మంగళూరు, కోయంబత్తూర్, శివగంగ, తిరుచిరాపల్లి, కసరాగాడ్ భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఎక్కడెక్కడ? ఢిల్లీ, పుణె, జైపూర్, లక్నో, కాన్పూర్, నాగపూర్, ఇండోర్, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, భోపాల్, విశాఖపట్నం, లూథియానా, ఆగ్రా నేరుగా చూడొద్దు ► కంటితో నేరుగా సూర్యగ్రహణం చూడడం అత్యంత ప్రమాదం. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కంటికి ఎంత మాత్రమూ మంచిది కాదు. ► సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం వల్ల కంటి రెటినాపై ప్రభావం చూపుతుంది. ► నల్ల కళ్లద్దాలు, మార్కెట్లో లభించే ఇతర సోలార్ ఫిల్టర్స్‌తో సూర్యగ్రహణం చూడకూడదు. ► కెమెరా, టెలిస్కోప్, బైనాక్యులర్స్ ఇతర పరికరాలతో చూడొద్దు. ► మార్కెట్లో ప్రత్యేకంగా సూర్యగ్రహణం చూడడానికి తయారు చేసే సోలార్ ఫిల్టర్స్ ద్వారా మాత్రమే చూడాలి. ► వెల్డర్స్ గ్లాస్ నెంబర్ 14 సూర్యగ్రహణం చూడడానికి అత్యుత్తమమైనది. ఇది కంటికి అత్యంత రక్షణ కల్పిస్తుందని మధ్యప్రదేశ్‌లో బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్త దేబిప్రసాద్ దౌరి చెప్పారు. ఏయే దేశాల్లో భారత్, శ్రీలంక, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా, ఖతర్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్ , తూర్పు రష్యా, ఆస్ట్రేలియా -
సూర్యగ్రహణంతో ఆలయాలన్నీ మూసివేత..
సాక్షి, హైదరాబాద్ : డిసెంబర్ 26న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్ని మూసివేయనున్నారు. అనంతరం మరుసటి రోజు భక్తుల దర్శనం కోసం ఆలయ తలుపులు తెరవనున్నారు. తిరుమల : రేపు సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారుల మూసివేయనున్నారు. దాదాపు 13 గంటల పాటుగా తలుపులు మూసివేయనున్నారు. ఈ రోజు రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా మూత పడి.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ది అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనం కోసం అనుమతిస్తారు.. రేపు ఉదయం విఐపి బ్రేక్ దర్శనాలు,(ప్రోటోకాల్ దర్శనాలు) టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా రేపు తిరుప్పావడ, కళ్యాణోత్సవం,ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేశారు. శ్రీకాకుళం : మంగళవారం రాత్రి పూజల అనంతరం అరసవల్లి సూర్యదేవాలయాన్ని మూయనున్నారు. తిరిగి రేపు సాయంత్రం 4 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయ ద్వారాలు తెరుస్తారు. రాజన్న సిరిసిల్ల : గురువారం సూర్యగ్రహణం సందర్భంగా ఈ రోజు రాత్రి 8.11 గంటలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూయనున్నారు. సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 11.20 నిమిషాలకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరుస్తారు. నిర్మల్ : ఈనెల 26న సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా 25వ తేదీ సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి 26వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ద్వారాలను అర్చకులుమూసివేయనున్నారు. తిరిగి 26వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు ఆలయం శుద్ధి, సంప్రోక్షణ , సరస్వతి అమ్మవారి కి అభిషేకం ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనం సేవలను కల్పించనున్నట్టు ఆలయ అధికారులు. ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు : సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల దేవాలయాలు ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 11.30 గంటల వరకు వరకు ఆలయ ధ్వారాలు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట తరువాత ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. నెల్లూరు : రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సేవలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
రేపు యాదాద్రి ఆలయం మూసివేత
సాక్షి, యాదగిరిగుట్ట : పాక్షిక సూర్యగ్రహణం కారణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రినుంచి ఈ నెల 26(గురువారం)వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8.26గంటల నుంచి 10.57గంటల వరకు మోక్షకాలం ఏర్పడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని బుధవారం (నేడు) రాత్రి ఆలయ ద్వారబంధనం చేస్తారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12గంటల తరువాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, మహానివేదన అనంతరం 2గంటలనుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తామని తెలిపారు. సాయంకాలం భక్తుల మొక్కుసేవలు, దర్బార్‌సేవ, అర్చనలు యధావిధిగా ఉంటాయని పేర్కొన్నారు. పాతగుట్ట ఆలయాన్ని సైతం మూసివేస్తామని తెలిపారు. పాక్షిక సూర్యగ్రహణం అనంతరం శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని శుద్ధి చేసి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వ్రతాలు జరిపిస్తామని పేర్కొన్నారు. వాడపల్లిలో.. దామరచర్ల(విుర్యాలగూడ): జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లిలోని దేవాలయాలను ఈ నెల 26న మూసివేయనున్నట్లు వాడపల్లి ఆలయాల మేనేజర్ మృత్యుంజశాస్త్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా గురువారం ఉదయం 7గంటల నుంచి శ్రీ మీనాక్షి ఆగస్తేశ్వరదేవాలయం, శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దేవాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు. -
రెండురోజులు తిరుమల ఆలయం మూసివేత
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం రెండురోజులు మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25, 26వ తేదీల్లో 13 గంటలపాటు ఆయల తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసేస్తారు. డిసెంబరు 26న గురువారం నాడు ఉదయం 8.08 గంటల నుంచి 11.06 వరకు సూర్యగ్రహణం జరగనుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అంటే బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత తలుపులు తెరిచి ఆలయ శుద్ధి చేపడుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు యథావిధిగా భక్తులకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. -
తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
-
మూతపడనున్న తిరుమల, శ్రీశైలం ఆలయాలు
సాక్షి, తిరుమల/శ్రీశైలం: సూర్యగ్రహణం కారణంగా ఈ నెల 26న కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయ మహాద్వారాలను మూసివే యనున్నారు. 26న ఉదయం 8:08 గంటల నుంచి ఉదయం 11:16 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణానికి 6 గం. ముందుగా ఆలయాన్ని మూసివేస్తారు. ఈ లెక్కన 25న రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆల య తలుపులను మూసివేయనున్నారు. 26న మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యా హ్నం 2 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే, శ్రీశైలం ఆలయ మహాద్వారాలను ఈ నెల 26న కొన్ని గంటల పాటు మూసివేయనున్నారు. గ్రహణకాలం ముగిసిన తరువాత అదే రోజు ఉదయం 11:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరవను న్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తారు. నేడు శ్రీవారి ‘ప్రత్యేక’ ప్రవేశ దర్శనం తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఈనెల 17న వయోవృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను అధికారులు జారీ చేస్తారు. అలాగే, ఈనెల 18న 5 ఏళ్లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. -
డిసెంబర్ 25, 26న తిరుమల ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల: సూర్య గ్రహణం కారణంగా డిసెంబర్ 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 26న గురువారం ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ఆలయశుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. భక్తులు గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి పోయా కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. స్వామివారి సర్వ దర్శనానికి 22 గంటలు పడుతోంది. టైం స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. -
గ్లాసెస్ లేకుండానే డేర్ చేసిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికాలో కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డేర్ చేశారు. కళ్లజోడు లేకుండానే ఆయన సూర్యగ్రహణాన్నీ వీక్షించారు. కాగా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని, అలాచూస్తే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుంటారు. అయితే ఆ సలహాను ట్రంప్ ఏమాత్రం పాటించలేదు. శ్వేత సౌధం బాల్కానీ నుంచి ట్రంప్, భార్య మెలానియా సోలార్ ఎక్లిప్స్‌ను తిలకించారు. ఈ సమయంలో ట్రంప్ చిత్రవిచిత్రంగా తన కళ్లు మూస్తూ తెరుస్తూ గ్రహణాన్ని వీక్షించారు. ఇది మీడియా కంటపడింది. రిపోర్టర్లు నేరుగా చూడొద్దని వారించడంతో... అనంతరం కళ్లజోడు ధరించి సూర్యగ్రహణం చూశారు. కాగా భార్య మెలానియాతో పాటు కుమారుడు బారన్ ట్రంప్ కూడా గ్రహణాన్ని వీక్షించారు. అయితే ట్రంప్ కళ్లజోడు లేకుండా సూర్యగ్రహణాన్ని వీక్షించడంపై ట్విట్టర్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సూర్యగ్రహణం అమెరికాలో పశ్చిమ తీరంలో ఒరెగాన్లోని లింకన్ బీచ్‌లో మొదలైన ఈ అద్భుతం 14 రాష్ట్రాల గుండా సాగింది. గ్రహణంతో అమెరికాలో 14 రాష్ట్రాల మీదుగా 70.కి.మీ వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది. ఒరెగాన్ రాష్ట్రంలో మొదలై తూర్పు తీరమైన దక్షిణ కరోలినా రాష్ట్రంలో ముగిసింది. సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం 90 నిమిషాలు కొనసాగింది. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది ఖగోళ శాస్త్రవేత్తలు తరలివచ్చారు. -
సూర్యగ్రహణం మనకు కనిపించదు..
సాక్షి, హైదరాబాద్: సోమవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) వినువీధిలో సంభవించే సూర్యగ్రహణం హైదరాబాద్‌లో కనిపించే అవకాశం లేదని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాత్రి 9.30గంటలకు ఈ గ్రహణం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో నగరవాసులు ఈ గ్రహాణాన్ని వీక్షించే అవకాశం ఉండదని పేర్కొన్నాయి. అమెరికాలో పలు చోట్ల ఈ గ్రహణం వీక్షించే అవకాశం ఉందని వెల్లడించాయి. -
సూర్యగ్రహణంతో భూకంపాలు.. సునామీలు
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 21వ తేదీన ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల భూకంపాలు, సునామీలు, టోర్నడోలు ఏర్పడే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1979 సంవత్సరం తర్వాత ఏర్పడనున్న అతి పెద్ద సూర్యగ్రహణం ఇదేనని వారు చెబుతు న్నారు. ఈ సూర్యగ్రహణం అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో తప్ప భారత్‌లో కనిపించదని తెలిపారు. అమెరికాలో 21న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంటే.. దాదాపు ఆరు గంటలపాటు ఈ గ్రహణం కొనసాగ నుంది. సుదీర్ఘంగా గ్రహణం ఏర్పడటం వల్ల ఉపరి తలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తగ్గుతాయని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా తగ్గినప్పుడు ఆయా ప్రాంతాల్లో టోర్నడోలు, భూకంపాలు, సునామీలకు ఆస్కారం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా తదితర ప్రాంతాల్లో పగటిపూట ఏర్పడటం వల్ల మనదేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుంది. అందువల్ల ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అంతేగాక ఈ సూర్యగ్రహణ ప్రభావం మన దేశంపై ఉండబోదన్నారు. అందువల్ల పుకార్లను నమ్మవద్దని సూచించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్‌లపైనే ఉండే అవకాశముం దన్నారు. ఇలాంటి సుదీర్ఘ సూర్యగ్రహణం మళ్లీ 2,500 సంవత్సరంలోనే ఏర్పడుతుందన్నారు. సోమవారం ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం మనుషులు, జంతువులు, వాతావరణంపై ఎలా ఉంటుందోనని నాసా పరిశోధనలు చేస్తోంద న్నారు. ఇప్పటికే అమెరికాలో సూర్యగ్రహణ ప్రభావంతో టోర్నడోల ప్రభావం మొదలైందని చెప్పారు. -
ఆగస్టు 21న అమెరికాలో సూర్యుడు మాయం
ఆగస్టు 21వ తేదీన అమెరికా అంతటా, మిట్ట మధ్యాహ్నం ఎవరో మింగేసినట్లుగా సూర్యుడు మాయం కానున్నాడు. పోర్ట్లాండ్ నుంచి ఓరెగాన్ మీదుగా, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్ వరకు లైట్లు స్విచాఫ్ చేసినట్లుగా సూర్యుడు మాయమవుతాడు. ఉత్తర అమెరికా నుంచి కూడా సూర్యుడు పాక్షికంగానే కనిపిస్తాడు. దీన్ని గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్ అని వ్యవహరిస్తారు. 99 సంవత్సరాల క్రితం, 1918, జూన్ 8వ తేదీన వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వరకు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. దాదాపు గంటన్నర పాటు ఉండే ఈ సూర్యగ్రహణాన్ని చూడాలంటే.. నాష్విల్లీలోని కాన్సాస్ సిటీ, సెయింట్ లూయీ నగరాలైతే బెస్ట్ అట. అక్కడి నుంచి ఈ గ్రహణం బాగా కనిపించే అవకాశం ఉంది. అరుదుగా సంభవించే ఈ సూర్యగ్రహణాన్ని చూసి ఆనందించేందుకు ఈ నగరాల్లో హోటల్ గదులను అమెరికన్లు ఇప్పటినుంచే బుక్ చేసుకుంటున్నారు. -
ముట్టుకుంటే సూర్యగ్రహణం!
వాషింగ్టన్: సుమారు 38 ఏళ్ల అనంతరం ఈ ఏడాది ఆగస్టు 21న ఖగోళంలో ఓ అద్భుతం చోటుచేసుకోనుంది. చంద్రుడు సూర్యుడికి అడ్డురావడంతో కొన్ని నిమిషాల పాటు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ అద్భుతం కేవలం అమెరికాలో మాత్రమే కనిపించనుంది. అమెరికాలో చోటుచేసుకోనున్న ఈ అద్భుతాన్ని అందరికీ గుర్తిండిపోయేలా చేయాలన్న తలంపుతో అక్కడి పోస్టల్ ఏజెన్సీ వినూత్నమైన పోస్టల్ స్టాంప్‌ను రూపొందించింది. ఈ స్టాంప్‌పై మొదటిచిత్రంగా 2008లో లిబియాలో చోటుచేసుకున్న సూర్యగ్రహణం బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మను తాకగానే చంద్రుడు పూర్తిగా అడ్డు వచ్చి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ స్టాంప్ అమ్మకాలు జూన్ 20 నుంచి ప్రారంభంకానున్నాయి. -
గ్రహణం విడిచిన వేళ...
అల్లిపురం: నగరంలో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించింది. ఉదయం 6 .13 గంటల నుంచి 6. 48 గంటల వరకు 35 నిమిషాల పాటు గ్రహణం ఉంది. గ్రహణ గమనాన్ని వీక్షించేందుకు నగర వాసులు ఉత్సాహం చూపించారు. కొంతమంది ఔత్సాహికులు నల్లటి కళ్లద్దాలు, ఎక్స్‌రే ఫిల్మ్‌లతో గ్రహణాన్ని ఆసాంతం తిలకించారు. తెల్లవారుజాముకే నగరవాసులతో బీచ్ నిండిపోయింది. గ్రహణం వీడిన తరువాత బీచ్‌లో స్నానాలు ఆచరించారు. సూర్య నమస్కారాలు చేసుకుని, పూజలు చేసి వెనుదిరిగారు. -
సూర్యగ్రహణాన్ని చూశారా..
హైదరాబాద్ లో సూర్యగ్రహణం కనిపించిందిలా.. హైదారాబాద్: నేటి సూర్యగ్రహణాన్ని మీరు వీక్షించారా? పాక్షికంగానే కనిపించినప్పటికీ ఇండోనేషియా, మధ్య పసిఫిక్ దీవుల్లోని ప్రజలు మాత్రం బుధవారం పొద్దున్నే నిద్రలేచి సూర్యగ్రహణాన్ని ఎంజాయ్ చేశారు. సూర్యగ్రహణం హైదరాబాద్‌లో ఉదయం 6.29కే ప్రారంభమై.. 6.47కు ముగిసింది. ఇక్కడ పాక్షికంగా గ్రహణం 12 శాతమే కనిపించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం అత్యధికంగా సగం వరకూ సూర్యుడిని చంద్రుడు అడ్డుకున్నాడు. భువనేశ్వర్‌లో 24 శాతం, కోల్‌కతాలో 18.5 శాతం వరకూ గ్రహణం కనిపించింది. ప్రత్యేకమైన కళ్లజోళ్లు ధరించి గ్రహణాన్ని వీక్షిస్తున్న ఇండోనేషియన్ యువతులు -
శ్రీవారికి సుదీర్ఘ విరామం
-
నేడు పాక్షిక సూర్యగ్రహణం
కోల్‌కతా: దేశంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వేకువజామున పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. గ్రహణం.. సుమత్రా, బొర్నియో వంటి ఆసియా ఖండ దీవులతో పాటు మధ్య పసిఫిక్ సముద్ర ప్రాంతంలో సంపూర్ణంగా ఏర్పడనుంది. భారత్‌లో మాత్రం వివిధ ప్రాంతాల్లో 12 నుంచి 18 శాతందాకా ఏర్పడనుంది. ముంబై,ఢిల్లీ సహా పశ్చిమ, వాయవ్య, ఉత్తర భారతప్రాంతాల్లో కనిపించదు. హైదరాబాద్‌లో ఉదయం 6.29కే గ్రహణం ప్రారంభమై.. 6.47కు ముగుస్తుంది. 12 శాతమే కనిపించనుంది. భ అండమాన్ నికోబార్‌లో మాత్రం అత్యధికంగా సగం వరకూ సూర్యుడిని చంద్రుడు అడ్డుకోనున్నాడు. భువనేశ్వర్‌లో 24 శాతం, కోల్‌కతాలో 18.5 శాతం వరకూ గ్రహణం కనిపిస్తుంది. -
ఆలయాల మూసివేత
సూర్యగ్రహణం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి నుంచి మూత సాక్షి నెట్వర్క్: తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మంగళవారం రాత్రి నుంచి మూసివేశారు. బుధవారం ఉదయం 5.47 నుంచి 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో అటు తిరుమల శ్రీవారి ఆలయం, బెజవాడ కనకదుర్గ, అన్నవరం సత్యదేవుని ఆలయాలతోపాటు ఇటు తెలంగాణలోని భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ సహా పలు ప్రముఖ ఆలయాల తలుపులను మంగళవారం రాత్రి మూసివేశారు. శుద్ధి, సంప్రోక్షణ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇలాఉండగా.. నిత్యం గంట విరామం కూడా లేని తిరుమలేశునికి సూర్యగ్రహణం వల్ల సుమారు 13 గంటల పాటు విరామం లభించింది. ఆలయ నిబంధనల ప్రకారం గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయాన్ని, నిత్యాన్నప్రసాద కేంద్రాన్ని మూసివేస్తారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి 8.30కు టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆధ్వర్యంలో ఆలయ మహద్వారం మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి 11 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో, జేఈవో వెల్లడించారు. -
ఆలయాల మూసివేత
సూర్యగ్రహణం సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలు మంగళవారం రాత్రి మూసి వేశారు. తిరుమలలోని వేంకటేశ్వరస్వామితోపాటు తిరుపతిలోని పలు స్థానిక ఆలయాలు, కాణిపాకం, నారాయణవనం, తిరుచానూరు ఆలయాలు కూడా మూసి వేశారు. ఈ ఆలయాలన్నింటినీ బుధవారం ఉదయం పది గంటల తరువాత తెరవనున్నారు. తిరుచానూరు: సూర్యగ్రహణం సందర్భంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం రాత్రి 8.30 గంటలకు మూసి వేశారు. తిరిగి బుధవారం ఉదయం సూర్యగ్రహ ణం అనంతరం 10 గంటలకు ఆలయ తలుపులు తెరచి, శుద్ధి, పుణ్యావచనం నిర్వహించనున్నారు. 10.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని నిద్ర మేల్కొల్పి, 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సహస్రనామ, నిత్యార్చన, 12 నుంచి 1 గంట వరకు మొదటి గంట(నైవేద్యం) సమర్పిస్తారు. అనంతరం అమ్మవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు. అలాగే యోగిమల్లవరంలోని శ్రీపరాశరేశ్వరస్వామి ఆలయం కూడా మూసి వేశారు. బుధవారం ఉదయం 10 గంట లకు తెరిచి స్వామి వారికి నిత్య కైంకర్యాలు, అభిషేక పూజల ను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎం.రామకృష్ణ,ప్రధానార్చకులు మూర్తి గురుకుల్ తెలిపారు. కాణిపాక ఆలయం ఐరాల: సూర్యగ్రహణం సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ప్రధాన ద్వారాలను అధికారులు మూసివేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు దేవస్థాన పరిధిలో అనుబంధ ఆలయాలైన వరదరాజ స్వామి, మరగదాంబికా సమేత మణికంఠేశ్వరస్వామి ఆలయాలను మూసివేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యావహచనం, గ్రహణ శాంతి, అభిషేకాలను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు ఈఓ పూర్ణచంద్రరావు తెలిపారు. వేదనారాయణ స్వామి ఆలయాలు నాగలాపురం : సూర్యగ్రహణం నేపథ్యంలో బుధవారం ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు నాగలాపురంలోని వేదనారాయుణస్వామి ఆల యుం, సురుటపల్లి పళ్లికొండేశ్వరస్వామి ఆలయం మూసి వేయనున్నారు. సూర్య గ్రహణం అనం తరం 10 గంటలకు పైన ఆలయు శుద్ధి, సంప్రోక్షణ అనంతరం నిత్య కైంకర్యాలు నిర్వహించి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కల్యాణ వెంకన్న ఆలయం నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం ముసివేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యావచనం తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. -
వెళ్లొస్తం రాజన్నా..
ఎములాడ రాజన్న సన్నిధిలో వైభవంగా జరిగిన మహాశివరాత్రి జాతర ముగిసింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 6 నుంచి 8 వరకు జాతరోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 4లక్షల మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి రూ.87 లక్షల ఆదాయం సమకూరింది. సూర్యగ్రహణంతో మంగళవారం సాయంత్రం ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తులు వచ్చే ఏడాదికి మళ్లొస్తం రాజన్నా అంటూ సెలవు తీసుకున్నారు. -వేములవాడ * ముగిసిన మహాశివరాత్రి వేడుకలు * జాతర సక్సెస్‌తో రాజన్నకు పూజలు * రూ.87 లక్షల ఆదాయం * కొనసాగతున్న భక్తుల సందడి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏటా అత్యంత వైభవంగా జరుపుకునే మహాశివరాత్రి వేడుకలు మంగళవారం ముగిశాయి. మూడు రోజుల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో పురవీధులన్నీ సందడిగా మారారుు. భక్తుల ద్వారా మూడు రోజుల్లో స్వామి వారికి రూ.87 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు ఆలయ అకౌంట్స్ ఏఈవో ఉమారాణి తెలిపారు. హుండీ ఆదాయం లెక్కించాల్సి ఉంది. జాతర భక్తుల సౌకర్యాల కోసం రూ.1.10 కోట్లు ఖర్చు చేయగా రూ.87 లక్షలు మాత్రమే రావడంతో ఖర్చు ఎక్కువై... ఆదాయం తక్కువైందని ఆలయ అధికారులు అసంతృప్తిలో ఉన్నారు. ఈనెల 6 నుంచి ప్రారంభమైన జాతరకు నాలుగు లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆర్టీసీకి అంతంత మాత్రమే... మహాశివరాత్రి జాతర ఉత్సవాలతో ఎంతో ఆదాయం వస్తుందని ఆశతో ఎదురుచూసిన ఆర్టీసీ అధికారులకు నిరాశే మిగిలింది. ప్రతినిత్యం వచ్చే ఆదాయంతో సమానంగానే ఆదాయం వచ్చింది తప్ప జాతర ఉత్సవాల ప్రత్యేకం ఏంకనిపించలేదని డీఎం శ్రీనాథ్ తెలిపారు. ఒకే వైపునుంచి భక్తుల రద్దీ వచ్చింది తప్ప.. మరో ప్రాంతం వాళ్లు తక్కువగా వచ్చారని, సమ్మక్క భక్తుల ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కనిపించిందని చెప్పారు. వ్యాపారం కూడా అంతంత మాత్రమే కొనసాగిందని వ్యాపారులూ అసంతృప్తిగా ఉన్నారు. బందోబస్తు నుంచి పోలీసులు రిటర్న్ జాతర బందోబస్తులో పాల్గొనేందుకు వేములవాడకు వచ్చిన పోలీసులు మంగళవారం ఉదయం నుంచే వెనుదిరిగారు. జాతర బందోబస్తు కోసం శనివారమే వేములవాడకు చేరుకున్న 1074 మంది పోలీసులు ఆది, సోమవారాలు షిఫ్ట్ పద్ధతిలో విధులు నిర్వహించారు. భక్తుల రద్దీ కాస్త తగ్గడంతో సిరిసిల్ల డివిజన్ పోలీసులు మినహా జిల్లాలోని మిగతా ప్రాంతాలకు చెందిన పోలీసులు తిప్పి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. అధికారుల్లో సంతోషం జాతర సక్సెస్ కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో సంతోషం నెలకొంది. ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఇతర అధికారులు, అర్చకులు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర వర్గాల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కు చెల్లించుకున్నారు. -
శ్రీవారికి సుదీర్ఘ విరామం
తిరుమల: సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం రాత్రి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం 5.47 గంటల నుంచి ఉదయం 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనుంది. ఆలయ నిబంధనల ప్రకారం గ్రహణ సమయానికి సుమారు 6 గంటల ముందే ఆలయాన్ని మూసివేస్తారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి 7.40 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఏకాంత సేవ వైదికంగా పూర్తి చేశారు. ఆ తర్వాత బంగారువాకిళ్లు, వెండివాకిలి ద్వారాలను టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవోతో పాటు అధికారులు, ఆలయ పూజారులు మహద్వారాన్ని మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 10 గంటకు తిరిగి తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సుప్రభాతం ఏకాంతంగా నిర్వహించిన తర్వాత ఉదయం 11 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. నిత్యం గంట కూడా విరామం లేని తిరుమలేశునికి సూర్యగ్రహణం వల్ల సుమారు 13 గంటలపాటు విరామం లభించింది. -
సూర్యగ్రహణం కారణంగా ఆలయం మూసివేత
తిరుచానూరు (చిత్తూరు జిల్లా) : సూర్యగ్రహణం కారణంగా చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం రాత్రి 9-30 గంటల నుండి బుధవారం ఉదయం 10 గంటల వరకూ మూసివేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. -
నేటి సాయంత్రం నుంచి పలు దేవాలయాలు మూసివేత
హైదరాబాద్ : సూర్యగ్రహణం బుధవారం ఉదయం సంభవించనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలను మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు ఆయా దేవాలయాలకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నేటి రాత్రి 8.30 గంటల నుంచి రేపు ఉదయం 10.00 గంటల వరకు మూసివేయనున్నారు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయాన్ని రాత్రి 7.00 గంటల నుంచి రేపు ఉదయం 12.00 గంటలకు మూసివేస్తారు. అలాగే తెలంగాణలోని వేములవాడ రాజన్న దేవాలయాన్ని కూడా ఈ రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రేపు ఉదయం 6.00 గంటల వరకు మూసివేస్తారు. యాదగిరిగుట్టలోని యాదాద్రి దేవాలయాన్ని రాత్రి 8.30 గంటల నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆలయం మూసివేస్తారు. ఆదిలాబాద్ జిల్లా బాసర దేవాలయం కూడా నేటి రాత్రి 7.00 గంటల నుంచి రేపు ఉదయం 7.30 గంటల వరకు మూసివేస్తారు. -
సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాల మూత
సాక్షి, తిరుమల/ విజయవాడ/ సింహాచలం: సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలను మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మూసివేయనున్నారు. ఈ నెల 9న ఉదయం 5.47 నుంచి ఉదయం 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనుంది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి తదితర ఆలయాల తలుపులు మూసివేయనున్నారు. శుద్ధి, సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాగా, తిరుమలలో బుధవారం నిర్వహించాల్సిన సహస్రకళశాభిషేకం సేవను రద్దు చేశారు. ఇతర సేవల్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే సింహాచలం అప్పన్న ఆలయంలో బుధవారం నిత్యకల్యాణం రద్దు చేసినట్లు ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. -
రేపు రాత్రి నుంచి దుర్గమ్మ దర్శనం రద్దు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా మంగళవారం రాత్రి నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం నిలిపివేయనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. సాయంత్రం పూజా కార్యక్రమాల అనంతరం రాత్రి 7.30 గంటలకు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయాలతో పాటు ఉపాలయాల తలుపులు మూసివేస్తారని తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, మహా నివేదన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. -
8వ తేదీ రాత్రి శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల : మార్చి 19 నుంచి 23వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో డి. సాంబశివరావు మాట్లాడుతూ... మార్చి 9వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో 8వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 10.00 గంటల వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయం మూసివేస్తామని తెలిపారు. తిరుమలలోని కళ్యాణ వేదికలో వివాహం చేసుకున్న వారికి ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వివాహానికి అవసరమైనవన్నీ టీటీడీ సమకూరుస్తుందన్నారు. అలాగే వెయ్యి కాళ్ల మండపం పునర్ నిర్మాణానికి టెండర్లు మార్చి 11వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ నెలకు గాను 50 వేల ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేశారు. -
మార్చి 9న సూర్యగ్రహణం
12 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత సాక్షి, తిరుమల: వచ్చేనెల... మార్చి 9 వ తేదీ ఉదయం 5.47 నుంచి ఉదయం 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనుంది. ఈసందర్భంగా శ్రీవారి ఆలయం సుమారు 12 గంటలపాటు మూసివేయనున్నారు. మార్చి 8న మంగళవారం రాత్రి 8.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మార్చి 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈసందర్భంగా మార్చి 9వ తేదీన సహస్రకలశాభిషేకం రద్దుచేశారు. ఇతర సేవల్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. -
హాలీవుడ్లో...
తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటిస్తూ జాతీయ స్థాయి నటుడిగా అందరికీ సుపరిచితుడైన నాజర్ మళ్లీ ఓ హాలీవుడ్ చిత్రంలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన ‘ఫెయిర్ గేమ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు. ‘సోలార్ ఎక్లిప్స్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ హాలీవుడ్ చిత్రం భారత స్వాతంత్య్ర పోరాట కాలం నేపథ్యంలో సాగుతుందట. అశోక్ అనే పోలీసాఫీసర్‌గా ఈ చిత్రంలో నటించనున్నానని నాజర్ తెలిపారు.