అమెరికాలో సూర్య గ్రహణం సందడి | Sakshi
Sakshi News home page

Solar Eclipse: అమెరికాలో సూర్య గ్రహణం సందడి

Published Sun, Apr 7 2024 12:28 PM

Solar Eclipse Promotions how to Watch it USA - Sakshi

ఉత్తర అమెరికా ఆకాశంలో సోమవారం (ఏప్రిల్‌ 8) నాడు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అక్కడి జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. ఇది కెనడా నుండి నిష్క్రమించే ముందు టెక్సాస్‌తో పాటు 14 ఇతర అమెరికా రాష్ట్రాలను దాటనుంది.

ఇది 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని పలు మార్కెట్లతో పాటు టూరిజం విభాగం గ్రహణ వీక్షకుల కోసం ప్రత్యేక ఏ‍ర్పాట్లు చేస్తున్నాయి. 

సౌత్‌వెస్ట్, డెల్టా వంటి విమానయాన సంస్థలు సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి విమాన మార్గాలను ప్రకటించాయి. అలాగే పలు మార్కెట్లలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ అమ్మకానికి అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ రంగురంగుల టీ షర్టులు, ఖగోళ సావనీర్‌లు విక్రయిస్తున్నారు.

2017లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు పలు కంపెనీలు దానిని ఆదాయమార్గంగా మార్చుకున్నాయి. వాటిలో క్రిస్పీ క్రీమ్ కూడా ఉంది. షార్లెట్, నార్త్ కరోలినాకు చెందిన ఈ సంస్థ 2017 సూర్య గ్రహణం సందర్భంగా పరిమిత-ఎడిషన్ చాక్లెట్ గ్లేజ్డ్ డోనట్‌లను విడుదల చేసింది.  

Advertisement
Advertisement