న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేజ్రీవాల్‌పై తొలి ఛార్జ్‌షీట్ రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ కేసులో కేజ్రీవాల్‌ను తొలిసారి నిందితుడిగా పేర్కొననున్నట్లు తెలిపాయి. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ‘కీలక కుట్రదారు’గా (kingpin)పేర్కొంటూ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు శుక్రవారం కోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం.
కాగా లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment