TSRTC
-
మహాశివరాత్రికి 3,000 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్ర ముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు లు నడపనుంది. 43 శైవ క్షేత్రాలకు 3,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 24వ తేదీ నుంచి 28 వరకు ఈ ప్రత్యే క బస్సులు అందుబాటులో ఉంటా యి. ప్రధానంగా శ్రీశైల క్షేత్రానికి 800, వేములవాడకు 714, ఏడుపా యల జాతరకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సుల చొప్పున నడుపనున్నారు.అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటా యి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి. ఈ స్పె షల్ బస్సుల్లో 50% అదనపు చార్జీలను వసూలు చేస్తారు. రెగ్యులర్ సర్విస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. శివరాత్రి ఆపరేషన్స్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచితమే..: గత ఏడాది శివరాత్రికన్నా ఈసారి 809 బస్సులను అదనంగా నడపనున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని చెప్పారు. ముందస్తు టికెట్ల బుకింగ్‌ను www.tgsrtcbus.in వెబ్సైట్లో చేసుకోవచ్చు. సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–6944 0000, 040–23450033ను సంప్రదించాలని అధికారులు సూచించారు. -
ఆర్టీసీలో సమ్మె నోటీసు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో ఆర్టీసీ(RTC) యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీలోని కొన్ని సంఘాలు, మరికొన్ని సంఘాల్లోని చీలిక వర్గాలు సోమవారం సాయంత్రం సమ్మె నోటీసు జారీ చేశాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండటంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్‌ను కలిసి నోటీసు, డిమాండ్ల జాబితాను అందజేశాయి. ఆర్టీసీ యాజమాన్యం స్పందించని పక్షంలో ఫిబ్రవరి 9 నుంచి లేదా, ఆ తర్వాత ప్రకటించే తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ థామస్‌రెడ్డి వర్గం, ఎన్ఎంయూ మౌలానా వర్గం, బీకేయూ, బీడబ్ల్యూయూ, కార్మిక పరిషత్‌లు సమ్మె నోటీసు జారీ చేశాయి. 21 డిమాండ్లతో.. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ జరగక ఉన్న సిబ్బందిపై అదనపు భారం, ఆర్టీసీలో అద్దె బస్సులు పెరిగి పోస్టుల సంఖ్య తగ్గిపోతుండటం, అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వాహకులకు డిపోలు అప్పగించే యోచన, ఆర్టీసీ సొంతానికి వాడుకున్న సహకార పరపతి సంఘం, పీఎఫ్ ట్రస్టు నిధులను తిరిగి చెల్లించకపోవటం... ఇలా మొత్తం 21 డిమాండ్లను సంఘాలు ఆర్టీసీ అధికారుల ముందుంచాయి. కార్మికుల్లో అయోమయం.. సమ్మె విషయంలో ఆర్టీసీలోని సంఘాలు ఐక్యంగా లేకపోవటం ఇప్పుడు కార్మికుల్లో అయోమయానికి కారణమైంది. ⇒ గతంలో ప్రధాన సంఘాలుగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ముఖ్యనేత రాజిరెడ్డి వైదొలిగి కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఎస్డబ్ల్యూయూలో ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ మరో ప్రధాన సంఘం టీఎంయూలో అశ్వత్థామరెడ్డి, తిరుపతి వర్గం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ ఎన్‌ఎంయూలో నరేందర్ వర్గం సమ్మెను వ్యతిరేకిస్తోంది. మిగతా సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ⇒ ఇప్పుడు సమ్మెకు దూరంగా ఉన్న ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లు ఈనెల 24, 25 తేదీల్లో డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ⇒ ప్రస్తుతం సమ్మెకు దూరంగా ఉన్న సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యలను కలుస్తూ డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోయిన సంఘాలు, వాటి చీలిక వర్గాల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో కార్మికుల్లో కూడా చీలిక ఏర్పడుతోంది. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె మొదలు ‘చాలాకాలంగా ఉన్న సమస్యల విషయంలో యాజమాన్యం తీరుతో విసిగిపోయి సమ్మె నోటీసు ఇచ్చాం. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె ప్రారంభిస్తాం. ఇప్పటికే సగం డిపోల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. మిగతా డిపోల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాం’అని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. -
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్
-
TGSRTC: ఆర్టీసీలో సమ్మె సైరన్.. 21 డిమాండ్లతో నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు సోమవారం ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు.కాగా, నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో మరోసారి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు.. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ సందర్భంగా కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఇక, 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. -
TG: ఆర్టీసీలో సమ్మె సైరన్.. నేడు యాజమాన్యానికి నోటీసులు
సాక్షి,హైదరాబాద్:నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. తాజాగా ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ (Tgsrtc) యాజమాన్యానికి సమ్మె నోటీసు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు సోమవారం(జనవరి27) ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు. కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఇదీ చదవండి: నేడు ఇండోర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం -
‘ప్రైవేటు’ చేతికి ఆర్టీసీ డిపోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పెద్ద ఆర్టీసీ డిపోలు ప్రైవేటు సంస్థ పరిధిలోకి వెళ్లిపోతున్నాయి. అద్దె బస్సుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు కోతపడే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆర్టీసీ ఉద్యోగులలో కలకలం రేపుతున్నాయి. ఇది ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడమేమీ కాకపోయినా.. ప్రైవేటీకరణకు దారితీసినట్టేననే ఆందోళనకు దారితీస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంలో భాగంగా.. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించటం, డీజిల్ భారాన్ని తగ్గించుకోవటం లక్ష్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటోంది. క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒలెక్ట్రా సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ నుంచి తీసుకుంటోంది. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నరపైనే కావడంతో వాటిని కొనటం తలకుమించిన వ్యవహారమని భావిస్తున్న ఆర్టీసీ.. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో వాటిని అద్దెకు తీసుకుంటోంది. ఆ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి సమకూరిస్తే.. ఈ బస్సులు తిరిగిన దూరం ఆధారంగా కిలోమీటరుకు ఇంత అని నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ అద్దెగా చెల్లిస్తుంది. బస్సు నిర్వహణ, డ్రైవరు, మెకానిక్ సిబ్బందిని ఆ ప్రైవేటు సంస్థనే సమకూర్చుకుంటుంది. కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ తరఫున ఉంటారు. ఇలా జేబీఎం సంస్థ 500 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అద్దెకిస్తుంది. అందులో ఇప్పటికే దాదాపు 150 బస్సులను సరఫరా చేసింది. మిగతావి విడతలవారీగా రానున్నాయి. ఈ బస్సులను ప్రస్తుతానికి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాలకు కేటాయించారు. త్వరలో హైదరాబాద్‌లోని ఓ డిపోకు అందనున్నాయి. తర్వాత నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాలకు కూడా సమకూర్చుతారు. ఇంతకాలం ఎలక్ట్రిక్ బస్సులు అనగానే ఏసీ బస్సులే ఉండేవి. ఇప్పుడీ సంస్థ నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తోంది. వాటిని సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్, ఎక్స్‌ప్రెస్ కేటగిరీల్లో తిప్పుతున్నారు. ఈ బస్సుల కోసం డిపోలనే అప్పగిస్తూ.. అయితే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్ డిపోలను సదరు జేబీఎం సంస్థకే అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్–2 డిపోకు 75 ఎలక్ట్రిక్ బస్సులు అందాయి. మరో 40 బస్సులు రానున్నాయి. హైదరాబాద్‌లోని హైదరాబాద్–1 డిపోకు 75 బస్సులు సమకూరనున్నాయి. ఈ రెండు డిపోల నుంచి ఆర్టీసీ సొంత బస్సులను ఇతర డిపోలకు మార్చేసి... ఆ రెండు డిపోలను పూర్తిగా జేబీఎం సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే వరంగల్ డిపో నుంచి సొంత బస్సులను ఇతర డిపోలకు తరలించేశారు. హైదరాబాద్–1 డిపో బస్సులను హైదరాబాద్–3 డిపోకు బదిలీ చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరిగితే వాటిని.. భవిష్యత్తులో మిగతా బస్సులు సరఫరా అయ్యాక ఆయా డిపోలను కూడా ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారన్న ప్రచారం ఆర్టీసీ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది. సిబ్బందిని కూడా తరలించేస్తూ... ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకిస్తున్న సంస్థ ఆ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు, వాటి మరమ్మతులు చేపట్టేందుకు మెకానిక్ సిబ్బందిని సొంతంగానే సమకూర్చుకుంటుంది. ఆ డిపోల్లో ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది అవసరం ఉండదు. వీరి వ్యవహారాలు చూసే డిపో అధికారులకూ పని ఉండదు. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ పక్షాన పనిచేస్తారు. కేవలం వీరి వ్యవహారాలు చూసేందుకు ఒకరిద్దరు ఆర్టీసీ సిబ్బంది, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మాత్రమే డిపోలలో ఉంటారు. డిపోలో కార్యకలాపాలన్నీ ప్రైవేటు సంస్థ అధీనంలోనే నడుస్తాయి. బస్సుల చార్జింగ్ కోసం ఆ సంస్థనే చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంటుంది. విద్యుత్ సరఫరా వ్యవస్థను మాత్రం ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది.ఇకపై నియామకాలు లేనట్టే! ప్రస్తుతం ఆరీ్టసీలో దాదాపు 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం గతంలో ప్రక్రియ ప్రారంభించినా నిలిచిపోయింది. అయితే ఆర్టీసీలోకి అద్దె బస్సులు భారీగా వస్తుండటం, వాటి నిర్వహణకు ప్రైవేటు సంస్థల సిబ్బందే ఉంటుండటంతో... ఆర్టీసీలో ఇకపై నియామకాలు ఉండకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ప్రైవేటీకరణకు దారితీసినట్టేనని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు.హైదరాబాద్‌లో డిపోలన్నీ ప్రైవేటు చేతికే!హైదరాబాద్ నగరంలో తిప్పుతున్న ఆర్టీసీ డీజిల్ బస్సులను వెలుపలికి తరలించి.. వాటి స్థానంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద కేంద్రానికి దరఖాస్తు చేసింది. ఆ బస్సులను కూడా జీసీసీ పద్ధతిలోనే నడుపుతారు. అంటే ఆ బస్సులు చేరే డిపోలన్నీ ప్రైవేటు సంస్థ అ«దీనంలోకి వెళతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని డిపోలు ప్రైవేటు నిర్వహణలోకి చేరుతాయనే అభిప్రాయం వినిపిస్తోంది.వేల మంది డ్రైవర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం!హైదరాబాద్‌లో మొత్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుండటం, అవి అద్దె బస్సులు కానుండటంతో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 6,000 మంది ఆర్టీసీ డ్రైవర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. నగరంలో డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన కొద్దీ.. ఆర్టీసీ సొంత బస్సులతోపాటు డ్రైవర్లను కూడా ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల అవసరానికి మించి డ్రైవర్లు ఉంటే.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) దిశగా ఒత్తిడి చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్య రహిత, పర్యావరణహిత ప్రజారవాణా సదుపాయం ఆహా్వనించదగ్గదే అయినా.. ఆర్టీసీ సిబ్బంది భవిష్యత్తును దెబ్బతీయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వస్తోంది. ‘‘ప్రైవేట్ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీని సృష్టించుకోవడం కోసం ఆర్టీసీలను బలితీసుకుంటున్నాయి. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టదాయకం’’అని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి పేర్కొన్నారు. -
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు
హనుమకొండ అర్బన్/నయీంనగర్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా మని రెవెన్యూ, గృహ ని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేస్తే కూడా ఓర్వలేక ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. సోమవారం హనుమకొండ కుడా మైదానంలో వరంగల్ రీజియన్‌కు కేటాయించిన టీజీఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లతో కలిసి పొంగులేటి ప్రారంభించారు. అదేవిధంగా హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ, గత ప్ర భుత్వం కుట్రపూరితంగా ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చూసిందని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో పరిపుష్టం చేసి, కార్మికులకు భద్రత కల్పించామన్నారు. ధర ణిని ప్రక్షాళన చేసి కొత్త చట్టం తీసుకువచ్చామని, దీనిద్వారా తెలంగాణలో ఉన్న 2 కోట్ల 77లక్షల ఎకరాల ఆసాములకు పూర్తి భద్రత కలి్పస్తున్నామని పే ర్కొన్నారు. గత ప్రభుత్వం కనీసం లక్ష ఇళ్లు కూడా నిర్మించలేదని, తమ ప్ర భుత్వంలో మొదటి విడతగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. మిగతా నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు.అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులు ఉంటే మండల కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఆంబోతులను పంపుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు గతంలో తొంటి ఇరుగుడు నిజమా అబద్ధమా తెలియదు.. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి ఏమైందని ఆయన ప్రశ్నించారు. సాగు చేసే ప్రతీ భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. -
TSRTC: సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు
సాక్షి,హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం టీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉండగా.. ఈ సంక్రాంతికి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి ఉంచనున్నట్లు వెల్లడించింది. జనవరి 9 నుంచి 15 వరకు సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. -
ఇదేం దా‘రుణం’?
ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు కుమారుడు జేఈఈలో ఆలిండియా స్థాయిలో 265 ర్యాంకు సాధించాడు. ఐఐటీ ఫీజు చెల్లించేందుకు సీసీఎస్ నిధి నుంచి లోన్ కోసం వెంకటేశ్వర్లు దరఖాస్తు చేశాడు. నిధులు లేక సకాలంలో రుణం ఇవ్వలేమని వారు చెప్పడంతో ఇల్లు తాకట్టు పెట్టి ప్రైవేటుగా రూ.10 లక్షలు అప్పు చేశాడు. ఆ వడ్డీ భారంతో సతమతమవుతున్నాడు.కానికల్ సెక్షన్లో పనిచేస్తున్న జుబేర్‌కు కొన్నిరోజులుగా ఒక కాలు, చేతికి స్పర్శ సరిగా ఉండటం లేదు. ఆస్పత్రికి వెళితే త్వరగా శస్త్రచికిత్స చేయాలని, లేకుంటే పక్షవాతానికి గురికావొచ్చని హెచ్చరించారు. ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే.. తొలుత ట్రీట్మెంట్ ఇస్తామని, తగ్గకుంటే ప్రైవేటుకు రిఫర్ చేస్తామన్నారు. దీనితో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం రుణం కావాలని సీసీఎస్‌లో దరఖాస్తు చేశారు. నిధులు లేవనడంతో బయట అధిక వడ్డీకి అప్పు చేయాల్సి వచ్చింది.సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోని సహకార పరపతి సంఘం (సీసీఎస్) దివాలా దశకు చేరుకోవటంతో సంస్థలోని చిరుద్యోగుల జీవితాలు ఆగమాగం అవుతున్నాయి. పిల్లల చదువుల కోసం కొందరు, పెళ్లిళ్ల కోసం మరికొందరు, అనారోగ్య సమస్యలతో ఇంకొందరు, ఇతర కుటుంబ అవసరాల కోసం మరెందరో.. లోన్ కోసం సీసీఎస్‌లో దరఖాస్తు చేస్తున్నారు. అక్కడ నిధులు లేవని తేల్చిచెప్తుండటంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఫైనాన్షియర్ల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. సిబిల్ స్కోర్(Cibil Score) సరిగా లేదన్న కారణంతో బ్యాంకులు రుణాలకు నిరాకరిస్తుండంతో ప్రైవేటు అప్పులు చేయక తప్పడం లేదు.వచ్చే జీతంలో ఇంటి ఖర్చులు పోగా మిగతా సొమ్ము వడ్డీలు కట్టేందుకు కూడా సరిపోని దుస్థితి తలెత్తుతోందని, కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు వాపోతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు రూ.లక్షకు నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతినెలా జీతంలో 7% కోత పెట్టుకుని నిధి సమకూర్చుకుంటే.. తమ నిధి నుంచి తమకే రుణాలు అందక ఇలా అప్పుల బారినపడటం దారుణమని పేర్కొంటున్నారు. డ్రైవర్ కొండారెడ్డి కుమార్తె పెళ్లి పెట్టుకున్నాడు. రూ.9 లక్షల లోన్ కోసం సీసీఎస్‌కు దరఖాస్తు చేశాడు. ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చేవరకు లోన్ దొరికే పరిస్థితి లేదని, తొలుత రిటైర్మెంట్ కేసులను పరిష్కరించాకే లోన్ చెల్లింపులు ఉంటాయన్న సమాధానం వచ్చింది. అప్పటిదాకా ఎదురు చూసే పరిస్థితి లేక, డ్రైవర్ కావటంతో వెంటనే అప్పు పుట్టక తిరిగి తిరిగి చివరకు అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది.జాతీయ స్థాయి గుర్తింపు నుంచి.. ఆర్టీసీలోని (TSRTC) సహకార పరపతి సంఘానికి ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో ప్రతినెలా 7 శాతం మొత్తం దీనికి జమ చేయటం ద్వారా నిధి ఏర్పడుతుంది. అందులోంచే ఉద్యోగులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. దాదాపు రూ.3 వేల కోట్ల నిధితో వేల సంఖ్యలో ఉద్యోగులకు రుణాలు ఇస్తూ, కార్మికులను ఆదుకునే సంస్థగా గిన్నిస్ బుక్ రికార్డుతోపాటు పలు పురస్కారాలు దక్కించుకుంది. కానీ ఆర్టీసీ కొన్నేళ్లుగా ఈ నిధిని సొంతానికి వాడేసుకుని ఖాళీ చేసింది. ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.900 కోట్లకుపైగా ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది.చదవండి: ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై రెవెన్యూ శాఖలో గుబులుసీసీఎస్లో నిధులు లేకపోవడంతో... ఆర్టీసీ ఉద్యోగులకు లోన్లు అందని పరిస్థితి నెలకొంది. సీసీఎస్ (CCS) గతంలో ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించడంతో బకాయిలు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఈ మేరకు గత జూన్‌లో సీసీఎస్‌కు రూ.200 కోట్లు అందాయి. మరో రూ.150 కోట్లు బ్యాంకు నుంచి రుణం తెచ్చింది. ఈ మొత్తం నుంచి ఉద్యోగులకు లోన్లు ఇచ్చింది. ఇలా జూన్ వరకు పేరుకుపోయిన దరఖాస్తుదారులకు ఊరట లభించింది. ఆ తర్వాత బకాయిల చెల్లింపు లేకపోవటంతో లోన్ దరఖాస్తులు పేరుకుపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం 7 వేల మంది రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో అవసరాల కోసం.. ప్రస్తుతం ఆర్టీసీలో 40 వేల మంది ఉద్యోగులుంటే... అందులో దాదాపు సగం మంది వరకు వివిధ అవసరాల కోసం సీసీఎస్ రుణాలపై ఆధారపడుతుంటారు. దాన్ని చెల్లించి, మళ్లీ అత్యవసరం పడితే రుణం తీసుకుంటూ ఉంటారు. విద్యా సంవత్సరం ముగియనున్నందున ఫైనల్ సెమిస్టర్ ఫీజులు చెల్లించాల్సి ఉంది. దీంతో చాలా మంది ఉద్యోగులు పిల్లల ఫీజుల కోసం అత్యవసర లోన్లు కావాలని దరఖాస్తులు సమర్పించారు. పిల్లల పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులు, ఇంటి రిపేర్లు.. ఇలా మరెన్నో అవసరాల కోసం దరఖాస్తు చేసినవారు ఉన్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఇంతగా ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మళ్లీ కోర్టు తలుపుతట్టే ఆలోచన ఉద్యోగుల ఒత్తిడి భరించలేక బకాయిలు చెల్లించాలంటూ కొన్నిరోజులుగా సీసీఎస్ యంత్రాంగం ఆర్టీసీపై ఒత్తిడి పెంచుతోంది. కనీసం బ్యాంకు నుంచి రుణం పొందేందుకు పూచీకత్తు అయినా ఇవ్వాలని కోరుతోంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి సానుకూలత రావటం లేదు. సీసీఎస్ బకాయిలు చెల్లించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించి ఉన్నందున... మళ్లీ హైకోర్టు తలుపుతట్టి, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయాలని సీసీఎస్ యంత్రాంగం భావిస్తున్నట్టు తెలిసింది. -
‘చిల్లర’ పొరపాట్లు.. పెద్ద శిక్షలు!
టికెట్ జారీ యంత్రం (టిమ్) ద్వారా కండక్టర్ విధులను కూడా నిర్వహించే డ్రైవర్ అతను. బస్సు నడుపుతుండగా రిజర్వేషన్ చేయించుకొని తదుపరి స్టాప్‌లో ఎక్కాల్సిన ప్రయాణికుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ మాట్లాడుతుండగా ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో డ్రైవర్‌ను ఉన్నతాధికారులు తొలుత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఇంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన చరిత్ర ఆయనకు ఉందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందనేది అధికారుల మాట.ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఆ తొందరలో పొరపాటున పురుష ప్రయాణికుడికి కండక్టర్ జీరో టికెట్ (మహాలక్ష్మి పథకంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్) జారీ చేశాడు. తదుపరి స్టాప్‌లో చెకింగ్ సిబ్బంది తనిఖీ చేసి కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే జీరో టికెట్ జారీ చేసి టికెట్ చార్జీ రుసుము తీసుకున్నాడన్నది తనిఖీ సిబ్బంది ఆరోపణ.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ‘చిల్లర’కారణాలతో గత మూడేళ్లలో వందలాది మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు వేడుకున్నా (అప్పీళ్లు) కుదరదని సంస్థ తేలి్చచెప్పడంతో వారంతా తాజాగా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం ఆర్టీసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రంగా పరిగణిస్తూ..: ఆర్టీసీలో ‘చిల్లర’వివాదాలు కొత్తకాదు. టికెట్ల జారీలో జరిగే పొరపాట్లను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. రూ. 10 తేడా వచి్చనా విధుల నుంచి తప్పిస్తోంది. ఇక డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సైతం తొలగిస్తోంది. మూడేళ్లుగా వివిధ కారణాలతో ఏకంగా 600 మందికి ఉద్వాసన పలికింది. అయితే వారంతా డిపో మేనేజర్ మొదలు ఎండీ వరకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో గత నెలలో అప్పీళ్ల మేళా నిర్వహించింది. వివిధ కోణాల్లో వారి కేసులను సమీక్షించి 180 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 420 మందిని మాత్రం పక్కనపెట్టేసింది.దీంతో వారంతా సంస్థ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వేతన సవరణ, పాత బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు సహా వివిధ డిమాండ్లపై నిత్యం కారి్మకులు గొంతెత్తుతున్న వేళ 420 మంది రోడ్డెక్కడం ఆర్టీసీకి తలనొప్పిగా మారింది. ఉద్వాసనకు గురైన వారి వాదన ఓ రకంగా ఉంటే అధికారుల మాట మరోరకంగా ఉంటోంది. వారిలో ఎవరి వాదన సరైందో తేలాల్సి ఉంది.వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ‘టిమ్’లో టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల పెన్నుతో టికెట్ నంబర్ రాసే క్రమంలో చేసిన పొరపాటుకు ఓ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. టిమ్ యంత్రం వాడకంలో చిన్న పొరపాట్లు చేసిన మరికొందరిని తప్పించారు. చిన్నచిన్న సమస్యలు, చిల్లర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు కూలీలుగా మారుతున్నారు. అలా వారం క్రితం ఓ మాజీ కండక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది బృందం ప్రతినిధి రాజేందర్ ఊరికే ఉద్యోగాలు తొలగించం.. ఆర్టీసీ కారి్మకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి సంక్షేమానికే ప్రయతి్నస్తాం తప్ప వారి ఉద్యోగాలు తొలగించాలని చూడం. ఓ తప్పు చేసినట్లు తేలితే వివిధ కోణాల్లో సమీక్షించడంతోపాటు ఆ ఉద్యోగి గత చరిత్రను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఒకట్రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తాం. తప్పును పునరావృతం చేస్తే వేటు వేస్తాం. మద్యం సేవించి విధులకు వచ్చే డ్రైవర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. – ఓ ఆర్టీసీ అధికారి మాట -
కొత్త బస్సులు సమకూర్చుకోండి
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా సేవలను అందించడానికి కొత్త బస్సులను సమకూర్చుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో మంత్రి పొన్నం శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందన్నారు. మొదటి విడతలో మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మహి ళా స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్యలకు అద్దె బస్సులను అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కటి చొప్పున అద్దె బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రారంభించిన కార్గో హోం డెలివరీ సదుపాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరణించిన, మెడికల్లీ అన్‌ఫిట్ అయిన సిబ్బంది జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రూ. 3,747 కోట్ల మేర చార్జీల ఆదా! మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 20 వరకు మొత్తం 111 కోట్ల జీరో టికెట్లను సంస్థ జారీ చేసిందని, రూ.3747 కోట్ల చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం తెలిపారు. జీరో టికెట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు.రవాణా ఆదాయ లక్ష్యాలను సాధించాలి.. ఆదాయ పెంపుదల లక్ష్యాలను సాధించాలని శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని సమీక్షలో సూచించారు. -
కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటారు. కేవలం ఆర్టిసీ సంస్థ,ఉద్యోగులు, సంక్షేమం, సమస్యలు ఇవి మాత్రమే కాకుండా, అనేక సామాజిక అంశాలపై కూడాపలు ఆసక్తికర విషయాలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది.ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు. 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ దివ్యాంగుడు అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి సర్' అంటూ సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.అద్భుతమైన గొంతుతో ఆ పాటను పాడడమే కాకుండా చేతితో, తాళం వేస్తూ లయబద్దంగా పాడటం ఆకట్టుకుంటోంది. అటు ఆ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ముగ్ధులైపోయారు. నిజంగానే మట్టిలో మాణిక్యం అంటూ ప్రశించారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సాహాన్నివ్వాలని కోరారు.మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024 -
TG: రేపటి నుంచి ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి కార్గో సేవలను ఆదివారం(అక్టోబర్ 26) నుంచి విస్తరించనుంది. కార్గోలో బుక్ చేసిన వస్తువులను ఆదివారం నుంచి వినియోగదారుల ఇంటి వద్దకే అందించే సౌకర్యం కల్పించనున్నారు. తొలుత హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా పార్సిళ్ల హోం డెలివరీ ప్రారంభించనున్నారు.ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ కార్గో సేవలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. పార్సిళ్ల హోం డెలివరీ ఛార్జీలు.. 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.501.01నుంచి 5 కేజీలకు రూ.60 5.01 నుంచి 10 కేజీలకు రూ.65 10.1 నుంచి 20 కేజీలకు రూ.7020.1 నుంచి 30 కేజీలకు రూ.75 -
స్పెషల్ బస్సు పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీ
నల్గొండ, సాక్షి: ప్రత్యేక బస్సుల పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి నేటికి అమలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు రూ. 290 చార్జ్ ఉండగా.. దసరా సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా రూ. 70లను ఆర్టీసీ వసూలు చేసింది. ప్రస్తుతం మరో రూ. 40 పెంచి రూ. 110లు అదనంగా వసూలు చేస్తోంది. ప్రస్తుతం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ. 400 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారులే అమలు చేయమన్నారని కండక్టర్లు సమాధానం ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రైతుల ద్రోహి కాంగ్రెస్: కేటీఆర్ -
TG: బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్: దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచలేదని సంస్థ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు.ఈ విషయమై సోమవారం(అక్టోబర్14) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. టికెట్ ధరలు పెంచారన్న ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ‘ఛార్జీలు పెంచారనే వార్తల్లో వాస్తవం లేదు. ఈ ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తోంది. జీవో నెంబర్ 16 ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సంస్థ సవరించింది.రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు లేదు.స్పెషల్ బస్సుల్లో డీజిల్ ఖర్చులకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు జీవో నెంబర్ 16 ప్రకారం’ఉంది అని సజ్జనార్ తెలిపారు. ఇదీ చదవండి: తెలంగాణ గ్రూప్1పై హైకోర్టు తీర్పు రేపు -
ఖాళీగా రిటర్న్.. స్పెషల్ బస్సుల్లో అధిక ఛార్జీలు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 6300 బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇదే సమయంలో స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయని బాంబు పేల్చారు.ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘దసరా రద్దీ దృష్ట్యా 6300 బస్సులు నడుపుతున్నాం. మహాలక్ష్మి స్కీమ్ కింద మరో 600 బస్సులు అదనంగా నడిపిస్తున్నాం. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నడుస్తున్నాయి. రేపటి నుంచి మొత్తం బస్సులు నడిపిస్తాం. ఈనెల 14వరకు అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. దసరా పండుగ కాబట్టి రిటర్న్ జర్నీలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది.. కాబట్టి కొంత చార్జీలు పెంపు తప్పదు. మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి అని చెప్పారు.ఇక, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి చాలా మంది తమ స్వగ్రామాలకు పయణమవుతున్నారు. విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ఇవ్వడంతో వారంతా ముందుగానే ఇళ్లకు చేరుకున్నారు. రేపు సద్దుల బతుకమ్మ కావడంతో స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు..
-
శభాష్ భారతి.. కండక్టర్‌కు సజ్జనార్ అభినందనలు
మహబూబ్ నగర్, సాక్షి: రక్షాబంధన్ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిజేశారు. ‘ కండక్టర్ సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం’అని ఎక్స్‌లో పేర్కొన్నారు.రాఖీ పండుగ రోజు తెలంగాణ ఆర్టీసి బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి… pic.twitter.com/nTpfVpl5iT— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) August 19, 2024 -
ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు
జగిత్యాల క్రైం: వందమందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఉన్నట్టుండీ ఊడిపోయిన సంఘటనలో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా రాయికల్ ప్రధాన రహదారిపై శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో.. ఒకేసారి రెండు వెనుక టైర్లు ఊడిపోయాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి ఖానాపూర్ వెళ్తోంది.సుమారు 100 మంది ప్రయాణికులున్న బస్సు జగిత్యాల రూరల్ మండలం చల్గల్–మోరపల్లి శివారు చేరగానే.. బస్సు వెనుక కుడివైపు రెండు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురికావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. ఎవరికేమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. -
మహాలక్ష్మికే సరి!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్న మాటలకు, బడ్జెట్లో చూపిన లెక్కలకు పొంతన కుదరటం లేదు. గురువారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్టీసీకి రూ.4,084.43 కోట్లను ప్రకటించారు. ఈ మొత్తాన్ని మహాలక్ష్మి పథకానికి కేటాయిస్తున్నట్టుగానే చూపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ పథకానికి ఊతం ఇవ్వటానికే బడ్జెట్ కేటాయింపులు పరిమితమైనట్టు కనిపిస్తోంది. కేటాయింపుల్లో నేరుగా మహాలక్ష్మి పథకానికి కేటాయింపులుగా రూ.3,082.53 కోట్లను చూపారు. ఇక ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.631.04 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.370.86 కోట్లు చూపారు. వీటిని కూడా మహాలక్ష్మికి కేటాయింపులుగానే పేర్కొన్నారు. దీంతో బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఆ పథకానికే ఖర్చు చేస్తారన్నట్టుగా ఉంది.బకాయిలకు ఏం చేస్తారు?ఆర్టీసీ ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు, ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి దాదాపు రూ.1,800 కోట్ల వరకు బకాయి పడింది. ఆ బకాయిలు చెల్లించటం లేదన్న ఆగ్రహంతో ఇటీవల భవిష్యనిధి సంస్థ ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్‌పై స్టే పొందింది. ఆ స్టే గడువు తీరితే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం పొంచి ఉంది. బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైన విషయం తెలిసిందే. దీంతో బస్సులు సరిపోక కొత్తవి కొనాల్సి వస్తోంది.అవసరమైనన్ని కొత్త బస్సులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వీటన్నింటికి చాలినన్ని నిధులు మాత్రం బడ్జెట్లో ప్రతిపాదించకపోవడంతో కార్మిక నేతలు పెదవి విరుస్తున్నారు. రాయితీ పాస్‌లకు సంబంధించి రూ.950 కోట్లు, ఇతరత్రా అవసరాలకు కావాల్సిన వాటితో కలుపుకొని రూ.1,782 కోట్లపై స్పష్టత లేకపోవటం ఆందోళకరమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1,500 కోట్లు ప్రతిపాదించింది. ఆ మొత్తానికి సంబంధించి రూ.వేయి కోట్ల వరకు బకాయిలు ఉండిపోయినట్టు సమాచారం. వాటిని ఎలా సర్దుబాటు చేస్తారని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.రోడ్లు బాగుపడేదెలా?కొన్నేళ్లుగా రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ గాడి తప్పింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రోడ్ల నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొన్ని చోట్ల పనులు జరగటంతో కొత్త రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి చేపట్టాల్సిన రెన్యువల్స్‌ను గాలికొదిలేశారు. ఈ తరుణంలో తాజా బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తారన్న అంచనా ఏర్పడింది. కానీ దానిని తలకిందులు చేస్తూ రోడ్లకు అత్తెసరు నిధులే కేటాయించారు.రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్ల నిర్వహణకు రూ.888 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.606 కోట్లు కేటాయించారు. ఇవి రోడ్లను బాగు చే యటం, అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి ఎలా సరిపోతాయో ప్రభుత్వానికే తెలియాలని అంటున్నారు. ఇక రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.1,525 కోట్లు కేటాయించారు. ఇవి భూసేకరణ పద్దు కిందకే ఖర్చు కానున్నాయి. -
HYD: కీచక కండక్టర్.. యువతి ట్వీట్‌కు ఆర్టీసీ రి‘యాక్షన్’
సాక్షి, రంగారెడ్డి: సిటీ బస్సులో కండక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్న బస్సులో కండక్టర్ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టీజీఎస్ఆర్టీసీ ఎండీ, షీ టీమ్స్, హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది.‘ఈ నెల 15న (మంగళవారం)మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నా. ఆధార్ కార్డు లేకపోవడంతో రూ. 30 డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నా. బస్సు రద్దీగా ఉండటంతో అదే అదనుగా భావించిన కండక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను అనుచితంగా తాకాడు. 2 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంకుల్ ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరవగానే వెనక్కి వెళ్లిపోయాడు. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.తాజాగా ఈ ఫిర్యాదుపై టీజీఎస్ఆర్టీసీ స్పందించింది. ఫరూక్ నగర్ కండక్టర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ‘ఫరూఖ్‌నగర్ డిపోకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది. టీజీఎస్ఆర్టీసీ మహిళా భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.’ అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఫరుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా #TGSRTC యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ… pic.twitter.com/pCzfcZRUz4— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 16, 2024 -
ఆర్టీసీ ఉద్యోగులకు ‘సహకార రుణాలు’
హైకోర్టు జోక్యం ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం నింపింది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ‘ఉద్యోగుల సొంత నిధి’ నుంచి రుణాలందుకుంటున్నారు. పిల్లల చదువులు, సొంతింటిని సమకూర్చుకోవ టం, ఆస్పత్రి ఖర్చులు, ఇతర అవసరాలకు రుణం పొందుతున్నా రు.. కేవలం 40 రోజుల వ్యవధిలో ఏకంగా 9,500 మంది రూ.200 కోట్ల వరకు రుణాల రూపంలో పొందారు.సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్) పేరుకుపోయిన రుణ దరఖాస్తులను క్లియర్ చేసింది. రూ.355 కోట్ల మేర దరఖాస్తుదారులకు చెల్లింపులు చేసింది. అడపాదడపా స్వల్ప మొత్తం రుణాల రూపంలో ఇవ్వటం తప్ప ఇంత మొత్తంలో చెల్లించడం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఇటు ఉద్యోగుల ఇంటి అవసరాలకు రుణాలు, పదవీ విరమణ పొందిన వారికి సెటిల్మెంట్లు, సీసీఎస్‌లో సభ్యత్వం రద్దు చేసుకున్న వారికి చెల్లింపులతో ఒక్కసారిగా సీసీఎస్ కార్యాలయం సందడిగా మారింది.హైకోర్టు జోక్యంతో...ప్రతినెలా ఉద్యోగుల జీతం నుంచి నిర్ధారిత మొత్తం మినహాయించి సీసీఎస్‌లో ఆర్టీసీ డిపాజిట్ చేస్తుంది. ఇలా పోగయ్యే మొత్తం నుంచి ఉద్యోగులకు రుణాలివ్వటం సీసీఎస్ విధి. ⇒ ఉద్యోగుల జీతాల నుంచి ఆ మొత్తాన్ని మినహాయిస్తూ దాన్ని కొన్నేళ్లుగా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. దీంతో సీసీఎస్ దివాలా దశకు చేరిన విషయం తెలిసిందే. దీంతో సీసీఎస్ పాలకవర్గం కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తోంది. ⇒గతేడాది రూ.200 కోట్ల మొత్తాన్ని సీసీఎస్‌కు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించింది. కానీ, కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించటంతో సీసీఎస్ పాలకవర్గం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. మిగతా రూ.150 కోట్లను వెంటనే చెల్లించాలంటూ ఏప్రిల్‌లో కోర్డు ఆర్టీసీని ఆదేశించింది. దీంతో ఆ నెల చివరలో ఆ మొత్తాన్ని ఆర్టీసీ జమ చేసింది. ⇒ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు నుంచి సీసీఎస్ మరో రూ.150 కోట్లు రుణం పొందింది. ఈ రూ.300 కోట్లను ఉద్యోగులకు రుణాలుగా, రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లకు వినియోగించాలని నిర్ణయించింది. 9,500 దరఖాస్తులు ఏప్రిల్ చివరి నాటికి సీసీఎస్‌లో రుణాల కోసం 6,500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ రెండున్నరేళ్లుగా పేరుకుపోయినవే. నిధులు సమకూరాయని తెలియగానే మరో 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వెరసి 9,500 దరఖాస్తుదారులకు రుణాల కింద రూ.200 కోట్లు సీసీఎస్ అందజేసింది. అప్పటివరకు వారి జీతాల నుంచి కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేసిన మొత్తాన్ని రిటైర్మెంట్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.కానీ నిధులు లేక ఏడాదిన్నరగా దాదాపు 1,200 మందికి చెల్లించలేదు. ఇప్పుడు వారికి కూడా సెటిల్ చేశారు. సీసీఎస్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటంతో అందులో నుంచి తమ సభ్యత్వాన్ని రద్దు చేసి సెటిల్ చేయాల్సిందిగా మరో 3,200 మంది దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉంటూ వచ్చాయి. వారందరికీ చెల్లించేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఆర్టీసీ జమ చేసిన నెలవారీ మొత్తం రూ.55 కోట్లను కూడా ఇందుకు వినియోగించారు. ఇక సీసీఎస్‌లో డిపాజిట్లు పెట్టిన రిటైర్డ్ ఉద్యోగులకు 9 నెలలుగా పేరుకుపోయిన వడ్డీ మొత్తం మరో రూ.9 కోట్లు కూడా చెల్లించారు. కేవలం 40 రోజుల వ్యవధిలో రూ.355 కోట్లు చెల్లించారు.ఇంకా రావాల్సినవి రూ.980 కోట్లురుణాలు ఇస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించారు. పోగైన నిధులు రూ.355 కోట్లు ఖర్చయిపోవటంతో, ఇప్పుడు కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో 3 వేలు పెండింగ్ జాబితాలోకి చేరాయి. ఇంకా కొత్త దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసీ ప్రతినెలా సీసీఎస్‌కు చెల్లించే మొత్తం రూ.20 కోట్లు మాత్రమే. అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలంటే ఈ మొత్తం సరిపోదు. సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లించాల్సిన మిగతా బకాయిలు చెల్లిస్తే తప్ప ఇవి క్లియర్ అయ్యే సూచనలు కనిపించటం లేదు. ఇప్పటికీ, సీసీఎస్‌కు ఆర్టీసీ రూ.570 కోట్ల మొత్తం (అసలు) బకాయి ఉంది. దీనిపై చెల్లించాల్సిన వడ్డీ మరో రూ.410 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వెరసి మరో రూ.980 కోట్ల వరకు ఆర్టీసీ బకాయి ఉన్నట్టు తేలుతోంది. విడతలవారీగానైనా ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే మిగతా దరఖాస్తులు క్లియర్ అవుతాయి. -
ఆర్టీసీలో 3,035 పోస్టులు భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. వివిధ స్థాయిల్లో 3,035 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో రద్దీ దాదాపు రెట్టింపైంది. దీంతో కొత్త బస్సుల అవసరం ఏర్పడింది. ప్రస్తుత రద్దీకి 4 వేల కొత్త బస్సులు అవసరమని ఆర్టీసీ తేల్చింది. అయితే అన్ని బస్సులు కాకున్నా, దశలవారీగా 1,500 బస్సులు సమకూరనున్నాయి. దీంతో భారీ సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్ల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం కండక్టర్ల కొరత లేకున్నా, డ్రైవర్లకు కొరత ఉంది. కొత్త బస్సులు వచ్చే లోపే ఆ పోస్టుల భర్తీ అవసర మని ఆర్టీసీ నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి ముఖ్యమంత్రి ఓకే అనటంతో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2012లో ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు. నిజానికి భవిష్యత్తులో వచ్చే కొత్త బస్సుల దృష్ట్యా ఆర్టీసీలో 10 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి 3,035 పోస్టుల భర్తీతోనే సరిపెట్టనున్నారు. సాలీనా రూ.15 కోట్ల వ్యయం కొత్త నియామకాల వల్ల జీతాల రూపంలో సాలీనా రూ.15 కోట్ల వ్యయం కానుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణలతో సంవత్సరానికి అంతకు మూడు రెట్ల మేర జీతాల భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 200 మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. సంవత్సరానికి దాదాపు 2,500 మంది రిటైర్ అవుతున్నారు. పదవీ విరమణ పొందేవారి జీతం గరిష్టంగా ఉంటుంది. ఆ మొత్తంతో ముగ్గురు కొత్త ఉద్యోగులను తీసుకోవచ్చు. అంటే కొత్త నియామకాలతో ఆర్టీసీపై అదనంగా పడే భారం ఏమీ లేదని స్పష్టమవుతోంది. ముందే అదనపు డ్యూటీల భారం ఆర్టీసీలో 12 సంవత్సరాలుగా నియామకాలు లేకపోవటంతో, రిటైర్మెంట్ల రూపంలో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొరత మొదలైంది. ముఖ్యంగా డ్రైవర్ల సంఖ్య సరిపోక, ఉన్నవారిపై అదనపు డ్యూటీల భారం మొదలైంది. వీక్లీ ఆఫ్‌లలో కూడా డ్రైవర్లు విధుల్లోకి రావాల్సి వస్తోంది. డ్రైవర్లు అలసి పోవడంతో బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిక్రూట్‌మెంటుకు అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు గత ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం, మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని అందుబాటులోకి తేవటంతో సిబ్బందిపై భారం మరింత పెరిగింది. దీంతో అధికారులు రిక్రూట్మెంట్ చేపట్టాలంటూ ప్రతిపాదనలు పంపడమే కాకుండా తరచూ లిఖితపూర్వకంగా అభ్యరి్థస్తూ వచ్చారు. జనవరిలో ఆ ఫైలు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వద్దకు చేరింది. దాదాపు నెల విరామం తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. అక్కడ కూడా కొంతకాలం పెండింగులో ఉన్న తర్వాత ఎట్టకేలకు అనుమతి లభించింది. తాజా భర్తీ ప్రక్రియలో కండక్టర్ పోస్టుల ఊసు లేదు. భవిష్యత్తులో డ్రైవర్లే కండక్టర్ విధులు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతోనే డ్రైవర్ పోస్టుల భర్తీ జరగనుంది. టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాం – త్వరలో 3,035 పోస్టుల భర్తీ – రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్: టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలోని వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం కరీంనగర్లో పొన్నం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చిన ఏడు నెలల్లోనే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ వంద శాతం దాటిందని తెలిపారు. ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీగా తీర్చిదిద్ది ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామని అన్నారు. -
TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో, దీనికి సంబంధించిన విధివిధానాలను ఆర్టీసీ అధికారులు రూపొందించనున్నారు. మరోవైపు.. ఆర్టీసీ ఖాళీల భర్తీపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా..‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని రూట్స్‌లో బస్సులు సరిగా లేకపోవడంతో ప్రజలు బస్సులు నడపాలని కోరారు. దీంతో, ప్రభుత్వం ఆర్టీసీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. -
‘పల్లె’కూ బ్యాటరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వెలుపలా ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో పరిమితంగా తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయోగాత్మకంగా పది ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను గరుడ ప్లస్ కేటగిరీలో ప్రారంభించారు. ఇప్పుడు తొలిసారి రాష్ట్రపరిధిలో హైదరాబాద్‌తో ఇతర ప్రధాన పట్టణాలను ఎలక్ట్రిక్ బస్సులతో అనుసంధానించే బృహత్తర కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఇవి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు కేటగిరీలో సేవలందించనున్నాయి. ఇప్పటివరకు నగరం వెలుపలి ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు లేవు. ఆ లోటును భర్తీ చేస్తూ 450 బస్సులు ఆర్టీసీ బస్సు శ్రేణిలో చేరబోతున్నాయి. మరో వారం తర్వాత నుంచి ఈ బస్సులు దశలవారీగా రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్–నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య ఇవి తిరగనున్నాయి. నేషనల్ ఎలక్ట్రిక్ బస్సు ప్రోగ్రాం కింద సరఫరా.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటానని భారత్ ఐక్యరాజ్య సమితికి హామీ ఇచ్చి, ఆమేరకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే మోదీ ప్రభుత్వం గతంలో ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్)’పేరుతో పథకాన్ని ప్రారంభించింది. రెండుదశల్లో దీన్ని అమలు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ఈ పథకం కింద వచ్చినవే. రెండోదశలో మరో 500 బస్సుల కోసం ఆర్టీసీ ప్రతిపాదించగా, అవి కూడా మంజూరయ్యాయి. కానీ కొన్ని కారణాలతో ఆ కాంట్రాక్టు వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండటంతో ఆ బస్సులు రాలేదు. ఇప్పుడు ఫేమ్ స్థానంలో కేంద్రప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు(ఎన్‌ఈబీపీ)ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణ ఆర్టీసీకి 450 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో బస్సులు సరఫరా చేసే ఆ టెండర్‌ను ఢిల్లీకి చెందిన జేబీఎం కంపెనీ దక్కించుకుంది. వారంరోజుల్లో తొలిదశ బస్సులు బ్యాటరీ బస్సులకు జేబీఎం సంస్థ మరో వారంరోజుల్లో శ్రీకారం చుట్టనుంది. ఆ సంస్థనే అద్దె ప్రాతిపదికన బస్సుల నిర్వహణ చూసుకుంటుంది. డ్రైవర్ల బాధ్యత జేబీఎందే కాగా,కండక్టర్ మాత్రం ఆర్టీసీ నుంచి విధుల్లో ఉంటాడు. ఈ బస్సులను నడిపినందుకుగాను ప్రతి కి.మీ.కు రూ.40 చొప్పున అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లిస్తుంది. వీటికి అవసరమైన చార్జింగ్ వ్యవస్థను ఆ సంస్థనే ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్‌తోపాటు ఆయా పట్టణాల్లోని సంబంధిత డిపోల్లో వీటిని ఏర్పాటు చేస్తుంది. తొలుత 20 బస్సులు రానున్నాయి. అలా విడతలవారీగా వచ్చే రెండు నెలల్లో మొత్తం బస్సులు రోడ్డెక్కే అవకాశముంది. 450 బస్సులను సరఫరా చేయాల్సి ఉండగా, 400 బస్సులకు సంబంధించిన షెడ్యూళ్లను ఆర్టీసీ ఆ సంస్థకు అందించింది. ఇప్పుడు ఆ 400 బస్సులు వీలైనంత త్వరలో అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ ఆ సంస్థకు సూచించింది. వీటిల్లో 245 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 85 సూపర్ లగ్జరీ బస్సులు, 70 పల్లెవెలుగు సర్వీసులు ఉంటాయి. దాదాపు వేయి వరకు డీజిల్ బస్సులను ఆర్టీసీ దశలవారీగా సమకూర్చుంటుండగా, వాటికి అదనంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 350 కి.మీ. వరకు ప్రయాణం గతంలో ఎలక్ట్రిక్ బస్సులు ఒకసారి ఫుల్‌చార్జ్ చేస్తే 225 కి.మీ.వరకు తిరిగేవి. దీంతో వాటిని దూరప్రాంతాలకు నడపటం కష్టంగా మారింది. హైదరాబాద్ నుంచి గమ్యం చేరి తిరిగి సిటీకి వచ్చేలోపు చార్జింగ్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఈ సమస్యను అప్పటికిప్పుడు అధిగమించలేక ఇతర పట్టణాలకు తిప్పేందుకు ఆర్టీసీ సాహసించలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న బస్సులు ఫుల్‌చార్జ్ చేస్తే 350 కి.మీ.వరకు నడుస్తాయి. దీంతో దూరప్రాంత పట్టణాలకు వాటిని తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆయా పట్టణాల్లో కూడా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నందున, తిరుగు ప్రయాణంలో మళ్లీ ఫుల్ చార్జింగ్‌తో వస్తాయి. దీంతో మధ్యలో చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. -
గతుకుల రోడ్డుపై.. బతుకు బండి!
వందల సంఖ్యలో బస్సులు.. లక్షల మంది ప్రయాణికులు.. వారిని సకాలంలో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిలో నిమగ్నమవుతున్నారు. పని భారాన్ని భరిస్తూ ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మీ’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఉద్యోగులపై తీవ్ర పనిఒత్తిడి పడింది. వీటన్నింటినీ తట్టుకుని నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నా.. వారి బతుకు బండి సురక్షితంగా సాగడంలేదు. ఒకవైపు తీవ్ర పనిఒత్తిడి, డబుల్ డ్యూటీలు.. మరోవైపు అనారోగ్య సమస్యలు, అధికారుల వేధింపులు, ఇలా అనేక సమస్యలతో ఆర్టీసీ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్–1, నిజామాబాద్–2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2400కు పైగా మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షా 90వేల మంది ప్రయాణించేవారు. కాగా.. మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెండు లక్షల 90 వేలకు చేరింది.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 50 మంది వరకు ఉంటుంది. గతంలో సామర్థ్యానికి మించి అదనంగా 10 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించడానికి వయస్సు పైబడినవారు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు.నిజామాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల కిటకిట8 గంటల డ్యూటీ లేదు..డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. కానీ ఇప్పుడు పని గంటల నిబంధన లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లు డేడ్యూటీ చేస్తారు. కానీ ఉదయం వెళ్లిన వారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతోంది. నిజామాబాద్ – హైదరాబాద్ మధ్య అప్ అండ్ డౌన్ 360 కిలోమీటర్లు అవుతుండగా.. నిజామాబాద్ – వరంగల్ మధ్య అప్ అండ్ డౌన్ 460 కిలోమీటర్లు పడుతుంది.దీంతో పాటు వారికి టార్గెట్ ఒత్తిడి కూడా ఉంటుంది. దీంతో కార్మికులకు పనిభారం పెరుగుతోంది. ఇలా డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం 10 నుంచి 12 గంటల పాటు పని చేస్తున్నారు. దీంతో నిద్ర కరువై అనారోగ్యాల భారిన పడుతున్నారు. నిద్రలేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యూనియన్లు లేకపోవడంతో డిపోలోని అధికారులు సిబ్బందికి ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేయడంతో పనిఒత్తిడి పెరుగుతోంది.ప్రశ్నిస్తున్న అధికారులు..ఆర్టీసీ బస్సులకు డైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రూట్లో వెళ్లే బస్సులు కేఎంపీఎల్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. డైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కేఏంపీఎల్ వచ్చేటట్లు చూడాలని సూచనలు చేస్తున్నారు. కండక్టర్లకు మహాలక్ష్మి పథకంతో పాటు టిక్కెట్లకు టార్గెట్ నిర్దేశిస్తున్నట్లు ఆరీ్టసీలో చర్చ జరుగుతోంది. దీంతో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని కండక్టర్లు వాపోతున్నారు.రెండు డ్యూటీలు చేస్తేనే స్పెషల్ ఆఫ్..ఆర్టీసీ ఉద్యోగులు లీవ్‌లు తీసుకోవాలంటే కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్, డ్రైవర్లకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ ఉంటుంది. రోజంతా పనిచేస్తేనే మరుసటి రోజు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నారు. అలాగే అనార్యోగం పాలైన సిబ్బంది సంబంధిత డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర సెలవులు కావాలంటే అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే. -
ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాల స్తంభన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై భవిష్యనిధి (పీఎఫ్) సంస్థ తీవ్ర చర్యకు ఉపక్రమించింది. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలను తీవ్రంగా పరిగణిస్తూ ఏకంగా ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. తనకున్న ప్రత్యేక అధికారాలతో ఆర్టీసీ ప్రధాన కార్యాలయంతో ముడిపడిన ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఆర్టీసీ రోజువారీ ఆదాయం ఈ ఖాతాల్లోనే డిపాజిట్ అవుతుంది. ఆ మొత్తం నుంచే సంస్థ రోజువారీ కార్యకలాపాలు సాగుతుంటాయి. ఇప్పుడు బ్యాంకు ఖాతాలు స్తంభించడంతో ఆర్టీసీలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రూ.వేయి కోట్లకు చేరువలో బకాయిలు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన భవిష్యనిధి ఖాతాల్లో ప్రతినెలా కంట్రిబ్యూషన్ జమ అవుతుంటుంది. సాధారణ సంస్థల్లాగా కాకుండా, భవిష్యనిధి ఖాతాలను సంస్థనే నిర్వహిస్తుంది. వాటిల్లో ఉద్యోగుల కంట్రిబ్యూషన్, వారి పక్షాన సంస్థ కంట్రిబ్యూషన్ జమ చేస్తుంది. గతంలో ఈ కంట్రిబ్యూషన్ ఠంచన్‌గా జమయ్యేది. కానీ, పదేళ్లుగా సంస్థ పనితీరు సరిగా లేకపోవటంతో.. సంస్థ అవసరాల కోసం భవిష్యనిధి మొత్తాన్ని ఆర్టీసీ వినియోగించుకోవడం ప్రారంభించింది. ఏడాదిన్నర క్రితం వరకు అలా రూ.1,200 కోట్లకు ఆ బకాయిలు పేరుకుపోయాయి.పలు దఫాలుగా భవిష్యనిధి సంస్థ నిలదీసింది. కానీ ఆర్టీసీ స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో, విడతల వారీగా రూ.300 కోట్ల వరకు చెల్లించింది. ఆ తర్వాత ఆ చెల్లింపులు ఆగిపోయాయి. ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు రూ.950 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ప్రతినెలా కంట్రిబ్యూషన్ల కింద రూ.25 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీన్ని ఇప్పుడు పీఎఫ్ కమిషనరేట్ తీవ్రంగా పరిగణించి నిలదీయటం ప్రారంభించింది. ఇప్పుడు ఏకంగా తన ప్రత్యేక అధికారాలను వినియోగించి ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. రీజినల్ ఖాతాల్లోకి జమ..భవిష్యనిధి సంస్థ చర్యతో వెంటనే తేరుకున్న ఆర్టీసీ.. రోజువారీ ఆదాయాన్ని బస్‌భవన్‌కు ఉన్న ప్రధాన ఖాతాల్లో కాకుండా రీజినల్ కార్యాలయాలతో అనుసంధానమైన ఇతర ఖాతాల్లో జమ చేయటం ప్రారంభించింది. ఈమేరకు అన్ని కార్యాలయాలకు బస్‌భవన్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలందాయి. ఈ ఖాతాలు ఫ్రీజ్ కానందున వాటిల్లో జమ చేసి వాటి నుంచే డ్రా చేసుకుంటూ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని ఆదేశించింది. భవిష్యనిధి సంస్థ వాటినీ ఫ్రీజ్ చేయబోతోందని సమాచారం అందడంతో హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్కాకుండా స్టే పొందాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు తెలిసింది.అలా జరగని పక్షంలో ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు ఉన్న టోల్గేట్ల ఫాస్టాగ్‌లకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంది. దాన్ని కూడా పీఎఫ్ సంస్థ ఫ్రీజ్ చేయబోతోందని ఆరీ్టసీకి సమాచారం అందింది. అదే జరిగితే, ఫాస్టాగ్‌ల నుంచి టోల్ రుసుము మినహాయింపునకు వీలుండదు. దీంతో టోల్ గేట్ల వద్ద నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌తో కాకుండా నగదు చెల్లిస్తే, రుసుము రెట్టింపు ఉంటుంది. ఇది ఆర్టీసీపై రోజువారీ రూ.లక్షల్లో భారం పడుతుంది. దీంతో ఫాస్టాగ్ ఖాతాకు కూడా ప్రత్యామ్నాయ చర్య లకు ఉపక్రమించింది. సోమవారం సెలవు కావటంతో, మంగళవారం దాన్ని కొలిక్కి తేవాలని భావిస్తోంది. పీఎఫ్ బకాయిలకు సాయం సాధ్యమా?హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేనిపక్షంలో కచి్చతంగా పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సిందే. అన్ని నిధులు ఆర్టీసీ వద్ద సిద్ధంగా లేనందున.. ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, 2013 వేతన సవరణ బాండు బకాయిలకు సంబంధించి ఉద్యోగుల చెల్లింపునే ప్రభుత్వం అర్ధంతరంగా వదిలేసిన ప్రస్తుత తరుణంలో, పీఎఫ్ బకాయిలకు సాయం చేయటం సాధ్యమా అన్న మీమాంస ఉత్పన్నమవుతోంది. బాండు బకాయిలను ఆర్టీసీ డ్రైవర్లకు చెల్లించి, మిగతా వారికి చెల్లించలేదు. బాండు బకాయిలకు రూ.280 కోట్లు అవసరం కాగా, కేవలం రూ.80 కోట్లే అందినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని గత ఫిబ్రవరిలో డ్రైవర్ కేటగిరీ ఉద్యోగులకు చెల్లించారు. మిగతా వారికి చెల్లించలేదు. దీంతో భవిష్యనిధి బకాయిల విషయంలో గందరగోళం నెలకొంది. -
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ ఆర్టీసీ స్పందించింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్‌లోని టోల్ సెస్‌ను సంస్థ సవరించింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్‌ను యాజమాన్యం సవరించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని సజ్జనార్ ట్వీట్ చేశారు.టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. #TGSRTC బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగింది. ఈ… pic.twitter.com/kO2mbAkjl2— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 12, 2024 -
విన్నపాలు వినవలె!
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు ఇవ్వటంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 90 శాతాన్ని మించి పోయి పూర్వవైభవం కనిపిస్తోంది.. కానీ, అదే సమయంలో ప్రభుత్వం నుంచి రావా ల్సిన మొత్తం విడుదల కాకపోవటంతో, పెరిగిన ఆక్యుపెన్సీ రేషియోకు తగ్గ ఆదాయం నమోదు కావటం లేదు. మరోవైపు ఆర్టీసీ సహకార పరపతి సంఘం, భవిష్యనిధి బకాయిలు ఏకంగా రూ.2 వేల కోట్లను దాటిపోయాయి.గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా, దాని అమలు ఆగిపోయింది. ఇప్పుడు ఉద్యోగులకు సకా లంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆర్టీసీ అధికారుల విన్నపాల్లో ఆయన దేనికి సానుకూలత వ్యక్తం చేస్తారోనన్న చర్చ ఇప్పుడు సంస్థలో విస్తృతంగా సాగుతోంది. నేడు సమీక్ష లేకుంటే... వాస్తవానికి మంగళవారం రోజునే సమావేశం ఉంటుందని చెప్పగా, ఆ రోజున వాయిదా వేసి బుధవారం ఉంటుందంటూ సమాచారం అందింది. జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున, సీఎం ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇలాంటి తరుణంలో సమీక్ష ఉండకపోవచ్చునని కూడా కొందరు అధికారులు అభిప్రాయపడుతు న్నారు. జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.రాజకీయంగా అది కూడా ఆయన బిజీగా ఉండేందుకు కారణం కానుంది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత సమీక్ష ఉండే అవకాశం ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. బుధవారం సమీక్ష జరగని పక్షంలో, వచ్చే పది రోజుల్లో ఉంటుందని అంటున్నారు. దీంతో, ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఓ నివేదిక సిద్ధం చేస్తున్నారు.అధికారులు ఏం కోరనున్నారంటే ⇒ మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి జారీ చేస్తున్న జీరో టికెట్ల ఆధారంగా ప్రతినెలా నిధులు రీయింబర్స్ చేయాలి. దాన్ని రూ.350 కోట్లకు పెంచాలి. ⇒ మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ బాగా పెరిగినందున, 4 వేల కొత్త బస్సులు సమకూర్చాలి. ⇒ ప్రతిపాదిత కొత్త బస్సుల సంఖ్య దామాషా ప్రకారం.. పది వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు కనీసం నాలుగు వేల పోస్టులు భర్తీ చేయాలి. ⇒ గతేడాది బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తంలో ఇంకా రూ.వేయి కోట్లు బకాయి ఉంది. దాన్ని వెంటనే విడుదల చేయాలి ⇒ఆర్టీసీ సహకార పరపతి సంఘం, భవిష్యనిధికి సంబంధించిన రూ.2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం సర్దుబాటు చేయాలనే అంశాలను అందులో పొందుపరుస్తున్నట్టు తెలిసింది. -
తెలంగాణ బస్సు పేరు మారింది..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బస్సు పేరు మారింది.. ఇక మీదట TSRTC కాదు.. TGSRTCగా యాజమాన్యం పేరు మార్చింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు పేరు మార్పు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో పలు కీలక మార్పులు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్(TS)ను తెలంగాణ(TG) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టీఎస్ఆర్టీసీ ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీగా లోగో మార్పులు చేసి కొత్త లోగోను ప్రకటిస్తామని ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మార్చడం జరిగిందని.. సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాల పేర్లను తెలియజేశారు. ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq గా సంస్థ మార్చిందన్నారు. ప్రయాణీకులు, ప్రజలు తమ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఏవైనా ఫిర్యాదులు ఉంటే మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి సమాచారం తీసుకురావాలని విజ్ఙప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq అనే ఎక్స్ ఖాతాలను ఫాలో అవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ముఖ్య గమనిక: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చడం జరిగింది. ఆ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలైన @tgsrtcmdoffice, @tgsrtchq లను సంస్థ మార్చింది. మీ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని… pic.twitter.com/vwwnklHttw— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 22, 2024 -
సమ్మర్ ఎఫెక్ట్: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: సిటీలో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండల తీవ్రతతో హైదరాబాద్ నగర పరిధిలో బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ తగ్గించనుంది. మధ్యాహ్నం 12 గంటల 4 గంటల వరకు గతం కంటే తక్కువ బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు వెల్లడించారు. అయితే సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీలో బస్సులను యధావిధిగా నడపనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి సిటీలో మధ్యాహ్నం వేళల్లో బస్సులు తగ్గనున్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ఇదీ చదవండి.. తెలంగాణకు వర్ష సూచన.. 10 రోజుల పాటు -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. -
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. కాగా ఏప్రిల్ 17న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని సూచించారు. భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు రూ.151 చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది… pic.twitter.com/POrpO87fEi — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 1, 2024 -
వోల్వో.. వద్దు
సాక్షి, హైదరాబాద్: గరుడ ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగుకానున్నాయి. ఆ పేరుతో ఆర్టీసీలో తిరుగుతున్న ఒక్కో వోల్వో బస్సుకు నెలకు సగటున రూ.లక్షకు పైగా నిర్వహణ ఖర్చు వస్తోంది. పైగా చిన్న రిపేరు చేయాల్సి వచ్చినా.. కంపెనీకి తరలించాల్సి రావటం, ఒక్కో పనికి రూ.3–4 లక్షల వరకు బిల్లు వస్తుండటంతో వాటిని వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా 20 వరకు బస్సులను పక్కన పెట్టేసింది. త్వరలో మరికొన్నింటిని తుక్కు కింద మార్చబోతోంది. వాటి స్థానంలో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొంటున్న లహరి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడపబోతోంది. సామర్థ్యానికి మించి నడపటంతోనే.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆధునిక బస్సులు అందుబాటులోకి తెస్తుండటంతో ఆర్టీసీ కూడా ఆ శ్రేణి బస్సులను సమకూర్చటం అనివార్యమైంది. రెండు దశాబ్దాల క్రితం గరుడ పేరుతో బస్సులు ప్రారంభించారు. ఆకర్షణీయంగా ఉండేలా మెర్సిడస్ బెంజ్, ఇసుజు కంపెనీల బస్సులు నడిపారు. ఆ తర్వాత మల్టీ యాక్సెల్ బస్సులను గరుడ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ కేటగిరీలో వోల్వో, స్కానియా బస్సులు వాడారు. 2016–17లో కొత్త వోల్వో బస్సులు కొన్నారు. సాధారణంగా ఆ కంపెనీ బస్సులు ఏడెనిమిది లక్షల కిలోమీటర్ల వరకు తిప్పొచ్చని నిపుణులు చెబుతారు. అంతకంటే ఎక్కువ తిప్పితే సమస్యలు ఏర్పడతాయి. ఒక్కో బస్సు ధర రూ.1.3 కోట్ల వరకు ఉండటంతో వెంటవెంటనే కొత్తవి సమకూర్చటం కుదరదు. అంత ధర పెట్టి కొని తక్కువ కిలోమీటర్లు తిప్పి తుక్కు కింద మార్చటానికి ఆర్టీసీ అధికారులకు మనస్కరించటం లేదు. దీంతో ఏకంగా 14 లక్షల నుంచి 15 లక్షల కి.మీ. వరకు తిప్పుతున్నారు. దీంతో ఆ బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల మరమ్మతులను సొంత సిబ్బందే చేస్తుంటారు. కానీ వోల్వో కంపెనీలో ఆయిల్ మార్చటం లాంటి చిన్నచిన్న పనులు తప్ప మిగతా సాంకేతిక సమస్యలన్నీ ఆ కంపెనీ ఇంజనీర్లే సరిదిద్దాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్య తలిత్తితే బస్సును నిలిపివేసి ఆ కంపెనీ నిపుణులకు కబురు పెట్టాల్సిందే. వారొచ్చి మరమ్మతు చేసి రూ.మూడు నాలుగు లక్షల బిల్లు వేసి వెళుతున్నారు. ఇది ఆర్టీసీ చేతి చమురు వదిలిస్తోంది. ఒక్కో బస్సుకు ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో 14 లక్షల కి.మీ. దాటిన బస్సులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించి అమలు ప్రారంభించింది. ఆ కంపెనీ బస్సులు కొనటం ఆర్థికంగా ఇబ్బందిగా మారటంతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి సమకూర్చుకుంటున్న లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను వాటి బదులు తిప్పుతోంది. ఇటీవలే 16 లహరి బస్సులను వాటికి చేర్చింది. త్వరలో 40 వోల్వో బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించింది. మిగతా వాటిని దశలవారీగా ఆపేయనుంది. పోటీని తట్టుకోగలదా..? ప్రస్తుతానికి బహుళజాతి కంపెనీ బస్సులు కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించింది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంగళూరు, షిర్డీ, చెన్నై లాంటి దూర ప్రాంతాలకు బహుళజాతి కంపెనీలకు చెందిన ఆధునిక బస్సులు సమకూర్చుకుంటున్నాయి. ఆ కేటగిరీ బస్సులు ఆర్టీసీలో లేకపోవటం వెలితిగానే మారనుంది. ఇది ప్రయాణికుల ఆదరణపై ప్రభావం చూపే అవకాశముంది. అప్పటి పరిస్థితిని పరిశీలించి వాటిని కొనాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప ఇప్పట్లో వాటిని కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించటం గమనార్హం. -
మహాలక్ష్మి సిటీ బస్సులు ప్రారంభం..!
-
TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. కాగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నాం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16 శాతం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. కొత్త పీఆర్సీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తాం. 21 శాతం పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా నడుస్తోంది అని వ్యాఖ్యలు చేశారు. -
టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ను జాతీయ స్థాయిలో ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలు వరించాయి. రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో ఈ అవార్డులు లభించాయి. నష్టాలను అధిగమించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో అంతర్గతంగా చేస్తున్న కొత్త ఆవిష్కరణలకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) 2022–23కుగాను తెలంగాణ ఆర్టీసీని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. నాలుగు ఫస్ట్.. ఒకటి సెకండ్.. రోడ్డు భద్రత విభాగానికి సంబంధించి మఫిసిల్ కేటగిరీ (బస్సుల సంఖ్య 4,001–7,500 ఉన్న సంస్థల పరిధి)లో ఆర్టీసీ మొదటి స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ... రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమేయం తక్కువ ఉండేలా చూడటంలో టీఎస్ఆర్టీసీ తొలి నుంచీ టాపర్‌గా ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు కారణమైన నిష్పత్తి 0.05గా ఉంది. ఇంధన పొదుపులోనూ ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరుకు తిరిగే కిలోమీటర్ల (కేఎంపీఎల్) విషయంలో ఉత్తమంగా నిలిచింది. మఫిసిల్ కేటగిరీలో 5.35 కేఎంపీఎల్‌తో మొదటి స్థానం, పట్టణ ప్రాంతాల కేటగిరీలో 4.61 కేఎంపీఎల్‌తో రెండో స్థానంలో నిలిచింది. టీఎస్ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరు డీజిల్‌కు దాదాపు 5.14 కి.మీ. మేర తిరుగుతున్నాయి. ఇక సిబ్బంది సంక్షేమం, ఉత్పాదకత కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. గతేడాది ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసింది. తీవ్ర గుండె సమస్యలున్న 250 మందిని గుర్తించి వారికి చికిత్సలు అందిస్తోంది. సిబ్బంది నైపుణ్యం పెరిగేలా సామూహిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. వాటికి ఈ పురస్కారం లభించింది. డిజిటల్ కార్యక్రమాల అమలు విభాగంలోనూ సంస్థకు మొదటి స్థానం సాధించింది. ప్రయాణికులు, సిబ్బంది కోసం కొత్త యాప్‌లు, టికెట్ల రిజర్వేషన్ పద్ధతిలో మార్పులు, బస్ ట్రాకింగ్ కోసం గమ్యం యాప్ తదితరాలకు ఈ పురస్కారం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ పురస్కారాలు లభించాయని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనగా ఉత్తమ పనితీరుతో టీఎస్ఆర్టీసీ దేశంలోని ఇతర ఆర్టీసీలకు ఆదర్శంగా నిలిచిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు. -
ఉచిత బస్సు పథకంతో RTCకి నష్టమా, లాభమా?
-
వచ్చే 4 రోజులు తెలంగాణ బస్సులు బిజీ బిజీ
తొందరపడి బస్టాండ్లవైపు పరుగులు తీయొద్దని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. వచ్చే నాలుగు రోజులు ఎక్కువ బస్సులు మేడారం వెళ్తాయి కాబట్టి.. సాధారణ రూట్లలో బస్సులు తక్కువ ఉంటాయి. అలాగే కొన్ని రద్దవుతాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. "తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం." రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. – వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఆర్టీసీ. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!! తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024 -
ఆర్టీసీ ప్రయాణికుల అసౌకర్యంపై ఎండీ సజ్జనార్ స్పందన
హైదరాబాద్, సాక్షి: మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో.. సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తయ్యే వరకు ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలని కోరారాయన. తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. రెగ్యులర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!! తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024 ఇదీ చదవండి: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్!! అంతకు ముందు.. జాతర వెళ్లే భక్తులకు ఆర్టీసీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు అవకాశం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. మూగజీవాలకు ఆర్టీసీ బస్సుల్లో ఎంట్రీ లేదన్నారాయన. అంతేకాదు.. గతంలో ఎప్పుడూలేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని మేడారంలో 15 కిలో మీటర్ల మేర 48 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. -
మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
సాక్షి, ములుగు: సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం మేడారంలో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేతృత్వంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్‌తో కూడిన బేస్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బేస్ క్యాంప్‌లో 7 కిలో మీటర్ల పొడవునా 50 క్యూ లైన్లను నిర్మించినట్లు వివరించారు. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆదివారం నుంచి 25వ తేది వరకు 8 రోజుల పాటు ప్రత్యేక బస్సులను సంస్థ తిప్పుతున్నట్లు తెలిపారు. దాదాపు 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది ఈ జాతరకు పని చేస్తున్నారని స్పష్టం చేశారు. సిబ్బందికి సరిపడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మేడారం జాతరకు అమల్లో ఉందని, మహిళలు పైసా ఖర్చు లేకుండా తల్లులను దర్శించుకోవచ్చన్నారు. గతంలో భక్తులు పెద్ద ఎత్తున కాలినడకన మేడారం జాతరకు వచ్చే వారని, ఉచిత ప్రయాణం వల్ల సురక్షింతంగా బస్సుల్లో వస్తున్నారని పేర్కొన్నారు. మేడారం జాతరకు బస్సుల్లో వచ్చే భక్తులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు నిబద్దత, క్రమ శిక్షణతో పని చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిష్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ రఘునాథ రావు, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, తదితరులు పాల్గొన్నారు. -
‘‘బీఆర్ఎస్ ఓటమికి ఆర్టీసీ కార్మికులు కృషి చేశారు’’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర ఎవరు మర్చిపోరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మార్గ్‌లో 100 కొత్త బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ‘కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్త బస్సులు ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు అనుకున్నారు కానీ పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం మిమ్మల్ని విస్మరించింది. ఎంతో మంది ఆర్టీసి కార్మికులు ప్రాణ త్యాగం చేశారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మీ కృషి ఏంతో ఉంది. మహాలక్ష్మి స్కీమ్‌ను మేనిఫెస్టోలో పెట్టాం. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పథకం అమలు చేశాం. 15 కోట్ల 27 లక్షల మంది మహిళలు ఆర్టీసి లో ఉచితంగా ప్రయాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అంకెలతో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. గత ప్రభుత్వాల బడ్జెట్ వాస్తవ రూప దాల్చదు అని అధికారులు అన్నారు’అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి.. బడ్జెట్‌పై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు -
మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగనుంది. ఇక, ఈసారి మేడారం జాతర కోసం భక్తులు ఇప్పటి నుంచే పోటెత్తుతున్నారు. దీంతో, టీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదే సమయంలో మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా, తాజాగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ..‘మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నాం. ఇక, మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించాం. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉ. 6.00, 6.30 గంటలకు జేబీఎస్ నుంచి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. పెద్దలకు రూ. 750 చిన్నారులకు రూ. 450 టిక్కెట్ ధర నిర్ణయించారు. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.00, 2.30, 3.00 గంటలకు బయలుదేరతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఇందులో రానుపోను టిక్కెట్ ఛార్జీ పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310లు. సూపర్‌లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులను కూడా నడుపుతారు. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదు. సూపర్ లగ్జరీలో టిక్కెట్ ధర పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.550, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించారు. -
దాడులు చేస్తే..: తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆర్డీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు.. ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మహాలక్ష్మీ స్కీం ప్రకటన అనంతరం.. పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ధైర్యం చెప్పే పనిలో ఉన్నారు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. మొన్నీమధ్య ఫరూక్నగర్ డిపో బస్సులో డ్రైవర్, కండక్టర్లపై జరిగిన దాడిని ఆయన ఖంచింన సంగతి తెలిసిందే. తాజాగా గాయపడిన ఆ సిబ్బందిని పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. టీఎస్ఆర్టీసీ అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇక నుంచి ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారాయన. ‘‘గాయపడ్డ కండక్టర్, డ్రైవర్‌కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది. ఫరూక్ నగర్ డిపో బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే ఇక ఉపేక్షించం. ఇక నుంచి రౌడీ షీట్లు కేసులు తెరుస్తాం’’ అని సజ్జనార్ హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని సజ్జనార్ చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని తెలిపారు. కాగా ఫరూక్నగర్ డిపోకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారని, ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్‌కి గాయాలయ్యాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన. -
Sajjanar: ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు దిగటం దురదృష్టకరం
సాక్షి, హైదరాబాద్: పదే పదే హెచ్చరిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరమని, ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని తెలగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అన్నారు. ‘తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఇద్దరు ఫరూక్నగర్ డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్‌పై విచక్షణరహితంగా ఆదివారం రాత్రి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్‌తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరగింది. డ్రైవర్ షేక్ అబ్దుల్‌కి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కమిషనరేట్ దోమలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను పోలీసులు అరెస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు’ అని సజ్జనార్ తెలిపారు. పదే పదే హెచ్చరిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరం. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తాజాగా #Hyderabad ట్యాంక్ బండ్ పై ఇద్దరు ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై విచక్షణరహితంగా ఆదివారం రాత్రి దాడి చేశారు. క్రికెట్… pic.twitter.com/qSgAk4zTYy — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 5, 2024 -
ఉచిత ప్రయాణంపై పిల్.. ప్రయోజనం లేదన్న కోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. బస్సులన్ని మహిళలతోనే నిండిపోతున్నాయని టికెట్ తీసుకున్నా సీటు ఉండటం లేదని నాగోలుకు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్ర రద్దీ పెరిగిందని పిటీషన్లో పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదని హైకోర్టుకు తెలిపారు. ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని హరిందర్ పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు హరిందర్ దాఖలు చేసిన పిటీషన్లో ఎటువంటి ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది. పిటిషనర్ బస్సులో ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారని ధర్మాసనం తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. -
TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి.. సజ్జనార్ సీరియస్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ బస్సు డిపో పరిధిలో ఓ మహిళ టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు కండక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ.. చేయిచేసుకోవడంతో పాటు కాలుతో సైతం తన్నింది. ఈ ఘటనపై ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా స్పందించారు. ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనపై సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో..‘హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో తన్నిన మహిళ హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు… pic.twitter.com/SAZ2gPxSGY — Telugu Scribe (@TeluguScribe) January 31, 2024 Video Credentials: Telugu Scribe మొదటి ట్రిప్పు అని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించినా ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 31, 2024 అయితే, హయత్‌నగర్ డిపో-1 పరిధిలో మద్యం సేవించిన ఓ మహిళ మత్తులో దుర్భాషలాడింది. బస్సులో తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ కండక్టర్‌పై దాడికి దిగింది. కాగా, మహిళా కండక్టర్‌ను తన్నిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రూ.500లకు చిల్లర లేకపోవడంతో దిగిపోవాలని కండక్టర్ సూచించినట్లు తెలిసింది. దీంతో, సదరు ప్రయాణికురాలు హల్చల్ చేసింది. -
మహాలక్ష్మీ స్కీమ్, కొత్త బస్సులపై సజ్జనార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్, కొత్త ఆర్టీసీ బస్సుల గురించి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే, మహాలక్ష్మీ స్కీమ్ ద్వారా 12కోట్లకుపైగా మహిళలు బస్సుల్లో ప్రయాణించినట్టు సజ్జనార్ చెప్పుకొచ్చారు. కాగా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈరోజు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణలో 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని అన్నారు. ఇదే సమయంలో సజ్జనార్..‘ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నాం. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుంది. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అనౌన్స్మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.కోటి సాయం
సాక్షి, హైదరాబాద్: ► సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఫెయిల్ కావటంతో ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించారు. కండక్టర్ బస్సు ముందు నిలబడి ఆ వివరాలను రిపోర్టులో రాస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొంది.. దీంతో బస్సు దూసుకొచ్చి ముందు నిలబడిన కండక్టర్‌ను ఢీకొనటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవలే ఆయన కుటుంబానికి ప్రమాద సాయంగా రూ.40 లక్షలు అందాయి. ► మెహిదీపట్నంకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ చిన్న కారణంతో గతంలో ఆర్టీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని సర్వీసు నుంచి తొలగించింది. దానిపై ఆ డ్రైవర్ లేబర్ కోర్టును ఆశ్రయించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో అతను దుర్మరణం చెందాడు. సర్వీసులో లేకపోవటంతో ఆర్టీసీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చిన్న పిల్లలను చదివించేందుకు ఆయన భార్య ఇళ్లల్లో పాచి పనులు చేయాల్సి వచ్చింది. ఆ దీనావస్థకు చలించి కొందరు జోక్యం చేసుకోవటంతో చివరకు ఆ ఉద్యోగి కుటుంబానికి కూడా రూ.40 లక్షల ప్రమాద బీమా సాయం అందింది. ఇలా అనుకోని ప్రమాదం చోటు చేసుకుని.. సంపాదించే కుటుంబ పెద్ద చనిపోతే అల్పాదాయ కుటుంబాలు ఆర్థికంగా ఎదు ర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆస్తులు లేని కుటుంబాలు, సంపాదించే ఇతర వ్యక్తులు లేని కుటుంబాలు రోడ్డున పడటమే. ఇలాంటి సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు వారి ఖాతాలున్న బ్యాంకు శుభవార్త చెప్పింది. ప్రమాదవశాత్తూ చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగి కుటుంబాలకు ఇకపై ఏకంగా రూ.కోటి సాయం అందనుంది. ఆ ఉద్యోగి పేరుతో రూపే కార్డు ఉంటే మరో రూ.15 లక్షలు అందుతుంది. వెరసి, రూ.1.15 కోట్లు అందటం ద్వారా ఆ కుటుంబానికి ఆర్ధికంగా వెసులుబాటు కలగబోతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇది అమలు కానుంది. ఖాతాలు యూబీఐలోకి రావడంతో.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్దగా ఊరటనిచ్చే ప్రమాద బీమా లేదు. సంస్థ పరంగా అందే సాయం కూడా నామమాత్రమే. ఇలాంటి తరుణంలో, సూపర్ సేవింగ్ శాలరీ ఖాతా ద్వారా యూబీఐ పెద్ద వెసులుబాటు కల్పించింది. గతంలో ఆర్టీసీ జీతాల ఖాతాలు మరో బ్యాంకులో ఉండేవి. ఏడాదిన్నర క్రితం ఎండీ సజ్జనార్ వాటిని యూబీఐలోకి మార్చారు. ఆ సమయంలో ప్రమాద బీమా కింద ఆర్థిక సాయం అందే వెసులుబాటు గురించి చెప్పిన బ్యాంకు అధికారులు, ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాలను సూపర్ సేవింగ్ సాలరీ ఖాతాలుగా మార్చాలని సూచించారు. ఆ వెంటనే ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు పొందే వీలు కల్పించింది. దాదాపు ఏడాదిగా అది అమలవుతోంది. ఈ సమయంలో దాదాపు 20 మంది ఆర్టీసీ ఉద్యోగులుకు ప్రమాదాల బారిన పడి మృతి చెందారు. వీరి కుటుంబాలకు దశలవారీగా ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని బ్యాంకు అందజేసింది. ఏదైనా సంస్థలో పనిచేస్తూ, ప్రతినెలా ఠంచన్‌గా జీతం అందే వారికి ఈ ఖాతా పొందే వీలును బ్యాంకు కల్పిస్తోంది. బ్యాంకుల మధ్య పోటీతో పెంపు బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ వాతావరణం నేపథ్యంలో, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.కోటికి పెంచుతూ ఆ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 47 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. ప్రతినెలా రూ.220 కోట్ల వరకు వారి జీతాల పద్దు ఉంటుంది. నిత్యం ఆర్టీసీకి రూ.14 కోట్ల వరకు టికెట్ల రూపంలో ఆదాయం (మహిళలకు అందించే జీరో టికెట్ల మొత్తం కాకుండా) ఉంటుంది. ఇవన్నీ ఆ బ్యాంకులోనే డిపాజిట్ అవుతాయి. ఇది పెద్ద మొత్తం కావటంతో సంస్థను ఆకట్టుకునేందుకు ఆ బ్యాంకు ఈ ప్రమాద బీమా మొత్తాన్ని పెంచింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఇక బ్యాంకు అందించే రూపే కార్డు ఉన్న వారికి అదనంగా మరో రూ.15 లక్షలు కూడా అందుతుంది. ఇప్పటికీ అవగాహన లేని ఉద్యోగులెందరో.. ఈ ప్రమాద బీమా గురించి దాదాపు ఉద్యోగులందరికి తెలిసినా, అది వర్తించాలంటే ఏం చేయాలన్న విషయంలో కొందరికి ఇప్పటికీ అవగాహన లేదు. తమ ఖాతాలను సూపర్ సేవింగ్స్ సాలరీ ఖాతాగా మార్చాలంటూ ప్రతి ఉద్యోగి సంబంధిత బ్యాంకు బ్రాంచీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ, ఆ ఖాతాలోకి మారని ఉద్యోగులెందరో ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే వారికి ఈ పథకం వర్తించదు. దాదాపు ఏడాదిగా ఆ బ్యాంకు ప్రమాద బీమా వసతిని అమలు చేస్తున్నా, ఉద్యోగులకు అవగాహన కల్పించటంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. ఇక రూపే కార్డు తీసుకోవాలని, దాన్ని ప్రతి 45 రోజుల్లోపు ఒకసారన్నా కచ్చితంగా వాడాలన్న నిబంధన గురించి కూడా అవగాహన లేదు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈడీ కృష్ణకాంత్ చర్యలు ప్రారంభించారు. ఈ పథకం వివరాలు, ఉద్యోగులు అనుసరించాల్సిన విషయాలను తెలియ చెప్తూ ఫ్లెక్సీలు రూపొందించి అన్ని డిపోలకు పంపుతున్నారు. -
సీఎం రేవంత్ ఇంటికి ఆర్టీసీ ఉద్యోగులు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవాలని సీఎం రేవంత్‌ను వేడుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో తమను చిన్న కారణాలతో తొలగించారని చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొందరు బుధవారం తెల్లవారుజామునే సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందన్నారు. చిన్న చిన్న కారణాలతో తమను సస్పెండ్ చేసి, మెమో ఇచ్చి, జీతాలు కట్ చేసినట్టు సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని తమ గోడును చెప్పుకున్నారు. ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. -
ఆర్టీసీ బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు
-
TSRTC: సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు
సిద్దిపేట, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత ప్రయాణం మూలంగా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఆర్టీసీ సిబ్బందితో గొడవ పడడం దగ్గరి నుంచి ఆఖరికి మహిళలు వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం దాకా చూస్తూనే ఉన్నాం. తాజాగా మహిళలు చెప్పులతో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఆ మధ్యలో ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఆ గొడవను ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించగా.. అక్కడే ఉన్న కొందరు ఆ వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న దుబ్బాక డిపో బస్సులో.. తోగుట మండలం వెంకట్రావ్ పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమచారం. ఉచిత ప్రయాణ విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. -
TS: మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని నాగోల్‌కి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ వేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదని.. జీవో 47 రద్దు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాకి పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్ల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. పురుషులకు సీట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. మహిళల రద్దీ కారణంగా టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. -
పండుగ ప్రయాణంపై ‘డైనమిక్’ పిడుగు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ దూర ప్రాంతాల్లోని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ ‘డైనమిక్ చార్జీ’ రూపంలో పెను భారం మోపింది. దాదాపు రెట్టింపు చార్జీలతో జేబులు గుల్ల చేస్తోంది. గతంలో పండుగ సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు రుసుము వసూలు చేసే విధానం ఉండేది. కానీ ఇటీవల దాన్ని రద్దు చేసి సాధారణ చార్జీలకే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఆర్టీసీ కల్పించింది. కానీ సంక్రాంతి వేళ.. డైనమిక్ ఫేర్ విధానం పేరిట.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అదనపు రుసుము వసూలు చేస్తోంది. విశాఖ స్పెషల్ రూ.3 వేలు వాస్తవానికి కొన్ని నెలలుగా దశల వారీగా డైనమిక్ ఫేర్ విధానాన్ని విస్తరిస్తూ వచ్చిన టీఎస్ఆర్టీసీ.. సంక్రాంతి రద్దీ సమయానికి దూరప్రాంత రూట్లను కూడా ఈ విధానంలోకి తెచ్చేసింది. ఫలితంగా పండుగ ప్రత్యేక బస్సుల్లో చార్జీలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సాధారణ రోజుల్లో విశాఖపటా్ననికి స్లీపర్ బస్సులో టికెట్ ధర రూ.1,500 లోపు ఉండగా, ఇప్పుడు ప్రత్యేక బస్సుల్లో అది రూ.3 వేలను దాటింది. విజయవాడ మార్గంలో సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.300, రాజధానిలో రూ.550, గరుడలో రూ.800 వరకు చార్జీలు పెరిగాయి. మిగతా దూరప్రాంతాల మార్గాల్లోని బస్సుల్లోనూ ఇదే బాదుడు కనిపిస్తోంది. డిమాండ్, ముందు.. వెనుక సీట్లను బట్టి చార్జీలు డిమాండ్ పెరిగే కొద్దీ చార్జీలను సవరించి పెంచుకోవటాన్నే డైనమిక్ ఫేర్ విధానం అంటున్నారు. సాధారణంగా విమానయాన సంస్థలు దీన్ని అను సరిస్తుంటాయి. నెల రోజుల ముందు బుక్ చేసుకునే విమాన టికెట్ ధరకు, అదేరోజు బుక్ చేస్తే ఉండే చార్జీకి పొంతనే ఉండదు. మూడు నాలుగు రెట్లు కూడా చార్జీ పెరుగుతుంది. ఇదే విధానాన్ని తెలంగాణ ఆర్టీసీ అనుసరిస్తోంది. తొలిసారిగా గతేడాది బెంగళూరు మార్గంలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఆ తర్వాత విస్తరిస్తూ తాజాగా ఇతర రాష్ట్రాల రూట్లలో అమలు ప్రారంభించింది. సాధారణ రోజుల్లో డిమాండ్ ఉండక బస్సుల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. అలాంటి సమయంలో సాధారణ టికెట్ ధరలో 80% మొత్తాన్నే వసూలు చేస్తోంది. అంటే రూ.100గా ఉండే టికెట్ ధరను రూ.80గా మారుస్తోంది. కానీ డిమాండ్ పెరిగే కొద్దీ టికెట్ ధరలను క్రమంగా పెంచుతూ గరిష్టంగా 150 శాతంగా ఖరారు చేస్తోంది. ఇక ముందు వైపు ఉండే సీట్లలో ఒక ధర, వెనక సీట్లలో మరో ధర, కిటికీ వైపు సీటుకు ఓ ధర, పక్క సీటుకు మరో ధర, ఉదయం వేళ ఒక ధర, సాయంత్రం, రాత్రి వేళ వేరు ధరలు.. ఇలా ఎప్పటికికప్పుడు సందర్భాన్ని బట్టి చార్జీలను సవరిస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కూడా ఈ విధానం అనుసరిస్తున్నారు. డిమాండ్ లేని సాధారణ రోజుల్లో చార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తుండటంతో ఆ బస్సులు నిండిపోయి ప్రయాణిస్తుంటాయి. అదే సమయంలో ఆర్టీసీ బస్సులు ఖాళీగా కన్పిస్తుంటాయి. ఇక డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో రెండు మూడు రెట్లకు టికెట్ ధర పెంచి ప్రైవేటు ట్రావెల్స్ వసూలు చేస్తుంటాయి. ఈ విధానం లాభసాటిగా ఉండటంతో తెలంగాణ ఆర్టీసీ కూడా దీన్ని అమల్లోకి తెచ్చింది. ఆదుకున్న ఏపీఎస్ ఆర్టీసీ సాధారణంగా సంక్రాంతి, దసరా, దీపావళి పండగ వేళల్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. 15 లక్షల నుంచి 20 లక్షల మంది తరలి వెళ్తారు. దీంతో ఏపీకి టీఎస్ఆర్టీసీ అదనంగా బస్సులు నడుపుతుంది. అలా ఈ సంక్రాంతికి 1,550 బస్సులను ఏపీకి తిప్పాలని భావించింది. కానీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావటంతో రద్దీ విపరీతంగా పెరిగి బస్సులు సరిపోని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో నామమాత్రంగా 400 అదనపు బస్సులతో సరిపెట్టింది. ఇదే సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,450 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అవి సరిపోక పోవడం ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు ప్రయాణికులు పొటెత్తుతుండటంతో మూడు రోజుల క్రితం ప్రత్యేక బస్సుల సంఖ్య పెంచాల్సిందిగా ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులను టీఎస్ఆర్టీసీ అధికారులు కోరారు. దీంతో గత మూడు రోజులుగా మరో 350 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ రంగంలోకి దించింది. ప్రైవేటు బస్సు చార్జీలూ భగ్గు తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 4,420 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. దక్షిణమధ్య రైల్వే విశాఖ, కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, తదితర ప్రాంతాలకు రద్దీకనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవి ఏ మూలకూ చాలటం లేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని చార్జీలను పెంచేశారు. వైజాగ్, అమలాపురం, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో రూ.950 నుంచి రూ.2000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. విశాఖపటా్ననికి నగరం నుంచి సాధారణ రోజుల్లో రూ.1300గా ఉండే స్లీపర్ బస్సు చార్జీ ఇప్పుడు రూ.4000 వరకు చేరుకుంది. రాజమండ్రికి రూ.3,800 వరకు, విజయవాడకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. -
సంక్రాంతి సెలవులతో సొంతూళ్లకు వెళ్తున్న నగరవాసులు
-
TSRTC: అలాంటి వారిని సహించం.. సజ్జనార్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ సంఘటన. బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టిఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు. నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి.… pic.twitter.com/juEpeywb74 — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 10, 2024 ఇదీ చదవండి: నాంపల్లి: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ -
‘ఒరిజినల్ ఆధార్’ తప్పనిసరి..
సాక్షి హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని మహిళలు వినియోగించు కోవాలంటే ఒరిజినల్ ఆధార్‌కార్డు తప్పనిసరి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. గుర్తింపుకార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ కార్డు అయినా సరే ఈ పథకానికి వర్తిస్తుందని ఆయన ‘ఎక్స్’వేదికగా సోమవారం పోస్టు చేశారు. అయితే పాన్‌కార్డు మాత్రం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. పాన్‌కార్డుపై అడ్రస్ ఉండదని, అందువల్ల ఆ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా..ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లో ఫొటో కాపీలు, కలర్ జీరాక్స్ చూపిస్తున్నారన్న విషయం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వ్యాఖ్యానించారు. మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ఒరిజినల్ గుర్తింపుకార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఎండీ సజ్జనార్ తెలిపారు. వాదనలకు దిగొద్దు... ’ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం’అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని ఇది సరికాదని ఆయన తెలిపారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని చెప్పారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వారవుతారని వివరించారు. అందువల్ల ప్రతి మహిళ జీరోటికెట్ తీసుకోవాలని. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందన్నారు. అలాగే సదరు మహిళ నుంచి రూ.500 జరిమానా వసూలు చేస్తారని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు అదనంగా 4,484 బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇది గతేడాది సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల సంఖ్య కంటే దాదాపు 200 అదనం. కానీ, తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,500 ప్రత్యేక బస్సులు అవసరమని గుర్తించినప్పటికీ, కేవలం 600 సర్వీసులను మాత్రమే తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉండటంతో బస్సులో విపరీతమైన రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఉన్న బస్సులు సరిపోవటం లేదు. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు అందే అవకాశం లేకపోవటంతో పండగ ప్రత్యేక బస్సుల్లో సింహభాగం తెలంగాణ ప్రాంతంలోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీకి నడిపేందుకు చాలినన్ని బస్సులు లేకపోవటంతో, డిమాండులో సగానికంటే తక్కువ బస్సులతోనే సరిపుచ్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. 626 సర్విసులకు రిజర్వేషన్ సౌకర్యం ఇప్పుడు నడిపే 4,484 ప్రత్యేక బస్సుల్లో 626 సర్విసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈనెల ఏడో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి నేపథ్యంలో, సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో కూడా రద్దీ విపరీతంగా ఉండనున్నందున.. ఎక్కువ ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు పల్లెవెలుగు బస్సులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రత్యేక బస్సుల నిర్వహణ, ‘మహాలక్ష్మి’రద్దీని తట్టుకునే చర్యలపై చర్చించారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్ ప్రాంతాలలో ప్రత్యేక బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నందున ఆయా ప్రాంతాలకు సిటీ బస్సులను కూడా అదనంగా తిప్పాలని నిర్ణయించారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా జమయ్యే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో నీడ కోసం షామియానాలు, మంచినీటి వసతి, కుర్చిలను సిద్ధం చేయాలని, ప్రయాణికుల సందేహాలను తీర్చే వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రద్దీ ప్రాంతంలో ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనంగా ఎలాంటి చార్జీ ఉండదని, సాధారణ టికెట్ చార్జీలే వర్తిస్తాయని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 1,450 సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ సర్విసులకు అదనంగా 1,450 బస్సులు తిప్పుతున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 10 నుంచి 13 వరకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇవి తిరుగుతాయని పేర్కొన్నారు. వీటిల్లోనూ సాధారణ చార్జీలే వసూలు చేస్తారని, ఎలాంటి అదనపు చార్జీలుండవని తెలిపారు. రద్దీ నేపథ్యంలో 11వ తేదీ నుంచి 13 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు , మాచర్ల వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్‌కు బదులు, దాని ఎదురుగా ఉన్న ఓల్డ్ సీబీఎస్ (గౌలిగూడ బస్టాండు)లో ఆగుతాయని వెల్లడించారు. -
TS: సంక్రాంతికి 4వేల స్పెషల్ బస్సులు
హైదరాబాద్, సాక్షి: సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 4 వేల ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. శుక్రవారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నేతృత్వంలో TSRTC అధికారులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉచిత ప్రయాణం.. ఈ బస్సులకూ వర్తించేలా ఈ సందర్భంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 4 వేల 484 బస్సులు అదనపు బస్సులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. ఇందులో 626 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి. బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని.. సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయని తెలిపారాయన. అలాగే.. సంక్రాంతి పండగకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుందని స్పష్టత ఇచ్చింది. ఈ సమీక్షలో ఈడీలు, జిల్లాల రీజినల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
TSRTC: రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్న ఆయన.. వారు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు మీడియాతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం ఎండీ సజ్జనార్‌కు ఐదు సమస్యలను విన్నవించామన్నారు. ఎండీ సానుకూలంగా స్పందించారని, ఈ నెల 10 వ తేదీ లోపల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నామని వారు తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ పరామర్శ -
ఈ నెల 5 నుంచి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారించకపోతే ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. మంగళవారం టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు సాక్షి మీడియాతో మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతున్నాయన్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు. ప్రమాదానికి ఇన్య్సూరెన్స్ రాకపోతే మాపై కేసులు పెడుతున్నారు. కొత్త బస్సులకు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు టెండర్లు వేయలేదు. ఇందులో గిట్టుబాటు కావడం లేదు. టెండర్లు వేయొద్దని కోరుతున్నాం’’ అని అద్దె బస్సుల యజమానులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: నేను ఎక్కడికి పారిపోలేదు: బైరి నరేష్ -
TSRTC: న్యూ ఇయర్లో షాకిచ్చిన ఆర్టీసీ.. సిటీలో ప్రయాణికులకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గట్టి షాకిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తి టికెట్ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల రద్దీ కోసం టీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనికి మంచి స్పందన కూడా లభించింది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఎదురుచూపులతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంది. ఈ సందర్బంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023 ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు’ అని తెలిపారు. -
టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఆ టికెట్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఫ్యామిలీ 24, టీ 6 టికెట్లను రద్దు చేస్తూ టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి(జనవరి 1) వీటిని రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను రేపటి నుంచి పూర్తిగా నిలుపుదల చేయనునట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది.. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు’’ అని సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023 -
ఆర్టీసీ సిబ్బందిపై దాడులను సహించం: మంత్రి పొన్నం ప్రభాకర్
-
HYD: 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోరవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. నేడు 80 బస్సులు ప్రారంభించామని, త్వరలో మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మే జూన్ కల్ల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ. 400 కోట్లతో ఈ కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణం తీసుకొచ్చిందన్న సజ్జనార్.. ఈ 21 రోజుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. వచ్చే రోజుల్లో ఓపికతో ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఇప్పటికీ ఆరు కోట్ల ఉచిత టికెట్లు విక్రయించినట్లు తెలదిపారు. కండక్టర్, డ్రైవర్లకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు. ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని, బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేoదుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. LIVE : Minister Ponnam Prabhakar Inaugurates 80 New RTC Buses https://t.co/C2TMl4o6rp — Telangana Congress (@INCTelangana) December 30, 2023 రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. లీజుకు ఆర్టీసీ భూములు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఎస్ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఈ-టెండరు దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానించింది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనుంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్సైట్లో చూడాలని సూచించింది. టెండర్లకు వచ్చే ఏడాది జనవరి 18 చివరి తేదీగా పేర్కొంది. -
కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ
-
TSRTC: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో, బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. అవసరం లేకున్నా కొందరు బస్సుల్లో ప్రయాణించడంతో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఓ మహిళా కండక్టర్‌ను కొందరు మహిళలు దూషించడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అంతటితో ఆగకుండా ఆమెను బస్సు నుంచి దింపేశారు. ఇక, ఈ ఘటనను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై సజ్జనార్ స్పందిస్తూ..‘టీఎస్ఆర్టీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం అని అన్నారు. #TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్… pic.twitter.com/4PIOXQmAAX — V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2023 -
TS: కండక్టర్‌తో మహిళా వాగ్వాదం.. రెండూ ఒకటే కదా..
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పట్ల చోట్ల బస్సుల్లో కండక్టర్లకు మహిళలకు, డ్రైవర్లకు మహిళలు మధ్య వాగ్వాదాలు జరుగుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ యువతి ఫోన్లో ఆధార్ కార్డు నంబర్ చూపి.. బస్సులో ప్రయాణానికి అనుమతి ఇవ్వావాలని కండక్టర్‌తో గొడవకు దిగింది. అక్కడితో ఆగకుండా ఒరిజినల్ ఆధార్, ఫోన్లో ఉండే ఆధార్ నంబర్ ఒకటే కాదా అని కండక్టర్‌తో వాదించింది. దీని సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే.. కచ్చింతంగా ఆధార్ కార్డు/ ఓటర్ ఐడీ కార్డు/ పాస్ పోర్టు వంటి గుర్తింపు కార్డులు చూపించాలని మార్గదర్శకాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కండక్టర్లు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపించాలని మహిళలను కోరుతున్నారు. ఇటువంటి సమయంలోనే పలు చోట్లు బస్సుల్లో గొడవలకు దారి తీస్తోంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం పలు చోట్ల గొడవలకు దారి తీస్తోంది. ఉచితంగా ప్రయాణించాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు/ఓటర్ ఐడీ/పాస్ పోర్ట్ లాంటి ఒక గుర్తింపు కార్డు ఉండాలని అంటున్న కండక్టర్లు. అయితే ఓ యువతి ఫోన్లో ఆధార్ నంబర్ చూపించడంతో కండక్టర్ పర్మిషన్ ఇవ్వట్లేదు. దీంతో ఆమెకు, కండక్టర్ కు… pic.twitter.com/CYSYFMbZZV — Telugu Scribe (@TeluguScribe) December 27, 2023 -
జీరో టికెట్‌పై కండక్టర్ల కన్నింగ్ ప్లాన్.. చర్యలకు TSRTC రెడీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీరో టికెట్ విషయంతో కొందరు కండక్టర్లు అత్యుత్యాహం చూపిస్తున్నారు. ఎక్కువ మందిని తీసుకెళ్తున్నామని చూపించుకోవడానికి లెక్కలు పెంచుతూ ఇష్టారీతిన టికెట్స్ కొడుతున్నారు. ఈ విషయం ఆర్టీసీ అధికారులు దృష్టికి చేరడంలో దీనిపై యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కారు. ఆధార్‌కార్డు చూపించి టికెట్ ఎస్ఆర్ నగర్ వరకూ టికెట్ ఇవ్వమని కోరారు. అయితే, బస్సు కండక్టర్ మాత్రం ఆమెకు.. కోఠి వరకూ జీరో టికెట్ ఇచ్చారు. దీంతో, టికెట్‌పై అదేంటని ప్రయాణికురాలు ప్రశ్నించగా.. మీరేమీ డబ్బులు ఇవ్వలేదు కదా? అని అన్నాడు. అదే బస్సుల్లో సదరు కండక్టర్ మరొకరికి కూడా ఇలాగే టికెట్ ఇచ్చినట్టు తేలింది. కాగా, విషయాన్ని సదరు ప్రయాణికులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి ఫిర్యాదులు గ్రేటర్‌జోన్ అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో, యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. అయినా కండక్టర్లలో మార్పు రావడంలేదు. అయితే.. అంతకుముందు నుంచి కూడా 2850 బస్సులులే ఉండగా.. ప్రయాణికులు మాత్రం రెట్టింపు అయ్యారు. గతంలో 11లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 18లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సీట్లు 60శాతం మహిళలతో నిండిపోతున్నాయి. 43 సీట్ల మెట్రో ఎక్స్‌ప్రెస్, 45 సీట్ల ఆర్డినరీ బస్సుల్లో వందమంది వరకూ ప్రయాణిస్తున్నారు. ఎంత పెరిగినా 2850 బస్సుల్లో 18లక్షల మంది ఎలా అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువమంది ప్రయాణికుల్ని తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్లకు యాజమాన్యం నజరానాలు ప్రకటించింది. అందుకే కొంతమంది జీరో టిక్కెట్లు జారీ చేసి లెక్కలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం! 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఆర్టీసీ కండక్టర్లు. ఉత్తి పుణ్యానికి జీరో టిక్కెట్లు కొడుతూ ప్రభుత్వం ధనం వృధా చేస్తున్న కండక్టర్లు. మహబూబ్ నగర్ నుండి తాండూరు… pic.twitter.com/Ht6fnPZP4q — Telugu Scribe (@TeluguScribe) December 24, 2023 ఇటీవల ఓ పల్లెవెలుగులో కండక్టర్ కూడా ఇలాగే చేసినట్టు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ప్రయాణికులు బస్సు ఎక్కకపోయినా కండక్టర్ జీరో టికెట్ కొడుతున్నారని సదరు ప్రయాణికుడు ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
మహిళా ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి
-
TSRTC: పల్లె వెలుగులు ఎక్కువగా వాడుకోండి: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. మరోవైపు ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఒక ప్రకటన చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అయితే అది మరోలా ఉంటోందని చెబుతున్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరుతూ ఓ వీడియోను ఉంచారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అన్నారయన. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. -
TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోందన్నారు. అయితే, హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం’ అని తెలిపారు. ఈ కొత్త బస్సుల్లో బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్) ఉందని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను #TSRTC అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు… pic.twitter.com/fjALCZS9Pm — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 22, 2023 ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
TS: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. ఆర్టీసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం పడింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిలళకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణీకులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్ సర్వీసులు లేక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు సరిపోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. TSRTC is inviting applications from entrepreneurs for the supply of various types of city buses under the Hire Scheme in the Greater Hyderabad zone. Prospective entrepreneurs may visit our website at https://t.co/r7jl9XZYI0 for details or contact 9100998230. @TSRTCHQ @PROTSRTC pic.twitter.com/oTbFhTndxE — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 22, 2023 దీంతో స్పందించిన టీఎస్ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, సిటీ మఫిసిల్ బస్సులు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అసక్తి ఉన్న వారు http://tsrtc.telangana.gov. లేదా మొబైల్ నంబర్: 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టీఎస్ఆర్టీసీ బస్సు నమూనా, కలర్, సీట్లు, తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకం కింద డిసెంబర్ 9వ తేదీన మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభించిందని.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసి ఎండీ సజ్జనార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పలు రూట్లలో బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. చదవండి: TS: ఉదయం 4.30 నుంచే ప్రజావాణి.. ఫిర్యాదుల్లో ఎక్కువగా ఏమున్నాయంటే -
ఆర్టీసీ పాలిట మహాలక్ష్మి మారిన మహాలక్ష్మి పథకం
-
‘ఇదేం అభిమానం!’ బిగ్‌బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అసెంబ్లీ వద్ద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, యువతులు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అలాగే, రాజీవ్ ఆరోగ్యశ్రీ(చేయూత)ని ప్రారంభించిన సీఎం, మంత్రులు. దీంతో, ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మహాలక్ష్మీ పథకం అమలులోకి రానుంది. తెలంగాణలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఆవరణలో మూడు బస్సులు ప్రారంభమయ్యాయి. ఇక, ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్యఖర్యులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పచ్చజెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నేడు సోనియా గాంధీ పుట్టినరోజు. డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశాన్ని సోనియా మనకు ఇచ్చారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. తెలంగాణవ్యాప్తంగా మహాలక్ష్మీ పథకం అమలులోకి వస్తుంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు గ్యారంటీలను అమలుచేస్తున్నాం అని అన్నారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ మంత్రులు, మహిళ నేతలు బస్సులో ట్యాంక్ బండ్‌కు బయలుదేరారు. దీంతో, అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది. ఇక, నేటి మధ్యాహ్నం నుంచి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. నిఖత్ జరీన్‌కు ప్రోత్సాహకం.. అలాగే, బాక్సర్ జఖర్ ఘరీన్‌కు రూ. 2కోట్ల చెక్‌ను సీఎం రేవంత్ అందించారు. వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. -
TS: రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రేపటి(శనివారం) నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు టీఎస్ఆర్టీసీ సీఎండీ సజ్జనార్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ‘మహాలక్ష్మీ స్కీమ్’ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీగా జీరో అమౌంట్ టికెట్‌తో ప్రయాణించవచ్చని తెలిపారు. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నాలుగైదు రోజులు గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించవచ్చుని తెలిపారు. ప్రయాణీకుల సంక్షేమం కోసం ఆర్టీసీ యాజమాన్యం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ ప్రయాణం మంచి స్కీమ్ అని కొనియాడారు. స్కీమ్‌తో ఆర్టీసీకి ఆదరణ మరింత పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారని వెల్లడించారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రస్తుతం 7290 బస్సులు ఉన్నాయని, రోజు ఆదాయం 14 కోట్ల వరకు వస్తోందని తెలిపారు. మహిళలకు ఫ్రీ ప్రయాణంతో 50 శాతం ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు. తగ్గే ఆదాయంపై ప్రభుత్వ సహాయంకై విజ్ఞప్తి చేశామని చెప్పారు. -
డిజిటలైజేషన్ దిశగా టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకు గానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ మేరకు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా సాంకేతికతలో ముందడుగు వేసింది. 9 వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తోంది. ఇంత విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న సంస్థ.. అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. డిజిటలైజేషన్ ఆవశ్యకతను గుర్తించి, ఈఆర్పీ ప్రాజెక్టులో భాగంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యుషన్ (CIS)పై మొగ్గు చూపి వాటి సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు నల్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంస్థ ఓ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఈఆర్పీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. “సంస్థ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈఆర్పీ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. పది నెలల వ్యవధి రికార్డు సమయంలో సంస్థ ఈఆర్పీ ప్రాజెక్టును అమలులోకి తెచ్చాం. CIS ప్రాజెక్ట్ సమర్థవంతమైన ఆదాయ నిర్వహణ, వ్యయ నియంత్రణ కోసం సకాలంలో చర్యలకు దోహదపడుతోంది. కేంద్రీకృత సమగ్రమైన డేటా లభ్యత, భద్రతతో పాటు మానవశక్తి వినియోగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్లపై కేంద్రీకృతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తిగత స్టోర్లు, వర్క్‌షాపులు, ఆదాయ నిర్వహణ, పే రోల్ వంటి కార్యకలాపాల నిర్వహణలో రాష్ట్రంలోని అన్ని డిపోలు, జోన్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలన్నింటినీ ఈఆర్పీ ఏకీకృతం చేస్తోంది. ఈ సేవల్ని వినియోగించుకోవడంలో దేశంలోని ఆర్టీసీల్లో టీఎస్ ఆర్టీసీ మొదటిది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెట్ వర్క్‌ను అప్ గ్రేడ్ చేశాం అని సంస్థ వీసీ అండ్ ఎండీ వి.సి.సజ్జనర్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత సామార్థాన్ని మెరుగుపరచాలనే ఉద్ధేశంతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. సమర్థవంతమైన ఈ వ్యవస్థ సంస్థ అభివృద్ధికి దోహద పడగలదని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన నాణ్యమైన సేవల్ని అందించేందుకు టీఎస్ ఆర్టీసీతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని నల్సాఫ్ట్ సీఈఓ నల్లూరి వెంకట్ ఆనందం వ్యక్తం చేశారు. సమష్టి కృషి, అంకితభావంతో పని చేసి నిర్ధేశించుకున్న కాలానికి పూర్తి చేయగలిగామని చెప్పారు. ఆధునీక సాంకేతితను అందిపుచ్చుకోవడంలో టీఎస్ ఆర్టీసీ ముందంజలో ఉందన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హన్స ఈక్విటీ పార్ట్నర్స్ త్రినాథ్ బాబు మాట్లాడుతూ, రోజువారీ కార్యకలాపాల్లో సాంకేతికతను ఉపయోగించకుండా ఏ సంస్థ కూడా పురోగమించదన్నారు. సీఐఎస్ ప్రాజెక్టు ద్వారా కార్యకలాపాల నిర్వహణ మరింత సౌలభ్యంగా మారే అవకాశం ఉందన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ టీఎస్ ఆర్టీసీ పురోగమించడం శుభపరిణామన్నారు. సీఓఓ డాక్టర్ వి రవీందర్, ఐటి కన్సల్టెంట్ శ్రీమతి దీపా కోడూర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పివి ముని శేఖర్, ఎస్ కృష్ణకాంత్, వి.వెంకటేశ్వర్లు, ఎ. పురోషోత్తం, ఆర్థిక సలహాదారు విజయ పుష్ప, చీఫ్ ఇంజనీర్ (IT) ఎం. రాజ శేఖర్, తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఓటర్ల ఇక్కట్లు.. ఓటు వేసేది ఎలా?..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు తరలి వెళ్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఎన్నికల తమ వంతుగా ఓట్లు వేసేందుకు ఓటర్లు కదిలారు. భాగ్యనగరం నుంచి తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో, బస్సు, రైళ్లు నిండిపోయాయి. సరిపడినన్ని బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, ఉన్న కొద్ది బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండంతో స్థలం సరిపోక.. బస్సులపైకి ఎక్కి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద.. బస్సుపైకి ఎక్కి ప్రయాణికులు ఇళ్లకు వెళ్తున్నారు. మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్, కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు భారీ తరలివెళ్తున్న ప్రజలు. ఔటర్ వైపు భారీగా చేరుకుంటున్న వాహనాలు.