Article 370
-
ఇందిరా గాంధీ తిరిగొచ్చినా ఆర్టికల్ 370 పునురుద్దరించబోం: అమిత్ షా
కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ఇందిరా గాంధీ స్వర్గం నుంచి తిరిగొచ్చినా.. ఆర్టికల్ 370 పునరుద్దరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. పదేళ్ల సోనియా గాంధీ-మన్మోహన్ సింగ్ పాలనలో ఉగ్రవాదులు సులభంగా జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించి బాంబు దాడులకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ను సందర్శించిన సందర్భంగా తాను భయపడ్డానని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై షా స్పందిస్తూ.. షిండే జీ, మీ మనవళ్లతో కలిసి ఇప్పుడు కాశ్మీర్‌కు వెళ్లండి, మీకు ఎటువంటి హాని జరగదు’ అని అన్నారు.కాగా జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఏర్పడిన ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని అసెంబ్లీలో తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన మరో ర్యాలీలో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ నాల్గో తరం కూడా కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరని అన్నారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ చాలా కృషి చేశారని షా అన్నారు. -
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్
రాంచీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపించి అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎప్పటికీ అనుమతించదని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా.. పాలమూలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించారు. ఆయన చూపించిన రాజ్యాంగం కాపీ కవర్‌పై భారత రాజ్యాంగం అని వ్రాసి ఉంది. అందులో ఏ కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. నకిలీ రాజ్యాంగ కాపీతో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారు. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదని నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం’ అని అన్నారు.ఇక.. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.చదవండి: దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి -
రాహుల్ భావితరాలు కూడా.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేవు
సాంగ్లి (మహారాష్ట్ర): కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, ఆయన వారసులు కూడా జమ్మూశ్మీమర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అది వారి వల్లకాదన్నారు. సాంగ్లిలో మహాయుతి తరఫున శుక్రవారం అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం బుధవారం జమ్మూశ్మీమర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ మద్దతునివ్వడంతో అమిత్ షా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్ష నేతలు రాహుల్ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్లు వ్యతిరేకించారని షా గుర్తుచేశారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డపై నుంచి చెబుతున్నా.. రాహుల్ బాబా. మీరు లేదా మీ నాలుగోతరం వారసులు కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరు. శ్మీమర్ కోసం దేశంలోని ప్రతి వ్యక్తి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు’అని అమిత్ షా అన్నారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నపుడు పార్లమెంటులో నేనా బిల్లును ప్రవేశపెట్టాను. రాహుల్ గాం«దీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్లు దీన్ని వ్యతిరేకించారు. దీనివల్ల శ్మీమర్ లోయలో రక్తపాతం జరుగుతుందన్నారు. రక్తం ప్రవహించడం మాట అటుంచితే కనీ సం రాయి విసిరే సాహసం కూడా ఎవరూ చేయలేదు’అని అమిత్ షా పేర్కొన్నారు. యూపీఏ హయాంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవి. ఉరి, పుల్వామా ఘటనల తర్వాత చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్‌లోని తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. మోదీ ప్రయత్నాల వల్ల అది సాకారమైందని అమిత్ షా అన్నారు. -
కశ్మీర్ అసెంబ్లీలో ఆఖరి రోజూ ఆగని ఆందోళనలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఆఖరి రోజైన శుక్రవారం కూడా ఆందోళనల మధ్యే కొనసాగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. గొడవకు దిగిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా.. జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను కేంద్రం త్వరలోనే ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంత హోదాతో పరిమిత అధికారాలతో అభివృద్ధిని, శాంతిభద్రతలను సాధించలేమని చెప్పారు. సమావేశాల సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షం నేత సునీల్ శర్మతోపాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఎన్సీ ఎమ్మెల్యే సజ్జాద్ షహీన్, మరొకరు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ రథేర్ చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
ఆర్టికల్ 370 రగడ.. కాంగ్రెస్ కు మోదీ వార్నింగ్
-
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో రసాభాస
-
Video: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసాగా కొనసాగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో తొలిరోజైన సోమవారం నుంచే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా పునరుద్దరణ అంశాలపై గందరగోళం నెలకొంది. గురువారం అయిదోరోజు అసెంబ్లీలో ఆర్టికల్ 370పై పెద్ద రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ సభలో వాగ్వాదానికి దిగారు.అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే, జైల్లో ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడంతో సభలో రగడ మొదలైంది. ఈ నిరసన ప్రదర్శనపై సభలో బీజేపీ ప్రతిపక్షనేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే మార్షల్స్ జోక్యం చేసుకొని గొడవపడుతున్న ఎమ్మెల్యేలను బలవంతంగా దూరం తీసుకెళ్లారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడి, తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్యేల ముషియుద్దానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This is a reminder to BJP, this is not UP, this is Jammu and Kashmir assembly. ANY misadventure will get befitting reply! Kudos to @sajadlone for being the fierce tiger he is and putting these BJP MLA's in their place. DONT REKINDLE OUR MUSCLE MEMORY!!!!! @JKPCOfficial pic.twitter.com/kJpxTK9n59— Munneeb Quurraishi (@Muneeb_Quraishi) November 7, 2024గురువారం సభ ప్రారంభమైన వెంటనే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరుతూ శాససనసభ బుధవారం ఆమోదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళన చేపట్టింది. పార్టీ సభ్యులు తీర్మానం ప్రతులను చించి సభ వెల్ లోకి విసిరారు. ఈ గందరగోళం మధ్య ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్‌పై స్పీకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర చీఫ్ రవీందర్ రైనా స్పందిస్తూ.. అధికార ఎన్సీ, కాంగ్రెస్‌లు భారత వ్యతిరేక భావాలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కా హాత్ పాకిస్థాన్ కే సాత్, కాంగ్రెస్ కే హాత్ టెర్రరిస్టుల కే సాత్ అంటూ నినాదాలు చేశారు. -
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. తొలి రోజే ఆర్టికల్ 370 రగడ
-
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. నేటి సమావేశంలో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పుల్వామా నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పారా.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన స్పీకర్ అబ్దుల్రహీమ్ రాథర్‌కు తీర్మానాన్ని సమర్పించారు. అయిదు రోజుల అసెంబ్లీ సెషన్ ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ ప్రజల కోరకు మేరకు స్పీకరర్గా తన అధికారాలను ఉపయోగించి దీనిపై చర్చించాలని ఆయన కోరారు.అయితే ఈ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిని అనుమతించకూడదని కాషాయ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం తీసుకొచ్చినందుకు పారాను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే షామ్ లాల్ శర్మ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే అభ్యర్థించినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో కాసేపు అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది.అనంతరం అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు లాంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు. ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తేల్చిచెప్పారు. సభ ఎలా జరగాలనేది, ఏం చర్చించాలనే ఏ ఒక్క సభ్యులచే నిర్ణయించరాదని అన్నారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న ఆర్టికల్ 370ని రద్దు నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని అన్నారు. అయితే రాష్ట్ర పునరుద్దరణకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. దీంతో, ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది. -
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..
-
Omar Abdullah: బీజేపీ నుంచి ఆశించడం మూర్ఖత్వం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను లాక్కున్న బీజేపీ నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆశించడం మూర్ఖత్వమని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరి మారబోదన్నారు. ఆర్టికల్ 370పై మాట్లాడబోమని కానీ, అదిప్పుడు సమస్య కాదని తామెప్పుడూ చెప్పలేదని అబ్దుల్లా స్పష్టం చేశారు. భవిష్యత్‌లో దేశంలో ప్రభుత్వం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఒమర్... అప్పుడు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించే కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో కాకుండా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం సజావుగా నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి జమ్మూకశ్మీర్‌కు చాలా తేడా ఉందని, 2019కు ముందు జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రమని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని, హోంమంత్రి, సీనియర్ మంత్రులు చెప్పారని, డీలిమిటేషన్, ఎన్నికలు జరిగాయని, రాష్ట్ర హోదా మాత్రమే మిగిలి ఉందని, దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఘర్షణ పడటం వల్ల సమస్యలను పరిష్కరించలేమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్సీ గురువారం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అబ్దుల్లా చెప్పారు. ఆ తర్వాత కూటమి సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరుతామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ భాగస్వామ్యం అవుతుందా అన్న ప్రశ్నకు ఎన్సీ నేత సమాధానమిస్తూ ప్రస్తుతానికి దానిపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.హిందువుల్లో విశ్వాసాన్నిపెంచుతాం: ఫరూక్జమ్మూకశ్మీర్ మధ్య బీజేపీ సృష్టించిన విభేదాలను తగ్గించి, హిందువుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రెండు ప్రాంతాల మధ్య భేదం చూపబోమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అతిపెద్ద సవాళ్లున్నాయన్నారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది కూటమి నిర్ణయిస్తుందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడంపై ఫరూక్ స్పందిస్తూ.. తాను నిర్ణయించిందే జరుగుతుందని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అభ్యర్థని ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
పాక్ నోట మళ్లీ పాతపాట
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కశీ్మర్ ప్రస్తావన తెచి్చంది. దీర్ఘకాలిక శాంతి కోసం భారత్ ఆరి్టకల్ 370ని పునరుద్ధరించాలని, జమ్మూకశీ్మర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ తన సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి షరీఫ్ శుక్రవారం ప్రసంగించారు. ఆరి్టకల్ 370, హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బుర్హాన్ వనీల ప్రస్తావన తెచ్చారు. ‘పాలస్తీనియన్ల లాగే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్య్రం, స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్దకాలంగా పోరాడుతున్నారు’ అని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూకశీ్మర్పై భారత్ చర్చలకు రావాలన్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపించారు. స్వీయ నిర్ణయాధికారం జమ్మూకశీ్మర్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయని అన్నారు. భారత్‌కు బ్రిటన్ మద్దతు ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వముండాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ మద్దతు పలికారు. భారత్ డిమాండ్‌కు అమెరికా, ఫ్రాన్స్‌లు ఇదివరకే మద్దతు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో, మరింత స్పందనతో కూడి ఉండాలని స్టార్మర్ ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. -
జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి వ్యాఖ్యల దుమారం
ఢిల్లీ: జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్టికల్ 370 అంశంపై పాకిస్తాన్ జోక్యం చేసుకుంది. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే విధమైన ఆలోచనతో ఉన్నాయని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మట్లాడుతూ.. ‘‘జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కూటమి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఎన్నికల అంశంగా మార్చారు. ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణ కోసం జమ్ము కశ్మీర్లో పాకిస్తాన్ , నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఒకే అభిప్రాయంతో ఉన్నాయి’’ అని అన్నారు. ఎన్నికల జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిపై పాక్ జోక్యం చేసుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దుమారం రేపుతున్నాయి. ఇక.. ఇప్పటి వరకు పాక్ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు.Pakistan’s Defence Minister @KhawajaMAsif on Hamid Mir’s Capital Talk on Geo News says, “Pakistan and @JKNC_ - @INCIndia alliance are on the same page in Jammu & Kashmir to restore Article 370 and 35A”. Will @RahulGandhi & @OmarAbdullah react. pic.twitter.com/x9dYev2PHM— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) September 19, 2024 ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తాము అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్ పూర్తిగా మౌనంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ప్రస్తావన లేకపోవటం గమనార్హం. కానీ, ముందు నుంచి జమ్ము కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని హామీ ఇస్తూ వస్తోంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ హామీ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు మెహబూబా ముఫ్తీ పీడీపీ తన మేనిఫెస్టోలలో పెట్టింది.పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు బీజేపీ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారి వైపే ఉంటుందని ఆరోపణలు చేసింది. ‘‘ఉగ్రవాద రాజ్యమైన పాకిస్తాన్, కశ్మీర్ విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరిని సమర్థిస్తుంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎల్లప్పుడూ భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన వారి వైపు కనిపిస్తారు’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్‌లో విమర్శించారు. -
కశ్మీర్లో నేడే తొలి దశ
శ్రీనగర్/జమ్మూ: జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో 8 స్థానాలు జమ్మూలో, 16 కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 23 లక్షల పై చిలుకు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. జమ్మూ కశ్మీర్లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం. పైగా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. దాంతో ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనని ఆసక్తి నెలకొంది. ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు, సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు. సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న రెండు, మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి. పారీ్టలన్నింటికీ ప్రతిష్టాత్మకమే ప్రధాన ప్రాంతీయ పారీ్టలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వేర్పాటువాద జమాతే ఇస్లామీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ, డీపీఏపీ కూడా బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీ పొత్తు పెట్టుకున్నా మూడుచోట్ల స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. మరో చోట ఎన్సీ రెబెల్ బరిలో ఉన్నారు. కశ్మీర్‌పై కాషాయ జెండా ఎగరేయజూస్తున్న బీజేపీనీ రెబెల్స్ బెడద పీడిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుంచి 43కు పెరిగాయి. ముస్లిం ప్రాబల్య కశ్మీర్లో ఒక్క సీటే పెరిగింది.బరిలో ప్రముఖులు: మొహమ్మద్ యూసుఫ్ తరిగమీ (సీపీఎం) కుల్గాం నుంచి వరుసగా ఐదో విజయంపై కన్నేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్దూరు నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత సకీనా (దమ్హాల్ హాజిపురా), పీడీపీ నేతలు సర్తాజ్ మద్నీ (దేవ్సర్), అబ్దుల్ రెహా్మన్ వీరి (షంగుస్–అనంత్‌నాగ్), మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా (శ్రీగుఫ్వారా–బిజ్బెహరా), వహీద్ పరా (పుల్వామా) తదితర ప్రముఖులు తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ప్రధాన సమస్యలు ఇవే...→ నిరుద్యోగం, అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి జమ్మూ కశ్మీర్ ప్రజలు ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు. → పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభిస్తేనే సమస్యలు తీరి తమ ప్రయోజనాలు నెరవేరతాయని వారు భావిస్తున్నారు. దాంతో దాదాపుగా పారీ్టలన్నీ దీన్నే ప్రధాన హామీగా చేసుకున్నాయి. → ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని కూడా ఎన్సీ వంటి పార్టీలు చెబుతున్నాయి. విద్య, వివాహాలు, పన్నులు, సంపద, అడవుల వంటి పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తామంటున్నాయి. → ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీరీలు భారీ సంఖ్యలో ఓటువేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. -
పీఓకే ప్రజలారా.. భారత్‌లో కలవండి
జమ్మూ/బనిహాల్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామ్‌బాన్ నియోజకవర్గంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి యువత పిస్టల్, రివాల్వర్ పట్టుకోవడం వదిలేసి ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నారు. కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. బీజేపీకి మద్దతు పలికితే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇక్కడ మరింత అభివృద్ధిని సాకారం చేస్తాం. ఇక్కడి అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు సైతం భారత్‌తో కలిసిపోతే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకుంటారు. నాదీ గ్యారెంటీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పీఓకే ప్రజలను భారత్‌లో విలీనానికి పిలుపునిచ్చారు. ‘‘ పీఓకే ప్రజలకు నేను చెప్పేదొకటే. పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయుల్లా భావిస్తోంది. పాక్ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం ఒప్పుకుందికూడా. ఇటీవల పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ ఒక విషయంలో సమర్పించిన అఫిడవిట్లో పీఓకే అనేది ఎప్పటికీ పాక్‌కు విదేశీ భూభాగమే అని స్పష్టంగా పేర్కొన్నారు. మిమ్మల్ని భారత్ తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే రండి. మాతో కలవండి’’ అని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఆపేస్తే చర్చలకు సిద్ధంజమ్మూకశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం పూర్తిగా ఆపేస్తే ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధమని రాజ్‌నాథ్ ప్రకటించారు. ‘‘ ఉగ్రవాదానికి మద్దతు పలకడం అనే చెడ్డపనిని పాక్ ఆపేయాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాల మెరుగు కోసం ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనం మన మిత్రుడిని మార్చుకోగలంగానీ పొరుగు దేశాన్ని కాదుకదా. పాక్‌తో బంధం బలపడాలనే కోరుకుంటున్నాం. ముందుగా పాక్ ఉగ్రవాదాన్ని వీడాలి. ఉగ్రవాదాన్ని కశ్మీర్లో ఆపినప్పుడే చర్చలు పట్టాలెక్కుతాయి. ఇక్కడ ఉగ్రవాదం కోరల్లో చిక్కుకున్న వారిలో 85 శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఉగ్రఘటనల్లో ముస్లింలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఉగ్రవాదం బాటలో పయనించి ప్రాణాలు పోగొట్టుకోకండి’’ అని రాజ్‌నాథ్ హితవు పలికారు. -
జమ్ములో భావసారూప్య పార్టీలతో కూటమికి కాంగ్రెస్ సై
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) వేగంగా సిద్ధమవుతోంది. సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీలిచ్చింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 18, 25, అక్టోబరు 1వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ కు 1953కు ముందున్న స్వయం ప్రతిపత్తిని కోరతామని ఎన్సీ మేనిఫెస్టో పేర్కొంది. ఈ మేరకు 2000 జూన్‌లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి సారథ్యంలో కేంద్ర కేబినెట్ దీన్ని తిరస్కరించింది. 2019లో నరేంద్ర మోదీ సర్కారు ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశీ్మర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష కోరతామని, కశీ్మరి పండిట్లు గౌరవప్రదంగా తిరిగి వచ్చేలా చూస్తామని మేనిఫెస్టోలో ఎన్సీ హామీ ఇచి్చంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కరెంటు, నీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తామని పేర్కొంది. పేదలకు ఏడాదికి 12 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. అమలు చేయగలిగిన హామీలను మాత్రమే ఇచ్చామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మేనిఫెస్టోను విడుదల చేస్తూ అన్నారు. అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తొలి సమావేశాల్లో తీర్మానం చేస్తామని ఒమర్ వెల్లడించారు. పేద కుటుంబాలకు చెందిన ప్రతి గృహిణికి నెలకు రూ.5,000 ఆర్థికసాయం అందజేస్తామని, యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చింది. భావసారూప్య పార్టీలతో కూటమికి సిద్ధంజమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నూతన చీఫ్ తారిక్ హమీద్ కర్రా శ్రీనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ)సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూకశీ్మర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వెల్లడించారు. ఎన్సీ ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్లు తనకు తెలిసిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం గత వారం పార్టీ జమ్మూకశీ్మర్ చీఫ్‌గా కర్రాను నియమించింది. సోమవారం న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంలో ఎన్సీ, పీడీపీలు ఇప్పటికే కాంగ్రెస్‌కు పచ్చజెండా ఊపాయన్న తారిక్ అహ్మద్..భావ సారూప్యం కలిగిన ప్రాంతీయ పారీ్టలతో చర్చలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అధిష్టానం ఇప్పటికే ఇందుకోసం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే ఉద్దేశంతో కాంగ్రెస్‌ను వీడిన గులాం నబీ ఆజాద్‌తో, ఆయన సొంతపార్టీ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీతో మాత్రం చర్చల ప్రశ్నే లేదన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించకుంటే సుప్రీంకు: ఒమర్ కేంద్ర ప్రభుత్వం జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఈ విషయంలో తమదే విజయమని, రాష్ట్ర హోదా సాధించుకుంటామని అన్నారు. తమ పార్టీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని ఒమర్ చెప్పారు. అదే సమయంలో, ఇతర పార్టీల ఓటు బ్యాంకు చీలి పోయిందని చెప్పారు. ఈ విషయం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తేలిపో యిందన్నారు. ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులతోనే అసలైన ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. -
Election Commission of India: మోగింది ఎన్నికల భేరీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దశాబ్ద కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆర్టీకల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం తొలిసారిగా ఎన్నికల సందడి ప్రారంభం కాబోతోంది. జమ్మూకశ్మీర్‌తోపాటు హరియాణా శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి ఒక దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో సెపె్టంబర్ 18, సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలియజేశారు. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్–డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను సాధారణంగా ఐదు దశల్లో నిర్వహిస్తుంటారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే జమ్మూకశ్మీర్‌లో తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకుంటున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈసారి కేవలం మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయబోతున్నామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాల వల్లే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసినట్లు వివరించారు. 2019లో హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరంభంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సైతం జరగాల్సి ఉందని, వీటిలో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, హరియాణాలో పోలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్‌తోపాటు ఎన్నికల సంఘం కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెపె్టంబర్ 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.ముగ్గురు జెంటిల్మెన్ మళ్లీ వచ్చేశారు ముగ్గురు పెద్దమనుషులు(జెంటిల్మెన్) మళ్లీ వచ్చేశారని మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ చమత్కరించారు. తన సహచర కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూను విలేకరులకు పరిచయం చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ‘లాపతా జెంటిల్మెన్’ అంటూ ట్రోలింగ్ నడిచింది. ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కనిపించకుండాపోయారని, లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జూన్ 3న విలేకరుల సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... లాపతా జెంటిల్‌మన్లు త్వరలో తిరిగివస్తారని చెప్పారు. తాము ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. -
Union Minister G Kishan Reddy: కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్‌లో ఎన్నికలు
ఆర్‌ఎస్‌పురా: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగుతా యని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇకపైనా కొనసాగాలంటే బీజేపీకే అధికారమివ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లయిన సందర్భంగా సోమవారం జమ్మూ శివారులోని బానా సింగ్ స్టేడియంలో మహోత్సవ్’ ర్యాలీనుద్దేశించిమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. -
Article 370 Removal: అది మా అజెండాలో ఉంది: బీజేపీ నేతలు
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 2019 ఆగస్టు 5న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చారిత్రక ఘట్టానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు బీజేపీ నేతలు తమ స్పందనలు తెలియజేస్తున్నారు.ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ‘ఇది మా(బీజేపీ) ఎజెండాలో ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దీని కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారు. నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించి స్థానికులకు స్వేచ్ఛ కల్పించారు’ అని అన్నారు. #WATCH | Raipur: Chhattisgarh CM Vishnu Deo Sai says "Today is the third Monday of the 'Sawan' month. I want to extend my wishes to the people of the state. I am travelling to to Kawardha along with Deputy CM Vijay Sharma wherein we will offer prayers to Lord Shiva..."On 5… pic.twitter.com/VC0jJIDzXh— ANI (@ANI) August 5, 2024 జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ ‘2019, ఆగస్టు 5 న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఫలితంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రతి వ్యక్తికి హక్కులు లభించాయి. ఆర్టికల్ 370 తీసుకురావడం ద్వారా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు జమ్ముకశ్మీర్ ప్రజలకు ద్రోహం చేశాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ ‘వన్ ఇండియా-బెస్ట్ ఇండియా’ సంకల్పాన్ని నెరవేర్చారు’ అని అన్నారు. జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ‘ఈరోజు చరిత్రాత్మకమైన రోజు. ఆర్టికల్ 370, 35ఏలను తొలగించడం ద్వారా జమ్ము, కశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్రవాదం అదుపులోకి వచ్చింది. వేర్పాటువాదులు జైలులో ఉన్నారు. స్థానికులు ఉపాధి పొందుతున్నారు. లోయలో శాంతి నెలకొంది’ అని అన్నారు. #WATCH | On the 5th anniversary of the abrogation of Article 370, former Deputy CM of Jammu and Kashmir and BJP leader Nirmal Singh says, "Today is a very historic day. Today on 5 August 2019, the Parliament removed Article 370 and 35A and implemented the Constitution of India in… pic.twitter.com/WY27a5DVZR— ANI (@ANI) August 5, 2024 -
ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. జమ్ముకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేసి నేటికి (ఆగస్టు 5) ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు భద్రతను మరింతగా పెంచారు. భద్రతా దళాలు అణువణువునా పహారా కాస్తున్నాయి.2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. దీనికితోడు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తయిన నేపధ్యంలో జమ్మూ జిల్లాలోని అఖ్నూర్లో భద్రతను మరింతగా పెంచారు. ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై నిఘా సారిస్తున్నారు.ఈ సందర్భంగా దక్షిణ జమ్మూ ఎస్పీ అజయ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా తాము మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు. కాగా దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత జమ్ముకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులు జరిగాయి. వీటిలో కథువాలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి, దోడా, ఉదంపూర్‌లలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్ ప్రధానమైనవి. -
Amit Shah: మేం అలాగే చేస్తాం
న్యూఢిల్లీ: విపక్షాల విమర్శలకు జడిసేదిలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టంచేశారు. ఆరి్టకల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, ముస్లింలకు కోటాను వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మతం అంశాన్ని ముందుకు తెస్తోందని విపక్షాలు విమర్శించినాసరే తాము అలాగే చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఆదివారం పీటీఐతో ఇంటర్వ్యూలో షా వెల్లడించిన విషయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. మేం అప్పుడు ఓడిపోయాం కదా! ‘‘రాజ్యాంగంలో లేనివిధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు విపక్షాలు ఇస్తామంటే వ్యతిరేకిస్తున్నాం. ఆరి్టకల్ 370ని రద్దుచేశాం, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చాం. చేసిన పనులనే చెప్పుకుంటున్నాం. వద్దు అని విపక్షాలు అన్నాసరే మేం అలాగే చేస్తాం. కావాలనే పోలింగ్ శాతాలను ఈసీ ఆలస్యంగా వెల్లడిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు అంటున్నాయి. ఈవీఎంలను బీజేపీ తమకు అనుకూలంగా మార్చేస్తోందని విపక్షాల చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. తెలంగాణ, పశి్చమబెంగాల్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఈసీ ఇలాగే చేసింది. అప్పుడు ఆ రాష్ట్రాల్లో మేం ఓడిపోయాంకదా. ఆ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఈ ఎన్నికలు కూడా అంతే పారదర్శకంగా జరుగుతున్నట్లే లెక్క. ఓడిపోతానని రాహుల్ గాంధీ ఊహించారు. అందుకే ముందే ఏడ్చేసి, ఏవో కారణాలు చెప్పేసి విదేశాలకు వెళ్లిపోతారు. జూన్ 6న విదేశాలకు వెళ్తారేమో. అందుకే ఏదో ఒకటి చెప్తున్నారు’’ ‘400’ అనేది నినాదం కాదు ‘‘ మేం 399 సీట్లు సాధిస్తే ‘ మీకు 400 రాలేదుగా’ అని విపక్షాలు విమర్శిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తా. ఈసారి 400 సీట్లు గెలుస్తాం అనేది మా నినాదం కాదు. విజయావకాశాలను లెక్కగట్టి చెప్పిన సంఖ్య అది. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వల్లే మేం ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. పేద కుటుంబమహిళకు ఏటా రూ.1 లక్ష ఇస్తామని కాంగ్రెస్ అమలుచేయలేని వాగ్దానాలిస్తోంది. 2–3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తోంది. రూ.1 లక్ష సంగతి దేవుడెరుగు గతంలో హామీ ఇచి్చనట్లు(హిమాచల్ ప్రదేశ్‌లో) రూ.1,500 అయినా ఇస్తారేమో చూద్దాం. బెంగాల్, ఒడిశాలోనూ మాదే హవా ‘‘పశ్చిమబెంగాల్లో 24–30 సీట్లు, ఒడిశాలో 16–17 సీట్లు గెలుస్తాం. తమిళనాడులోనూ ఓటు షేర్ పెంచుకుంటాం. ఈసారి కేరళలో ఖాతా తెరుస్తాం. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా ఉమ్మడి పౌరస్మతి అమలుచేస్తాం. మండే ఎండాకాలంలో కాకుండా వేరే కాలంలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అమలుచేస్తాం. సంబంధిత బిల్లునూ పార్లమెంట్లో ప్రవేశపెడతాం. ఆర్మీలో యువత కోసం అగి్నవీర్ను మించిన అద్భుత పథకం లేదు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత చక్కని ప్రతిభ కనబరిచిన వారికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉంది కదా’’. -
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
PM Narendra Modi: ఆ ఆలోచన మానుకోండి
సోనీపట్/న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టామని, దాన్ని మళ్లీ వెనక్కి తీసుకురావాలన్న ఆలోచన విరమించుకోవాలని కాంగ్రెస్ పారీ్టకి ప్రధాని మోదీ హితవు పలికారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను కురుక్షేత్రంగా సంగ్రామంగా అభివరి్ణంచారు. ఈ రణరంగంలో ఒకవైపు అభివృద్ధికి కట్టుబడి ఉన్న మోదీ సర్కారు, మరోవైపు ఓటు జిహాద్ మోహరించాయని అన్నారు. శనివారం హరియాణాలోని అంబాల, గొహనా, దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. దేశ వ్యతిరేక అజెండాను కాంగ్రెస్ దాచుకోవడం లేదని అన్నారు. బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... పాకిస్తాన్‌కు భయపడతామా? ‘‘ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న స్వప్నాన్ని కాంగ్రెస్ మర్చిపోవాలి. లేకపోతే మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత జమ్మూకశీ్మర్ అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. కాంగ్రెస్ అధికారానికి దూరమై పదేళ్లవుతోంది. ఆ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని శాసించిన ఆ పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ప్రభుత్వ పథకాలకు కేవలం ఒకే ఒక కుటుంబం పేరు పెట్టారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పాలనలో సరిహద్దుల్లో నిత్యం కాల్పులు, కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనలు జరుగుతుండేవి. మా ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. శత్రువు అప్పటి శత్రువే. కానీ, ప్రజల ఓటు పరిస్థితిని మొత్తం మార్చేసింది. సరిహద్దుల్లో ఉన్న మన సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఇదంతా కాంగ్రెస్‌కు, విపక్ష ఇండియా కూటమికి నచ్చడం లేదు. కాంగ్రెస్ మనుషులు పాకిస్తాన్ అధికార ప్రతినిధులుగా మాట్లాడుతున్నారు. మనం పాకిస్తాన్‌కు భయపడతామా? ఇప్పుడున్నది నరేంద్ర మోదీ పరిపాలన. శత్రువులను వారి భూభాగంలో అడుగుపెట్టి మరీ దెబ్బకొడతాం.’’ -
Lok Sabha Election 2024: కశ్మీర్లో కనిపించని కమలం!
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలతో కలిసి 400 పైచిలుకు స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కశ్మీర్లో మాత్రం మూడు లోక్‌సభ స్థానాలకు దూరంగా ఉండటం విశ్లేషకులకు కూడా అంతుబట్టకుండా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు ఏవీ పోటీ చేయని స్థానాలు ఈ మూడే! ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కలి్పంచే ఆరి్టకల్ 370తో పాటు రాష్ట్ర హోదా కూడా రద్దు చేశాక జరుగుతున్న తొలి లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎందుకిలా ముఖం చాటేసినట్టన్న ప్రశ్న తలెత్తుతోంది... కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో 5 లోక్‌సభ స్థానాలున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్– రాజౌరి స్థానాలు శ్రీనగర్ పరిధిలోనివి. వీటిల్లో ముస్లిం ఓటర్లే గణనీయంగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఈసారి కావాలనుకుంటే వ్యూహాత్మకంగా ముస్లిం అభ్యర్థులను బరిలో దింపొచ్చు. కానీ జమ్మూ పరిధిలోని జమ్మూ, ఉదంపూర్ లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది. ఈ రెండూ బీజేపీ సిట్టింగ్ స్థానాలే. తొలి, రెండో విడతలో వీటికి ఎన్నిక ముగిసింది. జమ్మూలో 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన జుగల్ కిషోర్ శర్మ బీజేపీ తరఫున మళ్లీ పోటీ చేశారు. ఉదంపూర్లోనూ గత రెండు ఎన్నికల నుంచి బీజేపీ టికెట్‌పై గెలుస్తున్న ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పోటీ చేశారు. శ్రీనగర్‌లో మే 13న పోలింగ్ ముగిసింది. మే 20న బారాముల్లా, మే 25న అనంతనాగ్–రాజౌరితో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు పూర్తవుతాయి. కారణాలేమిటి? ఆర్టికల్ 370ని, రాష్ట్ర హోదాను రద్దు చేయడం కశ్మీర్లో కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించిందన్నది బీజేపీ భావన. అలాంటప్పుడు అక్కడి లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే అభ్యర్థులకు ప్రాణాపాయం పొంచి ఉంటుందని, పైగా తనను బూచిగా చూపి ఎన్సీ, పీడీపీ రెండూ ఓటర్లను ఏకీకృతం చేస్తాయని అంచనాకు వచ్చింది. అందుకే నేరుగా బరిలో దిగకుండా చిన్న పారీ్టలకు దన్నుగా నిలిచినట్టు చెబుతున్నారు. బారాముల్లా నుంచి ఎన్సీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోటీ చేశారు. ఆయనకు పీడీపీ నేత ఫయాజ్ మిర్, జేకేపీసీ చైర్మన్ సజ్జాద్ గనీ ప్రత్యర్థులుగా ఉన్నారు. సజ్జాద్‌ను బీజేపీ ప్రతినిధేనని ఒమర్ అబ్దుల్లాతో పాటు పీడీపీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ఆరోపణలు చేశారు. అనంతనాగ్–రాజౌరిలో తమ ప్రత్యర్థి అయిన జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీ అభ్యర్థి జాఫర్ ఇక్బాల్ మన్హాస్‌కు బీజేపీ మద్దతిస్తోందని ముఫ్తీ ఆరోపించారు. శ్రీనగర్‌లో కూడా ఎన్సీ, పీడీపీలపై అప్నీ పార్టీ నుంచి మహమ్మద్ అష్రఫ్ మిర్ పోటీ చేశారు. ఈ అప్నీ పార్టీ బీజేపీ మద్దతుతోనే 2021లో పుట్టుకొచి్చందని ఎన్సీ అంటోంది. అసలు లక్ష్యం అసెంబ్లీయే!? ‘‘మా ప్రత్యర్థులు అంచనా వేసినట్టుగా మేము కశ్మీర్‌ను జయించబోవడం లేదు. ప్రతి కశ్మీరీ హృదయాన్నీ గెలుచుకోవడమే మా కర్తవ్యం’’ అని ఏప్రిల్ 16న జమ్మూ ర్యాలీలో అమిత్‌షా చేసిన ప్రకటనను కీలకంగా చూడాలి. కశ్మీర్ లోయలో కమల వికాసంపై తమకేమీ తొందర లేదన్నారాయన. ప్రధాని మోదీ కూడా ఆరి్టకల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా మార్చిలో శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పటికల్లా ఎన్సీ, పీడీపీలను వీలైనంతగా బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు భావిస్తున్నారు. కొన్నిసార్లు పెద్ద లక్ష్యాన్ని సాధించేందుకు కొన్ని నిర్ణయాలు తప్పవని లోయలో పోటీకి దూరంగా ఉండటంపై జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా చేసిన నర్మగర్భ ప్రకటన అంతరార్థం కూడా అదేనంటున్నారు. లోయలో దేశభక్తి కలిగిన పార్టీలకు బీజేపీ మద్దతిస్తుందని అప్పుడే ఆయన ప్రకటించారు కూడా. ఎన్సీ, పీడీపీలకు స్థానిక పారీ్టలతో చెక్ పెట్టడమే బీజేపీ తొలి లక్ష్యంగా కనిపిస్తోంది. లోయలోని మూడు లోక్‌సభ స్థానాలనూ 2019లో ఎన్సీ గెలుచుకోవడం గమనార్హం. ఈసారి తెర వెనక పాత్రకశ్మీర్లో తనకు ఏమాత్రం బలం లేని మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా అక్కడ తెర వెనక కీలకపాత్రే పోషిస్తున్నట్టు స్థానిక రాజకీయ పారీ్టలతో పాటు బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కశ్మీర్‌లోని మూడు స్థానాలనూ కాంగ్రెస్ కూడా పొత్తులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్‌కు కేటాయించడం విశేషం. అలా రెండు ప్రధాన జాతీయ పారీ్టలూ కశ్మీర్లో పోటీకి దూరంగానే ఉన్నాయి. దాంతో ఈ స్థానాల్లో పోటీ ప్రధానంగా ఎన్సీ, పీడీపీ మధ్యే నెలకొంది. అయితే సజ్జాద్ లోన్‌కు చెందిన జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ), అల్తాఫ్ బుఖారీకి చెందిన జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ, మాజీ సీఎం గులాంనబీ ఆజాద్‌కు చెందిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పారీ్ట (డీపీఏపీ) కూడా బరిలో ఉన్నాయి. ఇవి బీజేపీ షాడో పార్టీలని ఎన్సీ, పీడీపీ ఆరోపిస్తున్నాయి. బీజేపీ వైఖరి గమనిస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలకు ఓటు వేయొద్దని గత నెల ఇక్కడ ర్యాలీ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
OTT Releases: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఈసారి కూడాఅరడజనుకుగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కానీ వీటిలో చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలేం లేవు. దీంతో ఆటోమేటిక్ గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే 18 వరకు కొత్త మూవీస్- సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) ఓటీటీ రిలీజుల విషయానికొస్తే.. ఈ వారం సైరన్, ఆర్టికల్ 370, డ్యూన్ పార్ట్ 2 సినిమాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలైతే ఉన్నాయి గానీ వస్తే గానీ వాటి సంగతి తెలియదు. వీకెండ్ వచ్చేసరికి మరికొన్ని సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 15-21 వరకు) నెట్ ఫ్లిక్స్ ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 15 అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17 ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) - ఏప్రిల్ 17 రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 19 హాట్ స్టార్ సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17 ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17 చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 19 సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఏప్రిల్ 19 జియో సినిమా ద సింపథైజర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15 ఆర్టికల్ 370 (హిందీ మూవీ) - ఏప్రిల్ 19 ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19 బుక్ మై షో డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16 లయన్స్ గేట్ ప్లే డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 19 ద టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19 సోనీ లివ్ క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15 జీ5 సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 16 కమ్ చాలు హై (హిందీ సినిమా) - ఏప్రిల్ 19 డిమోన్స్ (హిందీ చిత్రం) - ఏప్రిల్ 19 (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) -
PM Narendra Modi: కశ్మీర్ భారత్‌లో లేదా?
నవడా/జల్పాయ్గురి/జబల్పూర్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అచ్చంగా ముస్లిం లీగ్ విధానాలను పోలి ఉందని విమర్శించారు. అది మేనిఫెస్టో కాదు, బుజ్జగింపు పత్రం అని ధ్వజమెత్తారు. ఆదివారం బిహార్‌లోని నవడా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఆర్టికల్ 370 రద్దు గురించి బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. వారి పారి్థవ దేహాలు త్రివర్ణ పతాకాలతో స్వస్థలాలకు చేరుకున్నాయి. రాజ్యాంగాన్ని జమ్మూకశ్మీర్‌లో గతంలో ఎందుకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదో ప్రతిపక్ష నేతలు చెప్పాలి. అది దేశంలో అంతర్భాగం కాదా?’’ అని ప్రశ్నించారు. రన్‌వేపై మా గ్రోత్ ఇంజన్ సిద్ధం దేశాన్ని రెండు విభజించాలన్నదే కాంగ్రెస్ ఆలోచనా విధానమని మోదీ ఆక్షేపించారు. ‘‘ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పెద్దలు బహిష్కరించారు. హాజరైన పార్టీ నేతలను బహిష్కరించారు. శ్రీరామనవమి రాబోతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన పాపాలను మర్చిపోవద్దు’’ అని ప్రజలకు సూచించారు. తమ పదేళ్ల పాలన ట్రైలర్ మాత్రమేనని, తమ గ్రోత్ ఇంజన్ రన్‌వేపై సిద్ధంగా ఉందని, ఇక టేకాఫ్ తీసుకుంటుందని అన్నారు. బెంగాల్‌లోని జల్పాయ్గురిలో ఎన్నికల మెగా ర్యాలీలో, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. పశి్చమ బెంగాల్లో అవినీతికి, హింసాకాండకు ఉచిత లైసెన్స్ ఇవ్వాలని అధికార టీఎంసీ కోరుకుంటోందని మండిపడ్డారు. -
‘ఖర్గే పొరపాటున మాట్లాడినా.. అది నిజమే!’: జైరాం రమేష్
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని 371వ ఆర్టికల్‌ను మార్చాలన్న మోదీ-షా గేమ్ ప్లాన్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనుకోకుండా బయటపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే ఖర్గే 370 ఆర్టికల్ అనాల్సింది.. పొరపాటున ఆర్టికల్ 371 అన్నారని తెలిపారు.అయినప్పటికీ మోదీ- షా అసలు గేమ్ ప్లాన్ బయటపడిందని జైరాం రమేష్ అన్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే విరుచుకుపడ్డారు. కానీ నిజం ఏమిటంటే.. నాగాలాండ్‌కు సంబంధించిన ఆర్టికల్ 371-ఎ, అస్సాంకు చెందిన ఆర్టికల్ 371-బి, మణిపూర్‌కు సంబంధించిన ఆర్టికల్ 371-సి, సిక్కింకు చెందిన ఆర్టికల్ 371-ఎఫ్, మిజోరామ్‌కు సంబంధించిన ఆర్టికల్ 371-జిని మోదీ-షా మార్చాలనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఆర్టికల్ 371-హెచ్ అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించిందని జైరాం రమేష్ అన్నారు. ఆర్టికల్ 371జే పూర్వపు హైరాబాద్-కర్ణాటక ప్రాంతానికి సంబంధించిందని ఆయన గుర్తు చేశారు. Today by a slip of the tongue in his speech in Jaipur, @INCIndia President Mallikarjun Kharge ji mistakenly said that Modi claims credit for abolishing Article 371. Kharge ji clearly meant Article 370. Amit Shah immediately pounced on the Congress President. But the truth is… — Jairam Ramesh (@Jairam_Ramesh) April 6, 2024 అనుకోకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 371పై మోదీ-షా ప్లాన్‌ను బయటపెట్టడంతో ఆయన వ్యాఖ్యలపై ఒక్కసారిగా అమిత్ షా ఆందోళన పడ్డారని అన్నారు. అందుకే అమిత్ షా.. ఖర్గే మాటలను ఆర్టికల్ 370కి ముడిపెడుతున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు. It is shameful to hear that the Congress party is asking, "Kashmir se kya waasta hai?" I would like to remind the Congress party that J&K is an integral part of India, and every state and citizen has the right over J&K, just as the people of J&K have the right over the rest of… pic.twitter.com/cFeO80XBxl — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 6, 2024 మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా స్పందించి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ నేతలు చేస్తున్న పొరపాట్లు దశాబ్దాలుగా మన దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటాలియన్ సంస్కృతి కారణంగా ప్రతిపక్ష పార్టీ.. భరత దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు’ అని అమిత్ షా మండిపడ్డారు. ఖర్గే ఏమన్నారంటే... మల్లికార్జున్ ఖర్గే రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించి సభలో మోదీ-షాపై విరుచుకుపడ్డారు. ‘బీజేపీ వాళ్లు రాజస్తాన్ వచ్చి ఆర్టికల్ 371ను రద్దు చేశామని చెబుతున్నారు. ఇక్కడి ప్రజలకు అసలు దానితో సంబంధం ఏమిటీ?. జమ్ము కశ్మీర్‌కు వెళ్లి అక్కడి ప్రజలకు దానికి గురించి మాట్లాడితే బాగుంటుంది’ అని ఖర్గే అన్నారు. -
ఓటీటీకి వంద కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్టికల్ 370. జమ్మూకశ్మీర్‌లో కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కొత్త ఏడాదిలో వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచింది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఏప్రిల్ 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆర్టికల్ 370 ఓటీటీ రైట్స్‌ను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించగా.. బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్‌పై లోకేష్ ధర్, ఆదిత్య ధర్,జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. -
ఆర్టికల్ 370 రద్దుతో ప్రజలకు స్వేచ్ఛ
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధిలో జమ్మూకశ్మీర్ నూతన శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అబివృద్ధికి అడ్డుగోడగా మారిన ఈ ఆర్టికల్‌ను రద్దు చేశాక ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, జమ్మూకశ్మీర్ హాయిగా ఊపిరి పీల్చుకుంటోందని చెప్పారు. గురువారం జమ్మూకశ్మీర్‌లో మోదీ పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 1,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ‘చలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా క్యాంపెయిన్’, ‘దేఖో ఆప్నా దేశ్ పీపుల్స్ చాయిస్ టూరిస్టు డెస్టినేషన్ పోల్’ అనే రెండు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ‘వికసిత్ భారత్–వికసిత్ జమ్మూకశ్మీర్’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ జమ్మూకశ్మీర్ ప్రజలనే కాకుండా మొత్తం దేశాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఈ ఆర్టికల్ రద్దయ్యాక జమ్మూకశ్మీర్ సంకెళ్లు తెగిపోయాయని అన్నారు. అద్భుతమైన శ్రీనగర్ ప్రజల్లో ఈరోజు తాను కూడా ఒకడినైనందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ రోజు తాను ప్రారంభించిన ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్ ప్రగతిని మరింత వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ అనే స్వప్నం సాకారం కావాలంటే జమ్మూకశ్మీర్ అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనని చెప్పారు. మోదీతో కశ్మీర్ యువకుడి సెల్ఫీ జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన యువకుడు నజీమ్ నజీర్ కల నెరవేరింది. సాక్షాత్తూ మోదీతో అతడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు. అంతేకాదు నజీర్‌ను మోదీ తన స్నేహితుడిగా సంబోధించారు. గురువారం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ఈ సంఘటన జరిగింది. నజీర్ తేనెటీగల పెంపకం, తేనె వ్యాపారం చేస్తున్నాడు. మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. దీంతో ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం లభించింది. నజీర్ గురించి తెలుసుకున్న మోదీ అతడిని అభినందించారు. మీతో సెల్ఫీ తీసుకోవాలని నజీర్ కోరగా మోదీ అంగీకరించారు. ఈ సెల్ఫీని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిత్రుడు నజీర్‌తో సెల్ఫీ దిగడం మరిచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు. తేనె వ్యాపారంతో నజీర్ తీపి విప్లవం తీసుకొచ్చాడని ప్రశంసించారు. మీ కుటుంబ సభ్యులను పంపించండి భారతదేశానికి కిరీటం లాంటి జమ్మూకశ్మీర్‌లో పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో ప్రగతికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ ఉద్ఘాటించారు. జమ్మూకశ్మీర్ కేవలం ఒక ప్రాంతం కాదని, ఇది మన దేశానికి శిరస్సు లాంటిదని చెప్పారు. తలెత్తుకొని నిలబడటం అభివృద్ధికి, గౌరవానికి గుర్తు అని పేర్కొన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ‘చలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులు తమ కుటుంబాల నుంచి కనీసం ఐదుగురిని జమ్మూకశ్మీర్ పర్యటనకు పంపించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు మోదీ మహాశివరాత్రి, రంజాన్ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేశారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక ప్రధానమంత్రి కశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. -
నా నెక్ట్స్ మిషన్ ‘వెడ్డింగ్ ఇన్ ఇండియా’: ప్రధాని మోదీ
శ్రీనగర్: ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత.. శ్రీనగర్‌లో ఇవాళ తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. బక్షి స్టేడియం వేదికగా ‘వికసిత్ భారత్ వికసిత్ జమ్మూకశ్మీర్’ కార్యక్రమంలో రూ.6,400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అద్భుతమైన శ్రీనర్ ప్రజల తాను ఒకడిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, వారి మనసులు గెలుచుకునేందుకు తాను శ్రీనగర్ వచ్చినట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగిందని తెలిపారు. 2023లో కశ్మీర్లో 2 కోట్ల మంది పర్యటించారని పేర్కొన్నారు. తన నెక్ట్స్ మిషన్ ‘వెడ్డింగ్ ఇన్ ఇండియా’ అని.. వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా జమ్మూకశ్మీర్‌ను తయారు చేయబోతున్నామన్నారు. #WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says "J&K has been a huge victim of 'Parivarvad' and corruption. The previous governments here had left no stone unturned to destroy our J&K Bank, by filling the bank with their relatives and nephews, these 'Parivarvadis' have… pic.twitter.com/6PJVAlcI3Y — ANI (@ANI) March 7, 2024 ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు జమ్మూకశ్మీర్‌కు తరలివస్తున్నారన్నారు ప్రధాని మోదీ. జమ్మూకశ్మీర్ విజయగాథ ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని చెప్పారు. కశ్మీర్ సరస్సుల్లో ఎక్కడ చూసిన కమలం పూలు కన్పిస్తాయని..50 ఏళ్ల క్రితం ఏర్పడిన జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లోగో కూడా కమలమేనని తెలిపారు. బీజేపీ సింబల్ కూడా కమలమేనని అన్నారు. #WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says "This freedom from restrictions has come after the removal of Article 370. For decades, for political gains, Congress and its allies misled the people of Jammu and Kashmir in the name of 370 and misled the country. Did J&K… pic.twitter.com/SKMmjHxgvT — ANI (@ANI) March 7, 2024 ఆర్టికల్ 370పై కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు మోదీ. ఆర్టికల్ 370తో జమ్మూక్మర్ ఏం లాంభం జరిగిందని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కుటుంబాలే 370తో లబ్ది పొందాయని విమర్శించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ యువత కొత్త అవకాశాలు అందుకుంటున్నారని, అందరికీ సమాన అవకాశాలు, హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi launches and dedicates to the nation 53 projects worth Rs 6,400 crores at Srinagar's Bakshi Stadium. pic.twitter.com/5Mfe2kRdGw — ANI (@ANI) March 7, 2024 -
స్విట్జర్లాండ్‌కు పోటీగా కశ్మీర్
జమ్మూ: ఆర్టీకల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సామాజిక న్యాయం, సమీకృత అభివృద్ధి అనే కొత్త శకంలోకి కశ్మీర్ అడుగుపెట్టిందన్నారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కశ్మీర్ లోయను పర్యాటకానికి గమ్యస్థానంగా, స్విట్జర్లాండ్‌కు పోటీగా అన్ని విషయాల్లోనూ అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో కొత్త శకం ఆరంభమైందని, ఇక్కడి ప్రజలు వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి పొందారని పేర్కొన్నారు. గతంలో అధికారం చెలాయించిన వారసత్వ పాలకులు సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల బాగోగులు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. మోదీ మంగళవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. రూ.32,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వోద్యోగాలు పొందిన వారితో, పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్‌లో దేశంలోనే అతిపెద్దదైన 12.77 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం జమ్మూలో బహిరంగ సభలో ప్రసంగించారు. గల్ఫ్ దేశాల నుంచి జమ్మూకశ్మీర్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా కన్యాకుమారితో అనుసంధానించే రోజు దగ్గర్లో ఉందన్నారు. ఆ అడ్డుగోడ కూల్చేశాం.. జమ్మూకశ్మీర్‌లో నిత్యం బాంబులు, తుపాకులు, కిడ్నాప్‌లు, వేర్పాటువాదం వార్తలొచ్చే రోజులు పోయాయని, సమతులాభివృద్ధితో కూడిన నూతన కశ్మీర్ కనిపిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక రంగ ప్రగతితోపాటు అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే భక్తుల సంఖ్య పెరుగుతుండడం పట్ల స్రంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీకల్ 370 రద్దు నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐఐఎం క్యాంపస్‌లు ప్రారంభం ఐఐఎం–జమ్మూ, ఐఐఎం–బోద్‌గయ, ఐఐఎం–విశాఖపట్నం క్యాంపస్‌లను మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఐఐటీ–భిలాయ్, ఐఐటీ–తిరుపతి, ఐఐటీ–జమ్మూ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల క్యాంపస్‌లను జాతికి అంకితం చేశారు. 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ పాఠశాలల శాశ్వత క్యాంపస్‌లకు శంకుస్థాపన చేశారు. విద్యా రంగంలో స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. -
అప్పుడు రాముడు.. ఇప్పుడు ప్రధానిగా.. అందరి కళ్లు అతనిపైనే!
బాలీవుడ్ భామ యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'ఆర్టికల్ 370'. ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ నిర్మాతగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ రద్దు అంశమే తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో యామి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఈ మూవీలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో శ్రీరాముని పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరుణ్ గోవిల్. ఆర్టికల్ 370 చిత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత్రలో ఆయన కనిపించారు. చాలా మంది అభిమానులు ట్రైలర్లో ప్రధాని మోడీగా కనిపించిన అరుణ్ గోవిల్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్రలో కనిపించిన కిరణ్ కర్మాకర్‌ని నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న థియేటర్లలో విడుదల కానుంది. #ArunGovil as Modi Ji in Upcoming movie #Article370 #YamiGautam पहचान गए तो एक लाइक तो बनता है pic.twitter.com/A4mfbLCF6r — 📍 (@ghatnachakr) February 8, 2024 Symbolism galore. Arun Govil who played Lord Ram playing PM Modi. Trailer looks quite amazing. Looks like a high octane action drama. If things work out can be a great hit. Yami is too good an actress. #Article370 https://t.co/n9pUvpyXYn — Ujjawal Pratap Singh (@pratap_pablo) February 8, 2024 -
President Droupadi Murmu: బలమైన దేశంగా ఎదిగాం!
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే శతాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితో బలమైన దేశంగా ఎదిగామని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట నిర్వహించుకున్నామని, మరోవైపు ఆర్థిక సంస్కరణల్లో కీర్తిప్రతిష్టలు సాధించామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నూతన భవనంలో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము దాదాపు 75 నిమిషాలపాటు ప్రసంగించారు. పార్లమెంట్ కొత్త భవనంలో ఆమె ప్రసంగించడం ఇదే మొదటిసారి. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తావించారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన సైనిక దళాలు తగిన సమాధానం చెబుతున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని గుర్తుచేశారు. భారత్ బలమైన దేశంగా మారిందన్నారు. ప్రతిష్టాత్మక జి–20 సదస్సును కేంద్రం విజయవంతంగా నిర్వహించిందని, తద్వారా ప్రపంచంలో ఇండియా స్థానం మరింత బలోపేతమైందని వివరించారు. జమ్మూకశీ్మర్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మొదటిసారి అంతర్జాతీయ సమావేశాలు జరిగినట్లు తెలియజేశారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. జనవరి 22 చిరస్మరణీయమైన రోజు ‘‘రాబోయే శతాబ్దాలకు సంబంధించి దేశ భవిష్యత్తు స్క్రిప్‌్టను రాసుకోవాల్సిన సమయం వచ్చింది. మన పూరీ్వకులు వేలాది సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని మనకు వరంగా అందించారు. ప్రాచీన భారతదేశంలో అప్పటి మనుషులు సాధించిన విజయాలను ఇప్పటికీ సగర్వంగా గుర్తుచేసుకుంటున్నాం. రాబోయే కొన్ని శతాబ్దాలపాటు గుర్తుంచుకొనే ఘనమైన వారసత్వాన్ని ఇప్పటి తరం మనుషులు నిర్మించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించింది. దశాబ్దాల, శతాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు శతాబ్దాలపాటు ఎదురుచూశారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆలయం ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు రోజుల్లో 13 లక్షల మంది దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22వ తేదీ నిజంగా చిరస్మరణీయమైన రోజు. నక్సల్స్ హింసాకాండ తగ్గుముఖం ఆర్టికల్ 370 రద్దుపై గతంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది చరిత్రలో కలిసిపోయింది. ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచి్చంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ భవిష్యత్తు నిర్మాణం కోసం మన శక్తిని గరిష్ట స్థాయిలో ఖర్చు చేసినప్పుడే దేశం ప్రగతి పథంలో వేగంగా ముందంజ వేస్తుంది. ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కలి్పస్తోంది. సైనిక దళాలను బలోపేతం చేస్తోంది. అంతర్గత భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జమ్మూకశీ్మర్‌లో మార్కెట్లు, వీధులు గతంలో నిర్మానుష్యంగా కనిపించేవి. ఇప్పుడు జనంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య కూడా తగ్గిపోయింది. నక్సలైట్ల హింసాకాండ భారీగా తగ్గింది. అదుపులోనే ద్రవ్యోల్బణం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మహాసౌధం నాలుగు మూల స్తంభాలపై స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. అవి యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు. ఈ నాలుగు వర్గాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మనమంతా చిన్నప్పటి నుంచి వింటున్నాం. పేదరికాన్ని పారదోలడాన్ని మన జీవితాల్లో మొదటిసారి చూస్తున్నాం. ఇండియాలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ ప్రకటించింది. దేశంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటడం హర్షణీయం. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు మన దేశ అభివృద్ధి ప్రయాణానికి బలాలుగా మారుతు న్నాయి. ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచింది. ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తవహించింది’’. మహిళలకు 15 వేల డ్రోన్లు ‘2014 తర్వాత గత పదేళ్లుగా ద్రవ్యోల్బణ రేటు సగటున కేవలం 5 శాతం ఉంది. ప్రభుత్వ చర్యలతో ప్రజల చేతుల్లో డబ్బు ఆడుతోంది. సామాన్య ప్రజలు కూడా పొదుపు చేయగలగుతున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బ్యాంకు రుణాలను అందుబాటులోకి తీసుకొచి్చంది. సైనిక దళాల్లో శాశ్వత మహిళా కమిషన్‌ను మంజూరు చేసింది. సైనిక స్కూళ్లతోపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్, నావికాదళంలోనూ మహిళలను ఆఫీసర్లుగా నియమిస్తోంది. అలాగే 2 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద మహిళలకు 15 వేల డ్రోన్లు అందజేయాలని నిర్ణయించింది’. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి ‘మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత నారీశక్తి వందన్ అధినియం(మహిళా రిజర్వేషన్ చట్టం) పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ చట్టంతో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆశయం. ఈ చట్టాన్ని తీసుకొచి్చనందుకు పార్లమెంట్ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతి తోడ్పాడునందిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. రెండు వరుస త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7.5 శాతానికిపైగానే నమోదైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది’. 25 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు ‘రైల్వేశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. నమో భారత్, అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. కొత్తగా 25 వేల కిలోమీటర్లకుపైగా రైల్వే లైన్లు వేసింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మొత్తం రైల్వేట్రాక్ పొడవు కంటే ఇదే ఎక్కువ. రైల్వేశాఖలో 100 శాతం విద్యుదీకరణకు చాలా దగ్గరలో ఉన్నాం. దేశంలో తొలిసారిగా సెమీ–హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. 39 మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వేస్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రతి ప్రయాణికుడికి రైల్వేశాఖ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రతి ఏటా రూ.60 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతోంది’. -
తీర్పులు న్యాయమూర్తుల వ్యక్తిగతం కాదు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల వెలువరించిన ఏకగ్రీవ తీర్పు పట్ల వ్యక్తమవుతున్న విమర్శలపై స్పందించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నిరాకరించారు. రాజ్యాంగం, చట్టం ప్రకారమే న్యాయమూర్తులు కేసులపై తీర్పులిస్తారని చెప్పారు. ఏదైనా కేసుపై చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సోమవారం పీటీఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కలి్పంచలేమంటూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచి్చన తీర్పుపై మాట్లాడారు. ఏ న్యాయమూర్తి కూడా వారి వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇవ్వరని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇచ్చిన తీర్పు కూడా జడ్జిల వ్యక్తిగతం కాదని అన్నారు. చాలా రకాల కేసుల విచారణ, తీర్పుల్లో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని గుర్తుచేశారు. ఒక జడ్జిగా ఏ కేసును, తీర్పునూ వ్యక్తిగతంగా తీసుకోలేదని చెప్పారు. అందుకు తనకు ఎలాంటి విచారం గానీ, ఫిర్యాదు గానీ లేదన్నారు. న్యాయమూర్తులు తీర్పు వెలువరించిన తర్వాత అది ప్రజల ఆస్తిగా మారుతుందని స్పష్టం చేశారు. దానిపై అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రజలకుంటుందని పేర్కొన్నారు. తీర్పుపై విమర్శలను తిప్పికొట్టడం, సమరి్థంచుకోవడం సరికాదన్నారు. తీర్పు ఇచి్చన తర్వాత ఇక ఆ సంగతి పక్కన పెట్టాలన్నది తన ఉద్దేశమని వివరించారు. తీర్పుపై ఏ జడ్జికీ ఆధిక్యముండదు అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు దేళ్ల క్రితం ఇచ్చిన తీర్పుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు. ఈ తీర్పు రావడానికి కారణాన్ని ధర్మాసనంలోని ఏ ఒక్క సభ్యుడికో అపాదించలేమని పేర్కొన్నారు. ధర్మాసనంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా అయోధ్య తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఏ కేసులో అయినా ఇవ్వాల్సిన తీర్పును సంబంధిత జడ్జిలంతా కలిసి కూర్చొని, చర్చించుకొని నిర్ణయిస్తారని పేర్కొన్నారు. చివరకు అది కోర్టు తీర్పుగా మారుతుందని స్పష్టం చేశారు. తీర్పును నిర్ణయించే విషయంలో ఆధిక్యం ఏ ఒక్క జడ్జికో కట్టబెట్టలేమని తేలి్చచెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం పేర్లను ప్రతిపాదించే కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదు అని విమర్శించడం సరైంది కాదని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొలీజియంలో అంతర్గతంగా జరిగే సంప్రదింపులను కొన్న కారణాలతో ప్రజలకు తెలియపర్చలేమని సీజేఐ స్పష్టం చేశారు. -
2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు?
ఆర్టికల్ 370ని తొలగించి నాలుగున్నరేళ్లు దాటినా జమ్ముకశ్మర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో 85 మంది ఉగ్రవాదులు, 35 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మృతి చెందారు. 2023లో జమ్ముకశ్మీర్‌లో తొమ్మిది ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో ఆరు జమ్మూ డివిజన్లో, మూడు కశ్మీర్ లోయలో జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ డివిజన్లో 25 మంది సైనికులు మరణించారు. ప్రధానంగా పూంచ్, రాజౌరి జిల్లాల్లో, కశ్మీర్ లోయలో జరిగిన మూడు ఆపరేషన్లలో తొమ్మదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత మార్చి, జూన్, జూలై, అక్టోబర్లలో సైనిక ప్రాణనష్టం జరగలేదు. ఫిబ్రవరిలో ఒక సైనికుడు, ఏప్రిల్, మే, నవంబర్, డిసెంబర్లలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు, సెప్టెంబర్‌లో నలుగురు, ఆగస్టులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మాచెల్ సెక్టార్‌లోని ఒక ఫార్వర్డ్ ఏరియాలోని లోయలో జారిపడి ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఇద్దరు సైనికులు మరణించారు. ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలోని పొట్గంపొర అవంతిపొర వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హిమాచల్ ప్రదేశ్ సైనికుడు వీరమరణం పొందారు. ఏప్రిల్‌లో పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్లోని భటాధురియన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డాడు. స్థానికేతర మిలిటెంట్లు యూబీజీఎల్ ఉపయోగించి ఆర్మీ వాహనంపై గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు సమాచారం. మేలో జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ జిల్లాలోని కంది అటవీ ప్రాంతంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఆగస్టులో దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. సెప్టెంబరులో, రాజౌరిలోని నార్లా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికునితో పాటు ఒక ఆర్మీ శునకం మరణించింది. దక్షిణ కాశ్మీర్‌లోని గాడోల్ కోకెర్నాగ్ ఎన్కౌంటర్లో కల్నల్, మేజర్‌తో సహా కనీసం ముగ్గరు ఆర్మీ సిబ్బంది మరణించారు. నవంబర్‌లో కలకోట్ రాజౌరిలోని బాజీ మాల్ అటవీ ప్రాంతంలో 30 గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. డిసెంబరులో పూంచ్‌లోని తన్నమండి సూరంకోట్ రోడ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో నలుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఏడాది ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది పౌరులు మరణించగా, ఆర్మీ కస్టడీలో ముగ్గురు మరణించారు. 2023లో ఇప్పటి వరకు 85 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది కూడా చదవండి: ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు! -
ఆర్టికల్ 370 రద్దు : ‘సుప్రీం కోర్టు తీర్పు కలవరపరించింది’
ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఆర్టికల్ 370 రద్దుపై వెలువరించిన తీర్పు, కొలీజియం వ్యవస్థ, ఎలక్షన్ కమిషనర్ల నియామకం బిల్లు వంటి అంశాలపై ఆయన శుక్రవారం ఆసియాటిక్ సోసైటీ ఆధ్వర్యంలో ‘కాన్స్టీట్యూషన్: చెక్ అండ్ బ్యాలన్సస్’ మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు తనని చాలా కలవెరపెట్టిందని తెలిపారు. ఆర్టికల్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించిందని తెలిపారు. అయితే దానివల్ల రాజ్యాంగ విరుద్ధమైన చర్యను కొనసాగించడానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లు ఇటీవల రాజ్య సభలో ఆమోదం పొందిన విషయం కూడా తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. జడ్జిలను ఎంపిక చేసే ప్రస్తుత కొలీజియం వ్యవస్థ కూడా దారుణమైనదని కానీ,అది కొంతమేరకు మేలేనని తెలిపారు. రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంను తాను సూచిస్తానని అన్నారు. అందులో ఉండేవారు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. ప్రధాని న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తుల సూచనలు కూడా తీసుకుంటారని అన్నారు. అనంతరం వారు న్యాయమూర్తులను సిఫార్సు చేస్తారని చెప్పారు. చదవండి: ఆధార్‌పై ప్రశ్నలకు భారీ స్పందన.. -
సవరణ తప్పట! రద్దు మాత్రం రైటట!!
కేంద్ర ప్రభుత్వం జమ్మూ –కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 అధికర ణాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అధ్యక్ష తన న్యాయమూర్తులు ఎస్కే కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన రాజ్యాంగ బెంచి కీలకమైన తీర్పును వెలువరించింది. దేశ సమగ్రతను పరిరక్షించాలంటూ సొలిసిటర్ జనరల్ ‘సమర్థవంతంగా’ వాదించడంతో ఒకే ఒక్క అంశం మినహా అన్ని అంశాలలో అత్యున్నత న్యాయస్థానం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాదన లతో పూర్తిగా ఏకీభవించింది. రాజ్యాంగ నిపుణులూ, ‘రూల్స్ ఆఫ్ లా’ తెలిసిన వాళ్లూ తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది. ఈ 370 అధికరణ రద్దుపై తీర్పు దాదాపు అన్ని వాదాలనూ అంగీకరించింది. అయితే ఆర్టికల్ 370 రద్దు కోసం ఆర్టికల్ 367ను సవరించడం చట్టబద్ధం కాదని కోర్టు పేర్కొ నడం గమనార్హం. సుప్రీంకోర్టు చర్చించిన ఎనిమిది ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. అయితే అందులో 6వ అంశాన్ని నిశితంగా పరీక్షించాల్సి ఉంది. ఈ అంశాన్నే కోర్టు తప్పు పట్టింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం కోసం ఆర్టికల్ 367ను సవరించడం మొత్తం చట్టపరమైన ప్రక్రియకు కీలకమైనది. అయితే ఈ సవరణ చట్టబద్ధం కాదని న్యాయమూర్తుల ధర్మపీఠం పేర్కొంది. ఆర్టికల్ 367 అనేది ఇంటర్‌ప్రెటేషన్ (వ్యాఖ్యానించే లేదా వివరించే) క్లాజ్ మాత్రమే. అంతేకానీ అది డెఫినిషన్ల (నిర్వచనాల)ను సబ్‌స్టిట్యూట్ (ప్రత్యామ్నాయంగా చూపే) చేసే క్లాజ్ కాదు. అందుకే 1954లో జమ్మూ– కశ్మీర్‌కు అనువర్తించేలా తెచ్చిన కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ (సీఓ) 272 ప్రకారం ఆర్టికల్ 370 రద్దు కోసం ఆర్టికల్ 367ను సవరించడం చట్టవిరుద్ధం అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కోర్టు తీర్పు లోని అంశాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమ వుతుంది. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన విస్తృతమైన తీర్పులో సీఓ 272 ఉద్దేశ్యం ఆర్టికల్ 367లో మార్పులు చేయడానికి అన్నట్టుగా మొదట కనిపించినా, అది సమర్థంగా ఆర్టికల్ 370ని పూర్తిగా మార్చివేసిందని పేర్కొన్నారు. ఈ మార్పులు గణనీ యంగా బలమైనవీ, స్థిరమైనవనీ కోర్టు పేర్కొంది. సవరణ ప్రక్రియలో రాజ్యాంగ నియమ భంగం చేస్తూ ఒక అధికరణాన్ని రద్దు చేయడానికి ఇంటర్ర్ పెటేషన్ క్లా్లజ్ (వ్యాఖ్యాన నిబంధన)ను సవరించే హక్కు ప్రభుత్వానికి లేదు. ఒక రాజ్యాంగ సవరణకు నిర్దేశిత మార్గాన్ని తప్పించుకునేందుకు ఇంటర్‌ప్రెటేషన్ క్లాజ్‌ను ఉపయోగించే అధికారం లేదు కనుక ఆర్టికల్ 367ని ఆశ్రయించి ఆర్టికల్ 370కి చేసిన సవరణలు చట్టబద్ధం కాదని నిర్ధారించామనీ, ఇటువంటి అక్రమమైన పద్ధతుల ద్వారా సవరణ లను అనుమతించడం దురదృష్టకరం అనీ సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 370 (1) (డి) కింద అధికారాన్ని ఉపయోగించి ఆర్టికల్ 370ని సవరించే అధికారం కేంద్రానికి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సీజేఐ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, ఆర్టికల్ 367ను ఉపయోగించి 370ని సవరించే విషయంలో ఒక పద్ధతిని నిర్దేశించారనీ, దానిని అనుసరించకుండా దొడ్డి దారిలో అక్రమ మార్గం నుంచి సవరణ అనుమతించడం సరికాదనీ జస్టిస్ ఎస్కే కౌల్ తన తీర్పులో వ్యాఖ్యానించారు. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. మొదటగా ‘సీఓ272’గా ప్రాచుర్యం పొందిన రాజ్యాంగపు (జమ్మూ–కశ్మీర్ అనువర్తిత) ఉత్తర్వు– 1954ను రద్దు చేసి, భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలూ జమ్మూ–కశ్మీర్‌కు వర్తి స్తాయని ప్రకటించింది. రెండవ దశలో అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 367ను కూడా సవరించి, 370 ఆర్టికల్ రద్దుకు మార్గం వేసుకొంది. పైన పేర్కొన్న రెండు దశల కన్నా ముందు, జారీ అయిన రాజ్యాంగపు (జమ్మూ–కశ్మీర్ అనువర్తిత) ఉత్తర్వు– 2019... సీఓ272 రద్దుకు కీలకమైన ఆధారం అని సుప్రీంకోర్టు నిర్ణయించింది. జమ్మూ–కశ్మీర్ రాజ్యాంగ సభ సూచనల మేరకు మాత్రమే ఆర్టికల్ 370ని సవరించాలి. కానీ ఆ రాజ్యాంగ సభ మనుగడలో లేదు కాబట్టి ఆర్టికల్ 367లో సీఓ272 ఉత్తర్వు ద్వారా ఒక క్లాజును ప్రవేశపెట్టారు. ఈ క్లాజ్ ప్రకారం ఆర్టికల్ 370 క్లాజ్(2) అనుసరించి రాష్ట్ర రాజ్యాంగ సభను ‘రాష్ట్ర శాసన అసెంబ్లీ’గా చదువుకోవాలి. అయితే 2018 లోనే జమ్మూ–కశ్మీర్ శాసనసభను రద్దు చేసినందున, రాష్ట్రం రాష్ట్రపతి పాలన కింద ఉండటం వల్ల పార్లమెంటు ఆదేశం ‘రాజ్యాంగ శాసన సభకు సమానం’ అన్నట్టు పరిగణించారు. అంతే కాకుండా జీఓ272లో ఉన్న ‘జమ్మూ–కశ్మీర్ ప్రభుత్వం’ అంటే ‘జమ్మూ–కశ్మీర్ గవర్నర్’గా అర్థం చేసుకోవాలి వంటి క్లాజులను ఆర్టికల్ 367లో సృష్టించారు. వీటన్నింటినీ ఆధారంగా చూపి ఆర్టికల్ 370ని రద్దు చేయాలని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధమైన తీర్మానాన్ని లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో లోక్‌సభ ఆమోదించింది. తర్వాత రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. అయితే పార్లమెంటు ఆమోదించిన చట్ట పరమైన తీర్మానంపై, 2019 ఆగస్టు 6 నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆర్టికల్ 370కి సంబంధించిన అన్ని క్లాజులూ ‘2019 ఆగస్టు 6’ నుంచి నిర్వీర్యం అవుతాయని నోటిఫికేషన్ (సీఓ273)ని జారీ చేశారు. ఈ విధంగా జమ్మూ– కశ్మీర్ ప్రత్యేక హోదాను సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆర్టికల్ 370(3) కింద ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్రపతి అధికారాలను ఉపయో గించుకున్నారు. ఈ అధికరణం రాష్ట్రపతి నిర్దేశించిన తేదీ నుంచి ఉనికిలో ఉంటుందని కానీ, లేక పని చేయడం మానేస్తుందని కానీ, లేదా మినహాయింపు, సవరింపులతో పని చేస్తుందని ప్రకటించేందుకు రాష్ట్రపతికి ఆర్టికల్ 370 (3) అధికారమిస్తుంది. కనుక రాష్ట్రాన్ని జమ్మూ–కశ్మీర్, లద్దాఖ్ లుగా విభజించేందుకు ‘జమ్మూ–కశ్మీర్ పునర్వ్య వస్థీకరణ బిల్లు–2019’ను పార్లమెంటు ఆమోదించడం అత్యంత రాజ్యాంగ వ్యతిరేక చర్య. ప్రత్యేకంగా, విడిగా చూసినప్పుడు... అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు మొత్తంలో 367 అధికరణకు సవరణ చేయడం తప్పని కోర్టు చెప్పడం కేవలం ఒక అంశంగా మాత్రమే ఉందనిపిస్తోంది. కానీ, మొత్తం తీర్పే ఈ అంశాన్నే ఆధారం చేసుకొని సమర్థించడం ‘రాజ్యాంగ బద్ధమేనా?’ మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
బదల్తా కశ్మీర్
ఆర్టికల్ 370 ఎత్తివేతను సుప్రింకోర్ట్ సమర్థించింది. జమ్ము–కశ్మీర్లకు రాష్ట్రహోదా ఇచ్చి ఎన్నికలు నిర్వహించమంది. మరోవైపు అక్కడ యువగళాలు మారుతున్న కశ్మీర్‌ను గానం చేస్తున్నాయి. 14 ఏళ్ల ర్యాపర్ హుమైరా జా విడుదల చేసిన పాట ‘బదల్తా కశ్మీర్’ మార్పును ఆహ్వానిస్తూ కొత్త ఆశను రేపుతోంది. హుమైరా జా పాటను భారత ప్రభుత్వం ఇన్‌స్టాలో షేర్ చేసింది.‘నేను ఇలాగే ముందుకెళ్తాను’ అంటున్న హుమైరా పరిచయం. ‘బద్లా జొ కశ్మీర్... బద్లా హై సారా దౌర్’ అని పాడుతోంది హుమైరా జా. ‘కశ్మీర్ మారుతోంది... కశ్మీర్ ధోరణి మారుతోంది... అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది’ అంటూ ఆమె పాడిన పాట ఇప్పుడు కశ్మీర్వాసులనే కాదు, దేశాభిమానులను కూడా ఆకర్షిస్తోంది. హుమైరా ఈ పాటను ఎం.సి.రా అనే మరో ర్యాపర్ కలిసి పాడింది. కశ్మీర్లో తాజా అభివృద్ధి పరిణామాలను పాటలో మిళితం చేస్తూ వీరు విడుదల చేసిన ‘బదల్తా కశ్మీర్’ పాట కశ్మీర్ భవిష్యత్తు మీద ఆశను కలిగిస్తోంది. ‘మా నానమ్మ, తాతయ్యల కాలంలో కశ్మీర్ ఎలా ఉండేది... (ఆర్టికల్ 370 ఎత్తేశాక) ఇప్పుడు ఎలా ఉందనేది నేను వారి మాటల్లో విన్నాను. నా కళ్లారా చూశాను. ఇక్కడ జరిగిన జి 20 సమ్మిట్, శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడం, కొత్త టన్నెల్స్ ఏర్పాటు... ఇంతకుముందు చూడలేదు. మా ఊరు కంగన్ నుంచి శ్రీనగర్‌కు వెళ్లాలంటే గతంలో గంటన్నర పట్టేది. ఇప్పుడు గండర్బల్ దగ్గర బ్రిడ్జి కట్టాక ముప్పై నిమిషాల్లో వెళ్లిపొంతున్నాము. ఇదంతా మారుతున్న కశ్మీరే’ అంటుంది హుమైరా జా.తొమ్మిదో తరగతి చదువుతున్న హుమైరా అలవోకగా ర్యాప్ సాంగ్స్ రాసి పాడుతుంది. హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ పదాలను టక్కున పట్టేట్టుగా వాడుతూ పాటలు రాసి పాడటం వల్ల గతంలోనే గుర్తింపు పొందినా ‘బదల్తా కశ్మీర్’ పాటతో ప్రపంచానికి తెలిసింది. ‘నేను రెండో క్లాస్‌లో ఉండగా యోయో హనీసింగ్ రాప్ ఆల్బమ్ విన్నాను. అది నాకు చాలా నచ్చింది. ఆ వయసులోనే అలా ర్యాప్ పాటలు ట్రై చేసేదాన్ని. అప్పుడే బజ్రంగి భాయ్‌జాన్ (2015) సినిమా షూటింగ్ మా ఏరియాలో జరిగితే అందులోని బాల నటి హర్షాలికి నేను బాడీ డబుల్ (డూప్)గా నటించాను. అలా నేను కూడా సినిమాల్లో నటించాలనుకున్నానుగానీ మా కశ్మీర్లో సినిమా పరిశ్రమ లేదు. అందుకని ర్యాపర్‌గా రాణించాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది హుమైరా. కశ్మీర్లో ప్రతి ఏటా జరిగే ‘ర్యాప్ బ్యాటిల్’ పొంటీల్లో పాల్గొని 2022, 2023 సంవత్సరాల్లో టైటిల్ గెలిచింది హుమైరా. ‘2022లో 15 మంది అబ్బాయిలు నాకు పొంటీగా వచ్చారు. నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. నేనే గెలిచాను’ అంటుంది హుమైరా. ‘కశ్మీర్లో అమ్మాయిలు స్పోర్ట్స్‌లో, కళల్లో, చదువులో, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఆ విషయాన్ని నా పాటలో చెప్పాను’ అందామె. ఈ పాటలోనే మేల్ వాయిస్ ఇచ్చిన ఎం.సి.రా ‘ఇక్కడ ఇప్పుడు జీన్స్ ప్యాంట్ అమ్మాయిలు తొడుక్కుంటున్నారు. బట్టల్ని బట్టి వారిని జడ్జ్ చేసే రోజులు పొంయాయి’ అనే లైన్లు పాడాడు. హుమైరా, ఎం.సి.రా కలిసి ‘మై కశ్మీరి... మేరా దేశ్ హై హిందూస్తాన్’ అని పాటను ముగిస్తారు. ఈ పాటలో హుమైరా ‘టెర్రరిస్టులకు ఇక్కడ చోటు లేదు. అనవసరంగా ఎవరి రక్తం పారడానికి వీల్లేదు’ అనే లైన్లు పాడింది. ‘నువ్వు చూపుతున్న అభివృద్ధి ఉత్తుత్తదే. అసలు వాస్తవం వేరే ఉంది అని కొందరంటున్నారుగా’ అని విలేకరులు ప్రశ్నిస్తే ‘అది వారి దృష్టికోణం. ఇది నా దృష్టికోణం’ అంటుంది హుమైరా.‘కొంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. నేను పట్టించుకోను. నేను ఇలాగే ముందుకెళతాను. నా వెనుక ఒక్కరు నిలబడినా చాలు’ అందామె.కశ్మీర్ వెనుక హుమైరా వెనుక ఇప్పుడు చాలామంది ఉన్నారు. కశ్మీర్ అభివృద్ధికి అందరూ ప్రయత్నిస్తే ‘నయా కశ్మీర్’ దగ్గరిలోనే సాధ్యమవుతుంది. -
ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు..ఇంకా ఇతర అప్డేట్స్
-
Jammu Kashmir: ఆర్టికల్ 370 రద్దు సబబే
ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పంచిన ఈ ఆర్టికల్ ను రద్దు చేయడం సబబేనని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ ఏకగ్రీవంగా మూడు తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటేనని, దాని రద్దుకు రాష్ట్రపతికి పూర్తి అధికారాలున్నాయని స్పష్టం చేసింది. లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని సమరి్థంచింది. జమ్మూ కశ్మీర్‌కు తక్షణం రాష్ట్ర హోదాను పునరుద్ధరించి సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించా లని కేంద్రాన్ని ఆదేశించింది. కశ్మీర్లో మానవ హక్కుల హననంపై స్వతంత్ర కమిషన్ ఆధ్వర్యంలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ విడి తీర్పు వెలువరించారు. కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు సహేతుక కారణాలు ఉండి తీరాల్సిందేనని జస్టిస్ సంజీవ్ ఖన్నా తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పు చరిత్రాత్మకమంటూ మోదీ ప్రస్తుతించారు. ఆరెస్సెస్, బీజేపీ ఈ తీర్పును స్వాగతించగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు భిన్నంగా స్పందించాయి. న్యూఢిల్లీ: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్‌ను రద్దు చేయడం సబబేనని స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముక్త కంఠంతో సమరి్థంచింది. 370 ఆర్టికల్ రద్దు తాలూకు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. సోమవారం ఈ మేరకు ఏకగ్రీవంగా మూడు తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 కేవలం ఓ తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, దాన్ని రద్దు చేసే పూర్తి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయని సీజేఐ స్పష్టం చేశారు. ఈ మేరకు తనతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎస్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ తరఫున ఆయన 352 పేజీల మెజారిటీ తీర్పు వెలువరించారు. లద్దాఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం కూడా సబబేనని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి. 2024 సెపె్టంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి’’ అని కేంద్రాన్ని సీజేఐ ఆదేశించారు. ఈ తీర్పును సమరి్థస్తూ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ 121 పేజీలతో విడిగా తీర్పు ఇచ్చారు. ఈ రెండు తీర్పులతోనూ పూర్తిగా ఏకీభవిస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా మరో తీర్పు వెలువరించారు. ఈ తీర్పును కేంద్రంలో మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. ప్రధానితో పాటు బీజేపీ తీర్పును సమర్థించగా పలు పార్టిలతో పాటు పలువురు నేతలు వ్యతిరేకించారు. ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేయలేరు జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. రాష్ట్ర హోదా రద్దు చేసి దాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ అనంతరం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సెపె్టంబర్ 5న తీర్పును రిజర్వు చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యంగ ఆదేశం (సీఓ) 272లో జమ్మూ కశ్మీర్‌కు రాజ్యాంగంలోని అన్ని విధి విధానాలనూ వర్తింపజేశారు. ఆర్టికల్ 370లో పేర్కొన్న రాజ్యాంగ అసెంబ్లీ అనే పదాన్ని అసెంబ్లీగా మార్చారు. ఈ నిర్ణయాల చెల్లుబాటుపై ధర్మాసనం ప్రధానంగా విచారణ జరిపింది. జమ్మూ కశ్మీర్ విషయమై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేయజాలరని తీర్పులో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం అది భారతదేశంలో సంపూర్ణంగా విలీనమై అంతర్భాగంగా మారిందనడంలో ఏ సందేహానికీ తావులేదని స్పష్టం చేశారు. ‘‘ఆర్టికల్ 1 ప్రకారమే గాక ఆర్టికల్ 370ని బట్టి చూసినా జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే. అలాంటప్పుడు దానికి ప్రత్యేక సార్వ¿ౌమాధికారమంటూ ఏమీ ఉండబోదు. హక్కుల విషయంలోనూ మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే. అంతే తప్ప ప్రత్యేకతేమీ ఉండబోదు’’ అని పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రకటించిన నేపథ్యంలో దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం ఆర్టికల్ 3 ప్రకారం సరైందో కాదో తేల్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 (1) (డి) కింద తనకున్న అధికారాలను వినియోగించేందుకు (నాటి) జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అంగీకారం తీసుకోవడం రాష్ట్రపతికి తప్పనిసరేమీ కాదని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ అసెంబ్లీ అనుమతి లేకుండా ఆర్టికల్ 370కి ఎలాంటి మార్పుచేర్పులూ చెల్లుబాటు కావని, రాజ్యాంగ అసెంబ్లీ 1957లోనే రద్దయినందున ఆర్టికల్ 370 శాశ్వతత్వం సంతరించుకుందని పిటిషనర్లు చేసిన వాదనను పూర్తిగా అసంబద్ధమన్నారు. అది కేవలం తాత్కాలిక ఏర్పా టేనని రాజ్యాంగంలోని పలు నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. దాన్ని రాజ్యాంగంలోని 21వ భాగంలో పొందుపరిచేందుకు కూడా అదే కారణమని వివరించారు. సార్వభౌమత్వం ఉండదు ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు అంతర్గత సార్వ¿ౌమత్వం ఉంటుందన్న వాదనను కూడా ధర్మాసనం తోసిపుచి్చంది. 1947లో విలీనం సందర్భంగా రక్షణ, విదేశాంగ, సమాచార అంశాల్లో మాత్రమే జమ్మూ కశ్మీర్ సార్వ¿ౌమాధికారాలను భారత ప్రభుత్వానికి నాటి రాజు హరిసింగ్ వదులుకున్నారన్న వాదనను కూడా కొట్టిపారేసింది. కేంద్రంతో ఇలాంటి ప్రత్యేక నిబంధనలున్న ఇతర రాష్ట్రాలు కశ్మీర్‌ను ఉదాహరణగా చూపుతూ తమకూ అంతర్గత సార్వ¿ౌమత్వముందని వాదిస్తే పరిస్థితేమిటని సీజేఐ ప్రశ్నించారు. మన అసౌష్టవ సమాఖ్య వ్యవస్థ స్వభావం ప్రకారం కొన్ని రాష్ట్రాలకు మిగతా వాటితో పోలిస్తే కొన్ని విషయాల్లో కాస్త స్వయం ప్రతిపత్తికి ఆస్కారముందని గుర్తు చేశారు. ‘‘భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా ఔదలదాలుస్తూ 1949 నవంబర్ 25న కశ్మీర్ విలీన ఒప్పందాన్ని దాని యువరాజు కరణ్‌సింగ్ బేషరతుగా ఆమోదించడంతోనే అది పూర్తిగా దేశంలో కలిసిపోయింది. కనుక జమ్మూ కశ్మీర్‌కు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎప్పుడూ ఏ విధమైన అంతర్గత సార్వభౌమత్వమూ లేదు, ఉండబోదు. అక్కడి ప్రజలకూ ఇదే వర్తిస్తుంది’’ అన్నారు. ‘‘రెండు కారణాలతో ఆర్టికల్ 370 తెరపైకి వచి్చంది. ఒకటి జమ్మూ కశ్మీర్లో రాజ్యాంగ అసెంబ్లీ కొలువుదీరేదాకా దాకా అది మధ్యంతర ఏర్పాటుగా పని చేసింది. అలాగే నాడు అక్కడ నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాటుగా కూడా ఆర్టికల్ 370ని తీసుకొచ్చారు. అది శాశ్వతమేమీ కాదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది’’ అని స్పష్టం చేశారు. సెపె్టంబర్ 30లోగా జమ్మూ కశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సీజేఐ సూచించారు. కశ్మీర్లో మానవ హక్కుల హననంపై నిష్పాక్షిక దర్యాప్తు: జస్టిస్ కౌల్ సీజేఐ వెలువరించిన మెజారిటీ తీర్పుతో ఏకీభవిస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ విడిగా తీర్పు వెలువరించారు. దశలవారీగా కశ్మీర్‌ను అభివృద్ధి తదితర అన్ని అంశాల్లోనూ ఇతర రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్లడమే ఆర్టికల్ 370 ఉద్దేశమని స్పష్టం చేశారు. దాని రద్దు పూర్తిగా సబబేనని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌కు తగిలిన గాయాలు మానాల్సిన అవసరముందని జస్టిస్ కౌల్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. 1980ల నుంచి అక్కడ ప్రభుత్వపరంగా, ఇతరత్రా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. అప్పటి దారుణాలపై అది నిష్పాక్షికంగా పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక సమరి్పంచాలన్నారు. కశ్మీర్ జస్టిస్ కౌల్ స్వస్థలం. ఈ నేపథ్యంలో తీర్పులో ఒక చోట ‘కశ్మీరీలమైన మేము’ అని కూడా ఆయన పేర్కొన్నారు. ‘‘1947 నుంచీ దశాబ్దాల పాటు కశ్మీరీలు వేర్పాటు, ఉగ్రవాదాల బాధితులుగా ఉంటూ వస్తున్నారు. దాంతో తొలుత కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను ఇతర దేశాలు ఆక్రమించాయి. 1980ల్లో వేర్పాటువాదం లోయలో కల్లోలం సృష్టించింది. అది వలసలకు దారి తీసింది. అవి స్వచ్చంద వలసలు కావు. సరిహద్దుల ఆవలి నుంచి వచ్చి పట్ట మతిలేని మతోన్మాదాన్ని తాలలేక కశ్మీరీ పండిట్లు ప్రాణాలు కాపాడుకునేందుకు విధి లేక ఇల్లూవాకిలీ విడిచి మూకుమ్మడిగా వలస వెళ్లారు. దాంతో కశ్మీర్ తాలూకు సాంస్కృతిక విలువలే సమూలంగా మారిపోయాయి. దేశ సమగ్రత, సార్వ¿ౌమత్వమే ప్రమాదంలో పడి సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విదేశీ చొరబాట్లను అరికట్టి దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించేందుకు సైన్యం చేపట్టిన చర్యలతో పరిస్థితులు మరో మలుపు తీసుకున్నాయి. తర్వాతి పరిణామాల్లో ఆడ, మగ, చిన్నా, పెద్దా అందరూ భారీ మూల్యం చెల్లించాల్సి వచి్చంది. మూడు దశాబ్దాలు దాటినా నాటి అన్యాయాలను సరిదిద్దలేదు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అక్కడ పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు కశ్మీర్ తాలూకు సామాజిక నిర్మాణాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. తద్వారా కశ్మీరీలు సహనశీలత, పరస్పర గౌరవం సహజీవనం సాగించేలా చూడాలి’’ అని పేర్కొన్నారు. గట్టి కారణాలుంటేనే యూటీలు: జస్టిస్ ఖన్నా రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఈ చర్య విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. సమాఖ్య తత్వానికి అడ్డంకిగా మారుతుంది. ప్రజలకు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకుండా చేస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. అందుకే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలంటే అందుకు సహేతుకమైన గట్టి కారణాలు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచిన నియమ నిబంధలను పూర్తిగా అనుసరిస్తూ మాత్రమే అందుకు పూనుకోవాలని సూచించారు. ఆర్టికల్ 370 అంశంపై వెలువరించిన విడి తీర్పులో జస్టిస్ ఖన్నా ఈ మేరకు పేర్కొన్నారు. దాని రద్దు సబబేనంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వెలువరించిన తీర్పులతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. ఆర్టికల్ 370కి శాశ్వత లక్షణం లేదని స్పష్టం చేశారు. ‘‘ఈ మేరకు సీజేఐ, జస్టిస్ కౌల్వెలువరించిన తీర్పులు గొప్ప పరిణతితో కూడుకున్నవి. సంక్లిష్టమైన న్యాయపరమైన అంశాలను సరళంగా వివరిస్తూ సాగాయి’’ అని ప్రస్తుతించారు. అంతిమ అధికారం కేంద్రానిదే ప్రజాస్వామ్యం, సమాఖ్య తత్వం మాన రాజ్యాంగపు మౌలిక లక్షణాలైనా కొన్ని నిర్దిష్ట ఏకస్వామ్యపు లక్షణాలు కూడా అందులో ఇమిడే ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘వాటి ప్రకారం ఏ విషయంలోనైనా అంతిమంగా నిర్ణాయక అధికారాలు కేంద్రానికే దఖలు పడ్డాయి. కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు వంటివి వాటిలో భాగమే’’ అని సీజేఐ వివరించారు. ‘‘కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల విభజన, వాటి అమలులో రాష్ట్రాలకు ఇచ్చిన స్వతంత్రం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేవే. అయితే పలు కారణాల దృష్ట్యా రాష్ట్రంగా మనుగడ సాగించలేవని భావించిన ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే సంపూర్ణ అధికారాలు కేంద్రానికి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఏమిటీ ఆర్టికల్ 370? ► ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉంటుంది. ► ప్రత్యేక రాజ్యాంగం, రాష్ట్ర పతాకం ఉంటాయి. ► అంతర్గత పాలన విషయంలో పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ► కశ్మీర్‌పై భారత సార్వభౌమాధికారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల వరకే పరిమితం. ► ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్మూ కశ్మీర్లో ఆస్తులు, భూములు కొనుగోలు చేయలేరు. ► ప్రజల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం మిగతా ప్రాంతాల వారికంటే భిన్నంగా ఉంటుంది. ► అక్కడ ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అధికారం కేంద్రానికి లేదు. ► రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్లు మినహా ఇతర చట్టాల అమలుకు అక్కడి రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. ► ఆర్టికల్ 370ని సవరించే, రద్దు చేసే అధికారం రాజ్యాంగ అసెంబ్లీకి ఉంది. ► కానీ రాజ్యాంగ అసెంబ్లీయే 1957లో రద్దయిపోయింది. ► దాంతో ఆర్టికల్ 370 రాజ్యాంగంలో శాశ్వత భాగమైయిందని, దాని రద్దు అధికారం కేంద్రానికి లేదని అక్కడి పారీ్టలు వాదిస్తూ వస్తున్నాయి. అమలు నుంచి రద్దు దాకా... 1947 అక్టోబర్ 26: భారతదేశ విభజన తర్వాత జమ్మూకశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండడానికే మహారాజా హరిసింగ్ మొగ్గు చూపారు. భారత్‌లో గానీ, పాకిస్తాన్లో గానీ విలీనం కాబోమని ప్రకటించారు. ఇంతలో పాకిస్తాన్ సైన్యం అండతో అక్కడి గిరిజనులు జమ్మూకశ్మీర్‌పై దండెత్తారు. మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వ సహకారాన్ని కోరారు. భారత్‌లో విలీనానికి అంగీకరించారు. కొన్ని షరతులతో విలీన ఒప్పందంపై సంతకం చేశారు. 1949 మే 27: రాజ్యాంగాన్ని రూపకల్పనకు ఏర్పాటైన రాజ్యాంగ సభ విలీన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 370 ముసాయిదాను ఆమోదించింది. 1949 అక్టోబర్ 17: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తూ ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగంలో చేర్చారు. 1951 మే 1: జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ రాజకుమారుడు డాక్టర్ కరణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 1952: ఇండియా, జమ్మూకశ్మీర్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ‘ఢిల్లీ అగ్రిమెంట్’పై భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, జమ్మూకశ్మీర్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా సంతకం చేశారు. 1954 మే 14: రాష్ట్రపత్తి ఉత్తర్వు మేరకు ఆర్టికల్ 370 అమల్లోకి వచ్చింది. 1954 మే 15: జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసితుల హక్కుల విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలకు రక్షణ కలి్పంచడానికి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ‘ఆర్టికల్ 35ఏ’ను భారత రాజ్యాంగంలో చేర్చారు. 1957 నవంబర్ 17: జమ్మూకశ్మీర్ రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1958 జనవరి 26: జమ్మూకశ్మీర్‌కు సొంత రాజ్యాంగం అమల్లోకి వచి్చంది. 1965: జమ్మూకశ్మీర్‌లో ప్రధానమంత్రి, సదర్–ఇ–రియాసత్ పదవులను ముఖ్యమంత్రి, గవర్నర్‌గా అధికారికంగా మార్చారు. 2018 డిసెంబర్ 20: జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. 2019 జూలై 3: రాష్ట్రపతి పాలనను మరోసారి పొడిగించారు. 2019 ఆగస్టు 5: ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2019 ఆగస్టు 6: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ అడ్వొకేట్ ఎం.ఎల్.శర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తర్వాత మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 9: జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం–2019ను పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. 2019 సెప్టెంబర్ 19: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. 2023 ఆగస్టు 2: పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ మొదలైంది. 2023 సెపె్టంబర్ 5: మొత్తం 23 పిటిషన్లపై ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. 2023 డిసెంబర్ 11: ఆర్టికల్ 370 రద్దును సమరి్థస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. చరిత్రాత్మక తీర్పు ఆరి్టకల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం. ఇదొక చరిత్రాత్మక తీర్పు. ఇది కేవలం న్యాయపరమైన తీర్పుకాదు. భవిష్యత్తు తరాలకు ఒక ఆశాదీపం. మెరుగైన భవిష్యత్తుకు వాగ్దానం. మరింత బలమైన, ఐక్య భారత్‌ను నిర్మించుకొనే విషయంలో మన సమ్మిళిత కృషికి మద్దతుగా నిలుస్తుంది. జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌లోని మన సోదర సోదరీమణుల ప్రగతి, ఐక్యత, ఆశను ప్రతిధ్వనించే తీర్పు ఇది. వారి కలలను నెరవేర్చే విషయంలో మన అంకితభావం చెదిరిపోనిది. భారతీయులుగా మనం గర్వపడే మన ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చింది. ఆరి్టకల్ 370 వల్ల నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ప్రగతి ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష – ‘ఎక్స్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో జమ్మూకశీ్మర్‌లో శాంతి నెలకొంది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు హింసను అనుభవించిన ప్రజలు ప్రస్తుతం శాంతియుతంగా జీవిస్తున్నారు. వారి జీవితాల్లో అభివృద్ధికి కొత్త నిర్వచనం వచ్చిచేరింది. జమ్మూకశీ్మర్‌లో పర్యాటకం, వ్యవసాయ రంగాలు వెలిగిపోతున్నాయి. – అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి ప్రతీ భారతీయుడి మదిలో సంతోషం ఆరి్టకల్ 370, ఆరి్టకల్ 35ఏను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచింది. ఈ చరిత్రాత్మక నిర్ణయంతో ప్రతీ భారతీయుడి మదిలో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ ఒక కొత్త అధ్యాయం లిఖించారు. – రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్తు జమ్మూకశీ్మర్, లద్దాఖ్ ప్రజల ఉజ్వలమైన భవిష్యత్తుకు సుప్రీంకోర్టు తీర్పు నాంది పలికింది. అభివృద్ధిని వారికి చేరువ చేయడానికి మోదీ సర్కారు కృషి చేస్తూనే ఉంటుంది. న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు ఇచి్చంది. అభివృద్ధి, సుపరిపాలన, సాధికారత జమ్మూకశీ్మర్, లద్దాఖ్ ప్రజలకు అందుతాయి. వారంతా ఇకపై కలిసికట్టుగా ఉంటారు – ఎస్.జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి ప్రజల పాలిట మరణ శాసనం ఆరి్టకల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు జమ్మూ కశీ్మర్ ప్రజల పాలిట మరణ శాసనం కంటే తక్కువేమీ కాదు. ఇది కేవలం ప్రజలకే కాదు, భారత్ అనే భావనకు పరాజయం. భారత పార్లమెంట్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక, చట్టవ్యతిరేక చర్యకు నేడు న్యాయపరంగా ఆమోదం లభించింది. కోర్టు తీర్పుతో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏ నిర్ణయమూ తుది నిర్ణయం కాదు. జమ్మూకశీ్మర్ ప్రజలు రాజకీయ పోరాటం కొనసాగించాలి. – మెహబూబా ముఫ్తీ, పీడీపీ ఈ తీర్పు నిరాశ కలిగించింది సుప్రీంకోర్టు తీర్పు నాకు నిరాశ కలిగించింది. అయితే, ఉత్సాహం మాత్రం కోల్పోలేదు. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. జమ్మూకశీ్మర్ ప్రజల పోరాటం కొనసాగుతుంది. ఓటమి ఎదురైతే వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం. చట్టపరంగా ముందుకెళ్తాం – ఒమర్, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు రాష్టహోదా పునరుద్ధరించాలి ఆరి్టకల్ 370 రద్దుకు చట్టపరంగా ఆమోదం లభించింది. ఇక చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఇక ఎవరూ అడ్డుకోలేరు. వాస్తవానికి ఆరి్టకల్ 370 రద్దు వల్ల జమ్మూ లోని డోంగ్రాలు, లద్దాఖ్‌లోని బౌద్ధులు ఎక్కువగా నష్టపోతారు. జమ్మూకశ్మీర్‌కు వెంటనే రాష్టహోదా పునరుద్ధరించాలి. రాబోయే లోక్‌సభ ఎన్నికలతోపాటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం జాతీయ సమైక్యత బలోపేతం ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు మన జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తుంది. ఈ ఆరి్టకల్‌ను మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఆరి్టకల్ 370 రద్దుకు చట్టపరంగా మద్దతు లభించడం ఆహా్వనించదగ్గ పరిణామం. జమ్మూకశీ్మర్ ప్రజలకు ఇకపై ఎంతో మేలు జరుగుతుంది – సునీల్ అంబేకర్, ఆర్ఎస్ఎస్ ఆ తీర్పునకు చట్టపరంగా విలువ లేదు ఆర్టికల్ 370 విషయంలో భారత సుప్రీంకోర్టు తీర్పునకు చట్టపరంగా ఎలాంటి విలువ లేదు. భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఏకపక్షంగా, చట్టవ్యతిరేకంగా తీసుకున్న చర్యలను అంతర్జాతీయ చట్టాలు, న్యాయ వర్గాలు గుర్తించడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం జమ్మూకశీ్మర్ ప్రజలకు స్వయం ప్రతిపత్తి అనే హక్కు ఉంది. ఆ హక్కును వారి నుంచి ఎవరూ బలవంతంగా లాక్కోలేరు. భారత సుప్రీంకోర్టు తీర్పును మేము తిరస్కరిస్తున్నాం. పాక్ విదేశాంగ మంత్రి ప్రజల ఆకాంక్షలను కేంద్రం నెరవేర్చాలి జమ్మూకశీ్మర్‌కు తక్షణమే రాష్ట్రహోదా పునరుద్ధరించాలి. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలకు కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పును కుణ్నంగా పరిశీలించాల్సి ఉంది. న్యాయస్థానం కొన్ని అంశాలను పక్కనపెట్టినట్లు కనిపిస్తోంది. పి.చిదంబరం, అభిõÙక్ సింఘ్వీ, కాంగ్రెస్ కోర్టు తీర్పు కలవరానికి గురిచేసింది సుప్రీంకోర్టు తాజా తీర్పు కొంత కలవరానికి గురిచేసింది. ఈ తీర్పు పర్యావసానాలు దేశ రాజ్యాంగ సమాఖ్య నిర్మాణంపై తీవ్రస్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు. – సీపీఎం పొలిట్ బ్యూరో – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐక్యతకు బలం చేకూర్చిన తీర్పు!
ఆర్టికల్ ‘370, 35ఎ’ల రద్దుపై భారత సర్వోన్నత న్యాయస్థానం డిసెంబరు 11న ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను నిర్ద్వంద్వంగా సమర్థించింది. ఈ మేరకు 2019 ఆగస్టు 5 నాటి నిర్ణయం రాజ్యాంగ సమగ్రతను మరింత పటిష్ఠం చేసేదే తప్ప దెబ్బ తీసేది ఎంతమాత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఆర్టికల్ 370కి స్వాభావిక శాశ్వతత్వం లేదనే వాస్తవాన్ని కూడా కోర్టు గుర్తించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో ‘ఒకే భారతం–శ్రేష్ఠ భారతం’ స్ఫూర్తి మరింత బలోపేతమైంది. ఐక్యతా బంధం, సుపరిపాలనపై ఉమ్మడి నిబద్ధతకు నిర్వచనం ఇదేనని గుర్తు చేసిన ఈ తీర్పు ప్రతి భారతీయుడూ గర్వించదగినది. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. నిర్మలమైన లోయలు, గంభీర పర్వతాలతో కూడిన ప్రాకృతిక వైభవం అనాదిగా కవులు, కళాకారులను ఉత్తేజితం చేయడమే కాకుండా సాహసికుల హృదయాలను కూడా దోచుకుంది. ఆకాశాన్నంటే హిమాలయ సోయగం నడుమ సౌందర్య–అద్భుతాల సంగమంగా ఈ ప్రదేశం అలరారేది. కానీ, ఈ స్వర్గం ఏడు దశాబ్దాలపాటు అత్యంత దారుణ హింస, అస్థిరతలకు ఆలవాలమై ప్రకృతి ప్రేమికులకు, సౌందర్య ఆరాధకులకు నరకంగా పరిణమించింది. దురదృష్టవశాత్తూ శతాబ్దాల పాటు సాగిన వలసపాలన వల్ల... ముఖ్యంగా మానసిక, ఆర్థిక అణచివేత ఫలితంగా మనం ఒక రకమైన అస్తవ్యస్త సమాజంగా మారిపోయాం. అనేక ప్రాథమిక అంశాలపై సుస్పష్ట వైఖరి కొరవడి, ద్వంద్వత్వాన్ని అనుమతించడంతో అది మనల్ని మరింత గందరగోళంలోకి నెట్టింది. ఈ దురదృష్టకర పరిణా మాలకు జమ్మూ కశ్మీర్ ప్రధాన బాధితురాలుగా మిగిలింది. స్వాతంత్య్రం సిద్ధించిన వేళ జాతీయ సమైక్యత దిశగా నవ్యారంభాన్ని ఎంచుకునే అవకాశం మనకు దక్కింది. కానీ, మనం దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకు బదులు అస్తవ్యస్త సమాజ విధానాల కొన సాగింపునకే నిర్ణయించుకున్నాం. నా జీవితంలో చిన్న వయసు నుంచే జమ్మూ–కశ్మీర్ సమస్యతో నేను ఒకవిధంగా ముడిపడి ఉన్నాను. కానీ, దీన్ని కేవలం రాజకీయ సమస్యగా కాకుండా సామాజిక ఆకాంక్షలు తీర్చే అంశంగా పరిగణించే సైద్ధాంతిక చట్రంలో నేనొకడిని. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో జరిగిందంతా అక్కడి ప్రజానీకానికి, మనదేశానికి ఘోర ద్రోహమని నేను దృఢంగా విశ్వసించాను. అందుకే ప్రజలకు వాటిల్లిన అన్యా యాన్ని సరిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని బలమైన సంకల్పం పూనాను. ఆ మేరకు జమ్మూ–కశ్మీర్ ప్రజల కష్టాలు తీర్చేందుకు అవిరళంగా శ్రమించాలని నిశ్చయించుకున్నాను. ఆ క్రమంలో ఆర్టికల్ 370, 35(ఎ) ప్రధాన అవరోధాలు అయ్యాయి. అవి దుర్భే ధ్యమైన అడ్గుగోడల్లా తోచాయి. మరోవైపు బాధితులంతా పేదలు, అణగారిన వర్గాలవారు. ఈ పరిస్థితుల నడుమ ఈ రెండు రాజ్యాంగ నిబంధనల వల్ల భారతీయులందరికీ లభించే హక్కులు, ప్రగతి కశ్మీర్ ప్రజలకు దక్కవన్నవి సుస్పష్టం. ఫలితంగా ఒకే దేశంలోని పౌరుల మధ్య అగాధం ఏర్పడింది. పర్యవసానంగా జమ్మూ కశ్మీర్ ప్రజల బాధలు తెలిసి, అక్కడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భావించిన ఇతర పౌరులు కూడా నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఈ సమస్యను కొన్ని దశాబ్దాలుగా నిశితంగా పరిశీలించిన ఓ కార్యకర్తగా దాని లోతుపాతులు, సంక్లిష్టతలపై నాకు క్షుణ్ణమైన అవగాహన ఉంది. ఏదేమైనా ఒక విషయంలో మాత్రం నాకు తిరుగు లేని స్పష్టత ఉంది. అదేమిటంటే– జమ్మూ–కశ్మీర్ ప్రజలు ప్రగతిని కోరుకుంటున్నారు. తమ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలతో దేశాభివృద్ధికి తోడ్పడాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. తమ భవిష్యత్తరానికి మెరుగైన జీవన నాణ్యతను, హింస–అనిశ్చితి రహిత జీవనాన్ని కూడా ప్రగాఢంగా వాంఛిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్యన జమ్మూ– కశ్మీర్ ప్రజలకు సేవలందించడంలో మూడు ప్రధానాంశాలకు మేంప్రాధాన్యమిచ్చాం. ఆ మేరకు పౌరుల సమస్యలను అవగతం చేసు కోవడం, చేయూత ద్వారా విశ్వాసం పెంచడం, ముమ్మూర్తులా అభివృద్ధి ప్రాథమ్యం కల్పించడంపై నిశితంగా దృష్టి సారించాం. దేశంలో మేం 2014లో అధికారంలోకి రాగానే... జమ్మూ–కశ్మీర్ ప్రగతి పయనాన్ని మరింత వేగిరపరచేందుకు మా ప్రభుత్వంలోని మంత్రులు తరచూ అక్కడికి వెళ్లి ప్రజలతో నేరుగా సంభాషించాలని మేం నిర్ణయించుకున్నాం. దీంతో అక్కడ సుహృద్భావం పెంపొందించడంలో ఈ పర్యటనలు కీలకపాత్ర పోషించాయి. ఈ మేరకు 2014 మే నెల నుంచి 2019 మార్చి వరకు 150 దఫాలకు పైగా మంత్రులు పర్యటించడం మునుపెన్నడూ లేని రికార్డు. ఇక ప్రత్యేక ప్యాకేజీతో జమ్మూ–కశ్మీర్ అభివృద్ధి అవసరాలు తీర్చే దిశగా 2015లో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ఇందులో మౌలిక సదుపాయాల నిర్మాణం, ఉద్యోగ–ఉపాధికల్పన, పర్యాటకానికి ప్రోత్సాహం, హస్త కళల పరిశ్రమకు మద్దతు వంటి కార్యక్రమాలున్నాయి. జమ్మూ–కశ్మీర్లో యువత కలలను రగిలించగల శక్తి క్రీడలకు ఉందన్న వాస్తవాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ మేరకు వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించాం. వారి ఆకాంక్షలు –భవిష్యత్తుపై ఈ క్రీడల పరివర్తనాత్మక ప్రభావాన్ని మేం ప్రత్యక్షంగా చూశాం. క్రీడా వేదికల మెరుగుతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి శిక్షకులను అందుబాటులో ఉంచాం. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్బుల ఏర్పాటును ప్రోత్సహించడం మేం చేపట్టిన అత్యంత ప్రత్యేక చర్యలలో ఒకటి. దీని ఫలితాలు అత్యద్భుతం. వీటిద్వారా ఎందరో యువతీయువకులు పటిష్ఠ శిక్షణతో ప్రతిభావంతులైన క్రీడాకారు లుగా వెలుగులోకి వచ్చారు. వీరిలో అఫ్షాన్ ఆషిఖ్ పేరు నాకింకా గుర్తుంది. ఎందుకంటే– 2014 డిసెంబరు నాటికి శ్రీనగర్‌లో రాళ్లు విసిరే అల్లరిమూకలో ఆమె ఒకరుగా ఉండేది. అయితే, సముచిత చర్యలు, ప్రోత్సాహంతో ఆ యువతి ఫుట్‌బాల్ వైపు మళ్లి జాతీయ స్థాయిలో పేరుప్రతిష్ఠలు సంపాదించింది. ఆ తర్వాత యువతరంతో సుదృఢ భారతం కార్యక్రమం సందర్భంగా ఓసారి నేను ఆమెతో సంభాషించినట్లు నాకిప్పటికీ గుర్తుంది. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధిలో పంచాయితీ ఎన్నికలు ఒక మేలిమలుపు. మరోసారి మేం అధికారంలో కొనసాగడం లేదా మా సిద్ధాంతాలకు కట్టుబాటు... అనే వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవా ల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. మాకు ఇదేమంత కఠినమైనది కాదు. అధికారం వదులుకున్నా, సిద్ధాంతాలను నిలబెట్టుకున్నాం. ఆ మేరకు జమ్మూ ప్రజల ఆకాంక్షలు, కశ్మీర్ ప్రగతికే అత్యంత ప్రాధాన్యమిచ్చాం. పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడం అక్కడి ప్రజల ప్రజాస్వామిక స్వభావాన్ని స్పష్టం చేసింది. గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులతో సంభాషించాలని నా మనస్సుకు తోచింది. ఈ సందర్భంగా ఇతరత్రా సమస్యలపై మాట్లాడటంతో పాటు నేను వారికొక అభ్య ర్థన చేశాను. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను తగులబెట్ట రాదని, ఈ వాగ్దానానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశాను. ఆ తర్వాత వారు తమ హామీని నిలబెట్టుకోవడం నన్నెంతో ఆనందింప జేసింది. పాఠశాలలు తగుల బడితే అందరి కన్నా ఎక్కువగా బాధపడేది పసివాళ్లే! ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ ఒక చరిత్రాత్మక దినంగా ప్రతి భారతీయుడి హృదయంలో నాటుకు పోయింది. ఆ రోజున ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మన పార్లమెంటు చారిత్రక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ లలో పెనుమార్పులు వచ్చాయి. చివరకు 2023 డిసెంబరులో న్యాయ స్థానం తీర్పు దాన్ని బలపరచింది. ఈ మూడు ప్రదేశాల్లో అభివృద్ధిని చూశాక నాలుగేళ్ల కిందటి పార్లమెంటు నిర్ణయంపై ప్రజాకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రతిధ్వనింపజేసింది. రాజకీయాల స్థాయిలో గత 4 ఏళ్లుగా క్షేత్రస్థాయిన ప్రజా స్వామ్యంపై సరికొత్త విశ్వాసం పునరుద్ధరించబడింది. అంతకు ముందు సమాజంలోని మహిళలు, గిరిజనులు, ఎస్సీ/ఎస్టీ, అణగా రిన వర్గాలకు దక్కా ల్సిన ప్రయోజనాలు అందేవి కావు. అదే సమ యంలో లద్దాఖ్ ఆకాంక్షలు పూర్తిగా విస్మరణకు గురయ్యాయి. అయితే, 2019 ఆగస్టు 5న ఈ పరిస్థితి సమూలంగా మారిపోయింది. ఇప్పుడు కేంద్ర చట్టాలన్నీ ఎలాంటి భయపక్షపాతాలూ లేకుండా అమలవుతున్నాయి. ప్రాతి నిధ్యం మరింత పెరిగింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. అందరూ విస్మరించిన శరణార్థి సమాజాలు అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడం ప్రారంభించాయి. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు సంతృప్త స్థాయికి చేరింది. మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక రంగానికి చేయూతతో కశ్మీర్ అందాలు ప్రతి ఒక్కరికీ మళ్లీ స్వాగతం పలుకు తున్నాయి. ఈ ఘనత సహజంగానే జమ్మూ–కశ్మీర్ ప్రజల దృఢ సంకల్పానికి దక్కుతుంది. ఈ మేరకు తాము ప్రగతి కాముకులం మాత్రమేనని, ఈ సానుకూల మార్పునకు చోదకులు కావడానికి సిద్ధంగా ఉన్నామని వారు పలుమార్లు నిరూపించుకున్నారు. గతంలో జమ్ము, కశ్మీర్, లద్దాఖ్‌ల పరిస్థితి ఒక ప్రశ్నార్థకంలా ఉండేది. కానీ, ఇప్పుడది ‘‘రికార్డు వృద్ధి, రికార్డు ప్రగతి, రికార్డు స్థాయిలో పర్యాటక ప్రవాహం’’తో ఆశ్చర్యార్థకానికి ప్రతీకగా మారింది. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్లలోప్రతి బిడ్డ నేడు స్వచ్ఛమైన నేపథ్యంతో జన్మిస్తున్నాడు. అక్కడ అతను లేదా ఆమె శక్తిమంతమైన ఆకాంక్షలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. ప్రజల స్వప్నాలు నేడు గతానికి బందీలు కావు. భవిష్యత్తుకు బంగారుబాట పరిచే అవకాశాలు. అన్నింటికీ మించి భ్రమలు, నిరాశా నిస్పృహల స్థానంలో ఇప్పుడు అభివృద్ధి, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం పరిఢ విల్లుతున్నాయి! నరేంద్ర మోదీ భారత ప్రధాని -
Article 370: సుప్రీం కోర్టు తీర్పుపై నిరుత్సాహ పడం: మెహబూబా ముఫ్తీ
సాక్షి, ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ, ఆ పార్టీ నేతలు స్వాగతించగా కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు, పలువురు నేతలు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. సుప్రీం కొర్టు తీర్పుకు నిరుత్సాహ పడటం లేదు. ఈ విషయంలో జమ్ము కశ్మీర్ ఎన్నో ఒడిదుడుకులు చూసింది. 370 నిబంధన తాత్కాలికమన్న వ్యాఖ్యలతో తాము ఓడిపోనట్లు కాదు. ఇది భారత దేశ ఆలోచనల ఓటమి. #WATCH | On SC verdict on Art 370 in J&K, PDP chief Mehbooba Mufti says, "...We should not be disheartened... J&K has seen several ups and downs... SC's verdict stating Article 370 was a temporary provision, is not our defeat, but the defeat of the idea of India... I want to say… pic.twitter.com/moTm2HPzpO — ANI (@ANI) December 11, 2023 ప్రస్తుతం జమ్ము కశ్మీర్ జైలులా మారింది. దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరవద్దని ఆదేశించారు. మేము అంతా గృహ నిర్భందంలో ఉన్నాం. ఏళ్ల నుంచి కొనసాగుతున్న రాజకీయం యుద్ధం ఇది. మేము ఇక్కడి నుంచి వెళ్లము. మీమంతా ఏకమై.. కలిసిపోరాడుతాం’అని తెలిపారు. డొమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... సుప్రీకోర్టు తీర్పు చాలా విచారకరం, దురదృష్టకరమైందని తెలిపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. On SC verdict on Article 370, National Conference leader Omar Abdullah says, "We had knocked on the doors of the Supreme Court because we were hoping for justice...We respect the Supreme Court...Our attempts will not end here. Will we approach the courts again? We will decide… pic.twitter.com/eWWbPhY9Pp — ANI (@ANI) December 11, 2023 అదే విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘న్యాయం కోసం ఆశించి సుప్రీంకోర్టు ఆశ్రయించాం. మాకు న్యాయం దక్కుతుందని ఆశించాం. అయితే సుప్రీం కోర్టుపై మాకు గౌరవం ఉంది. మా ప్రయత్నాలు ఇక్కడితో ఆగిపోతాయా? మళ్లీ కోర్టులను ఆశ్రయిస్తామా? అనే దానిపై న్యాయ సంప్రదింపుల అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
ఆర్టికల్ 370 రద్దుపై ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
-
ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ రూపంలో తన స్పందన తెలియజేశారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని కోర్టు ఆమోదించిందని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది. 2029, ఆగస్టు 5న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమైందని సుప్రీంకోర్టు సమర్ధించింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల ఆశ, పురోగతికి ఐక్యతకి ఇది అద్భుతమైన ప్రకటన. భారతీయులు గౌరవించే ఐక్యతా సారాంశాన్ని సుప్రీంకోర్టు బలపరిచింది. జమ్మూకశ్మీర్, లడఖ్‌లోని ప్రజల కలలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నాను. అభివృద్ధి ఫలాలు జమ్మూకాశ్మీర్ ప్రజలకు చేరడమే కాకుండా, ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు వాటి ప్రయోజనాలను అందజేయాలని నిశ్చయించుకున్నాం. ఈరోజు తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు మాత్రమే కాదు..ఇది ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకోసం బలమైన, మరింత ఐక్యతాయుత భారతదేశాన్ని నిర్మించాలనే తమ సంకల్పానికి సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు. Today's Supreme Court verdict on the abrogation of Article 370 is historic and constitutionally upholds the decision taken by the Parliament of India on 5th August 2019; it is a resounding declaration of hope, progress and unity for our sisters and brothers in Jammu, Kashmir and… — Narendra Modi (@narendramodi) December 11, 2023 ‘ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత పేదలు, అణగారిన వర్గాల ప్రజల హక్కుల పునరుద్ధరణ జరుగుతుంది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. స్థానిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడం, అత్యాధునిక విద్యా మౌలిక సదుపాయాలను కల్పించడం, పేదలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఆర్టికల్ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు? After the abrogation of #Article370, the rights of the poor and deprived have been restored, and separatism and stone pelting are now things of the past. The entire region now echoes with melodious music and cultural tourism. The bonds of unity have strengthened, and integrity… — Amit Shah (@AmitShah) December 11, 2023 -
ఆర్టికల్ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు?
భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వతంత్రప్రతిపత్తి జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ఉంది. ఈ ప్రత్యేకతకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 1947ఆగస్ట్ 15న భారత్, పాక్ స్వాతంత్య్రం పొందాయి. నాడు శ్రీనగర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నగా భారత్ సాయం కోరిన జమ్మూకశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. జమ్మూకశ్మీర్ ప్రధానిగా హేక్‌అబ్దుల్లాను (1949) భారత్ నియమించింది. 1949 అక్టోబర్ 17న.. రాజప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్‌సింగ్ ఉన్నారు. 1949 అక్టోబర్ 17న కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యాంగంలో 370 ఆధికరణను చేర్చింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని శాశ్వతంగా ఉంచాలని, తాత్కాలిక పద్ధతుల్లో హక్కులు ఇవ్వకూడదన్న అబ్దుల్లా వాదనను అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు. 1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దయింది. 1954లో 35ఏ నిబంధన జరిగింది. 1956లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. చివరికి 370 అధికరణం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే ఈ ప్రత్యేకప్రతిపత్తిని రాజ్యాంగంలోని 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 370 రూపకర్త.. ఒకప్పటి మద్రాస్ రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ 370కు ప్రధాన రూపకర్త. 1937-43 కాలంలో జమ్మూకశ్మీర్ సంస్థానానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. 1947 అక్టోబర్‌లో కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కేంద్రమంత్రిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ వ్యవహారాలు ఈయనే చూసుకునేవారు. ఈయన సారథ్యంలోని బృందం 1948, 1952లో కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. Photo Credits: LIVE LAW HINDI ఆర్టికల్ 370 అంటే.. భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి లభిస్తోంది. ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలూ, రాజ్యాంగం, జెండా అమల్లో ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన లభిస్తాయన్న నిబంధన కూడా ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కశ్మీర్లో అమలు చేయగలదు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సమస్యలకు, వివాదాలకు నిలయం.. మొదటి నుంచి కశ్మీర్ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. కశ్మీర్లో క్రయవిక్రయాలపై హక్కులు లేకపోవడం, ఉగ్రవాదుల దాడుల కారణంగా శాంతిభద్రతలు అదుపులో లేకపోవడంతో ఇన్నాళ్లూ పెద్ద కార్పొరేట్ కంపెనీలేవీ కశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి సాహసించలేదు. స్థానిక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో లబ్ధి చేకూరడానికి అనుగుణంగానే వ్యూహాలు రచించాయి. అధికారం ఎక్కువగా స్థానిక ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోవడంతో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. మరొకవైపు ఉగ్రదాడులకు స్థావరంగా మారడంతో ప్రబుత్వానికి ఆర్టికల్ 370 రద్దు అనివార్యమైంది. ఎప్పుడైనా స్వతంత్రప్రతిపత్తి రద్దు.. ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా కశ్మీర్‌కు ఇచ్చిన స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేయడానికి అధికారాలున్నాయి. ఫలానా తేదీ నుంచి 370 రద్దు లేదంటే మార్పులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఈ నిబంధనతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పక్కాగా వ్యూహాలు రచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం 370ని రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ 370లో నిబంధన 3ని చాలా తెలివిగా వినియోగించుకున్న మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ నుంచి తప్పించుకుంది. ఆర్టికల్ 370 రద్దు ఇలా.. భారత రాజ్యసభలో ఆగస్ట్ 5, 2019న ఉదయం 11 గంటకు, లోక్‌సభలో 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆర్టికల్ 370 రద్దును ప్రకటించారు. నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనుమతిని తెలుపుతూ గెజిట్ విడుదల చేయడంతో అధికారికంగా 370 అధికరణం రద్దు జరిగింది. 360 రద్దుతో 35ఏ ఆర్టికల్ కూడా రద్దవుతుంది. ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఢిల్లీ తరహా పాలన అమలులోకి వచ్చింది. -
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టులో తీర్పు
-
చొరబాట్లు ఆగాలంటే మోదీకే ఓటేయండి
ఝంఝార్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి అధికారం ఇవ్వకుంటే బిహార్‌లోని సరిహద్దులకు సమీపంలోని ప్రాంతాలు అక్రమ చొరబాటుదార్లతో నిండిపోతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. బిహార్‌లో ఝంఝార్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బిహార్‌లోని ఈ ప్రాంతం నేపాల్, బంగ్లాదేశ్‌ల సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుతోపాటు వచ్చే ఏడాది జనవరికల్లా అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేయనున్న ప్రధాని మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు. లాలూ– నితీశ్ ద్వయం మళ్లీ అధికారంలోకి వచ్చినా, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టలేకపోయినా ఈ ప్రాంతం మొత్తం అక్రమ చొరబాటుదార్లతో కిక్కిరిసి పోవడం ఖాయమన్నారు. ఫలితంగా బిహార్‌ను అనేక సమస్యలు చుట్టుముడతాయని ఆయన హెచ్చరించారు. చొరబాటుదార్లతో ఈ ప్రాంతం నిండిపోవాలని మీరు అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే 2024 లోనూ బిహార్‌లోని మొత్తం 40 సీట్లను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యూపీఏ బదులు..ఇండియా ఎందుకంటే.. యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణంతో సంబంధాలున్నాయి కాబట్టే అప్పటి పార్టీలన్నీ కలిసి ఈసారి ఇండియా అనే కొత్త పేరు పెట్టుకున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ కూటమి నేతలు సనాతన ధర్మాన్ని చులకన చేసి మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని పీఠంపై ఆశలు పెట్టుకున్న నితీశ్ కుమార్ గతంలో లాలూ ప్రసాద్ పాల్పడిన కుంభకోణాలను చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపించారు. అయితే, ప్రధాని పదవి ఖాళీగా లేదన్న విషయం నితీశ్ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. లాలూతో నితీశ్ పొత్తు నీళ్లు, చమురు కలయిక చందంగా ఉంటుందన్నారు. నీళ్లతో చమురు కలియకపోగా నీళ్లన్నిటినీ కలుషితం చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాని కావడమెలాగని నితీశ్ ఆలోచిస్తుండగా లాలూ మాత్రం తన కొడుకు, డిప్యూటీ సీఎం తేజస్వీని సీఎంగా చూడాలని ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కలిసి ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు తగ్గించడం వంటి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నా రని ఆరోపించారు. రాష్ట్రంలోని సంకీర్ణ కూటమిలోని కాంగ్రెస్ కూడా ఇదే వైఖరితో ఉందన్నారు. కృష్ణాష్టమి, రక్షాబంధన్ సందర్భంగా సెలవులను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన బిహార్ ప్రజలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు సమ్మె చేయడంతో ఏడాదిలో అవసరమైనన్ని రోజులు తరగతులు నిర్వహించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త క్యాలెండర్‌ను విద్యాశాఖ ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంలో విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేయడంపై, జమ్మూ కశ్మీర్ పునవ్యవస్థీకరణ చట్టంపైనా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నమోదైన అనేక పిటిషన్లపైనా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చేపట్టిన విచారణ ముగియగా తీర్పును రిజర్వ్‌లో ఉంచింది సుప్రీం కోర్టు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం అనేది అత్యంత సున్నితమైన, సమస్యాత్మక అంశమని చెబుతూ విచారణ నిమిత్తం ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను 16 రోజులపాటు ఏకథాటిగా విచారించింది. డీవై చంద్రచూడ్ తోపాటు సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ఈ ధర్మాసనం సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే సహా మరికొంతమంది పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ఆలకించింది. పిటిషనర్ల తరపున ఎవరైనా న్యాయవాదులు తమ వాదనలను ధర్మాసనానికి వినిపించాలనుకుంటే వారు లిఖితపూర్వకంగా రాబోయే మూడు రోజుల్లో అర్జీ పెట్టుకోవచ్చని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి.గిరి తదితరులు తమ వాదనలను అత్యున్నత న్యాయస్థానానికి వినిపించారు. 16 రోజుల విచారణలో 2019, ఆగస్టు 5న కేంద్రం తీసుకున్ననిర్ణయం యొక్క రాజ్యాంగ చెల్లుబాటు, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లుబాటు, జూన్ 20, 2018న విధించిన గవర్నర్ పరిపాలన సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 2020లో కూడా సుమారు 23 పిటీషన్లు పిటీషన్లు కూడా దాఖలయ్యాయి కానీ అవి లిస్టింగ్ కానీ కారణంగా వాటిపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు పెద్దగా ఆసక్తి చూపలేదు. మిగతా అన్ని అంశాలపై పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. #BREAKING | Article 370 Abrogation arguments conclude: Supreme Court reserves order. #SC #Article370 #Article370hearing WATCH #LIVE here- https://t.co/6CjsNJaatY pic.twitter.com/RzoDCEjru0 — Republic (@republic) September 5, 2023 ఇది కూడా చదవండి : G20 Summit - జీ20 అతిధులకు బుక్లెట్లు -
ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజ్యంగంలోని ఆర్టికల్ 35ఏ జమ్మూకశ్మీర్‌లో నివసించని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవీ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 35ఎ జమ్మూ కాశ్మీర్లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను లేకుండా చేసిందని అన్నారు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటే భారత రాజ్యాంగం గొప్పది రాష్ట్ర ప్రభుత్వంలో సమాన అవకాశాలు, ఉద్యోగాలు, భూమిని కొనుగోలు చేసేటటువంటి హక్కులను ఈ ఆర్టికల్ పౌరుల నుంచి దూరం చేసిందని తెలిపారు. వీటిపై జమ్మూకశ్మీర్ నివాసితులకు ప్రత్యేక హక్కులు ఉండటం వల్ల.. ఇతరులు(రాష్ట్రేతరులు) ఈ హక్కులను కోల్పోయారని అన్నారు. భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటే ఉన్నతమైనదన్నకేంద్ర వాదనను సీజేఐ ఏకీభవించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్టికల్ 370తోపాటు 35ఏ ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2019లో రద్దు చేసింది. ఈ రెండు అధికరణలు జమ్మూకశ్మీర్ ప్రజలకు విశేష అధికారాలు కల్పించాయి. వారిని శాశ్వత నివాసులుగా నిర్వచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ఆస్తి కొనుగోలు, సెటిల్మెంట్ పరంగా ప్రత్యేక హక్కులు అందించాయి. చదవండి: లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ మూడు హక్కులను లాగేసుకుంది అదే సమయంలో 35ఏ ఆర్టికల్ రాష్ట్రేతరుల ప్రాథమిక హక్కులను కాలరాసిందని చంద్రచూడ్ అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించే ఆర్టికల్ 16(1), దేశంలో ఎక్కడైనా నివసించే, స్థిరపడే హక్కును కల్పించే ఆర్టికల్ 19(1)(e), ఆస్తి కొనుగోలు, వృత్తి వ్యాపారం చేయగల స్వేచ్చ 9(1)(f) వంటి మూడు ప్రాథమిక హక్కులను 35ఏ అధికరణ హరించిందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి.. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. జమ్మూకశ్మీర్‌లోని శాశ్వత నివాసితులు, ఇతర నివాసితుల మధ్య మాత్రమే కాకుండా దేశంలోని ఇతర పౌరుల మధ్య కూడా వ్యత్యాసాన్ని సృష్టించిందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా దేశం మొత్తాన్ని ఏకరీతిన ఉంచిందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఉంచిందన్నారు. రాష్ట్రంలో గతంలో అమలు చేయని సంక్షేమ పథకాలన్నింటినీ ఇది అమలు చేస్తుందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా విద్యాహక్కును పేర్కొన్నారు. ఆర్టికల్ 370ను తొలగించే వారకు భారత రాజ్యంగంలో చేసిన ఏ సవరణ కూడా జమ్మూకశ్మీర్‌కు వర్తించేది కాదని, దీని ప్రకారం 2019 వరకు అక్కడ విద్యా హక్కు ఎప్పుడూ అమలు కాలేదని వివరించారు. -
ఆ లెక్చరర్ని ఎందుకు సస్పెండ్ చేశారు.. సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన లెక్చరర్ జరూర్ అహ్మద్ భట్‌ను ఆయన పనిచేసే కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ అంశాన్ని వెంటనే పరిశీలించాల్సిందిగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను కోరింది సుప్రీంకోర్టు. గత బుధవారం ఢిల్లీ వచ్చిన జరూర్ అహ్మద్ భట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురి సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్లిన ఆయనకు వారు పనిచేసే కాలేజీ యాజమాన్యం సస్పెన్షన్ ఆర్డర్లు జారే చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్. వెంటనే స్పందిస్తూ సుప్రీం ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ఇక్కడ కోర్టు ముందు హాజరైన ఉద్యోగిని విధుల నుంచి తొలగించారని చెబుతున్నారు.. ఈ అంశాన్ని ఒకసారి పరిశిలించండి.. వీలయితే లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడండని సూచించింది. ఇది ప్రతీకార చర్య కాదు కదా..? అని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించగా జస్టిస్ ఎస్కె కౌల్ దానిపై ఎలాంటి స్పష్టత లేదని న్యాయస్థానికి తెలిపారు. భట్ జమ్మూ కశ్మీర్ ఉద్యోగుల క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించారని, జమ్మూ కశ్మీర్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని, సెలవు నిబంధనలను అతిక్రమించినందుకు ఆయనపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది జమ్మూ కశ్మీర్ విద్యా శాఖ. ఈ సస్పెన్షన్ సమయంలో భట్ జమ్ము పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు జవాబుదారీగా ఉంటారని తెలిపారు. గురువారం సుప్రీం ధర్మాసనం ముందు హాజరై తన వాదనలను వినిపించిన భట్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న తనకు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని విద్యార్థులు అడిగితే సమాధానం చెప్పడం కష్టాంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయి రెండు కేంద్ర పాలిట ప్రాంతాలుగా విభజించబడిందని ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టులో వాదించారు. ఇది కూడా చదవండి: ‘ఆస్తులు పోగొట్టుకున్నా.. లోకేష్ నుంచి ప్రాణహాని ఉంది’ -
టెక్–ఫ్రెండ్లీగా కింది కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతకు మరింతగా వినియోగించుకుంటూ కింది స్థాయి న్యాయస్థానాలను ‘టెక్–ఫ్రెండ్లీ’గా తయారుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. గురువారం ఆరి్టకల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కింది కోర్టులు సాంకేతిక పుంజుకోవాల్సిన అవసరం ఉందంటూ చేసిన వాఖ్యపై సీజేఐ స్పందించారు. కోవిడ్ కష్టకాలంలో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతిరోజూ నడపాల్సి వచి్చందని గుర్తుచేశారు. ఈ–కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు కేంద్రం కేటాయించిన భారీ బడ్జెట్ కారణంగా న్యాయవ్యవస్థ ముఖ్యంగా కింది కోర్టుల్లో సాంకేతిక పుంజుకొంటుందని సీజేఐ ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయస్థానాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఇతోధిక నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అత్యంత ముఖ్యమైనదని గుర్తుచేశారు. -
గృహ నిర్బంధంలో మెహబూబా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆందోళనలు జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలను అదుపులోకి తీసుకుంది. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని గృహ నిర్బంధంలో ఉంచింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితులున్నాయంటూ సుప్రీంకోర్టుకు చెబుతున్న కేంద్రం.. ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మెహబూబా ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరుతూ భారీ హోర్డింగులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..మరో వైపు ప్రజల నిజమైన ఆకాంక్షలను అణగదొక్కుతోందన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సమయంలో ఇలాంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. తాము శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వలేదని పీడీపీ తెలిపింది. రాజ్భాగ్లో కొందరు పీడీపీ కార్యకర్తలు ‘ఆగస్ట్ 5 బ్లాక్ డే’అనే ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. కాగా, శ్రీనగర్‌లోని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫీస్‌లను పోలీసులు మూసివేశారు. -
ఉమ్మడి పౌరస్మృతి ఆలోచనే వద్దు: ఆజాద్
శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు రూపకల్పన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ.. కశ్మీరీ సీనియర్ నేత.. డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ చైర్మన్ గులాంనబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఆలోచనే చేయొద్దంటూ కేంద్రంలోని బీజేపీకి సూచించారాయన. యూసీసీ అనేది చాలా సంక్లిష్టమైన అంశం. ఆర్టికల్ 370(జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించి..) రద్దు చేసినంతలా సులువు కాదు. ఎందుకంటే.. ఇది కేవలం ముస్లింలతో ముడిపడిన అంశం కాదు. క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, గిరిజనులు.. ఇలా అందరితో ముడిపడి ఉంది. అన్ని మతాలకు, వర్గాలకు ఆగ్రహం తెప్పించే అంశం ఇది. ఏ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. అలాగే కేంద్రంలోని బీజేపీకి కూడా. కాబట్టి.. అసలు ఉమ్మడి పౌర స్మృతి ముందడుగు వద్దని.. అసలు ఆ ఆలోచనే వద్దని కేంద్రానికి సూచించారాయన. ఆపై దేశంలో తాజా రాజకీయ పరిణామాలపైనా ఆయన స్పందిస్తూ.. ముఖ్యంగా ఎన్సీపీ సంక్షోభం తనను బాధించిందని చెప్పారు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో యాభై ఏళ్ల కాంగ్రెస్‌తో అనుబంధాన్ని తెంచుకుని.. సొంత పార్టీ ద్వారా కశ్మీర్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు ఆజాద్. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా! -
‘370’ అనంతర మార్పుల్ని కశ్మీర్ ఆమోదించింది: అమిత్ షా
శ్రీనగర్: 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతర మార్పులను జమ్మూకశ్మీర్ ప్రజలు ఆమోదించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాద చర్యలు, రాళ్లు రువ్వడం వంటి ఘటనలు 70% తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు కొత్త జమ్మూకశ్మీర్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. మంత్రి శుక్రవారం శ్రీనగర్‌లో జరిగిన ‘వితస్త కల్చరల్ ఫెస్టివల్’కు హాజరయ్యారు. గత 30–40 ఏళ్ల జమ్మూకశ్మీర్ చరిత్ర మాత్రమే తెలిసిన వారు ఇది ఒక సమస్య అని, దీనిని వివాదాస్పద ప్రాంతంగానే భావిస్తారన్నారు. అదే జమ్మూకశ్మీర్ ఇప్పుడు వితస్త ఉత్సవాలు జరుపుకుంటోందని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంతో బలైన 42 వేల మంది ప్రజల బాధ్యతను ఎవరు తీసుకుంటారని అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్(పీడీపీ)లను ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370తో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ సిద్ధాంతకర్త శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఆయన నివాళులర్పించారు. -
విదేశీ మారక నిల్వల కంటే వేగంగా... పాక్ విశ్వసనీయత పతనం
బెనౌలిమ్ (గోవా): అంతర్జాతీయ వేదికలపై వక్రబుద్ధి ప్రదర్శించే పాకిస్తాన్ తీరుపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ విశ్వసనీయత దాని విదేశీ మారక ద్రవ్య నిల్వల కంటే కూడా శరవేగంగా క్షీణిస్తోందంటూ దుయ్యబట్టారు. శుక్రవారం గోవాలో ముగిసిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల భేటీ ఇందుకు వేదికగా మారింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భేటీలో లేవనెత్తారు. దానిపై పునరాలోచన చేసేదాకా భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు పాక్ సిద్ధంగా లేదన్నారు. దాంతో భేటీ అనంతరం జై శంకర్ మీడియాతో మాట్లాడుతూ బిలావల్ వ్యాఖ్యలను తూర్పారబట్టారు. ‘‘ఆర్టికల్ 370 ముగిసిన చరిత్ర. ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొని వాస్తవాలు గమనించండి’’ అంటూ చురకలు వేశారు. బిలావల్ ‘ఉగ్రవాదానికి ప్రోత్సాహకుడు, సమర్థకుడు, అధికార ప్రతినిధి’గా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు! తామూ ఉగ్రవాద బాధితులమేనన్న బిలావల్ వ్యాఖ్యలపైనా జై శంకర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, పాక్ చేతులు కలుపుతాయా అని ప్రశ్నించగా, ఉగ్రవాద బాధితులు ఎప్పుడూ ఉగ్రవాదానికి పాల్పడిన వారితో కలిసి ఉగ్రవాదంపై చర్చించడానికి కూర్చోరని బదులిచ్చారు. చేశారు. జీ 20 సన్నాహక సమావేశాలను జమ్మూ కశ్మీర్లో జరపడంపై బిలావల్ లేవనెత్తిన అభ్యంతరాలనూ కొట్టిపారేశారు. ‘‘అసలు జీ 20 భేటీలతో మీకేం సంబంధం? దానికంటే, జమ్మూ కశ్మీర్లో మీరు ఆక్రమించుకున్న భూభాగాలను ఎప్పుడు ఖాళీ చేస్తారన్న దానిపై మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ వాతలు పెట్టారు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ‘‘మేమేదో పాక్‌పై దౌత్యపరంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నించడం లేదు. ఆ దేశం అసలు రంగును రాజకీయంగా, దౌత్యపరంగా ఎప్పటికప్పుడు ప్రపంచం ముందుంచుతున్నాం’’ అని వివరించారు. ఉగ్రమూలాల్ని పెకిలించాలి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమూలంగా నాశనం చేయాలని ఎస్సీఓ భేటీలో జై శంకర్ పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాదం ఇప్పటికీ కొనసాగుతోంది. దానినెవరూ సమర్థించరాదు. ప్రభుత్వాల సాయంతో తెరవెనుక సాగే సీమాంతర ఉగ్రవాదం సహా ఏరూపంలో ఉన్నా అరికట్టాలి’’ అని పాక్‌నుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రమూకల ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయాలన్నారు. ఇది ఎస్సీవో లక్ష్యాల్లో ఒకటని గుర్తు చేశారు. సభ్య దేశాల శాంతి, సుస్థిరతలకు భారత్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్నారు. ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావించరాదనే ఎస్సీవో నిబంధనలను ఉల్లంఘించకుండానే పాక్‌కు మంత్రి తలంటారు. బిలావల్ మాట్లాడుతూ దౌత్యపరమైన అంశాల్లో ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకోరాదన్నారు. ‘‘ఈ సమస్యను రాజకీయాల నుంచి వేరు చేసి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. నేనూ ఉగ్రవాద బాధితుడినే. నా తల్లి బేనజీర్ భుట్టో ఉగ్రవాదానికి బలయ్యారు’’ అన్నారు. నమస్కారంతోనే భుట్టోకు పలకరింపు భారత్ సారథ్యంలో ఎస్సీవో సదస్సుకు హాజరైన పాక్ మంత్రి భుట్టో తదితర సభ్య దేశాల విదేశాంగ మంత్రులకు ఎస్.జై శంకర్ తాజ్ ఎగ్జోటికా రిసార్టులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నమస్తేతో స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం హోటల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్లో మాత్రం భుట్టో సహా అతిథులందరితోనూ మంత్రి జై శంకర్ కరచాలనం చేశారు. కార్యక్రమంలో రష్యా, చైనా విదేశాంగ మంత్రులు వరుసగా బిలావల్ భుట్టో, సెర్గీ లావ్రోవ్, క్విన్ గాంగ్‌తోపాటు ఖజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మంత్రులు పాల్గొన్నారు. -
అప్పటివరకు భారత్‌తో మాటల్లేవ్.. పాక్ విదేశాంగ మంత్రి తలపొగరు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇరు దేశాల సంబంధాలపై బింకాలకు పోయారు. ఆర్టికల్ 370 రద్దును సమీక్షిస్తేనే భారత్‌తో సంబంధాలు, చర్చల విషయంపై ఆలోచిస్తామని అన్నారు. అప్పటివరకు భారత్‌తో ఎలాంటి సంప్రదింపులు ఉండవన్నారు. ఓ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యా ఖ్యలు చేశారు. గోవాలో మే 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సుకు భుట్టో హాజరయ్యారు. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఎలాంటి మాటామంతీలో పాల్గొనలేదు. దీంతో భారత్‌తో ఎప్పుడు సమావేశంలో పాల్గొంటారని ప్రశ్నించగా.. ఆర్టికల్ 370 రద్దును సమీక్షించినప్పుడే అని బదులిచ్చారు. కాగా.. 2011 తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్పుడు పాక్ విదేశాంగ మంత్రిగా ఉన్న హీనా రబ్బానీ ఖార్ అప్పటి భారత విదేశాంగమంత్రితో సమావేశమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఏ సమావేశంలోనూ పాల్గొనలేదు. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపైనా భారత అంతర్గత విషయమైన కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి అబాసుపాలైంది. చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం -
అప్పటిదాకా పోటీచేయను
శ్రీనగర్: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ తొలగించిన ఆర్టికల్ 370ను పునరుద్ధరించేదాకా తాను శాసనసభ సమరంలో అడుగుపెట్టబోనని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం అయిన మెహబూబా బుధవారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ రద్దయిన ఆర్టికల్‌ను పునరుద్ధరించే వరకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగను. ఇది సరైన నిర్ణయం కాదని నాకూ తెలుసు. కానీ ఇది భావోద్వేగంతో తీసుకున్న కఠిన నిర్ణయం. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే తమ రహస్య ఎజెండా కార్యరూపం దాల్చదనే భయంతోనే బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్టికల్‌ను తొలగించింది. ‘ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని కేంద్రం చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయితీ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి అసలైన గీటురాయి అన్నపుడు ప్రధాని, హోం మంత్రి వంటి వేరే పదవులు ఎందుకు ? వాళ్లు ఏం చేస్తున్నట్లు ?. కశ్మీర్ ప్రజలను బలహీనపరచి తమ ముందు సాగిలపడేలా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది’ అని ఆరోపించారు. -
అసాధ్యాలను సుసాధ్యం చేసిన మోదీ: అమిత్ షా
సిమ్లా: ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం సహా గతంలో అందరూ అసాధ్యమని భావించిన వాటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపిందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దవుతుందని మీలో ఎవరైనా ఊహించారా? అంటూ హాజరైన వారినుద్దేశించి ఆయన ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ తీసుకువచ్చిన ఆర్టికల్ 370ను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు మిన్నకుండి పోతారని ఎద్దేవా చేశారు. అయోధ్యలో మందిర నిర్మాణం అసాధ్యమని కాంగ్రెస్ పెదవి విరిస్తే తాము బృహత్ రామాలయం పనులను ప్రారంభించామని చెప్పారు. ‘వంశ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌కు కర్తవ్యపథ్గా పేరు పెట్టి, సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు’అని అమిత్ షా అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్.. మోదీ నాయకత్వంలో ఐదో స్థానానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. -
Gaurav Yatra: నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య
జంజార్కా/ఉనాయ్(గుజరాత్): కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆయన గురువారం అహ్మదాబాద్ జిల్లా జంజర్కా, ఉనాయ్లలో బీజేపీ ‘గౌరవ్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా పైవ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ను రాజ్యాంగంలో చేర్చుతూ నెహ్రూ చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కాలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370ను తొలగించాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో 370ను రద్దు చేసి, కశ్మీర్‌ను దేశంతో విలీనం చేశారు’అని అమిత్ షా చెప్పారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కానీ, మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది’అని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. గతంలో యూపీఏ హయాంలో పాక్ ఆర్మీ మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మన ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని చూసింది. కానీ, ఇది మౌని బాబా (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది’అని అమిత్ షా అన్నారు. ‘గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 200 రోజులు కర్ఫ్యూయే అమలయ్యేది. కానీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు’అని చెప్పారు. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేవని విమర్శించారు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రే వర్గానికి భారీ ఊరట -
రక్తపాతం జరుగుతుందన్నారు.. ఇప్పుడేమైంది.. అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరిలో భారీ ర్యాలీకి హాజరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన ప్రసంగించే సమయంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు 'మోదీ-మోదీ' నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. దీంతో కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తే రక్తపాతం జరగుతుందని భయపెట్టిన వారికి ఈ నినాదాలే సమాధానం అని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వంలో కశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కశ్మీర్‌ను 70 ఏళ్ల పాటు మూడు కుటుంబాలే పాలించాయని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని విమర్శించారు. బీజేపీ అధికారంలో వచ్చాక కశ్మీర్లో విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచామని, మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని, 100కుపైగా పాఠశాలలు కొత్తగా వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని, హైవేల కోసం రూ.లక్ష కోట్లు మంజూరు చేశామని షా తెలిపారు. 2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాతే ఇవన్నీ జరిగాయని చెప్పారు. #WATCH | Today's rally and your 'Modi-Modi' chants are answers to those who said if 370A will be abrogated, there will be a blood bath: Union Home Minister Amit Shah, in Jammu and Kashmir's Rajouri pic.twitter.com/1WJlHnK2nl — ANI (@ANI) October 4, 2022 అమిత్ షా కశ్మీర్ పర్యటనలో పలు కీలక ప్రకటనలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పహరీ వర్గాన్ని ఎస్టీల జాబితాలో చేర్చే విషయంపై అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. మూడు రోజుల పర్యటనలో దీనిపై స్పష్టత రానుంది. చదవండి: చీతాలకు లంపీ డిసీజ్‌కు ముడిపెట్టిన నానా పటోలే.. ఏకిపారేసిన బీజేపీ -
బాబాసాహెబ్ కలల సాకారంలో...
అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. మోదీ బలమైన సంకల్పం ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలన్నింటి లోనూ అంబేడ్కర్ ప్రభావం సుస్పష్టం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలనా శైలిలో సర్వత్రా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభిప్రాయం. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మన సమాజ భాగ స్వాములైన బడుగు, బలహీన వర్గాల వారి ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంత యినా ఉంది. స్వాతంత్య్రం తర్వాత దేశ ప్రగతికి వివిధ ప్రభుత్వాలు తమ వంతు కృషి చేసినప్పటీకీ అంబేడ్కర్ కన్న కలల్లో ఏళ్ల తరబడి నెరవేరని ఎన్నో స్వప్నాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి పుట్టినరోజు. ఆయనతో నాది చాలా సుదీర్ఘ, చిరస్మరణీయ అనుబంధం. సంస్థలో ఒకరిగా, ముఖ్యమంత్రిగా, ఇవాళ ప్రధానమంత్రిగా ఆయన పనిచేయడం నేను చూస్తూ వచ్చాను. దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతలో ఆయన ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ మేరకు బాబాసాహెబ్‌కు నిజమైన శిష్యుడిగా భారతదేశాన్ని సమసమాజంగా రూపుదిద్దడానికి మోదీ ముమ్మర కృషి చేస్తున్నారు. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలు తదితరాలన్నింటిలోనూ అంబే డ్కర్ ప్రభావం సుస్పష్టం. ఒక సంస్థలో సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, నేడు ప్రధానమంత్రిగానూ మోదీ సదా బాబాసాహెబ్ బాటలోనే నడుస్తున్నారు. తదనుగుణంగా దేశానికేగాక ప్రపంచం మొత్తానికీ చిరకాలం గుర్తుండిపోయే బహుమతిని ‘పంచతీర్థం’ రూపంలో మోదీ అందించారు. బాబాసాహెబ్ జయంతిని ‘సమతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించడమేగాక నవంబర్ 26ను భారత ‘రాజ్యాంగ దినోత్సవం’గానూ మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ చూపిన ఈ చొరవతో ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ 125వ జయంతి వేడుకను నిర్వహించింది. అంబేడ్కర్ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ నెరవేరని– ఆర్టికల్ 370 రద్దు, స్వయం సమృద్ధ భారతం స్వప్నాలను మోదీ ప్రభుత్వం పటిష్ఠ చర్యలతో సాకారం చేయగలిగింది. కాగా, ఆనాడు అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. దీంతో భారతదేశంలో జమ్ము–కశ్మీర్ విలీనానికి అడ్డుకట్ట పడింది. అయితే, మోదీ బలమైన సంకల్పం, దీక్ష ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. అదేవిధంగా శక్తిమంతమైన స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణం దిశగా ప్రధానమంత్రి మోదీ ఉద్యమ సంక ల్పంతో శ్రమిస్తున్నారు. ‘స్వయం సమృద్ధం’ కావడం ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదని అంబేడ్కర్ గట్టిగా విశ్వసించారు. కానీ, భారతదేశాన్ని స్వావలంబన మార్గంలో నడి పించడంలో మునుపటి ప్రభుత్వాలకు సంకల్పం, చిత్తశుద్ధి లోపిం చాయి. కానీ, మోదీ ఈ పరిస్థితిని చక్కదిద్ది, భారత ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడం ద్వారా ప్రపంచానికి మన శక్తిని చాటారు. కాబట్టే మన బలమేమిటో ప్రపంచం ఇవాళ గుర్తించింది. రాష్ట్రపతి హోదాలో నేను పలు సామాజిక సమస్యలు, పాలనా వ్యవహారాలపై ప్రధానితో సంభాషించినప్పుడల్లా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతి గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ జాడ్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పేదలేనని చెప్పేవారు. ఈ నేపథ్యంలో గడచిన ఎనిమిదేళ్లుగా మోదీ అవినీతిపై అలుపెరుగని నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నిరుపేద లందరికీ అందేలా ఆయన చేసిన కృషిని మనమంతా ప్రత్యక్షంగా చూశాం. పర్యవసానంగా ఇవాళ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ సాఫీగా సాగిపోతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలన్నీ నిరుపేదలపై కరుణను ప్రతిబింబించేవి కావడం గమనార్హం. మన ప్రజాస్వామ్య వ్యవస్థను అనువంశిక రాజకీయాలు నియంత్రించడం మోదీకి తీవ్ర ఆందోళన కలిగించిన మరో అంశం. ఈ అనువంశిక రాజకీయాలు చిత్తశుద్ధితో, శ్రమించి పనిచేసే రాజ కీయ కార్యకర్తల హక్కులను ఏ విధంగా లాగివేసుకుంటాయనే అంశంపై ఆయన సదా గళం విప్పుతూనే వచ్చారు. మోదీ ఎల్లప్పుడూ అర్హత ప్రాతిపదికగానే నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అనువంశిక రాజకీయాలపై మోదీ చేసిన యుద్ధం ఇప్పటికే తన ప్రభావం చూపుతోంది. ఈ మేరకు మన ప్రజాస్వా మ్యాన్ని పటిష్ఠం, మరింత శక్తిమంతం చేసేది ప్రతిభ ఆధారిత రాజకీయాలే తప్ప అనువంశిక రాజకీయాలు కావన్నది స్పష్టమైంది. మోదీ పాలన శైలికి మరో నిలువెత్తు నిదర్శనం ‘పద్మ’ పురస్కరాలు. ఒకనాడు సంపన్న, పలుకుబడిగల వర్గాలకు ‘విశేష పరి గణన’ ఇచ్చేవిగా భావించబడిన ఈ పురస్కారం నేడు ‘సామా న్యుడి’తో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకుంది. ఈ మేరకు ఇవాళ ‘జన సామాన్యం’తో మమేకమైన వారికి అంకితం చేయబడ్డాయి. అత్యంత వెనుకబడిన రంగాలలో అభివృద్ధి, తదనుగుణంగా అట్టడుగు వర్గాల జీవితాల్లో కొత్త అధ్యాయం లిఖించే విధంగా ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక చర్యల గురించి ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలిచాను. ఇందులో ఒకటి ‘ఆకాంక్షాత్మక జిల్లాల కార్య క్రమం’ కాగా, రెండోది ‘ఆదర్శ గ్రామాల పథకం’. మోదీ విశిష్ట ఆలోచన శైలికి ఇదే నిదర్శనం. వేలెత్తి చూపలేని పటిష్ట ప్రణాళికలు, లోపరహితంగా వాటిని అమలు చేయడం వల్ల నిరుపేదల జీవితాల్లో సుస్పష్టమైన మార్పులు వచ్చాయి. అనేక సాంఘిక సంక్షేమ పథకాలే ఇందుకు తిరుగులేని ఉదాహరణలు. వీటిలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఉచిత రేషన్ పథకమైన ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అత్యంత విశిష్టమైనది. భారతీయులు కరోనా మహ మ్మారిపై సాహసోపేత పోరాటం సలుపుతున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందారు. మహమ్మారి వైరస్‌పై భారత్ పోరాటాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ముందుండి నడిపారో నేను ప్రత్యక్షంగా చూశాను. మన శాస్త్రవేత్తలు, వైద్యులు ఒకటికి రెండు ‘దేశీయ’ (మేడ్ ఇన్ ఇండియా) టీకాలను రూపొందించడంలో ఆయనిచ్చిన చేయూత, మద్దతు నిరుపమానం. దీంతో మనందరికీ భద్రత లభించడమేగాక అనేక ఇతర దేశాల ప్రజానీకం సంక్షేమానికీ మనమంతా తోడ్పడినట్ల యింది. మరోవైపు మహమ్మారి గరిష్ఠ స్థాయిలో విజృంభించే నాటికి 100 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేసే బృహత్తర కార్యాచర ణను కూడా ప్రధానమంత్రి చేపట్టారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత భారీ, వేగవంతమైన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతం చేశారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను కోవిడ్ ఊపిరాడకుండా చేసిన సమయంలో ప్రధాని మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమేగాక విస్తరించారు. సమయ స్ఫూర్తితో కూడిన విధానపరమైన కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి స్తంభించకుండా ఎంతో జాగ్రత్త వహించారు. మోదీ గత ఎనిమిదేళ్ల పాలన అత్యద్భుతం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలన శైలిలో సర్వత్రా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభి ప్రాయం. అంబేడ్కర్ అడుగుజాడల్లో మన ప్రధాని ‘దేశమే ప్రథమం’ అనే నినాదాన్ని తారకమంత్రంగా స్వీకరించారు. మరోవైపు సుపరి పాలన, సామాజిక సమన్వయం, క్రమశిక్షణలనే విశిష్ట లక్షణాలతో ఆయన ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది. (నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు) రామ్‌నాథ్ కోవింద్ (భారత మాజీ రాష్ట్రపతి) -
శతమానం భారతి: ప్రగతి పథంలో పరుగుతు తీస్తున్న జమ్మూకశ్మీర్
మూడేళ్ల క్రిందట ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. దశాబ్దాల అంతరాన్ని అంతం చేస్తూ ప్రగతిలో వెనుకబడి ఉన్న జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ లకు ఆర్టికల్ 370 నుంచి విముక్తి కల్పిం చింది. దీంతో ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ భావన మరింత బలం పుంజుకుంది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఇస్తున్న రాజ్యాంగం లోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం అంటే, స్వతంత్ర భారతదేశానికి పునరేకీకరణ శక్తిని ఇవ్వడమే. ఈ నేపథ్యంలో గడిచిన మూడేళ్లుగా జమ్ము కశ్మీర్ ప్రగతి పథంలో శరవేగంతో పరుగులు తీస్తోంది. అక్కడి ఉపాధి, సౌభాగ్యాలకు కొత్త ఉత్తేజం లభించింది. జమ్ము కశ్మీర్‌కు 7 కొత్త వైద్య కళాశాలలు, 5 కొత్త నర్సింగ్ కళాశాలు మంజూరు అయ్యాయి. వైద్య కోర్సులలో సీట్ల సంఖ్య 500 నుంచి దాదాపుగా రెట్టింపు అయింది. జల విద్యుత్ ప్రాజక్టులు ఉద్పాదన ప్రారంభించాయి. వాటి ద్వారా పరిశ్రమ లకు ప్రయోజనంతో పాటు ఆ ప్రాంతాల రాబడీ పెరుగుతోంది. వ్యవసాయ రంగ ప్రగతితో కూడా ఆదాయం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తోంది. జమ్ము, కశ్మీర్లో కొత్తగా అమలవుతున్న ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్టు’ పథకం సగటు ప్రజల జీవితాలను సులభతరం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఉజ్వల, డి.బి.టి., సౌభాగ్యం వంటి అనేక పథకాలు 100 శాతం అమలవుతున్నాయి. 2024 కల్లా ఆ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సురక్షిత తాగునీరు అందించాలని సంకల్పించిన ప్రభుత్వం.. రెండేళ్ల ముందుగానే ఈ ఆగస్టు 15 కల్లా పూర్తి లక్ష్యాన్ని నెరవేర్చనుంది! దేశంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద ప్రతి వ్యక్తీ లబ్ది పొందిన ఏకైక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం.. జమ్ము కశ్మీర్ మాత్రమే కావడం విశేషం. -
ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనా?
జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దుచేసి మూడు సంవత్సరాలు అయింది. మూడేళ్ల తర్వాత, ఇక గడియారాన్ని వెనక్కు తిప్పడం సాధ్యంకాని పని అని చాలామంది ప్రజలు భావిస్తున్న సమయంలో ఒక పుస్తకం... ఆర్టికల్ 370 రద్దు చట్టప్రకారం చెల్లనేరదని వాదిస్తోంది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 370 రద్దుకు గవర్నర్ తన ఆమోదం తెలిపారు. ఇలాంటి సందర్భంలో గవర్నర్ తన స్వతంత్ర హోదాలో కాకుండా రాష్ట్రపతి ప్రతినిధిగా వ్యవహరిస్తారు. అంటే ఇది రాష్ట్రపతి స్వయానా తన సొంత ఆమోదం కోరిన దానితో సమానం అవుతుందని పుస్తకం అంటోంది. ఇక రాజ్యాంగాన్ని అన్వయించుకోవడంలో సహాయం చేయడం కోసం ఉద్దేశించిన ఆర్టికల్ 367ను అనుచితంగా ఉపయోగించారనీ చెబుతోంది. వీటిని ఒకానొక పుస్తకపు అభిప్రాయాలుగా కొట్టేయడం అంత సులభం కాదు. ఎందుకంటే దీన్ని ప్రచురించిన విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్ అర్ఘ్యా సేన్‌గుప్తా రాజ్యాంగం మీద సాధికారత కలిగిన వ్యక్తిగా గౌరవం ఉన్నవారు. ఆగస్ట్ 5వ తేదీ శుక్రవారం నాటికి జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసి మూడేళ్ళు నిండాయి. ఈ సందర్భంగా ‘హమీ అస్త్: ఎ బయోగ్రఫీ ఆఫ్ ఆర్టికల్ 370’ అనే పుస్త కాన్ని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సంస్థ ప్రచురించింది(‘భూమ్మీద ఎక్కడైనా స్వర్గం ఉన్నదీ అంటే... అది ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది’ అని కశ్మీర్ సౌందర్యం గురించి అమీర్ ఖుస్రో పలికిన పంక్తుల్లోని ఇక్కడే ఉంది (హమీ అస్త్) అన్నది ఈ పుస్తకం టైటిల్). ఈ పుస్తకం తీవ్రమైన కలకలం సృష్టించగలదు. ఎందుకంటే ‘ఆర్టికల్ 370 రద్దు చట్టప్రకారం చెల్లనేరదు’ అని ఇది వాదించింది. ఈ పుస్తకాన్ని నలుగురు రచయితలు రాశారు – అర్ఘ్యా సేన్‌గుప్తా, జినాలీ డేనీ (రీసెర్చ్ ఫెలో), ప్రణయ్ మోదీ (ప్రాజెక్ట్ ఫెలో), కెవిన్ జేమ్స్ (మాజీ రీసెర్చ్ ఫెలో). సేన్‌గుప్తా... విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వ్యవ స్థాపకుడు, రీసెర్చ్ డైరెక్టర్ కూడా. (మిగిలిన ముగ్గురూ ‘విధి’ సెంటర్‌తో సంబంధం ఉన్నవారే.) ‘హమీ అస్త్’ రచయితలు మూడు కారణాల వల్ల ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం అని వాదిస్తున్నారు. ఈ కారణాలు సాంకేతికపర మైనవి. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దు వంటి చర్యకు ఎందుకు పాల్పడ్డారు, దాన్ని ఎలా అమలు పర్చారు అనే విషయాన్ని మనందరం తెలుసు కోవలసిన అవసరం ఉంది. సాధారణ వ్యక్తులు వీటిని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. అయితే సమస్య చాలా ముఖ్యమైంది కాబట్టి, ఈ వాదన లను సంగ్రహరూపంలో చెబుతాను. ‘హమీ అస్త్’లో చెప్పిన తొలి కారణం ప్రకారం, జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఆమోదం అనేది శాసన సభతో రాజ్యాంగ అసెంబ్లీని సమానం చేస్తోంది. అది ఎలా జరిగింది అన్నది ఇక్కడ ప్రధానం కాదు. నిజానికి అది కూడా ఒక సమస్యే అయినప్పటికీ ఆ సమయంలో గవర్నర్ నడవడిక ఎలా ఉండింది అనేది ఇక్కడ కీలకమైన విషయం. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 370 రద్దుకు గవర్నర్ తన ఆమోదం తెలిపారు. పుస్తకం ఏమంటున్నదంటే: ‘‘జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తన ఆమోదం తెలిపినప్పుడు, తన స్వతంత్ర హోదాలో కాకుండా నిజానికి రాష్ట్రపతి ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తారు... అంటే ఇది రాష్ట్రపతి స్వయానా తన సొంత ఆమోదం కోరిన దానితో సమానం అవుతుంది... అయితే అలాంటి స్వీయ ఆమోదం అనేది చట్ట అవసరాలను సంతృప్తి పరుస్తుందా అనేది ఇక్కడ ప్రశ్న. క్లుప్త సమాధానం ఏమిటంటే, లేదు అనే.’’ రెండో కారణం ఏమిటంటే, ఆర్టికల్ 367ను ఉపయోగించిన విధానమే. రాజ్యాంగాన్ని అన్వ యించుకోవడంలో సహాయం చేయడం ఈ ఆర్టికల్ ఉద్దేశం. రాజ్యాంగ అసెంబ్లీని శాసన సభలాగా వ్యాఖ్యానించడానికి ఈ ఆర్టికల్ 367ను ఉప యోగించారు. అయితే, అలా వాడుతున్నప్పుడు ‘‘రాజ్యాంగ నిబంధనల్లోనే గణనీయంగా మార్పులు తీసుకొచ్చారు’’. ‘హమీ అస్త్’ పుస్తకం ఇలా అంటుంది: వివరణాత్మక ఘర్షణ లేదా గందరగోళాన్ని పరిష్కరించడం కోసం ఆర్టికల్ 367ని ఉపయోగించలేదనేది చాలా స్పష్టం... ఇంతకుముందు రాజ్యాంగ సభకు లేని నిర్దిష్టమైన వాస్తవిక అధికారంతో శాసనసభను రద్దు చేయ డానికి ఈ ఆర్టికల్‌ని ఉపయోగించారు. చివ రగా, ఆర్టికల్ 367ను అనుచితంగానూ, శాసన విరుద్ధంగానూ ఉపయోగించారని ఈ పుస్తకం ముగిస్తుంది. ఇక ‘హమీ అస్త్’ చెప్పిన మూడో కార ణాన్ని పరిశీలిద్దాం. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను ప్రకటించే ఉద్దేశంతోనే ఆర్టికల్ 367ను ఉపయో గించారు. సందర్భం మరోలా అవస రమైతే తప్ప, రాష్ట్ర అసెంబ్లీ అధికారాలు పార్లమెంటు ద్వారా అమలవుతాయని ఇది ప్రకటించింది. అంటే ఇక్కడ సందర్భం అనేదే నిర్ణయాత్మక అంశం అన్నమాట. ఈ సందర్భం అనేది ఏమిటి? జమ్మూ కశ్మీర్, భారత కేంద్రప్రభుత్వం మధ్య చారిత్రక రాజీ కుదరడమే ఆ సందర్భమనీ, ఆర్టికల్ 370లో దీన్ని పొందుపర్చారనీ పుస్తకం చెబుతోంది. అంటే, భారతదేశంతో జమ్మూ కశ్మీర్ రాజ్యాంగబద్ధ సంబంధంలోని నియమ నిబంధనలు జమ్మూ కశ్మీర్ ప్రజల ప్రతినిధుల ద్వారా, అలాగే తక్కిన భారత ప్రజల ప్రతినిధులతో ఉమ్మడిగా నిర్ణయించబడతాయని దీనర్థం. ఈ రాజ్యాంగ పరమైన సంబంధానికి ఎలాంటి మార్పు చేయా లన్నా రెండు చేతులూ చప్పట్లు కొట్టాల్సి ఉండ టమే ఇక్కడ సందర్భం. కానీ ఆర్టికల్ 370 రద్దులో రెండో చేయి మిస్సయింది. అదీ విషయం. ఈ పుస్తకంలోని అంశం సులభమైందే కానీ, చాలా తీవ్రమైంది. రాష్ట్రపతి పాలన విధింపు పర్యవసానంగా శాసనసభ అధికారాలను పార్ల మెంట్ స్వాధీనపర్చుకుంది. అయితే ఆర్టికల్ 370 వెలుగులో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తరఫున పార్ల మెంట్ అధికారాలను అమలు చేయడాన్ని రాష్ట్రపతి పాలన విధింపులోని నిబంధనలు నిషేధిస్తున్నా యని ఈ పుస్తకం చెబుతోంది. ఇప్పుడు ‘హమీ అస్త్’ అనేది కేవలం విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీకి సంబంధించిన ఒక అభిప్రాయం మాత్రమే. కానీ ప్రత్యేకించి ఈ సెంటర్, అంతకంటే ముఖ్యంగా సేన్‌గుప్తా అభిప్రా యాలు చాలా విలువైనవి. రాజ్యాంగంపై సాధికా రిక అవగాహన కలిగి ఉన్నారన్న గౌరవం వీరికి ఉంది. కాబట్టి ఇక్కడ వెలువడిన వాదనలు చాలా విలువైనవి. పైగా వీటిని పుస్తక రూపంలో తేవడం అనేది మరింత ప్రాధాన్యం కలిగిన విషయంగా మారింది. తమ వాదనలను తాము నమ్మకపోతే పుస్తక రూపంలో ఇలా ప్రచురించరు కదా! అయితే సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ఇంకా విచారించలేదు. ఇంతవరకూ ఈ అంశాన్ని సర్వో న్నత న్యాయస్థానం వాయిదాలు వేస్తూ పోతోంది. గడియారాన్ని వెనక్కు తిప్పవచ్చు అనే విశ్వాసం కూడా దీనివెనుక ఉండవచ్చు మరి. కానీ, మూడేళ్ల తర్వాత ఇప్పుడు అది సాధ్యం పని అని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. ‘హమీ అస్త్’ మరో అడుగు ముందుకేసింది. ఆర్టికల్ 370 రద్దు అనేది జరిగిపోయిన వ్యవహారంగా మిగిలిపోతే, అది రాజకీయ అపహాస్యం కిందికి వస్తుందని ఈ పుస్తకం సూచిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్ సమస్య
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో శాంతిని పునఃస్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహాయులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాటు ప్రజలూ, మీడియాను కూడా ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి, మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. కాబట్టి, కశ్మీర్ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్త పడినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది. గ్రీకు పురాణాల్లో ‘హుబ్రిస్’ అని పిలుస్తారు దాన్ని. ఇంగ్లిష్ నిర్వచనం ప్రకారం అధిక గర్వం లేదా మితిమీరిన అహంకారం అనవచ్చు. గ్రీకుల పురాతన మత బోధనల్లో ‘హుబ్రిస్’కు గురైన వారు... నెమిసిస్ అనే దేవత చేతిలో హతమవుతారు. కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొం టున్నట్లు కనిపిస్తోంది! తిరిగి వెళ్తున్న పండిట్లు ఆర్టికల్ 370, 35ఏ రద్దు తరువాత కశ్మీర్ లోయలో శాంతిని పునః స్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహా యులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. తమను తాము కాపాడుకునేందుకు వెళుతున్న పండిట్లను నిలువరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనధికారిక అంచనాల ప్రకారం ఇప్పటికే కొన్ని వందల మంది పండిట్లు కశ్మీర్‌ను వదిలి జమ్మూ చేరుకున్నారు. అంతేకాదు... ఉద్యోగం కోసం తప్పనిసరి చేస్తూ తమతో రాయించు కున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద గత ఏడాది కాలంలో దాదాపు ఆరు వేల మంది పండిట్లకు ఉద్యోగాలు, నివాస సదుపాయం లభించాయి. ప్రభుత్వం వీరి కోసం వేర్వేరు జిల్లాల్లో తాత్కాలిక ఇళ్ల నిర్మాణమూ చేపట్టి పూర్తి చేసింది. పండిట్ల తిరుగు వలస నేపథ్యంలో అధికారులు ఇప్పుడు ఉద్యోగ ఒప్పందాలను చూపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే... ప్రచార పటాటోపానికి మాత్రమే పనికొచ్చే నిర్మాణాలు కొన్ని చూపి అంతా బాగానే ఉందనే భ్రమను కల్పిస్తోంది ప్రభుత్వం. కానీ ట్రాన్సిట్ క్యాంపుల వద్ద కనీస భద్రతా సౌకర్యాలు, సిబ్బంది కూడా లేకపోవడం మాత్రమే వాస్తవం. అణిచివేతే విధానం కశ్మీర్ విషయంలో ప్రభుత్వం అణచివేత ధోరణినే ప్రదర్శించింది. కశ్మీర్‌లోని మిలిటెంట్లూ, ఉగ్రవాదులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ, మీడియాను కూడా అనూహ్య రీతిలో తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. అటు ఉగ్ర వాదులు, ఇటు ప్రభుత్వం మధ్యలో బలవుతున్నది మాత్రం నిరా యుధులైన అమాయకులు. మరీ ముఖ్యంగా కశ్మీరీ పండిట్లు. వీరితో పాటు ప్రభుత్వ విధాన అమలుకు సహకరించారన్న అంచనాతో స్థానిక పోలీసు సిబ్బంది మీద కూడా ఉగ్రవాదుల దాడులు జరుగు తున్నాయి. పోలీసులను పరిస్థితులకు బందీలుగా కాకుండా ప్రభుత్వ ఉపకరణాలుగా ఉగ్రవాదులు చూస్తున్నారు. 2019 తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వివాదాస్పద విధానాన్ని అవలంబించిందంటే అతిశయోక్తి కాదు. ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు లభిస్తున్నాయన్న భ్రమలో దాన్ని రద్దు చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్రాన్ని కాస్తా కేంద్ర పాలిత ప్రాంత స్థాయికి తగ్గించారు. జమ్మూ కశ్మీర్‌కు ముఖ్య మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన రాజకీయ నేతలను నిర్బంధంలో ఉంచారు. పరిపాలన మొత్తం నేరుగా ఢిల్లీ నుంచే నడిచేది. వీటన్నింటికి తోడుగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు నిర్వ హించిన ‘ఆపరేష¯Œ ఆలౌట్’ను మనం మరచిపోకూడదు. ఉగ్రవాద అణచివేతలో విజయం సాధించామన్న ప్రభుత్వ ప్రచారార్భాటాన్నీ గుర్తుంచుకోవాలి. వాస్తవిక పరిస్థితులు వేరే... 2021 డిసెంబరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి, కశ్మీర్ పాలనా వ్యవస్థకు అనధికార నేత అయిన అమిత్ షా మాట్లా డుతూ – ఆర్టికల్ 370 తొలగింపు ద్వారా కశ్మీర్లో శాంతి స్థాపనకు మార్గం ఏర్పడిందనీ, అభివృద్ధి సుసాధ్యమైందనీ మరోసారి వ్యాఖ్యా నించారు. అలాగే ఈ ఏడాది మార్చిలోనూ కశ్మీర్లో హింస తగ్గి పోయిందని నిరూపించేందుకు బోలెడన్ని గణాంకాలు వల్లెవేశారు. గణాంకాలు కాగితంపై బాగానే కనిపిస్తాయి కానీ... వాస్తవ పరిస్థి తులు పరిశీలిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. తుదముట్టించిన మిలిటెంట్ల సంఖ్య, అరెస్ట్ అయినవారు, స్వాధీనం చేసుకున్న ఆయు ధాలు, పునరావాసం పొందిన పండిట్లు, కుదుర్చుకున్న ఒప్పందాల వంటివన్నీ అమిత్ షా మాటల్లో వినిపించాయి అయితే వీటన్నింటి మధ్య జన సామాన్యుల భావనలెలా ఉన్నాయన్నది మాత్రం ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. ఆరేళ్ల అణచివేత ధోరణుల ఫలితంగా ప్రజలు అప్పటికే విసుగెత్తి ఉన్నారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు నిరసన ప్రదర్శనలు నిర్వహించే అవకాశమూ లేకపోయిన నేపథ్యంలో వారు ప్రభుత్వ చర్యలకు మద్దతిస్తారని ఆశించలేము. ఉగ్రవాదం తీరు మారింది! ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సైనిక చర్యల కారణంగా గణనీయంగా తగ్గిపోయిన ఉగ్రవాద కార్యకలాపాలు కాస్తా మళ్లీ తీవ్రవాదం స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు అక్కడ యుద్ధం ఏకే 47, ఆర్‌పీజీలతో జరగడం లేదు కానీ... వ్యక్తులను ఎంచుకుని మరీ తుపాకులు, గ్రెనేడ్లతో దాడులు మొదలుపెట్టారు. లక్ష్యితులు నిరాయుధులు కావడం, ఆయుధాలను దుస్తుల్లో దాచుకుని వెళ్లగలగడం ఉగ్రవాదుల పనిని మరింత సులువు చేస్తోంది. అతి సాధారణ జీవితం గడుపుతూ అవసరమైనప్పుడు పండిట్ల వంటి నిరాయుధులను, లేదంటే విధి నిర్వహణలో లేని పోలీసు సిబ్బందిపై కాల్పులు జరపడం ఈ హైబ్రిడ్ మిలిటెన్సీ తీరుతెన్నులుగా మారాయి. పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయిందని సైన్యం స్వయంగా గత ఏడాది జూ¯Œ లో ప్రకటించింది కాబట్టి... ఈ తాజా దాడులు, హైబ్రిడ్ మిలిటెన్సీ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నలలోనే జరుగుతోందని మనం కచ్చితంగా అను కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే... మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఏర్పడ్డ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని మిలిటెంట్లు పని చేస్తున్నారని చెప్పాలి. తుపాకులకు చోటు లేదు! కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల అణచివేతలో నిఘా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ బలగాలు ఎంతో సమర్థతతో వ్యవహరించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. గడచిన రెండు దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకమార్లు ఏర్పడ్డాయి కూడా! అయితే ఒక మిలిటెంట్ హతమైతే... అతడి స్థానంలో ఇంకొకరు పుట్టుకొస్తున్నారు. అంటే... ఎంత మంది మిలిటెంట్లను చంపాం? ఎన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం? అన్నవి ముఖ్యం కాదన్నమాట. కశ్మీర్ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్తపడినప్పుడే సమస్యకు పరిష్కారం లభించినట్లు. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది. ఈ రెండు రాష్ట్రాల అనుభవాలేమిటన్నది బీజేపీ సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులకూ బాగా తెలుసు. కానీ ప్రస్తుతం వారు వాటిని విస్మరి స్తున్నారు. ఇదీ రాజకీయం ప్రత్యేకత. పాకిస్తాన్ కారణంగా కశ్మీర్ విషయంలో దౌత్యమూ అత్యవసరం. కానీ అవేవీ చేయకుండా మనం అణచివేత రాజకీయాలకు పాల్పడతూ, ఉడికీ ఉడకని జాతీయత అనే భావన ఆధారిత విధానాలను అవలంబిస్తున్నాం. వ్యాసకర్త: మనోజ్ జోషీ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జీవితంలో మూడేళ్లు వృథా
అహ్మదాబాద్: కాంగ్రెస్‌లో ఉండి తన జీవితంలో మూడేళ్లు వృథా చేసుకున్నానని గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ వాపోయారు. ఆయన బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని హార్దిక్ మండిపడ్డారు. గురువారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో అధికార బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ లేదా మరో రాజకీయ పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకోలేదనన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి ఘనతలు బీజేపీ సాధించిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌లో ముందుచూపు లేని నేతలు ఉన్నారని, గుజరాత్ ప్రజలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతం.. వాడుకో, వదిలించుకో గుజరాత్లో తనను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినప్పటికీ ఏనాడూ సరైన పని అప్పగించలేదని, గౌరవం కల్పించలేదని హార్దిక్ ఆక్షేపించారు. పటీదార్ కోటా ఉద్యమంతో గుజరాత్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతగానో లాభపడిందన్నారు. అయినప్పటికీ కీలకపార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ కాంగ్రెస్‌లో 25 ఏళ్లుగా 7–8 మందే పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. సెకండ్ క్యాడర్ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. వాడుకో, వదిలించుకో.. ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు కావాల్సింది చింతన్(మేధోమథనం) కాదు, చింత అని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. హార్దిక్ పటేల్‌కు జైలు భయం: కాంగ్రెస్ హార్దిక్ వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ తిప్పికొట్టారు. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే రాజీనామా పత్రం తయారు చేసుకున్నాడని విమర్శించారు. అతడిపై దేశద్రోహం కేసు నమోదయ్యిందని గుర్తుచేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్‌ను వీడాడన్నారు. -
కశ్మీర్‌పై షహబాజ్ కారుకూతలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్‌ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్‌తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు. పొరుగుదేశాలను ఎవరం ఎంచుకోలేమని, వాటితో కలిసి జీవించాలని, దురదృష్టవశాత్తు దేశ విభజన సమయం నుంచి భారత్‌తో పాక్‌కు సత్సంబంధాలు లేవని చెప్పారు. 2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని, దీంతో కశ్మీర్ లోయలో, రోడ్లపై కశ్మీరీల రక్తం చిందుతోందని విషం కక్కారు. కశ్మీర్ విషయంపై చర్చకు మోదీ ముందుకురావాలని, ఆ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు. రాబోయే తరాలు ఎందుకు బాధలు పడాలని, ఐరాస తీర్మానాలకు, కశ్మీరీల ఆంక్షాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ఆహ్వానించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండో–పాక్ సంబంధాలు దిగజారాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్‌లోని భారత హైకమిషనర్‌ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్‌తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది. -
జియా ఉల్ హక్ హయాం.. మోదీ పాలన ఒక్కటే
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనసుల్ని విషపూరితం చేస్తూ మోదీ సర్కార్ అప్రజాస్వామికంగా పాలిస్తోందని మెహబూబా ఆగ్రహం వ్యక్తంచేశారు. పాకిస్తాన్లో ఒకప్పటి సైనిక నియంత జనరల్ ముహమ్మద్ జియా ఉల్ హక్ పాలనా.. మోదీ సర్కార్ పరిపాలనా ఒక్కటే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి హోదాను తొలగించిన మోదీ సర్కార్‌పై జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా పోరాడాలని మెహబూబా పిలుపునిచ్చారు. బుధవారం ఆమె జమ్మూలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ‘ పాక్‌లో ఒక శ్రీలంక జాతీయుడిని అమానుషంగా కొట్టి చంపేస్తే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెంటనే స్పందించి కఠిన చర్యలకు పూనుకున్నారు. కానీ, భారత్‌లో మూకదాడికి పాల్పడి ప్రాణాలను హరిస్తున్న వారికి పూలదండలతో సత్కరిస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగా న్ని ఖూనీ చేస్తున్నారు. నాటి జియా ఉల్ హక్ పాలనకు, నేటి మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు తేడా ఏముంది? రెండూ ఒక్కటే’ అని మెహబూబా అన్నారు. ‘ భారత్‌ను, ముస్లింలను విడదీస్తున్నారని నాడు పాక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాపై అందరూ పగతో రగలిపోయారు. ఇప్పుడు భారత్‌లో ఎందరో జిన్నాలు ఉద్భవించారు. వారంతా భారతస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని పార్టీకి చెందిన వారే’ అని బీజేపీని మెహబూబా పరోక్షంగా విమర్శించారు. -
ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం రైతుల్లా పోరాడాలి: మాజీ సీఎం
శ్రీనగర్: రద్దు చేసిన ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కోసం జమ్ముకశ్మీర్ ప్రజలు రైతుల్లా పోరాటం చేయాలని మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 11 నెలలకు పైగా పోరాటం చేశారని తెలిపారు. వారి పోరాటంలో 700 మందికి పైగా రైతులు మృతి చెందారని అన్నారు. రైతుల బలిదానాలతో కేంద్రం ప్రభుత్వం దిగివచ్చి.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని తెలిపారు. చదవండి: లుంగీ ధరించినవాళ్లు నేరస్తులు కాదు: రషీద్ అల్వీ కశ్మీరీలు తమ హక్కులు తిరిగి పొందాలంటే రైతుల్లా త్యాగాలు చేయాలని అన్నారు. తాము ఆర్టికల్ 370, 35 ఏ, రాష్ట్ర హోదాను తిరిగి పొందుతామని వాగ్దానం చేశామని గుర్తుచేశారు. దాని కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో తమ పార్టీ హింసకు మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 5 ఆగస్టు, 2019న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. -
‘370’ రద్దు తర్వాత స్వస్థలాలకు 1,678 మంది కశ్మీరీలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాత సుమారు 1,678 మంది కశ్మీరీలు తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారని కేంద్రం తెలిపింది. వీరందరికీ ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ–2015 కింద ఉద్యోగాలను కల్పించినట్లు మంగళవారం పార్లమెంట్లో వెల్లడించింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 150 మంది దరఖాస్తుదారుల భూములను తిరిగి వారికే అప్పగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వలసవెళ్లిన హిందువులకు చెందిన భూములపై తిరిగి వారికే అధికారం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. చదవండి: (చంపేస్తామని బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్) -
Mohan Bhagwat: 80 శాతం నిధులు రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్లేవి
నాగ్‌పూర్: ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కశ్మీర్‌కు కేటాయించిన నిధుల్లో 80 శాతం రాజకీయ నాయకులు తమ జేబుల్లో వేసుకున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా ఆరోపించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు, కాశ్మీర్ లోయ కోసం కేటాయించిన 80 శాతం నిధులు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. కేటాయించిన నిధులు ప్రజలకు చేరలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని ప్రజలు అభివృద్ధిని ప్రత్యక్షంగా పొందుతున్నారని తెలిపారు. తాను జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించి ప్రస్తుత అక్కడ ఉన్న పరిస్థితిని చూశానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. గతంలో జమ్మూ, లడఖ్‌పై తీవ్రమైన వివక్ష ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఎటువంటి వివక్ష లేదని పేర్కొన్నారు. ఆగస్టు 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను అందించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. -
అభివృద్ధిలో ఏపీకి అండగా కేంద్రం
తిరుపతి గాంధీరోడ్డు/రేణిగుంట: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్– 370ని రద్దు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో బుధవారం నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ కూడలిలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడి ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. కోవిడ్ సమయంలో పేదలకు ఉచితంగా నెలకు 5 కిలోల బియ్యం అందించామని గుర్తుచేశారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు పలు కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. ప్రపంచం మొత్తం కోవిడ్‌తో బాధపడుతున్నా భారత్‌లో మోదీ ప్రభుత్వం సమర్థంగా వైరస్‌ను ఎదుర్కొని అతిపెద్ద వ్యాక్సినేషన్ మిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో ఆక్సిజన్ కొరతను కూడా అధిగమించామని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఉన్న గండికోటను సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిషన్‌రెడ్డికి సాదర స్వాగతం రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి సాదర స్వాగతం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి పుష్పగుచ్ఛం, శాలువా అందించి ఆయనకు స్వాగతం పలికారు. -
ఆర్టికల్ 370ని పునరుద్దరించేవరకు ఎన్నికల్లో పోటీ చేయను
కశ్మీర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370, 35ఏని పునరిద్ధరించేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ముఫ్తీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వవస్థీకరణ కన్న ముందు ఈ ప్రాంత ప్రజల విశ్వాసం గెలవడం ముఖ్యం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370, 35ఏని పునరిద్ధరించే వరకు నా పోరాటం కొనసాగుతుంది.. అప్పటి వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. నా పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సీఎం అభ్యర్థులకు కొరత లేదు’’ అన్నారు. ‘‘మా పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది.. దాని ప్రకారమే నడుచుకుంటుంది. అందుకే ప్రధాని ఆహ్వానం మేరకు మేం ఢిల్లీ వచ్చి.. మోదీతో సమావేశం అయ్యాము. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలతో సమావేశం కావడం ముఖ్యం కాదు. ప్రజలతో కలిసిపోయి.. వారిలో విశ్వాసం నింపాలి. వారి నమ్మకాన్ని గెల్చుకోవాలి. అందుకు తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం’’ అన్నారు మెహబూబా ముఫ్తీ. జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై ఆక్కడి కీలక నేతలతో ప్రధానమంత్రి మోదీ గురువారం తన నివాసంలో దాదాపు మూడున్నర గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలుంటాయని ప్రధాని తెలిపారని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ వెల్లడించారు. చదవండి: కశ్మీర్ పార్టీల మల్లగుల్లాలు -
ప్రధాని అధ్యక్షతన జమ్మూకశ్మీర్ అఖిలపక్ష నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ భవిష్యత్‌పై ప్రణాళిక రూపొందించేందుకు ఆ ప్రాంతానికి చెందిన అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఈ భేటీ దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి 8 రాజకీయ పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి జరుగుతున్న అఖిలపక్ష భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ప్రధానిని కోరగా, ప్రధాని సానూకూలంగా స్పందించారని తెలుస్తోంది. అలాగే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్నికలు నిర్వహించాలని, కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించాలని ఆజాద్ ప్రధానిని కోరారు. భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. -
కశ్మీర్ కథ ఎటు..?
జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు (ఆగస్టు 5, 2019) తర్వాత మంచుకొండల్లో రాజకీయ వేడి రాజుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు కశ్మీర్ రాజకీయ పార్టీ నేతలతో అఖిలపక్ష సమావేశం జరగనుంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టడానికి ఏయే పార్టీలు సహకరిస్తాయో, ఎవరెవరు వ్యతిరేకిస్తూ వేర్పాటువాద చిచ్చు రగులుస్తారో తెలుసుకోవడానికి... ఈ సమావేశాన్ని కేంద్రం వేసిన తొలి అడుగుగా భావిస్తున్నారు. కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అందరితో కలుపుకొని పోయేలా నిర్వహించడం కోసమే ప్రధాని ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టుగా ప్రధాని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఎజెండా ఏమిటి? జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా గత ఏడాది స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో హమీ ఇచ్చారు. రాష్ట్ర హోదా కల్పించి ఎన్నికలకు వెళ్లాలంటే దాని కంటే ముందుగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. జమ్మూకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ చట్టం– 2019 కశ్మీర్ అసెంబ్లీ బలాన్ని 107 నుంచి 114కి పెంచింది. ఇందులో 24 సీట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందినవి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఏడు నియోజకవర్గాల సరిహద్దులు, జనాభా, భౌగోళిక స్వరూపంపై సమగ్ర నివేదిక కోసం నియోజకవర్గాల పునర్విభజన కమిటీకి బాధ్యతలు అప్పగించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన్ ప్రకాశ్ దేశాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల్లో విస్తరిస్తే అభివృద్ధికి ఆటంకాలు ఉంటాయని అభిప్రాయపడినట్టు సమాచారం. అందుకే నియోజకవర్గాల పునర్విభజనపై తొలుత అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే సమయం వచ్చినప్పుడు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచనగా ఉంది. రాజకీయ చిత్రం జమ్మూకి అనుకూలంగా మారుతుందా? నియోజకవర్గాల పునర్విభజనతో జమ్మూ ప్రాంతానికి అనుకూలంగా రాజకీయాలు మారే అవకాశాలున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి జమ్మూలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. ఇన్నాళ్లూ కశ్మీర్‌కు చెందిన నాయకుల ఆధిపత్యం వల్ల జమ్మూ అభివృద్ధిపై వివక్ష ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జమ్మూలో అసెంబ్లీ స్థానాలు పెరగడం వల్ల బీజేపీ రాజకీయంగా బలపడుతుందని, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ ముఫ్తీ కుటుంబాల హవాకు తెరపడి వేర్పాటువాద శక్తులు బలహీనంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలోని 37 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 25 స్థానాలను కొల్లగొట్టింది. ఈ ప్రాంతంలో సీట్లు పెరిగితే రాజకీయంగా బలపడాలనే ఆలోచనలో కేంద్రంలోని అధికార బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘జమ్మూకశ్మీర్ మొత్తం జనాభాలో 55% కశ్మీర్లో ఉంటే సీట్లు 53% ఉన్నాయి. అదే జమ్మూలో జనాభా 43% ఉంటే సీట్లు 42.5% ఉన్నాయి. విస్తీర్ణంలో కశ్మీర్లో కంటే జమ్మూలో నియోజకవర్గాలు చాలా పెద్దవి. మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గరకి నాయకులు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే కేంద్రం కట్టుబడి ఉంది. అందరి ఆమోదంతో అభివృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టింది’’ అని కశ్మీర్ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎందుకింత ప్రాధాన్యం? పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో బీజేపీ ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించింది. అప్పట్నుంచి కశ్మీర్ కేంద్ర పాలనలోనే ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను విడదీస్తూ... రెండు ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ... జమ్మూకశ్మీర్ పునర్యవస్థీకరణ చట్టానికి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. మళ్లీ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటే కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేసి, పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. జూలైలో వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కశ్మీర్ కథకి ప్రజాస్వామ్యబద్ధమైన ముగింపు ఇవ్వడానికే అఖిలపక్షాన్ని పిలవడంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత తొలిసారి ఒక రాజకీయ ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టడం, నెలల తరబడి నిర్బంధంలో ఉంచిన నాయకుల్ని సమావేశానికి పిలవడంతో ఈ సమావేశంలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి నెలకొంది. విపక్షాలు ఏమంటున్నాయి ? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కశ్మీర్‌కు చెందిన 14 మంది నాయకులకు ఆహ్వానం పంపితే ప్రతీ ఒక్కరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తిరిగి కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలంటూ ఏర్పాటైన ఏడు పార్టీల కూటమి గుప్కర్ అలయెన్స్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించింది. గత ఏడాది జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో మొత్తం 278 స్థానాల్లో గుప్కర్ కూటమి 110 స్థానాలను గెలుచుకొని బీజేపీకి గట్టి సవాల్ విసిరింది. బీజేపీ 75 స్థానాలకు పరిమితం కాగా, ఏకంగా 50 సీట్లలో స్వతంత్రులు నెగ్గారు. ఇప్పుడు ఆ కూటమి నేతలు సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఈ తరహా సమావేశాలకు దూరంగా ఉండే నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అఖిలపక్ష సమావేశానికి రానుంది. జమ్ము కశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్య ప్రధాని దృష్టికి తీసుకురావడమే తమ లక్ష్యమని, ప్రత్యేకంగా ఎజెండా అంటూ తమకేమీ లేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున ఆహ్వానం అందుకున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సంపూర్ణ రాష్ట్ర హోదాయే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
అంబేడ్కర్ బతికుంటే ఆయననూ బీజేపీ నేతలు దూషించేవారు
శ్రీనగర్: ఆర్టికల్ 370కి అనుకూలంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ నాయకులు విరుచుకుపడడాన్ని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్వీట్ చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడు మనమధ్య లేరని, ఒకవేళ జీవించి ఉంటే ఆయన పాకిస్తాన్ మద్దతుదారుడంటూ బీజేపీ నాయకులు దూషించేవారని అన్నారు. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం కూలదోసిందని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలి: రవిశంకర్ ఆర్టికల్ 370 విషయంలో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఖరేంటో స్పష్టం చేయాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు. దిగ్విజయ్ చెప్పినట్లుగా ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా? అని ప్రశ్నించారు. రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. -
కశ్మీర్లో త్వరలో ఎన్నికలు..?
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు రాజకీయ ప్రక్రియను ప్రారంభించడానికి, కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధణకు వివిధ పార్టీలతో చర్చించాలని కేంద్రం భావిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు ఆదివారం ఎన్డీటీవీతో చెప్పాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక హోదా పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఏర్పాటైన 7 పార్టీల గుప్కర్ కూటమి (పీఏజీడీ) కేంద్రంతో చర్చలకు అంగీకరించింది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్.. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చర్చలకు మాత్రమే హాజరవుతామని స్పష్టం చేసింది. 2018 జూన్‌లో మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకున్నాక కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించింది. తర్వాత ఆగస్టు, 2019లో జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ... 370 ఆర్టికల్ రద్దు చేసింది. వాస్తవానికి 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిపి ఉండవలసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికల సంఘం ఆ సాహసం చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. గత ఏడాది ఆగస్టులో ఏర్పాటైన గుప్కర్ కూటమి స్థానిక ఎన్నికల్లో 100కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. కానీ, 6 నెలలుగా అంతర్గత విభేదాలతో చురుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. ఆ కూటమి చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇటీవల పీడీపీ చీఫ్‌తో మంతనాలు జరిపారు. ఆ తర్వాత జుమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలపై కేంద్రంతో చర్చల్లో పాల్గొంటామన్నారు. అమెరికా ఒత్తిడి పని చేస్తోందా? కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావించడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని సమాచారం. కశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడాన్నే బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. -
ఆర్టికల్ 370 రచ్చ.. దిగ్విజయ్‌పై విమర్శల వర్షం
న్యూఢిల్లీ: ఒకవేళ తాము అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ను రద్దుపై పునరాలోచన చేస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఓ పాక్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ ఒకవేళ కేంద్రంలో మేం అధికారంలోకి వస్తే.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంపై తమ పార్టీ పునరాలోచన చేస్తుందన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నాయకులు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం ఏంటో దిగ్విజయ్ వ్యాఖ్యలతో పూర్తిగా వెల్లడయ్యింది. కశ్మీర్ లోయలో కాంగ్రెస్ వేర్పాటువాద బీజాలు నాటుతోంది.. పాక్ డిజైన్లను అమలు చేస్తోంది అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాల్వియా చేసిన వీడియోని పోస్ట్ చేశారు. In a Club House chat, Rahul Gandhi’s top aide Digvijaya Singh tells a Pakistani journalist that if Congress comes to power they will reconsider the decision of abrogating Article 370… Really? यही तो पाकिस्तान चाहता है… pic.twitter.com/x08yDH8JqF — Amit Malviya (@amitmalviya) June 12, 2021 ఈ వీడియోలో దిగ్విజయ్ ‘‘వారు(బీజేపీ) ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అందరిని జైల్లో పెట్టారు. సెక్యూలరిజం అన్న దానికి కశ్మీరియత్ అనేది మూలం. ఎందుకంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో హిందూ రాజు పాలన చేశాడు. ఇద్దరు కలసికట్టుగా పని చేశారు. కశ్మీర్ పండిట్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాం. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోవడం చాలా విచారకరమైన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలనుకుంటుంది" అన్నారు దిగ్విజయ్. దిగ్విజయ్ ఇంటర్వ్యూ అనంతరం సోషల్ మీడియాలో ఆర్టికల్ 370 ట్రెండ్ కావడంతో పలువురు బీజేపీ నాయకులు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు సంబిత్ పాత్ర ‘‘దిగ్విజయ్‌ని ఇలాంటి ప్రశ్న అడిగిన పాక్ విలేకరికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ పేరు మార్చాలని నేను కోరుకుంటున్నాను. భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ) బదులు యాంటీ నేషనల్ క్లబ్ హౌస్ అని మార్చితే బాగుటుంది. దీనిలోని వారంతా మోదీని, భారతదేశాన్ని ద్వేషిస్తున్నారు’’ అని విమర్శించారు. తనపై వస్తోన్న విమర్శలపై దిగ్విజయ్ స్పందించారు. ‘‘లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల సానుభూతిపరులు, బీజేపీ, మోదీ-షా పాలనను వ్యతిరేకిస్తున్న వారందరూ ఈ వినాశకరమైన పాలనను (సిక్) తొలగించడానికి ఓటు అనే ఆయుధంతో పోరాడతారు" అని ట్విట్ చేశారు. It may look delusional to Shefali but Millions of Congress Workers Sympathisers and all those who are opposed to BJPModiShah regime would fight every inch to vote out this disastrous regime. https://t.co/OmZdv5r4Wj — digvijaya singh (@digvijaya_28) June 12, 2021 "బహుశా, నిరక్షరాస్యులకు 'తప్పక', పరిగణించాలి' మధ్య వ్యత్యాసం అర్థం కాలేదు," అని దిగ్విజయ్ హిందీలో మరొక ట్వీట్లో పేర్కొన్నారు. -
సరైన సమయంలో కశ్మీర్‌కు రాష్ట్ర హోదా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు తగిన సమయం చూసి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో హామీ ఇచ్చారు. కశ్మీర్‌ను దశాబ్దాల తరబడి పరిపాలించిన వారికంటే 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్రం ఆ ప్రాంతానికి ఎంతో చేసిందని చెప్పారు. జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) 2021 బిల్లుపై జరిగిన చర్చకు అమిత్ షా శనివారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ ఎప్పటికైనా రాష్ట్ర హోదా దక్కుతుందని పెట్టుకున్న ఆశలు ఈ బిల్లుతో అడియాసలుగా మారుతున్నాయని కొందరు సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనను ఆయన తోసిపుచ్చారు. అఖిల భారత సర్వీసు ఆఫీసర్స్ జమ్మూకశ్మీర్ కేడర్ని అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం యూనియన్ టెర్రిటరీలతో కలపడమే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేశారు. కశ్మీర్ రాష్ట్ర హోదాకి ఈ బిల్లుకి ఎలాంటి సంబంధం లేదన్న అమిత్ షా సరైన సమయం చూసి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత మూజువాణి ఓటుతో బిల్లుని సభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. కశ్మీర్‌కే మొదట్నుంచి ప్రాధాన్యం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370కి మద్దతు పలికి 70 ఏళ్లకు పైగా ఆ ప్రాంతాన్ని అలాగే ఉంచిన కాంగ్రెస్ ఇతర పార్టీలు, తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న ఈ బిల్లుపై ఎందుకు ఇన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని అమిత్ షా అన్నారు. 2014లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జమ్మూకశ్మీర్‌కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా కశ్మీర్‌కి స్వేచ్ఛగా వెళ్లి రావచ్చునని చెప్పారు. కశ్మీర్ పౌరులెవరూ తమ భూములు కోల్పోరని హామీ ఇచ్చిన అమిత్ షా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తగినన్ని భూములున్నాయని తెలిపారు. స్థానిక అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. రాజులు, రాణుల పాలనకు ఎవరూ అంగీకరించరని ప్రజలే ప్రభువులుగా ఉండాలన్నదే ప్రజాభీష్టంగా ఉందని వివరించారు. 2022 నాటికి కశ్మీర్‌కు రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముగిసిన మొదటి విడత సమావేశాలు లోక్‌సభ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శనివారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు తిరిగి మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు సాధారణంగా రెండు విడతలుగా జరుగుతాయి. మొదటి విడతలో పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, బడ్జెట్ ప్రవేశం పెట్టడం ఉంటాయి. రెండో విడతలో వివిధ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లపై సంబంధిత స్టాండింగ్ కమిటీల పరిశీలన ఉంటుంది. ఫైనాన్స్ బిల్లు, సంబంధిత గ్రాంట్ల డిమాండ్ల ఆమోదం వంటివి ఉంటాయి. కాగా, మొదటి విడత బడ్జెట్ సమావేశాలు 100% ఫలప్రదంగా ముగిశాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. జనవరి 29వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు నిర్ణీత 50 గంటల్లో 49 గంటలపాటు సభ్యుల కార్యకలాపాలు కొనసాగాయన్నారు. 43 నిమిషాలపాటు మాత్రం అంతరాయం కలిగిందని చెప్పారు. ఈ సమావేశాల్లో సభ్యులు 13 ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారన్నారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్య అంశాలపై చర్చ కోసం అర్ధరాత్రి వరకు కొనసాగిన సందర్భాలున్నాయన్నారు. 5 ట్రిబ్యునళ్ల రద్దుకు లోక్‌సభలో బిల్లు ప్రజలకు పెద్దగా అవసరం లేని ఐదు ట్రిబ్యునళ్లను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రద్దు ప్రతిపాదిత ట్రిబ్యునళ్లలో ఎయిర్పోర్ట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డు ఉన్నాయి. వీటి కోసం సినిమాటోగ్రాఫ్ చట్టం–1952, కస్టమ్స్ యాక్ట్–1962, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ యాక్టు–1994 తదితరాలను సవరించనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆర్థిక మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ట్రిబ్యునళ్లతో ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదని మంత్రి అన్నారు. వీటితో ఆర్థిక భారంతోపాటు పరిష్కారంలో కాలయాపన కూడా అవుతోందని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్రిబ్యునళ్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను కమర్షియల్ కోర్టులు/హైకోర్టులకు బదిలీ చేస్తామని తెలిపారు. -
బీజేపీకి వ్యతిరేకం.. దేశానికి కాదు
కశ్మీర్: జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని పునరుద్దరించడమే కాక ఆర్టికల్ 370ని తిరిగి సాధించడం కోసం కశ్మీర్ నాయకులంతా ఏకమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ) పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేశారు. దీనికి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం, ఫరూక్ అబ్దుల్లాను అధ్యక్షుడిగా, మెహబూబా ముఫ్తీని ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో శనివారం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘గుప్కార్ కూటమి బీజేపీకి వ్యతిరేకం.. దేశానికి కాదు. కానీ కూటమి దేశానికి వ్యతిరేకమని బీజేపీ అసత్య ప్రచారం చేస్తుంది. వారు దేశానికి, రాజ్యాంగానికి హానీ చేశారు. జమ్ము కశ్మీర్ ప్రజల హక్కులు తిరిగి వారికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మతం ఆధారంగా విభజించడానికి వారు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి’ అన్నారు. (చదవండి: కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి) ఇక నేటి సమావేశంలో అలయన్స్ సభ్యులు ఆర్టికల్ 370 పునరుద్ధరణ, జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. ఇక అలయెన్స్‌కు తనను చైర్మన్‌గా ఎన్నుకున్నారని.. మెహబూబా ముఫ్తీని వైస్ చైర్మన్‌గా.. వామపక్ష నేత మహమ్మద్ యూసుఫ్ తారిగామిని కన్వీనర్‌గా.. జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోనెని అధికార ప్రతినిధిగా ఎన్నుకున్నట్లు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. సజ్జద్ లోనె మాట్లాడుతూ.. ‘వాస్తవాల గురించి త్వరలోనే శ్వేతపత్రంతో ప్రజల ముందుకు వస్తాము. ఇంతకు ముందు మన వద్ద ఉన్నవి.. ఇప్పుడు మనం కోల్పోయిన వాటిపై పరిశోధన పత్రం ఇస్తాము. రెండు వారాల్లో, మా తదుపరి సమావేశం జమ్మూలో ఉంటుంది. తరువాత మరో సమావేశం ఉంటుంది. మా పూర్వపు రాష్ట్ర జెండా మా కూటమికి చిహ్నంగా ఉంటుంది’ తెలిపారు..