AP Assembly: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ సీరియస్‌

AP Assembly Speaker Angry Over TDP Members Behavior - Sakshi

సాక్షి, అమరావతి: సభలో టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరంగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి బాధ్యతారాహిత్యం, తనది బాధ్యత అని పేర్కొన్నారు. సభా నాయకుడు తనకు గొప్ప బాధ్యత అప్పగించారని,  ఆ బాధ్యతల మేరకే సహనంగా ఉంటున్నట్లు చెప్పారు. చరిత్రలో కళంకితుడిగా ఉండాలనుకోవట్లేదని తెలిపారు. కాగా, సభా కార్యకలాపాలను టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుకోవడంతో అసెంబ్లీలో గందగోళం నెలకొంది. దీంతో టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.

పోలవరంపై టీడీపీని ఏకిపారేసిన బుగ్గన..
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ ప్రయోజనాలపై చర్చించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో తెలిపారు. విభజన వల్ల పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులపై ప్రధాని మోదీతో సీఎం చర్చించారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా? గతంలో టీడీపీ పెట్టిన బకాయిలపై చర్చిద్దామా? అని సవాల్ విసిరారు.

టీడీపీ హయాంలో చంద్రబాబు 30 సార్లు ఢిల్లీకి వెళ్లారని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనపై చర్చిద్దామా? అని అడిగారు.  సభను పక్కదారి పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: నాగ్‌పూర్‌ టూ విజయవాడ: ఎకనమిక్‌ కారిడార్‌కు లైన్‌క్లియర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top