సాక్షి, హైదరాబాద్: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
కాగా, ఏపీకి భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో పాల్గొనేందుకు కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి. విశాఖ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బుధవారం ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కి పైగా నమోదు కావడం గమనార్హం. గత సర్కారు మాదిరిగా ఆర్భాటాలు కాకుండా వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది.
చదవండి: సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం
Good luck to our younger brother Vizag & sister state AP as they conduct their Global Investors Summit
— KTR (@KTRBRS) March 2, 2023
I wish them the very best 👍
May both Telugu speaking states prosper and be the best in India pic.twitter.com/v6UhGlZ7qP
Comments
Please login to add a commentAdd a comment